Top Stories
ప్రధాన వార్తలు

అక్కడ జరిగిందేమిటి?.. మీరు చేస్తున్నదేమిటి?
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల్ని ప్రాణాలు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల వేరివేత లక్ష్యంగా భారత్ ‘ ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. పాక్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసిన భారత్.. 90 మంది వరకూ టెర్రర్ మూకలను మట్టుబెట్టింది. అయితే భారత్ విజయవంతంగా పూర్తి చేసిన ఆపరేషన్ సిందూర్ పై చైనా మీడియా విషం కక్కింది. చైనాలోని గ్గోబల్ టైమ్స్’ అనే మీడియా సంస్థ ఆపరేషన్ సిందూర్ భారత్ విమానాలను పాక్ కూల్చిందంటూ తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. కొన్ని పాత ఫోటోలను జత చేసి వాటిని ప్రస్తుత ఆపరేషన్ సిందూర్ కు ఆపాదించింది. దీనిపై చైనాలోని భారత్ ఎంబాసీ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అక్కడ జరిగింది ఏమిటి.. మీరు చేస్తున్నదేమిటి అంటూ మండిపడింది ఒక విషయాన్ని వార్త రూపంలో ప్రచురించేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని, దానికి మూలాలను అన్వేషించి వార్తలు వేయాలని గ్లోబల్ టైమ్స్ కు చురకలంటించింది. అక్కడా ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసి విజయవంతంగా దాన్ని పూర్తి చేస్తే మీరు దాన్ని వక్రీకరించడం తగదంటూ హితవు పలికింది. కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులు హతమయ్యారు.

అత్యవసర సేవల ఉద్యోగుల 'సెలవులు రద్దు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యవసర సేవలు అందించే అన్ని విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుని హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించింది. పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్ధరాత్రి భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల నేపథ్యంలో మనమంతా సైన్యంతో ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సమయంలో రాజకీయాలకు, పార్టీలకు తావు లేదని అన్నారు. మీడియా, సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ప్రజల కోసం 24/7 టోల్ ఫ్రీ నంబర్ ‘సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ వెంటనే ఏర్పాటు చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మూడు కమిషనరేట్లకు సంబంధించిన సీసీటీవీలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలి. రక్తం, ఆహారం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం రెడ్ క్రాస్తో సమన్వయం చేసుకోవాలి. అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల అందుబాటుపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి. ఆహార నిల్వలు కూడా తగినంత ఉండేలా చూడాలి. సైబర్ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఫేక్ న్యూస్ ప్రచా రం చేసే వారిపై ఉక్కు పాదం మోపాలి. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో ఆందోళన మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. కీలక ప్రాంతాల్లో భద్రత పెంచాలి అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రత పెంచాలి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల దగ్గర కూడా భద్రత పెంచాలి. నగరంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలి. హిస్టరీ షీటర్లు, పాత నేరస్తుల విషయంలో పోలీస్ విభాగం అప్రమత్తంగా ఉండాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించండి హైదరాబాద్‌లోని ఆర్మీ, నేవీ, వైమానిక కార్యాలయాలు, రక్షణ రంగ సంస్థల దగ్గర భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. నగరంలో మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని చెప్పారు. కేంద్ర నిఘా బృందాలతో , రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. చంపినా చూస్తూ ఊరుకుంటే ఎలా..? ఐసీసీసీ వద్ద ఎండలో నిలబడిన మీడియాను చూసిన రేవంత్‌రెడ్డి తన వాహనం ఆపి వారితో ముచ్చటించారు. ‘భారత రక్షణ రంగంలో హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతం. అన్ని విభాగాలను అప్రమత్తం చేశాం. దేశంలోకి వచ్చి చంపుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా? ’అని వ్యాఖ్యానించారు.సైన్యానికి సెల్యూట్: సీఎం రేవంత్ ఆపరేషన్ సిందూర్‌లో భారత సాయుధ దళాలు సాధించిన విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన సైన్యం దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ‘ఒక భారతీయ పౌరుడిగా, నేను ముందుగా మన సాయుధ దళాలకు బలమైన అండగా నిలుస్తున్నా. ఉగ్రవాద నిర్మూలన దిశగా భారత సైన్యం చేపట్టిన ఈ ధైర్యవంతమైన చర్య దేశ భద్రతకు నిదర్శనం. ఈ దాడులు మన సైన్యం సామర్థ్యం, ధైర్యాన్ని ప్రపంచానికి స్పష్టంగా చాటాయి. మనమంతా ఒకే గొంతుకై, ఒకే స్వరంతో ప్రకటిద్దాం.. జై హింద్..’అని సీఎం తన ‘ఎక్స్’ఖాతాలో పోస్టు చేశారు. నేడు సంఘీభావ ర్యాలీ భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.

IPL 2025: బ్రెవిస్ విధ్వంసం.. కేకేఆర్‌పై సీఎస్కే విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్ కంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్ పాండే (36 నాటౌట్), రసెల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. డెవాల్డ్ బ్రెవిస్ (52) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టును తిరిగి గెలుపు ట్రాక్‌లో పెట్టాడు. మధ్యలో దూబే (45) బాధ్యతాయుతంగా ఆడి సీఎస్కే విజయతీరాలవైపు మళ్లించాడు. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమైన తరుణంలో అప్పటిదాకా కామ్‌గా ఉన్న ధోని (17 నాటౌట్) సిక్సర్ కొట్టి సీఎస్కేకు గెలుపుకు చేరువ చేశాడు. నాలుగో బంతికి కంబోజ్ బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపు వల్ల సీఎస్కేకు ఒరిగేది ఏమీ లేనప్పటికీ కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టింది. బ్రెవిస్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 పరుగులువైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ శివాలెత్తిపోయాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లు సహా 30 పిండుకున్నాడు. ఈ ఒక్క ఓవర్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు ఓటమి ఖాయమనుకున్న సీఎస్కే ఒక్కసారిగా గెలుపు ట్రాక్‌లోకి వచ్చింది.బ్రెవిస్ 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు.

అదనుచూసి పదునైన పాఠం!
తీరికూర్చుని భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో జగడాలమారి పాకిస్తాన్‌కూ, దాని కీలుబొమ్మలైన ఉగ్రమూకలకూ తెలిసొచ్చి ఉండాలి. 2016 నాటి ‘ఉరి’ సర్జికల్ దాడులు, 2019 నాటి బాలాకోట్ వైమానిక దాడులకు అనేక రెట్లు అధికంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక ‘ఆపరేషన్ సిందూర్’ సంకేతనామంతో మన త్రివిధ దళాలు పకడ్బందీ సమన్వయంతో పాకిస్తాన్‌లోనూ, ఆక్రమిత కశ్మీర్ లోనూ తొమ్మిది చోట్ల గంటసేపు సాగించిన క్షిపణి దాడులు పాక్ సైన్యాన్నీ, ఉగ్రమూకల్నీ గుక్క తిప్పుకోనీయకుండా చేశాయి. ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలూ, వారి ఆయుధ గిడ్డంగులూ, ఇతరేతర అవసరాలకు వినియోగిస్తున్న బహుళ అంతస్తుల భవంతులూ లక్ష్యంగా మొత్తం 24 చోట్ల సాగించిన దాడుల్లో 70 మంది వరకూ ఉగ్రవాదులు మరణించగా, మరో 60 మంది గాయపడ్డారని చెబు తున్నారు. ఉగ్రవాద ముఠాలైన జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ప్రధాన కార్యాలయాలు రెండూ కుప్పకూలాయని సమాచారం. జేఈఎం చీఫ్ మసూర్ అజర్ సోదరితోసహా అతగాడి కుటుంబానికి చెందిన పదిమంది హతమయ్యారని కూడా చెబుతున్నారు. జరిగిన నష్టాన్ని కప్పెట్టే ఎత్తుగడతో అయిదు భారత్ విమానాలను కూల్చామంటూ పాక్ స్వోత్కర్షలకు పోతోంది. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి పాక్ లోలోపలివరకూ చొచ్చుకెళ్లి దాడులు సాగించిన తీరూ, ఒక్క క్షిపణి కూడా గురితప్పకుండా శత్రుమూకలపై చండ్రనిప్పులు కురిపించిన విధానం మన త్రివిధ దళాల పకడ్బందీ అంచనాలకూ, పదునైన వ్యూహచతురతకూ దర్పణాలు. పాక్ గడ్డపై గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఉగ్రశిబిరాల ఆనుపానుల్ని శత్రునేత్రానికి చిక్కని విధంగా గత పక్షం రోజులుగా మానవ రహిత విమానాలతో జల్లెడపట్టాకే ఈ దాడులు జరిగాయి. పహల్గామ్ సమీపంలో అకారణంగా, అన్యాయంగా నిరాయుధ భారత పౌరులను గురిచూసి కాల్చిచంపటానికి కిరాయిమూకల్ని పంపి కొన్నిరోజులుగా పాకిస్తాన్ మురుస్తోంది. దీనిపై నిలదీస్తే షరా మామూ లుగా సాక్ష్యాలడుగుతోంది. గత నెల 22న పహల్గామ్ సమీపంలో ఉగ్రవాద ముఠా 26 మందిని పొట్టనబెట్టుకున్నప్పటి నుంచీ భారత ప్రజ ప్రతీకారంతో రగిలిపోతోంది. కంటికి కన్ను సిద్ధాంతం పాటించి గట్టి దెబ్బతీయాల్సిందేనన్న అభిప్రాయం అలుముకుంది. ఈ నేపథ్యంలో మన దళాల దాడులు విజయవంతం కావటం అందరినీ సాంత్వన పరుస్తుందనటంలో సందేహం లేదు.అనుకోని పరిణామాలు తలెత్తితే అనుసరించాల్సిన పద్ధతులపై పౌరులకు అవగాహన కల్పించటానికి బుధవారం మాక్ డ్రిల్ జరగటం, అంతకుముందు రోజు రాత్రే మన త్రివిధ దళాలు దాడులు చేయటం గమనిస్తే వర్తమానం ఎంత జటిలంగా ఉన్నదో అర్థమవుతుంది. ఇది మనం కోరుకున్నది కాదు. మన ప్రమేయం లేకుండా వచ్చిపడిన విపత్తు. అకారణంగా మనపై రుద్దిన సంక్లిష్ట సమస్య. దీనికి దీటుగా స్పందించకపోతే ఉగ్రదాడులకు అంతూ పొంతూ ఉండదు. కనుకనే పహల్గామ్ మారణకాండ గురించి తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ పర్యటనను రద్దుచేసుకుని వెను దిరిగారు. ఆ వెంటనే మంత్రివర్గ సహచరులతో, త్రివిధ దళాల అధిపతులతో వరస సమాలోచనలు సాగించారు. ఎప్పుడు, ఎక్కడ ఎలా దాడులు సాగించాలో, తీవ్రత ఏ స్థాయిలో వుండాలో మీరే నిర్ణ యించండంటూ మన దళాలకు అధికారం ఇచ్చారు. పర్యవసానంగానే పాక్ ప్రాపకంతో చెలరేగి పోతున్న ఉగ్రముఠాలకు గట్టి సమాధానం వెళ్లింది. ఈ దాడులకు చాలాముందే ఇతరేతర నిర్ణ యాలు తీసుకున్నారు. సింధూ నదీజలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించ టంతోపాటు ఇండియా పలు చర్యలు తీసుకుంది. దీన్నంతటినీ గమనిస్తున్నవారికి మన దేశం సైనిక చర్యకు కూడా వెనకాడబోదని పక్షం రోజుల క్రితమే అర్థమైంది. యుద్ధం దేనికీ పరిష్కారం కాకపోవచ్చు. చర్చలే అంతిమంగా ఎంతటి జటిల సమస్యనైనా పరిష్కరిస్తాయన్న సిద్ధాంతం కూడా సరైనదే కావొచ్చు. కానీ పొరుగు పచ్చగావుంటే ఓర్వలేక నిష్కారణంగా దాడులకు దిగే నైజాన్ని శాంతిప్రవచనాలతో ఎదుర్కొనటం సాధ్యమేనా? ఒకపక్క పహల్గామ్ దాడులతో సంబంధం లేదంటూనే గత కొన్ని రోజులుగా అధీనరేఖ వద్దా, అంత ర్జాతీయ సరిహద్దు వద్దా పాక్ ఎలాంటి కవ్వింపూ లేకుండా కాల్పులకు దిగుతోంది. ఈ దాడుల కారణంగా ఒక్క బుధవారంనాడే పూంఛ్ జిల్లా గ్రామాల్లో 12 మంది పౌరులు బలయ్యారు. తన దుష్ట పన్నాగాలను కప్పిపుచ్చటానికి భద్రతామండలిలో పాకిస్తాన్ అమాయకత్వం నటిస్తూ భారత్ తీసు కుంటున్న వరస చర్యలకు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలని విఫలయత్నం చేసింది. రేపో మాపో అది నేరుగా సైన్యాన్ని రంగంలోకి దించి ప్రతీకారం పేరిట చెలరేగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉగ్రముఠాల ద్వారా మారణహోమానికి పాల్పడటం కన్నా ఒకరకంగా ఇది మంచిదే. భారత్ బెదిరిపోయి సైనిక దాడుల ఆలోచన మానుకుంటుందన్న తప్పుడు ఆలోచనతో కొన్ని రోజులుగా అది అణుబాంబు బెదిరింపులకు కూడా తెగించింది. ఆ దుస్సాహసానికి పూనుకుంటే చేజేతులా స్వీయవినాశనాన్ని కొనితెచ్చుకున్నానని పాక్ పశ్చాత్తాపపడే రోజు ఎంతో దూరంలో ఉండదు. ఈ కష్టకాలంలో దేశ ప్రజానీకం కుల మత భేదాలు మరిచి కలిసికట్టుగా ఉండటం అత్య వసరం. ఇదే అదనుగా నాలుగు ఓట్ల కోసమో, మరికొన్ని సీట్ల కోసమో ప్రజల్లో వైషమ్యాలు సృష్టించాలని చూసే అవాంఛనీయ శక్తుల్ని అందరూ సకాలంలో పోల్చుకుని దూరం పెట్టడం, తగిన బుద్ధి చెప్పటం ఎంతో అవసరం. మనలోని సమష్టితత్వమే ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనే ధైర్యాన్ని స్తుంది. విజయాన్ని మన చేతికందిస్తుంది.

గతానికి భిన్నంగా...
ఏప్రిల్ నెల చివరలో జమ్మూ–కశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది నిరాయుధులను దారుణంగా హత్య చేసినందుకు ప్రతీకారంగా, మే 7 ఉదయం పాకిస్తాన్లో ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న తొమ్మిది ప్రదేశాలపై భారత సైన్యం దాడి చేసింది. పహల్గామ్ ఘాతుక చర్యకు సమాధానం ఇచ్చి తీరుతామని దేశ రాజకీయ నాయకత్వం స్పష్టం చేయడంతో సైనిక దాడి తప్పదని తేలిపోయింది. అయితే, పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి జరగడం ఇదే మొదటి సారి కాదు, కానీ సరిహద్దు రేఖలు మారుతున్నాయని సూచించే లక్షణాలు ‘ఆపరేషన్ సిందూర్’లో ఉన్నాయి.సరిహద్దును దాటి...పాకిస్తాన్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చివరి ప్రధాన దాడి 2019 ఫిబ్రవరిలో చోటు చేసు కుంది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్‌ను అప్పుడు భారత వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ కేంద్ర బిందువైన పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రదేశాలపై భారతీయ సైన్యం దాడికి దిగింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన తర్వాత,భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. దక్షిణ పంజాబ్‌లోని బహావల్పూర్లో జైష్–ఎ–మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. పంజాబ్‌లోని మరొక ప్రదేశం మురీద్కే! ఇక్కడ లష్కరే తోయిబా చాలా కాలంగా ఉనికిలో ఉంది. అయితే కశ్మీర్లో వాస్తవ సరిహద్దును గుర్తించే ఎల్ఓసీకీ, పాకిస్తానీ పంజాబ్‌కు మధ్య వ్యత్యాసం ఏమిటంటే, స్థిరపడిన అంతర్జాతీయ సరిహద్దు. సూటిగా చెప్పాలంటే, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులకు చెందిన భౌగోళిక ప్రాంతం ఇప్పుడు విస్తరించింది. ప్రతీకారం తీర్చుకునే విషయంలో పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశం కూడా భారత్ లక్ష్యాలకు దూరంగా లేదని తాజా దాడులు స్పష్టంగా సందేశమిస్తున్నాయి.1971 నాటి యుద్ధంలోని ముఖ్యాంశాలలో ఒకటి, భారత సైన్యంలోని త్రివిధ బలగాలూ పాల్గొనడమే! నాటి యుద్ధంలో పూర్తి విజయం సాధించడానికి త్రివిధ దళాలు కలిసి పనిచేశాయి. ఆపరేషన్ సిందూర్‌లో కూడా మూడు దళాలూ పాల్గొన్నాయని ప్రభుత్వం తెలిపింది. వనరులను అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవడానికి సైన్యం దీర్ఘకాలిక లక్ష్యంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లకు ఇది శుభ సూచకం.నిజానికి భారతదేశం నుండి ప్రతిస్పందన అని వార్యం అయింది. అయినా భారీ స్థాయి దళాల కదలికల ద్వారా భారత్ ప్రతిస్పందన ఉంటుందని చెప్పే సూచన లేవీ లేవు. పాకిస్తాన్ వైపు మాత్రం వారు ప్రతిస్పందన కోసం సిద్ధమవుతున్నప్పుడు గణనీయ స్థాయిలో దళాల కదలిక కనిపించింది. అదే సమయంలో భారత్ సంయమన మార్గాన్ని ఎంచుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన దాడుల్లో ఏవీ పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడిని ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలనకే పరిమితం చేశారు. దాడుల తర్వాత కూడా ప్రభుత్వం తన మీడియా ప్రకటనలో భారతదేశం తీవ్ర స్థాయి యుద్ధంలోకి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టంగా సూచించింది.ప్రతిదాడి చేయడానికి ముందు, భారతదేశం తాను అనుకున్న విధంగా ప్రతీకారం తీర్చుకోవడానికి గణనీయమైన స్థాయిలో అంతర్జాతీయ మద్దతును సాధించింది. చైనా మాత్రమే దీనికి మినహాయింపు. అదే సమయంలో, అంతర్జాతీయ ప్రధాన శక్తులు వాణిజ్య యుద్ధంతో పాటుగా పశ్చిమాసియాలో, ఉక్రెయిన్‌లో దీర్ఘకాలిక సంఘర్షణ సవాలును ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇరుదేశాల మధ్య ఘర్షణలు ఒక స్థాయికి మించి పెరగకూడదని అవి ఆశిస్తున్నాయి.వికసిత భారత్, రుణ సంక్షోభ పాక్‌భారతదేశం మూడు దశాబ్దాలకు పైగా జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంతో పోరాడు తోంది. ఈ క్రమంలో రెండు దేశాలలోనూ, వేర్వేరు ఆర్థిక పథాల్లో అభివృద్ధి జరుగుతోంది. భారత్ తన ఆర్థిక సరళీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన 1991 నాటికి, పాకిస్తాన్ తలసరి జీడీపీ భారత్ కంటే ఎక్కువగా ఉంది. తాజాగా ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, 2023లో పాకిస్తాన్ తలసరి జీడీపీ 1,365 డాలర్లు కాగా, భారత్ జీడీపీ 82 శాతం ఎక్కువగా 2,481 డాలర్ల వద్ద ఉంది. అంటే రెండు దేశాల ఆర్థిక పథాలు వాటి వ్యూహాత్మక ఎంపికలను ప్రభావితం చేశాయి.భారత్ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. ‘బ్రెగ్జిట్’ తర్వాత అది బ్రిటన్‌తో చేసుకున్న అత్యంత ముఖ్యమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇటీవలే ముగించింది. మరోవైపు, పాకిస్తాన్ ఒక రుణ సంక్షోభం నుండి మరొక రుణ సంక్షోభానికి గురవుతూ, ఐఎమ్ఎఫ్ ఆపన్న హస్తం కోసం విజ్ఞప్తి చేస్తోంది. అది దాదాపు చైనా కాలనీగా మారింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఎంచుకున్న ఎంపికలనూ, పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సార్వభౌమాధికారపు నిరంతర బలహీనతనూ పరిశీలించడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ అసీమ్ మునీర్‌కు అది ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు.సంజీవ్ శంకరన్ వ్యాసకర్త ‘మనీ కంట్రోల్’ ఒపీనియన్స్–ఫీచర్స్ ఎడిటర్

‘అమాయకుల ప్రాణాలు తీసిన వారిని మట్టుబెట్టాం’
న్యూఢిల్లీ: అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఆపరేషన్ సిందూర్‌తో మట్టుబెట్టామని కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో శత్రువుకు తగిన విధంగా బుద్ధి చెప్పామన్నారు. ఈ రోజు(బుధవారం) ప్రెస్ మీట్ లో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్.. ‘రైట్ టు రెస్పాండ్ హక్కును వాడుకున్నాం. భారత సైనం తన సత్తాను చాటింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేశాం. పహల్గామ్ లో అమాయకుల ప్రాణాలు తీసిన వారు మూల్యం చెల్లించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ శత్రువులకు తగిన విధంగా బుద్ధి చెప్పాం. హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నాం. భారత సైన్యం లక్ష్యం పాక్ పౌరులు కాదు.. ఉగ్రవాదుల స్థైర్యాన్ని దెబ్బతీశాం. ఆపరేషన్ సిందూర్‌తో రికార్డు సృష్టించాం. పాక్ పౌరుల ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం.జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బవహల్పూర్ లోని జైష్-ఎ-మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది..

క్రికెట్ అభిమానులకు గుండె పగిలే వార్త.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ
టీమిండియా అభిమానులకు గుండె పగిలే వార్త. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని హిట్‌మ్యాన్ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని రోహిత్ పేర్కొన్నాడు. రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటనలో ఇలా రాసుకొచ్చాడు. "అందరికీ నమస్కారం, నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తెల్ల దుస్తుల్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గౌరవంగా ఉంది. సంవత్సరాలుగా మీ అందరి ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. వన్డే ఫార్మాట్లో కొనసాగుతాను"38 ఏళ్ల రోహిత్ భారత్ తరఫున 67 టెస్ట్‌లు ఆడి 40.6 సగటున 4301 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, 11 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022లో విరాట్ కోహ్లి నుంచి టెస్ట్ కెప్టెన్సీని చేపట్టిన రోహిత్.. 24 టెస్ట్‌ల్లో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. ఇందులో 12 మ్యాచ్‌ల్లో భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. 9 మ్యాచ్‌ల్లో భారత జట్టు ఓడగా.. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. రోహిత్ తర్వాత టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్‌ను ప్రకటించాల్సి ఉంది. రేసులో శుభ్‌మన్ గిల్ ముందున్నాడు. రోహిత్ గతేడాది పొట్టి ప్రపంచకప్ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో రోహిత్ భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు. ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో టెస్ట్‌ల్లో రోహిత్ శర్మ ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. గత 10 టెస్ట్ మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శన కారణంగా ఆ సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ స్వతాహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు.అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. వ్యక్తిగతంగా విఫలం కావడమే కాకుండా ఈ రెండు సిరీస్‌ల్లో రోహిత్ కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. ఈ రెండు సిరీస్‌లను భారత్ కోల్పోయింది.

పాక్ పీఎం యాక్షన్.. ఆర్మీ చీఫ్ నో యాక్షన్!
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ ‘యాక్టింగ్ కెప్టెన్’ పాత్రకు రెడీ అయ్యారు. భారత్‌తో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. భారత్ తమపై దాడి చేసిందని, అందుకు ప్రతీకారం తీర్చుకుంటామనీ అన్నారు. రైట్ టు రెస్పాండ్ హక్కు మాకూ ఉందన్నారు. ఈ మేరకు అత్యవసరం సమావేశం కూడా ఏర్పాటు చేశారు.ఆర్మీ చీఫ్ ఎక్కడ..?ఈ మేరకు హై లెవిల్ సెక్యూరిటీ మీటింగ్ కు పాక్ ప్రధాని షరీఫ్ పిలుపునిచ్చారు. అయితే దీనికి ఆ దేశ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ హాజరుకాలేదు. కనీసం మునీర్ నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నడుమ మునీర్ ఎక్కడో కీలక ప్రాంతంలో దాక్కున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తో యుద్ధాన్ని ఆర్మీ చీఫ్ మునీర్ వద్దనుకునే కీలక మీటింగ్ లకు దూరంగా ఉంటున్నాడనే వాదన కూడా తెరపైకి వచ్చింది.ఇప్పుడు పాక్ ప్రధాని షరీప్ కాస్త యాక్టింగ్ లోకి దిగుదామని ప్రయత్నిస్తున్నా అక్కడ సైన్యం పూర్తిగా సహకరించడం లేదనడానికి మునీఫ్ గైర్హాజరీనే ఒక ఉదాహరణ. ప్రస్తుతం భారత్ పై తిరుగుబాటు చేస్తే పాక్ కే నష్టమని పలువురు దేశ, విదేశీ రాజకీయనాయకులు చెబుతున్న మాట. ఇదే ఫాలో అవుతున్నట్లున్నాడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. పాక్ లో అత్యంత శక్తివంతుడుగా విస్తృత ప్రచారంలో ఉన్న మునీర్.. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్లో పాక్ పెద్దలకు అర్థం కావడం లేదు. హైలెవిల్ మీటింగ్ కు రావాలని పాక్ భద్రతా దళాల అధికారులకు ప్రధాని ఆదేశాలు ఇచ్చిన తరుణంలో మునీర్ ఎందుకు దూరంగా ఉన్నట్లు. పాక్ పీఎం యాక్షన్ ప్లాన్ కు ఆ దేశ ఆర్మీ చీఫ్ నుంచి ఎటువంటి యాక్షన్ లేకపోవడం ఏంటనేది ఇప్పుడు ఆ దేశంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు..మునీర్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. తమ పార్టీ మాత్రం ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాల్లో పాల్గొదనే సంకేతాలిచ్చాడు. దాంతోనే ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీలోని పార్లమెంట్ సభ్యులు కూడా ప్రభుత్వంపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ కూడా కీలక సమయంలో పాక్ హ్యాండిచ్చాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తూ భారత్ వార్నింగ్ ఇచ్చిన మునీఫ్.. సరైన సమయానికి మాత్రం ఎస్కేపింగ్ ప్లాన్ చేసుకున్నట్లు కనబడుతోంది.మరో ముషారఫ్ రాజ్యం రాబోతుందా..?పాకిస్తాన్ లో ప్రభుత్వాలను కూల్చేసి ఆర్మీ చీఫ్ లు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గతంలో చూశాం. మరి మునీఫ్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అయితే మునీఫ్ అంత సీన్ లేదనే కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతం పాక్ లో ప్రభుత్వాన్ని మునీర్ కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకే సైలెంట్ మోడ్ లోకి మునీఫ్ వెళ్లాడని, ఇది పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్ కు మేలు చేయడం కోసమేనని పాక్ లోనే వినిపిస్తోంది. గతంలో పాక్ మాజీ సైనాకాధికారి ముషారఫ్.. సైన్యం మద్దతు విశేషంగా కూడగట్టుకుని పాక్ ప్రభుత్వాన్ని కూల్చేసి అధ్యక్షుడయ్యాడు.ముషారఫ్.. 1999 నాటి కుట్రలో ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి అధికారం హస్తగతం చేసుకొని, ‘ఛీఫ్ ఎగ్జిక్యూటివ్’గా, ఆ పైన సైనికాధ్యక్షుడిగా, చివరకు పౌర అధ్యక్షుడిగా తొమ్మిదేళ్ళ కాలం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఆఖరికి మెడ మీద అభిశంసన కత్తితో 2008లో గద్దె దిగక తప్పలేదు.

ప్రధాని మోదీ విజయరహస్యం ఇదే..!
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధ వ్యూహాలపైనే చర్చ నడుస్తోంది. ఎంత కఠినమైన సమయంలో కూడా తనలోని గాంభీర్యాన్ని ముఖంలో కనిపించనీయకుండా. పైకి తనపని తాను చేసుకుంటూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉండటమే మోదీ శైలి. అవతలి వాడికి అవకాశమివ్వడం, అవతలివాడిని మాట్లాడనీయడం మోదీకి తెలిసిన మరో విద్య. అది చెడు కానంతవరకే మోదీ భరిస్తారు.. ఒకవేళ అవతలి వాళ్ల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న సమయంలో మాత్రం మోదీ వ్యవహరశైలి భిన్నంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా విశేష అభిమానం సందపాదించుకున్న మోదీ యుద్ధ వ్యూహాలను చూసి ప్రపంచ మిలిటరీ వ్యూహకర్తలు, విశ్లేషకులు నివ్వెరపోతున్నారు.ఎడమవైపు సంజ్ఞ చేస్తారు కుడివైపుకు తిరుగుతారు.. ఇది మనకు మోదీ ప్రసంగంలో తరుచు కనిపిస్తూ ఉంటుంది. మరి మోదీ వ్యూహాలు కూడా ఇలానే ఉంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులే కాకుండా ఆ దేశ కవ్వింపు చర్యలకు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవతమైంది. గత కొన్నేళ్లుగా మోదీ యుద్ధ తంత్రాలను దాయాది దేశం పాకిస్తాన్ పసిగట్టలేకపోతోంది.బాలాకోట్, "ఆపరేషన్ సింధూర్" రెండింటికీ ముందు, ప్రధాని మోదీ బాడీ లాంగ్వేజ్ బహిరంగ ప్రదర్శనే గాక ఆయన ప్రసంగాలు కూడా ప్రశాంతంగా కనిపించాయి. మోదీ అసలు ఉద్ధేశాన్ని బహిర్గత పరచలేదు. ఈ రెండు సమయాల్లోనూ సూదిమొనంత కచ్చితత్వంతో తాను చేయబోయే అ దాడులను,కాయన అమాయక మొహం వెనక దాచిపెట్టారు.బాలాకోట్ దాడి వ్యూహం తరహాలోనే, ఈసారి కూడా ప్రధాని మోదీ వ్యూహాలు పాకిస్తాన్‌ను నివ్వెరపరచాయ్. దాడికి ముందు ప్రశాంతమైన బాడీ లాంగ్వేజ్‌తో మాస్టర్‌మైండ్ యుద్ధతంత్రంతో. ఆపరేషన్ సింధూర్ కు ముందు ప్రదర్శించిన వైఖరి.. బాలకోట్‌కు ముందు ఆయన ప్రదర్శించిన వైఖరి పాకిస్తాన్‌ను అయోమయంలో పడేసింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక వైపు చూపించి.. మరో వైపు నుంచి.. మధ్యందిన మార్తాండుని వలే అనన్యసామాన్యమైన శక్తితో శత్రువుపై పిడుగులు కురిపించే కళలో ప్రావీణ్యం సంపాదించినట్లే ఉంటుంది.. 2019లో బాలకోట్ దాడులకు ముందు ఆయన ప్రయాణ ప్రణాళికతో పాటు ఆయన ప్రసంగం, ప్రస్తుత "ఆపరేషన్ సింధూర్" సందర్భంగా ఆయన వ్యూహాలు.. యుద్ధతంత్రంలో మాస్టర్‌క్లాస్‌లు.. శత్రువును అచేతనం చేసి.. మూగబోయేలా చేశాయి.ఒకసారి చేస్తే యాదృచ్ఛికం కానీ మళ్ళీమళ్ళీ పునరావృతం చేయడమంటే.. ప్రపంచమనే వేదికను నివ్వెరపరచడమే. ఇది మోదీకే సాధ్యమైన యుద్ధతాండవం. అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. రెండు దాడులకు మధ్య ఉన్న సారూప్యతలను పరిశీలిస్తే.. అవి కచ్చితంగా ఆశ్చర్యచకితుల్ని చేసే విధంగా ఉంటాయి. బాలకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రదర్శించిన తంత్రం నుండి ఎలాంటి పాఠం నేర్చుకోనందుకు పాకిస్తాన్ తన చెప్పుతో తననే కొట్టుకుంటుంది.బాలకోట్ కు 48 గంటల ముందు2019 ఫిబ్రవరి 26న.. తెల్లవారుఝామున భారతదేశం బాలకోట్ పై దాడి చేసింది. కానీ, ఆ దాడికి ముందు 48 గంటలు, మోదీ షెడ్యూల్ అంతా యథావిధిగా జరిగింది.ఫిబ్రవరి 25న, ఆయన న్యూఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి ఆయన మాట్లాడినప్పటికీ, పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని జిహాదిస్ట్ మౌలిక సదుపాయాలపై రాబోయే దాడి గురించి ఎటువంటి సూచన ఇవ్వలేదు.నిన్న(మంగళవారం, మే 6వ తేదీ) రాత్రి 9 గంటలకు, భారత విమానాలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ప్రధాని మోదీ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భారతదేశం యొక్క ఆకాంక్షలు, అభివృద్ధి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దాని సంకల్పం గురించి మోదీ మాట్లాడారు. ఆందోళన సూచించే ఒక్క ముడత కూడా అతని నుదిటిపై కనిపించలేదు. ప్రసంగంలో సందేహాస్పదమైన అంశాలకు ఏమాత్రం చోటివ్వలేదు.తుఫాను ఎదురైనప్పుడు ప్రశాంతత, అగ్ని గుండంలోనూ ధైర్యంగా నిలబడగలగడం గొప్ప నాయకుడి లక్షణాలు అని మనస్తత్వవేత్తలు అంటారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వం.. వారు సూచించే నాయకత్వ అంచనాలకు సరిపోవడం చూసి.. వారు నాయకత్వానికి ఇచ్చిన భాష్యం సరైందేనని భావిస్తారు.మోదీ వ్యూహాలు అర్థం కాలేదు,..చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోకపోతే, అవే తప్పులను పునరావృతం చేస్తారు. బాలాకోట్‌కు ముందు ప్రధాని మోదీ తీరును పాకిస్తాన్ విశ్లేషించి ఉంటే.. మే 6వ తేదీ రాత్రి నియంత్రణ రేఖ వెంబడి తొమ్మిది లక్ష్యాలపై భారత్ దాడి చేసినప్పుడు ఆ దేశం ఎంతో కొంత ప్రతిఘటించే ఉండేది, కానీ మోదీ వ్యూహాలు అర్ధం కాకపోవడంతో పాకిస్తాన్ చూస్తూ ఉండిపోయింది.బాలకోట్‌కు ముందు ప్రధాని మోదీ వైఖరికి సంబంధించి కచ్చితత్వానికి ప్రతిరూపంగానే నిలుస్తుంది. దాడులకు కొన్ని గంటల ముందు, ఆయన ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొని 2047 నాటికి భారతదేశం ఆర్థికంగా గొప్ప దేశంగా ఎదగాలనే ఆకాంక్షల గురించి మాట్లాడారు.30 నిమిషాల పాటు జరిగిన ఆనాటి తన ప్రసంగంలో.. ఏమాత్రం ఆందోళన కానీ ఒత్తిడి లేని వ్యక్తిలా ప్రశాంతంగా ఆయన మాట్లాడారు, జోకులు వేస్తూ, భారతదేశంలో ఉగ్రవాద దాడులకు మద్దతు ఇచ్చినందుకు పొరుగువారిని విమర్శించడం వినడానికి ప్రేక్షకులు ఆసక్తిగా కనిపించినప్పటికీ, పాకిస్తాన్ అనే పదాన్ని మాత్రం ఒక్కసారి కూడా పలకలేదు. ఆ సందర్బంగా మోదీ బాడీ లాంగ్వేజ్‌ను పరిశీలిస్తే ఎలాంటి అంచనాకు రాలేం.భారతదేశం అంతటా యుద్ధ విన్యాసాలు ప్రకటించడం అతిపెద్ద తంత్రం.. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికీ తన దేశాన్ని సైనిక చర్యకు, దాని పరిణామాలకు సిద్ధం చేస్తున్నారని సూచిస్తుంది. కానీ, ఇది పాకిస్తాన్‌కు విలాసవంతమైన సమయం ఉందనే భ్రమను కలిగించడానికి ఒక వ్యూహం మాత్రమే అని ఉదయాన్నే తేలింది.యుద్ధ కళలో నిష్ణాతులు ఏమంటారంటే.. మీకు మీ శత్రువు గురించి పూర్తిగా తెలిస్తే, యుద్ధంలో ఓటమికి చాలా తక్కువ అవకాశం ఉంటుందని చెబుతారు. పాకిస్తాన్‌ను మోదీ పూర్తిగా చదివేశారు... కానీ ఆయన్ను అంచనా వేయడంలో పాక్ మళ్లీ ఫెయిల్ అయ్యింది. అందుకే గెలుపు ప్రతీసారి మోదీనే వరిస్తుంది.

Operation Sindoor: ముంబై ఇండియన్స్‌పై ఎఫెక్ట్
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ముంబై ఇండియన్స్‌పై పడింది. తమ తదుపరి మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ఇవాళ (మే 7) సాయంత్రం ముంబై నుంచి చండీఘడ్ మీదుగా ధర్మశాలకు ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ధర్మశాల ప్రయాణం వాయిదా పడింది. భారత ప్రభుత్వం సూచనల మేరకు చండీఘడ్ సహా దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేశారు. చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో ముంబై ఇండియన్స్ ప్రయాణించాల్సిన విమాన సర్వీస్ కూడా ఉంది. బీసీసీఐ నుంచి తదుపరి సూచనలు వచ్చే వరకు ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలోనే ఉండనుంది.ఈ నెల 11న ముంబై ఇండియన్స్ ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసమే వారు ధర్మశాల ప్రయాణానికి సిద్దమయ్యారు. ఈ లోపే విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు ధర్మశాలలో రేపు (మే 8) ఓ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇదివరకే ధర్మశాలకు చేరుకున్నాయి.కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ దాడులకు తెగబడే అవకాశం ఉండటంతో భారత ప్రభుత్వం పలు విమానాశ్రయాలను మూసి వేయాలని సూచించింది. అయితే దీని ప్రభావం ఐపీఎల్ పడే అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం సాగాలంటే ఆయా జట్లు ఓ వేదిక నుంచి మరో వేదికకు విమానాల ద్వారా ప్రయాణించాల్సి ఉంది. దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేసిన నేపథ్యంలో జట్ల ప్రయాణానికి ఆటంకం కలుగవచ్చు. దీని ప్రభావం ఐపీఎల్ షెడ్యూల్‌పై పడే అవకాశం ఉంది.స్పందించిన బీసీసీఐషెడ్యూల్ మార్పు అంశంపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాయి. ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.మ్యాచ్ ముగిసిన కొద్ది సేపటికే ఆపరేషన్ సిందూర్ మొదలైందిముంబై ఇండియన్స్ -గుజరాత్ టైటాన్స్ మధ్య నిన్న (మే 6) జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గత నెల 22వ తేదీన పాక్ ఉగ్రమూకలు దాడులకు తెగబడి 26 మంది అమాయకుల ఫ్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. దీనికి బదులుగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్‌కు బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.
Operation Sindoor: ఉగ్ర తండాలపై రక్త సిందూరం
Operation Sindoor: ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైనికాధికారులు
Jammu and Kashmir: దశాబ్దాలుగా నరమేధమే
ఐదు విమానాలు కూల్చేశాం
భారత్‌ను దెబ్బకొట్టాల్సిందే
Operation Sindoor: ఆ 9 లక్ష్యాలు ఇవే..
పాక్ సైన్యం కర్కశ కాల్పులు
అత్యవసర సేవల ఉద్యోగుల 'సెలవులు రద్దు'
గెజిట్‌పై స్టే ఇవ్వలేం!
Operation Sindoor: యుద్ధ స్వరం... ఆ ఇద్దరు
చూడటానికి మొక్కజొన్న పంట.. కానీ దగ్గరకెళ్తే షాకవ్వుతారు!
సారీ సార్! యుద్ధమొస్తే నేనూ వెళ్లిపోతా...
కుమారుడి ధోతి వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి మంజుల (ఫొటోలు)
భారత్ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. శుభవార్తలు వింటారు
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. సంఘంలో గౌరవమర్యాదలు
మొదట్నుంచి మీరే ఏదో రకంగా విదేశీయులకు హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూపిస్తున్నారుగా సార్!!
గోదావరి ప్రజల ఆరాధ్య దైవం.. శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం (ఫొటోలు)
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్
ఉగ్రబుద్ధిపై వక్రభాష్యం!
ఫ్లాష్ ఫ్లాష్: పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..30 మంది ఉగ్రవాదుల హతం
#MetGala2025 : చరిత్ర సృష్టించిన కియారా.. మొదటిసారి బేబీ బంప్‌తో ఇలా! (ఫొటోలు)
ఆపరేషన్ సిందూర్ అప్డేట్స్.. రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం
భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్.. కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?
నేడు ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల
యుద్ధానికి సిద్ధం!.. నేడు కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష
భారత్ దాడులు.. పాక్ ప్రధాని రియాక్షన్ ఇదే..
IPL 2025: చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషబ్ పంత్
మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!
త్వరలో నా డ్రీమ్ ప్రాజెక్ట్‌తో తిరిగొస్తా: కార్తీక్ సుబ్బరాజ్
Operation Sindoor: ఉగ్ర తండాలపై రక్త సిందూరం
Operation Sindoor: ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైనికాధికారులు
Jammu and Kashmir: దశాబ్దాలుగా నరమేధమే
ఐదు విమానాలు కూల్చేశాం
భారత్‌ను దెబ్బకొట్టాల్సిందే
Operation Sindoor: ఆ 9 లక్ష్యాలు ఇవే..
పాక్ సైన్యం కర్కశ కాల్పులు
అత్యవసర సేవల ఉద్యోగుల 'సెలవులు రద్దు'
గెజిట్‌పై స్టే ఇవ్వలేం!
Operation Sindoor: యుద్ధ స్వరం... ఆ ఇద్దరు
సినిమా

'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?
కొన్నిసార్లు చిన్న సినిమానే కదా ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ అదే భారీ దెబ్బ కొట్టొచ్చు. తమిళ ప్రేక్షకుల్ని ప్రస్తుతం ఎంటర్ టైన్ చేస్తున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ'ని చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే సూర్య 'రెట్రో'కి పోటీగా రిలీజ్ అనేసరికి చాలామంది.. బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా అనుకున్నారు. కానీ ఇప్పుడదే సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది.చాలా తక్కువ బడ్జెట్, సింపుల్ కథతో తీసిన ఈ సినిమా మే 01న రిలీజైతే ఇప్పటివరకు రూ.20 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. పోటీలో ఉన్న రెట్రో కంటే దీన్ని చూసేందుకే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) అసలు విషయానికొస్తే ఈ సినిమాని త్వరలో తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది కానీ అది జరిగే పనిలా అనిపించట్లేదు. ఎందుకంటే ఇది తమిళ ఫ్లేవర్ తో తెరకెక్కిన కథ. దీన్ని తెలుగులో ఆదరిస్తారా అంటే సందేహమే. అదే టైంలో ఓటీటీలో రావడానికి నాలుగు వారాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారట.ఈ లెక్కన చూసుకుంటే 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా ఓటీటీలోకి మే 31న వచ్చే సూచనలు గట్టిగా ఉన్నాయి. తెలుగు వెర్షన్ కూడా అప్పుడే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీలో సిమ్రాన్ తప్పితే మనకు తెలిసిన ముఖం లేదు.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక)

ఆ మార్పు కి నేను సిద్ధంగా ఉన్నాను: హీరో శ్రీవిష్ణు
‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్ల అవుతుంది. ఈ పదహారేళ్లలో ఎక్కడ కూడా బోర్ కొట్టించని సినిమాలే చేశానని భావిస్తున్నాను. రానున్న రొజులలో చాలా మార్పులు రాబోతున్నాయి. పెద్ద రెవల్యూషన్ రాబోతుంది. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ రాబోతున్నారు. ఆ మార్పు కి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి క్యారెక్టర్ లో ది బెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం #సింగిల్(#single movie). కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కార్తిక్ రాజు దర్శకత్వం వహించారు. మే9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో శ్రీవిష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ డైరెక్టర్ కార్తీక్ రాజు ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా మంచి ఎంటర్టైనర్ అవుతుందని నమ్మకం కలిగింది. ఫైనల్ గా సినిమా చూసుకున్న తర్వాత చాలా పెద్ద ఎంటర్టైనర్ అవుతుందని అనిపించింది.ఇప్పటివరకు విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఇదంతా టీమ్ ఎఫర్ట్ అని భావిస్తున్నాను.→ ఈ సినిమా క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. నా క్యారెక్టర్, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్. ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ నాలుగు క్యారెక్టర్లు కూడా ఆడియన్స్ కి చాలా నచ్చుతాయి. క్లైమాక్స్ చాలా యూనిక్ గా ఉంటుంది. అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.→ సినిమాని కంప్లీట్ గా హైదరాబాద్ లో తీసాం. హైదరాబాద్‌ని చాలా కొత్తగా చూపించాం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ ని ఇంత కొత్తగా ఎవరు చూపించలేదు. చాలా బెస్ట్ మూమెంట్స్ ని క్యాప్చర్ చేశాం. → నేను ప్రతి క్యారెక్టర్ నీ ఎంజాయ్ చేస్తాను. డైరెక్టర్ తోనే ఎక్కువ ట్రావెల్ చేస్తాను. ఆ ట్రావెల్ లోనే 50% వచ్చేస్తుంది. తర్వాత లొకేషన్ లో ఇంకొంత క్యారెక్టర్ మీద కమాండ్ పెరుగుతుంది.→ ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. ఇందులో లవ్‌స్టోరీ ఉంటుంది. దానికి తగ్గట్లుగానే నా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఆడియన్స్ చూస్తారు.→ సినిమా ఒక హైపర్ ఎనర్జీతో వచ్చింది. దానికి తగ్గట్టు విశాల్ చంద్రశేఖర్ ఎనర్జిటిక్ సాంగ్స్ ఇచ్చారు. ఆర్ఆర్ చాలా బాగా చేశారు. చాలా కొత్తగా ఉంటుంది. చాలా ఇన్నోవేటివ్ సౌండ్ ఉంటుంది→ సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో స్వాగ్ ఒక ఫుల్ కామెడీ సినిమా అనుకున్నారు. మేము కూడా ప్రాపర్ కంటెంట్ ఇలా ఉంటుందని ప్రిపేర్ చేయలేకపోయాం. అందుకే చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడిందని అనుకుంటున్నాను. ఫుల్ ఫన్ అని వచ్చిన వాళ్ళు కొంత డిసప్పాయింట్మెంట్ అయిన మాట నిజమే. ఒక డిఫరెంట్ కంటెంట్ సినిమా చూడాలనే ఆడియన్స్ కి సినిమా చాలా నచ్చింది. టెలివిజన్ లో వచ్చిన తర్వాత కూడా చాలా మంచి అప్లోజ్ వచ్చింది. ప్రయోగం చేసినప్పుడు వర్క్ కాకపోతే దానిని ఎక్స్పీరియన్స్ కింద చూడాలి. వర్క్ అయినా వర్క్ కాకపోయినా కొత్త ప్రయత్నం మానకూడదని నా అభిప్రాయం.→ గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పటినుంచో గీతా ఆర్ట్స్ లో చేయాలి. లక్కీగా ఈ సినిమా కుదిరింది 100% కాన్ఫిడెన్స్ ఉన్న జోనర్ ఇది. ఈ జోనర్ లో గీత ఆర్ట్స్ తో చేయడం వెరీ వెరీ హ్యాపీ.→ ప్రస్తుతం మృత్యుంజయ అనే ఒక థ్రిల్లర్ చేస్తున్నాను. అలాగే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాను.అలాగే ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాను.

