
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
కడప సెవెన్ రోడ్స్: రెవెన్యూ అధికారులు అన్నిరకాల జీవోలు, చట్టాలపై అవగాహన పెంచుకుని.. తమ పనితీరు మెరుగుపరచుకొని బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సభా భవన్ లో కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని తహసీల్దార్లు, డీటీలు, వీఆర్వో, మండల సర్వేయర్ల తో వివిధ రకాల రెవెన్యూ అంశాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం (వర్క్ షాప్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సేవలలో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమన్నారు. ప్రజలతో కలిసి మెలిసి మమేకం కావాలని, చట్ట ప్రకారం మార్గదర్శకాలు మేరకు పని చేయాలని సూచించారు. వ్యవస్థలో లోపాలు సరిదిద్దుకొని ముందుకు వెళ్లగలిగినప్పుడే శాఖకు మంచి పేరు వస్తుందని అన్నారు. పిజిఆర్‌ఎస్ ద్వారా అందిన దరఖాస్తులను ఆయా గ్రామాల వారిగా క్రోడీకరించుకోవాలని సూచించారు. ప్రతి వారం పిజిఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం పై ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్ష చేస్తోందన్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను నాణ్యతగా పరిష్కరించడమే మన బాధ్యత అని తెలియజేశారు. సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేయడం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్ప వని హెచ్చరించారు. భూముల అంశంలో నిబంధనలను దష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ చేసి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. అసైన్డ్ భూములు, ఆర్‌ఓఆర్, పట్టాదారు పాస్ పుస్తకాలు, చట్టాలు తదితర అంశాలపై అవగాహన కలిగి పని చేయాలన్నారు.
లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి
కడప నెవెన్ రోడ్స్: ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన నిరుద్యోగులకు వివిధ రకాల సెక్టార్ల ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సబ్సిడీ రుణాలను అందిస్తోందన్నారు. అందులో భాగంగా పరిశ్రమల రంగం, ట్రాన్స్‌ఫోర్ట్ సెక్టార్, వ్యవసాయ రంగం విభాగాలలో 828 యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 29న కడప హార్టికల్చర్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నట్లు ఇందులో బ్యాంకర్లు పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ముందుగా డీసీసీ సమావేశానికి సంబంధించిన అజెండా, వివరాలను ఎల్‌డీఎం మేనేజర్ జనార్దనం వివరించగా..అనంతరం ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించి అజెండా వివరాలను కలెక్టర్ కి వివరించారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి