ఎన్జీఓలకు ఇంటి స్థలాల కోసం కృషి
కడప కల్చరల్ : జిల్లాలోని ఎన్జీఓలకు ఇంటి స్థలాలు ఇప్పించేందుకు తగిన కృషి చేస్తామని కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు లెక్కల కొండారెడ్డి తెలిపారు. ఆదివారం సంస్థ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన లెక్కల కొండారెడ్డి జమా ఖర్చులను సభ్యులకు వివరించారు. సొసైటీకి అందరూ సహకరించాలని కోరారు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు బి.శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు డి.రవికుమార్‌లు మాట్లాడుతూ స్థలాలు రాని సభ్యులకు రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.విద్యాసాగర్‌ల సహకారంతో తప్పక స్థలం అందించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.ప్రసాద్ యాదవ్, జిల్లా కార్యదర్శి డి.రవికుమార్‌లు మాట్లాడుతూ ఇంటి స్థలాల విషయంగా ఎలాంటి సందేహాలు, ఆందోళన అవసరం లేదని, తప్పక అందరికీ అందగలవని స్పష్టం చేశారు. సమావేశంలో సొసైటీ పాలక వర్గ డైరెక్టర్లు, ఉమ్మడి కడప జిల్లా తాలూకా అధ్యక్షలు, కార్యదర్శులు, మాజీ జిల్లా అధ్యక్షలు ఎస్ మునెయ్య, పెన్షనర్ల అధ్యక్షలు రామమూర్తి నాయుడు పాల్గొన్నారు.


