బోగస్‌ పట్టా అని తేలితే జైలుకు వెళ్లేందుకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

బోగస్‌ పట్టా అని తేలితే జైలుకు వెళ్లేందుకు సిద్ధం

Published Sun, Apr 20 2025 12:19 AM | Last Updated on Sun, Apr 20 2025 12:19 AM

బోగస్‌ పట్టా అని తేలితే జైలుకు వెళ్లేందుకు సిద్ధం

బోగస్‌ పట్టా అని తేలితే జైలుకు వెళ్లేందుకు సిద్ధం

కడప రూరల్‌ : కడప భగత్‌సింగ్‌నగర్‌ సర్వే నంబరు 344లో తన భార్య పేరిట ఉన్న 2.50 సెంట్ల స్థలం నకిలీ పట్టా అని తేలితే తాను జైలుకు వెళ్లేందుకై నా సిద్ధమేనని సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి బి.నారాయణరెడ్డి అన్నారు. శనివారం కడప ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ స్థలం తన భార్య పేరిట ఎలా వచ్చిందో విచారించి చర్యలు తీసుకోవాలంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. భగత్‌సింగ్‌ నగర్‌ భూపోరాటం జరిగిన 1996, 1998 సంవత్సరాలలో వీరెవరూ ఆ పార్టీలో లేరని తెలిపారు. భగత్‌సింగ్‌ నగర్‌ స్థలం తన భార్య పేరిట పట్టా ఉందంటూ 2016 డిసెంబరు 31న కడప తాలూకా పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేసిన సీపీఎం నాయకులకు ఇప్పుడది నకిలీ పట్టాగా ఎలా కనబడుతోందో వివరించాలన్నారు. డీకేటీ పట్టాపై తహసీల్దార్‌ వద్ద విచారణ జరుగుతోందన్నారు. సంబంధం లేని స్థలంలో కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పాతిన బోర్డును తక్షణమే తొలగించాలన్నారు. లేకపోతే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం ద్వారా ఆయనపై చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. 2014 తర్వాత సీపీఎం రాష్ట్ర నాయకత్వం అవలంబిస్తున్న విధానాలతో తాను విబేధించి బయటకు వచ్చానని స్పష్టం చేశారు.

బోర్డు తొలగించకుంటే మున్సిపల్‌ కమిషనర్‌పై చర్యలు

సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి

బి.నారాయణరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement