హామీల అమలుపై నోరువిప్పని ఎమ్మెల్యే ‘దొంతి’ | Sakshi
Sakshi News home page

హామీల అమలుపై నోరువిప్పని ఎమ్మెల్యే ‘దొంతి’

Published Fri, May 17 2024 5:40 AM

హామీల అమలుపై నోరువిప్పని ఎమ్మెల్యే ‘దొంతి’

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

ఖానాపురం: దొంగ హామీలతో గెలిపిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎందుకు నోరు విప్పడంలేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా దొడ్డు రకంతో పాటు ఇతర పంటలకు రూ.500 బోనస్‌ చెల్లించా లని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రంలో గురువా రం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌మార్కెట్‌ యార్డు వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల తర్వాత మాటమారుస్తున్న కాంగ్రెస్‌కు బుద్దిచెప్పాలన్నారు. ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే మాధవరెడ్డి ఎన్నికలు ముగిసాక నోరువిప్పకపోవడం దుర్మార్గమన్నారు. బోనస్‌ ఇవ్వకుంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిరసనలు తప్పవన్నారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, ఎంపీపీ ప్రకాశ్‌రావు, ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ రామస్వామి, వెంకటనర్సయ్య, శ్రీనివాస్‌గౌడ్‌, అశోక్‌, ప్రసాద్‌, అశోక్‌, వెంకన్న, శ్రీనివాస్‌గుప్త, యువరాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement