యువకుడి లాకప్‌డెత్‌పై విచారణ
కడప అర్బన్: కడప టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం జరిగిన యువకుడి లాకప్‌డెత్‌పై పోలీస్ అధికారులు సమగ్ర విచారణ చేపడుతున్నారు. కడప నగ రం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాసాపేటలో నివాసం వుంటున్న షేక్ సోను (23)ను ఈ నెల 16వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో 211/2024 గంజాయి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మరుసటి రోజున 17న ఉదయం 10 గంటల సమయంలో కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. ఈ క్రమంలో లాకప్‌లో ఉంచారు. దాదాపు తెల్లవారుజా మున 3:20 గంటల సమయంలో అతను తన షర్ట్‌కు ఉన్న ఒక చేతిగుడ్డను మెడచుట్టూ చుట్టుకున్నాడు. తరువాత ఇంకో చేతిగుడ్డను లాకప్‌లోని బాత్‌రూం పిట్టగోడను ఎక్కి.. కిటీకికి వున్న గ్రిల్‌కు దగ్గరగా వెళ్లి కట్టి వేలాడాడు. గిలగిలా కొట్టుకుని, గింజుకుంటూ ఉండగా.. చివరి నిమిషంలో విధుల్లో వున్న మహ మ్మద్ అనే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ నారాయణ గమనించి వెంటనే బయ టికి తీసుకుని వచ్చారు. తమ వంతుగా సీపీఆర్‌ను నిర్వహించారు. వెంటనే రక్షక్ పోలీసు వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌కు చేరుకోగానే డాక్టర్లు షేక్ సోనుకు వైద్య పరీక్షలు చేసి మృతి చెందా డని నిర్ధారించారు. ఈ నెల 17న అతని మృతదేహానికి ఇన్‌చార్జి ఆర్డీఓ ఎ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో మెజిస్టీరియల్ విచారణ చేపట్టి, రిమ్స్ వైద్యులచే పోస్టుమార్టం నిర్వహింపచేసి బంధువులకు అప్పగించారు.
ఉన్నతాధికారులకు నివేదిక
సమర్పిస్తాం: డీఎస్పీ
ఈ సంఘటన జరిగిన తరువాత విచారణ అధికారిగా జమ్మలమడుగు డీఎస్పీ కె.వెంకటేశ్వరరావును నియమించారు. మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం ప్రక్రియకు ముందుగా.. మృతుడి బంధువులను డీఎస్పీ విచారణ చేశారు. పోస్టుమార్టం తరువాత కడప టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు విచ్చేశారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని అంశాలపై సమగ్రంగా విచారణ చేశారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడారు. తనను విచారణ అధికారిగా ఉన్నతాధికారులు నియమించిన క్షణం నుంచే విచారణ ప్రారంభించామన్నారు. కడప టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు గంజాయి కేసులో నిందితుడిగా వున్న షేక్ సోనును తీసుకుని వచ్చినప్పటి నుంచి.. ఉరేసుకున్న తరువాత పోలీసు రక్షక్ వాహనంలో అతన్ని తరలించే వరకు సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. అలాగే కానిస్టేబుల్ మహమ్మద్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ నారాయణ విధుల్లో వున్నపుడు ఏయే అంశాలు జరిగాయో వివరంగా విచారణ చేన్నామన్నారు. పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌లో వున్న బాత్‌రూం కిటికీ గ్రిల్‌కు చొక్కాతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తరువాత ఉన్నతాధికారులకు నివేదికను సమర్పిస్తామన్నారు.
పోలీసు సిబ్బందితో డీఎస్పీ వివరాల సేకరణ
సీసీ ఫుటేజీల పరిశీలన
యువకుడి లాకప్‌డెత్‌పై విచారణ


