
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో హజ్ కమిటీ ద్వారా గురువారం స్థానిక రాధాకృష్ణనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ 125 మందికిగాను 115 మందికి వ్యాఽధి నిరోధక టీకాలు వేశామన్నారు. ఇంకా ఈ టీకాలు వేయించుకోని హజ్ యాత్రికులకు తిరిగి ఈనెల 28న టీకాలు వేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీఐఓ ఉమామహేశ్వరకుమార్, డీఎల్ ఏటీఓ డాక్టర్ రవిబాబు, యూపీహెచ్‌సీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉబేదుల్లా, డాక్టర్ సుమధుర, సూపర్‌వైజర్ మహబూబ్‌బాష పాల్గొన్నారు.