
జూనియర్ కళాశాలల అభివృద్ధికి కృషి
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని ప్రభుత్వ కళాశాలల్లో విద్యతోపాటు కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తామని ఇంటర్ ఎఫ్‌ఏసీ ఆర్‌జేడీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఎప్‌ఏపీ ఆర్‌జేడీగా శ్రీనివాసులు గురువారం కడప ఇంటర్ ఆర్‌జేడీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు డీఐఈఓగా నియమితులైన శ్రీనివాసులను ఎఫ్‌ఏసీ ఆర్‌జేడీగా ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ఆయన గురువారం ఇంటర్ ఆర్‌జేడీగా బాధ్యతలు చేపట్టారు. నూతన ఆర్‌జేడీ, డీఐఈఓలను ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంఘ నేతలు ఘనంగా సన్మానించారు.