
ఓపెన్ ఫలితాల్లో ప్రతిభ
కడప ఎడ్యుకేషన్: ఓపెన్ పది, ఇంటర్ ఫలితాల్లో అభ్యాసకులు ప్రతిభ చాటారు. జిల్లా వ్యాప్తంగా 2135 మంది అభ్యాసకులు పరీక్ష రాయగా ఇందులో 1550 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఇంటర్మీడియట్‌కు సంబంధించి 6248 మందికిగాను 4984 మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు వెల్లడించారు.
పులివెందుల వాసికి
గిన్నిస్ బుక్‌లో చోటు
పులివెందుల రూరల్: పులివెందుల పట్టణంలోని రాజీవ్ కాలనీలో నివాసముంటున్న దిద్దెకుంట రాజేష్ కుమార్ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. విజయవాడలోని హలెల్ మ్యుజిక్ స్కూల్ ఆన్‌లైన్ క్లాస్ ద్వారా సంగీతం నేర్చుకున్నారు. కాగా, 2024 డిసెంబర్ 1న 18 దేశాలలోని 1046 మంది స్వరాలు ఆలపించినవారిలో ఈయన ఒకడు. రాజేష్‌కుమార్ ఈ రికార్డును సొంతం చేసుకున్నందుకు పులివెందుల పాస్టర్ అసోసియేషన్ సభ్యులు, ఎరబ్రల్లి కొత్త పల్లి ఇమ్మనుయేలు, చర్చి పాస్టర్ సిమోను, వైవీయూ లలిత కళల విభాగం అకడమిక్ ఇన్‌ఛార్జి శేఖర్‌రెడ్డి, సుబ్బరాయుడు హర్షం వ్యక్తం చేశారు.
ప్రారంభమైనహేలాంబ తిరునాల
కమలాపురం : మండలంలోని పెద్దచెప్పలిలో వెలసిన శ్రీ ఎల్లమ్మ(హేలాంబ) తిరునాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. బుధవారం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తోట రవీంద్ర ఆధ్వర్యంలో, ధర్మకర్తల మండలి సభ్యుల పర్యవేక్షణలో తిరునాల మహోత్సవా లు ప్రారంభం అయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో బాజా భజంత్రీల నడుమ, భక్తుల సమక్షంలో ఎల్లమ్మను ప్రతిష్టించారు. సమీప ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచి పెట్టా రు. ప్రముఖ రంగ స్థల నటుడు, నంది అవార్డు గ్రహీత సుబ్బరాయుడు తన బృందంతో కల సి చెప్పిన ఎల్లమ్మ కథ భక్తులను ఆకట్టుకుంది.

ఓపెన్ ఫలితాల్లో ప్రతిభ