
ప్రత్యేక బస్సు సర్వీసులు
కడప కోటిరెడ్డిసర్కిల్: విద్యా సంస్థలకు వేసవి సెలవుల నేపథ్యంలో పలు విహార ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం మీడియాకు వివ రాలు వెల్లడించారు. కడప డిపో నుంచి గోవా, ఊటీ, వేలాంగిణి, అరుణాచలానికి బస్సులు నడుస్తాయన్నారు.
● మే 9న కడప నుంచి గోవాకు ఇంద్ర (50301) సర్వీసు బయలుదేరుతుందని, ఇందులో రూ.4200 చార్జిగా నిర్ణయించామన్నారు. అదే రోజు బెంగళూరు, మైసూరు మీదుగా ఊటీకి సూపర్ లగ్జరీ సర్వీసు రాత్రి 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఇందులో చార్జిగా రూ.2400గా ఉంటుందన్నారు. మే 9వ తేదీనే వేలాంగిణికి వయా నాగపట్నం మీదుగా ఇంద్ర (950066) బస్సు సర్వీసు బయలుదేరి వెళుతుందన్నారు. ఇందులో చార్జిగా రూ.3200 ఉందన్నారు.
● పౌర్ణమి సందర్భంగా మే 11న కడప డిపో నుంచి అరుణాచలానికి రెండు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. రాత్రి 9 గంటలకు సూపర్ లగ్జరీ (6001) బయలుదేరి వెళుతుందన్నారు. ఇందులో రూ.1050 చార్జిగా ఉందన్నారు. ఈ బస్సు చిత్తూరు, వేలూరు మీదుగా వెళ్తుందన్నారు. అదే రోజు ఉదయం 6 గంటలకు అరుణాచలానికి మరో బస్సు వెళుతుందన్నారు. ఈ సూపర్ లగ్జరీ సర్వీసు (913337)లో చార్జిగా రూ. 1350 నిర్ణయించామన్నారు. ఈ బస్సు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం మీదుగా అరుణాచలం వెళ్తుందన్నారు. ఈ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, ఆన్‌లైన్ లేదా ఆర్టీసీ బస్టాండులోని రిజర్వేషన్ కౌంటర్‌లో తమ టిక్కెట్లను ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలన్నారు.