మొన్ననే విడాకులు .. ఇప్పుడు ఐటమ్ సాంగ్
టీమిండియా క్రికెటర్, ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు ఆడుతున్న యజువేంద్ర చాహల్.. కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. 2020లో యూట్యూబర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మతో చాహల్ పెళ్లి జరిగింది. అయితే వీళ్ల బంధం చాలావరకు బాగానే ఉండేది. మరి ఏమైందో ఏమో గానీ గత కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉన్నారు. ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసేసుకున్నారు.అయితే భర్త నుంచి విడిపోయిన తర్వాత ధనశ్రీ.. సినిమాల్లో బిజీ అయిపోతోంది. మొన్నీమధ్యే తెలుగులో 'ఆకాశం దాటివస్తావా' మూవీలో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ఓ హిందీ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడీ ఈ విషయాన్ని ఈమెనే స్వయంగా వెల్లడించింది.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ హీరోహీరోయిన్లుగా నటించిన 'భూల్ చుక్ మాఫ్' చిత్రం మే 09న థియేటర్లలోకి రానుంది. ఇందులోని ప్రత్యేక గీతంలో ధనశ్రీ నర్తించింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే సినిమాల్లో నటించే విషయమై చాహల్-ధనశ్రీ మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారా అనే సందేహం వస్తోంది.ఎందుకంటే విడాకులు తీసుకున్న కొన్నిరోజుల తర్వాత తెలుగు, హిందీలో తాను చేస్తున్న సినిమాల గురించి ధనశ్రీ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలు సక్సెస్ అయితే గనక ఈమె పూర్తిస్థాయిలో హీరోయిన్ గా మారిపోతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9)

హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. తన భార్య గర్భంతో ఉందని చెప్పాడు. ఇప్పుడు ఈమెకు గ్రాండ్ గా సీమంతం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని కిరణ్ భార్య రహస్య తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: పవన్ 'హరిహర వీరమల్లు'.. అంతా ఓటీటీ దయ!)కడపకు చెందిన కిరణ్ అబ్బవరం.. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ప్రేక్షకుల్ని అలరించాడు. తర్వాత చాలా సినిమాలు చేశాడు గానీ అవన్నీ ఫ్లాప్స్ అయ్యాయి. కానీ గతేడాది 'క' మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.్యక్తిగత జీవితానికొస్తే.. తన తొలి సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ నే కిరణ్ అబ్బవరం ప్రేమించాడు. కొన్నేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న వీళ్లిద్దరూ గతేడాది పెళ్లి చేసుకున్నారు. ఈ జనవరిలో ప్రెగ్నెన్సీ ప్రకటించారు. ఇప్పుడు సీమంతం జరిగింది. మరో ఒకటి రెండు నెలల్లో కిరణ్-రహస్యకు బేబీ పుట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran)
న్యూస్ పాడ్‌కాస్ట్

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!
క్రీడలు

కోల్‌కతాకు చెన్నై ఝలక్
కోల్‌కతా: ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ అవకాశాలపై దెబ్బ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అజింక్య రహానే (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్ (21 బంతుల్లో 38; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మనీశ్ పాండే (28 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించగా...నూర్ అహ్మద్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు సాధించింది. డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా...శివమ్ దూబే (40 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఉర్విల్ పటేల్ (11 బంతుల్లో 31; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. పవర్‌ప్లేలోపే సగం వికెట్లు కోల్పోయి 60/5 వద్ద నిలిచిన చెన్నై ఓటమి ఇక లాంఛనమే అనిపించింది. కానీ బ్రెవిస్, దూబే పోరాడంతో పాటు చివర్లో ధోని (17 నాటౌట్) పట్టుదలగా నిలబడటంతో గెలుపు సాధ్యమైంది. తాజా ఫలితంతో కోల్‌కతా ‘ప్లే ఆఫ్స్’కు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది. మిగిలిన 2 మ్యాచ్‌లలో గెలిచి గరిష్టంగా 15 పాయింట్లకు చేరినా ముందుకెళ్లడం కష్టమే. సాంకేతికంగా రేసులో ఉన్నా... ఈసారి కథ ముగిసినట్లే! ఐపీఎల్లో నేడుపంజాబ్ X ఢిల్లీవేదిక: ధర్మశాలరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: బ్రెవిస్ విధ్వంసం.. కేకేఆర్‌పై సీఎస్కే విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్ కంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్ పాండే (36 నాటౌట్), రసెల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. డెవాల్డ్ బ్రెవిస్ (52) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టును తిరిగి గెలుపు ట్రాక్‌లో పెట్టాడు. మధ్యలో దూబే (45) బాధ్యతాయుతంగా ఆడి సీఎస్కే విజయతీరాలవైపు మళ్లించాడు. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమైన తరుణంలో అప్పటిదాకా కామ్‌గా ఉన్న ధోని (17 నాటౌట్) సిక్సర్ కొట్టి సీఎస్కేకు గెలుపుకు చేరువ చేశాడు. నాలుగో బంతికి కంబోజ్ బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపు వల్ల సీఎస్కేకు ఒరిగేది ఏమీ లేనప్పటికీ కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టింది. బ్రెవిస్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 పరుగులువైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ శివాలెత్తిపోయాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లు సహా 30 పిండుకున్నాడు. ఈ ఒక్క ఓవర్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు ఓటమి ఖాయమనుకున్న సీఎస్కే ఒక్కసారిగా గెలుపు ట్రాక్‌లోకి వచ్చింది.బ్రెవిస్ 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు.

IPL 2025: పడిక్కల్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించిన ఆర్సీబీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ, ప్లే ఆఫ్స్ బెర్త్‌కు అతి సమీపంలో ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ముందు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో లక్నో (మే 9), సన్‌రైజర్స్ (మే 13), కేకేఆర్‌లతో (మే 17) తలపడనుంది.కాగా, ఆర్సీబీకి సీఎస్కేతో ఆడిన గత మ్యాచ్‌లో ఓ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వన్‌డౌన్ ఆటగాడు, ఇన్ఫామ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ గాయపడ్డాడు. తాజాగా ఆర్సీబీ యాజమాన్యం పడిక్కల్ స్థానాన్ని భర్తీ చేసింది. పడిక్కల్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసింది. మయాంక్‌ను ఆర్సీబీ కోటి రూపాయలకు దక్కించుకుంది. 34 ఏళ్ల మయాంక్‌కు ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2011 నుంచి అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 127 మ్యాచ్‌లు ఆడి 2661 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్లో మయాంక్ సన్‌రైజర్స్‌లో ఉన్నాడు. ఈ సీజన్ మెగా వేలంలో మయాంక్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. తమ తొలి టైటిల్ వేటను విజయవంతంగా సాగిస్తున్న ఆర్సీబీకి మున్ముందు ఆడబోయే కీలక మ్యాచ్‌ల్లో మయాంక్ ఏ మేరకు తోడ్పడతాడో చూడాలి. మయాంక్‌కు గతంలో (2011) ఆర్సీబీకి ఆడిన అనుభవం ఉంది. మయాంక్ స్వస్థలం బెంగళూరే కావడం అతనికి కలిసొచ్చే అంశం. మయాంక్ దేవ్ స్థానాన్ని భర్తీ చేయగలడో లేదో చూడాలి. దేవ్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడి 247 పరుగులు చేశాడు.హ్యారీ బ్రూక్‌కు ప్రత్యామ్నాయంగా అటల్లీగ్ ప్రారంభానికి ముందు వైదొలిగిన హ్యారీ బ్రూక్ స్థానాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు సెదిఖుల్లా అటల్‌తో భర్తీ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 13 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో కొనసాగుతుంది.

IPL 2025: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో సీఎస్కే తరఫున ఆల్‌టైమ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించాడు. ఐపీఎల్ 2025లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (మే 7) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన జడేజా కీలకమైన రహానే వికెట్ తీశాడు. సీఎస్కే తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించే క్రమంలో జడేజా డ్వేన్ బ్రావోను అధిగమించాడు. ఐపీఎల్లో జడేజా సీఎస్కే తరఫున 184 మ్యాచ్‌ల్లో 141 వికెట్లు సాధించగా.. బ్రావో 116 మ్యాచ్‌ల్లో 140 వికెట్లు తీశాడు.ఐపీఎల్లో సీఎస్కే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..141* - రవీంద్ర జడేజా (184 మ్యాచ్‌లు)140 - డ్వేన్ బ్రావో (116 మ్యాచ్‌లు)95 - ఆర్ అశ్విన్ (104 మ్యాచ్‌లు)76 - దీపక్ చాహర్ (76 మ్యాచ్‌లు)76 - ఆల్బీ మోర్కెల్ (78 మ్యాచ్‌లు)60 - శార్దూల్ ఠాకూర్ (57 మ్యాచ్‌లు)58 - మోహిత్ శర్మ (48 మ్యాచ్‌లు)మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్ కంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్ పాండే (36 నాటౌట్), రసెల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సునీల్ నరైన్ 26, గుర్భాజ్ 11, రఘువంశీ 1, రింకూ సింగ్ 9 పరుగులు చేసి ఔటయ్యారు.కాగా, ఈ సీజన్లో సీఎస్కే కథ ముగిసిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది.కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఇంకా పోటీలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 11 పాయింట్లు సాధించింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ వచ్చింది. కేకేఆర్ ఈ మ్యాచ్‌తో కలుపుకుని ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.
బిజినెస్

ఉగ్రదేశం మదం అణచిన ఫైటర్ జెట్లు
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై ఈ రోజు తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మెరుపుదాడికి పాల్పడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది స్థావరాలను భారత ఆర్మీ బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఘటనలో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆపరేషన్ సింధూర్‌లో రఫేల్, సుఖోయ్ ఎస్‌యూ -30 ఎంకేఐ, జాగ్వార్ యుద్ధ విమానాలను మోహరించింది. వాటి గురించి తెలుసుకుందాం.డసాల్ట్ రఫేల్డసాల్ట్ రాఫెల్ 4.5 జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ జెట్. ఇది అధునాతన ఏవియానిక్స్, మెరుగైన పోరాట సామర్థ్యాలకు ప్రసిద్ది చెందింది. అటాక్ చేసే సమయంలో యుద్ధభూమిలో పరిస్థితుల అవగాహన కోసం ఆర్బీఈ2 ఏఈఎస్ఏ రాడార్, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, ఫ్రంట్-సెక్టార్ ఆప్ట్రోనిక్స్ను అమర్చారు. రెండు ఎస్ఎన్సీఎంఏ ఎం88 టర్బోఫాన్ ఇంజిన్లను ఇందులో ఉపయోగించారు. ఇది సూపర్ క్రూయిస్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 9,500 కిలోల వరకు ఆయుధాలు, ఇంధనాన్ని మోసుకెళ్లగలదు. ఫైటర్ పైలట్లకు యుద్ధభూమిలో రియల్ టైమ్ సమాచారం అందించేందుకు బహుళ సెన్సార్లను ఉపయోగించారు. నౌకాదళం కోసం 26 రఫేల్-మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్ గతంలో రూ.63,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ఈ జెట్లను ఉంచాలని నిర్ణయించింది.సుఖోయ్ ఎస్ యూ-30 ఎంకేఐఈ ట్విన్ ఇంజిన్, మల్టీరోల్ ఎయిర్ సుపీరియరిటీ ఫైటర్ జెట్ సుఖోయ్ ఎస్‌యూ-30ఎంకేఐను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోసం రష్యాకు చెందిన సుఖోయ్ డిజైన్ బ్యూరో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది భారతదేశ ఆయుధాగారంలో అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటి.ఇది థ్రస్ట్ వెక్టరింగ్ కంట్రోల్‌తో ఏఎల్-31FP టర్బోఫాన్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. ఇది ఒకసారి ఇంధనం నింపితే గరిష్టంగా 3,000 కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు ఇంధనం నింపితే 8,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.మల్టీ-మోడ్ రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ (ఐఆర్ఎస్టీ)ను కలిగి ఉంది. ఇజ్రాయెల్, ఫ్రెంచ్, ఇండియా ఏవియానిక్స్‌లో ఇవి ఉన్నాయి.గగనతల క్షిపణులు, గైడెడ్ బాంబులతో సహా 8,000 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగలదు.భారత వైమానిక దళంలో 260కి పైగా ఈ జెట్లు సేవలందిస్తున్నాయి.ఇదీ చదవండి: ప్రభుత్వ రుణం దిగిరావాలిసెపెకాట్ జాగ్వార్సెపెకాట్ జాగ్వార్ అనేది ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్ ఇంజిన్, సూపర్ సోనిక్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్. తక్కువ ఎత్తులో హైస్పీడ్ ఆపరేషన్స్ కోసం రూపొందించారు. శత్రు భూభాగంలో దాడులకు అనువైనది. మెరుగైన రాడార్, జీపీఎస్ నావిగేషన్, నైట్ ఫ్లయింగ్ వ్యవస్థలను కలిగి ఉంది. రెండు రోల్స్ రాయిస్ టర్బోమెకా అడౌర్ టర్బోఫాన్ ఇంజిన్లతో దీన్ని రూపొందించారు. లేజర్ గైడెడ్ బాంబుల కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. భారత వైమానిక దళంలో జాగ్వార్ 1979 నుంచి కీలక స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్‌గా ఉంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఇది కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం అంబాలా, గోరఖ్‌పూర్, జామ్ నగర్ వైమానిక స్థావరాల్లో వీటిని మోహరించారు.

ప్రభుత్వ రుణం దిగిరావాలి
పెరిగిన ప్రభుత్వ రుణం మోస్తరు స్థాయికి దిగిరావాల్సి ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌సేత్ అన్నారు. తద్వారా వడ్డీ చెల్లింపులు తగ్గుతాయని, అప్పుడే రేటింగ్ అప్‌గ్రేడ్ అవుతుందన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అనిశ్చితులు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్ ఏదో ఒక నిర్ధిష్టమైన మార్గానికి పరిమితం కాకూడదన్నారు.‘మారుతున్న పరిణామాలకు మనం చురుగ్గా స్పందించాలి. నేడు భారత ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి సమీపించింది. మిగిలిన ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందన్నది తెలుసుకునేంత సామర్థ్యం మనకు ఉంది. ఈ దిశగా మనదైన మార్గాన్ని గుర్తించాలి’ అని వివరించారు. ప్రభుత్వ రుణం ప్రస్తుత స్థాయిల నుంచి కచ్చితంగా దిగిరావాలంటూ.. అందుకు ద్రవ్య స్థిరీకరణను మార్గంగా పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?దేశ జీడీపీలో పన్నుల వాటా దశాబ్దం క్రితం 16.5 శాతంగా ఉంటే, అది ప్రస్తుతం 18 శాతానికి చేరినట్టు అజయ్‌సేత్ తెలిపారు. ప్రస్తుత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే మరో 5–6 ఏళ్లలో 20 శాతానికి పన్నుల వాటా చేరుకోగలదన్నారు. వ్యయాల గురించి మాట్లాడుతూ.. మూలధన వ్యయాలకు అనుకూలంగా తగిన సర్దుబాట్లు జరుగుతున్నట్టు చెప్పారు.

యాపిల్ మొబైల్స్ అన్నీ భారత్‌లోనే తయారీ
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో ఉత్పత్తి చేయడం ప్రతి కంపెనీకి ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. తాము అమెరికాలో విక్రయించబోయే అధిక శాతం ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయంటూ టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించడం ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.‘రాబోయే రోజుల్లో తమ మొబైల్ ఫోన్లు అన్నింటినీ భారత్‌లోనే తయారు చేయాలని, సోర్సింగ్ చేయాలని యాపిల్ నిర్ణయించుకుంది. కాబట్టి భారత్‌లో ఇన్వెస్ట్ చేశారంటే విశ్వసనీయతను, సహజత్వాన్ని, అఫోర్డబిలిటీని (తక్కువ వ్యయాల ప్రయోజనాలు) ఎంచుకున్నట్లే’ అని భారత్ టెలికం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం దన్నుతో దేశీయంగా టెలికం పరికరాల మార్కెట్ అనెక రెట్లు వృద్ధి చెందిందని ఆయన తెలిపారు. రూ.4,000 కోట్ల పెట్టుబడులనేవి రూ.80,000 కోట్ల విక్రయాలకు, రూ.16,000 కోట్లు విలువ చేసే ఎగుమతులతో పాటు 25,000 ఉద్యోగాల కల్పనకు దోహదపడినట్లు సింధియా చెప్పారు.ఇదీ చదవండి: ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజారిటీ ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయని టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇదివరకే ప్రకటించారు. ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ మొదలైనవి వియత్నాంలో తయారైనవి ఉంటాయని పేర్కొన్నారు. ఇతరత్రా దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని పేర్కొన్నారు. చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అమెరికా భారీగా టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో కుక్ వ్యాఖ్యలు ఇటీవల ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంత మినహాయింపులున్నా, వివిధ టారిఫ్‌లను కలిపితే చైనా నుంచి ఎగుమతి చేసే తమ ఉత్పత్తులపై ఏకంగా 145 శాతం సుంకాలు వర్తిస్తాయని కుక్ తెలిపారు.

అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి మూడు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,750 (22 క్యారెట్స్), రూ.99,000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.500, రూ.540 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.540 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,000 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.500 పెరిగి రూ.90,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.540 పెరిగి రూ.99,150 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)లు కూడా భారీగానే పెరిగాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.3,100 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ

Met Gala 2025: స్టైలిష్ డిజైనర్‌వేర్‌లో ఇషా..ఏకంగా 20 వేల గంటలు..
ప్రతిష్టాత్మకమైన మెట్‌గాలా 2025 ఈవెంట్లో బాలీవుడ్ తారలంతా తమదైన ఫ్యాషన్ శైలిలో మెరిశారు. వారందరిలో ఈ ఇద్దరే ఈవెంట్ అటెన్షన్ మొత్తం తమవైపుకు తిప్పుకున్నారు. ఈ మెట్‌గాలా ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచాయి వాళ్లు ధరించిన డిజైనర్ వేర్లు. ఒకరు భారతీయ వారసత్వ సంప్రదాయన్ని ప్రపంచ వేదికపై చూపించగా.. మరొకరు భారతీయ హస్తకళకు ఆధునికతను జోడించి హైరేంజ్ ఫ్యాషన్‌తో అలరించారు. ఆ ప్రమఖులు ఎవరు..? ఆ ఈవెంట్ ప్రత్యేకతే ఏంటి తదితరాల గురించి చూద్దామా..!.మెట్ గాలా ఈవెంట్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన ప్రముఖులు ఇషా అంబానీ(Isha Ambani), గాయని దిల్జిత్ దోసాంజ్(Diljit Dosanjh)లు. ఇద్దరూ ఈవెంట్లో భారతీయ ఫ్యాషన్ కళ తమ భారతీయ సంప్రదాయ వారసత్వం, చేతికళలు గొప్పదనం తదితరాలే అర్థం పట్టేలా అట్రాక్టివ్ దుస్తుల్లో మెరిశారు. మొత్తం ఈవెంట్ వారి చుట్టూనే తిరుగుతుందేమో అనేంతగా ఉంది ఆ ఇరువురి లుక్. స్టైలిష్ డ్రెస్‌లో ఇషా..భారతీయ హస్తకళలకు పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా ఇషా డిజైనర్ వేర్ని రూపొందించారు. టాప్ గోల్డ్ దారంతో ఎంబ్రాయిడరీ చేసిన త్రీపీసెస్ కార్సెట్ ఇది. దానికి సరిపోయే బ్లాక్ కలర్ వెయిస్టెడ్ టైలర్డ్ ప్యాంటు విత్ తెల్లటి క్యాప్ లుక్‌లో అత్యంత స్టైలిష్ లుక్‌లో కనిపించింది ఇషా. అయితే డిజైనర్ అనామిక ఈ డ్రెస్‌కి అందమైన లుక్ ఇచ్చేందుకు దాదాపు 20 వేల గంటలు పైనే శ్రమించారట. ఒక పక్క చేతితో చేసిన బెనరస్ ఫ్యాబ్రిక్‌పై జర్దోజీ ఎంబ్రాయిడరీ, సున్నితమైన మోటిఫ్‌లు వంటి వాటితో సంప్రదాయ మేళవింపుతో కూడిన ఆధునిక ఫ్యాషన్ వేర్లా డిజైన్ చేశారామె. ప్రతి చిన్న కుట్టు మన సంప్రదాయ కళను సాంస్కృతికి అర్థం పట్టేలా శ్రద్ధ తీసుకుని మరీ డిజైన్ చేశారు. చూడటానికి బ్లాక్ డాండీ ఫ్యాషన్ లుక్లా అదిరిపోయింది. ఆ ఫ్యాషన్ వేర్కి తగ్గట్లు వింటేజ్ కార్టియర్ నెక్లెస్ ధరించారామె. నవానగర్ మహారాజుకు చెందిన ఈ నెక్లెస్ మొత్తం 480 క్యారెట్ల డైమెండ్ల తోపాటు షో-స్టాపింగ్ 80.73-క్యారెట్ కుషన్-కట్ డైమండ్ కూడా ఉంది. అలాగే చేతికి పక్షి ఉంగరాలు, నడుముకి వజ్రాలతో కూడిన ఆభరణం తదితరాలు ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) రాయల్ లుక్‌లో దిల్జిత్ దోసాంజ్గాయకుడు దిల్జిత్ దోసాంజ్ మెట్ గాలా 2025 నీలిరంగు కార్పెట్‌పై రాయల్ పంజాబీ దుస్తుల్లో కనిపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన వేదికపై సాంప్రదాయ సిక్కు వారసత్వాన్ని తెలియజేసేలా తలపాగా ధరించి వచ్చారు. సిక్కు రాయల్టీకి తగ్గ రాజదర్పంతో ఠీవీగా కనిపించారు దిల్జిత్ దోసాంజ్. భారతీయ రాజ వంశాలు ధరించే రత్నాలు, ముత్యాలు, పచ్చలు కూడిన ఆభరణాలు ధరించారు. సిక్కు శౌర్యం, గౌరవానికి ప్రతీక అయిన కత్తిని కూడా పట్టుకుని వచ్చారు. మెట్‌గాలాకి సంబంధించిన ఫ్యాషన్ వేర్ కాకపోయినా..గర్వంగా మా సంస్కృతే మా ఫ్యాషన్ అని చాటిచెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ వేడుకలో ఇతర బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులు కూడా తమదైన స్టైలిష్‌వేర్‌లో మెరిశారు. కాగా, ఈ ఏడాది న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ఈ ఛారిటీ ఈవెంట్ థీమ్ "సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్". అయితే ఈ 20 ఏళ్లలో పురుషుల దుస్తుల లుక్స్ పైకూడా దృష్టిసారించడం ఇదే మొదటిసారి. View this post on Instagram A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..)

కనుమరుగవుతున్న మామిడి వెరైటీలు ఇవే..!
ప్రపంచంలో మామిడిపండ్లకు చిరునామాగా సగర్వంగా నిలిచిన భారతదేశం, అనేకరకాల ప్రాదేశిక మామిడి పండ్లను కలిగి ఉంది. వీటిలో ప్రతీ మామిడి రకం తనదైన ప్రత్యేకమైన రుచి, సువాసన, సాంస్కృతిక నేపథ్యంతో ప్రసిద్ధి చెందింది. కానీ మార్కెట్ ఆధారిత వ్యవస్థ వల్ల వాణిజ్యపరంగా మొలకెత్తిన హైబ్రిడ్ రకాల ప్రభావంతో, ఈ విలువైన దేశీ మామిడి రకాలు క్రమంగా అదృశ్యం అవుతున్నాయి. ఇప్పటికే అన్ని చోట్లా లభించడం తగ్గిపోయిన ఈ మామిడి రకాలను ఈ వేసవి టూర్ల సందర్భంగా ఎక్కడైనా దొరికితే ఆస్వాదించడం మరచిపోవద్దు. 1. కరుప్పట్టి కాయ – తమిళనాడుతమిళనాడు దక్షిణ ప్రాంతాల్లో పుట్టిన ఈ కరుప్పట్టి కాయ ప్రత్యేకత ఏమిటంటే, ఇది చక్కెర పాకం (పామ్ జాగరీ)ను తలపించే రుచిని కలిగి ఉంటుంది. ఈ మామిడి పచ్చిగా తినడానికి కూడా బాగుంటుంది. అలాగే పచ్చళ్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఆకుపచ్చ రంగు ఫైబర్‌తో నిండిన గుజ్జుతో ఇది ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.2. కన్నిమాంగా – కేరళకేరళలో కన్నిమాంగా అనే చిన్న మామిడికాయలు పచ్చడికి ప్రసిద్ధి. ‘కన్నిమాంగా‘ అంటే ‘కన్య మామిడి‘, అంటే పూర్తి పక్వతకు ముందు కోయబడే కాయలు. ఈ రకాన్ని పచ్చడి రూపంలో వాడితే, కేరళ వంటకాల మసాలా రుచులకు ఇది సరిపోతుంది. అధిక దిగుబడి కలిగిన వాణిజ్య రకాల సాగు పెరిగిన నేపథ్యంలో, ఈ మామిడి మొక్కలు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. అయితే స్థానిక రైతులు గిరిజన సంఘాలు దీన్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.3. కల్భావి మావు – కర్ణాటకకర్ణాటక తీరప్రాంతాలలో పుట్టిన కల్భావి మావు మామిడి, గులాబీ వాసన తీపి రుచితో కొత్తగా ఉంటుందనే పేరు సంపాదించింది. ఇది గోల్డెన్ యెల్లో రంగులో మధ్య పరిమాణంలో ఉంటుంది. అదనపు తీపి కలిగి ఉండడంతో నేరుగా తినడానికి మాత్రమే కాకుండా స్వీట్స్ తయారీలో కూడా వాడేవారు. ఇటీవలి వరకూ మార్కెట్లలో విరివిగా లభించిన ఈ రకం, క్రమంగా తగ్గిపోతోంది. 4. బటాషా – పశ్చిమ బెంగాల్బెంగాల్కు చెందిన బటాషా మామిడి, బాగా తీయగా ఉంటుంది. ఇది చిన్న పరిమాణంలో ఉండి, రసం నిండిన గుజ్జుతో ఉంటుంది అయితే దీని మృదువైన తొక్క ఎక్కువ దూరాలకు తరలించలేనంత సున్నితంగా ఉండటంతో, ఈ మామిడి వాణిజ్యం పెద్దగా పుంజుకోలేదు. దాంతో దీని సాగు కూడా తగ్గిపోతోంది. ప్రస్తుతం ఇది కేవలం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తోంది.5. అమ్మ చెట్టు – ఆంధ్రప్రదేశ్ఈ మామిడి రకాన్ని అందించే చెట్టుకు తెలుగులో ‘‘అమ్మ చెట్టు’’ అనే పేరు, మామిడికి కూడా అదే పేరు. పెద్దదైన పరిమాణం, ఫైబర్‌తో నిండిన గుజ్జుతో ఉన్న ఈ మామిడి చెట్లు గ్రామీణ జీవన విధానంలో భాగంగా ఉండేవి. అయితే, ఈ చెట్ల నిర్వహణ కష్టం కావడంతో, ఈ రకం సాగు తగ్గిపోయింది. ఇక ఇది కేవలం కథల్లో, జ్ఞాపకాలలో మాత్రమే మిగిలిపోనుంది. అధిక దిగుబడి, హైబ్రిడ్ రకాలపై దృష్టి పెరగడంతో దేశీ రకాల మామిడి ప్రాధాన్యత తగ్గిపోయింది. అలాగే టెంక లేని పండ్లను ఇష్టపడే ఆధునిక వినియోగదారుల అభిరుచి వల్ల, స్వాభావికంగా పెరిగే దేశీ రకాల విస్త్రుతికి అడ్డంకి ఏర్పడింది. మరోవైపు నగరీకరణ విస్తరణ వల్ల తోటలపై భౌగోళిక ఒత్తిడి పెరిగింది. యువతలో దేశీరకాల గురించి అవగాహన లేకపోవడం కూడా సాగును దెబ్బతీసింది.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... కారణాలేవైనా మనదైన మామిడి వెరైటీలను మనం కోల్పోతుండడం దురదృష్టకర పరిణామమేనని చెప్పాలి.(చదవండి: కల్తీ పుచ్చకాయను పసిగట్టొచ్చు ఇలా..!)

మంచి పుచ్చకాయను గుర్తించండి ఇలా!
వేసవిలో లభించే పుచ్చకాయలు అందరికీ ఇష్టం, అంతకంటే చల్లని నేస్తాల వంటివి అనొచ్చు. వాటి సహజమైన తీపి, అధిక నీటి శాతం వాటి రిఫ్రెషింగ్ రుచితో పాటు కలర్‌ఫుల్ రూపం కూడా సమ్మర్లో వాటిని తిరుగులేనివి పండుగా నిలబెట్టాయి. ఈ పుచ్చకాయల వల్ల ఆరోగ్య ప్రయోజనాలూ అనేకం...పుచ్చకాయ కేవలం అలసిపోయినప్పుడు రిఫ్రెష్ చేసే పండు మాత్రమే కాదు, అవసరమైన పోషకాలతో కూడా నిండి ఉంటుంది. దాదాపు 9092% నీటితో కూడిన పుచ్చకాయ, వేసవి వేడి సమయంలో హైడ్రేషన్ కోసం ఒక అద్భుతమైన ఎంపిక. ఒక 100 గ్రాముల పుచ్చకాయ ద్వారా దాదాపు 16 కేలరీలు లభిస్తాయి తక్కువ కేలరీల పండుగా, బరువును నియంత్రించుకునే వారికి పుచ్చకాయ అనుకూలంగా ఉంటుంది. దీనిలో సి, ఎ, బి6 విటమిన్లు అలాగే పొటాషియం మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటం వలన ఈ పండు అధిక రక్తపోటు ఉన్నవారికి మరింత ప్రయోజనకరం. దీని విటమిన్ సి కంటెంట్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేసి వివిధ వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. పుచ్చకాయ జీర్ణక్రియకు సహాయపడుతుంది, దానిలోని ఇనుము శాతం కారణంగా రక్తహీనత ఉన్నవారికి మంచిది. పండులోని ఎరుపు భాగాన్ని తరచుగా అత్యంత రుచికరంగా పరిగణిస్తారు, అయితే చర్మం దగ్గర ఉన్న లేత ఆకుపచ్చ రంగులో ఉండే భాగం సైతం ఎక్కువ పోషక ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యపరంగా పుచ్చకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ, దానిని కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. వేసవి నెలల్లో, రోడ్డు పక్కన ఎర్రగా, కోసిన పుచ్చకాయ రూపం ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, మార్కెట్లో చాలా కల్తీ పుచ్చకాయలు ఉన్నాయి, మరి తాజా, ఆరోగ్యకరమైన పుచ్చకాయను కొనుగోలు చేస్తున్నారని తెలుసుకోవడం ఎలా? నాణ్యత లేని పండ్ల ద్వారా మోసపోకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండడం ఎలా? ఇప్పుడు చూద్దాం..కల్తీ పుచ్చకాయ అంటే హానికరమైన రసాయనాలు, రంగులు లేదా ఆర్టిషియల్ రిపైనింగ్ ఏజెంట్లను ఉపయోగించి దాని రూపాన్ని లేదా బరువును పెంచడానికి తారుమారు చేసిన పండు. సాధారణ కల్తీ పద్ధతుల్లో దాని గుజ్జును ఎర్రగా కనిపించేలా చేయడానికి ఆర్టిషియల్ కలర్‌ను ఇంజెక్ట్ చేయడం, బరువు పెంచడానికి నీటిని జోడించడం లేదా తాజాదనాన్ని కాపాడటానికి రసాయనాలను ఉపయోగించడం వంటివి చేస్తున్నారు. ఈ పద్ధతులు మన ఆరోగ్యానికి హానికరం, కాబట్టి విశ్వసనీయ విక్రేతల నుంచి మాత్రమే పుచ్చకాయలను కొనుగోలు చేయడం సహజ పక్వత సంకేతాలను తనిఖీ చేయడం ముఖ్యంమంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి? పుచ్చకాయను కొనుగోలు చేసేటప్పుడు, రంగు ముఖ్యం. నిస్తేజమైన చర్మం ఉన్న దాని కంటే శక్తివంతమైన, తగిన రంగు కలిగిన పుచ్చకాయ మంచి ఎంపిక. పక్వానికి ముఖ్య సూచిక దానిని తట్టినప్పుడు వచ్చే శబ్దం బోలుగా ఉండే, తేలికపాటి శబ్దం పండు నీటితో నిండి ఉందని మంచిదని సూచిస్తుంది. అదనంగా, ఏవైనా మచ్చలు లేదా గాయాలు ఉన్నాయా అని పుచ్చకాయను తనిఖీ చేయాలి, ఎందుకంటే ఇవి నష్టం లేదా చెడిపోవడాన్ని సూచిస్తాయి. పుచ్చకాయ అడుగున పసుపు మచ్చల కోసం ఉండాలి. అలా మచ్చలు ఉంటే ఈ పుచ్చకాయను సరైన సమయంలో సహజంగా పండించారని అర్ధం. అయితే, లేత లేదా తెల్లటి మచ్చలు ఉంటే పండు పూర్తిగా పక్వానికి రాకముందే కోసినట్లు అర్ధం View this post on Instagram A post shared by Adithya Nataraj 🇮🇳 (@learnwithadithya) (చదవండి: World Asthma Day: శ్వాసకు ఊపిరి పోద్దాం..! ఆస్తమాను అదుపులో ఉంచుదాం..!)

