● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే.. | - | Sakshi
Sakshi News home page

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే..

Published Sat, Apr 26 2025 12:41 AM | Last Updated on Sat, Apr 26 2025 12:41 AM

● కేజ

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆశయం నెరవేరుతోంది. ఏ ఆధారం లేని బాలికల చదువు కోసం.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ) నెలకొల్పారు. వైఎస్సార్‌ తనయుడు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కేజీబీవీలకు కార్పొరేట్‌ హంగులు సమకూర్చారు. వాటిలో ఇంటర్‌ విద్యను ప్రవేశ పెట్టారు. ఆ విద్యాలయాలు నేడు ఫలితాల పరంగా సత్తా చాటుతున్నాయి. ఇంటర్‌, పదో తరగతి ఫలితాల్లో తిరుగులేని ఆధిపత్యం చూపి భళా అనిపించాయి.

కడప ఎడ్యుకేషన్‌: జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో ఫలితాల పరంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) బాలికలు మెరిశారు. జిల్లా వ్యాప్తంగా 17 కేజీబీవీలు ఉండగా వాటిల్లో నుంచి 621 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. వారిలో 534 మంది పాసై 85.99 శాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు కేజీబీవీలు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. పెండ్లిమర్రి కేజీబీవీ మినహా మిగతా అన్ని కేజీబీవీల్లో 500 పైన మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నారు.

నేరవేరుతున్న వైఎస్సార్‌ కల

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయం నెరవేరుతోంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన, ఆర్థిక స్థోమత లేకుండా, పేదరికంలో ఉండి చదవాలనే ఆసక్తి ఉన్నా.. పరిస్థితులు అనుకూలించని ఎంతో మంది నిరుపేద బాలికలు చదువుకోవాలనే లక్ష్యం ఫలిస్తోంది. నేడు ఎంతో మంది విద్యార్థులు బాగా చదివి.. విద్యావంతులై తమ ప్రతిభ చాటుతూ భళా అనిపిస్తున్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఏర్పాటు చేశారు. వాటిలో ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంగ్లిషు మీడియంలో బోధన, అత్యంత భద్రతతో కూడిన సవతి సదుపాయాలు కలిగి.. బాలికలు విద్యావంతులుగా తయారవుతున్నారు. ఈ విద్యాలయాల్లో సాధారణ విద్యతోపాటు ఆంగ్లమాధ్యమం, యోగా, క్రీడలు, వృత్తి విద్యాకోర్సుల ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇవి బాలికలకు చదువుతోపాటు బతుకు దెరువుకు భరోసా కల్పిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు– నేడు మనబడి కార్యక్రమం ద్వారా కేజీబీవీలకు లక్షలు ఖర్చు చేసి మరిన్ని వసతులు, సౌకర్యాలు కల్పించారు. పదో తరగతి తరువాత వారు డ్రాపౌట్స్‌గా మారేందుకు వీలులేకుండా కేవీజీబీలలో ఇంటర్‌ విద్యను కూడా ప్రవేశ పెట్టి మరో అడుగు ముందుకు వేశారు.

వంద శాతం ఉత్తీర్ణత సాధించిన కేజీబీవీలు ఇవే..

జిల్లాలో మూడు కేజీబీవీలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. దువ్వూరు కేజీబీవీలో 39 మందికి 39 మంది పాస్‌ అయి వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. అలాగే సింహాద్రిపురం కేజీబీవీలో 39 మందికి 39 మంది పాస్‌ అయ్యారు. మైదుకూరు కేజీబీవీలో 37 మందికి 37 మంది ఉత్తీర్ణత పొందారు. గతేడాది 10 కేజీబీవీలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. అలాంటిది ఈ ఏడాది మూడు మాత్రమే సాధించడం గమనార్హం.

90 శాతం పైన ఉత్తీర్ణత

జిల్లాలోని అట్లూరు కేజీబీవీలో 38 మందికి 37 మంది పాసై 97 శాతం ఉత్తీర్ణత సాధించారు. జమ్మలమడుగు కేజీబీవీలో 39 మందికి 37 మంది పాసై 92 శాతం, వేముల కేజీబీవీలో 38 మందికి 35 మంది పాసై 92 శాతం ఉత్తీర్ణత పొందారు.

80 శాతం పైన ఉత్తీర్ణత

చాపాడు కేజీబీవీలో 36 మందికి 32 మంది పాసై 89 శాతం ఉత్తీర్ణత, పెండ్లిమర్రి కేజీబీవీలో 31 మందికి 27 మంది పాసై 87 శాతం ఉత్తీర్ణత, పెద్దముడియం కేజీబీవీలో 38 మందికి 33 మంది పాసై 86 శాతం, బి.కోడూరు కేజీబీవీలో 32 మందికి 27 మంది పాసై 84 శాతం, ఖాజీపేట కేజీబీవీ 35 మందికి 28 మంది పాసై 80 శాతం ఉత్తీర్ణత సాధించారు.

పదో తరగతి ఫలితాల్లో మెరిసిన కేజీబీవీలు

మొత్తం 85.99 శాతం ఉత్తీర్ణత

మూడు విద్యాలయాలు వంద శాతం

ప్రథమ స్థానం విద్యార్థినికి 578 మార్కులు

నిత్యం పర్యవేక్షిస్తూ..

జిల్లాలోని ఆర్‌జేడీ, డీఈఓల సూచనలు, సలహాలు పాటిస్తూ కేజీబీవీలను నిత్య పర్యవేక్షించాం. నిత్యం స్టడీ అవర్స్‌తోపాటు వారాంతం పరీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు మార్కుల పరంగా పర్యవేక్షిస్తూ వచ్చాం. తక్కువ మార్కులు వచ్చే వారి పట్ల ఎస్‌ఓలతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించాం. – అనిత, జీసీడీఓ, సమగ్రశిక్ష

సంతృప్తికర ఫలితాలు

కేజీబీవీల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. కేజీబీవీల ఫలితాల పరంగా 85.99 శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు 17 కేజీబీవీలకు గాను మూడు కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణతను సాధించాం. చాలా మంది విద్యార్థినులు 500 మార్కులుపైన సాధించారు. ఫలితాల పరంగా సంతోషంగా ఉంది.

– షేక్‌ షంషుద్దీన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

దువ్వూరు కేజీబీవీకి చెందిన గురుధరణి 578 మార్కులు సాధించి కేజీబీవీల్లో ప్రథమ స్థానం(టాపర్‌గా)లో నిలిచింది. మైదుకూరు కేజీబీవీకి చెందిన నిహారిక 576 మార్కులు సాధించి ద్వితీయ స్థానం, సింహాద్రిపురం కేజీబీవీలో రిషిత 571 మార్కులు సాధించి తృతీయ స్థానం సాధించారు.

కేజీబీవీల వారిగా టాపర్స్‌ వివరాలు

అట్లూరు కేజీబీవీలో స్పందన అనే విద్యార్థి 516 మార్కులు సాధించి ఆ కేజీబీవీ టాపర్‌గా నిలిచింది. చక్రాయపేటలో వి.వర్షిణి 529, పెండ్లిమర్రిలో దీక్షితారెడ్డి 493, వల్లూరులో ఽమణివీణ 553, వేములలో సాత్విక 562, బి.కోడూరులో బాను మాధురి 537, కాశినాయనలో హుస్సేన్‌ బీ 515, చాపాడులో దివ్య కుళాయమ్మ 531, జమ్మలమడుగులో వందన 576, పెద్దముడియంలో సుప్రియ 563, కలసపాడులో మధులత 511, ఖాజీపేటలో భారతి 547, బి.మఠంలో వెంకట సుమశ్రీ 522 మార్కులు సాధించి ఆయా కేజీబీవీల్లో టాపర్స్‌గా నిలిచారు.

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే.. 1
1/7

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే..

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే.. 2
2/7

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే..

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే.. 3
3/7

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే..

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే.. 4
4/7

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే..

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే.. 5
5/7

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే..

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే.. 6
6/7

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే..

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే.. 7
7/7

● కేజీబీవీలలో టాపర్స్‌ వీరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement