న్యాయవాది ఇంట్లో చోరీ
కడప అర్బన్ : కడప నగరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓంశాంతినగర్ రోడ్ నంబర్ 20లో నివాసం ఉంటున్న నీలిమ అనే న్యాయవాది ఇంటిలో దొంగలు బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లారు. న్యాయవాది గతనెల 21న తన పుట్టింటికి వెళ్లారు. ఈనెల 22వ తేదీన రాత్రి తమ ఇంటికి రాగానే వాకిలి తెరిచి ఉండటం, బీరువాలను పగులగొట్టి బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లారు. సంఘటన స్థలాన్ని మంగళవారం రాత్రి చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. పోలీసులు తమ విచారణలో 9 తులాల బంగారు ఆభరణాలు దోచుకుని వెళ్లినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా న్యాయవాది నీలిమ తమ ఇంటిలో సుమారు 1000 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.


