
డీఎస్సీ శిక్షణ వైపు పరుగులు
కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ అభ్యర్థుల ఎదురుచూపులు ఫలించాయి. ఆశలు మళ్లీ చిగురించాయి. ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదల అయింది. ఇప్పటికే చాలా మంది డీఎస్సీ అభ్యర్థులు వేలకు వేలు ఖర్చు పెట్టుకుని నెలల తరబడి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఇక కోచింగ్ సెంటర్లకు పరుగులు తీయనున్నారు. దీంతోపాటు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ను ఇచ్చేందుకు సిద్ధమవుతుండడం విశేషం.
జిల్లాలో 705 పోస్టులు.. ఉమ్మడి వైఎస్సార్‌జిల్లాలో 705 ఉపాధ్యాయ పోస్టులు ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల ప్రజా పరిషత్తు, మున్సిపాలిటి పరిధిలో భర్తీకానున్నాయి. ఇందులో 407 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులుకాగా 298 సెకండ్ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులు భర్తీకానున్నాయి. ఇందులో 219 తెలుగు మీడియం ఎస్‌జీటీ, 31 ఉర్దూ ఎస్‌జీటీ, 21 ఎస్‌జీటీ మున్సిపాలిటి, 07 ఉర్దూ ఎస్‌జీటీ, 12 కార్పొరేషన్ ఎస్‌జీటీ, ఎస్‌జీటీ ఉర్దూ 8 పోస్టులు భర్తీకానున్నట్లు తెలిసింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ఉర్దూ 06, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ 79, స్కూల్ అసిస్టెంట్ హిందీ 16, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 26, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 42, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు 28, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ ఫిజికల్ సైన్సు 02, స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ తెలుగు మీడియం 49, బయలాజికల్ సైన్సు ఉర్దూ మీడియం 02, తెలుగు మీడియం సోషియల్ 58, ఉర్దూ 05, ఫిజికల్ సైన్సు ఉర్దూ 07 పోస్టులు భర్తీకానున్నాయి.
20 నుంచి...మే 15 వరకు..
ఈ నెల 20 నుంచే మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మే 15వ తేదీ వరకు ఉంటుంది. జూన్ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ (కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతోపాటు డీఎస్సీ పరీక్షకు సంబంధించిన పూర్తి సమా చారం, జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్, నోటికేషన్ కోసం వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు htpp:// cse.ap. go.inతోపాటు htpp://apdsc.apcfss.inలో అందు బాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.
పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు
కోచింగ్‌్ సెంటర్లలో మొదలైన హడావుడి
ఉచిత కోచింగ్‌కు సన్నాహాలు చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు
జిల్లాలో 705 పోస్టుల భర్తీకి అవకాశం

డీఎస్సీ శిక్షణ వైపు పరుగులు