
పీహెచ్‌ఎన్ పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతం
కడప రూరల్: వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో మంగళవారం నిర్వహించిన పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 22 మంది ఎంపీహెచ్‌ఎస్ (ఎఫ్)లకు పీహెచ్‌ఎన్ (ఎన్‌టీ)లుగా పదో న్నతి కల్పించారు. ఈ కౌన్సెలింగ్‌కు 22 మందికి గాను 18 మంది ప్రమోషన్‌లు పొందారు. నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించినట్లు ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ భక్తవత్సలం, సూపరింటెండెంట్ వెంకటసుబ్బమ్మ, సీనియర్ అసిస్టెంట్స్ వనీష, బత్తనయ్య పాల్గొన్నారు.
ఆర్‌పీఐ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శిగా ఫణీంద్ర కుమార్
కడప కార్పొరేషన్: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జవ్వాజి ఫణీంద్ర కుమార్ నియమితులయ్యారు. కేంద్రమంత్రి రాందాస్ అతవాలే, ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఎం. వెంకట స్వామి ఆదేశాల మేరకు మంగళవారం విజయ వాడలోని ఆ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మా రెడ్డి బ్రహ్మానంద రెడ్డి చేతుల మీదుగా ఫణీంద్ర కుమార్ నియామక పత్రాన్ని అందుకున్నారు.

పీహెచ్‌ఎన్ పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతం