
ఘనంగా అంకాలమ్మ విగ్రహ ప్రతిష్ట
ఖాజీపేట : తుడుమలదిన్నె గ్రామంలో నూతనంగా నిర్మించిన అంకాలమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. మూడు రోజుల నుంచి ఆలయ విగ్రహప్రతిష్టా కార్యక్రమాలు జరిగాయి. చివరి రోజున అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. ప్రతిష్ట పురస్కరించుకుని బండలాగుడు పోటీలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గెలిచిన వారికి కమిటీ సభ్యులు బహుమతి ప్రదానం చేశారు.
ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ ఛైర్మన్
విగ్రహ ప్రతిష్టా మహోమత్సం పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జెడ్పీ ఛైర్మన్ రామగోవిందురెడ్డి పాల్గొన్నారు. పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే ఎండోమెంట్ ద్వారా రూ. 34లక్షల నిధులు మంజూరుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అందుకు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ఘన సత్కారం చేశారు.
విరిగిన ధ్వజస్తంభం
ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభం ఏర్పాటు చేసే కార్యక్రమం నిర్వహించారు. అయితే దురదృష్టవశాత్తు ధ్వజస్తంభం విగిరింది. విరిగిన భాగం ఆలయ పైభాగంలో పడింది. ఆలయం పై భాగం కొద్దిమేరకు దెబ్బతింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నా ఎవ్వరికీ ఎలాంటి అపాయం జరగక పోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అగ్రహారంలో అమ్మవారి విగ్రహప్రతిష్ట
ఖాజీపేట మేజర్ పంచాయితీ లోని అగ్రహారం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంకాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ రాఘవరెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ మాజీ అధ్యక్షుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్ గంగాధర్‌రెడ్డి, కేసీ కెనాల్ ప్రాజక్టు కమిటీ మాజీ అధ్యక్షుడు డీఎల్ శ్రీనివాసులరెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, మండల కన్వీనర్ మురళీమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.