
● చెన్నంరెడ్డి శివగణేష్‌రెడ్డి @ 119
కడప మండలం ఆలంఖాన్‌పల్లెకు చెందిన చెన్నంరెడ్డి మల్లికార్జునరెడ్డి, ఇందిరా ప్రియదర్శిని కుమారుడు చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియాస్థాయిలో 119వ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రుల కలను నెరవేర్చడంతో పాటు ఊరి పేరును నిలబెట్టాడు. శివగణేష్‌రెడ్డి 1 నుంచి 10వ తరగతి వరకు కడప బాలవికాస్ హైస్కూల్లో చదివాడు. ఇంటర్మీడియట్‌ను నెల్లూరు నరసింహకొండ నారాయణ కళాశాలలో పూర్తి చేశాడు. తరు వాత బీటెక్ హైదరాబాదు ఐఐటీలో పూర్తి చేశారు. తరువాత సివిల్స్ కోచింగ్‌ను ఢిల్లీలో తీసుకున్నాడు.
● తొలిసారి సివిల్స్ రాసినప్పుడు ర్యాంకు రాలేదు. రెండవసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి రెండు మార్కులతో వెనుదిరిగాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా మూడవ సారి మరింత గట్టిగా ప్రయత్నించి 119వ ర్యాంకు సాధించాడు. చెన్నంరెడ్డి శివగణేష్‌రెడ్డి తండ్రి మల్లికార్జునరెడ్డి గతంలో కడప నగర శివార్లలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ ఉండేవారు. తరువాత ఉద్యోగాన్ని మానేసి వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించుకునేవాడు. శివగణేష్‌రెడ్డి చెల్లెలు శివజ్యోతిక బీటెక్ పూర్తి చేసి ఎంటెక్ చేసేందుకు ప్రిపేర్ అవుతోంది. శివగణేష్‌రెడ్డి సివిల్స్‌లో 119 ర్యాంకు సాధించడంపై తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
● కడప బాలవికాస్ హైస్కూల్ పూర్వపు విద్యార్థి అయిన చెన్నంరెడ్డి శివగణ్‌ష్‌రెడ్డి 119వ ర్యాంకు సాధించడంపై పాఠశాల డైరెక్టర్ గంగయ్య, కరస్పాండెంట్ సుబ్బరాయుడు ఆనందం వ్యక్తం చేశారు.

● చెన్నంరెడ్డి శివగణేష్‌రెడ్డి @ 119