
సమస్యల పరిష్కారానికి స్పందించాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన స్పందించి నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను నాణ్యతతో పరిష్కార నివేదికలు పంపాలన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు శ్రీనివాసులు, వెంకటపతి, జెడ్పి సీఈవో ఓబులమ్మ, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి