Top Stories
ప్రధాన వార్తలు

చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో చంద్రబాబు జీవించాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.Happy Birthday to @Ncbn Garu! Wishing you a peaceful and healthy long life!— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2025

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. వరద బీభత్సంతో భయానక వాతావరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందగా.. సుమారు 100 మందిని సహాయక బృందాలు కాపాడాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొండ చరియలు విరిగి పడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బాగ్నా గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు మరణించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) రాంబన్ కుల్బీర్ సింగ్ ధృవీకరించారు. మృతులను మొహమ్మద్ అకిబ్ (14), మొహమ్మద్ సాకిబ్ (9), మోహన్ సింగ్ (75) గా గుర్తించారు. వీరందరూ బాగ్నా పంచాయతీ నివాసితులు.#JammuKashmir | Heavy rainfall in several parts of Bhalessa, Doda#Rainfall pic.twitter.com/8rDEyL8X3l— DD News (@DDNewslive) April 20, 2025 #Ramban | Flash floods triggered by heavy rains hit a village near the Chenab River in Dharamkund, J&K.#JammuKashmir #Dharamkund pic.twitter.com/mrcL9RX7Ja— DD News (@DDNewslive) April 20, 2025మరోవైపు.. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 100మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఐదేళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమై గాలులు వీయడం ఇదే మొదటిసారని పేర్కొంది.#Srinagar #Jammu National Highway is closed for traffic due to landslides & mudslides at multiple locations between Ramban and Banihal.The situation is extremely bad,as several vehicles have been damaged by landslides. Since last evening, #Banihal has received 71 mm of rainfall pic.twitter.com/zPj6hEgAl1— Indian Observer (@ag_Journalist) April 20, 2025ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రాంబన్‌లో కొండ చరియలు విరిగిపడడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందన్నారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇక, జిల్లా అంతటా రెండు హోటళ్ళు, అనేక దుకాణాలు, నివాస నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. మహిళలు, పిల్లలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.जम्मू कश्मीर मे बादल फटने से भयंकर तबाहीहजारों लोगों की जान पर आफतजम्मू -श्रीनगर नेशनल हाईवे भारी बारिश और लैंडस्लाइड के कारण बंद करना पड़ा हाईवे पर कीचड़ भरा मालवा आने से इसके नीचे कई गाड़ियां दब गई है#JammuKashmir #jammusrinagarhighway #landslide #rain #ramban pic.twitter.com/wH16tknzWt— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) April 20, 2025Five vehicles half buried under debris in T2 Ramban#LANDSLIDE #CLOUDBURST #ramban pic.twitter.com/ucMCDsXvRf— Gulistan News (@GulistanNewsTV) April 20, 2025Flood like situation on Jammu - Srinagar National Highway. Avoid a journey till 22 April.Most affected areas: Banihal, Panthyal, and adjacent areas. pic.twitter.com/QUpZMzx8fX— Kashmir Weather (@Kashmir_Weather) April 20, 2025

మటన్, పిజ్జా అంటే ఇష్టం.. చిన్న పిల్లాడు.. కానీ పాపం..
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించే చర్చ. దేశవాళీ క్రికెట్లో అద్భుతాలు చేసిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)నూ తాజాగా అడుగుపెట్టాడు. ఐపీఎల్-2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (RR vs LSG)తో శనివారం (ఏప్రిల్ 19) నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు.తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడుతద్వారా అత్యంత పిన్న వయసులో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. అంతేకాదు.. రాయల్స్ ఓపెనర్‌గా తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు ఈ చిచ్చరపిడుగు. లక్నో పేసర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బంతిని బలంగా బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటిచెప్పాడు.ఈ మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. మూడు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 34 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఎదుర్కొన్న తీరు అమోఘమంటూ మాజీ క్రికెటర్లు వైభవ్ నైపుణ్యాలను కొనియాడుతున్నారు.మటన్, పిజ్జా అంటే ఇష్టం.. చిన్న పిల్లాడు.. కానీ పాపం.. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ వ్యక్తిగత కోచ్ మనీశ్ ఓజా ఈ టీనేజర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘తనకి చికెన్, మటన్ అంటే చాలా ఇష్టం. చిన్న పిల్లాడు కదా.. సహజంగానే పిజ్జా అంటే కూడా మక్కువ ఎక్కువే. కానీ ఇకపై అతడు వాటిని తినబోడు.ఇక్కడికి రాగానే మటన్‌తో పాటు పిజ్జా అతడి డైట్ చార్ట్ నుంచి ఎగిరిపోయింది. మేమైతే అతడికి తరచుగా మటన్ పెట్టేవాళ్లం. ఎంత పెట్టినా సరే అంతా తినేసేవాడు. అందుకే తను కాస్త బొద్దుగా కనిపిస్తాడు. అయితే, ఇప్పుడు తనకు ఇష్టమైన ఆహారాన్ని అతడు సంతోషంగానే వదులుకున్నాడు.యువీ- యువీ కలిస్తే అతడువైభవ్కు సుదీర్ఘమైన కెరీర్ ఉంది. అతడు ఈరోజు ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు చూశారు కదా!.. భవిష్యత్ కాలంలో అతడు ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడు. తను ఫియర్లెస్ బ్యాటర్.అతడికి బ్రియన్ లారా ఆరాధ్య క్రికెటర్. అయితే, లారా- యువరాజ్ సింగ్ కలిస్తే ఎలా ఉంటుందో.. వైభవ్ అలాంటి ఆటగాడు. యువీలా దూకుడుగా ఆడటం తన శైలి.‘బంతి సిక్సర్ కొట్టేందుకు ఆస్కారం ఇస్తే నేనెందుకు సింగిల్ తీయాలి?.. సిక్సే కొడతా’ అని వైభవ్ చెబుతూ ఉంటాడు. ప్రాక్టీస్ సెషన్లో మేము 4 ఓవర్లలో 40 పరుగులు.. ఆరు ఓవర్లలో 60 పరుగులు చేయాలని ఆటగాళ్ల మధ్య పోటీలు పెట్టేవాళ్లం.వైభవ్ అయితే.. ఇంకొన్ని బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి చేసేవాడు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో మనీశ్ ఓజా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. లక్నోతో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రాజస్తాన్ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. కాగా మెగా వేలం-2025లో రాజస్తాన్ 1.1 కోట్లకు బిహార్ కుర్రాడు వైభవ్‌ను కొనుగోలు చేసింది.చదవండి: ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా రియాక్షన్ వైరల్ 𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q— IndianPremierLeague (@IPL) April 19, 2025

మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలు
ఆడపిల్లలంటే మన సమాజంలో చిన్నచూపు. ఇక అరుదైన వైకల్యంతో పుట్టిన చిన్నారి పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. అందుకే పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలివేశారు. కానీ భారతదేశంలో నివసిస్తున్న అమెరికాకు చెందిన దంపతులు పెద్ద మనసు చేసుకున్నారు. రెండేళ్లుగా అనాథాశ్రమంలో ఉంటున్న చిన్నారి నిషాని ఇంటికి తెచ్చుకున్నారు. ఎంతో ప్రేమగా ఒక బిడ్డకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఒక అందమైన పోస్ట్‌ద్వారా ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకు న్నారు. ప్రస్తుతం ఈ కథ నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) భారతదేశంలో నివసిస్తున్న ఒక అమెరికన్ జంట క్రిస్టెన్, టిమ్ ఫిషర్ శ్రీమతి ఫిషెర్. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలున్నారు. నాలుగో కుమార్తెగా రెండేళ్ల నిషాను దత్తత తీసుకున్నారు. నిషాను పరిచయం చేస్తూ ఒక వీడియోలో ఆనందకరమైన క్షణాన్ని పంచుకున్నారు. 2023 అక్టోబర్‌లో దత్తత ప్రక్రియను ప్రారంభించి, 2024 సెప్టెంబర్‌లో నిషా తమకు నచ్చిందని, 2025 ఏప్రిల్ నాటికి దత్తతను పూర్తి చేశామంటూ ఈ వీడియోలో వివరించారు. ఇది నిజంగా బిగ్ న్యూస్.. ఇన్నాళ్లూ ఈ రహస్యాన్ని దాచిపెట్టాం. ఈ రోజుకోసం ఎంతగానో కలలు కన్నాం. మజీవితంలో ఈ ప్రత్యేకమైన అమ్మాయి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు మా కల ఫలించిందంటూ ఫిషర్ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) అనేక కారణాల వల్ల స్పెషల్ నీడ్స్ బేబీని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. ప్రధానంగా బేలేట్రల్ లోయర్ లింబ్ వైకల్యం (bilateral lower limb deformities) బిడ్డకు కొత్త జీవితాన్ని ఇవ్వాలను కున్నాము. పాపాయి చిరునవ్వు, ఆనందం, సంతోషంతో ఎంతో అందంగా ఉంటుంది. ఇంత కాలం ఆమె నిర్లక్ష్యానికి గురైనా, ఆమె ఈ ప్రపంచానికి చాలా అవసరం అంటూ రాశారు. ఫిషర్స్ దత్తత ప్రకటన చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించింది. ప్రత్యేక అవసరాలున్న ఆడబిడ్డ నిషాను దత్తత తీసుకోవడానికి ఈ జంట తీసుకున్న నిస్వార్థ నిర్ణయాన్ని చాలా మంది ప్రశంసించారు. "మాటల్లో వర్ణించలేం. ఆమెకు శాశ్వత ఇల్లు ఇచ్చినందుకు మీ కుటుంబానికి చాలా ఆశీర్వాదాలు! నిజంగా మీరు చాలా అభినందనీయులు!" అన్నారొకరు. ‘‘అద్భుతం , మీమాది అపారమైన గౌరవం ఏర్పింది అభినందనలు!" అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. కాగా 2021లో భారతదేశానికి మకాం మార్చారు క్రిస్టెన్, ఫిషెర్ దంపతులు. వారి అనుభవాలను పంచు కోవడం ద్వారా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఇపుడు ముగ్గురు అమ్మాయిలున్న ఈ దంపతులు భారతీయ అమ్మాయిని అదీ స్పెషల్లీ నీడ్ బేబీని దత్తత తీసుకోవడం విశేషంగా నిలిచింది. ఇదీ చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి

రాజేంద్రనగర్, చేవేళ్లకు త్వరలో ఉప ఎన్నికలు: కేటీఆర్
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఏమైంది? నిట్టనిలువునా మోసపోయామని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, తెలంగాణలోని రెండు నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీసీ, ఎస్సీ, యువ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా తెలంగాణ భవన్‌కు వచ్చారు. రాజేంద్రనగర్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి కేటీఆర్ ఆహ్వానించారు. అనంతరం, కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఈ సంవత్సరమే ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఉంటాయి. మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ గెలవాలి. తెలంగాణలో ఉప ఎన్నికలు రావు అంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆ మరుసటి రోజు లైన్ దాటితే తాట తీస్తామని సుప్రీంకోర్టు జడ్జి అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సుప్రీంకోర్టు ఊరుకుంటుందా?.కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ గుండెలు జారేలా బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ సభకు కదలాలి. వరంగల్‌లో 1250 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేస్తున్నాం. వరంగల్ సభలో కేసీఆర్ ఒక్కరే మాట్లాడతారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేసింది. బీసీ, ఎస్సీ, యువ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?’ అని ప్రశ్నించారు.

Viral: అబ్బాయి జీతం రూ.2.50 కోట్లు ఉండాలి.. పిల్లలు వద్దు!, వధువు 18 కోరికల చిట్టా
అమ్మా..! సుధా(పేరు మార్చాం) బాగా చదువుకున్నావు. మంచి ఉద్యోగం చేస్తున్నావు. మా వయసు మీద పడిపోతుంది. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టాలని మీ నాన్న కంగారు పడుతున్నారు. నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు. సంబంధాలు వెతుకుతాం అంటూ జానకి తన కూతురికి విజ్ఞప్తి చేసింది. తల్లి విజ్ఞప్తితో ఏమో అమ్మా.. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నా పెళ్లి నీ ఇష్టం అని చెప్పడంతో నా బంగారు తల్లి అనుకుంటూ భర్త భూషణ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లింది. ఏవండోయ్ సుధా పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది.. మనోళ్లు ఉన్నారు కదా మంచి సంబంధం చూసి పెట్టమనండి అంటూ వంటింట్లోకి వెళ్లిన జానకి గుక్కెడు పంచదారను భర్త భూషణం నోట్లు కుమ్మరించింది. భార్య జానకి మాటలకు సంబరపడిపోయిన భర్త నాగభూషణం కుమార్తె సుధాకు పెళ్లి సంబంధాలు చూసేందుకు పక్కూరు తన పెద్దమ్మ పార్వతమ్మ ఇంటికి బయల్దేరాడు. ఈ స్టోరీ వినడానికి ఎంత బాగుంది.కానీ అదే సుధని పెళ్లి సంబంధాలు చూస్తాం. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పమ్మా అంటూ అడిగిన తల్లిదండ్రులకు ఎలాంటి కోరికలు లేవంటూనే తనకు కాబోయే వరుడిలో 18 రకాల కోరికలు ఉండాలంటూ తన కోరికల చిట్టా విప్పితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఓ యువతి విషయంలో అలానే జరిగింది. పేరు, ఊరు వెలుగులోకి రాలేదు. కానీ ఆమె కోరికల చిట్టా వెలుగులోకి వచ్చింది. ఆ కోరికల చిట్టా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.జీతం ఏడాదికి 3లక్షల డాలర్ల సంపాదించాలి (మన కరెన్సీలో దాదాపు రూ.2.5 కోట్లు!)జెనరస్, స్పాయిల్‌గా ఉండాలి. అంటే భోజనం, ప్రయాణం, ఫ్యాషన్ ఇలా ప్రతీది కాస్ట్లీగా ఉండాలిలగ్జరీ లైఫ్ ఇష్టపడాలి (ఫైన్ డైనింగ్, ట్రావెలింగ్, వైన్ టేస్టింగ్, ఆర్ట్ ఎగ్జిబిషన్స్)నన్ను నిజంగా ప్రేమించాలి. అన్ని విషయాల్లో నాకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలిఎమోషనల్ ఇంటెలిజెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌గా ఉండాలినైట్ ఎప్పుడైనా బయటికి వెళితే షాడోలా నన్ను వెన్నంటే ఉండాలిఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించడానికి నిరంతరం, దూర దృష్టితో కష్టపడి పనిచేసే వ్యక్తి కావాలికుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇష్టమైన వారితో గడపడం. తరచుగా కుటుంబ విలువలు, సంప్రదాయాలు బాధ్యతలకు ప్రాముఖ్యత ఇవ్వాలిసోషల్ మీడియాలో షో ఆఫ్ వద్దు. ప్రైవసీ ఇష్టంశృంగారం విషయంలో నమ్మకంగా ఉండాలి.నాకు పిల్లలు వద్దు .. ఆవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి పని,వంట పని ఇలా అన్నింట్లో సహాయపడే వ్యక్తే జీవిత భాగస్వామి కావాలని పోస్టులో పేర్కొంది. She sent me a list of her requirements. One of them includes a salary of $300k+byu/New_Ambassador2442 inTinder

ఆడియో టేపుల కలకలం.. తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి హత్యకు కుట్ర
మహబూబ్‌నగర్,సాక్షి: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొండా ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు నిందితులు రెక్కీ నిర్వహించారు. ఇందులో భాగంగా కోర్టు, రియల్ఎస్టేట్ కార్యాలయాల వద్ద కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీషీటర్లు అనుమానాస్పదంగా కనిపించారు.ఓ హత్యకేసులో ప్రశాంత్‌రెడ్డి నిందితుడు కావడం, రూ.2.5 కోట్లకు సుఫారీ కుదుర్చుకున్నట్లు పలు ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ప్రశాంత్‌రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెలుగులోకి వచ్చిన ఆడియోల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అమెరికాలో భారతీయులకు కొత్త టెన్షన్.. సంచలనంగా మారిన నివేదిక!
అగ్రరాజ్యం అమెరికా అంటేనే విదేశీయులకు భయం పుడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక, భారతీయుల దుస్థితి మాత్రం మరింత దారుణంగా ఉంది. భారతీయుల వీసాలే ఎక్కువ సంఖ్యలో రద్దు అవుతున్నాయి. అమెరికా ప్రభుత్వం రద్దు చేసిన వీసాల్లో 50 శాతం భారతీయ విద్యార్థులవేనని తేలింది. వీసా రద్దు అంటూ భారతీయులకు మెయిల్స్ వస్తున్నాయి.అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్‌కు అందిన నివేదికల ప్రకారం ప్రభుత్వం రద్దు చేసిన 327 వీసాల్లో 50శాతం భారతీయులు ఉన్నారని.. అయితే వారి వీసా రద్దుకు సరైన కారణాలు పేర్కొనలేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.ఇక, విద్యార్థులు అక్కడే చదువుకున్నారు. చాలా ఏళ్లుగా అమెరికాలోనే ఓపీటీపై ఉద్యోగాలు చేస్తున్నారు. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టీకల్ ట్రైయినింగ్. దీని ప్రకారం అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయవచ్చు. ఇలా ఉద్యోగం చేస్తున్న వారి వీసాలే ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా రద్దు అవుతున్నాయి. అయితే, ఈ వీసాల రద్దుకు మాత్రం కారణాలు స్పష్టం చెప్పడం లేదు. ఒక్క మెయిల్‌తో వీసాలను రద్దు చేస్తున్నారు. దీంతో, భారతీయులు గందరగోళం నెలకొంది.నివేదిక ప్రకారం.. వీసాలు రద్దు చేసిన విద్యార్థుల్లో 50శాతం మంది భారత్‌కు చెందినవారు కాగా 14శాతం మంది చైనా దేశీయులు. తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉన్నారు. దీనిపై ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ మాట్లాడుతూ.. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ (DOS), ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇక, చట్టబద్దమైన పత్రాలు లేని విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే.మరిన్ని విషయాలు ఈ వీడియోలో..

భరించలేని నొప్పితో ఆస్పత్రిలో.. యాంకర్ రష్మీకి ఆపరేషన్
యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఆస్పత్రిపాలైంది. కొద్దినెలలుగా ఆమె రక్తస్రావం, భుజం నొప్పి సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన రష్మీకి ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. జనవరి నుంచి నాకు ఎప్పుడుపడితే అప్పుడు రక్తస్రావం అవుతోంది. దీనికి తోడు భుజం నొప్పితో విలవిల్లాడాను. ముందుగా దేనికి చికిత్స తీసుకోవాలో అర్థం కాలేదు.రెండు రోజుల క్రితమే ఆపరేషన్ఇంతలో శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి 9కి పడిపోయింది. మార్చి 29న శరీరం నా కంట్రోల్లో లేకుండా పోయింది. పూర్తిగా నీరసించిపోయాను. కానీ అంతకుముందే కొన్ని ప్రాజెక్టులకు డేట్స్ ఇచ్చిన కారణంగా నా పని పూర్తి చేసుకున్నాకే ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాను. ఏప్రిల్ 18న ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాను. మూడువారాలపాటు విశ్రాంతి తీసుకుంటాను. ఆపరేషన్ ముందు ఇలా..తర్వాతే మళ్లీ సెట్స్‌లో అడుగుపెడతాను. ఈ సమయంలో నాకు సాయం చేసిన డాక్టర్లకు, తోడుగా నిల్చున్న నా కుటుంబానికి కృతజ్ఞతలు అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లడానికి ముందు.. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యాక దిగిన ఫోటోను ఈ పోస్ట్‌కు జత చేసింది. ఇది చూసిన అభిమానులు రష్మీ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) చదవండి: ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్

విశాలమైన ఆఫీస్.. ఫుల్ డిమాండ్
స్థిరాస్తి రంగాన్ని కరోనా ముందు, తర్వాత అని విభజించక తప్పదేమో.. మహమ్మారి కాలంలో ఇంటిలో ప్రత్యేక గది, ఇంటి అవసరం ఎలాగైతే తెలిసొచ్చిందో.. ఆఫీసు విభాగంలోనూ సేమ్ ఇదే పరిస్థితి. కోవిడ్ అనంతరం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాలంటే ఆఫీసు స్థలం విశాలంగా ఉండక తప్పని పరిస్థితి. దీంతో విస్తీర్ణమైన కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరిగింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 25 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో 80 శాతం స్థలం పెద్ద, మధ్య స్థాయి కార్యాలయాల వాటానే ఉన్నాయి. ఈ విభాగంలో 20 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది. అత్యధికంగా 35 శాతం ఐటీ సంస్థలు, 17 శాతం ఫార్మా అండ్ హెల్త్ కేర్ సంస్థలు లీజుకు తీసుకున్నాయని గ్లోబల్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ సావిల్స్ ఇండియా నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది తొలి మూడు నెలల్లో దేశంలో కార్యాలయ స్థల లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ఆరు ప్రధాన నగరాలలో క్యూ1లో 1.89 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. 2020 తర్వాత ఈ స్థాయిలో ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ లావాదేవీలు 7.10 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా.సరఫరాలో 28 శాతం వృద్ధి.. 2025 క్యూ1లో ఆరు మెట్రో నగరాల్లో కొత్తగా మార్కెట్లోకి 86 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 28 శాతం అధికం. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా 8.15 కోట్ల చ.అ. స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. లీజులలో వృద్ధి, సరఫరా కారణంగా ఈ త్రైమాసికం ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ వేకన్సీ రేటు 15 శాతంగా ఉంది.జీసీసీల జోరు.. ఇప్పటి వరకు దేశంలోని ఆరు మెట్రోలలో 80.62 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ముగింపు నాటికి 87.91 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా. స్థూల ఆర్థికాభివృద్ధి, స్థిరమైన ధరలు, నైపుణ్య కార్మికుల అందుబాటు తదితర కారణాలతో ఐటీ, బ్యాంకింగ్, తయారీ రంగాలలో ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ లావాదేవీలు పెరగడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుతో ఆఫీసు స్పేస్ విభాగం మరింత వృద్ధి సాధిస్తుంది.
రాత్రి ట్రైన్లో ప్రయాణం.. ఏకంగా ముద్దిస్తావా? అని అడిగాడు: మాళవిక మోహనన్
IPL 2025 PBKS vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
ఫుడ్ ఆర్డర్‌తో పాటు ఓ స్లిప్ పంచుతున్న డెలివరీ బాయ్.. అందులో ఏముందంటే?
మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలు
కొలికపూడికి మరో షాక్.. తిరువూరులో రెండుగా చీలిన టీడీపీ
Viral: అబ్బాయి జీతం రూ.2.50 కోట్లు ఉండాలి.. పిల్లలు వద్దు!, వధువు 18 కోరికల చిట్టా
‘సూర్యాపేట్ జంక్షన్’రిలీజ్ డేట్ ఫిక్స్
సౌత్‌లో ఆ పిచ్చి అలాగే ఉంది.. నన్నెంత దారుణంగా తిట్టారో!: రాజాసాబ్ బ్యూటీ
దెయ్యం సినిమాకు వసూళ్లు ఎంతొచ్చాయ్?
చేతులు మారుతున్న కంపెనీలు.. రూ.వందల కోట్ల డీల్స్
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
డోంట్ వర్రీ సార్! ఇలా అయితేనే మీ టార్గెట్ పూర్తవుతుంది!
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
డెత్ సర్టిఫికెట్‌కు రూ.90 వేల లంచం
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
మూతపడిన జిందాల్ స్టీల్స్
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
అమ్మా..ఊపిరాడలేదు!
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
చల్లటి కబురు!
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
కంగారు పడకు! నేనే ఈ సారి ఎండలు కాస్త ఎక్కవగా ఉన్నాయ్!
కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
ఈ రాశి వారు వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు.
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
ఉపాధి హామీ పనులు.. 17జిల్లాలు అప్.. 15జిల్లాలు డౌన్..
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
‘సుప్రీంకోర్టు నిర్దేశిస్తుందా?.. ఇక మేము పార్లమెంట్‌ను మూసేస్తాం’
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
అక్రమ కేసే.. బాబు కుట్రే!
అమెరికాలో భారతీయులకు కొత్త టెన్షన్.. సంచలనంగా మారిన నివేదిక!
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్
బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్ జగన్
విశ్వమూ భ్రమిస్తోంది
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
10th class: పదోతరగతి పరీక్షలు.. పాసయ్యేందుకు లంచంతో విద్యార్థుల ఎత్తుగడ!
తెలంగాణ మంత్రి దగ్గర రూ.55 లక్షల అప్పు: రాజ్‌తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య
భరించలేని నొప్పితో ఆస్పత్రిలో.. యాంకర్ రష్మీకి ఆపరేషన్
మార్కెట్ మరింత పడుతుంది.. బంగారం, వెండి కొనడమే మేలు
పైసా తక్కువ రూపాయ్!
విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి
ఆ మర్మం ఏందో?.. స్మితా సబర్వాల్‌కు సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం
వెస్టిండీస్‌కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..!
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
జూలైలో మెగా సునామీ?
శుబ్‌మన్ గిల్‌కు భారీ షాక్!
రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు- యోగీ ఆధిత్యనాథ్
అమ్మాయికి అంకుల్‌తో పెళ్లి.. ఆగింది ఇలా..!
ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.
‘పచ్చ’పార్టీ కబ్జాకాండ
కోత కోసి.. పూత పూసి..
‘దిశ’ తరహా ఘటన.. పెళ్లికి వెళ్లడమే ఆమె పాలిట శాపమైంది!
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
రొయ్యకు లోకల్ మార్కెట్
జ్యోతిష్యం చెప్తుండగా టైర్ పేలి తుర్రుమన్న చిలుక
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
ఢిల్లీ వెళ్లాల్సిన విమానం జైపూర్‌లో ల్యాండ్.. సీఎం ఒమర్ అబ్దుల్లా ఫైర్
సుప్రీంకోర్టుపై బీజేపీ నేతల వ్యాఖ్యలు.. జేపీ నడ్డా ఏమన్నారంటే?
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్
అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ
ఎట్టకేలకు డీఎస్సీ షెడ్యూల్ విడుదల
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్‌లో ప్రియురాలి ఫొటో..
మానవ బుద్ధుల్ని నడిపిస్తున్నది ఎలాంటి సంబంధాలు?
‘రెండు జీరోలు కలిస్తే వచ్చేది జీరోనే’
ఆడియో టేపుల కలకలం.. తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి హత్యకు కుట్ర
అయ్యో! ఆగండయ్యా! అది అప్పుడు ఇప్పుడు మనం వాళ్ల కూటమిలో ఉన్నాం!
రెండు పెళ్లిళ్లు.. ఎందుకంటే నేను శ్రీరాముడిని ఫాలో కాను: కమల్ హాసన్
మేమేం పాపం చేశామమ్మా..
లక్నో ‘సూపర్’ విక్టరీ
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
హోమ్ లోన్ ముందుగా చెల్లించడం మంచిదేనా..?
Uppal: నార్త్ స్టాండ్ పేరు తొలగింపు.. స్పందించిన అజారుద్దీన్
'గుడ్ బ్యాడ్ అగ్లీ' కలెక్షన్స్.. అజిత్ కెరీర్లో ఇదే టాప్
బంజారాహిల్స్‌లో కలకలం.. ఆసుపత్రి బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేస్తానంటూ మహిళ హల్చల్
హమ్మయ్య.. బంగారం ఆగింది!
అది తెలిసిన రోజు సంగీతం మానేస్తాను: ఇళయరాజా
మరో ప్రపంచం పిలుస్తోంది... రండి!
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
అశుతోష్‌పై మండిపడ్డ ఇషాంత్ శర్మ.. వేలు చూపిస్తూ వార్నింగ్
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
నరాలు తెగే ఉత్కంఠ: ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా రియాక్షన్ వైరల్
రాత్రి ట్రైన్లో ప్రయాణం.. ఏకంగా ముద్దిస్తావా? అని అడిగాడు: మాళవిక మోహనన్
IPL 2025 PBKS vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
ఫుడ్ ఆర్డర్‌తో పాటు ఓ స్లిప్ పంచుతున్న డెలివరీ బాయ్.. అందులో ఏముందంటే?
మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలు
కొలికపూడికి మరో షాక్.. తిరువూరులో రెండుగా చీలిన టీడీపీ
Viral: అబ్బాయి జీతం రూ.2.50 కోట్లు ఉండాలి.. పిల్లలు వద్దు!, వధువు 18 కోరికల చిట్టా
‘సూర్యాపేట్ జంక్షన్’రిలీజ్ డేట్ ఫిక్స్
సౌత్‌లో ఆ పిచ్చి అలాగే ఉంది.. నన్నెంత దారుణంగా తిట్టారో!: రాజాసాబ్ బ్యూటీ
దెయ్యం సినిమాకు వసూళ్లు ఎంతొచ్చాయ్?
చేతులు మారుతున్న కంపెనీలు.. రూ.వందల కోట్ల డీల్స్
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
డోంట్ వర్రీ సార్! ఇలా అయితేనే మీ టార్గెట్ పూర్తవుతుంది!
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
డెత్ సర్టిఫికెట్‌కు రూ.90 వేల లంచం
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
మూతపడిన జిందాల్ స్టీల్స్
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
అమ్మా..ఊపిరాడలేదు!
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
చల్లటి కబురు!
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
కంగారు పడకు! నేనే ఈ సారి ఎండలు కాస్త ఎక్కవగా ఉన్నాయ్!
కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
ఈ రాశి వారు వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు.
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
ఉపాధి హామీ పనులు.. 17జిల్లాలు అప్.. 15జిల్లాలు డౌన్..
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
‘సుప్రీంకోర్టు నిర్దేశిస్తుందా?.. ఇక మేము పార్లమెంట్‌ను మూసేస్తాం’
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
అక్రమ కేసే.. బాబు కుట్రే!
అమెరికాలో భారతీయులకు కొత్త టెన్షన్.. సంచలనంగా మారిన నివేదిక!
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్
బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్ జగన్
విశ్వమూ భ్రమిస్తోంది
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
10th class: పదోతరగతి పరీక్షలు.. పాసయ్యేందుకు లంచంతో విద్యార్థుల ఎత్తుగడ!
తెలంగాణ మంత్రి దగ్గర రూ.55 లక్షల అప్పు: రాజ్‌తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య
భరించలేని నొప్పితో ఆస్పత్రిలో.. యాంకర్ రష్మీకి ఆపరేషన్
మార్కెట్ మరింత పడుతుంది.. బంగారం, వెండి కొనడమే మేలు
పైసా తక్కువ రూపాయ్!
విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి
ఆ మర్మం ఏందో?.. స్మితా సబర్వాల్‌కు సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం
వెస్టిండీస్‌కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..!
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
జూలైలో మెగా సునామీ?
శుబ్‌మన్ గిల్‌కు భారీ షాక్!
రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు- యోగీ ఆధిత్యనాథ్
అమ్మాయికి అంకుల్‌తో పెళ్లి.. ఆగింది ఇలా..!
ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.
‘పచ్చ’పార్టీ కబ్జాకాండ
కోత కోసి.. పూత పూసి..
‘దిశ’ తరహా ఘటన.. పెళ్లికి వెళ్లడమే ఆమె పాలిట శాపమైంది!
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
రొయ్యకు లోకల్ మార్కెట్
జ్యోతిష్యం చెప్తుండగా టైర్ పేలి తుర్రుమన్న చిలుక
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
ఢిల్లీ వెళ్లాల్సిన విమానం జైపూర్‌లో ల్యాండ్.. సీఎం ఒమర్ అబ్దుల్లా ఫైర్
సుప్రీంకోర్టుపై బీజేపీ నేతల వ్యాఖ్యలు.. జేపీ నడ్డా ఏమన్నారంటే?
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్
అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ
ఎట్టకేలకు డీఎస్సీ షెడ్యూల్ విడుదల
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్‌లో ప్రియురాలి ఫొటో..
మానవ బుద్ధుల్ని నడిపిస్తున్నది ఎలాంటి సంబంధాలు?
‘రెండు జీరోలు కలిస్తే వచ్చేది జీరోనే’
ఆడియో టేపుల కలకలం.. తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి హత్యకు కుట్ర
అయ్యో! ఆగండయ్యా! అది అప్పుడు ఇప్పుడు మనం వాళ్ల కూటమిలో ఉన్నాం!
రెండు పెళ్లిళ్లు.. ఎందుకంటే నేను శ్రీరాముడిని ఫాలో కాను: కమల్ హాసన్
మేమేం పాపం చేశామమ్మా..
లక్నో ‘సూపర్’ విక్టరీ
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
హోమ్ లోన్ ముందుగా చెల్లించడం మంచిదేనా..?
Uppal: నార్త్ స్టాండ్ పేరు తొలగింపు.. స్పందించిన అజారుద్దీన్
'గుడ్ బ్యాడ్ అగ్లీ' కలెక్షన్స్.. అజిత్ కెరీర్లో ఇదే టాప్
బంజారాహిల్స్‌లో కలకలం.. ఆసుపత్రి బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేస్తానంటూ మహిళ హల్చల్
హమ్మయ్య.. బంగారం ఆగింది!
అది తెలిసిన రోజు సంగీతం మానేస్తాను: ఇళయరాజా
మరో ప్రపంచం పిలుస్తోంది... రండి!
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
అశుతోష్‌పై మండిపడ్డ ఇషాంత్ శర్మ.. వేలు చూపిస్తూ వార్నింగ్
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
నరాలు తెగే ఉత్కంఠ: ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా రియాక్షన్ వైరల్
సినిమా

చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత
సమంత(Samantha) ఈ పేరు చెప్పగానే ఏ మాయ చేశావె తో పాటు చాలా సినిమాలు గుర్తొస్తాయి. తెలుగులో స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం పలు కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉంది. నిర్మాతగా మారి 'శుభం' అనే మూవీని విడుదలకు సిద్ధం చేసింది.మే 9న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. నెల్లూరులోని ఓ కాలేజీలో తాజాగా ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇందులో మాట్లాడిన సమంత.. తన తొలి చిత్రాల్లో చాలా ఘోరంగా యాక్టింగ్ చేశానని, అవి చూస్తున్నప్పుడల్లా సిగ్గేస్తుందని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: భరించలేని నొప్పితో ఆస్పత్రిలో చేరిన రష్మీ గౌతమ్..)సమంత నటించిన తొలి చిత్రం 'ఏ మాయ చేశావె'(Ye Maaya Chesave). అయితే ఈ మూవీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇందులో తన యాక్టింగ్ తనకే నచ్చలేదని సమంత చెప్పడం మాత్రం ఆశ్చర్యకలిగించింది. ఇకపోతే సామ్ ప్రస్తుతం 'రక్త బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇది వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశాలున్నాయి.ఏ మాయ చేశావె.. సమంత కెరీర్ లో చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది తనకు తొలి సినిమా. కలిసి నటించిన నాగచైతన్యని(Naga Chaitanya) కొన్నాళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాకపోతే మనస్పర్థల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. అయితేనేం చాలామందికి ఇప్పటికీ 'ఏ మాయ చేశావె' ఫేవరెట్ సినిమానే కావడం విశేషం.(ఇదీ చదవండి: ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్)

భరించలేని నొప్పితో ఆస్పత్రిలో.. యాంకర్ రష్మీకి ఆపరేషన్
యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఆస్పత్రిపాలైంది. కొద్దినెలలుగా ఆమె రక్తస్రావం, భుజం నొప్పి సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన రష్మీకి ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. జనవరి నుంచి నాకు ఎప్పుడుపడితే అప్పుడు రక్తస్రావం అవుతోంది. దీనికి తోడు భుజం నొప్పితో విలవిల్లాడాను. ముందుగా దేనికి చికిత్స తీసుకోవాలో అర్థం కాలేదు.రెండు రోజుల క్రితమే ఆపరేషన్ఇంతలో శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి 9కి పడిపోయింది. మార్చి 29న శరీరం నా కంట్రోల్లో లేకుండా పోయింది. పూర్తిగా నీరసించిపోయాను. కానీ అంతకుముందే కొన్ని ప్రాజెక్టులకు డేట్స్ ఇచ్చిన కారణంగా నా పని పూర్తి చేసుకున్నాకే ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాను. ఏప్రిల్ 18న ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాను. మూడువారాలపాటు విశ్రాంతి తీసుకుంటాను. ఆపరేషన్ ముందు ఇలా..తర్వాతే మళ్లీ సెట్స్‌లో అడుగుపెడతాను. ఈ సమయంలో నాకు సాయం చేసిన డాక్టర్లకు, తోడుగా నిల్చున్న నా కుటుంబానికి కృతజ్ఞతలు అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లడానికి ముందు.. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యాక దిగిన ఫోటోను ఈ పోస్ట్‌కు జత చేసింది. ఇది చూసిన అభిమానులు రష్మీ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) చదవండి: ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్

బిగ్‌బాస్ 'నబీల్' కొత్త కారు.. నిద్రలేని రాత్రులు గడిపానంటూ..
యూట్యూబర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ నబీల్ అఫ్రిది (Nabeel Afridi) కొత్త కారు కొనుగోలు చేశాడు. మహీంద్రా ఎక్స్‌యూవీ700ఏఎక్స్7 లగ్జరీ కారును ఇంటికి తెచ్చేసుకున్నాడు. మొత్తానికి తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు కారు వీడియోను షేర్ చేశాడు. ఒకప్పుడు ఏడు సీటర్ల కారు గురించి కలలు కనేవాడిని.. ఇప్పుడేకంగా మహీంద్రా లగ్జరీ కారును సొంతం చేసుకున్నాను. జీరో సబ్స్క్రైబర్లు, జీరో ఫాలోవర్ల నుంచి నా ప్రయాణం మొదలుపెట్టాను. మీ వల్ల కూడా అవుతుందిమనసు నిండా ఆలోచనలు, ఒక నోట్‌ప్యాడ్‌తో నా జర్నీ మొదలైంది. ఎన్నో కష్టనష్టాలను చూశాను. నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. ఇది కేవలం కారు మాత్రమే కాదు ఒక మైల్స్టోన్. నేను నా కలను నిజం చేసుకున్నానంటే మీరు కూడా మీ కలను సాకారం చేసుకోగలరు. ముందు కలగనండి.. దానికోసం ప్రయత్నించండి.. తర్వాత దాన్ని సాకారం చేసుకోండి అని క్యాప్షన్ జోడించాడు. అభిమానులు లేకపోయుంటే ఇంతదూరం వచ్చేవాడినే కాదంటూ నబీల్ ఎమోషనలయ్యాడు.కొత్త కారు ధరెంతంటే?కొత్త కారు కొన్న నబీల్‌కు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెప్తున్నారు. 2025లో లాంచ్ అయిన ఈ మోడల్ కారు ధర రూ.25 లక్షల పైనే ఉందని తెలుస్తోంది. నబీల్ అఫ్రిది.. వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్‌తో ఫేమస్ అయ్యాడు. అలా వచ్చిన గుర్తింపుతో తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో పాల్గొన్నాడు. ఈ షోలో సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. View this post on Instagram A post shared by Nabeel Afridi (@iamnabeelafridi) చదవండి: ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్

జ్యోతిష్కుడు చెప్పినట్లు నిజంగానే యాక్సిడెంట్ జరిగింది: దర్శకుడు ఇంద్రగంటి
‘‘సాధారణంగా ప్రతి సినిమా విషయంలో ఆ సినిమా ఫిల్మ్ మేకర్‌కి ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. కానీ నా కెరీర్లో నేను అతి తక్కువ అసంతృప్తితో తీసిన సినిమా ‘సారంగపాణి జాతకం’. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ప్రియదర్శి, రూపా కొడవాయూర్ జంటగా, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పిన సంగతులు... → ‘యశోద’ మూవీ తర్వాత సినిమా చేద్దామని శివలెంక కృష్ణప్రసాద్‌గారు అన్నప్పుడు ‘సారంగపాణి జాతకం’ కథ చెబితే, ఆయనకు నచ్చింది. ప్రియదర్శి చేసిన ‘మెయిల్, బలగం’ సినిమాలు, ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ చూసి తనతో మంచి హ్యూమరస్ మూవీ చేయొచ్చనిపించింది. దర్శికి విషయం చెబితే, అంగీకరించాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్ ఆటోమొబైల్స్ రంగంలో ఉద్యోగాలు చేస్తుంటారు. ఒకరు సేల్స్‌మేన్, మరొకరు సేల్స్ సర్వీసింగ్ కన్సల్టెంట్. వైవా హర్ష పాత్ర కూడా బాగుంటుంది.→ జాతకాలను నమ్మే పాత్రలో దర్శి నటించాడు. నేను జాతకాలను నమ్ముతానా? అంటే... నా జీవితంలో జ్యోతిష్కులు చెప్పినవి కొన్ని జరిగాయి... మరికొన్ని జరగలేదు. నా 32 యేళ్ల వయసులో దర్శకుడిగా నా తొలి చిత్రం వస్తుందని ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. అది జరిగింది. 2016లో మే నుంచి ఆగస్టు మధ్యలో ఓ ప్రమాదం జరుగుతుందని మరో జ్యోతిష్కుడు 2015లోనే హెచ్చరించాడు. నిజంగానే 2016 జూలైలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అలానే జ్యోతిష్కులు చెప్పినవాటిలో జరగనవీ ఉన్నాయి. → ఈ సినిమాలో నేను జాతకాన్ని ప్రశ్నించలేదు. ఏ నమ్మకాన్ని అయినా మీరు నమ్ముకోవచ్చు. అది దేవుడు కావొచ్చు.. వాస్తు కావొచ్చు. జాతకం కావొచ్చు. కానీ మామూలు నమ్మకం ఓ మనిషిని బలవంతుడ్ని చేస్తే, మూఢనమ్మకం బలహీనుడిని చేస్తుంది. అప్పుడు మనిషి తన జీవితంతో పాటు తన చుట్టూ ఉన్నవారి జీవితాలనూ అస్తవ్యస్తం చేస్తాడు. అప్పుడు ఎంత గందరగోళం ఏర్పడుతుందనే విషయాన్ని ఈ సినిమాలో హాస్యాస్పదంగా చూపించాం. నమ్మకం మనకు బలాన్నిచ్చే విధంగా ఉండాలి కానీ పిచ్చోడ్ని చేయకూడదు? ఈ సినిమాతో ఇదే చెప్పాలనుకున్నాను. → ఇక ఓటీటీల్లో సినిమాలు వెంటనే రిలీజ్ కాకుండా దర్శక–నిర్మాతలు–హీరోలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆడియన్స్‌ను థియేటర్స్ తీసుకురావడం మరింత కష్టమైపోతుంది. అలా అని ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదని కాదు. మార్చి 14న పదో తరగతి ఎగ్జామ్స్ టైమ్‌లో ‘కోర్ట్’ సినిమాను విడుదల చేస్తే బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఎమెషనల్ ఎక్స్‌పీరియన్స్‌ని కోరుకుంటున్నారు. → వాల్మికీ రామాయణం ఆధారంగా యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ‘జఠాయు’ కథ ఉంది. భవిష్యత్‌లో ఈ కథతో సినిమా చేస్తాను.
న్యూస్ పాడ్‌కాస్ట్

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ
క్రీడలు

అశుతోష్‌పై మండిపడ్డ ఇషాంత్ శర్మ.. వేలు చూపిస్తూ వార్నింగ్
గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) సహనం కోల్పోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ (Ashuthosh Sharma)కు వేలు చూపిస్తూ మైదానంలోనే వార్నింగ్ ఇచ్చాడు. ఫీల్డ్ అంపైర్‌తో పాటు.. టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అసలేం జరిగిందంటే..ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (GT vs DC) మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన టైటాన్స్.. ఢిల్లీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.అశుతోష్ శర్మ ధనాధన్‌ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ ఎనిమిది వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (9 బంతుల్లో 18), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31) వేగంగా ఆడగా.. కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 28) కాసేపు మెరుపులు మెరిపించాడు.ఇక అక్షర్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (21 బంతుల్లో 31)తో మెరవగా.. ఢిల్లీ నయా ఫినిషర్ అశుతోష్ శర్మ (19 బంతుల్లో 37) ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు. అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పందొమ్మిదో ఓవర్లో గుజరాత్ పేసర్ ఇషాంత్ శర్మ బంతితో బరిలోకి దిగాడు.అప్పటికి డొనొవన్ ఫెరీరా, అశుతోష్ క్రీజులో ఉన్నారు. ఇషాంత్ బౌలింగ్‌లో తొలి బంతిని ఎదుర్కొన్న అశుతోష్ సింగిల్ తీయగా.. మరుసటి బంతికి ఫెరీరా రన్ పూర్తి చేశాడు. మూడో బంతికి మళ్లీ అశుతోష్ సింగిల్ తీయగా.. నాలుగో బంతికి ఫెరీరా సాయి కిషోర్‌కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.వేలు చూపిస్తూ వార్నింగ్ఫెరీరా స్థానంలో వచ్చిన మిచెల్ స్టార్క్ సింగిల్ తీయగా.. అశుతోష్ మళ్లీ స్ట్రైక్‌లోకి వచ్చాడు. అయితే, ఆఖరి బంతిని ఇషాంత్ వైడ్‌గా వేయగా.. అశుతోష్‌కు మరో బంతి ఆడే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో ఇషాంత్ సంధించిన బౌన్సర్‌ను అశుతోష్ ఎదుర్కోలేకపోయాడు.ఇక బంతి వెళ్లి వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లో పడింది. ఈ క్రమంలో బంతి అశుతోష్ గ్లోవ్స్‌ను తాకిందని భావించిన గుజరాత్ ఆటగాళ్లు బిగ్గరగా అవుట్‌కి అప్పీలు చేశారు. అయితే, అంపైర్ నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. ఇంతలో అశుతోష్ బంతి భుజాన్ని రాసుకుని వెళ్లిందన్నట్లుగా సైగ చేశాడు. అశుతోష్ శర్మ చర్యను సహించలేకపోయిన ఇషాంత్ శర్మ అతడి దగ్గరికి వెళ్లి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చినట్లు కనిపించింది. తర్వాత అశుతోష్ తన షర్టును పైకెత్తి బంతి భుజానికి తాకిందని అంపైర్‌కు చెప్పే ప్రయత్నం చేశాడు.Battle b/w ishant sharma vs ashutosh Sharma 🤣 pic.twitter.com/EMd12Z2o7V— Daigo18 (@daigo2637391027) April 19, 2025ఇరగదీసిన బట్లర్ఇంతలో అంపైర్‌తో పాటు గిల్ జోక్యం చేసుకుని ఇషాంత్‌ను పక్కకు తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.2 ఓవర్లలో ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జోస్ బట్లర్ (54 బంతుల్లో 97 నాటౌట్), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (34 బంతుల్లో 43), రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 11 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.చదవండి: IPL 2025: శుబ్‌మన్ గిల్‌కు భారీ షాక్! Right off the middle! 💥#AshutoshSharma hits the accelerator and launches a stunning SIX over the square boundary!Watch the LIVE action ➡ https://t.co/6YcPaJPTHV#IPLonJioStar 👉 #GTvDC | LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar! pic.twitter.com/TpSfdehCwX— Star Sports (@StarSportsIndia) April 19, 2025

శుబ్‌మన్ గిల్‌కు భారీ షాక్!
గెలుపు సంబరంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా.. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ మేరకు శిక్ష విధించింది.ఇందుకు సంబంధించి ఐపీఎల్ పాలక మండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ గిల్‌కు జరిమానా విధించినట్లు తెలిపింది. ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్లో అతడు మొదటిసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు రూ. 12 లక్షలతో సరిపెట్టినట్లు పేర్కొంది.ఢిల్లీ భారీ స్కోరుకాగా ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ వేదికగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (32 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్‌లు), అశుతోష్ శర్మ (19 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. జోస్ ది బాస్.. దంచేశాడులక్ష్య ఛేదనలో జోస్ బట్లర్ దంచికొట్టాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కేవలం 54 బంతుల్లోనే 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.మరోవైపు.. బట్లర్‌కు తోడుగా షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (34 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు. ఆఖర్లో తెవాటియా మూడు బంతుల్లో 11 పరుగులతో అజేయంగా నిలిచి బట్లర్‌తో కలిసి గుజరాత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. THE CELEBRATION FROM JOS BUTTLER. - Buttler was on 97*, but the happiness after Tewatia finished the match. 👏❤️ pic.twitter.com/31z4tWPJmL— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2025 ఢిల్లీ విధించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా ఈ సీజన్లో ఐదో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది.ఐపీఎల్-2025: గుజరాత్ వర్సెస్ ఢిల్లీ👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: గుజరాత్.. మొదట బౌలింగ్👉ఢిల్లీ స్కోరు: 203/8 (20)👉గుజరాత్ స్కోరు: 204/3 (19.2)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై గుజరాత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్ (గుజరాత్- 54 బంతుల్లో 97 నాటౌట్).చదవండి: IPL 2025: గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్ ఖాన్

పాకిస్తాన్ భారత్‌లో మ్యాచ్‌లు ఆడదు: పీసీబీ చీఫ్
భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ (ICC Women's ODI World Cup) కోసం పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించబోదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహసిన్ నఖ్వీ శనివారం స్పష్టంచేశారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ఐసీసీ పురుషుల చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్లో పర్యటించేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో రోహిత్ సేన ఆడే మ్యాచ్‌లను ‘హైబ్రీడ్ మోడల్’లో దుబాయ్‌లో నిర్వహించారు. ఇప్పుడదే రీతిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆడనున్న మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించనున్నారు. దీనికి గతంలోనే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారం తెలిపాయి. ‘భారత జట్టు పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు. తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు మహిళల ప్రపంచకప్ విషయంలోనే అదే జరుగుతుంది. ఆతిథ్య హోదాలో భారత్ నిర్ణయించిన తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సిద్ధంగా ఉంది’అని నఖ్వీ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది.వెస్టిండీస్ అవుట్.. బంగ్లాదేశ్ క్వాలిఫైభారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు బంగ్లాదేశ్ అర్హత సాధించింది. పాకిస్తాన్లో జరుగుతున్న వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా బంగ్లాదేశ్ వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకుంది. లాహోర్‌లో శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రితూ మోని (48; 5 ఫోర్లు), ఫహీమా ఖాతూన్ (44 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ మహిళల జట్టు 39.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’మునీబా అలీ (93 బంతుల్లో 69; 8 ఫోర్లు), ఆలియా రియాజ్ (52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) సత్తాచాటారు.ఈ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన పాకిస్తాన్ 10 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలవగా... బంగ్లాదేశ్ జట్టు 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బంగ్లాదేశ్ రెండో ‘ప్లేస్’దక్కించుకుంది. వెస్టిండీస్ కూడా 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 ఓటములతో 6 పాయింట్లు సాధించినా... రన్‌రేట్‌లో స్వల్పంగా మెరుగ్గా ఉన్న బంగ్లాదేశ్ ముందంజ వేసింది. మాథ్యూస్ మెరుపులు వృథా... వెస్టిండీస్ మహిళల జట్టుకు నిరాశ తప్పలేదు. థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లో 10 ఓవర్లలో లక్ష్యఛేదన పూర్తిచేస్తే మెరుగైన రన్‌రేట్‌తో వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించే అవకాశం ఉండగా...ఐదు బంతుల తేడాతో అవకాశం కోల్పోయింది. ఆ జట్టు 10.5 ఓవర్లలో 168 పరుగులు చేసింది. మొదట థాయ్‌లాండ్ మహిళల జట్టు 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. నాథకన్ చాంతమ్ (66; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ 4, ఆలియా అలీనె 3 వికెట్లు పడగొట్టింది.అనంతరం ఛేదనలో విండీస్ 10.5 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెపె్టన్ హేలీ మాథ్యూస్ (29 బంతుల్లో 70; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... షినెల్ హెన్రీ (17 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టింది.మాథ్యూస్ మెరుపులతో కరీబియన్ జట్టు సునాయాసంగా గమ్యాన్ని చేరేలా కనిపించినా... కీలక సమయంలో ఆమె అవుట్ కావడం విండీస్ అవకాశాలను దెబ్బకొట్టింది. చివర్లో హెన్రీ విజృంభించినా... అది సాధ్యపడలేదు. లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 0.639 రన్‌రేట్‌తో నిలవగా... వెస్టిండీస్ 0.626తో నిలిచింది. అంటే 0.013 తేడాతో వెస్టిండీస్ వరల్డ్‌కప్ పోటీ నుంచి తప్పుకొంది. చదవండి: కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ

ఫైనల్లో అనాహత్, వీర్
కౌలాలంపూర్: ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్, వీర్ చోత్రాని ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఐదో సీడ్, 17 ఏళ్ల అనాహత్ 11–2, 11–7, 11–6తో హెలెన్ టాంగ్ (హాకాంగ్)పై విజయం సాధించింది. 21 నిమిషాల్లో ముగిసిన పోరులో అనాహత్... ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఐదు మ్యాచ్‌లు జరగగా... అన్నీట్లోనూ అనాహత్ విజయం సాధించడం విశేషం. ఆదివారం జరగనున్న ఫైనల్లో టోబీ ట్సె (హాంకాంగ్)తో అనాహత్ తలపడనుంది. భారత మరో ప్లేయర్, రెండో సీడ్ ఆకాంక్ష పరాజయం పాలైంది. ఆకాంక్ష 3–11, 10–12, 12–10, 8–11తో టోబీ ట్సె చేతిలో ఓడింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ వీర్ చోత్రాని కూడా ఫైనల్లో అడుగు పెట్టాడు. సెమీ ఫైనల్లో వీర్ చోత్రాని 11–7, 11–6, 7–11, 11–4తో ఎనిమిదో సీడ్ చి హిమ్ వాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ప్లేయర్లు మే 9 నుంచి 17 వరకు చికాగోలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధిస్తారు.
బిజినెస్

సెబీ కొత్త ప్రతిపాదన.. రీట్, ఇన్విట్లలో మరిన్ని పెట్టుబడులు!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పరిమితిని పెంచే ప్రతిపాదనను సెబీ ముందుకు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం అమలైతే అప్పుడు రీట్, ఇన్విట్లలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది.తద్వారా వీటిల్లో లిక్విడిటీ మరింత మెరుగుపడనుంది. ప్రస్తుతం ఒక ఫండ్ ఎన్ఏవీలో గరిష్టంగా 10 శాతం మేరే రీట్, ఇన్విట్లలో పెట్టుబడులకు అనుమతి ఉంది. ఇప్పుడు దీన్ని ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్స్‌కు 20 శాతానికి ప్రతిపాదించింది. మే 11 వరకు ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను తెలియజేయాలని సెబీ కోరింది. ఓఎన్డీసీ నెట్‌వర్క్‌లోకి యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ఫండ్స్లో పెట్టుబడులను సులభతరం చేసే దిశగా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో చేరినట్లు యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ వెల్లడించింది. దీనితో అంతగా ఆర్థిక సేవలు అందుబాటులో లేని, మారుమూల ప్రాంతాల్లోని వారు కూడా సరళతరంగా, తక్కువ వ్యయాలతో తమ ఫండ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుందని సంస్థ ఎండీ బి. గోప్‌కుమార్ తెలిపారు. తమ ప్లాట్‌ఫాంలో యాక్సిస్ ఎంఎఫ్ చేరడమనేది అందరికీ ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్య సాకారానికి తోడ్పడుతుందని ఓఎన్డీసీ ఎండీ టి. కోషి చెప్పారు.

