
వైవీయూ డిగ్రీ పరీక్షలు షురూ
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ,బీకాం, బ్యాచిరల్ ఆఫ్ వొకేషనల్ 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు 80 కళాశాల నుంచి 55 కేంద్రాల్లో 25,892 మంది విద్యార్థులు రాస్తున్నారు. కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల, స్పిరిట్స్ డిగ్రీ కళాశాల కేంద్రాలను విశ్యవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాస రావు , వైవీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తనిఖీ చేశారు. విద్యార్థులకు ఏ అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వి కృష్ణారావు మాట్లాడుతూ పరీక్షలు మే 24వ తేదీ వరకు ఉంటాయన్నారు. ఉపకులపతి ఆదేశాల మేరకు పరీక్షలలో ప్రతి కేంద్రానికి అబ్జర్వర్లను నియమించామని, అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాయన్నారు.