జపాన్‌లో శాకాహారమా..? సలాడ్లతో సరిపెట్టుకోవాల్సిన పనిలేదు..
అందమైన దేశంలో ఒకటిగా పేరుగాంచింది జపాన్. అక్కడ నగరాలన్నీ ప్రకృతి రమణీయతతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. తప్పక పర్యటించాల్సిన దేశమే అయినా..పర్యాటకులకు ఇబ్బంది కలిగించేది ఆహారం. అందులోనూ శాకాహారులే అయితే మరింత సమస్య. అక్కడ ఏది ఆర్డర్ చేసిన అందులో తప్పనిసరిగా ఏదో ఒక నాన్‌వెజ్ ఉంటుంది. తినాలంటేనే భయం భయంగా ఉంటుంది. అందుకే అక్కడ పర్యటించే టూరిస్ట్‌లు స్టోర్స్‌లో దొరికే సలాడ్లు వంటి ఇతర పదార్థాలపై ఆధారపడతారు. ఇక అలా ఇబ్బంది పడాల్సిన పనిలేదు అంటూ జపాన్‌లో కూడా శాకాహారం దొరుకుతుందని చెబుతోంది బాలీవుడ్ నటి బర్ఖాసింగ్. ఇంతకీ జపాన్‌లో ఎక్కడ శాకాహారం లభిస్తుందంటే..జపాన్‌లో ఒసాకా, క్యోటో, టోక్యో అంతట మనకు శాకాహార భోజనం లభిస్తుందట. ఇక్కడ అందించే వంటకాల్లో చేపలు లేదా మాంసాన్ని జోడించకుండా టమోటా ఆధారిత రెసిపీలు ఎక్కువగా దొరుకుతాయట. అక్కడ పూర్తి శాఖాహారం తోకూడిన వేగన్ మెనూ పర్యాటకుల్ని ఆకర్షిస్తుందట. అందువల్ల ఎలాంటి సంకోచంల లేకుండా నచ్చిన వంటకాలన్నీ ఆస్వాదించొచ్చు అని చెబుతున్నారు నటి బర్ఖాసింగ్. చాక్లెట్ గ్యో ఐస్ క్రీం, సోబా నూడుల్స్ వంటి టేస్టీ టేస్టీ వంటకాల రుచి చూడొచ్చట. ఇక కోకో ఇచిబన్యా రెస్టారెంట్ కూరగాయలతో చేసిన కర్రీలకు ఫేమస్ అట. అక్కడ మనకు తెలియని కొంగొత్త కూరగాయల రుచులు మైమరిపిస్తాయని చెబుతోంది బర్ఖాసింగ్. అలాగే అక్కడ ఉండే చిన్న చిన్న స్టాల్స్ మెత్తటి చీజ్‌కేక్, కస్టర్డ్ నిండిన పాన్కేక్లకు పేరుగాంచినవని చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాలీవుడ్ నటి, మోడల్ బర్ఖాసింగ్ పలు సినిమాలు, టీవీ షోల్లో నటించింది. అంతేగాదు వైవిధ్యభరితమైన నటనకు ప్రసిద్ధిగాంచిన నటి బర్ఖాసింగ్. View this post on Instagram A post shared by Barkha Singh (@barkhasingh0308) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..)
ఫొటోలు


భార్యకు సీమంతం చేసిన హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)


Miss World 2025: సుందరీమణులకు స్వాగతం


తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు (ఫొటోలు)


భారత్ తడాఖా.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ విలవిల (ఫొటోలు)


మిస్ వరల్డ్ పోటీల విలేకరుల సమావేశంలో నందినీ గుప్తా, సోనూసూద్ (ఫొటోలు)


ఘనంగా తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)


మెట్‌గాలా 2025 ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ (ఫోటోలు)


'శుభం' కోసం తెగ కష్టపడుతున్న సమంత (ఫొటోలు)


భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్.. కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?


గోదావరి ప్రజల ఆరాధ్య దైవం.. శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం (ఫొటోలు)
అంతర్జాతీయం

కొత్త పోప్ ఎవరో!
ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది క్యాథలిక్‌లకు అత్యున్నత మతాధికారిగా సేవలు అందించబోయే తదుపరి పోప్ ఎవరనే ఉత్కంఠ తీవ్రమైంది. దీనికి తెరదించడంలో భాగంగా కార్డినల్స్ బుధవారం వాటికన్ సిటీలో రహస్య ఓటింగ్‌కు సిద్ధమయ్యారు. అత్యధిక మెజారిటీ సాధించిన కార్డినల్కు పోప్ పదవి దక్కనుంది. 70 దేశాలకు చెందిన 133 మంది కార్డినళ్లు సిస్టిన్ ఛాపెల్లోకి వెళ్లి రహస్య ఓటింగ్‌లో పాల్గొనబోతున్నారు.మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చిన వారే నూతన పోప్ అవుతారు. సిస్టిన్ ఛాపెల్‌లో ఏ కార్డినల్ ఎవరికి ఓటేశారనే విషయం పొరపాటున కూడా బయటకు పొక్కకుండా ఉండేందుకు వాటికన్ సిటీవ్యాప్తంగా అన్ని మొబైల్ఫోన్ల స్నిగల్స్ను బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఆపేయనున్నారు. నాలుగున్నర గంటలకు కార్డినళ్లు అందరూ ఛాపెల్లోకి వెళ్లనున్నారు. వీళ్ల ఫోన్లు, అన్నిరకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అధికారులు తీసుకుని కొత్త పోప్ ఎన్నిక తర్వాతే తిరిగి అప్పగిస్తారు. అప్పటిదాకా కార్డినళ్లను ఛాపెల్ ప్రాంగణం బయటకు కూడా అనుమతించబోరు. కొత్త పోప్ ఎన్నికల వార్త వినేందుకు ప్రజలు, మీడియా ప్రతినిధులు వేచి ఉండే ‘సెయింట్ పీటర్ స్క్వేర్’ వద్ద మాత్రం మొబైల్ నెట్వర్క్ పనిచేయనుంది. రహస్య ప్రక్రియలో ఎవరు పోప్‌గా పోటీపడుతున్నారనే అంశంపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే ప్రధానంగా ఐదారుగురి పేర్లు మాత్రమే వినవస్తున్నాయి. వాళ్ల గురించి క్లుప్తంగా...పియట్రో పరోలిన్70 ఏళ్ల ఇటలీ కార్డినల్ అయిన పియట్రో పరోలిన్ మిగతా వాళ్లతో పోలిస్తే పోటీలో ముందంజలో ఉన్నారు. గత పోప్ ఫ్రాన్సిస్ హయాంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్‌కు ప్రధాన సలహాదారుగా ఉంటూ ఇప్పటికే ఈయన డిప్యూటీ పోప్‌గా అందరికీ చిరపరిచితులు. క్యాథలిక్‌ల పాత సిద్ధాంతాల పరిరక్షణకంటే దౌత్యం, ప్రపంచవ్యాప్తంగా పోప్ ప్రతిష్టను ఇనుమడింపజేయడం మీదనే ఈయన ప్రధానంగా దృష్టిపెడతారనే వాదన ఉంది. గత 266 మంది పోప్లలో 213 మంది ఇటలీ దేశస్తులే. గత 40 ఏళ్లుగా ఇటలీవ్యక్తి పోప్ పదవిని అధిరోహించలేదు. ఈ లెక్కన ఈసారి ఇటలీ వర్గం ఈయనకు అత్యధిక మద్దతిచ్చే అవకాశముంది.లూయిస్ ఆంటోనియోగోకెమ్ ట్యాగిల్67 ఏళ్ల ట్యాగిల్ ఫిలిప్పీన్స్ దేశస్తుడు. మిగతా వాళ్లతో పోలిస్తే ఈయన చాలా సంవత్సరాలుగా పాస్టర్‌గా కొనసాగి కార్డినల్ అయ్యారు. వాటికన్ తరఫున దౌత్యవేత్తగా, చర్చి చట్టాలను కఠినంగా అమలుచేసే కార్డినళ్లతో పోలిస్తే ఈయన భిన్నమైన వ్యక్తి. ఈయన స్వదేశం ఫిలిప్పీన్స్‌లో 80 శాతం జనాభా క్యాథలిక్లే. పైగా కార్డినళ్లలో ఐదుగురు ఫిలిప్పీన్ దేశస్తులున్నారు. దీంతో ఈయనకు సైతం మద్దతు పలికే లాబీ బలంగా ఉందని వార్తలొస్తున్నాయి.రాబర్ట్ ప్రివోస్ట్69 ఏళ్ల ప్రివోస్ట్ స్వస్థలం అమెరికాలోని షికాగో. రెండేళ్ల క్రితం తదుపరి బిషప్‌ల ఎన్నికల బాధ్యతలను ఇటీవల మార్క్ ఆలెట్ను పక్కనబెట్టిమరీ ప్రివోస్ట్కు పోప్ ఫ్రాన్సిస్ కట్టబెట్టారు. ఇలా ఫ్రాన్సిస్ నుంచి మన్ననలు పొందారు. పోప్‌గా ఎన్నికైతే ఆ పీఠాన్ని అధిరోహించిన తొలి అమెరికన్ కార్డినల్‌గా చరిత్రకెక్కుతారు.పీటర్ కోడ్వో టర్క్సన్76 ఏళ్ల టర్క్సన్ ఘనా దేశానికి చెందిన కార్డినల్. 22 ఏళ్ల క్రితం ఘనా నుంచి కార్డినల్ అయిన తొలి వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. గత 1,500 ఏళ్లలో ఆఫ్రికా ఖండం నుంచి ఎవరూ పోప్ బాధ్యతలు చేపట్టలేదు. ఈసారి ఈయనకు సైతం గెలుపు అవకాశాలున్నట్టు తెలుస్తోంది. స్వలింగ సంబంధాలను నేరంగా చూడకూడదని ఆయన వాదించేవారు. యూరప్‌లో ఇస్లాం మతవ్యాప్తి పెరగొచ్చని గతంలో ఆందోళన వ్యక్తం చేశారు.మారియో గ్రెక్68 ఏళ్ల మారియో మాల్టా దేశానికి చెందిన వ్యక్తి. క్యాథలిక్‌లలో అందరితో కలుపుకొని పోయే కార్డినల్కు అవకాశం ఇవ్వాలని భావిస్తే మొట్టమొదట వినిపించేది ఈయన పేరే. పోప్‌కు సలహాలు, సూచనలు ఇచ్చే సంఘమైన బిషప్ సైనోడ్కు ఆరేళ్ల క్రితమే ఈయన ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. అందరి సమ్మతితో నిర్ణయాలు తీసుకోవాలనేది ఈయన ఆలోచన.ఫ్రిడోలిన్ ఆంబోంగో బెసుంగీ65 ఏళ్ల ఫ్రిడోలిన్ ఆఫ్రికాలోని కాంగో దేశానికి చెందిన వ్యక్తి. ఆఫ్రికా నుంచి ఏటా లక్షల సంఖ్యలో క్రైస్తవ మతంలోకి మారుతున్న నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఫ్రిడోలిన్కు సైతం మెండుగా ఉన్నట్లు సమాచారం. ఏడేళ్లు కిన్షారా ఆర్చ్‌బిషప్‌గా ఉన్న ఈయనను పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా ఎంపికచేశారు. పాత సాంప్రదాయాలకు ఈయన పట్టంకడతారు. స్వలింగ వివాహాలకు ఈయన బద్ద వ్యతిరేకి. ‘‘ క్రైస్తవుల్లో ప్రొటెస్టాంట్లను ప్రొటెస్టెంట్లుగానే ఉండనిద్దాం. ఇక ముస్లింను ముస్లింగానే బతకనిద్దాం’’ అని గతంలో వ్యాఖ్యానించారు. ఈయన వ్యాఖ్యలు క్రైస్తవాన్ని బోధించే మతప్రచారకులకు ఇబ్బందికరంగా మారాయి.పీటర్ ఎర్డో72 ఏళ్ల ఎర్డో హంగేరీ దేశానికి చెందిన కార్డినల్. గత 21 ఏళ్లుగా కార్డినల్‌గా కొనసాగుతూ యూరప్‌లో చర్చి వర్గాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. 2006 నుంచి పదేళ్లపాటు యూరోపియన్ బిషప్‌ల మండలి సమావేశాలను విజయవంతంగా నిర్వహించారు. తొలుత బుడాపెస్ట్ ఆర్చ్‌బిషప్‌గా పనిచేశారు. అటు ఆఫ్రికన్ కార్డినళ్లతో, ఇటు యూరప్ కార్డినళ్లతో సత్సంబంధాలున్నాయి. పోప్ పదవికి గట్టి పోటీ ఇచ్చే వీలుంది. – సాక్షి, నేషనల్ డెస్క్పోప్ ఫ్రాన్సిస్, ఆయనకు ముందు పోప్‌గా ఉన్న బెనెడిక్ట్–16లను పోప్ పదవికి ఎన్నుకోవడానికి కార్డినళ్లకు కేవలం రెండు రోజుల సమయం పట్టింది. అయితే 1268 సంవత్సరంలో ఈ ప్రక్రియ ఎంతకీ తెమల్లేదు. దీంతో ఏకంగా 1,006 రోజులపాటు ఓటింగ్ జరిగి ఎట్టకేలకు 1271 సంవత్సరంలో పోప్‌ను ఎన్నుకున్నారు. చరిత్రలో అత్యంత సుదీర్ఘకాల ఎన్నిక ప్రక్రియ ఇదే.

ఇక స్వేచ్ఛా వాణిజ్యం
న్యూఢిల్లీ/లండన్: భారత్–యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)తోపాటు డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఒప్పందం కుదిరాయి. ఇరుదేశాల మధ్య మూడేళ్లుగా జరుగుతున్న చర్చలు ఫలించాయి. ఒప్పందంపై భారత్, యూకే మంగళవారం అంగీకారానికి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై సుంకాల మోత మోగిస్తున్న తరుణంలో ఈ ఒప్పందాలు కుదరడం వల్ల భారత్, యూకే దేశాలకు ఎనలేని లబ్ధి చేకూరుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బలపడనున్న బంధం యూకేతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చరిత్రాత్మకమైన మైలురాయిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్–యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబ డులు, ఆర్థిక ప్రగతి, ఉద్యోగాల కల్పన, నవీన ఆవిష్కరణలు వంటి అంశాల్లో రెండు దేశాలకు ఎంతో మేలు జరుగుతుందని హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ తాజాగా యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో ఫోన్లో మాట్లాడారు. ఎఫ్‌టీఏపై చర్చించారు. ఎఫ్‌టీఏతోపాటు డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కుదరడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. ప్రపంచంలో రెండు అతిపెద్ద, ఓపెన్–మార్కెట్ ఆర్థిక వ్యవస్థలైన భారత్, యూకే మధ్య ఎఫ్‌టీఏ కుదరడంతో వ్యాపారాలకు నూతన అవకాశాలు అందుబాటులోకి రావడంతోపాటు రెండు దేశాల మధ్య ఆర్థిక బంధంతోపాటు ప్రజల మధ్య సంబంధాలు మరింత బలం పుంజుకుంటాయని మోదీ, స్టార్మర్ ఉద్ఘాటించారు. ఏమిటీ ఒప్పందం? ⇒ భారత్–యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చాలాఏళ్లుగా చర్చల్లో నలుగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టడం, విదేశీ ఉత్పత్తులపై సుంకాల బాంబు పేల్చడంతో భారత్–యూకే మధ్య చర్చల్లో ఒక్కసారిగా వేగం పెరిగింది. 2022 జనవరిలో మొదలైన ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. అదే సమయంలో ప్రతిపాదిత ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ⇒ స్వేచ్ఛా వాణిప్య ఒప్పందంతో విస్కీ, అడ్వాన్స్డ్ తయారీ భాగాలు, వైద్య పరికరాలు, అడ్వాన్స్డ్ మెషినరీ, ఆహార ఉత్పత్తులపై టారిఫ్‌లు భారీగా తగ్గుతాయి. ⇒అంతర్జాతీయ మార్కెట్ల కోసం రెండు దేశాలు ఉమ్మడిగా వస్తువులు, సేవలను అభివృద్ధి చేయడానికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ⇒యూకే ఉత్పత్తులను ఇండియా అనుమతించనుంది. అలాగే ఇండియా తమ ఉత్పత్తులను యూకేలో విక్రయించుకోవచ్చు. ⇒ భారత్‌లో బ్రిటిష్ స్కాచ్ విస్కీ, బ్రిటిష్ కార్ల ధరలు తగ్గిపోతాయి. అలాగే బ్రిటన్‌లో ఇండియా వస్త్రాలు, తోలు ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. ⇒ ఒప్పందం ప్రకారం... యూకే విస్కీ, జిన్‌పై సుంకాన్ని 150 నుంచి 75 శాతానికి భారత్ తగ్గిస్తుంది. పదేళ్లలో 40 శాతానికి తగ్గించనుంది. ⇒ బ్రిటిష్ ఆటోమొబైల్స్‌పై ఇండియాలో టారిఫ్ ప్రస్తుతం 100 శాతం ఉండగా, ఇది 10 శాతానికి తగ్గిపోనుంది. ప్రతిఫలంగా భారత్ నుంచి వచ్చే పలు ఉత్పత్తులపై టారిఫ్‌లను యూకే ప్రభుత్వం భారీగా తగ్గిస్తుంది. ⇒ యూకే మార్కెట్లలో 99 శాతం భారతీయ ఉత్పత్తులపై టారిఫ్‌లు సున్నాకు పడిపోతాయి. పాదరక్షలు, బంగారు అభరణాలు, రత్నాలు, రసాయనాలు, ప్లాస్టిక్, రబ్బర్, కలప, కాగితం, గాజు, సెరామిక్, బేస్ మెటల్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ మెషినరీ, ఫర్నీచర్, క్రీడా సామగ్రి, శుద్ధి చేసిన ఆహారం, పాడి ఉత్పత్తులపై సుంకాలు ఉండవు. అంతేకాకుండా భారతీయులకు యూకేలో మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ⇒ ఎఫ్టీఏతో ఇండియా–యునైటెడ్ కింగ్డమ్ నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెండు రెట్లు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. 2040 నాటికి బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ ప్రతిఏటా అదనంగా 4.8 బిలియన్ పౌండ్ల మేర లాభపడుతుందని చెబుతున్నారు. ⇒భారత్, యూకే మద్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 41 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఎఫ్టీఏతో ఇది 56 బిలియన్ పౌండ్లకు చేరుకోనుంది. ⇒ డబుల్ కంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్(సామాజిక భద్రత ఒప్పందం) ప్రకారం.. భారత్ ఉద్యోగాలు యూకేలో లేదా యూకే ఉద్యోగులు భారత్‌లో పనిచేస్తే నేషనల్ ఇన్సూరెన్స్ లేదా సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ⇒ ఎఫ్టీఏకు ఇరుదేశాల పార్లమెంట్ ఆమోదం లభించి, సంతకాలు జరగాల్సి ఉంది. ఏడాది లోగా అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

భారత్ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్!
ఇస్లామాబాద్: 1971లలో నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత్ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ బుధవారం జరగనుంది. ఈ తరుణంలో పాకిస్తాన్ మాజీ దౌత్వవేత్త (హైకమిషనర్) అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్.. పాకిస్తాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. వచ్చే వారం,11,12వ తేదీలలో దాడి చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. India will likely carry out its limited misadventure against Pakistan after Victory Celebrations in Russia. Perhaps on 10-11 May.— Abdul Basit (@abasitpak1) May 6, 2025మరోవైపు, పాక్‌పై దాడి చేసేందుకు భారత్ సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్‌పై భారీ స్థాయి ‘ఆపరేషన్’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్‌తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్‌లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది.ఈ మేరకు రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. డ్రిల్స్‌లో భాగంగా సమర్థమైన పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పహల్గాం ఉగ్ర దాడుల వంటివి జరిగితే దీటుగా ఎదుర్కోవడం ఎలాగో నేర్పిస్తారు. స్వీయరక్షణ చర్యలతో పాటు విద్యుత్ సరఫరా బ్లాకౌట్ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలో, కీలక మౌలిక వనరుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తారు.

యూఎన్వో కీలక భేటీలో పాకిస్థాన్‌కు భంగపాటు
యూఎన్వో సమావేశంలో పాకిస్థాన్‌కు భంగపాటు ఎదురైంది. పహల్గాం ఉగ్రదాడిని యూఎన్వో తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ చెప్పిన పలు అంశాలను సభ్య దేశాలు తిరస్కరించాయి. లష్కరే తోయిబా ప్రమేయంపై పాక్‌ను యూఎన్వో ఆరాతీసింది. ప్రత్యేకంగా ఒక మతం వారినే కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ క్షిపణి పరీక్షలపై యూఎన్వో ఆందోళన వ్యక్తం చేసిందిపహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకుండా భారత్ చర్యలపైనే ఫోకస్ పెట్టిన పాక్.. సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని భద్రతా మండలిలో ప్రస్తావించింది. భారత్, పాకిస్థాన్ సంయమనం పాటించాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. భద్రతామండలిలో భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన పాకిస్తాన్.. భారత్ చర్యలను తప్పు బట్టే ప్రయత్నం చేసింది. ఎలాంటి తీర్మానం లేకుండానే భద్రతా మండలి రహస్య సమావేశం ముగిసింది.భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వెలిబుచ్చింది. వాటి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇరు దేశాలకూ సూచించారు. అందుకు దన్నుగా నిలిచేందుకు ఐరాస సిద్ధమని తెలిపారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని హితవు పలికారు.సాయుధ ఘర్షణ మొదలైతే పరిస్థితి అదుపు తప్పుతుందని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్‌లో పెల్లుబుకుతున్న జనాగ్రహాన్ని, ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలను. ఆ పాశవిక దాడిని మరోసారి ఖండిస్తున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలా పౌరులను లక్ష్యం చేసుకోవడం దారుణం. దీనికి పాల్పడ్డవారికి చట్టపరంగా కఠిన శిక్షపడాల్సిందే’’ అన్నారు.
జాతీయం

ప్రధాని మోదీ విజయరహస్యం ఇదే..!
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధ వ్యూహాలపైనే చర్చ నడుస్తోంది. ఎంత కఠినమైన సమయంలో కూడా తనలోని గాంభీర్యాన్ని ముఖంలో కనిపించనీయకుండా. పైకి తనపని తాను చేసుకుంటూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉండటమే మోదీ శైలి. అవతలి వాడికి అవకాశమివ్వడం, అవతలివాడిని మాట్లాడనీయడం మోదీకి తెలిసిన మరో విద్య. అది చెడు కానంతవరకే మోదీ భరిస్తారు.. ఒకవేళ అవతలి వాళ్ల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న సమయంలో మాత్రం మోదీ వ్యవహరశైలి భిన్నంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా విశేష అభిమానం సందపాదించుకున్న మోదీ యుద్ధ వ్యూహాలను చూసి ప్రపంచ మిలిటరీ వ్యూహకర్తలు, విశ్లేషకులు నివ్వెరపోతున్నారు.ఎడమవైపు సంజ్ఞ చేస్తారు కుడివైపుకు తిరుగుతారు.. ఇది మనకు మోదీ ప్రసంగంలో తరుచు కనిపిస్తూ ఉంటుంది. మరి మోదీ వ్యూహాలు కూడా ఇలానే ఉంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులే కాకుండా ఆ దేశ కవ్వింపు చర్యలకు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవతమైంది. గత కొన్నేళ్లుగా మోదీ యుద్ధ తంత్రాలను దాయాది దేశం పాకిస్తాన్ పసిగట్టలేకపోతోంది.బాలాకోట్, "ఆపరేషన్ సింధూర్" రెండింటికీ ముందు, ప్రధాని మోదీ బాడీ లాంగ్వేజ్ బహిరంగ ప్రదర్శనే గాక ఆయన ప్రసంగాలు కూడా ప్రశాంతంగా కనిపించాయి. మోదీ అసలు ఉద్ధేశాన్ని బహిర్గత పరచలేదు. ఈ రెండు సమయాల్లోనూ సూదిమొనంత కచ్చితత్వంతో తాను చేయబోయే అ దాడులను,కాయన అమాయక మొహం వెనక దాచిపెట్టారు.బాలాకోట్ దాడి వ్యూహం తరహాలోనే, ఈసారి కూడా ప్రధాని మోదీ వ్యూహాలు పాకిస్తాన్‌ను నివ్వెరపరచాయ్. దాడికి ముందు ప్రశాంతమైన బాడీ లాంగ్వేజ్‌తో మాస్టర్‌మైండ్ యుద్ధతంత్రంతో. ఆపరేషన్ సింధూర్ కు ముందు ప్రదర్శించిన వైఖరి.. బాలకోట్‌కు ముందు ఆయన ప్రదర్శించిన వైఖరి పాకిస్తాన్‌ను అయోమయంలో పడేసింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక వైపు చూపించి.. మరో వైపు నుంచి.. మధ్యందిన మార్తాండుని వలే అనన్యసామాన్యమైన శక్తితో శత్రువుపై పిడుగులు కురిపించే కళలో ప్రావీణ్యం సంపాదించినట్లే ఉంటుంది.. 2019లో బాలకోట్ దాడులకు ముందు ఆయన ప్రయాణ ప్రణాళికతో పాటు ఆయన ప్రసంగం, ప్రస్తుత "ఆపరేషన్ సింధూర్" సందర్భంగా ఆయన వ్యూహాలు.. యుద్ధతంత్రంలో మాస్టర్‌క్లాస్‌లు.. శత్రువును అచేతనం చేసి.. మూగబోయేలా చేశాయి.ఒకసారి చేస్తే యాదృచ్ఛికం కానీ మళ్ళీమళ్ళీ పునరావృతం చేయడమంటే.. ప్రపంచమనే వేదికను నివ్వెరపరచడమే. ఇది మోదీకే సాధ్యమైన యుద్ధతాండవం. అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. రెండు దాడులకు మధ్య ఉన్న సారూప్యతలను పరిశీలిస్తే.. అవి కచ్చితంగా ఆశ్చర్యచకితుల్ని చేసే విధంగా ఉంటాయి. బాలకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రదర్శించిన తంత్రం నుండి ఎలాంటి పాఠం నేర్చుకోనందుకు పాకిస్తాన్ తన చెప్పుతో తననే కొట్టుకుంటుంది.బాలకోట్ కు 48 గంటల ముందు2019 ఫిబ్రవరి 26న.. తెల్లవారుఝామున భారతదేశం బాలకోట్ పై దాడి చేసింది. కానీ, ఆ దాడికి ముందు 48 గంటలు, మోదీ షెడ్యూల్ అంతా యథావిధిగా జరిగింది.ఫిబ్రవరి 25న, ఆయన న్యూఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి ఆయన మాట్లాడినప్పటికీ, పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని జిహాదిస్ట్ మౌలిక సదుపాయాలపై రాబోయే దాడి గురించి ఎటువంటి సూచన ఇవ్వలేదు.నిన్న(మంగళవారం, మే 6వ తేదీ) రాత్రి 9 గంటలకు, భారత విమానాలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ప్రధాని మోదీ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భారతదేశం యొక్క ఆకాంక్షలు, అభివృద్ధి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దాని సంకల్పం గురించి మోదీ మాట్లాడారు. ఆందోళన సూచించే ఒక్క ముడత కూడా అతని నుదిటిపై కనిపించలేదు. ప్రసంగంలో సందేహాస్పదమైన అంశాలకు ఏమాత్రం చోటివ్వలేదు.తుఫాను ఎదురైనప్పుడు ప్రశాంతత, అగ్ని గుండంలోనూ ధైర్యంగా నిలబడగలగడం గొప్ప నాయకుడి లక్షణాలు అని మనస్తత్వవేత్తలు అంటారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వం.. వారు సూచించే నాయకత్వ అంచనాలకు సరిపోవడం చూసి.. వారు నాయకత్వానికి ఇచ్చిన భాష్యం సరైందేనని భావిస్తారు.మోదీ వ్యూహాలు అర్థం కాలేదు,..చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోకపోతే, అవే తప్పులను పునరావృతం చేస్తారు. బాలాకోట్‌కు ముందు ప్రధాని మోదీ తీరును పాకిస్తాన్ విశ్లేషించి ఉంటే.. మే 6వ తేదీ రాత్రి నియంత్రణ రేఖ వెంబడి తొమ్మిది లక్ష్యాలపై భారత్ దాడి చేసినప్పుడు ఆ దేశం ఎంతో కొంత ప్రతిఘటించే ఉండేది, కానీ మోదీ వ్యూహాలు అర్ధం కాకపోవడంతో పాకిస్తాన్ చూస్తూ ఉండిపోయింది.బాలకోట్‌కు ముందు ప్రధాని మోదీ వైఖరికి సంబంధించి కచ్చితత్వానికి ప్రతిరూపంగానే నిలుస్తుంది. దాడులకు కొన్ని గంటల ముందు, ఆయన ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొని 2047 నాటికి భారతదేశం ఆర్థికంగా గొప్ప దేశంగా ఎదగాలనే ఆకాంక్షల గురించి మాట్లాడారు.30 నిమిషాల పాటు జరిగిన ఆనాటి తన ప్రసంగంలో.. ఏమాత్రం ఆందోళన కానీ ఒత్తిడి లేని వ్యక్తిలా ప్రశాంతంగా ఆయన మాట్లాడారు, జోకులు వేస్తూ, భారతదేశంలో ఉగ్రవాద దాడులకు మద్దతు ఇచ్చినందుకు పొరుగువారిని విమర్శించడం వినడానికి ప్రేక్షకులు ఆసక్తిగా కనిపించినప్పటికీ, పాకిస్తాన్ అనే పదాన్ని మాత్రం ఒక్కసారి కూడా పలకలేదు. ఆ సందర్బంగా మోదీ బాడీ లాంగ్వేజ్‌ను పరిశీలిస్తే ఎలాంటి అంచనాకు రాలేం.భారతదేశం అంతటా యుద్ధ విన్యాసాలు ప్రకటించడం అతిపెద్ద తంత్రం.. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికీ తన దేశాన్ని సైనిక చర్యకు, దాని పరిణామాలకు సిద్ధం చేస్తున్నారని సూచిస్తుంది. కానీ, ఇది పాకిస్తాన్‌కు విలాసవంతమైన సమయం ఉందనే భ్రమను కలిగించడానికి ఒక వ్యూహం మాత్రమే అని ఉదయాన్నే తేలింది.యుద్ధ కళలో నిష్ణాతులు ఏమంటారంటే.. మీకు మీ శత్రువు గురించి పూర్తిగా తెలిస్తే, యుద్ధంలో ఓటమికి చాలా తక్కువ అవకాశం ఉంటుందని చెబుతారు. పాకిస్తాన్‌ను మోదీ పూర్తిగా చదివేశారు... కానీ ఆయన్ను అంచనా వేయడంలో పాక్ మళ్లీ ఫెయిల్ అయ్యింది. అందుకే గెలుపు ప్రతీసారి మోదీనే వరిస్తుంది.

దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్
అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు.. దేశవ్యాప్తంగా సివిల్ డిపెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. దాదాపు 54 ఏళ్ల అనంతరం దేశవ్యాప్తంగా పౌర రక్షణ, సన్నద్ధత విన్యాసాలు నిర్వహించారు. 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట ఈ డ్రిల్స్ జరిగాయి. మాక్ డ్రిల్స్‌లో భాగంగా వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు వినిపించాయి.👉హైదరాబాద్, విశాఖ సహా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్👉సికింద్రాబాద్, గోల్గొండ, కంచన్‌బాగ్ డీఆర్డీఏ, మౌలాలీలోని ఎన్ఎఫ్సీలో డిఫెన్స్ బృందాల మాక్ డ్రిల్👉విశాఖ వన్ టౌన్లో మాక్ డ్రిల్👉వైమానిక దాడులపై అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్👉ఎక్కడెక్కడ జరిగాయంటే..దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్‌డ్రిల్స్ జరిగాయి. వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి. 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్‌షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ ఉన్నాయి.మాక్‌డ్రిల్ వల్ల ప్రజలు ఎవరూ భయపడొద్దు: సీవీ ఆనంద్సైరన్ మోగగానే ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలిఇళ్లలో ఉన్నవాళ్లు ఇళ్లలోనే ఉండాలిబయట ఉన్నవాళ్లు సమీప భవనాల్లోకి వెళ్లాలి👉ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది.👉ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పై సీఎం సమీక్ష నిర్వహించారు.👉ఆపరేషన్ అభ్యాస్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.👉జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో మరికాసేపట్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నాం👉సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అలర్ట్ చేస్తాం.👉4 గంటలకు సైరన్ మోగగానే మాక్ డ్రిల్ ప్రారంభమవుతుంది.👉హైదరాబాద్, విశాఖ సహా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్👉ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్ నిర్వహణ👉సాయంత్రం 4 గంటల నుంచి 4.30 వరకు మాక్ డ్రిల్👉హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్👉సికింద్రాబాద్, గోల్గొండ,కంచబాగ్ డీఆర్డీఏ, మౌలాలీలోని ఎన్ఎఫ్సీలో డిఫెన్స్ బృందాల మాక్ డ్రిల్ 👉మోగనున్న పోలీస్ సైరన్, ఇండస్ట్రియల్ సైరన్లు

ఆపరేషన్ సిందూర్.. మసూద్ అజర్ ఫ్యామిలీ ఖతం
ఢిల్లీ: ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం.జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బవహల్పూర్ లోని జైష్-ఎ-మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచారం.ముఖ్యంగా బవహల్పూర్లోని జైష్-ఎ-మహమ్మద్ శిబిరాలు, సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మందితో పాటు అనుచరులు మరణించినట్లు తెలుస్తోంది. మసూద్ అజార్ అక్క, బావ, మేనల్లుడు, అతడి భార్య కూడా ఉన్నట్లు సమాచారం.

Operation Sindoor: ఎవరీ కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం వంతంగా ముగి;సింది. పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో మంగళవారం అర్ధ రాత్రి భారత భద్రతా దళాలు ఆర్మీ,నేవీలు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టాయి.ఆపరేషన్‌లో భాగంగా లక్షిత దాడుల్ని అరగంటలోపు నేలమట్టం చేసింది. 9స్థావరాల్లో ఉన్న 80 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేశాయి. అనంతరం ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశం జరిగింది. ఈ ఆపరేషన్‌కు సారధ్యం వహించిన భారత సశస్త్ర దళాల్లో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీ,విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రిలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు నాయకత్వం వహించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీలు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది వెల్లడించారు. దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియోల్ని బహిర్ఘతం చేశారు. దీంతో ప్రపంచ మొత్తం ఈ ఇద్దరి మహిళా అధికారులు గురించి చర్చ మొదలైంది. ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi) ఇండియన్ ఆర్మీలోని త్రివిధ దళాలలైన ఆర్మీలోని సిగ్నల్‌కోర్‌కి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ. అనేక సాహసోపేతమైన విజయాలతో సైనిక చరిత్రలో తన స్థానాన్ని సుస్థిర పరుచున్నారు. ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సిందూర్‌కు ముందుండి నాయకత్వం వహించారు. ఫోర్స్ 18కు నాయకత్వం 2016 మార్చిలో అప్పటి లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ భారత్ ఆతిథ్యమిచ్చిన ఫోర్స్ 18 అనే బహుళజాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం మార్చి 2 నుండి 8 వరకు పుణేలో జరిగింది. ఇందులో ఆసియన్ దేశాలతో పాటు జపాన్, చైనా, రష్యా, యుఎస్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి 18 దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో పాల్గొన్న దళాల్లో, లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ మాత్రమే మహిళా కమాండర్‌గా ఉండడం ఆమె నాయకత్వ నైపుణ్యానికి నిదర్శనం.పీస్ కీపింగ్ ఆపరేషన్స్‌లోనూఆమె నేతృత్వంలోని 40-సభ్యుల భారత దళం శాంతి భద్రతలను కాపాడేందుకు, సంఘర్షణ లేదా సంఘర్షణానంతర ప్రాంతాలకు సైనిక సిబ్బందిని మోహరించి ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించే విభాగమే ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ (PKOs). ఈ పీకేవో ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించారు. హ్యూమానిటేరియన్ మైన్ యాక్షన్ (HMA) వంటి కీలక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంది. దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులైన పీస్ కీపింగ్ శిక్షణాదారులలోంచి ఆమెను ఎంపిక చేశారు.యుఎన్ శాంతి పరిరక్షణలో విశిష్ట అనుభవం2006లో, యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్ (కాంగో) లో మిలిటరీ అబ్జర్వర్‌గా పనిచేశారు. 2010 నుంచి ఆమె పీకేవోలో కొనసాగుతూ వచ్చారు. అందులో ఆమె విశేష సేవలు అందిస్తున్నారు. సైనిక సేవ ఆమెకు వారసత్వంగా ఆమె తాత సైన్యంలో సేవలందించగా, ఆమె భర్త కూడా మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీకి చెందిన అధికారి. ఈ విధంగా ఆమె కుటుంబం సైనిక సేవలతో ముడిపడిందివింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Wing Commander Vyomika Singh)వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత వైమానిక దళానికి చెందిన పైలట్. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు ఈమె నేతృత్వంలోనే జరిగాయి. వ్యోమికా సింగ్ విషయానికొస్తే.. వ్యోమిక అంటే ఆకాశపు కుమార్తె అని అర్ధం. ఆ పేరులో ఆమె చిన్ననాటి కల ప్రతిబింబిస్తుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు పైలట్ కావాలనే సంకల్పం ఉండేది. స్కూల్ రోజుల్లోనే ఆమె ఎన్సీసీలో చేరి, తరువాత ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కుటుంబంలో మొదటిసారిగా సైన్యంలో చేరిన వ్యక్తిగా ఆమె పేరు గడించారు. 2019 డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.చల్లని గాలుల మధ్య నుండి మసక చీకట్ల వరకూ అన్నీ సాహసాలే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు. చేతక్, చీటాహ్ వంటి హెలికాప్టర్లను నడిపుతూ, జమ్మూ కాశ్మీర్ లోని ఎత్తయిన ప్రాంతాలు నుండి, ఈశాన్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాల వరకూ సేవలందించారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో సామాన్యులను రక్షించేందుకు ఆమె ఒక కీలకమైన రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. 2021లో ఆమె మౌంట్ మనిరంగ్ (21,650 అడుగుల ఎత్తు) పైకి ప్రయాణించిన త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్‌లో పాల్గొన్నారు.ఆపరేషన్ సిందూర్ తర్వాత పహల్గాంలో 26 మంది సాధారణ పౌరుల హత్యకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో, దేశానికి సమాచారం ఇవ్వడమే కాక, భారత సైన్యం ఇప్పుడు ఎవరిచేత ప్రాతినిధ్యం వహించబడుతోంది అన్న దానిలో స్పష్టమైన మార్పును వింగ్ కమాండర్ సింగ్ చూపించారు.
ఎన్ఆర్ఐ

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్రైమ్

కూతురి హత్యకు ప్రతీకారం
మండ్య(కర్ణాటక): గతేడాది జనవరిలో.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఓ యువతి.. ఆకస్మికంగా హత్యకు గురైంది. అప్పటినుంచి కేసు నడుస్తోంది. ఇంతలో ఆ కేసులో నిందితుని తండ్రి ప్రతీకార హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పౌరుషాల గడ్డ అయిన మండ్య జిల్లా పాండవపుర తాలూకా మాణిక్యనహళ్లిలో మంగళవారం జరిగింది. ఏం జరిగింది? వివరాలు.. నరసింహే గౌడ (55) అనే రైతు కత్తిపోట్లతో చనిపోయాడు. వెంటనే వెంకటేశ్, మంజునాథ్ అనే ఇద్దరిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వెంకటేష్ కూతురు దీపికతో నరసింహేగౌడ కొడుకు నితీష్ కుమార్ చనువుగా ఉండేవాడు. దీపిక కు అదివరకే పెళ్లయి కొడుకు ఉన్నాడు. ఇద్దరూ రీల్స్ కూడా చేసేవారు. గతేడాది జనవరిలో మేలుకోటె కొండ అంచున దీపిక హత్యకు గురైంది. నితీష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసు నడుస్తోంది. అప్పటినుంచి ఇరుకుటుంబాల మధ్య వైరం కొనసాగుతోంది. నరసింహేగౌడ తన కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఓ టీ హోటల్ వద్ద అతన్ని కత్తితో పొడిచి చంపారు. తన కూతురి హత్యకు ప్రతీకారంగా వెంకటేష్ ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.

మటన్ పులుసులో కప్ప
అన్నానగర్(తమిళనాడు): పూందమల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలో నావలడి అనే ప్రైవేట్ హోటల్ నడుస్తోంది. ఆదివారం రాత్రి ఈ రెస్టారెంట్‌కి ఓ కుటుంబం భోజనం చేసేందుకు వెళ్లింది. అక్కడ బిర్యానీ, మటన్ గ్రేవీ ఆర్డర్ చేసి తింటున్నారు. సిబ్బంది తీసుకొచ్చిన మటన్ పులుసును వారు తినేందుకు ప్రయత్నించగా అందులో పెద్ద కప్ప చనిపోయిందని తెలుస్తుంది. దీంతో షాక్ తిన్న వారు హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వారు ఆహారంలో కప్ప మొత్తం పడి ఉన్న వీడియోను తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సంచలనం సష్టించింది. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందింది. ఆ తర్వాత తిరువళ్లూరు జిల్లా ఆహార భద్రత విభాగం అధికారి వేలవన్ నేతృత్వంలో అధికారులు ఘటన జరిగిన హోటల్‌కు వెళ్లి కిచెన్‌లో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత హోటల్‌కు సీల్ వేసి చర్యలు తీసుకున్నారు.

ఓయో రూమ్‌కు తీసుకువెళ్లి.. రహస్య వీడియోలు
సాక్షి,హైదరాబాద్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళను వేధిస్తున్న యువకుడికి నగర షీ–టీమ్స్ బృందాలు చెక్ చెప్పాయి. ఇతడితో పాటు మరికొందరు పోకిరీలు, నిరాధార ఫిర్యాదులు చేస్తున్న యువతిని పట్టుకున్నట్లు డీసీపీ డాక్టర్ ఎన్జేపీ లావణ్య మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన ఓ యువకుడు (30) ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళతో కొన్నాళ్లు స్నేహం చేశాడు. ఆపై ఇరువురూ కలిసి ఓయో రూమ్‌కు వెళ్లగా... సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను రహస్య కెమెరాతో రికార్డు చేశాడు. ఆపై వాటిని బయటపెడతానంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. అలా కాకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు చేయాలంటూ మూడు ఆప్షన్లు ఇచ్చాడు. తాను కోరినప్పుడల్లా రావాలని, తనతో సన్నిహితంగా ఉండటానికి మరికొందరు మహిళలను ఏర్పాటు చేయాలని, రూ.లక్ష ఇవ్వాలని చెప్పిన యువకుడు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోరారు. ఎట్టకేలకు «ధైర్యం చేసిన ఆ మహిళ షీ–టీమ్స్‌ను ఆశ్రయిస్తూ తనకు ఉన్న నాలుగో ఆప్షన్ చూపింది. నిందితుడిని పట్టుకున్న బృందాలు అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి అతగాడికి మూడు రోజుల సాధారణ జైలుశిక్ష విధించారు. బేగంపేటకు చెందిన ఓ యువతి తన సహోద్యోగులతో కలిసి ఓ వేడుక చేసుకున్నారు. దీన్ని వారికి తెలియకుండా పక్క ఇంట్లో ఉండే ప్లంబర్ (34) రికార్డు చేశాడు. మర్నాడు ఆ వీడియోలు చూపిస్తూ మహిళలను బెదిరించడం మొదలెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని లేదంటే ఆ వీడియోలు ఆన్లైన్లో పెడతానని వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ–టీమ్స్ నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడిని నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో నివసించే యువతి ఇటీవల ప్రజావాణిలో ఓ ఫిర్యాదు చేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తనపై లైంగికదాడి చేశారని అందులో పేర్కొన్నారు. ప్రజావాణి నుంచి ఈ ఫిర్యాదు షీ–టీమ్స్‌కు రాగా.. అధికారులు బాధితురాలిని సంప్రదించి గోపాలపురం ఠాణాకు తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసిన అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె చేస్తున్న దందా వెలుగులోకి వచి్చంది. పోలీసులనే టార్గెట్‌గా చేసుకుంటున్న ఈ యువతి వివిధ కారణాలు చెప్తూ వారి ఫోన్లు తీసుకుంటుంది. వాటి ద్వారా అశ్లీల చిత్రాలను తన నెంబర్‌కు ఫార్వర్డ్ చేసుకుంటుంది. వీటిని చూపిస్తూ ఆ పోలీసులనే బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజావాణిలో తప్పుడు ఫిర్యాదు చేసిన ఆరోపణలపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే జీహెచ్ఎంసీ వాహనం డ్రైవర్ ఓ మహిళను వేధించారు. చెత్త వెయ్యడానికి వచ్చే ఆమెను చూస్తూ అభ్యంతరకర, అశ్లీల పనులు చేసేవాడు. దీనిపై బాధితురాలు షీ–టీమ్స్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా డెకాయ్ ఆపరేషన్ చేసిన అధికారులు సదరు డ్రైవర్‌ను పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. ∙ బాలికలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, ఆపై బెదిరింపులకు దిగుతున్న ముగ్గురిని పట్టుకున్న షీ–టీమ్స్ వారిపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయించాయి. ఛత్రినాక, జూబ్లీహిల్స్, మాదన్నపేటలకు చెందిన యువకులు బాలికల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నారు. ఆపై డబ్బు కోసమో, తనతో సన్నిహితంగా ఉండాలనో బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న షీ–టీమ్స్ నిందితులపై సంబంధిత ఠాణాల్లో పోక్సో కేసులు నమోదు చేయించాయి. మరోపక్క బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతుల్ని వేధిస్తున్న 49 మంది పోకిరీలను షీ–టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి.

కన్నీటి నిశ్చితార్థం
నిశ్చితార్థం చేసుకుని, త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి మార్చురీలో శాశ్వత విశ్రాంతి తీసుకుంటోంది. కుమార్తె పెళ్లి గురించి కోటి కలలు కన్న తల్లిదండ్రులదీ అదే దుస్థితి. నిశ్చితార్థం గోరింటాకు ఇంకా ఆరలేదు, అప్పుడే మృత్యువు పంజా విసిరింది. సాగరలో వేడుకను పూర్తి చేసుకుని బాగల్‌కోట జిల్లాలో తమ ఇంటికి వెళ్తుండగా, దారిలోనే ప్రయాణం ముగిసింది. కారు లారీని ఢీకొనడంతో కుటుంబం కడతేరిపోయింది.హుబ్లీ/ శివమొగ్గ(కర్ణాటక): వారంతా ఒకే కుటుంబ సభ్యులు. కూతురికి నిశ్చితార్థం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో విధి చిన్నచూపు చూసింది. లారీ– కారు ఢీకొన్న ఘటనలో కాబోయే పెళ్లికూతురు, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, బంధువుల అమ్మాయి దుర్మరణం చెందారు. మంగళవారం ఉదయం హుబ్లీ తాలూకా ఇంగళహళ్లి క్రాస్‌లో జాతీయ రహదారిలో ఈ ఘోరం జరిగింది. వివరాలు... ఈ ప్రమాదంలో విఠల శెట్టి (55), భార్య శశికళ (40), కుమార్తె శ్వేతా శెట్టి (29), కుమారుడు సందీప్ (26), అన్న కుమార్తె అయిన అంజలి (26) దుర్మరణం చెందారు. వీరి స్వస్థలం శివమొగ్గ జిల్లా సాగర వద్ద మూరుకై అనే గ్రామం. బాగల్‌కోటెలోని కులగేరి క్రాస్‌లో హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. సోమవారం శివమొగ్గ జిల్లా సాగరలో శ్వేతకు కుందాపుర యువకునితో నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో బంధుమిత్రులు పాల్గొన్నారు. త్వరలోనే పెళ్లి పెట్టుకుందామని తీర్మానించుకున్నారు. అలాగే సాగరలోనే కొత్తగా కట్టిన ఇంటిలో గృహ ప్రవేశం చేశారు. 8:30 సమయంలో.. రెండు వేడుకలను ముగించుకుని మంగళవారం తెల్లవారుజాము 4 గంటలప్పుడు సంతోషంగా సాగర నుంచి కారులో బయలు దేరారు. సుమారు 8:30 సమయంలో ఘటనాస్థలిలో కారు, అహ్మదాబాద్ నుంచి కొచ్చిన్‌కు వెళ్తున్న లోడ్ లారీ–వేగంగా ఢీకొన్నాయి. సందీప్ కారును నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ధాటికి కారులోని ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలి రక్తసిక్తమైంది. ప్రజలు హుబ్లీ గ్రామీణ పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. లారీలో చిక్కుకున్న కారు కారు లారీ లోపలికి దూసుకుపోవడంతో బయటకు తీయడం కష్టసాధ్యమైంది. కారు మొత్తం తుక్కయింది. కష్టమ్మీద మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పెద్దసంఖ్యలో బంధువులు చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనాస్థలిని ఎస్పీ బ్యాకోడ పరిశీలించారు. లారీ డ్రైవర్ మాట్లాడుతూ కారు అతివేగంగా వచ్చి తన లారీని ఢీకొట్టిందని చెప్పాడు.
వీడియోలు


9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం: ఆర్మీ


YSRCPలో చేరిన APNGO అసోసియేషన్ లీడర్స్


పహల్గాం దాడి అనంతరం ఉగ్ర పాకిస్థాన్ కు ప్రధాని మోదీ వార్నింగ్


Rajnath Singh: ప్రధాని మోదీ నేతృత్వంలో శత్రువులకు సరైన సమాధానం చెప్పాం


Operation Sindoor: భారత్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైన ఉగ్రశిబిర శిథిలాలు


యుద్ధానికి సిద్ధం.. విశాఖలో మాక్ డ్రిల్


ఉగ్ర గుట్టు విప్పారు ఎవరీ సోఫియా, వ్యోమికా?


YSRCP పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో YS జగన్ భేటీ


YS Jagan: ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య


హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్