అంచనాలు మించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్..
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అంచనాలను మించిన పనితీరు కనపర్చింది. స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 17,616 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ4లో నమోదైన రూ. 16,512 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 6.6 శాతం అధికం. తాజా క్యూ4లో నికర లాభం రూ. 17,072 కోట్లుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.సీక్వెన్షియల్ ప్రాతిపదికన లాభం 5.3 శాతం పెరిగింది. ఆదాయం రూ. 89,488 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2024–25) గాను రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై బ్యాంకు రూ. 22 డివిడెండ్ ప్రకటించింది. దీనికి జూన్ 27 రికార్డు తేదీగా ఉంటుంది. మరోవైపు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం సుమారు 6.8 శాతం పెరిగి రూ. 17,622 కోట్ల నుంచి రూ. 18,835 కోట్లకు చేరింది. 2025 మార్చి 31 నాటికి బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ రూ. 36.17 లక్షల కోట్ల నుంచి రూ. 39.10 లక్షల కోట్లకు చేరింది. పెరిగిన ఎన్పీఏలు.. 2024–25 క్యూ4లో స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి 1.33 శాతానికి చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన 1.24 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. అటు నికర ఎన్పీఏల నిష్పత్తి 0.33 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగింది. సీక్వెన్షియల్‌గా డిసెంబర్ క్వార్టర్లో నమోదైన 0.46 శాతం పోలిస్తే స్వల్పంగా తగ్గింది. పరిమాణంపరంగా చూస్తే స్థూల ఎన్పీఏలు రూ. 31,173 కోట్ల నుంచి రూ. 35,223 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్‌గా రూ. 36,019 కోట్ల నుంచి తగ్గాయి.వడ్డీ ఆదాయం 10 శాతం వృద్ధి.. » నికర వడ్డీ ఆదాయం నాలుగో త్రైమాసికంలో రూ. 29,080 కోట్ల నుంచి సుమారు 10 శాతం పెరిగి రూ. 32,070 కోట్లకు పెరిగింది. డిసెంబర్ క్వార్టర్లో నికర వడ్డీ ఆదాయం రూ. 30,650 కోట్లుగా నమోదైంది. » ఇక నికర వడ్డీ మార్జిన్ 3.54%గా నిల్చింది. ఆదాయ పన్ను రీఫండ్‌కి సంబంధించిన రూ. 700 కోట్ల వడ్డీని మినహాయిస్తే, నికర వడ్డీ మార్జిన్ 3.46%గా ఉంది. » సమీక్షాకాలంలో ఫీజుల రూపంలో రూ. 8,530 కోట్లు, విదేశీ మారకం .. డెరివేటివ్స్ ఆదా యం కింద రూ. 1,440 కోట్లు, నికర ట్రేడింగ్.. మార్క్‌టు మార్కెట్ ఆదాయం కింద రూ. 390 కోట్లు, ఇతరత్రా రికవరీల రూపంలో రూ. 1,670 కోట్లు వచ్చాయి. డిపాజిట్లు 16 శాతం అప్ .. » నాలుగో త్రైమాసికంలో బ్యాంకు డిపాజిట్లు సగటున సుమారు 16 శాతం పెరిగి రూ. 25.28 కోట్లకు చేరాయి. క్రితం క్యూ4లో ఇది రూ. 21.84 లక్షల కోట్లుగాను, అంతక్రితం క్వార్టర్లో రూ. 24.53 లక్షల కోట్లుగాను నమోదైంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన బ్యాంక్ డిపాజిట్లు సగటున 3.1 శాతం పెరిగాయి. కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) డిపాజిట్లు రూ. 7.85 లక్షల కోట్ల నుంచి సుమారు 6 శాతం వృద్ధితో రూ. 8.3 లక్షల కోట్లకు చేరాయి. మార్చి 31 నాటికి మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల వాటా 34.8 శాతంగా ఉంది. » రుణాలు 5.4 శాతం వృద్ధితో రూ. 26.44 లక్షల కోట్లకు చేరాయి. రిటైల్ రుణాలు 9 శాతం, కమర్షియల్ .. గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు 12.8 శాతం పెరగ్గా, కార్పొరేట్.. ఇతరత్రా హోల్‌సేల్ రుణాలు 3.6 శాతం తగ్గాయి.

మూడేళ్లలో జర్మనీ, జపాన్ను అధిగమిస్తాం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే మూడేళ్లలో జర్మనీ, జపాన్‌లను అధిగమిస్తుందనని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం అన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచానికి విద్యా కేంద్రంగా భారత్ ఎదుగుతుందన్నారు. మిగతావన్నీ పక్కన పెడితే, భారత్‌కు ఉన్న అతిపెద్ద సానుకూలత ప్రజాస్వామ్యంగా పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే ఏడాది చివరికి నాలుగో స్థానానికి చేరుకుంటాం. ఆ తర్వాతి సంవత్సరంలో మూడో స్థానాన్ని సాధిస్తాం’’అని సుబ్రమణ్యం చెప్పారు. ఐఎంఎఫ్ తాజా డేటా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. భారత కంపెనీలు, న్యాయ సేవల సంస్థలు, అకౌంటింగ్ సంస్థలు ప్రపంచ దిగ్గజాలుగా ఎదిగే ఆకాంక్షలతో పనిచేయాలని సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. తక్కువ ఆదాయ దేశాల్లోని సమస్యలతో పోల్చితే మధ్యాదాయ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవిగా పేర్కొన్నారు. ప్రపంచానికి పనిచేసే కారి్మక శక్తిని భారత్ అందిస్తున్నట్టు చెప్పారు. జపాన్ 15వేల మంది భారత నర్సులను తీసుకుంటే, జర్మనీ 20వేల మంది హెల్త్‌కేర్ సిబ్బందిని నియమించుకున్నట్టు గుర్తు చేశారు. వారిదగ్గర కుటుంబ వ్యవస్థ ముక్కలైనట్టు వ్యాఖ్యానించారు.

మార్చిలో జోరుగా పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు మార్చిలో గణనీయంగా పెరిగాయి. ఏకంగా 192 శాతం అధికంగా 4.47 బిలియన్ డాలర్ల (రూ.38వేల కోట్లు సుమారు) విలువైన పసిడి దిగుమతి అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024 మార్చి నెలలో దిగుమతులు 1.53 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే బంగారం దిగుమతుల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. విలువ పరంగా వృద్ధి కనిపించగా, పరిమాణం పరంగా పసిడి దిగుమతులు తగ్గాయి. బంగారం దిగుమతులు 2023–24తో పోల్చి చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా 27 శాతం ఎగసి 58 బిలియన్ డాలర్లకు (రూ.4.99 లక్షల కోట్లు సుమారు) చేరాయి. 2023–24 సంవత్సరంలో పసిడి దిగుమతులు 45.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పరిమాణం పరంగా 757.15 టన్నుల బంగారం గత ఆర్థిక సంవత్సరంలో దిగుమతి అయింది.2023–24లో ఇది 795.32 టన్నులుగా ఉండడం గమనించొచ్చు. దిగుమతి పరిమాణం తగ్గినప్పటికీ ధరల పెరుగుదలతో విలువ పరంగా వృద్ధి నమోదైంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 62 శాతం తగ్గగా (విలువ పరంగా), జనవరిలో 41 శాతం, 2024 డిసెంబర్లో 55 శాతం చొప్పున పెరిగాయి. సురక్షిత సాధనంగా బంగారాన్ని పరిగణిస్తూ పెట్టుబడులు పెట్టే ధోరణి పెరగడం దిగుమతులకు మద్దతుగా నిలిచినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో అనిశ్చితులు పెరిగిపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. వాణిజ్య లోటుకు ఆజ్యం బంగారం దిగుమతుల విలువ పెరగడం దేశ వాణిజ్య లోటు పెరిగేందుకు దారితీసింది. మార్చి నెలలో వాణిజ్య లోటు 21.54 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 283 బిలియన్ డాలర్ల లోటుతో ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకడం గమనార్హం.
ఫ్యామిలీ

అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవో
ఈ రోజు కష్టాలున్నాయని కుంగిపోకూడదు. చీకటి వెనుకే వెలుగు ఉంటుంది. ఈ ఆశావహదృక్పథమే మనిషిని నడిస్తుంది. భవిష్యత్‌పై ఆశను పెంచుతుంది. ఆత్మవిశ్వానికి మనో ధైర్యాన్ని జోడించి ముందుకు అడుగేయాలి. అప్పుడే మన పట్టుదలకు, కష్టానికి విజయం దాసోహమంటుంది. రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ సక్సెస్ గురించి తెలుసుకుంటే.. ఈ మాటలు అక్షర సత్యాల నిపించక మానవు. 9వ తరగతిలో న చదువు మానేసి, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోగా రాణిస్తూ, ప్రధానిమోదీ చేతులు మీదుగా సత్కారాన్ని అందుకున్న మహిళ గురించి తెలుసుకుందా రండి!రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లాకి చెందిన రుక్మిణి కటారా 13 ఏళ్ల వయసులో వివాహం చేశారు పెద్దలు. అప్పటికి మద్వా ఖపర్దా అనే చిన్న గ్రామంలో ఆమె తొమ్మిదో తరగతి చదువుకుంటోంది. పెళ్లి తరువాత చదువుకు బ్రేక్ పడింది. కుటుంబం గడవడం కోసం దినసరి కూలీగా పనిచేసింది. NREGA ద్వారా వచ్చే జీతమే వారికి ఆధారం. కానీ రాజస్థాన్ గ్రామీణ ఆజీవిక వికాస్ పరిషత్ (రాజీవిక) పథకం ఆమె జీవితంలో మార్పునకు నాంది పలికింది. ఈ పథకం కింద స్వయం సహాయక బృందంలో చేరి, ఆమె సౌర దీపాలు , ప్లేట్లను(Solar lamps and Plates) ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంది. శ్రద్ధ పెట్టి, ఈ పనిలో నైపుణ్యం సాధించింది. ఆ తరువాత దుర్గా ఎనర్జీ (దుంగార్పూర్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్)కంపెనీని స్థాపించింది. ఒక గిరిజన మహిళగా తాను సాధికారత సాధించడమే కాదు, తనలాంటి ఎందరో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించింది. కంపెనీ ఐదేళ్ల కాలంలో రూ. 3.5 కోట్లకు పైగా టర్నోవర్ సాధించింది. కంపెనీ సీఈవోగా రుక్మిణి మరో 50 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. తనలాంటి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ కృషికి గాను ఆమెకు జాతీయ గుర్తింపు కూడా లభించింది. 2016లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో రుక్మిణిని సత్కరించారు.ఇదీ చదవండి: ఫ్యాషన్‌లో తండ్రికి తగ్గట్టే : రూ 1.4 కోట్ల వాచ్‌తో మెరిసిన బ్యూటీతక్కువ చదువుకుంటే ఏంటి? "మహిళలు పెద్దగా చదువుకోలేదని, విద్య తక్కువ అని ఎప్పుడూ తమను తాము తక్కువగా అనుకోకూడదు. తక్కువ విద్యతో కూడా ఎదగవచ్చు. నేను తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. కానీ నేడు నేను ఒక కంపెనీ యజమానిని. నాలాగే ఇతర మహిళలు ఇలా ఎందుకు చేయకూడదు?” అంటుందామె సగర్వంగా. ఇతరులకు స్ఫూర్తినివ్వాలనే ఆమె ఆత్మవిశ్వాసం, సంకల్పం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఇపుడు భర్త కమలేష్‌తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు: రాకేష్, ఆశా, ప్రవీణ్ ,యువరాజ్. అందర్నీ ఉన్నత చదువులను చదివిస్తోంది.చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి

ఫ్యాషన్‌లో తండ్రికి తగ్గట్టే : రూ 1.4 కోట్ల వాచ్‌తో మెరిసిన బ్యూటీ
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కమార్తె సుహానా ఖానా మరో సారి తన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే నటించిన తాజా చిత్రం కేసరి చాప్టర్ 2, ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది.అంతకుముందు (ఏప్రిల్ 17న) ఈ చిత్ర నిర్మాతలు ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా తన స్నేహితురాలు నటి అనన్య పాండేకు సపోర్ట్‌గా ఈవెంట్‌కు విచ్చేసింది సుహానా. ఆఫ్-షోల్డర్ ఫ్లోవీ బ్లాక్ డ్రెస్, బ్లాక్ హీల్స్‌తో దృష్టిని ఆకర్షించింది, అంతేకాదు కోట్ల విలువైన వాచ్‌ను కూడా ధరించడం హాట్ టాపిక్‌గా నిలిచింది.తండ్రిలాగే సుహానాకు కూడా ప్రీమియం వాచీలంటే చాలా ఇష్టమట. జోయా అక్తర్ 2023 చిత్రం ది ఆర్చీస్తో అరంగేట్రం చేసిన సుహానా ఖాన్ ఇటీవల కేసరి 2 ప్రీమియర్‌లో రూ. 1.4 కోట్ల విలువైన అల్ట్రా లగ్జరీ వాచ్ ధరించి కనిపించింది. రెవర్సో ట్రిబ్యూట్ డ్యూఫేస్ టూర్బిలియన్ ( Jaeger-LeCoultre Reverso Tribute Duoface Tourbillon) దీంతో ఇది ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. సస్టైనబుల్ ఫ్యాషన్‌ను సమర్ధించే సుహానా ఈ వాచ్ ధరించి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఖుషీ కపూర్ , ఇబ్రహీం అలీ ఖాన్నాదానియన్ ప్రీమియర్‌లో కూడా ఇదే వాచ్‌ను ధరించింది. దుస్తులను పునరావృతం చేయడానికి అభ్యంతరం చెప్పదు. అనంత్ అంబానీ వివాహానికి కూడా అదే చేసింది. మనీష్ మల్హోత్రా దీపావళి వేడుకకు తాను గతంలో ధరించిన దుస్తులనే ధరించింది. ముఖ్యంగా జాతీయ అవార్డును అందుకోవడానికి అలియా తన పెళ్లి చీరను మళ్లీ ధరించిడం తనన ఆకట్టుకుందని చెప్పుకొచ్చిందీ స్టార్కిడ్.ఇక సుహానా కరియర్ విషయానికి వస్తే ఆర్చీస్ తర్వాత తండ్రి మూవీ కింగ్‌లో నటిస్తోంది. 20 ఏళ్ళ తరువాత సిద్ధార్థ్ ఆనంద్ షారూక్‌తో మూవీ ప్రకటించాడు. జవాన్ , పఠాన్ చిత్రాల అద్భుతమైన విజయం తర్వాత షారుఖ్ ఖాన్ తదుపరి పెద్ద ప్రాజెక్ట్ కింగ్. ఈ యాక్షన్ డ్రామాలో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ , దీపికా పదుకొనే అతిధి పాత్రలో నటిస్తున్నారు.కాగా సుహానా తండ్రి షారుఖ్ ఖాన్ దగ్గర విలాసవంతమైన గడియారాల కలెక్షన్ ఉంది. 2024లో, అతను రూ.4.2 కోట్ల విలువైన ఆడెమర్స్ పిగ్యుట్ వాచ్ ధరించి ఫ్యాన్స్‌ను ఆకర్షించాడు. అతను రూ.1.1 కోట్లకు పైగా విలువైన పటేక్ ఫిలిప్ ,రూ.6 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె టూర్బిలియన్ కూడావాచ్ కూడా ఉంది.

అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
చెట్టంత ఎదిగిన పిల్లలకు వేడుకగా పెళ్లి చేయాలని భావిస్తారు ఏ తల్లిదండ్రులైనా. అలాగే కనిపెంచిన అమ్మానాన్నల కనుల విందుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి ఆశిస్తారు ఏ బిడ్డలైనా. కానీ కన్నకొడుకు మూడు ముళ్ల ముచ్చట చూడాలన్న కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పుట్టెడు దుఃఖ్ఖంతో కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురి చేత కంట తడి పెట్టిస్తోంది.Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov— Thanthi TV (@ThanthiTV) April 18, 2025తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. దీంతో తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వధూవురులతోపాటు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగిన ఈ పెళ్లి తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తన తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. బోరున విలపిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం అక్కడున్నవారినందరి హృదయాలను బద్దలు చేసింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ బంధువులు, స్థానికులు కూడా వారిని ఆశీర్వదించారు.ఇదీ చదవండి:అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు లా కోర్సు చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ ప్రేమ సంగతిని ఇంట్లోని పెద్దలతో చెప్పారు. ఇరు కుటుంబాల అనుమతితో త్వరలోనే పెళ్లి చేసుకోవాలను కున్నారు. విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయశాంతి డిగ్రీ చదువుతోంది. చదువు పూర్తైన తరువాత వివాహంచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..అన్నట్టు విధి మరోలా ఉంది. అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో అనూహ్యంగా కాలం చేశాడు. దీంతో గుండె పగిలిన అప్పు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తగ్గినా.. పెరిగినా.. అనారోగ్యమే..
వస్తువుల్ని తూకమేసి అమ్మడం తెలిసిందే.. కానీ కొలత వేసి తినడం ఇప్పుడు సిటీజనులు అలవాటు చేసుకుంటున్నారు. సుషు్టగా తినడానికి బోలెడన్ని అవకాశాలున్నా వాటిని సరిగ్గా జీరి్ణంచుకునేందుకు తగిన శారీరక శ్రమ లేని నేపథ్యంలో నగరవాసుల ‘పొట్ట’తిప్పలు కొత్త దారి పట్టాయి. అవసరాన్ని మించిన ఆహారం ఆరోగ్యానికి చేటు అని గుర్తిస్తూ.. తింటున్న ఆహారాన్ని కొలిచే పనిలో పడ్డారు. వీరికి నగరంలో చెఫ్‌లు, న్యూట్రిషనిస్ట్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన తరగతులు ఉపకరిస్తున్నాయి. ఎంత వరకూ యాప్్ట? పలు యాప్స్ సిటీజనుల ఆహారపు అలవాట్లను పర్యవేక్షిస్తున్నాయి. తింటున్న ఆహారం ద్వారా వారికి అందుతున్న కేలరీలను అవి ఖర్చవుతున్న తీరూ చెబుతున్నాయి. అయితే కొన్ని యాప్స్ అమెరికన్/విదేశాల ఫుడ్ వాల్యూస్‌తో తయారైనవి కాబట్టి మనకి అవి పూర్తిగా కరెక్టా కాదా? అనేది ఖచి్చతంగా చెప్పలేమని న్యూట్రిషనిస్ట్‌లు అంటున్నారు. మెనూలోనూ సమాచారం.. నగరంలోని పలు స్టార్ హోటల్స్, టాప్‌క్లాస్ రెస్టారెంట్లు తమ వంటకాల మెనూలోనే కేలరీల సమాచారాన్ని కూడా పొందుపరుస్తున్నాయి. రెస్టారెంట్స్‌లో తినడం అనే అలవాటు నగరాల్లో పెరిగిపోయిన నేపథ్యంలో 2022లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ(ఎఫ్ఎస్ఎస్ఎఐ) రెస్టారెంట్లు తమ మెనూలోని వంటకాలు అందించే కేలరీల గణనను తప్పనిసరిగా పేర్కొనాలని ఆదేశించింది. దాంతో పలు స్టార్ హోటల్స్ ఈ ఆదేశాలను పాటిస్తుండటం వల్ల నగరవాసులకు తాము తీసుకుంటున్న ఆహారం అందించే కేలరీలపై అవగాహన ఏర్పడుతోంది. కేలరీస్.. కేర్‌ఫుల్ ప్లీజ్.. అధిక కేలరీల వల్ల ఊబకాయం, డయాబెటిస్, కేన్సర్ తదితర వ్యాధులకు దారితీస్తుంది. తగినంత కేలరీలు పొందకపోవడం పోషకాహార లోపం, అలసట, కండరాల నష్టం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. అంటువ్యాధులు, ఆందోళన ఏకాగ్రత లోపం పెంచుతుంది. అధిక కేలరీల భారం లేకుండా కీలకమైన పోషకాలను అందించే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు తృణధాన్యాలు వంటి పూర్తి, ప్రాసెస్ చేయని ఆహారాలను తీసుకోవాలి. తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఆహారాన్ని ప్రోత్సహించడానికి చిన్న ప్లేట్లు గిన్నెలను ఉపయోగించడం ద్వారా అతిగా తినడం తగ్గించాలి. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ సాధారణంగా పోషకాలు లేనివిగా, అధిక కేలరీలు కలిగి ఉంటాయి. అటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాలను ఎంచుకోవాలి. ప్రతి భోజనం నిదానంగా చేయాలి.. నెమ్మదిగా నమలాలి, ప్రతి బైట్‌ను ఆస్వాదించడానికి పరధ్యానాన్ని వదలాలి. రెగ్యులర్ శారీరక శ్రమ శక్తిని ఖర్చు చేయడం ద్వారా కేలరీలను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల మితమైన–తీవ్రతతో వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.రుచికన్నా మన శరీరానికి కలిగే లాభం మిన్న అనే ఆరోగ్య స్పృహ నగరవాసుల్లో బాగా పెరిగిందని నగరానికి చెందిన చెఫ్ కుమార్ అంటున్నారు. గతంలో అత్యంత రుచికరమైన వంటలు ఎలా చేయాలో అడిగిన మహిళలు ఇప్పుడు పోషక విలువలతో కూడిన ఆహారం గురించి అడుగుతున్నారని చెప్పారు. తరచూ తాము నిర్వహిస్తున్న స్మార్ట్ స్నాకింగ్ సెషన్స్‌లో ఒక్కోసారి ఒక్కో దినుసుతో ఆరోగ్యకరమైన వంటలు ఎలా చేయాలో నేర్పుతున్నామని, ఈ క్లాసెస్‌కి ఆదరణ బాగుందన్నారు. అవగాహన తరగతులూ షురూ.. ‘బాదం పప్పులు రోజువారీగా ఆహారంలో తీసుకోవడం మంచిది. కేవలం 4 పప్పులు తీసుకుంటే 29గ్రాముల ప్రొటీన్, 15 గ్రాముల కార్బొహైడ్రేట్స్, 322 మి.గ్రా కాల్షియం, 987 మి.గ్రా పొటాíÙయం, 322 మి.గ్రా కాల్షియం, 16.2 మి.గ్రా పీచు పదార్థాలు, 460 మి.గ్రా సోడియం.. వగైరాలు లభిస్తాయి’.. శ్రీనగర్‌కాలనీలో తన కుమార్తెకు వివరంగా చెబుతున్న మధ్యవయస్కురాలైన సుగుణ ఇటీవల తాజ్ డెక్కన్ హోటల్లో ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోరి్నయా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరవడం ద్వారా ఇలాంటి విషయాలు తెలుసుకోగలిగారు. ఇదేవిధంగా నగరానికి చెందిన మరి కొందరు గృహిణులు సైతం పోషకాహారంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఆచి తూచి.. ఆలోచించి..ఆహారం మీద సిటిజనుల్లో అవగాహన పెరగడం మంచి పరిణామమే. కానీ ఇంకా చాలా విషయాల్లో సరిపడా లేదనే చెప్పాలి. ఉదాహరణకు టీలు, కాఫీలు తాగితే ఏమీ కాదనుకుంటారు. కానీ టీ లేదా కాఫీ కూడా రోజుకి 2 కప్పులు మించకూడదు. దానిలో ఉండే పంచదార, పాలు కేలరీలను పెద్ద సంఖ్యలోనే జమ చేస్తాయి. అలాగే ఆల్కహాల్ తాగితే ద్రవమే కదా కేలరీలు రావనుకుంటారు. కానీ 1ఎం.ఎల్ఆల్కహాల్తో 7 కేలరీలు వస్తాయి. దానికి తోడు మంచింగ్ పేరుతో స్నాక్స్ అవీ జత చేస్తే మరింత హాని కలుగుతుంది. ఒకటే ఆహార పదార్థం ఇంట్లో వండిన దానికి బయట కొన్న దానికి కేలరీల్లో చాలా తేడా ఉంటుంది. బయట వండేవారు రుచి కోసం కలిపే నూనెలు, ఉప్పులు, దినుసుల వల్ల ఆ తేడా వస్తుంది. కూల్ డ్రింక్స్ కూడా అధికంగా కేలరీలను అందిస్తాయి. సగటున ఒక వ్యక్తి 1800 నుంచి 2200 వరకూ కేలరీలను తీసుకోవచ్చు. అయితే శారీరక శ్రమ, చేసే పని బట్టి ఇందులో కొద్దిగా మార్పు చేర్పులు ఉంటాయి. జాగ్రత్త పడినా బరువు పెరుగుతున్నామంటే మనం పాటిస్తున్న, అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లలో లోపం ఉన్నట్లే భావించి తగిన వైద్య సలహా తీసుకోవాలి. – డా.జానకి, న్యూట్రిషనిస్ట్
ఫొటోలు


హైదరాబాద్ : గచ్చిబౌలిలో తారల సందడి (ఫొటోలు)


ఆస్ట్రేలియాలో చిల్ అవుతోన్న సచిన్ కూతురు సారా టెండూల్కర్ (ఫోటోలు)


చిచ్చరపిడుగు.. సిక్సర్‌తో ఆగమనం! తగ్గేదేలే.. (ఫొటోలు)


ఇటలీ కుర్రాడితో హీరో అర్జున్ కూతురి నిశ్చితార్థం (ఫొటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 20-27)


కేజీఎఫ్ బ్యూటీ చేతిలో చంటిపాప.. మనసు నిండిపోయిందంటూ..


తిరుమలలో సమంత సహా పలువురు సెలబ్రిటీలు (ఫోటోలు)


దిల్‌రాజు బ్యానర్ 'ఆకాశం దాటి వస్తావా' సెట్స్‌లో ధనశ్రీ వర్మ (ఫోటోలు)


రెడ్ రోజ్ డ్రెస్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బ్యూటీ మీనాక్షి చౌదరి


రెట్రో లుక్‌లో వింటేజ్ గర్ల్ 'పూజా హెగ్డే' లుక్స్ (ఫోటోలు)
అంతర్జాతీయం

తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
కెనడాలో ఓ భారతీయ విద్యార్థి(Indian Student)ని అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న టైంలో ఎక్కడి నుంచో ఆమెపైకి ఓ తూటా దూసుకొచ్చి ఛాతిలో దిగింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన భారతీయ కాన్సులేట్ జనరల్.. ఎక్స్ ద్వారా వివరాలు తెలియజేసింది.హోమిల్టన్లోని మోహాక్ కాలేజీలో చదువుతున్న హర్సిమ్రత్ రంధవా(21).. బుధవారం సాయంత్రం 7.30గం. ప్రాంతంలో బస్టాప్‌లో వేచి ఉంది. ఆ సమయంలో అక్కడికి కాస్త దూరంలో రెండు కార్లు ఆగి ఉన్నాయి. ఉన్నట్లుండి వాటిల్లో ఉన్న వ్యక్తులు తుపాకులతో పరస్పరం కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ తుటా హర్సిమ్రత్ రంధవా(Harsimrat Randhawa) శరీరంలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే.. We are deeply saddened by the tragic death of Indian student Harsimrat Randhawa in Hamilton, Ontario. As per local police, she was an innocent victim, fatally struck by a stray bullet during a shooting incident involving two vehicles. A homicide investigation is currently…— IndiainToronto (@IndiainToronto) April 18, 2025ఛాతీలో బుల్లెట్ దిగడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగిందని, ఆస్పత్రికి తరలించేలోపే ఆమె కన్నుమూసిందని వైద్యులు వెల్లడించారు. కాల్పుల సమయంలో పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని, అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం జరగలేదని హామిల్టన్ పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వివరాలు సేకరించిన అధికారులు.. దర్యాప్తునకు సహకరించాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

వంట కోసం బోటులో పొయ్యి వెలిగించిన మహిళ
మధ్య ఆఫ్రికా దేశం కాంగో(Democratic Republic of the Congo)లో ఘోరం జరిగింది. ప్రయాణికులతో నదిలో వెళ్తున్న ఓ భారీ బోటు అగ్నిప్రమాదానికి గురి కాగా.. 150 మందికి పైగా మృతి చెందారు. మరో వంద మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో బోటులో 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాంగో నార్త్‌వెస్ట్ రీజియన్‌లోని మటాన్‌కుము పోర్టు నుంచి బోలోంబా వైపు.. మంగళవారం వందల మందితో కూడిన భారీ చెక్కబోటు ‘హెచ్‌బీ కాంగోలో’ బయల్దేరింది. అయితే కాంగో నది మధ్యలోకి వెళ్లగానే హఠాత్తుగా బోటులో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయాణికుల్లో చాలామంది నీళ్లలోకి దూకేశారు. ఈత కొందరు కొందరు నీట మునిగి చనిపోగా.. మరికొందరు అగ్నికి ఆహుతి అయ్యారు. చెల్లాచెదురైన మరో వంద మందికి పైగా జాడ తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన వాళ్లకు ప్రస్తుతం చికిత్స అందుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్మయం కలిగించే విషయం ఒకటి తెలిసిందే. ప్రయాణికుల్లో ఓ మహిళ వంట చేసేందుకు ప్రయత్నించగా.. మంటలు చెలరేగినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సదరు మహిళ గ్యాస్ స్టౌవ్ అంటించగానే.. పేలుడు సంభవించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె అగ్నికి ఆహుతై అక్కడికక్కడే మరణించింది. ఇక.. కాంగోలో బోటు ప్రమాదాలు షరా మాములుగా మారిపోయాయి. At Least 148 Dead After Overcrowded Boat Capsizes In Congo@nitingokhale @SuryaGangadha13 @amitabhprevi @s_jkr #Congo #Africa https://t.co/em5A5kUqQZ— StratNewsGlobal (@StratNewsGlobal) April 19, 2025పాతవి, పాడైపోయిన పడవలను ప్రయాణాలకు వినియోగించడం, సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో కూడిన పడవ ప్రయాణాలే అందుకు కారణాలు. దీనికి తోడు ప్రయాణికుల భద్రత గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా బోటు నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కిందటి ఏడాదిలో కాంగో వ్యాప్తంగా జరిగిన వేర్వేరు బోటు ప్రమాదాల్లో 400 మందికి పైనే మరణించారు.

డౌట్ అక్కర్లేదు.. ఇవి సింహాలే..
ఎండాకాలం ఎఫెక్ట్ మరి.. దక్షిణాఫ్రికాలోని యుకుటులా రిజర్వ్ పార్క్‌లో జెడ్ నెల్సన్ అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశారు. 2025 సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ పురస్కారాల్లో ఈ చిత్రం వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ విభాగంలో మొదటి బహుమతిని గెలుచుకుంది. ఈ లయన్ రిజర్వులో శిక్షణ పొందిన గైడ్ల సాయంతో మనం సింహాలకు చాలా దగ్గరగా వెళ్లొచ్చు. వాటి జీవనశైలిని గమనించవచ్చు.రోమ్‌లో వాన్స్, మెలోనీ టారిఫ్ చర్చలురోమ్: టారిఫ్‌లపై అమెరికా–ఇటలీల మధ్య జరుగుతున్న చర్చల వేదిక రోమ్కు మారింది. శుక్రవారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోనీతో సమావేశమయ్యారు, ప్రధాని కార్యాలయం ఛిగి ప్యాలెస్‌లో వీరు చర్చలు జరిపారు. అనంతరం, వైట్ హౌస్, మెలోనీ కార్యాలయం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అతిత్వరలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటలీని సందర్శించనున్నారని ఆ ప్రకటన తెలిపింది.ఆ సమయంలోనే అమెరికా– యూరప్ మధ్య చర్చలు జరపాలనే విషయం పరిశీలనలో ఉందని కూడా పేర్కొంది. గురువారం వైట్ హౌస్‌లో చర్చల సందర్భంగా మెలోనీ పక్కనే కూర్చున్న ట్రంప్.. వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తాము తొందరపడటం లేదని తెలిపారు. యూరప్‌తోపాటు మధ్యధరా ప్రాంతంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా ఇటలీ ఉంటుందని భావిస్తున్నామని మెలోనీ పేర్కొన్నారు. వాన్స్‌తో జరుగుతున్న చర్చల్లో సుదీర్ఘకాలం మైత్రి మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ సోదరీమణుల అరెస్టు రావల్పిండీ: జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని 72 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన సోదరీమణులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ప్రతి మంగళ, గురువారాల్లో కుటుంబీకులు, లాయర్ల బృందం ఆయన్ను కలుస్తారు. గురువారం వెళ్లిన ఇమ్రాన్ సోదరీమణులు అలీమా, ఉజ్మా, నొరీన్తో పాటు పీటీఐ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వెనక్కు వెళ్లాలని కోరారు. వారు నిరాకరించడంతో ఘర్షణ నెలకొంది. వారిని అరెస్టు చేసి జైలుకు దూరంగా విడిచిపెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.అడియాలా జైలు బయట పీటీఐ నేతలను అరెస్టు చేయడం ఈ వారంలో ఇది రెండోసారి. వీటిని పార్టీ ఖండించింది. బలమైన ప్రజా ప్రతిస్పందన తప్పదని హెచ్చరించింది. ఇంగ్లండ్‌లో ఉంటున్న తన పిల్లలతో మాట్లాడేందుకు, వైద్య పరీక్షలకు ఇమ్రాన్ పెట్టుకున్న పిటిషన్లను పాక్ కోర్టు ఇటీవలే అనుమతించింది.

యూరప్ ‘మండుతోంది’
ఇప్పటికే నానా సమస్యలతో సతమతమవుతున్న యూరప్ ఖండం పరిస్థితి సమీప భవిష్యత్తులో పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారనుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు! అది పర్యావరణ మార్పుల ప్రభావానికి అత్యంత ఎక్కువగా లోనవుతుండటమే కారణం. దాంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండంగా యూరప్ నిలిచింది. అంతేగాక వరదల దెబ్బకు ఆ ఖండంలో ఏకంగా 30 శాతం నదుల నెట్వర్క్ బాగా దెబ్బతింది. అక్కడ వాతావరణం ఎప్పుడెలా మారుతుందో ఎవరూ చెప్పలేనంత అస్థిరంగా మారిపోయింది. ఫలితంగా యూరప్‌కు సమీప భవిష్యత్తులో నానారకాలైన ప్రాకృతిక విపత్తులు పొంచి ఉన్నట్టు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ‘‘వాటిని నివారించాలంటే యూరప్ దేశాలన్నీ ఒక్కతాటిపైకి తక్షణం ఒక్కతాటిపైకి రావాలి. ఇప్పటినుంచే సమగ్ర పర్యావరణ పరిరక్షణ విధానాలు రూపొందించాలి. అంతకంటే ముఖ్యంగా వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి. లేదంటే పెను ముప్పు తప్పదు’’అని వారు కుండబద్దలు కొట్టారు. నిత్యం ఉత్పాతాలే: యూరప్‌లో పలు దేశాల్లో ఆకస్మిక వరదలు, కనీవినీ ఎరగని ఎండలు, వడగాడ్పులు కొన్నేళ్లుగా పరిపాటిగా మారిపోయాయి. గతేడాది యూరప్‌వ్యాప్తంగా చాలా దేశాలను వరదలు తీవ్రంగా వణికించడం తెలిసిందే. పశ్చిమ యూరప్‌ను గత పదేళ్లుగా 1950ల నుంచీ ఎన్నడూ చూడనన్ని వరదలు అతలాకుతలం చేశాయి. దక్షిణ యూరప్‌లో వరుసగా 13 రోజుల పాటు కనీవినీ ఎరగనంతటి వడగాడ్పులు వణించింయా. స్కాండినేవియాలో గ్లేసియర్లు కొన్నేళ్లుగా శరవేగంగా కరిగిపోతున్నాయి. తూర్పు యూరప్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. యూరప్‌లోని నదుల్లో 30 శాతానికి పైగా గరిష్ట వరద స్థాయిని దాటిపోయాయి. ఒక్క 2024లోనే 12 శాతం నదులు తీవ్ర వరద స్థాయిలను దాటి నగరాల్లోకి పొంగిపొర్లాయి. ఫలితంగా గత అక్టోబర్‌లో ఒక్క వాలెన్సియా నగరంలోనే 232 మంది వరదలకు బలయ్యారు. గత సెప్టెంబర్‌లో బోరిస్ తుఫాను మధ్య యూరప్ దేశాల్లో అతి భారీ వానలకు కారణమైంది. ఇవన్నీ యాదృచ్చికమేమీ కాదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదంతా రెండు దశాబ్దాలకు పైగా పర్యావరణంతో యథేచ్ఛగా చెలగాటమాడుతూ వచ్చిన ఫలితమని వారంటున్నారు. యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపరి్నకస్ క్లైమేట్ చేంజ్ సరీ్వస్, ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ)సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో సైంటిస్టులు ఈ మేరకు పేర్కొన్నారు. గతేడాది వరదలకు యూరప్‌లో చాలాదేశాల్లో తీవ్ర విధ్వంసానికి, వినాశనానికి దారితీశాయి. వాటి దెబ్బకు 4 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. 335 మంది మరణించారు. యూరప్ చరిత్రలోనే కనీవినీ ఎరగని పరిణామమిది. వరదల నష్టం రూ.1.62 లక్షల కోట్ల పై చిలుకేనని అంచనా. ‘‘ఉష్ణోగ్రతలపరంగా యూరప్ ఇప్పటికే నిప్పుల కుంపటిపై కూచుని ఉన్నట్టు లెక్క. ఇకనుంచి పెరిగి ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రతా ఆ ఖండం మొత్తాన్నీ వినాశనం వైపు నెడుతుంది’’అని డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యదర్శి సెలెస్టీ సావ్లో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యూరప్ దిద్దుబాట పట్టింది. 2024లో ఖండంలో ఉత్పత్తయిన మొత్తం ఇంధనంలో సంప్రదాయేతర వనరుల వాటా 45 శాతానికి పెరిగింది. చాలా నగరాలు పర్యావరణ మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

6 గంటల నిద్ర, 2 గంటల వ్యాయామం
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ఆరోగ్య రహస్యాన్ని వివరించారు. సరైన ఆహారం, రోజులో ఆరు గంటల నిద్ర, రెండు గంటలపాటు వ్యాయామం అనే సూత్రాలను తు.చ. తప్పక పాటించడం వల్లే ఫిట్‌గా ఉన్నట్లు వెల్లడించారు. లివర్ డే సందర్భంగా శనివారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్‌లో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. 2020 నుంచి పాటిస్తున్న ఆరోగ్య సూత్రాల వల్లే బరువు తగ్గానన్నారు. ‘కంటి నిండా నిద్ర, నీరు, సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం అనే నియమాలను పాటిస్తున్నా. వీటి ఫలితంగానే ఎలాంటి ఇంగ్లిష్ మందులను వాడాల్సిన అవసరం నాకు ఇప్పటివరకు రాలేదు. డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడలేదు’అని ఆయన వివరించారు. నేటి యువతరం కూడా ఇటువంటి నియమాలను పాటించి, మరో 40–50 ఏళ్ల ఆయుర్దాయం పెంచుకోవాలని, దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘శారీరక ఆరోగ్యం కోసం రోజులో రెండు గంటలను వ్యాయామం కోసం కేటాయించండి, మెదడు ఆరోగ్యం కోసం ఆరుగంటలపాటు నిద్రపోండి. ఇది చాలా అవసరం. ఇదే నా అనుభవం’అని ఆయన పేర్కొన్నారు. అనంతరం, అమిత్ షా పాటిస్తున్న ఆరోగ్య సూత్రాలను ప్రధాని మోదీ ఎక్స్‌లో కొనియాడారు. ‘ఆహారంలో నూనెలను తగ్గించుకోవడం వంటి చిన్నచిన్న మార్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒబెసిటీపై అవగాహన కల్పిద్దాం. ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం’అంటూ ఆయన పిలుపునిచ్చారు.

మురికివాడ ప్రజలు వర్సెస్ పోలీసులు
రూర్కేలా: ఒడిశా రాష్ట్రంలోని సుందర్ ఘర్ జిల్లాలో మురికివాడల్లో నిర్వాసితులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మృత్యువాత పడగా, 19 మంద గాయపడ్డారు. గాయపడిన వారిలో అదనపు తహసీల్దార్ కూడా ఉన్నారు. సుందర్ ఘర్ జిల్లాలోని బర్కానీ ఏరియాలో నివాసముండే మురికివాడ నిర్వాసితులను ఖాళీ చేయించే క్రమంలో అధికారులు అక్కడ వచ్చారు. ఈ క్రమంలోనే వారు ఖాళీ చేసేది లేదని తేల్చిచెప్పడంతో అటు పోలీసులకు మురికివాడ నిర్వాసితులకు ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జీ చేయగా, దాన్ని వారు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతం మీదుగా రైల్వే లైన్ మంజూరు కావడంతో అక్కడ ఉండే వారిని ఖాళీ చేయించేందుకు అధికారులు పూనుకున్నారు. దీనిలో భాగంగా పోలీసుల్ని తీసుకునిన అక్కడకు వెళ్లగా అక్కడ ఉద్రిక్త వాతావారణం చోటు చేసుకుంది.

‘సుప్రీంకోర్టు నిర్దేశిస్తుందా?.. ఇక మేము పార్లమెంట్‌ను మూసేస్తాం’
రాంచీ: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు ఆ జాబితాలో జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ ఎంపీ నిక్షికాంత్ దుబే చేరిపోయారు. సుప్రీం తీర్పు ‘అరాచకం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ.. ఇక తాము పార్లమెంట్ ను, అసెంబ్లీలను కూడా మూసేస్తాం అంటూ సెటైర్లు వేశారు. ప్రధానంగా రాష్ట్రపతికి మూడు నెలల టైమ్ లైన్ విధించడాన్ని ఆక్షేపించారు సదరు ఎంపీ.నియామక అధికారికి మీరు ఎలా దిశానిర్దేశం చేస్తారు?, రాష్ట్రపతి అనేవారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను నియమిస్తారు. పార్లమెంట్ అనేది ఈ దేశంలో చట్టాలు తయారు చేస్తుంది. అప్పుడు మీరు పార్లమెంట్ ను ఎలా డిక్టేట్ చేస్తారు. మీరు కొత్త చట్టాన్ని ఎలా రూపొందించారు. ఏ చట్టంలో రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉంది? అంటే మీరు ఈ దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలనుకుంటున్నారా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరగాల్సిందేనని దూబే పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ పరిమితులపై ప్రశ్నలను లెవనెత్తింది’ అంటూ వ్యాఖ్యానించారు.ఇటీవల ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు.ఇవీ చదవండి:వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులురాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’

జేఈఈ మెయిన్ ఫలితాలు.. 110 మందికి షాక్!
జేఈఈ మెయిన్ 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం అర్థరాత్రి విడుదల చేసింది. 2.50 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించినట్టు వెల్లడించింది. 24 మంది 100 పర్సంటైల్ సాధించినట్టు తెలిపింది. అయితే 110 మంది ఫలితాలను ప్రకటించకుండా ఎన్టీఏ నిలిపివేసింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో వీరి ఫలితాలను ప్రకటించలేదని ఎన్టీఏ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫోర్జరీ పత్రాలు ఉపయోగించడం పాటు రకరకాలుగా మోసాలకు పాల్పడినట్టు ఆరోపించింది.వ్యక్తిగత వివరాల్లో వ్యత్యాసం కారణంగా మరో 23 మంది ఫలితాలను కూడా ప్రకటించలేదు. ఫొటోలు, బయోమెట్రిక్ డేటాలో తేడాల కారణంగా ఈ 23 మంది రిజల్ట్ విడుదల కాలేదు. వీరు గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన ఐడెంటిటీ ప్రూఫ్ సమర్పించాలని ఎన్టీఏ (NTA) సూచించింది. వీటిని పరిశీలించిన ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. తాము ఎటువంటి తప్పుచేయలేదని అభ్యర్థులు నిరూపించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షలు దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో జనవరి- ఏప్రిల్‌లో జరిగాయి. సెషన్ 1 పరీక్ష సమయంలో 39 మంది అభ్యర్థులు అక్రమాలకు పాల్పడినట్టు ఎన్టీఏ గుర్తించింది. సెషన్ 2లో ఇదే రకమైన ఆరోపణలతో 110 మందిని గుర్తించడంతో మొత్తం 149 మందిని అనుమానిత జాబితాలో చేర్చింది. వీరిలో 133 మంది ఫలితాలు విడుదల చేయకుండా ఎన్టీఏ నిలిపివేసింది. తాము నిబంధలను ఉల్లంఘించలేదని నిరూపించుకున్న తర్వాతే వీరి పరీక్షా ఫలితాలను వెల్లడిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. నిష్పాక్షికత, పారదర్శకత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని కుండబద్దలు కొట్టింది.సరైన పత్రాలతో తమను సంప్రదించండిఫలితాలు విడుదలకాని అభ్యర్థులు సరైన పత్రాలతో తమను సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది. కరెక్ట్ ఐడెంటిటీ ప్రూఫ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఎథికల్ కండక్ట్ కలిగివుంచాలని వెల్లడించింది. పరీక్షల్లో అర్హత సాధించడానికి అనైతిక మార్గాలు అనుసరించకుండా అడ్డుకునేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు తమకు సహకరించాలని కోరింది. చదవండి: 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు వీరేఅక్రమాల నివారణకు చర్యలుదేశంలో అత్యంత పోటీ ఉండే జేఈఈ పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. పలు రకాలుగా భద్రత ఏర్పాటు చేస్తోంది. బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఏఐ- ఆధారిత వీడియో ఎనలిటిక్స్, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెడుతోంది. పరీక్షల్లో డిజిటిల్ అక్రమాలను నిరోధించేందుకు ఎగ్జామ్స్ సెంటర్ల వద్ద 5జీ జామర్లను అమరుస్తోంది. అంతేకాదు కొత్తగా అందుబాటులోకి వచ్చిన పరీక్షా కేంద్రాల్లో థర్డ్ పార్టీ ఏజెన్సీలతో ముందుగానే తనిఖీలు నిర్వహించింది. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు 1100 మందికి పైగా పరీక్షా నిర్వాహకులు, భాగస్వాములకు ముందుగానే ట్రైనింగ్ ఇచ్చింది. ఢిల్లీలోని సెంట్రల్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాల్లోని కదలికలను గమనిస్తూ అలర్ట్ చేసింది.
ఎన్ఆర్ఐ

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్‌లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.

డల్లాస్‌లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్‌లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్‌లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్‌ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-
క్రైమ్

ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య
వనపర్తి(మహబూబ్‌నగర్): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నా డని కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. సూగూరు గ్రామానికి చెందిన రవి, అతడి భార్య సునీత మేస్త్రి నరేశ్ వద్ద పనిచేస్తుండే వారు. క్రమంలో శ్రీరంగాపూర్‌కు చెందిన అరవింద్‌తో సునీతకు పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త రవికి తెలియడంతో అరవింద్‌ను హెచ్చరించాడు. అప్పటి నుంచి రవి తన భార్య సునీతను ఇబ్బంది పెడుతుండేవాడు. ఈ క్రమంలో తన భర్త అడ్డు తొలగించాలని ప్రియుడు అరవింద్‌కు చెప్పడంతో గత నెల 18న అతడు తన స్నేహితులైన భగవంతు, గిరితో కలిసి అయ్యవారిపల్లిలో మద్యం తాగుతూ రవి హత్యకు పథకం రచించారు. ఈ మేరకు మార్చి 19న సాయంత్రం అరవింద్ తన స్నేహితుడైన సూగూరుకు చెందిన బాష కారును అవసరం ఉందని తీసుకుని అయ్యవారిపల్లిలో భగవంతు, గిరిని ఎక్కించుకున్నాడు. వెంకటాపురంలో ఒక కిరాణం షాపులో మద్యం, వాటర్ బాటిల్స్, నల్ల కవర్స్ తీసుకున్నారు. అక్కడి నుంచి సూగూరుకు వెళ్లి ఆంజనేయులు అనే వ్యక్తితో రవికి ఫోన్ చేయించి మద్యం తాగుదామని పిలిపించారు. వారి వద్దకు వచ్చిన రవిని కారులో ఎక్కించుకుని గ్రామ సమీపంలోని శ్మశానవాటిక వద్దకు వెళ్లి మద్యం తాగారు. రవి మత్తులోకి వెళ్లిన తర్వాత అందరూ కలిసి అతడి ముఖానికి ప్లాస్టిక్ కవర్లు చుట్టి ఊపిరాకుండా చేసి చంపారు. ఎవరికీ అనుమానం రాకూడదని కొత్త సూగూరు ఊరి బయట రోడ్డు పక్కన శవాన్ని ఉంచి, నేరానికి ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లను బూడిదపాడు వద్ద వాగులో పడేసి వెళ్లిపోయా రు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టారు. సునీతను తమదైన శైలిలో విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకుంది. హత్య లో పాల్గొన్న వారిని అరెస్టు చేసి.. వారి నుంచి కారు, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్ విధించినట్టు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, పెబ్బేరు ఎస్ఐ యుగంధర్ రెడ్డి ఉన్నారు.

క్షేమంగా ఊరికి పంపిస్తామని.. కాటేశారు
కర్ణాటక: ఆ కూలీ యువతికి భాష తెలియదు, ఊరు తెలియదు, క్షేమంగా ఊరికి పంపిస్తానని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డారు కామాంధులు. మంగళూరు నగరం వద్ద ఉళ్లాలలోని మున్నూరు బంగ్లా వద్ద బెంగాల్ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో కొత్త నిజాలు బయటపడ్డాయి. వివరాలు.. బాధిత యువతి 3నెలల క్రితం తన ప్రియుని కలిసి పశ్చిమబెంగాల్ నుంచి కేరళకు కూలీ పనికి వచ్చింది. ఏప్రిల్ 16న ఇద్దరి మధ్య గొడవ జరిగి ప్రియుడు ఆమె మొబైల్ ని పగలగొట్టి వెళ్లగొట్టాడు. దీంతో యువతి కేరళ నుండి మంగళూరుకు వచ్చే రైలు ఎక్కింది. మంగళూరులో దిగిన ఆమె స్వంత ఊరికి వెళ్లడానికి డబ్బులు లేక రైల్వేస్టేషన్లో చాలామంది వద్ద డబ్బులు అడిగింది. ఈ క్రమంలో నిందితుడు ఆటోడ్రైవర్ ప్రభురాజ్ ఆమైపె కన్నేసి మొబైల్ రిపేరీ చేయించి ఆమె అక్కకు కాల్ చేయమని చెప్పాడు. అక్క ఆమెకు ఆన్లైన్లో రూ.2 వేలు పంపించి ప శ్చిమ్ బెంగాల్ రైలు ఎక్కాలని చెప్పింది, ప్రభురాజ్ తో కూడా మాట్లాడిండి.కూల్‌డ్రింకులో మత్తు కలిపిరైలు ఆలస్యంగా వస్తుందని యువతిని నమ్మించి ప్రభురాజ్ తన ఆటోలో ఆమెను 6 గంటలపాటు ఊరంతా తిప్పాడు. రాత్రి కాగానే మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి ఆమె స్పృహ కోల్పోయాక మిత్రులు మణి, మిథున్‌ను పిలిపించాడు. ముగ్గురూ కలిసి మున్నూరు బంగ్లా వద్ద నిర్జన ప్రదేశంలో అత్యాచారం చేసి పరారయ్యారు. బాధితులు ఓ ఇంటి వద్దకు వచ్చి పడిపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. నిందితులను కంకనాడి పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటి వరకూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని తెలిసింది.

హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
రాంగోపాల్‌పేట(హైదరాబాద్): వ్యభిచార ముఠా వ్యవహారాన్ని రాంగోపాల్‌పేట పోలీసులు రట్టు చేసి ఇద్దరు విటులను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న నిర్వాహకుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపి డబ్బులు సంపాధిస్తున్నట్లు గుర్తించారు. రాంగోపాల్‌పేట ఇన్స్పెక్టర్ నర్సింగరావు తెలిపిన వివరాల మేరకు.. రాంగోపాల్‌పేట పీజీరోడ్డు, బాపూబాగ్ కాలనీలోని ఓ భవనం రెండో అంతస్తులో సెక్స్ వర్కర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈనెల 18న పథకం ప్రకారం దాడి చేసి ఇద్దరు విటులతో పాటు ఇద్దరు యువతులను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఉద్యోగాన్వేషణ కోసం నగరానికి వచ్చినట్లు సదరు యువతులు తెలిపారు. ఉదోగ్య ప్రయత్నంలో ఉండగా స్వప్న అనే యువతి పరిచయం అయిందని, చేతన్ అనే వ్యక్తితో కలిసి ఈ భవనంలో ఉంటున్నామని వివరించారు. పట్టుబడిన విటులు నగరానికి చెందిన మహ్మయద్ అవియాజ్ (32), ఫహాద్ హుస్సేన్ (25)పై కేసులు నమోదు చేశారు. యువతులను షెల్టర్హోంకు తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకులు స్వప్న, చేతన్ కోసం గాలిస్తున్నామన్నారు. నిర్వాహకురాలు స్వప్న వాట్సాప్, ఫోన్ నంబర్ల ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచార గృహానికి రప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

హిజ్రాకి వేధింపులు.. యువకుడి ఇంటి ముందు ధర్నా
మంచిర్యాల: ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడంటూ మందమర్రి మొదటి జోన్లో ఉండే అజయ్ అనే యువకుడి ఇంటి ఎదుట శనివారం హిజ్రాలు ఆందోళన చేపట్టారు. తనను గత కొంతకాలంగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడని, ఫొటోలు, వీడియోలు తీసి వేధింపులకు పాల్పడుతున్నాడని చందన అనే హిజ్రా వాపోయింది. వీడియో కాల్ చేసి డబ్బులు కావాలని అడుగుతున్నాడని, ఇవ్వకపోతే రైలు కిందపడి చనిపోతానంటూ బెదిరిస్తున్నాడని పేర్కొంది. అజయ్‌ను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతులక్ష్మణచాంద: ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల గంగన్నృలక్ష్మి దంపతుల కుమారుడు రామ్‌చరణ్ (14) శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఒంటిగంట సమయంలో కాలనీ పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని చెక్ డ్యాంకు స్నానానికి వెళ్లారు. సాయంత్రమైనా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఈతకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో చెక్‌డ్యామ్ వద్దకు వెళ్లి చూడగా రామ్‌చరణ్ బట్టలు, పాదరక్షలు కనిపించాయి. చీకటి కావడంతో తిరిగి ఇంటికి వచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు.
వీడియోలు


జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. ముగ్గురు మృతి


న్యాయ వ్యవస్థపై బీజేపీకి అపారమైన నమ్మకం ఉంది: జేపీ నడ్డా


బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర


రామ్ చరణ్ కు పూజాహెగ్డే కౌంటర్? సోషల్ మీడియాలో వైరల్..


420 హామీలిచ్చి కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేసింది


విరాట్ కోహ్లికి ఘోర అవమానం


KSR Comment: సూపర్ సిక్స్ డైవర్షన్ కోసం చంద్రబాబు కొత్త ప్రకటన


ఐటీకి ప్రోత్సాహం పేరుతో పైసా తక్కువ రూపాయ్ పథకం


ఊర్వశి రౌతేలా నోటి దూల.. అర్చకులు సీరియస్ వార్నింగ్


మహారాష్ట్రలో దగ్గరవుతున్న ఠాక్రే సోదరులు