
దళితులు, క్రిష్టియన్ మైనార్టీలపై జరిగే దాడులను ఎదుర్కో
కడప కార్పొరేషన్ : దళితులు, క్రిష్టియన్ మైనార్టీలపై జరిగే దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ దళిత నాయకులు, కిష్ట్రియన్ మైనార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, క్రిష్టియన్లు, మైనార్టీలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్‌ను హత్య చేశారని, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేశారన్నారు. ఇలాంటి అన్యాయాలు, అక్రమాలను వైఎస్సార్‌సీపీ దళిత నాయకులు ఎత్తిచూపాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బూసిపాటి కిశోర్, పులి సునీల్, సీహెచ్ వినోద్, త్యాగరాజు, సుబ్బరాయుడు, పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్‌రెడ్డి