
ధనార్జనే ధ్యేయంగా బాబాయ్, అబ్బాయిల లూటీ
ఎర్రగుంట్ల(జమ్మలమడుగు) : నియోజకవర్గంలో ధనార్జనే లక్ష్యంగా పరిశ్రమలను లూఠీ చేయడానికి బాబాయ్, అబ్యాయిలు అరాటాపడుతున్నాని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ లూటీకి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెరలేపారని, స్థానికులను మరచి.. స్థానికేతరుడు మదుసూదన్‌రెడ్డికి పనులు అప్పగిస్తున్నారన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి ఆర్టీపీపీలో ఫ్లయాష్ కోసం టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డితో ఘర్షణ పడింది ప్రజలందరికీ తెలుసన్నారు. గెలుపు కోసం ప్రత్యేక విమానంలో వచ్చి ఆదినారాయణరెడ్డికి ఓటువేసిన రమేష్‌నాయుడుతోనూ సోలార్ ప్లాంట్ కాంట్రాక్టు కోసం గొడవపడిన నీచ చరిత్ర ఎమ్మెల్యేదేనని విమర్శించారు. నియోజకవర్గంలో తప్పు మీద తప్పులు చేస్తున్న ఎమ్మెల్యే ఇపుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డిలపై నిందలు వేస్తున్నారన్నారు. కార్యకర్తలను వదిలేసి తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చేందుకే ఎమ్మెల్యే పనిచేస్తున్నావన్నారు. సిమెంట్ పరిశ్రమలకు వెళ్లే ముడిసరుకు రవాణా వాహనాలు సీజ్ చేయిచడం దారుణం అన్నారు. ఎమ్మెల్యే ధనార్జనకు సిమెంట్ పరిశ్రమలు మూతపడిపోయి పరిస్థితి వస్తోందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాలయ్య, మేకల భాస్కర్, జయరామకృష్ణారెడ్డి, దాసరి నారాయణరెడ్డి, రషీద్, మహమ్మద్ ఆలీ, వెంకటశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలోనే అభివృద్ధి
మాజీ ఎమ్మెల్యే మూలే సుధీర్‌రెడ్డి