Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan Mohan Reddy Key Press Meet At 11 AM1
QR కోడ్‌తో బాబు మోసాలను నిలదీద్దాం.. ప్రజలకు వైఎస్‌ జగన్‌ పిలుపు

సాక్షి,గుంటూరు: ఏపీలో ఏడాదిగా కూటమి పాలనలో.. టీడీపీ, ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడే పల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.రాష్ట్రంలో దిగజారిన లాండ్‌ ఆర్డర్‌, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోంది. చంద్రబాబు అరాచక పాలనకు వ్యతిరేకంగా మే4న ప్రజలు, వైఎస్సార్‌పీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్లా. కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య నా రెంటపాళ్ల పర్యటన జరిగింది. అయినా విజయవంతమైంది. మా పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? మొన్నటి పొదిలి పర్యటనలో 40వేల మందిపై రాళ్లేసే ప్రయత్నం చేశారు. రైతులు సంయమనం పాటించారు. అయినా కేసులు పెట్టారు. రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదు. సంఘీభావం తెలపకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భయం.. ఎందుకు?చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఓ టీవీ ఛానెల్‌లో చంద్రబాబు అహంకార మాటలు వినండి. ప్రతిపక్షను భూస్థాపితం చేస్తారట. ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా?. ఏడాది కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చంద్రబాబు పాలనపై అసహనం పెరిగింది. ఆ అసహనాన్ని డైవర్ట్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారు. టాపిక్‌ డైవర్ట్‌ చేస్తున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. చెవిరెడ్డి అరెస్ట్‌ నిజంగా అశ్చర్యకరం. ‌తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని గన్‌మెన్‌ను బలవంతం చేశారు. తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వనందుకు గన్‌మెన్‌పై దాడి కూడా చేశారు. తనపై జరిగిన దాడిని గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్‌, డీజీపీకి గన్‌మెన్‌ లేఖ రాశారు. మరో గన్‌మెన్‌ను ప్రలోభాలకు గురిచేసి వారికి అనుకూలంగా స్టేట్‌మెంట్‌ ఇప్పించుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు.. అరెస్టులు చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారు. సొంత నియోజవకర్గంలో గెలవలేని వ్యక్తి. చంద్రగిరిలో ఇబ్బంది ఉండకూడదనే చెవిరెడ్డిని అరెస్ట్‌ చేశారు. తప్పుడు కేసులో పిన్నెల్లిని అరెస్ట్‌ చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్‌ తీసుకొచ్చాం. మళ్లీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సురేష్‌ భార్యపైనా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీపై 11 కేసులు పెట్టారు. జోగి రమేష్‌ కొడుకు, కాకాణిపై తప్పుడు కేసులు. కృష్ణమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిపైనా అక్రమ కేసులు పెట్టారు. కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నినాని, వైవి సుబ్బారెడ్డి,ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు. దేవినేని అవినాష్‌, మాజీ ఎమ్మెల్యే ఆర్కే,అంబటి రాంబాబు, విడదల రజినిపై తప్పుడు కేసులు దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పైనా అక్రమ కేసులు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిపై, ఉషశ్రీచరణ్‌, తోపుదుర్తి ప్రకాష్‌, గోరంట్ల మాధవ్‌పై కేసులు. ఇలా వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారు. కొమ్మినేని ఏం పాపం చేశారు.. చంద్రబాబూ?సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం పాపం చేశారు? ఏం చేశారని కొమ్మినేనిని అరెస్ట్‌ చేశారు?టీవీ డిబెట్‌లో అనలిస్ట్‌ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం? గతంలో కేఎస్‌ఆర్‌ ఉద్యోగాన్ని చంద్రబాబు ఊడగొట్టించారు. కేఎస్‌ఆర్‌ అరెస్ట్‌ అక్రమమేనన్న సుప్రీంకోర్టు.. తనకున్న విచక్షణాధికారాల్ని ఉపయోగించి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలించింది. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టులాంటిది. మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా?మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా అని వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్‌గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ నేతలు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాలిస్తే ఈ విషయం బయటకొచ్చింది. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వకుండా భయపెట్టారు. కనీసం చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదా? న్యాయం చేయాలనే తపన చంద్రబాబుకు లేదు. న్యాయం వైపు నిలిచే వ్యక్తి చంద్రబాబు కాదు. మరో ప్రాంతంలో ఇంటర్‌ గిరిజన బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తర్వాత బాలిక శవమై కనిపించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. టీడీపీ నేత.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటిప్రజల కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. 32లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్లను మంజూరు చేసి 10లక్షల ఇళ్లు పూర్తి చేశాం. చట్టం చేసి మరి నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించ్చాం. మహిళలపై ఎవరికి గౌరవం ఉంది?. మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటి.కరెంట్‌ బిల్లుల బాదుడే.. బాదుడు15వేల కోట్లు కరెంట్‌ బిల్లుల బాదుడు,గవర్నమెంట్‌ స్కూళ్లు కాలేజీ కాలేజీల్ని నిర్విర్యం చేశాడు. ప్రైవేట్‌ స్కూల్స్‌, కాలేజీల్లో ఫీజుల పేరిట బాదుడే బాదుడే. రేషన్‌ వెహికల్స్‌ వాహనాల్ని తీసేశాడు. రేషన్‌ ద్వారా ఇచ్చే పప్పు దాన్యాల్ని ఎగనామం పెట్టాడు. ఫలితంగా పప్పు దాన్యాల రేట్లు పెంచి బాదుడే బాదుడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. సుమారు 3లక్షలపై చీలూకు ఉద్యోగాల్ని తొలగించారు.ప్రభుత్వ ఉద్యోగుల సంగతి సరేసరిపంటలకు సరైన మద్దతు లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏమైనా ఒరిగిందా అంటే? అదీ లేదు. వచ్చీ రాగానే పీఆర్సీ అన్నారు. పీఆర్సీని ఆపేశారు. ఈ జులై 1వ తారీఖుతో కలిసి నాలుగు డీఏ ఇవ్వాలి. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 20 వేలకోట్ల వరకు ఆపేశారు. చంద్రబాబు పెట్టిన తాకట్టు.. చంద్రబాబు తాను అబద్ధమాడుతూ.. తానెప్పుడూ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం లేదన్నాడు. మద్యం ఆదాయం తాకట్టుపెట్టడం లేదు. కానీ 4-4-2025 నాడు విడుదల చేసిన జీవో 69 కింద ఏపీఎండీసీ కింద 436 మినరల్‌ ప్రాజెక్ట్‌ను తాకట్టు పెట్టారు. వాటి విలువ 191,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో, బాండలను అందరూ రెడీగా పెట్టుకోవాలి. చంద్రబాబు తన పాలన గురించి తెలుసుకునేందుకు మీ ఇంటికి ఎమ్మెల్యేలు, ఇతర నేతల్ని పంపిస్తున్నారు. నేతలు వచ్చినప్పుడు మ్యానిఫెస్టో, బాబుష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో బాండును అందించారు. ఆ బాండు, ఎన్నికల మ్యానిఫెస్టో చూపిస్తూ ఎంత వరకు ఎన్నికల హామీలు నెరవేర్చారో అడగండి. అప్పుడైనా చంద్రబాబుకు ఎన్నికల హామీలు నెరవేర్చుతారో చూడాలి. ఒకవేళ మీ వద్ద ‘బాబు మ్యానిఫెస్టోని గుర్తు తెచ్చుకుంటూ’ అనే పేరుతో చంద్రబాబు మ్యానిఫెస్టోను డౌన్‌లోడ్‌ చేసుకునేలా క్యూఆర్‌ కోడ్‌ను వైఎస్సార్‌సీపీ అందుబాటులోకి తెస్తుంది’ అని అన్నారు. ప్రభుత్వంపై ఫైట్‌ చేయండి. రాష్ట్ర ప్రజల తరుఫున వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

YS Jagan Serous Comments On CBN Govt Sakshi Incident2
చంద్రబాబు.. ‘సాక్షి’పై దాడులు విచ్చలవిడి రౌడీయిజం కాదా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏపీలో సాక్షి ఆఫీసులే టార్గెట్‌గా టీడీపీ నేతలు దాడులు చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. టీడీపీ సహా కూటమి నేతలు సాక్షి కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా?. వీటన్నింటికీ చంద్రబాబు, ప్రభుత్వమే కారణం కాదా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సంప్రదాయమే కదా?. ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస్‌ ఏం పాపం చేశారని అరెస్ట్‌ చేశారు. అనలిస్ట్‌ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం?. గతంలో కేఎస్‌ఆర్‌ ఉద్యోగాన్ని కూడా చంద్రబాబు ఊడగొట్టించారు. ఆయనపై పగతోనే ఇదంతా చేశారు. పత్రికల గొంతు నులుపే కార్యక్రమం ధర్మమేనా?. సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపచెల్లుమనిపించినట్టు కాదా?. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు రాతలు రాసిన వారిపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తారా?. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా?. వీటన్నింటికీ చంద్రబాబు కారణం కాదా?. పక్కా ప్లన్‌, ఓ ప్రణాళికతో సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కుట్ర జరిగింది. సాక్షి ఆఫీసులపై టీడీపీ నేతలు ధ్వంసం చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది. ఈరోజు సాక్షి టార్గెట్‌గా దాడులు చేశారు. రేపటి రోజున మరొకరిపై దాడులు చేస్తారా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సంప్రదాయమే కదా? ఇది ఇలాగే కొనసాగితే ఎలా?. భవిష్యత్‌ ప్రజలు బతుకుతారా?. ప్రజాస్వామ్యం అనేది ఏపీలో ఉందా?. చంద్రబాబుకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు కాదా?. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బుద్ది తెచ్చుకోవాలి. ‘సాక్షి’ ఆఫీసులపై దాడులు చేసింది వీరే..శ్రీకాకుళంలో మెట్ట శైలజ-టీడీపీ అధ్యక్షురాలుమెండ దాసు నాయుడు- టీడీపీ నాయకులు.విశాఖలో.. ముక్కా శ్రావణి.. టీడీపీ కార్పొరేటర్‌. అనంత లక్ష్మి.. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు.తూర్పుగోదావరి.. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి(అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే).బతూలు బాలరామకృష్ణ.. జనసేన ఎమ్మెల్యే. విజయవాడలోగద్దె అనురాధ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ భార్య గద్దె క్రాంతి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ కుమారుడు. మంగళగిరిలో.. కంభంపాటి శిరీష ఎస్‌సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌.అనంతపురంలో.. స్వప్న.. టీడీపీ మహిళా వింగ్‌ స్టేట్‌ సెక్రటరీ. సంగా తేజస్వినీ.. టీడీపీ మహిళా విభాగం స్టేట్‌ సెక్రటరీ.కడపలో.. బొజ్జా తిరుమలేష్‌.. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రెసిడెంట్‌. తిరుపతి.. ఆర్‌సీ మునికృష్ణ.. తిరుపతి డిప్యూటీ మేయర్‌. కోడూరి బాలసుబ్రహ్మణ్యం.. టీడీపీ అధికార ప్రతినిధి.

Israel Direct Warn To Iran Supreme Ali Khamenei3
ఖమేనీ కథ ముగిస్తాం.. ఇజ్రాయెల్‌ సంచలన ప్రకటన

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్‌ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ కథ ముగిస్తామని ప్రకటించింది. తాజా టెల్‌ అవీవ్‌ ఆస్పత్రి దాడిని ఉద్దేశించి ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్‌ కట్జ్‌(israel katz) స్వయంగా ఈ ప్రకటన చేశారు.తాజాగా.. టెల్‌ అవీవ్‌లోని ఓ ఆస్పత్రిపై మిస్సైల్స్‌తో ఇరాన్‌ దాడులు జరిపింది. ఈ దాడికి ఇరాన్‌ సుప్రీం ఖమేనీ(Khamenei)నే బాధ్యత వహించాలంటూ పేర్కొన్న ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ .. త్వరలోనే ఆయన కథ ముగిస్తామని, ఇరాన్‌ను ఖమేనీ విముక్త దేశంగా మారుస్తామని ప్రకటించారు. జూన్‌ 13వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. పోటాపోటీగా దాడులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో.. నేరుగా ఇరాన్‌ సుప్రీంను ఉద్దేశించి ఇజ్రాయెల్‌ ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అయితే.. ఈ బెదిరింపులను ఖమేనీ తీవ్రంగా భావించే పరిస్థితులు కనిపించడం లేదు. ‘‘బెదిరింపులకు తలొగ్గం.. యుద్ధం తీవ్రతరం అయ్యింది’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టి సందేశాలు పంపుతున్నారు. తమపై దాడి చేసి ఇజ్రాయెల్‌ (Israel) భారీ తప్పిదం చేసిందని, అందుకు శిక్ష తప్పదని ఓ వీడియో సందేశం సైతం విడుదల చేశారాయన. ‘‘ఇరాన్‌ లొంగిపోదనే విషయాన్ని వాళ్లు(ట్రంప్‌, నెతన్యాహులను ఉద్దేశిస్తూ) తెలుసుకోవాలి. అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్‌ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుంది. ఈ యుద్ధంలో వాళ్ల సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలి అని ఖమేనీ తన సందేశం పేర్కొన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న పోరులో అమెరికా జోక్యం చేసుకుంటే అది పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కూడా హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఖమేనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని.. ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి ఆయన్ను చంపాలనుకోవడం లేదన్నారు. ఇరాన్‌ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ట్రంప్‌ హెచ్చరించారు.మరోవైపు ఖమేనీకి బెదిరింపులపై లెబనాన్‌ ఉగ్రసంస్థ హెజ్‌బొల్లా తీవ్రంగా స్పందించింది. ఈ బెదిరింపులు మూర్ఖపు చర్య అని, అలాంటి ప్రయత్నాలు జరిగితే తాము చూస్తూ ఉండబోమని, అమెరికా-ఇజ్రాయెల్‌ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. ఎవరీ ఖమేనీ.. అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ (Ayatollah Sayyid Ali Khamenei) ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్‌. అత్యంత శక్తివంతమైన ప్రపంచాధినేతల్లో ఒకరు. ఖమేనీ ఒక షియా మత పండితుడు మాత్రమే కాదు.. రాజకీయ నేతగా ఇస్లామిక్ విప్లవంలో కీలకంగా వ్యవహరించాడు. 1989లో అయతొల్లా ఖోమేనీ మరణం తర్వాత ఇరాన్‌కు సుప్రీం అయ్యారు. ఖమేనీ (మధ్యలో వ్యక్తి)ఖమేనీ జీవిత నేపథ్యం:పుట్టిన తేదీ: జూలై 17, 1939స్థలం: మష్హద్, ఇరాన్విద్య: మష్హద్, కూమ్ నగరాల్లో మత విద్యవృత్తి: మత పండితుడు, రచయిత, రాజకీయ నాయకుడురాజకీయ ప్రస్థానం:1979లో ఇరాన్‌లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు.విప్లవం తర్వాత ఇరాన్ అధ్యక్షుడిగా 1981 నుంచి 1989 వరకు పనిచేశారు.1989లో ఖోమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్‌గా పగ్గాలుసుప్రీం లీడర్‌గా.. ఇరాన్‌లో సుప్రీం లీడర్ పదవి అత్యున్నతమైనది. ఖమేనీకి సైనిక, న్యాయ, మత వ్యవస్థలపై పూర్తి నియంత్రణ ఉంది. విదేశాంగ విధానాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈయనదే. ఆయన నియామకాలు, ఆదేశాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేస్తాయి. ఇటీవల ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖమేనీ పేరు మరింతగా వార్తల్లోకి వచ్చింది. ఆయన వ్యాఖ్యలు, నిర్ణయాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్నాయి.

Those Who Speak English In Country Will Soon Feel Ashamed: Amit Shah4
ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులొస్తాయ్‌: అమిత్‌ షా

ఢిల్లీ: మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని.. భాషలు మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివన్న అమిత్ షా.. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు.. అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదు. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను.’’ అంటూ అమిత్‌ షా చెప్పుకొచ్చారు.మన దేశాన్ని, మన సంస్కృతి, చరిత్ర, మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏవిదేశీ భాష కూడా సరిపోదని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. పూర్తి భారతదేశ ఆలోచనను విదేశీ భాషల ద్వారా ఊహించలేం. ఈ యుద్ధం ఎంత కష్టమో నాకు పూర్తిగా తెలుసు, కానీ భారత సమాజం దానిని గెలుస్తుందని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరోసారి ఆత్మగౌరవంతో, మన దేశాన్ని మన స్వంత భాషలలో నడుపుతాం. ప్రపంచాన్ని కూడా నడిపిస్తాం’’ అని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపొందించిన 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు) గురించి వివరిస్తూ.. ఈ ఐదు ప్రతిజ్ఞలు దేశంలోని 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయని అమిత్‌ షా అన్నారు. అమృత్ కాల్ కోసం మోదీ జీ 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు)కు పునాది వేశారు. 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటామని.. ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయి" అని అమిత్ షా చెప్పారు.

Supreme Court Panel Confirms Cash Found At Justice Yashwant Varma Home5
న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మకు భారీ ఎదురుదెబ్బ

