
అభ్యంతరాలను 24 లోపు సమర్పించాలి
– పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శ్యాముల్
కడప ఎడ్యుకేషన్ : రాయలసీమ పరిధిలోని అనంపురం, చిత్తూరు, కడప, కర్నూల్ పూర్వపు జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్(గవర్నమెంట్) నుంచి (గ్రేడ్ –2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు సవరించడానికి తాత్కాలిక జాబితాను htppr://rjdrekadapa.bofrpot.comలో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శ్యాముల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో తగిన ఆధారాలతో ఈ నెల 24వ తేదీలోల సమర్పించాలని సూచించారు.
బాధితులకు
సత్వర న్యాయం చేయాలి
– ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’లో
ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలని జిల్లా ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్‌న్స్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యను విన్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి, వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులకు సిబ్బంది తమ వంతుగా సహాయం చేసి ప్రశాంతంగా తమ సమస్యను వివరించడానికి కృషి చేశారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, డి.టి.సి డి.ఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 178 ఫిర్యాదులు వచ్చాయి.
పరీక్ష ఫీజు చెల్లింపునకు నేడు ఆఖరు
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా మే 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు సంంధించిన పరీక్ష రుసుము చెల్లించుటకు మంగళవారంతో గడువు ముగుస్తుందని ఆర్‌ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన, ఇంప్రూమెంట్ రాయు విద్యార్థులు వెంటనే పరీక్ష రుసుము సంబంధించిన కళాశాలలో చెల్లించాలని తెలిపారు. ఏదైనా ప్రైవేట్ జూనియర్ కళాశాల యజమాన్యం విద్యార్థుల ఫీజు బకాయి సాకు చూపుతూ కట్టించుకోకుంటే ఆయా కళాశాలలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పదోన్నతి కౌన్సెలింగ్ ప్రశాంతం
కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సోమవారం స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్సులుగా చేపట్టిన పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 15 మందికి గాను 9 మంది పదోన్నతులు పొందారు. నిబంధనల ప్రకారం ప్రమోషన్ల కౌన్సెలింగ్ ను చేపట్టినట్టు ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ డీఐఈఓగా సత్యనారాయణరెడ్డి
కడప ఎడ్యుకేషన్ : డిస్ట్రిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డీఐఈఓ)గా సత్యనారాయణరెడ్డిని నియమిస్తూ విద్యాశాఖ సెక్రటరీ కొన శశిదర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్‌టీఆర్ జిల్లా పయాకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఈయన్ను వైఎస్సార్‌జిల్లా డీఐఈఓగా నియమించారు. గతంలో డీవీఈఓగా పనిచేస్తున్న శ్రీనివాసులరెడ్డి ఉద్యోగ విరమణ చేయడంతో కడప ఆర్‌ఐవోగా పనిచేస్తున్న బండి వెంకటసుబ్బయ్య డీవీఈఓగా ఉన్నారు.
ఇంటర్ ఆర్‌జేడీగా శ్రీనివాసులు...
ఇంటర్మీడియట్ ఎప్‌ఏపీ ఆర్‌జేడీగా శ్రీనివాసులును ప్రభుత్వం నియమించింది. ఈయన ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా డీకే గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. చిత్తూరు డీఐఈఓగా నియమించిన శ్రీనివాసులను ఎఫ్‌ఏసీ ఆర్‌జేడీగా కడపకు నియమించారు. ప్రస్తుతం కడప ఆర్‌జేడీగా పనిచేస్తున్న రవిని రాయచోటి డీఐఈఓగా నియమించారు.

అభ్యంతరాలను 24 లోపు సమర్పించాలి