
● మార్కుల జాబితా మాయ
మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. జీఎన్‌ఎం కోర్స్‌కు 1800, బీఎస్సీ నర్సింగ్‌కు 2,700 మార్కులు ఉంటాయి. ఉద్యోగ నియామకాల్లో ఈ మార్కులతోపాటు సర్వీస్, అకడమిక్ వెయిటేజ్ మార్కులు ఉంటాయి. అలాగే కోవిడ్ కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేపట్టిన విధుల కాలాన్ని బట్టి మార్కులు ఉంటాయి. ఈ మార్కుల మెరిట్‌తోపాటు ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇక్కడ మార్కులకు ప్రాధాన్యత ఉంటుంది. దీంతో అభ్యర్థులు నకిలీ మార్కుల జాబితాను సమర్పించినట్లుగా సమాచారం. బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతకు సంబంధించి మొత్తం 20 మంది బోగస్ సర్టిఫికెట్స్‌ను సమర్పించగా.. అందులో నలుగురు కరోనా డ్యూటీలకు సంబంధించి బోగస్ సర్టిఫికెట్స్ పొందుపరిచినట్లుగా సమాచారం. ఇలా మార్కుల జాబితా ఒక మాయలా మారింది. దీని ఫలితంగానే షెడ్యూల్ ప్రకారం ఎప్పుడో జరగాల్సిన నియామకాల కౌన్సెలింగ్ వాయిదా పడుతూ వచ్చింది.