Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Kutami Atrocities No confidence motion against Vizag Mayor Live Updates1
GVMC: అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గిన కూటమి

విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో ప్రజాస్వామ్యం మళ్లీ మళ్లీ ఖూనీ అవుతోంది. బలం లేకున్నా విశాఖ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి.. కుట్రలు, ప్రలోభాల పర్వాలతో అడ్డదారిలో నెగ్గింది. ఏకంగా 30 మంది కార్పొరేటర్లను కొనుగోలు చేసిన టీడీపీ.. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిను మేయర్‌ పీఠం నుంచి దించేసింది. అధికార వ్యామోహంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. కేవలం పది నెలల కాలం ఉన్న ఓ మేయర్ పదవి కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించడం గమనార్హం. ఈ క్రమంలో దిగజారుడు రాజకీయాలు చేసింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. కార్పొరేటర్లను ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపడం, స్టార్‌ హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేయడం లాంటి చేష్టలకు పాల్పడింది. కేరళకు వెళ్లి మరీ వైస్సార్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించి.. బతిమాలి.. డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు అవసరం. ఒకవైపు డబ్బు ఎర, మరోవైపు బెదిరింపులు, ఇంకోవైపు కిడ్నాపులు.. ఇలా టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అయినా సరే బొటాబొటిగా 74 మంది సభ్యులతోనే విశాఖ మేయర్‌పై అవిశ్వాసం నెగ్గింది టీడీపీ. ఇక అవిశ్వాస ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే.. భారీ భద్రత నడుమ ఓటింగ్‌ నిర్వహించాలని, ఓటింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయించాలని వైఎస్సార్‌సీపీ చేసిన విజ్ఞప్తిని అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కూటమి నేతలను అడ్డుకోని పోలీసులుఅవిశ్వాసం వేళ.. కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు కాకుండా కొందరు కూటమి నేతలను పోలీసులు జీవీఎంసీ కార్యాలయంలోకి లోపలికి అనుమతించారు. బస్సులో ఉన్న కూటమి నాయకులను వారి అనుచరులను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. ఓటింగ్‌కు వెళ్లిన సభ్యులతో కలిసి జీవీఎంసీ దర్జాగా కొందరు కూటమి నేతలు వెళ్తున్న దృశ్యాలు మీడియాకు చేరడం గమనార్హం. నీచమైన రాజకీయాలు వద్దని చెప్పాప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటినుంచి నేను వైఎస్సార్‌సీపీలో ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు. డబ్బులు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చెయ్యొద్దని చెప్పాను. వైయస్ జగన్ వలనే నేను కార్పోరేటర్ అయ్యాను అని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ శశికళ ఈ ఉదయం ఓ వీడియో విడుదల చేశారు కూడా. ఓటింగ్‌కు ముందు వాస్తవ బలాబలాలువైఎస్సార్సీపీ 58 టీడీపీ 29జనసేన 3బీజేపీ 1సీపీఐ 1సీపీఎం 1ఇండిపెండెన్స్ 4.ఖాళీలు 1.జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లుజీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులుటీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..వైఎస్సార్సీపీకి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్‌సీపీ మొత్తం బలం 61ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు.

Italian prison opens its first Love room for inmates check details here2
సుప్రీం కోర్టే చెప్పింది, ఇక ములాఖత్‌లో ఏకాంతంగా..

‘‘ఖైదీలతో జైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. వాళ్ల మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాగుండడం లేదు. కుటుంబాలతో వాళ్ల బంధాలు బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే భాగస్వాములతో శారీరకంగా కలిసేందుకు అనుమతి ఇవ్వండి. పైగా అది వాళ్లకు ఉన్న హక్కు కూడా’’ అంటూ ఇటలీ సుప్రీం కోర్టు(Italy Constitution Court) తాజాగా ఇచ్చి తీర్పు ఇది. ఈ తీర్పునకు అనుగుణంగానే.. ఇటలీ జైళ్లలో శుక్రవారం నుంచి శృంగార గదులు(S*X Rooms) అందుబాటులోకి వచ్చాయి. ఉంబ్రియా రీజియన్‌లోని జైలులో ఓ ఖైదీని తన భార్యతో కలిసేందుకు అధికారులు అనుమతించారు. ఇందుకోసం అక్కడే లవ్‌ రూమ్‌(Love Rooms) పేరిట ఓ గదిని ఏర్పాటు చేయించారు. సాధారణంగా ములాఖత్‌ల టైంలో పక్కనే గార్డులు పర్యవేక్షిస్తుంటారు. కానీ, ఈ ఏకాంత ములాఖత్‌లో ఎవరూ పక్కన ఉండడానికి వీల్లేదు. న్యాయ శాఖ ఈ తరహా ఏర్పాట్లకు సంబంధించి మార్గదర్శకాలను కూడా రూపొందించడం గమనార్హం.ఉత్తర ఇటలీలోని అస్టి కారాగారంలో ఉన్న ఓ ఖైదీ తాను మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నానని, తనను తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలని ట్యూరిన్‌ కోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే అది తిరస్కరణకు గురైంది. దీంతో అతను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం.. ఇటలీ వ్యాప్తంగా జైళ్లలో 62 వేలమంది ఖైదీలు ఉన్నారు. ఇది జైళ్ల సామర్థ్యం కంటే 21 శాతం ఎక్కువ. అంతేకాదు తరచూ ఖైదీలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు మానసిక ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. అయితే.. ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయని, వాటిని అడ్డుకోవాలని చూడొద్దని జైళ్ల శాఖను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే శృంగారానికి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రిజనర్స్‌ రైట్స్ గ్రూప్‌ సంబురాలు చేసుకుంటోంది.అయితే ఈ తరహా ఏర్పాట్లు ఇటలీ(Italy)లోనే మొదటిసారి కాదు. ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌లాంటి యూరప్‌ దేశాల్లో ఈ తరహా ఏర్పాట్లు ఎప్పటి ుంచో ఉన్నాయి.

Dear Uma Movie Review And Rating Telugu3
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం

