Sridhar Babu
-
హెచ్‌సీయూది కాదు.. ఆ 400 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానిది (హెచ్‌సీయూ) కాదని ప్రభుత్వం పేర్కొంది. ఆ భూమి వర్సిటీదే కానప్పుడు తీసుకుంటున్నామనడంలో వాస్తవం ఏముంటుందని ప్రశ్నించింది. ఈ భూముల కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేసింది. ఈ భూమిని పరిశ్రమల స్థాపనకు వినియోగిస్తామని తెలిపింది. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో ఉన్న భూములకు చట్టబద్ధత కల్పిస్తామని వెల్లడించింది. హెచ్సీయూకు చెందిన ఇంచ్ భూమిని కూడా తీసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. పర్యావరణానికి ముప్పు తెచ్చే చర్యలు వర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఏమాత్రం చేపట్టబోమని హామీ ఇచ్చింది. హెచ్‌సీయూ భూములను లాక్కునేందుకు ప్రభు త్వం ప్రయత్నిస్తోందంటూ వివిధ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం, అభివృద్ధిని అడ్డుకునేలా బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచా రం చేస్తున్నాయని విమర్శించారు. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వ అ«దీనంలోనే ఉందని చెప్పారు. వర్సిటీకి భూమి ఇచ్చింది కాంగ్రెస్ సర్కారే: భట్టి భూమి ఇచ్చి హెచ్‌సీయూను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భట్టి అన్నారు. ఇందులో 400 ఎకరాల భూమిని తెలుగుదేశం ప్రభుత్వం బిల్లీరావుకు చెందిన మోసపూరితమైన కంపెనీ ఐఎంజీ భారత్‌కు కట్టబెట్టిందని తెలిపారు. ఈ భూమి తీసుకున్నందుకు పరిహారంగా యూనివర్సిటీకి ఆనుకునే మరోచోట (గోపన్‌పల్లి వైపు) 397 ఎకరాలు ఇచ్చిందని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారుల మధ్య అప్పట్లోనే ఒప్పందం జరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2006 నవంబర్ 21న ఐఎంజీ భారత్‌కు టీడీపీ ఇచ్చిన భూమిని రద్దు చేశారని తెలిపారు. దీంతో బిల్లీరావు హైకోర్టును ఆశ్రయించారని, కానీ వైఎస్సార్ అలుపెరగని న్యాయ పోరాటంతో ప్రజల భూమిని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళుగా ఈ భూమిని కాపాడే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. రూ.కోట్ల విలువైన భూమిని గాలికొదిలి పరోక్షంగా ఫ్రాడ్ కంపెనీకి మేలు చేసిందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి న్యాయ పోరాటం చేసి, విజయం సాధించామని, ప్రజల భూమిని ప్రజలకు చెందేలా చేశామని వివరించారు. ప్రస్తుతం ఈ భూమిని టీజీఐఐసీ ద్వారా పరిశ్రమల స్థాపనకు వినియోగించే ప్రయత్నం చేస్తున్నామని భట్టి పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చి, యువతకు ఉద్యోగాలు కల్పించడమే దీని ఉద్దేశమన్నారు. ఇందులో ప్రభుత్వంలోని ఏ ఒక్కరి స్వార్థం లేదని చెప్పారు. వర్సిటీ పరిసర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుంటే వాటికి తమ హయాంలోనే అనుమతులు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ నేతలు..ఇప్పుడు పర్యావరణం దెబ్బతింటోందని మాట్లాడటంలో అర్థం లేదని విమర్శించారు. వారి రాజకీయ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు భట్టి విజ్ఞప్తి చేశారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదు: శ్రీధర్‌బాబు కంచె గచ్చిబౌలిలోని 25వ సర్వే నంబర్లో ఉన్న భూమికి ఇప్పటివరకూ కచ్చితమైన రికార్డులు లేవని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 2016లో దీనిపై అప్పటి ప్రభుత్వం ఐఏఎస్‌లతో కమిటీ వేసిందని, ఆ కమిటీ 1,500 ఎకరాలపై యూనివర్సిటీకి హక్కులు కల్పించేందుకు కొన్ని సిఫారసులు చేసిందని చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మంత్రి విమర్శించారు. ఇటీవల తాము యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, రిజి్రస్టార్‌తో సంప్రదింపులు జరిపామని, చట్టబద్ధమైన హక్కులు కల్పించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఆ 400 ఎకరాల భూమిలో చెరువులు, బండరాళ్లు దెబ్బతింటున్నాయని ఒక వర్గం మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఫెవికాల్ బంధంతో అసత్యాల ప్రచారం: పొంగులేటి హెచ్‌సీయూ ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటోందని నిరూపించగలరా? అని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై ప్రత్యేక కమిటీ వేస్తామని, ఒక్క పక్షిగానీ, జంతువు గానీ చనిపోయిందని రుజువు చేయాలని విపక్షాలను డిమాండ్ చేశారు. రెండు ప్రతిపక్ష పార్టీలూ ఫెవికాల్ బంధంతో అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. దశాబ్దాలుగా ఈ భూమి కోర్టు పరిధిలో ఉంటే పోరాటం చేయలేని బీఆర్ఎస్, పరోక్షంగా బిల్లీరావుకు సహకరించిందని ఆరోపించారు. ప్రజల భూమిని తాము కాపాడుతుంటే అబద్ధాలతో గందగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ కృషిని చూసి విపక్షాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు మొదలు, దాని అభివృద్ధికి కృషి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని పేర్కొన్నారు. వర్సిటీ భూమిలోంచి గత ప్రభుత్వం రోడ్డు వేయబోతుంటే హెచ్‌సీయూ వీసీ కోర్టును ఆశ్రయించారని, అప్పుడు ఈ భూమిపై వర్సిటీకి అధికారం లేదని అప్పటి ప్రభుత్వం చెప్పిందన్నారు. విద్యార్థుల మనోభావాలు ఏమాత్రం దెబ్బతిననివ్వబోమని చెప్పారు. విద్యార్థుల ముసుగులో అరాచకం చేయాలని చూసే శక్తులను ఏమాంత్రం ఉపేక్షింబోమని మంత్రి హెచ్చరించారు. -
నాణ్యమైన విద్య, వైద్యం మా ప్రభుత్వ విధానం
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో కుప్పకూలిన విద్యావ్యవస్థను బాగు చేసుకుంటూ ముందుకువెళుతున్నామని, పూర్తిగా సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 11 వేలకుపైగా టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా చేపట్టామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో విద్యాశాఖ, రోడ్లు భవనాలు, పర్యాటకం, ఎక్సైజ్‌శాఖ పద్దులపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ పద్దుపై సుదీర్ఘంగా ప్రసంగించారు.ప్రస్తుతం విద్యావ్యవస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ఇదే సమయంలో కలుగజేసుకున్న శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. పైవిధంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 79 పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించామని, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగడంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని మంత్రి వివరించారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ పోస్టును సైతం భర్తీ చేయలేదంటూ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించడంతో బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు కలుగజేసుకున్నారు. ‘మా హయాంలో 26 వేల ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. 8 వేల ఉద్యోగాలు పబ్లిక్ సర్విస్ కమిషన్ ద్వారా చేశాం. గురుకులాల్లో 18 వేల నియామకాలు పూర్తి చేశాం’అని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,913 స్కూళ్లు మూతపడ్డాయని, 257 గ్రామపంచాయతీల్లో అసలు ప్రభుత్వ పాఠశాలలే లేవని సబిత తెలిపారు. కాళేశ్వరం అప్పుల కుప్ప: యెన్నం బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేయని పనులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. బీటెక్ చదివిన విద్యార్థులు సైతం ఎందు కూ పనికిరానివారిగా మారుతున్న దుర్భర స్థితి ప్రస్తుత విద్యావ్యస్థలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో తెలుగు మీడియం ఉపాధ్యాయులనే పెట్టడంతో విద్యార్థులకు తీరని అన్యా యం జరుగుతోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, దశ దిశ లేకుండా బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికి ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల కు ప్ప చేశారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణంతో ఎన్నో మార్పులు వచ్చాయని, విద్యారంగంలోనూ విద్యారి్థనులు పోటీపడుతున్నారని వివరించారు. -
మంత్రి శ్రీధర్ బాబుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైరికల్ కామెంట్
-
బండి సంజయ్ రంజాన్ గిఫ్ట్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు కౌంటర్
-
‘మేం త్వరలో బీజేపీకి మరో గిప్ట్ ఇస్తాం’
హైదరాబాద్: త్వరలో బీజేపీకి మరో గిఫ్ట్ ఇస్తామని సెటైర్లు వేశారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు.తాము బీజేపీకి ఎన్నో గిఫ్ట్ లు ఇచ్చిమని, మళ్లీ గిఫ్ట్ ఇస్తామంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ రంజాన్ గిప్ట్ లపై చేసిన వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు కౌంటర్ఇచ్చారు. ‘ మేం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చాం. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రంజాన్ గిఫ్ట్ ఇచ్చయా?, మేం కూడా బీజేపీకి త్వరలోనే మరో గిఫ్ట్ ఇస్తాం. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందాలు బయటకి వస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును గౌరవిస్తున్నాం. నరేందర్ రెడ్డికి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ల ఫెవికాల్ బంధం గట్టిగా చేసేందుకు చేసిన కృషి అందరూ చూశారు. బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ సింగ్ కి వచ్చిన ఓట్లు ఎన్ని?, తనకి బీఆర్ఎస్ సంపూర్ణ సహకారం ఇచ్చిందని రవీందర్ సింగ్ అన్నాడు. బీజేపీకి తోడుగా బీఆర్ఎస్ నిలబడింది’ అని శ్రీధర్ బాబు విమర్శించారు. -
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు.. ఆశ్చర్యంలో మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి,హైదరాబాద్ : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళం నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్‌లో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 2లక్షల 50వేల ఓట్లు పోలైతే దాదాపు 40వేల ఓట్లు పైచిలుకు చెల్లనివి కావడంతో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు.ఈ క్రమంలో కౌంటింగ్ ప్రక్రియపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరా తీశారు. చెల్లని ఓట్లు వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. చదువుకున్నవాళ్లకు ఓట్లు ఎలా వేయాలో తెలియకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చెల్లని ఓట్లపై ఏర్పడ్డ గందరగోళంపై అభ్యర్థుల ఆందోళన బాటపట్టారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
5 లక్షల కొత్త కొలువులు!
సాక్షి, హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడుల సాధన ద్వారా రాష్ట్రంలో 5 లక్షలకు పైగా కొత్త ఉగ్యోగాలను సృష్టించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ఔటర్ రింగు రోడ్డుతో పాటు కొత్తగా నిర్మితమయ్యే రీజినల్ రింగు రోడ్డు నడుమ ఫార్మా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని వెల్లడించారు. తద్వారా విభిన్న రంగాల్లో సుమారు 50 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో గత ఏడాది 150కి పైగా ప్రాజెక్టుల్లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించామని వివరించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ప్రారంభమైన రెండురోజుల ‘బయో ఆసియా 2025’ సదస్సును సీఎం ప్రారంభించి మాట్లాడారు. లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ ‘ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ ఫార్మాసిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే దిగ్గజ ఫార్మాస్యూటికల్ కంపెనీలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జర్మన్ కంపెనీ మిల్టెనీ బయోటెక్ జీనోమ్ వ్యాలీలో సెల్, జీన్ థెరపీని ప్రారంభించింది. కొత్తగా 4 బహుళ జాతి లైఫ్ సైన్సెస్ కంపెనీలు కూడా తెలంగాణలో అడుగు పెడుతున్నాయి. గడిచిన 25 ఏళ్లలో ఫార్మా, తయారీ, ఐటీ, డిజిటల్ హెల్త్ రంగాల్లో వపర్‌హౌస్‌గా హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో పేరొందిన అనేక ఫార్మా, హెల్త్‌కేర్, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై కృషి చేసే సంస్థలను ప్రోత్సహిస్తూ శాస్త్ర, సాంకేతిక నిపుణులను తయారు చేయడంతో పాటు జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. ఏటా జరిగే బయో ఆసియా సదస్సులు హైదరాబాద్‌ను ప్రపంచ లైఫ్‌సైన్సెస్ రాజధానిగా నిలబెట్టాయి. ఆరోగ్య రక్షణ రంగం భవిష్యత్తును నిర్దేశించటంతో పాటుం ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా ‘బయో ఆసియా’ దేశ విదేశాలను ఆకర్షిస్తోంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఫ్యూచర్, ఏఐ సిటీల్లో భారీ ప్రాజెక్టులు ‘రాబోయే పదేళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నాం. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో సేవల రంగాన్ని ప్రోత్సహిస్తూ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీలో అనేక భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాం. దేశంలోనే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకంతో హైదరాబాద్ ఈవీ రాజధానిగా అవతరించింది. ఆర్టీసీలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడుతున్నాం. ఔటర్, ట్రిపుల్ ఆర్‌ను రేడియల్ రోడ్లతో అనుసంధానం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. ‘చైనా ప్లస్ వన్’ అవసరాలు తీర్చే కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తాం. తెలంగాణలో మెగా డ్రైపోర్టును అభివృద్ధి చేసి ఏపీలోని ‘సీ పోర్టు’తో రైలు, రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానిస్తాం. తెలంగాణను బయో సైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా అభివృద్ధి చేస్తాం..’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హార్ట్ ఆఫ్ ది లైఫ్ సైన్సెస్‌గా జీనోమ్ వ్యాలీ: మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్రంలో కొత్తగా లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సంబంధిత పరిశ్రమల భాగస్వామ్యంతో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసేలా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా కోర్సులకు రూపకల్పన చేస్తామని చెప్పారు. ‘లైఫ్ సైన్సెస్ రంగంలో రెండు దశాబ్దాల క్రితం మొదలైన తెలంగాణ ప్రస్థానాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం. రాబోయే రోజుల్లో జీనోమ్ వ్యాలీని ‘‘హార్ట్ ఆఫ్ ది లైఫ్ సైన్సెస్’’గా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం ద్వారా 51 వేల మంది ప్రత్యక్షంగా, 1.5 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే జనరిక్ మందుల్లో 20 శాతం, వాక్సీన్ల ఉత్పత్తిలో 40 శాతం వాటా తెలంగాణ కలిగి ఉంది. 200కు పైగా దేశాలకు ఏటా 5 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఏఐ, క్వాంటం, రోబోటిక్స్ తదితర నూతన టెక్నాలజీల సాయంతో రోగుల అవసరాలకు అనుగుణంగా, వారికి త్వరగా స్వాంతన చేకూరేలా ఔషధాల సామర్థ్యాన్ని పెంచే పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి వ్యయంతో మౌలిక సదుపాయాల పరంగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చి దిద్దుతాం. అసోసియేషన్ ఆఫ్ కాంట్రాక్టు రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ (సీఆర్డీఎంవో) తన ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తుంది..’ అని మంత్రి చెప్పారు. ఆ్రస్టేలియాలోని క్వీన్స్లాండ్ గవర్నర్ జానెట్ యంగ్, వివిధ ఫార్మా, లైఫ్ సైన్సెస్ సంస్థల ప్రతినిధులు రాజీవ్‌శెట్టి, డాక్టర్ సాధన జోగ్లేకర్, జీవీ ప్రసాద్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ప్రసంగించారు. -
యూజీసీ ముసాయిదాను వ్యతిరేకిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు గండికొడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్ యూజీసీ రెగ్యులేషన్స్–2025 ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బుధవారం బెంగళూరులో జరిగిన ఆరు (బీజేపీయేతర) రాష్ట్రాల విద్యామంత్రుల సమావేశానికి.. తెలంగాణ విద్యాశాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి బదులుగా శ్రీధర్‌బాబు హాజరయ్యారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల విద్యామంత్రులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను ఆయన వెల్లడించారు. ‘ఇప్పటి వరకు విశ్వవిద్యాయాల ఉపకులపతుల నియామకాన్ని చీఫ్ సెక్రటరీ సభ్యుడిగా ఉన్న సెర్చ్ కమిటీ చేపట్టేది. అసలు రాష్ట్రాలకు సంబంధమే లేకుండా వీసీల నియామకం చేపట్టేలా డ్రాఫ్ట్ రూపొందించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉన్నత విద్యకు తెలంగాణ ఏటా రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అవసరమైన చోట కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తోంది’.. అని మంత్రి వెల్లడించారు. అయితే దీనిని ప్రోత్సహించాల్సిందిపోయి ఆటంకాలు కల్పించడమేమిటని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఉప కులపతులుగా పరిశ్రమల అధిపతులను, బ్యూరోక్రాట్లను, బయటి వ్యక్తులను నియమించే అవకాశాన్ని కల్పించాలన్న డ్రాఫ్ట్ రెగ్యులేషన్‌లోని ప్రతిపాదనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా సంస్థల్లో మూడు వేల మంది విద్యార్థులుంటేనే గ్రేడింగ్‌లు ఇస్తామని, ఉన్నత గ్రేడ్లు వస్తేనే కేంద్ర ప్రోత్సాహకాలు అందుతాయన్న ప్రతిపాదనను కూడా శ్రీధర్ బాబు వ్యతిరేకించారు. ఇది ప్రైవేటు యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలకు మేలు కలిగించే చర్య అని ఆరోపించారు. పేదలను ఉన్నత విద్యకు దూరం చేసే చర్య బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థులను ఎంపిక చేయాలనడం పేదలను ఉన్నత విద్యకు దూరం చేసే ఆలోచనగా మంత్రి శ్రీధర్‌బాబు అభివర్ణించారు. ‘దేశ సరాసరి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కేవలం 28 శాతం మాత్రమే ఉంది. అంటే ఉన్నత విద్య చదవాల్సిన వయసులో ఉన్న యువతలో నూటికి 28 మంది మాత్రమే కళాశాలల్లో చేరుతున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలంటే ఎంట్రన్స్ పెట్టాలనే ఆలోచనలు ఆటంకాలు సృష్టిస్తాయి. ఇప్పటిదాకా వైస్ చాన్స్లర్ల పదవీకాలం 3 సంవత్సరాలు ఉండగా యూజీసీ రెగ్యులేషన్స్‌లో 5 సంవత్సరాలకు పెంచాలనే ప్రతిపాదన సరికాదు’.. అని పేర్కొన్నారు. అలాగే ఆన్లైన్, కరెస్పాండెన్స్ కోర్సులకు అనుమతులివ్వబోమని చెప్పడం విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. డ్రాఫ్ట్ యూజీసీ నిబంధనలు తెలంగాణకు ఆమోదయోగ్యంగా లేవని సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఇప్పటికే అధికారికంగా లేఖ రాయడాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యకు సంబంధించిన ఏ ప్రతిపాదనలైనా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే నిబంధనలు రూపొందించాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. యూజీసీ రెగ్యులేషన్స్ –2025లోని 15 అంశాలను వ్యతిరేకిస్తూ, అమలును నిలిపివేయాలని రాష్ట్రాల విద్యామంత్రుల సమావేశం ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరుతూ తీర్మానం చేసింది. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఎ.శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు. -
కేంద్ర బడ్జెట్ పై అసంతృప్తి!
