
బరువెక్కిన గుండెతో అంత్యక్రియలు
ములకలచెరువు : చెరువులో మునిగి మృతి చెందిన ముగ్గురి అంత్యక్రియలు ఆదివారం ములకలచెరువులో బరువెక్కిన హృదయాలతో జరిగాయి. ఇద్దరు చిన్నారులకు తోడుగా వచ్చి మృతి చెందిన మరో చిన్నారి నందిత అంత్యక్రియలు కర్నాటక రాష్ట్రం కై వరమ్ క్రాస్‌లో జరిగాయి. నీళ్లలోకి దిగి నలుగురు మృత్యువాత పడిన విషయం విదితమే. ములకలచెరువులో జరిగిన ముగ్గురి అంత్యక్రియలకు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి హాజరయ్యారు. మృతులకు నివాళులు అర్పించారు. నలుగురికి రూ. 1.75 లక్షల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కూడా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మాధవరెడ్డి, నాయకులు అన్సర్‌బాషా, సిద్దారెడ్డి, చాంద్‌బాషా, రెడ్డెప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.