తెలుగు చిత్రసీమలో తెలుగమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. హీరోయిన్‌గా మెరిసేందుకు చాలా కష్టపడుతుంటారు. అలాంటిది సుమయ రెడ్డి అయితే తన తొలి ప్రయత్నంలోనే హీరోయిన్‌గా, రచయితగా, నిర్మాతగా భిన్న పాత్రల్ని పోషించింది. 'డియర్ ఉమ' అంటూ ఏప్రిల్ 18న వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించారు. పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌య రెడ్డి( Sumaya Reddy) హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని సాయిరాజేష్ మ‌హాదేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మరి ఈ సుమయ రెడ్డి తొలి ప్రయత్నం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి) వైద్య విద్యను పూర్తి చేసి సొంతంగా ఓ హాస్పిట‌ల్ నిర్మించి తండ్రి క‌ల‌ను నెర‌వేర్చాల‌ని అనుకుంటుంది. మరోవైపు దేవ్‌కు(పృథ్వీ అంబ‌ర్‌) మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. భవిష్యత్‌లో రాక్‌స్టార్ కావాల‌ని ఎన్నో క‌ల‌లు కంటాడు. కానీ, చదువులో చాలా వెనుకపడిపోతాడు. తన కాలేజీ సమయంలో దేవ్‌ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే, మ్యూజిక్ కార‌ణంగానే దేవ్‌కు ఆ అమ్మాయి బ్రేక‌ప్ చెప్పి వెళ్లిపోతుంది. ప్రేమలో విఫలమైన దేవ్ రాక్ స్టార్ అవ్వాలనే ప్రయత్నంలో అంతగా సక్సెస్ కాలేకపోతాడు. చిన్నా చితకా అవకాశల కోసం గడపగడపకూ తిరుగుతుంటాడు. అలాంటి దేవ్‌కి ఓ సారి ఉమ డైరీ దొరుకుతుంది. తనకు గాయమై హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తన జీవితం మారిందని.. అప్పటి నుంచే ఉమ జీవితం ఆగిపోయిందని తెలుసుకుంటాడు. అసలు ఉమకి ఏం జరిగింది..? ఉమ నేపథ్యం ఏంటి? ఉమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తుండేది? అనే ప్రశ్నలతో సతమతం అవుతుంటాడు దేవ్. ఇక ఉమ కోసం దేవ్ చేసిన పోరాటం ఏంటి? ఉమతో దేవ్ ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఈ కథలో దేవ్ అన్న సూర్య (కమల్ కామరాజ్) పాత్ర ఏంటి..? అన్నది కథ.వైద్యం పేరుతో కార్పొరేట్ హాస్పిట‌ల్స్ చేసే మోసాల‌కు ల‌వ్‌స్టోరీని జోడించి డియ‌ర్ ఉమ క‌థ‌ను సుమ‌య రెడ్డి రాసుకుంది. ఈ కథను సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. వైద్య రంగంలోని లోపాలను ఎత్తిచూపుతూ తెరకెక్కించాడు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గుర్తుచేస్తూ, సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా కథను నడిపించారు. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.ఎలా ఉందంటే..?రధన్ సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది, అయితే, కొన్ని చోట్ల మరింత మెరుగ్గా ఉండాల్సింది. రాజ్ తోట కెమెరా వర్క్ సహజంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన షాట్స్ మిస్ అయినట్టు అనిపించవచ్చు. స్క్రీన్ ప్లే సినిమాకు ఒక బలంగా నిలిచింది, ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అయితే, క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సన్నివేశాలు కొందరికి అతిగా అనిపించవచ్చు. పతాక సన్నివేశంలోని పాట సినిమా సందేశాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ, కథలో మరింత సహజంగా కలిసిపోయి ఉంటే బాగుండేది. మొత్తానికి, "డియర్ ఉమర్" ఒక మంచి ప్రయత్నం, కానీ కొన్ని అంశాలలో మరింత శ్రద్ధ పెడితే ఇది ఒక గొప్ప చిత్రంగా నిలిచేది. తొలి చిత్రమే అయినా సుమ చిత్ర ఆర్ట్స్, నిర్మాత సుమయ రెడ్డి గొప్ప కథను అందించడంలో సక్సెస్ అయ్యారు.డియర్ ఉమ చిత్రానికి సుమయ రెడ్డి ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. మంచి కథను ఇవ్వడమే కాకుండా.. ఈ కథను అనుకున్నట్టుగా తీయడంలో ఖర్చు పెట్టిన నిర్మాతగానూ సుమయ రెడ్డి సక్సెస్ అయింది. సుమయ రెడ్డిలోని రచయిత, నిర్మాతకు వంద మార్కులు వేసుకోవచ్చు. ఇక నటిగా ఇంకాస్త మెరుగు పర్చుకోవాల్సి ఉంటుందేమో. తెరపై సుమయ రెడ్డి అందంగా కనిపించారు. హీరోగా పృథ్వీ అంబర్ యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కమల్ కామరాజ్ పాత్ర సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. అజయ్ ఘోష్ పాత్ర రొటీన్ అనిపిస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పోషించిన పాత్రలు అక్కడక్కడా నవ్విస్తాయి. పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోకుండా డియర్‌ ఉమను చూస్తే తప్పకుండా మెప్పిస్తుంది.

IPL 2025: Dravid Breaks Silence On Reports Of Sanju Samson RR Rift4
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్‌ ద్రవిడ్‌