సాక్షి,ఢిల్లీ: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు (justice yashwant varma) భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. కాలిన నోట్ల కట్టల వ్యహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి సిఫార్స్‌ చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్‌ వర్మ అధికారిక నివాసంలో వెలుగులోకి వచ్చిన రూ.500 నోట్ల కట్టల వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. తాజాగా త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసి రిపోర్టును సుప్రీంకోర్టుకు అందించింది. స్టోరూంలో వెలుగులోకి వచ్చిన కరెన్సీ నోట్ల ఏపీసోడ్‌లో జస్టిస్‌ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని గుర్తించింది. ఇదే వ్యవహారంలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్‌ చేశాయి. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ 55 మంది సాక్షులను విచారించి, జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసి, మొత్తం 64 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను మొదటగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది. నివేదికలో కీలకమైన విషయాలను పరిశీలిస్తే..త్రిసభ్య విచారణ కమిటీ తన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.పేజీ 60లో: “ 30 తుగ్లక్ క్రెసెంట్‌లో ఉన్న స్టో రూమ్‌లో భారీ ఎత్తున నగదు ఉన్నట్లు గుర్తించాం. నగదు ఉన్న ప్రదేశం ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వర్మ అధికారిక నివాసం…” పేజీ 59లో: “... స్టోరుమ్‌లోకి వెళ్లేందుకు జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నది. ఎవరు అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేరు. మా విచారణలో తేలింది.”మార్చి 14న జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్న సమయంలో స్టోరూంలో పూర్తిగా కాలిన నోట్లు వెలుగులోకి వ‌చ్చాయి. ఓ సాక్షి చెప్పిన ప్రకారం.. “లోపలికి వెళ్లగానే ఏటు వైపు చూసినా, రూ.500 నోట్ల కట్టలు నేలపై పడి ఉన్నాయి. ఇది నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తంలో నగదు అని స‌ద‌రు వ్యక్తి త్రిస‌భ్య క‌మిటీకి చెప్పారు. కమిటీ నివేదిక ప్రకారం, ఇంత పెద్ద‌మొత్తంలో స్టోరూంలో ల‌భ్య‌మ‌వ్వ‌డంపై అనేక అనుమానాలున్నాయి. జస్టిస్‌ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా అక్కడ ఉంచడం అసంభవం’ అని నివేదిక‌లో ప్ర‌స్తావించింది.జస్టిస్‌ వర్మ కుమార్తె దియా వర్మ, ప్రైవేట్ సెక్రటరీ రాజీందర్ కార్కీలను కూడా క‌మిటీ విచారించింది. విచార‌ణ‌లో ఈ ఇద్దరూ స్టోరూంలో న‌గ‌దు ఉన్న విష‌యాన్ని ఎవ‌రికీ చెప్పొద్ద‌ని అగ్నిమాపక సిబ్బందిని కోరిన‌ట్లు తేలింది.దీంతో పాటు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కుమార్ చేసిన ఆరోపణలు, దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం, జస్టిస్ వర్మను తొలగించే ప్రక్రియ ప్రారంభించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అని కమిటీ తేల్చింది.దేశంలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. సుప్రీం త్రిసభ్య కమిటీ సిఫార్సుతో జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జస్టిస్‌ వర్మ మాత్రం కాలిన నోట్ల కట్టల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, నిరుపయోగంగా ఉండే స్టోరూంలో ఇతరులు సైతం ప్రవేశించే అవకాశం ఉందని వాదిస్తున్నారు. సుప్రీం నియ‌మించిన త్రిస‌భ్య క‌మిటీ స‌భ్యులు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ షీల్‌ నాగ్, హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జి.ఎస్‌.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అనూ శివరామన్‌ను సభ్యులుగా ఉన్నారు.

Silver prices at Rs 2 lakh Rich Dad Poor Dad Robert Kiyosakis Predict Sparks Debate6
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?

ఓ వైపు బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ రూ.లక్షను (10 గ్రాములకు) చేరుకుంటే ఇంకో వైపు మరో విలువైన లోహం వెండి కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య తీవ్ర ఘర్షణల నేపథ్యంలో వెండి, బంగారం ధరల ర్యాలీ కొనసాగింది. ముఖ్యంగా వెండి ధర గత ఆల్‌టైమ్‌ గరిష్టం రూ.1,08,100ను అధిగమించింది. ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,08,200 స్థాయికి చేరుకుంది. మరోవైపు 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.1,00,710 స్థాయిని తాకింది. రూ.540 లాభపడింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో 2012 ఫిబ్రవరి తర్వాత మొదటిసారి 37 డాలర్లను వెండి అధిగమించింది.ఈ నేపథ్యంలో ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మాటలపై అటు ఇన్వెస్టర్లతో పాటు ఇటు సామాన్య జనంలోనూ చర్చ సాగుతోంది. అమ్మో బంగారం అంత పెరిగింది... ఇంత పెరిగింది.. అని చర్చించుకుంటున్న జనం ఇప్పుడు పెరుగుతున్న వెండి ధరలను చూసి నోరెళ్లబెడుతున్నారు. ఆర్థిక అంశాల్లో ఎప్పటికప్పుడు తన అంచనాలను వెల్లడించే రాబర్ట్‌ కియోసాకి ఇటీవల వెండి గురించి సంచలన అభిప్రాయం ప్రకటించారు. కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరొచ్చని కియోసాకి అభిప్రాయపడ్డారు.👉 ఇదిగో ఈ ఖర్చులే జేబులు ఖాళీ చేసేది! ఇటీవలి ఆర్థిక అస్థిరత, స్థిరమైన ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కియోసాకి వెండిని దాని పారిశ్రామిక ఉపయోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉదహరిస్తూ "నేడు ప్రపంచంలోనే భలే మంచి బేరం" అని అభివర్ణించారు. అంటే వెండి ఇప్పుడే కొనుక్కోండి.. రాబోయే రోజుల్లో కొనడం కష్టమవుతుందున్న భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.1.06 లక్షలుగా ఉండగా, వెండి ఇప్పటికే గత ఏడాదిగా అద్భుతమైన లాభాలను చవిచూసింది.ఆర్థిక విశ్లేషకులు ఆచితూచి ఆశావహంగా ఉన్నారు. కొంతమంది కియోసాకి అంచనాను తీవ్రమైనదిగా భావిస్తుండగా, మరికొందరు ఆయనతో ఏకీభవిస్తున్నారు. ఇందుకు ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలలో పెరిగిన వెండి వినియోగం, అలాగే పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఎత్తి చూపుతున్నారు. వెండి జోరు నిజమే కానీ ఏకంగా రూ.2 లక్షలకు చేరుతుందా అన్నదానిపై ‘దీనికి కొన్ని తీవ్రమైన కారణాలు ఉండవచ్చు' అని ముంబైకి చెందిన కమోడిటీస్ స్ట్రాటజిస్ట్ మీరా దేశ్ పాండే అన్నారు.

Air India Incident Man Returns Cash and Gold Jewellery Found At Site7
ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్‌ హీరో

జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం 787-8 డ్రీమ్‌లైనర్ బోయింగ్ తీవ్ర విషాదాన్ని నింపింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే విమానాశ్రయానికి సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ ప్రాంతంలో కూలిపోవడంతో భోజనం తింటున్న విద్యార్థులు నలుగురు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ వార్త తెలియగానే, అహ్మదాబాద్ నివాసి రాజు పటేల్‌ మానవత్వాన్ని చాటుకున్న వైనం నెట్టింట పలువుర్ని ఆకట్టుకుంటోంది. ఆయన ప్రదర్శించిన చొరవ, నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంటోందిఅహ్మదాబాద్ నివాసి రాజు పటేల్‌ (56) విమానం కూలిపోయిన సమయంలో భారీ పేలుడు శబ్దాన్ని విని ఉలిక్కి పడ్డారు. అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. హా హా కారాలు వినపడుతున్నాయి. ఇది విన్న నరాజు పటేల్ వెంటనే స్పందించారు. తన వద్ద పనిచేస్తున్న సిబ్బందితో కలిసి ఆయన పరుగున ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. కానీ అప్పటికే అదుపు చేయలేని రీతిలో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడి ఉన్నారు. ఇంతలో సహాయ దళాలు అక్కడికి చేరుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న కొద్దిమందిలో రాజు, దట్టమైన పొగ, పెరుగుతున్న మంటలు, కేకలు, అరుపులు వినిపిస్తున్నా గందర గోళ పడలేదు. స్థానికులు ఇచ్చిన బట్టలు, చాపలను ఉపయోగించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమయం వృథా చేయకుండా, గాయపడ్డవారిని వీలైనంత వేగంగా అంబులెన్స్‌లలోకి ఎక్కించి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పటేల్ బృందం సేవలను చూసిన రెస్క్యూ అధికారులు, వారిని రాత్రి 9 గంటల వరకు సహాయక చర్యల్లో కొనసాగమని కోరడం గమనార్హం.అంతేకాదు సంఘటనా స్థలం శిథిలాల నుండి రూ. 60 వేల నగదు, 70 తులాల (బంగారం, హారాలు, గాజులు, మంగళసూత్రాలు, ఉంగరాలు, ) బంగారు ఆభరణాలను వెలికితీశారు. ఇంకా విదేశీ కరెన్సీ, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఐడి కార్డులు, వెండి వస్తువులను సేకరించి వాటిని జాగ్రత్తగా, నిజాయితీగా పోలీసులకు తిరిగి ఇచ్చారు.‘‘మొదటి 15 నుండి 20 నిమిషాల వరకు, తొందరగా దగ్గరికి చేరుకోలేకపోయాము. మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి, కానీ మొదటి అగ్నిమాపక దళం , 108 అంబులెన్స్‌లు వచ్చిన తర్వాత,సహాయం చేయడానికి ముందుకు సాగాం’’ అన్నారు రాజు. సమయానికి స్పందించడంతో పాటు, ఎంతో ధైర్య సాహసాన్ని ప్రదర్శించి ఆయన చేసిన సేవలతో పాటు తాను సేకరించిన వస్తువులను ఎంతో నిజాయితీగా అధికారులకు అప్పగించడం నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది.మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమైన రాజు పటేల్, బృందానికి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. ఆపద సమయాల్లో ఆదుకున్నవాడే మానవుడు మహనీయుడు అని పేర్కొంటున్నారు.

Ind vs Eng: Ashwin Picks His India XI Predicts highest run Scorer Wicket Taker8
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత తుదిజట్టు ఇదే!

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ తన తుదిజట్టు (భారత్‌)ను ప్రకటించాడు. కేఎల్‌ రాహుల్‌ (KL Rahul)- యశస్వి జైస్వాల్‌లను ఓపెనింగ్‌ జోడీగా ఎంపిక చేసుకున్న అశూ.. జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్‌కు స్థానం ఇచ్చాడు. అదే విధంగా.. చెన్నై బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తాడని పేర్కొన్నాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2025-27లో భాగంగా భారత్‌- ఇంగ్లండ్‌ తమ తొలి సిరీస్‌లో పరస్పరం తలపడనున్నాయి. ఇరుజట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ సిరీస్‌లోని తొలి టెస్టుకు లీడ్స్‌ వేదిక. ఈ మ్యాచ్‌తో శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.అశూ ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదేఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ లీడ్స్‌ టెస్టుకు భారత తుదిజట్టుపై తన అంచనా తెలియజేశాడు. సాయి సుదర్శన్‌తో పాటు కరుణ్‌ నాయర్‌కు కూడా తన జట్టులో చోటిచ్చాడు.‘‘కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, సాయి సుదర్శన్‌, శుబ్‌మన్‌ గిల్‌, కరుణ్‌ నాయర్‌, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ’’ అంటూ ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు తాను ఎంపిక చేసిన ప్లేయింగ్‌ ఎలెవన్‌ను అశూ వెల్లడించాడు.​అందుకే కరుణ్‌కే ఓటుఅయితే, ఆరో స్థానం కోసం కరుణ్‌ నాయర్‌, ధ్రువ్‌ జురెల్‌ మధ్య పోటీ ఉందని.. తాను మాత్రం ఫామ్‌ దృష్ట్యా కరుణ్‌కే ఓటు వేస్తానని అశూ తెలిపాడు. ఇక బుమ్రా అందుబాటులో లేనిపక్షంలో బౌలింగ్‌ ఆప్షన్‌ కోసం శార్దూల్‌ను ఎనిమిదో స్థానంలో ఆడించాలని సూచించాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అశూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.అత్యధిక వికెట్లు తీసేది అతడే!అదే విధంగా.. టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లిష్‌ పేసర్‌ క్రిస్‌ వోక్స్‌ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడని అశూ జోస్యం చెప్పాడు. లేదా షోయబ్‌ బషీర్‌ హయ్యస్ట్‌ వికెట్‌ టేకర్‌ అవుతాడని పేర్కొన్నాడు.టీమిండియా నుంచి బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడటం లేదు కాబట్టి అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదని చెప్పాడు. అయితే, సిరాజ్‌కు మాత్రం ఆ అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. పరుగుల వీరుడిగా పంత్‌!ఇక అత్యధిక పరుగులు వీరుడిగా రిషభ్‌ పంత్‌ నిలుస్తాడని అంచనా వేసిన అశూ.. ఇంగ్లండ్‌ నుంచి జో రూట్‌, బెన్‌ డకెట్‌ల పేర్లు కూడా కొట్టిపారేయలేమన్నాడు. కాగా భారత్‌- ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌కు టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. గెలిచిన కెప్టెన్‌కు పటౌడీ మెడల్‌ అందిస్తారు.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు అశ్విన్‌ ఎంపిక చేసిన భారత తుదిజట్టుకేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, సాయి సుదర్శన్‌, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), కరుణ్‌ నాయర్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ.భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్‌ ప్రకటించిన తుదిజట్టుజాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌, జేమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), క్రిస్‌ వోక్స్‌, బ్రైడన్‌ కార్సే, జోష్‌ టంగ్‌, షోయబ్‌ బషీర్‌.చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’

Daggubati Purandeswari About Jr NTR Political Entry And Family Issues9
ఎన్టీఆర్‌ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి

"పుష్ప" సినిమాలో, హీరో పుష్పరాజ్ ఇంటిపేరు కోసం, ఇంటి పేరు లేకపోవడంతో తను ఎదుర్కొన్న అవమానాలపై పోరాడతాడు. తన పేరు ముందు ఇంటి పేరు రావడం కోసం, జీరో నుండి హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. ఫైనల్‌గా తనను వెతుక్కుంటూ ఆ ఇంటిపేరు తన గుమ్మం ముందు వాలుతుంది. ఒకరకంగా ఎన్టీఆర్‌ పరిస్థితి కూడా పుష్పరాజ్‌ కథకు దగ్గరగా ఉంటుంది. తారక్‌ను అభిమానించే వారికి ఈ విషయం తెలుసు కూడా! తాజాగా ఇదే అంశం గురించి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) పలు విషయాలు పంచుకున్నారు.దూరం పెరిగింది..సీనియర్‌ ఎన్టీఆర్‌ కూతురు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్‌ (Jr NTR)ను చిన్నతనంలోనే నందమూరి ఫ్యామిలీకి ఎందుకు దూరం పెట్టారో ఇలా చెప్పారు. ' జూనియర్‌ ఎన్టీఆర్‌ను చిన్నతనంలోనే దూరం పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. దానిని పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కారణాలు అయితే ఉన్నాయి. కొంచెం దూరం పెరిగింది. కానీ, ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాం' అని ఆమె చెప్పారు.(చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు)తారక్‌ మనసులో ఏముంది?ఇదే సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ ఎంట్రీ గురించి కూడా పురందేశ్వరి మాట్లాడారు.' రాజకీయాల్లోకి తారక్‌ రావాలనుకుంటే వస్తారు. అతనిది ఇంకా చిన్న వయసు. అలాంటప్పుడు పాలిటిక్స్‌లోకి తారక్‌ రావాల్సిన అవసరం ఉందా..? అనేది మనం ప్రశ్నించుకోవాలి. అయితే, రాజకీయాల గురించి తారక్‌ మనసులో ఏముంది..? అనేది నాకు తెలియదు. ఈ విషయం గురించి ఎప్పడు కూడా చర్చించలేదు' అన్నారు.తారక్‌తో ఇబ్బంది లేదుగతంలో కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ఆమె మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తారక్‌ తన పిల్లలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాడని పురందేశ్వరి చెప్పారు. తను నటించిన సినిమా విడుదలైతే తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటానని ఆమె అన్నారు. తనను జూ. ఎన్టీఆర్ అత్తా అనే పిలుస్తాడని, తనతో ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె పలుమార్లు పంచుకున్నారు.చదవండి: వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్‌

Who is Sanjay Verma whom Sonam Raghuvanshi Called 119 Times10
‘హనీమూన్‌’ కేసు: బిగ్‌ ట్విస్ట్‌.. సంజయ్‌వర్మ మరెవరో కాదు..

మీరట్‌: మధ్యప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌లు వివాహమయ్యాక హనీమూన్‌ కోసం మేఘాలకు వెళ్లారు. అక్కడ వారిద్దరూ అదృశ్యమయ్యారు. కొద్దిరోజులకు ఒక లోయలో రఘువంశీ మృతదేహం లభ్యమయ్యింది. ఇంతలో సోనమ్‌ తాను భర్తను హత్య చేశానంటూ పోలీసులకు లొంగిపోయింది. పోలీసుల దర్యాప్తులో సోనమ్‌ ప్రియుడు రాజ్‌ కుష్వాహా హస్తం ఈ హత్య కేసులో ఉందని తేలింది. కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.సోనమ్ తన వివాహానికి ముందు, ఆ తరువాత సంజయ్ వర్మ అనే వ్యక్తికి 200 కి పైగా కాల్స్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో సోనమ్‌కు సంజయ్ వర్మతోనూ సంబంధం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కేసు దర్యాప్తు చేస్తున్న మేఘాలయ పోలీసులు.. సంజయ్‌ వర్మ మరెవరో కాదని, సోనమ్‌ ప్రేమికుడు రాజ్ కుష్వాహానే అని తేల్చారు. సోనమ్.. రాజ్ నంబర్‌ను ‘సంజయ్ వర్మ’ పేరుతో సేవ్‌ చేసింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు అలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. సోనమ్, సంజయ్‌ల మధ్య 39 రోజుల వ్యవధిలో 239 కాల్స్ నడిచాయి. అయితే సంజయ్ మొబైల్ నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్‌లో ఉందని పోలీసులు చెబుతున్నారు. తాజాగా సోనమ్ సోదరుడు గోవింద్ తనకు సంజయ్ అనే వ్యక్తితో పరిచయం లేదన్నారు. మేఘాలయ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘డొక్కు బస్సుల్లో పంపిస్తారా?’.. ఇరాన్‌ విద్యార్థుల ఆగ్రహం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement