
గుర్తు తెలియని వ్యక్తి మృతి
పులివెందుల రూరల్ : పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఇతను గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిసి ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.
బాల్య వివాహన్ని అడ్డుకున్న ఎస్‌ఐ
పెండ్లిమర్రి : మండలంలోని కొత్తగంగిరెడ్డిపల్లె గ్రామంలో బాల్య వివాహం చేస్తున్నారని అందిన సమాచారం మేరకు సోమవారం ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి బాల్య వివాహన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 ఏళ్ల బాలికకు 26 ఏళ్ల యువకుడితో మరో రెండు రోజుల్లో వివాహం చేయాలని నిర్ణయించారు. ఎస్‌ఐ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువురిని పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇరువురి పెద్దలపై బైండోవర్ కేసు నమోదు చేశారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
వీరపునాయునిపల్లె : అప్పుల బాధ తాళలేక వెల్దుర్తి గ్రామానికి చెందిన మాతిగాళ్ల రఘు(42) అనే రైతు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా.. రైతు సోమవారం ఉదయం పొలం దగ్గరికి వెళ్లి అక్కడే ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకున్నాడు. చుట్టు పక్కల ఉన్న పొలాల రైతులు గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి 1.5 ఎకరం పొలం ఉందని పొలంలో పంటలు సరిగ్గా రాక పోవడం ఒక కారణం కాగా, ముగ్గురు కుమార్తెల పెళ్లిల్లు ఎలా చేయాలన్నదే ఆత్మహత్యకు ప్రధాన కారణమని బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆడుతున్న వ్యక్తి అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : ఆన్‌లైన్‌లో క్యాసినో అనే బెట్టింగ్ గేమ్‌ను ఆడుతున్న వ్యక్తిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని తాళ్లమాపురం గ్రామానికి చెందిన మాచిరెడ్డి చైతన్య రెడ్డి ఆన్‌లైన్‌లో క్యాసినో అనే బెట్టింగ్ గేమ్ ఆడుతుండగా సోమవారం రూరల్ ఎస్‌ఐ వెంకట సురేష్ అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.20,800 నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి