వివాహేతర సంబంధానికి అడ్డును తొలగించాలనే ఉద్దేశంతో ప్రియుడితో కలసి ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ నేరం తన మీదకు రాకుండా అనేక వ్యూహాలు పన్నింది. భర్త స్థానంలో ప్రియుడిని తీసుకొచ్చి.. యాసిడ్ దాడి జరిగిందంటూ ప్రచారం చేసింది. ప్రియుడే భర్త అని నమ్మబలికింది.