
ఫోన్ పోయిందా.. వచ్చి తీసుకెళ్లండి
కడప అర్బన్: కడప సైబర్ పోలీస్ వారు 6 నెలలుగా 602 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. ఇప్పటి వరకు 275 మంది బాధితులు మాత్రమే వారి ఫోన్లను ఆధారాలు చూపించి తీసుకెళ్లడం జరిగింది. ఇంకా సుమారు 327 మంది వారి మొబైల్స్ తీసుకు వెళ్లాల్సి ఉంది. మీ మొబైల్ ఫోన్ పోయినట్లుగా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసిన వారు.. మీ మొబైల్‌కు సంబంధించిన ఆధారాలతో కడప సైబర్ క్రైమ్ కార్యాలయాన్ని సంప్రదించి, మీ మొబైల్ ఫోన్‌ను తీసుకొని వెళ్లగలరు. మరిన్ని వివరాలకు 08562 245490 నంబర్‌కు ఫోన్ చేయాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.
నేడు స్వచ్ఛ దినోత్సవం
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ఈ నెల 3వ శనివారం ఈ–చెక్ అనే థీమ్‌తో స్వచ్ఛ దినోత్సవాన్ని నిర్వహించాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన అంశాలపై శుక్రవారం టెలీ కాన్ఫెరెన్సు ద్వారా అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శనివారం జరగనున్న కార్యక్రమాల గురించి శుక్రవారం రోజున టాంటాం, మైక్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అన్ని కార్యక్రమాలు ఏ ప్రదేశాలలో జరుగుతాయో ప్రజలకు తెలియజేసి, వారందరినీ భాగస్వాములుగా చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఈ–వేస్ట్ సేకరణ/కలెక్షన్ డ్రమ్/బాక్సు ఏర్పా టు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సంస్థలు, ప్రజలంతా పాల్గొని ఈ–వేస్ట్ బాధ్యతను గుర్తించాలని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. అలాగే పబ్లిక్ ప్లేస్‌లలో పోస్టర్లు ప్రదర్శించాలని, ఈ–వేస్ట్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని, ప్రతి గ్రామ పంచాయతీలో ర్యాలీలు, మానవహారాలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు.
ఉపాధ్యాయుల
వివరాలు తెలపాలి
కడప ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న డీఎస్సీ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని ఎంఈఓలు అందజేయాలని పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శామ్యూల్ సూచించారు. శుక్రవారం కడప డీఈఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంఈఓలకు జీవో నంబర్ 117పై వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నంబర్ 117లో భాగంగా 3,4,5 తరగతులను హైస్కూల్‌ను నుంచి వెనక్కు తెచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. అలాగే 60 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలను బేసిక్ మోడల్ ప్రైమరీ స్కూల్‌గా, 60 నుంచి 150 మందిలోపు ఉన్న పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా ఏర్పాటు చేయనుందన్నారు. దీంతోపాటు డీఎస్సీ నిర్వహణ కూడా ఉందన్నారు. డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఈ నెల 24 నుంచి 26 వరకు అనారోగ్య సమస్యలున్న ఉపాధ్యాయులకు మెడికల్ సర్టిఫికెట్ల కోసం రిమ్స్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రమణ్యం, ఏడీ మూనీర్‌ఖాన్ ఏఎస్‌ఓ బ్రహ్మనందరెడ్డి, ఏపీఓలు జాలాపతి నాగేంద్రరెడ్డి, ఎంఈఓలు పాల్గొన్నారు.