డీఎస్సీకి ఉచిత కోచింగ్
కడప ఎడ్యుకేషన్: యూటీఎఫ్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు తెలిపారు. ఆదివారం కడప యూటీఎఫ్ భవన్‌లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. డీఎస్సీ బోధనలో ఉభయ రాష్ట్రాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంచే ఉచిత డీఎస్సీ కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ నిర్వహిస్తున్న ఉచిత డీఎస్సీ కోచింగ్ ఎంతో ఉపయోగకరమని.. అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డీఎస్సీ బోధనలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం కోవెల ప్రసాద్‌రెడ్డి (ఇంగ్లిష్), సిరివెల జయశంకర్ (తెలుగు), సుబ్బారెడ్డి (గణితం), శ్రీనివాసులు (బయలాజికల్ సైన్స్), సత్యానందరెడ్డి (ఫిజికల్ సైన్స్), మస్తాన్ (ట్రై మెథడ్స్) షేక్ షంషుద్దీన్ (సైకాలజీ) మహేష్ (జీకే – కరెంట్ అఫైర్స్) అనే ఉపాధ్యాయులు బోధిస్తారని వివరించారు. ఈనెల 24వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఫ్రీ డెమో తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తరగతులకు కడప జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 23వ తేదీలోపు కె.నరసింహరావు : 9440384701, గాజులపల్లి గోపీనాథ్ :9885125056 నంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.


