
కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి
కడప సెవెన్‌రోడ్స్ : అధికారం అండగా చూసుకుని జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సాయిదత్త, ప్రధాన కార్యదర్శి శ్యాం సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. అధిక ఫీజు వసూళ్ల వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ర్యాంకుల పేరుతో చేస్తున్న వేధింపులు తట్టుకోలేకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు దావుద్, రుద్రసేనారెడ్డి, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు