మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్ సమీపంలోని అల్గునూర్‌లో మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్ సమీపంలోని అల్గునూర్‌లో మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ తదితరులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మృత్యుంజయం తదితరులు చేపట్టిన రాస్తారోకోను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం వారందరినీ మానకొండూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో వారు విలేకరులతో మాట్లాడుతూ..మల్లన్నసాగర్ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా కేవలం 123 జీవో ద్వారా ప్రాజెక్టు కోసం నిర్బంధంగా భూమిని సేకరించటం ప్రభుత్వానికి తగదన్నారు.