
అన్నదాతలు ఆరుగాలం శ్రమించారు.. పంటలను కన్నబిడ్డల్లా పెం
లింగాల
మండలంలో
విరిగి పడిన
బొప్పాయి చెట్లు
మండలం గ్రామం పంట విస్తీర్ణం రైతులు పంటనష్టం
హెక్టార్లలో లక్షల్లో
ఒంటిమిట్ట చింతరాజుపల్లి అరటి 16 11 5.60
బొప్పాయి 10 10 2.50
కర్జూజ 6 5 1.50
పచ్చిమిరప 6 9 2.10
దువ్వూరు క్రిష్ణంపల్లి బొప్పాయి 8 9 2,00
కానగూడూరు బొప్పాయి 6 7 1.50
ఇడమడక బొప్పాయి 8 9 2
చక్రాయపేట చక్రాయపేట నిమ్మపంట 16.8 30 5.88
వెంపల్లి వెల్లిమవారిపల్లె అరటి 4 6 1.40
సింహాద్రిపురం అంకాలమ్మ అరటి 10 5 3.50
గూడూరు
కొవరంగుంటపల్లె అరటి 2 2 0.70
బిదనంచెర్ల అరటి 10 13 3.50
కసనూరు అరటి 0.82 1 0.29
సిద్దవటం మాచుపల్లి అరటి 2 2 0.70
ముద్దనూరు గంగాదేవ్‌పల్లి మునగ 1 1 0.25
లింగాల వెలిదండ్ల అరటి 48 55 16.80
బొప్పాయి 6 5 1.50
లింగాల అరటి 20 15 7.00
చిన్నకూడాల అరటి 18 20 6.30
వేముల వేముల అరటి 46 55 16.10
వేల్పుల అరటి 120 135 42.00
మీడిపెంట్ల అరటి 45 55 15.75
గొంతిపల్లి అరటి 3 5 1.05
మొత్తం 412.62 464 139.917
కడప అగ్రికల్చర్: నెలల తరబడి వేలకు వేలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంటలు.. తీరా దిగుబడులు చేతికొచ్చే సమయంలో ఈదురు గాలులు, అకాల వర్షాలతో దెబ్బతిన్నాయి. దీంతో అన్నదాతలు నిండా మునిగి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కనీసం సాగు ఖర్చులు కూడా చేతికి రాకుండానే.. చివరకు అప్పులను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇదే తరహాలో శుక్రవారం సాయంత్రం జిల్లాలో ఉన్నట్లుంటి వీచిన ఈదురుగాలులకు పలు మండలాల్లో అరటి, బొప్పాయి, కర్బూజ, నిమ్మ, మునగ వంటి పలు ఉద్యాన పంటలు నేలకొరిగాయి. దీంతో అన్నదాతలకు రూ.139.91 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా నష్టాన్ని అంచానా వేసి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు.
జిల్లాలో 464 మంది
రైతులకు సంబంధించి..
ఒంటిమిట్ట, దువ్వూరు, చక్రాయపేట, వేంపల్లి, సింహాద్రిపురం, సిద్దవటం, ముద్దనూరు, లింగాల, వేముల మండలాల పరిధిలోని 464 మంది రైతులకు సంబంధించి 412.62 హెక్టార్లలో అరటి, బొప్పాయి, కర్బూజ, మిరప, నిమ్మ, మునగ వంటి వివిధ పంటల నేలకొరిగి దెబ్బతిన్నట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి రూ.139.91 లక్షల మేర రైతులకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా నష్టపరిహారాన్ని అంచానా వేసినట్లు వారు తెలిపారు.
అత్యధికంగా దెబ్బతిన్న పంటలు
జిల్లాలోని కొన్ని మండలాల్లో అత్యధిక నష్టం జరిగింది. ఇందులో భాగంగా వేముల మండలం వేల్పుల గ్రామంలో అత్యధికంగా అరటి పంటలకు సంబందించి 135 మంది రైతులకు చెందిన 120 హెక్టార్లలో పంట దెబ్బతిని రూ.42 లక్షల మేర నష్టం జరిగింది. అదే మండలం వేముల గ్రామంలో అరటికి సంబంధించి 55 మంది రైతులకు 46 హెక్టార్లలో పంట దెబ్బతిని 16.10 లక్షలు, మీడిపెంట్ల గ్రామంలో 55 మంది రైతులకు 45 హెక్టార్లలో అరటి పంట దెబ్బతిని రూ.15.75 లక్షలు, అలాగే లింగాల మండలం వెలిదండ్లలో అరటి పంటకు సంబంధించి 55 మంది రైతులకు 48 హెక్టార్లలో పంట దెబ్బతిని 16.80 లక్షలు, చక్రాయపేట మండలం చక్రాయపేట గ్రామంలో 30 మంది రైతులకు సంబంధించి 16.8 హెక్టార్లలో నిమ్మపంట దెబ్బతిని రూ.5.88 లక్షలు, ఒంటిమిట్ట మండలం చింతమరాజుపల్లెలో అరటి, బొప్పాయి, కర్బూజ పంటలు 27 మంది రైతులకు సంబంధించి 32 హెక్టార్లలో పంట దెబ్బతిని రూ.9.60 లక్షల మేర నష్టం వాటిల్లింది.
బీభత్సం సృష్టించిన గాలివాన
దెబ్బతిన్న ఉద్యాన పంటలు
రూ.1.40 కోట్ల మేర నష్టం
ఆదుకోవాలని అన్నదాత వేడుకోలు

అన్నదాతలు ఆరుగాలం శ్రమించారు.. పంటలను కన్నబిడ్డల్లా పెం

అన్నదాతలు ఆరుగాలం శ్రమించారు.. పంటలను కన్నబిడ్డల్లా పెం

అన్నదాతలు ఆరుగాలం శ్రమించారు.. పంటలను కన్నబిడ్డల్లా పెం

అన్నదాతలు ఆరుగాలం శ్రమించారు.. పంటలను కన్నబిడ్డల్లా పెం

అన్నదాతలు ఆరుగాలం శ్రమించారు.. పంటలను కన్నబిడ్డల్లా పెం