
బీసీ కుల గణనపై ప్రకటన చేయాలి
కడప రూరల్: కడపలో జరిగే మహానాడులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ కుల గణనపై స్పష్టమైన ప్రకటన చేయాలని.. అలాగే 52 శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు డీఎం ఓబులేశు యాదవ్ అధ్యక్షతన శనివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బీసీ మహాసభ జాతీయ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఏ సత్తార్ మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీ కులాలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉండడం దారుణమన్నారు. బీసీలను కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని తెలిపారు. బీసీ ఓట్లను మాత్రం పొందు తూ సీట్ల కేటాయింపులో మాత్రం బీసీలకు దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే కుల జన గణన చేపట్టాలని, బీసీ కులాలకు 52 శాతం రిజర్వేషన్లు, జనా భా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నా రు. ఓబులేశు యాదవ్ మాట్లాడుతూ కడపలో జరిగే మహానాడులో రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ కుల గణనపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గురుమూర్తి, లోక్‌సత్తా పార్టీ నాయకులు దేవర శ్రీకృష్ణ మాట్లాడారు. జాతీయ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రమణ, మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సంగటి మనోహర్, దళితమిత్ర రాష్ట్ర అధ్యక్షులు కై పు రామాంజనేయులు, సీఆర్‌వీ ప్రసాద్, తిరుమలేశ్, పట్టుపోగుల పవన్‌కుమార్, సీఆర్‌ఐ సునీల్ పాల్గొన్నారు.