
సామాజిక రుగ్మతలను నిర్మూలిద్దాం
కడప సెవెన్‌రోడ్స్: దళితులకు ఎక్కడా అన్యాయం జరగకూడదని, జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా పారదర్శకంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలాని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్‌తోపాటు ఎస్పీ అశోక్ కుమార్, ఇన్‌చార్జి డీఆర్వో వెంకటపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు న్యాయంతో పాటు త్వరితగతిన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై తదుపరి సమావేశం నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే పోక్సో చట్టం, బాల్య వివాహాలు నిరోధక చట్టం పైన ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కడప, జమ్మలమడుగు, బద్వేలు డివిజన్ల ఆర్.డి.ఓ లు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, సంబందిత డివిజన్ల డీఎస్పీలు పాల్గొన్నారు.
అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ‘ఉల్లాస్’ ఉద్దేశ్యం
సమాజంలో ప్రతి ఒక్కరినీ నిరక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ‘ఉల్లాస్‘కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో రెండవ విడత ‘ఉల్లాస్‘కార్యక్రమం నిర్వహణపై.. జిల్లా స్థాయి కమిటీ కన్వర్జేన్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2025–26లో జిల్లాలో మొత్తం 33,132 మందికి అక్షరాస్యత లక్ష్యం నిర్దేశించడం జరగగా, అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
పశు పోషణతో రైతులకు ఆర్థిక బలం
గ్రామీణ స్థాయిలో పశు పోషణ ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని పీజీఆర్‌ఎస్ హాలులో జేడీ డాక్టర్ శారదమ్మ అధ్యక్షతన పశుసంవర్ధక శాఖ జిల్లాస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ఆ శాఖలో విభాగాల వారీగా సంబంధిత అధికారులతో సమీక్షించారు.
జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ
సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి