
ఆపుకోలేని ఆవేదనకు బ్రేక్ !
● లోకోపైలట్లను కరుణించిన రైల్వేశాఖ
● రైలింజన్‌లోనే యూరినల్స్,
ఏసీ, ఎర్గోనామిక్ సీట్లు
● తొలుత గూడ్స్ రైళ్లలో
ఏర్పాటుదిశగా చర్యలు
డివిజన్ : గుంతకల్
లోకోపైలెట్స్ : 2500
రన్నింగ్‌స్టాప్ క్రూసెంటర్ : తిరుపతి, రేణిగుంట,
నందలూరు, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్లు,
రాజంపేట : ఆపుకోలేని ఆవేదనకు రైల్వేశాఖ బ్రేక్ వేసింది..ఇదేంటబ్బా అనుకోవచ్చు..విధి నిర్వహణలో రైలింజన్ నడిపే లోకోపైలెట్స్, అసిస్టెంట్ లోకోపైలట్స్ యూరినల్స్ తదితర సమస్యలు ఉత్పన్నమైతే ఇబ్బందులు పడాల్సి వచ్చేది. లోకోపైలట్స్ ఒక్కోసారి నీళ్లు తాగటానికి ఒకటికి నాలుగుసార్లు ఆలోచించే పరిస్థితి..మూత్ర విసర్జనకు వెళ్లాంటే రైలు ఆగే స్టేషన్ రాకకోసం ఎదురుచూడాల్సిందే. అందుకు ఒక్కోసారి ఐదారు గంటలు కూడా పట్టొచ్చు.. మహిళాలోకోపైలట్లు చాలా అవస్థలు పడేవారు.ఈ సమస్యను పరిష్కరించాలని ఇంతకాలానికి రైల్వేశాఖ ముందడుగు వేసింది. రైలింజన్ క్యాబిన్‌లో యూరినల్స్, ఏసీవసతి, ఆధునిక ఎర్గోనామిక్ సీట్ల ఏర్పాట్లను తప్పనిసరి చేసింది. దీంతో ఎల్‌పీ,ఎల్‌పీలకు పెద్ద ఉపశమనం లభించనుంది.రైల్వేశాఖ నిర్ణయంపై హర్హాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
● కొత్తగా తయారుచేసే అన్ని లోకో క్యాబిన్లలో యూరినల్స్, ఏసీ, ఎర్గోనామిక్‌సీట్లు ఏర్పాటు కోసం వాటి డిజైన్లను రైల్వేశాఖ మార్చింది. ఇప్పటికే వినియోగిస్తున్న లోకోమోటివ్‌లలో వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గుత్తి, విజయవాడ, లాలాగూడా, మౌలాలి, లోకోషెడ్లను ఈ పనులు ప్రారంభించారు. తొలుత గూడ్స్‌రైళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 42 లోకోమోటివ్‌లలో ఏర్పాటుచేశారు. ఇంజిన్‌ను పరిశీలించేందుకు వీలుగా అన్ని కారిడార్ చిన్న క్యాబిన్ ఏర్పాటుచేసి ,అందులో యూరినల్స్ కమోడ్ ఏర్పాటుచేస్తున్నారు. లోకోమోటివ్‌లో నీటి వసతి ఉండదు. కాబట్టి టాయిలెట్ కాకుండా యూరినల్స్ వసతి మాత్రమే ఏర్పాటుచేస్తున్నారు.
క్లీనింగ్ ప్రశ్నార్థకరం..
సాధారణ కోచ్ నాలుగురోజులకొకసారి స్పెషల్ క్లీనింగ్‌కు షెడ్డుకు వెళుతుంది. అప్పుడు అందులోని మానవ వ్యర్థాలను తొలగిస్తారు. కానీ లోకోమోటివ్ 90రోజులకొకసారి మాత్రమే షెడ్డుకు వెళుతుంది. అప్పటి వరకు వ్యర్థాలను నిల్వ ఉంచలేరు. లోకోమోటివ్ కంపు కొడుతుందని ఎల్‌పీలు అంటున్నారు. దీంతో క్లీనింగ్ ప్రశ్నార్థకరంగా మారింది.
ఎర్గోనాటిక్ సీట్లు...
గతంలో 90 డిగ్రీల కోణంలో సీట్లు ఉండేవి. ఇవి ఏమాత్రం అనుకూలంగా ఉండేవి కాదు. వీటిల్లో ఎ క్కువ గంటలు కూర్చొని పనిచేస్తే నడుము, వెన్నముక నొప్పులొస్తున్నాయనే ఆరోపణలున్నాయి. రైల్వేశాఖకు ఫిర్యాదులు వెళుతున్నాయి. మహిళా సిబ్బంది మరింత ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పుడు వీటి స్థానంలో ఎర్గోనామిక్ సీట్లను ఏర్పాటుచేస్తున్నారు.

ఆపుకోలేని ఆవేదనకు బ్రేక్ !