
విద్యార్థిని చితకబాదిన స్కూలు యాజమాన్యంపై చర్యలకు డిమాం
కడప సెవెన్‌రోడ్స్ : ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామ పంచాయతీలోని పూజా ఇంటర్నేషనల్ స్కూలులో 9వ తరగతి చదువుతున్న మూల సాత్విక్‌రెడ్డిని చితకబాదిన పాఠశాల డీన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లి లెక్కల కొండమ్మ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర కో చైర్మన్ లెక్కల జమాల్‌రెడ్డి సోమవారం డీఆర్వో విశ్వేశ్వరనాయుడును కోరారు. విద్యార్థి పేరిట నకిలీ ఇన్‌స్ట్రాగామ్ సృష్టించి అమ్మాయిలను వేధించాడని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారని ఆరోపించారు. టీసీ కూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. జరిగిన విషయాలను డీఈఓ, పోలీసులు, కలెక్టర్‌కు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. తమకు సంబంధం లేదంటూ ప్రొద్దుటూరు డీఎస్పీ మాట్లా డటం విచారకరమన్నా రు. ఇప్పటికై నా టీసీ ఇప్పించాలని కోరారు.