
ఆదీ.. స్థాయి మరచి మాట్లాడకు
– ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.. ముందు నీ స్థాయి ఏమిటో తెలుసుకుని మాట్లాడు. నీకు రాజకీయ భిక్ష పెట్టిందే వైఎస్‌కుటుంబం. వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ గుర్తుపై గెలిచిన సంగతి మరచిపోరాదు.. అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2014లో వైఎస్సార్‌సీపీ టికెట్‌పై గెలిచి.. దొడ్డిదారిలో టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డి అక్రమాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కల్వటాల, పాపాయపల్లెలో సోలార్ పనులను అడ్డుకుంటే కేసులు పెట్టించే బెదిరిస్తున్నారన్నారు. నాగిరెడ్డిపల్లెలో 500 ఎకరాల కొండను ఎమ్మెల్యే అండతో అనుమతులు లేకుండా యంత్రాలు పెట్టి పనులు చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయాల్లో లేకుండా చేస్తానని ప్రగల్బాలు పలికిన నీ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
ÝùÌêÆŠæḥ MýS…ò³-±MìS ï³BÆŠ‡ òßæ^èlaÇMýS
రైతులను బెదిరించి సొమ్ము చేసుకోవాలని చూస్తే సహించమని రామసుబ్బారెడ్డి హెచ్చరించారు. వ్యవసాయం చేసే రైతు దొంగతనం చేశాడంటూ కేసు పెట్టడం చరిత్రలో తొలిసారి అన్నారు. సోలార్ కంపెనీ ప్రతినిధులు అక్రమ కేసులు పెడితే ప్లాంట్ నడుపుకోవడం కష్టం అవుతుందని హెచ్చరించారు.