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson)తో విభేదాలంటూ వచ్చిన వార్తలపై.. ఆ జట్టు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) స్పందించాడు. ఇలాంటి వదంతులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని.. సంజూ, తానూ జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తామని స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్‌-2025 (IPL 2025)లో రాజస్తాన్‌ రాయల్స్‌ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇద్దరికీ గాయాల బెడదఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో రాయల్స్‌ కేవలం రెండు మాత్రమే గెలిచింది. మరోవైపు.. హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ సంజూ శాంసన్‌ గాయాల బారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ సీజన్‌ ఆరంభానికి ముందు ద్రవిడ్‌ లీగ్‌ మ్యాచ్‌ ఆడి కాలికి దెబ్బ తాకించుకోగా.. వీల్‌చైర్‌లో కూర్చునే జట్టుకు మార్గదర్శనం చేస్తున్నాడు.ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానేఇక సంజూ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించని కారణంగా తొలి మూడు మ్యాచ్‌లలో కేవలం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు. ఆ తర్వాత సారథిగా పగ్గాలు చేపట్టిన ఈ కేరళ బ్యాటర్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా మరోసారి గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పితో అతడు తదుపరి లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే పరిస్థితి.ద్రవిడ్‌- సంజూ మధ్య విభేదాలు?ఇదిలా ఉంటే.. ఢిల్లీపై గెలవాల్సిన మ్యాచ్‌ను రాయల్స్‌ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇరు జట్లు సరిగ్గా 188 పరుగులే చేయడంతో మ్యాచ్‌ ‘టై’ కాగా.. సూపర్‌ ఓవర్లో ఢిల్లీ రాయల్స్‌పై జయభేరి మోగించింది. అయితే, సూపర్‌ ఓవర్‌కు ముందు ద్రవిడ్‌ ఆటగాళ్లతో డగౌట్‌లో చర్చలు జరుపగా.. సంజూ మాత్రం అందులో పాలుపంచుకోలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. ద్రవిడ్‌- సంజూ మధ్య విభేదాలనే వదంతులు వచ్చాయి.అతడు జట్టులో అంతర్భాగంఅయితే, ఈ వార్తలను ద్రవిడ్‌ ఖండించాడు. లక్నోతో శనివారం నాటి మ్యాచ్‌ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు. నేను, సంజూ ఒకే విధంగా ఆలోచిస్తాం. మా ప్రణాళికలు ఒక్కటే.అతడు జట్టులో అంతర్భాగం. ప్రతి చర్చ, నిర్ణయంలోనూ అతడు భాగమై ఉంటాడు. అయితే, కొన్నిసార్లు మనం అనుకున్న ఫలితాలు రాకపోతే ప్రతి ఒక్కరు నిరాశ చెందుతారు. ఆటలో ఇవన్నీ సహజం.మన ప్రదర్శన బాగా లేకపోతే విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ ఇలా ఆధారాల్లేకుండా వస్తున్న వార్తలను మేమైతే అరికట్టలేము. మా జట్టులోనూ ఎలాంటి విభేదాలు లేవు.మా వాళ్లు కఠినంగా శ్రమిస్తున్నారు. గెలుపు కోసం కృషి​ చేస్తున్నారు. తమ ప్రదర్శన బాగాలేకపోతే ఆటగాళ్ల మనసు ఎంతగా గాయపడుతుందో మీకు తెలియదు. ఎవరో పనిగట్టుకుని వారిని విమర్శించాల్సిన పనిలేదు. పొరపాట్లను సమీక్షించుకుని సరిచేసుకోగల సత్తా వారికి ఉంది’’ అని ద్రవిడ్‌ విమర్శకులకు, వదంతులు వ్యాప్తి చేసే వారికి చురకలు అంటించాడు.చదవండి: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్‌.. ఐపీఎల్‌ చరిత్రలో భారత తొలి బ్యాటర్‌గా

Boat carrying 500 capsizes in Congo river Full Details5
వంట కోసం బోటులో పొయ్యి వెలిగించిన మహిళ

మధ్య ఆఫ్రికా దేశం కాంగో(Democratic Republic of the Congo)లో ఘోరం జరిగింది. ప్రయాణికులతో నదిలో వెళ్తున్న ఓ భారీ బోటు అగ్నిప్రమాదానికి గురి కాగా.. 150 మందికి పైగా మృతి చెందారు. మరో వంద మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో బోటులో 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాంగో నార్త్‌వెస్ట్‌ రీజియన్‌లోని మటాన్‌కుము పోర్టు నుంచి బోలోంబా వైపు.. మంగళవారం వందల మందితో కూడిన భారీ చెక్కబోటు ‘హెచ్‌బీ కాంగోలో’ బయల్దేరింది. అయితే కాంగో నది మధ్యలోకి వెళ్లగానే హఠాత్తుగా బోటులో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయాణికుల్లో చాలామంది నీళ్లలోకి దూకేశారు. ఈత కొందరు కొందరు నీట మునిగి చనిపోగా.. మరికొందరు అగ్నికి ఆహుతి అయ్యారు. చెల్లాచెదురైన మరో వంద మందికి పైగా జాడ తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన వాళ్లకు ప్రస్తుతం చికిత్స అందుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్మయం కలిగించే విషయం ఒకటి తెలిసిందే. ప్రయాణికుల్లో ఓ మహిళ వంట చేసేందుకు ప్రయత్నించగా.. మంటలు చెలరేగినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సదరు మహిళ గ్యాస్‌ స్టౌవ్‌ అంటించగానే.. పేలుడు సంభవించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె అగ్నికి ఆహుతై అక్కడికక్కడే మరణించింది. ఇక.. కాంగోలో బోటు ప్రమాదాలు షరా మాములుగా మారిపోయాయి. At Least 148 Dead After Overcrowded Boat Capsizes In Congo@nitingokhale @SuryaGangadha13 @amitabhprevi @s_jkr #Congo #Africa https://t.co/em5A5kUqQZ— StratNewsGlobal (@StratNewsGlobal) April 19, 2025పాతవి, పాడైపోయిన పడవలను ప్రయాణాలకు వినియోగించడం, సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో కూడిన పడవ ప్రయాణాలే అందుకు కారణాలు. దీనికి తోడు ప్రయాణికుల భద్రత గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా బోటు నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కిందటి ఏడాదిలో కాంగో వ్యాప్తంగా జరిగిన వేర్వేరు బోటు ప్రమాదాల్లో 400 మందికి పైనే మరణించారు.

Housing Price Rises 9pc In Top Cities In FY25 PropEquity6
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..

సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గతేడాది కొత్త ప్రాజెక్టుల ధరలు సగటున 9 శాతం మేర పెరిగినట్లు డేటా అనలిటిక్స్‌ సంస్థ ప్రాప్‌ ఈక్విటీ తెలిపింది. 2024–25లో ప్రాపర్టీ ధరలు సగటున 9 శాతం పెరిగి చ.అ.కు రూ.13,197కు చేరినట్లు పేర్కొంది. ఏడాది కాలంలో కోల్‌కతాలో ఇళ్ల ధరలు అత్యధికంగా 29 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాత థానేలో 17 శాతం, బెంగళూరులో 15 శాతం, పుణెలో 10 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 5 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం, చెన్నైలో 4 శాతంగా ఉన్నాయి.ముంబై, నవీ ముంబైలో ఇళ్ల ధరలు 3 శాతం తగ్గాయి. కాగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల ధరలు 18 శాతం పెరిగాయి. అత్యధికంగా బెంగళూరులో 44 శాతం వృద్ధి నమోదయ్యింది. కోల్‌కత్తాలో 29 శాతం, చెన్నైలో 25 శాతం, థానేలో 23 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 20 శాతం, పుణేలో 18 శాతం, నవీ ముంబైలో 13 శాతం, ముంబైలో 11 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం పెరుగుదల నమోదు చేసింది. మరోవైపు ఈ ఏడాది జనవరి–మార్చిలో గృహాల అమ్మకాలు 23 శాతం తగ్గి, 1,05,791 యూనిట్లకు చేరుకోగా.. సరఫరా 34 శాతం తగ్గి 80,774లకు చేరుకుంది.ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లలో ధరలను పరిశీలిస్తే.. బెంగళూరులో గతేడాది చ.అ. సగటున ధర రూ.8,577 ఉండగా.. ప్రస్తుతం అది రూ.9,852కు పెరిగింది. కోల్‌కత్తాలో చ.అ. ధర రూ.6,201 నుంచి రూ.8,009కి పెరిగింది. చెన్నైలో రేట్లు చ.అ.కు రూ.7,645 నుంచి రూ.7,989కు పెరిగాయి. హైదరాబాద్‌లో చ.అ.కు రూ.7,890 నుంచి రూ.8,306కు పెరిగాయి. పుణెలో చ.అ.కు రూ.9,877 నుంచి రూ.10,832కు పెరిగాయి. థానేలో సగటు చ.అ. ధర రూ.11,030 నుంచి రూ.12,880కు పెరిగాయి. ఢిల్లీలో చ.అ.కు రూ.13,396 నుంచి రూ.14,020కు పెరిగాయి.

Meet wife and husband with love and effection happy faimily7
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!

‘కష్టాల్లో, సుఖాల్లో భర్తకు తోడుగా’ అంటుంటారు. కష్టాలు, సుఖాల్లోనే కాదు... వృత్తిలోనూ భర్తకు తోడూ నీడగా ఉంటుంది జ్యోతి. భర్త డ్రైవర్, భార్య క్లీనర్‌!జ్యోతి ఎందుకు క్లీనర్‌ కావాల్సి వచ్చింది? కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే... లారీ డ్రైవర్‌ అయిన భర్త శోభనాద్రి దూరప్రాంతాలకు వెళుతుండేవాడు. ఇదీ చదవండి: ప్రియుడితో మాజీ సీఎం కుమార్తె పెళ్లి : వైభవంగా‘ఎక్కడ ఉన్నాడో... ఏం తింటున్నాడో’ అని ఎప్పుడూ భర్త గురించి బెంగగా ఉండేది. అందుకు తగ్గట్టే డ్యూటీ దిగి ఇంటికి వచ్చిన భర్త బక్కచిక్కి కనిపించేవాడు.ఒకరోజు అడిగింది...‘నేను నీతోపాటే వస్తాను’‘మరి ఇల్లు?’ అన్నాడు భర్త.‘బండే మన ఇల్లు’ అన్నది ఆమె. ఇక ఆరోజు నుంచి బండే వారి ఇల్లు, బండే స్వర్గసీమ. లారీ ఎక్కడికి కిరాయికి వెళ్లినా క్లీనర్‌గా జ్యోతి భర్త వెంటే వెళుతుంది. లారీలోనే వంట సామగ్రి ఏర్పాటు చేసుకుని, మార్గ మధ్యంలో భర్తకు అవసరమైన భోజనం, టీ, అల్పాహారం వంటివి ఏర్పాటు చేస్తుంది. గతంలో దూర ప్రాంతాలకు వెళ్లిన సందర్భాల్లో సరైన భోజనం లేక శోభనాద్రి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. భర్త వెంట వెళితే ఇబ్బందులు ఉండవని జ్యోతి భావించింది. రాత్రి పూట భర్త డ్రైవింగ్‌ చేస్తుంటే నిద్ర రాకుండా ఉండేందుకు భర్తతో ముచ్చట్లు పెడుతూ అతడిని అప్రమత్తం చేస్తుంటానని చెబుతోంది జ్యోతి. కోళ్ల దాణా, ధాన్యం, బొగ్గు, మొక్కజొన్న వంటివి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు రవాణా చేస్తుంటామని, భార్య తోడు రావడం వల్ల ఇంటి బెంగ కూడా ఉండదని శోభనాద్రి చెబుతున్నాడు.‘పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశాం. బాధ్యతలు తీరిపోయాయి. ఇక మా ఇద్దరి జీవనం ఇలా కలిసిమెలిసి సాగిపోతోంది’ అని భార్యాభర్తలు చెబుతున్నారు. వీరిది ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామం.జి.వి.వి. సత్యనారాయణ, సాక్షి, కొవ్వూరు

TDP Supporters Protest Against Bandaru Sravani8
టీడీపీలో పొలిటికల్‌ వార్‌.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!

సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, వారి ప్రవర్తన కారణంగా.. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీటీసీ సైతం రాజీనామా చేశారు.వివరాల ప్రకారం.. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే శ్రావణి కార్యకర్తల కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పచ్చ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం వచ్చిన మంత్రి టీజీ భరత్‌కు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. టీడీపీ కార్యకర్తలను ఈడ్చి పడేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఎమ్మెల్యే శ్రావణి వైఖరికి నిరసనగా వెస్ట్ నరసాపురం టీడీపీ ఎంపీటీసీ అంజినమ్మ రాజీనామా చేశారు. ఇదే సమయంలో 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు కనీస గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ నేతలు వాసాపురం బాబు, కనంపల్లి ప్రసాద్ ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. టిడిపి ఎమ్మెల్యే బండారు శ్రావణి కు సొంత కార్యకర్త నుంచి నిరసన సెగ. పార్టీ కోసం చాలా కష్టపడ్డాను కానీ గుర్తింపు ఇవ్వడం లేదు.- టిడిపి కార్యకర్త pic.twitter.com/ZibwkRqIZv— రాజా రెడ్డి YSRCP (@rajareddzysrcp) April 18, 2025

Telugu Students Pass In JEE Mains 2025 Results9
జేఈఈ మెయిన్‌లో తెలుగు తేజాలు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్‌)లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించగా వారిలో నలుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన హర్షి ఎ. గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బనిబ్రత మజీతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ 100 పర్సంటైల్‌ సాధించారు. అలాగే టాప్‌–100 ర్యాంకుల్లో 15 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. 99 పర్సంటైల్‌లో వంద మందికిపైగా చోటు సాధించారు. జేఈఈ మెయిన్‌ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. రాజస్తాన్‌కు చెందిన ఎండీ అనాస్, ఆయుష్‌ సింగల్‌ తొలి రెండు ర్యాంకులు సాధించారు. జేఈఈ మొదటి విడత పరీక్ష జనవరిలో జరిగింది. రెండో సెషన్‌ను ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 10,61,849 మంది ఈ పరీక్షకు రిజిస్టర్‌ చేసుకున్నారు. వారిలో 9,92,350 మంది పరీక్ష రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మొదటి, రెండో విడత పరీక్ష ఫలితాలను ఆధారంగా చేసుకొని ర్యాంకులు ప్రకటించారు. వాటి ల్లో 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. ఈ పరీక్షకు ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 2న పరీక్ష ఉంటుంది.

Delhi Mustafabad Building Collapse Rescue Live Updates10
ఢిల్లీలో కుప్పకూలిన బిల్డింగ్‌.. ఇంకా శిథిలాల కిందే పలువురు

న్యూఢిల్లీ, సాక్షి: ముస్తాఫాబాద్‌(Mustafabad) భవన కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సంయుక్తంగా చేపట్టిన సహాయక చర్యల్లో.. ఇప్పటిదాకా 14 మందిని రక్షించగలిగారు. మరో 12 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.ANI న్యూస్‌ ఏజెన్సీ కథనం ప్రకారం.. అర్ధరాత్రి 3గం. ప్రాంతంలో ముస్తాఫాబాద్‌లో ఓ భవనం కుప్పకూలినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్‌​ సాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఉదయం కల్లా పలువురిని బయటకు తీసి జీబీటీ ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో నలుగురు చనిపోయారు. ఆ భవనంలో ఒక పోర్షన్‌లో ఒకే కుటుంబానికి చెందిన పది మంది నివాసం ఉంటున్నారని, అందులో ఆరుగురు చిన్నపిల్లలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వాళ్ల జాడపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈ ప్రభావంతోనే భవనం కూలి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతవారం కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ఓ వ్యక్తి మరణించగా..ఇద్దరు గాయపడ్డారు.#WATCH | Delhi: Mustafabad building collapse caught on camera. As per Delhi Police, "Among the 10 people who were taken out, 4 succumbed. Rescue operations still underway"(Source - local resident) https://t.co/lXyDvOpZ3q pic.twitter.com/NlknYWODRR— ANI (@ANI) April 19, 2025#WATCH | Delhi: 4 people died after a building collapsed in the Mustafabad area; rescue and search operation is underway 8-10 people are still feared trapped, said Sandeep Lamba, Additional DCP, North East District pic.twitter.com/qFGALhkPv3— ANI (@ANI) April 19, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement