
మొరాయించిన జలాశయం గేటు
జమ్మలమడుగు రూరల్: మైలవరం జలాశయం నుంచి ప్రొద్దుటూరు మీదుగా వెళ్లే దక్షిణ కాలువ కొన్ని నెలల నుంచి ప్రవహిస్తోంది. 5 నెలల క్రితం కాలువ వెంట పరిమితికి మించి నీళ్లు వస్తుండటంతో ఇవి కాస్త పొలాల్లోకి వెళ్లి అడ్డంగా పారుతున్నాయి. దీంతో తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయంటూ నర్సోజీకొట్టాల, పొన్నతోట రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. అసలు విషయానికి వస్తే దక్షిణ కాలువకు అడ్డంగా ఉండాల్సిన జలాశయం గేటు కిందికి దిగడం లేదు. గతంలో దక్షిణా కాలువ ద్వార ప్రొద్దుటూరు ప్రాంతానికి నీటి అవసరాల కోసం అధికారులు గేటును కాస్త పైకి ఎత్తి వదిలేశారు. ఆ తరువాత పట్టించుకోక పోవడంతో గేటు కింది భాగం రబ్బరు సీల్స్ దెబ్బతినడంతో పూర్తిగా స్ట్రక్ అయింది. వారం క్రితం గేటు దించడానికి సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా దిగనంటూ మొరాయించడంతో సిబ్బంది చేసేదిలేక వెనుదిరిగారు.
మైలవరం దక్షిణ కాల్వలో ఇరుక్కుపోయిన గేటు
కిందికి దించడానికి సిబ్బంది ప్రయత్నాలు విఫలం
నీరు తగ్గితే పనులు చేస్తాం
ప్రస్తుతం మైలవరం జలాశయంలో నీరు ఉండటంతో దక్షిణ కాలువ గేటు మరమ్మతులు చేయలేకపోతున్నాం. గేటు కింది భాగాన రబ్బర్ సీల్స్ దెబ్బతిని ఉన్నాయి. జూన్, జులై మాసంలో జలాశయంలో నీరు తగ్గిన వెంటనే మరమ్మతులు నిర్వహిస్తాం. దక్షిణ కాలువ ద్వారా ప్రతి రోజూ 20 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం 2.9 టీఎంసీల నీరు ఉన్నాయి.
– నరసింహమూర్తి, డీఈ, మైలవరం జలాశయం

మొరాయించిన జలాశయం గేటు