
కేజీ పీజీసెట్–2కే25కు విశేష స్పందన
కడప ఎడ్యుకేషన్ : కందుల గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ వారి ఆధ్వర్యంలో డిగ్రీ ఉత్తీర్ణులై పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలనే ఆశావహులకు నిర్వహించిన కేజీ పీజీసెట్–2కే25కు విశేష స్పందన లభించిందని కే.ఎస్.ఆర్.ఎం కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.నాగమణి తెలిపారు. ఈ పరీక్షకు ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ఉచిత అడ్మిషన్ కల్పిస్తామన్నారు. ఈ పరీక్ష రాయడం వల్ల విద్యార్థులకు రాబోయే ఐ సెట్–2025 పరీక్షపై మంచి అవగాహనతో పాటు, అనుభవం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి (నాని) మాట్లాడుతూ అధ్యాపకుల మార్గదర్శకాలను, సలహాలను తీసుకుని విద్యార్థులు ఉన్నత రంగాలలో స్థిరపడాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కందుల రాజేశ్వరి, కేఎల్‌ఎం ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రత్నమ్మ , కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎన్ ప్రసాద్, సీనియర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ నాగరాజు, కార్యనిర్వాహక సిబ్బంది, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.