
కళలకు నిలయం వైఎస్సార్ కడప జిల్లా
కడప కల్చరల్ : వైఎస్సార్ కడప జిల్లా కళలకు నిలయమని రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా అన్నారు. శ్రీ నవ్యకళానికేతన్ 50వ వార్షికోత్సవాన్ని ఆదివారం కడప నగరంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో నిర్వహించారు. దివంగత వైఎస్ సిలార్ కుమారుడు, సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు వైఎస్ సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచాన్ని తనదైన నాటకాలతో ముగ్దుల్ని చేసిన సురభి నాటక సంస్థతోపాటు బీఎన్ రెడ్డి లాంటి మహా దర్శకులు, మరెందరో సినీ నటులకు జిల్లా జన్మనిచ్చిందని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీనియర్ రంగస్థల కళాకారుడు, హోం గార్డు మాజీ కంపెనీ కమాండర్ వైఎస్ సిలార్, నవ్యకళానికేతన్‌ను స్థాపించి సంస్థ ద్వారా సంచలనాలు సృష్టించి ఎందరో కళాకారులను తయారు చేశారన్నారు. సినీ హాస్యనటుడు గౌతంరాజు ఈ సందర్భంగా ఉదయం నుంచి యువ ఔత్సాహిక కళాకారులకు ఆడిషన్స్ నిర్వహించారు. ప్రతిభ గల వారిని ఎంపిక చేసుకుని వారికి వెబ్ సీరిస్‌లో అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు షఫీ, పాకా సురేష్, సినీ యువ నటుడు కల్కి, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కళాకారులు పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా