దంత సంరక్షణపై అవగాహన
కడప అర్బన్: వరల్డ్ ఓరల్ హెల్త్ డే మార్చి 20 సందర్భంగా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రాం వారిచే నిర్వహించే వివిధ నోటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. నెల రోజులు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా వాకతాన్ చేశారు. పుచ్చిన పళ్ల సమస్యలు, దంతాల సంరక్షణతోపాటు గుట్కా, కై ని, పొగాకు, మందు మొదలగునవి అరికట్టే విధానం ప్రాథమిక దశలో రోగనిర్ధారణ చేయగలిగిన పరికరాలు, నోటి క్యాన్సర్‌పై ప్రజలలో అవగాహన కల్పించారు. నోటి ఆరోగ్యం, శరీర ఆరోగ్యం ఎలా సంరక్షించుకోవాలో ముందుగా దంత వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వాళ్లకు వివిధ పోటీలు నిర్వహించారు.
ఏప్రిల్ 9న వాకతాన్ మహావీర్ సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో యూజీ, పిజి దంత వైద్య విద్యార్థులు, స్టాఫ్ పాల్గొన్నారు. ఏప్రిల్ 17న గ్రూప్ టూత్ బ్రెషింగ్ పద్ధతి, నోటి ఆరోగ్యం అవగాహన ప్రజల్లో దంత సంరక్షణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు కడప ప్రభుత్వ దంతవైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎం.జ్యోత్స్న, వైస్ ప్రిన్సిపాల్ (అకడమిక్)డాక్టర్ పి.సురేష్ ప్రోత్సహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లీల తమవంతుగా కృషి చేశారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ జోత్స్న, డాక్టర్ శంకర్ వాకతాన్‌లో పాల్గొన్నారు.
మెడికల్ అండ్ హెల్త్ డీడీగా శేఖర్
కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్‌గా శేఖర్ నియమితులయ్యారు. ఈయన కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న భక్తవత్సలం పదోన్నతిపై ఏపీ రిక్రూట్‌మెంట్ బోర్డు జాయింట్ డైరెక్టర్‌గా వెళ్లారు. దీంతో ఈ స్థానంలోకి శేఖర్ వస్తున్నారు.