-
హైదరాబాద్ శివార్లలో రెండు కొత్త ఐటీ పార్కులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ‘డ్యూ’సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం సచివాలయంలో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘ఐటీ రంగంలో వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్‌లో పెట్టుబడుల కోసం ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైటెక్ సిటీ తరహాలో నగర శివార్లలో కొత్తగా మరో రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తాం. వీటి ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై అధికారులు అధ్యయనం చేస్తారు. ఐటీ పార్కుల్లో పనిచేసే ఉద్యోగులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు రవాణా సౌకర్యాలు కల్పిస్తాం. నగరంలోని నలుమూలల నుంచి ఈ పార్కులకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తాం. ఈ పార్కుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలకు అవకాశం కల్పిస్తాం’అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. ‘పెట్టుబడులతో ముందుకొచ్చే పరిశ్రమలకు భూకేటాయింపులపై ఇప్పటివరకు ప్రత్యేక పాలసీ లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రత్యేక పాలసీని రూపొందించి పెట్టుబడి, కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా భూమిని కేటాయిస్తాం. హైదరాబాద్‌లో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన డ్యూ సాఫ్ట్ వేర్ కంపెనీకి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తాం’అని శ్రీధర్‌బాబు వివరించారు. కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ డా.విష్ణువర్ధన్‌రెడ్డి, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, ‘డ్యూ’వెంచర్స్ ప్రెసిడెంట్ సురేశ్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘అలెరియా ఏఐ’తో పన్నుల రాబడిలో పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం నష్టపోకుండా ‘అలెరియా ఏఐ’టెక్నాలజీ దోహదపడుతుందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అలెరియా ఏఐ సంస్థ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో మంత్రి ఎదుట ‘అలెరియా ఏఐ’సాంకేతికతపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆఫ్‌లైన్‌లో పనిచేసే ఈ టూల్‌ను ప్రభుత్వ విభాగాలతో అనుసంధానం చేస్తే పన్ను, ఆదాయ రాబడిలో నష్టపోతున్న 30 శాతాన్ని తిరిగి పొందవచ్చని సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. వివిధ పథకాల్లో లబ్దిదారుల ఎంపికలో అర్హులు మాత్రమే ప్రయోజనం పొందేలా అలెరియా ఏఐ సహాయ పడుతుందని వారు వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో ఐబీటీ సీఈవో మన్సూర్ అలీఖాన్, అలెరియా సీఈవో ఎరిక్ లియాండ్రీ, ఇన్నోలాజిక్ సీఈవో శివ దొండపాటి తదితరులు ఉన్నారు. -
Telangana: దావోస్‌లో కుదిరిన ఒప్పందం.. రూ. 45,500 కోట్ల పెట్టుబడి
సాక్షి, హైదరాబాద్: దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో తెలంగాణ రూ.45,500 కోట్ల భారీ పెట్టుబడిని సాధించింది. దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో ఈ మేరకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. బుధవారం సన్ పెట్రో ఎండీ దిలీప్ సాంఘ్వీతో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చర్చల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి సమక్షంలో ఈ పెట్టుబడికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులతో పాటు మూడుచోట్ల భారీ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పుతుంది. నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలో ఏర్పాటయ్యే ఈ మూడు ప్రాజెక్టుల ఇంధన సామర్థ్యం 3400 మెగావాట్లు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే సుమారు 7 వేల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. హరిత ఇంధన ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేస్తాం: సీఎం హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయతి్నస్తున్నామని, సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించాలనే లక్ష్య సాధనలో ఈ ఒప్పందం ఓ మైలు రాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు. సన్ పెట్రో కెమికల్స్ చేపట్టబోయే ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ప్రభావశీలంగా ఉంటుందని దిలీప్ సాంఘ్వీ చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో అందరి దృష్టినీ తెలంగాణ ఆకర్షిస్తుందన్నారు. పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి ఇన్వెస్టిమెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చర్చల్లో పాల్గొన్నారు. ‘కంట్రోల్ ఎస్’ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక ‘ఏఐ డేటా సెంటర్ క్లస్టర్’ ఏర్పాటుకు ‘కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్’ ముందుకు వచ్చింది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల ఉద్యోగాలు లభిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి ప్రకటించారు. రాష్టంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలు రాయిగా నిలుస్తుందని మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. రూ.800 కోట్లతో ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ రాష్ట్రంలో అధునాతన మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్‌ను రూ.800 కోట్లతో ఏర్పాటు చేసేందుకు జేఎస్‌డబ్ల్యూ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్ అనుబంధ సంస్థ ‘జేఎస్‌డబ్ల్యూ యూఏవీ’తో రాష్ట ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారే అవకాశముంది. -
ప్రజల ముంగిటకు పౌరసేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. టెక్నాలజీ సాయంతో నిపుణులను భాగస్వాములను చేస్తూ పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామన్నారు. తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ (ఈఎస్డీ) రూపొందించిన ‘మీ టికెట్’యాప్‌ను గురువారం సచివాలయంలో శ్రీధర్‌బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ని రకాల టికెట్ బుకింగ్స్‌ను ఒకే ప్లాట్ ఫాం పైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించామన్నారు.భవిష్యత్తులో ఇదే తరహాలో మరిన్ని యాప్‌లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ‘ఈ యాప్‌లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లను బుక్ చేసుకోవచ్చు.పర్యాటకులు ఎంచుకున్న లొకేషన్‌కు సమీప ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా యాప్‌లో ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఈ యాప్ ను చాలా సులువుగా వినియోగించుకోవడంతో పాటు యూపీఐ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు. ఇతర ప్లాట్‌ఫాంల మాదిరిగా ఈ యాప్ లో అదనంగా ఎలాంటి చార్జీలను వసూలు చేయం’అని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మీ సేవ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ డా.జి.మల్సూర్, జూపార్క్స్ డైరెక్టర్ డా.సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో కొత్త జీసీసీ ఏర్పాటుకు ప్రణాళికలు
హైదరాబాద్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు హబ్‌గా మారుతోంది. హెల్త్ సెక్టార్లో సేవలందిస్తున్న ఎలీ లిల్లీ అండ్ కంపెనీ హైదరాబాద్‌లో కొత్తగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్(GCC)ను ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రకటించింది. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఎలీ లిల్లీ సేవలందిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే 2016లో బెంగళూరులో జీసీసీను ఏర్పాటు చేసింది. త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించబోయే జీసీసీ ఇండియాలో రెండోది కావడం విశేషం. కొత్త జీసీసీ(Global Capability Center)ను హైదరాబాద్‌కు ఆహ్వానించడం సంతోషంగా ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హెల్త్ కేర్ ఇన్నోవేషన్‌లో హైదరాబాద్ ఖ్యాతి పెరుగుతోందని చెప్పారు.లిల్లీ కెపాసిటీ సెంటర్ ఇండియా (ఎల్‌సీసీఐ)గా పిలవబడే ఈ కొత్త జీసీసీ ద్వారా స్థానికంగా మరింత సాంకేతిక సేవలు అందించడంతోపాటు అంతర్జాతీయంగా కూడా ఈ సెంటర్ సేవలు ఎంతో కీలకం కానున్నాయని కంపెనీ తెలిపింది. ఈ సెంటర్లో టెక్నాలజీ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులతో సహా సుమారు 1,000 నుంచి 1,500 మంది నిపుణులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఎలీ లిల్లీ(Eli Lilly) తెలిపింది. ఈ జీసీసీ 2025లోనే అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరుఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఆఫీసర్ డియోగో రావ్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగ్గా మార్చాలనుకునే సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తీసుకొస్తాం’ అని చెప్పారు. కొత్త సాంకేతిక పురోగతిని ఉపయోగించుకుంటూ వినూత్న ఆవిష్కరణలతో సంస్థ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి హైదరాబాద్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త ఎల్‌సీసీఐ వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. -
ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీల భర్తీ
సాక్షి, హైదరాబాద్/ మణికొండ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని ‘టీజీ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ’లో శనివారం జరిగిన 196 మంది డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదేళ్లుగా నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీని సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కించిందన్నారు. ‘భర్తీ ప్రక్రియలో ఏర్పడిన న్యాయపరమైన ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ నియామక పత్రాలను అందజేస్తున్నాం. ఈ విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. హోంశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు’అని పేర్కొన్నారు.అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు. ఎక్కడ విపత్తు తలెత్తినా రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలను కాపాడుతారన్నారు. కాగా, ఏడాది వ్యవధిలోనే అగ్నిమాపక శాఖకు సంబంధించిన విభాగాల్లో 878 మందిని భర్తీ చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేస్తామన్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న 196 మంది డ్రైవర్ ఆపరేటర్లకు మంత్రి అభినందనలు తెలిపారు.ఉద్యోగాల్లో చేరిన తర్వాత నీతి, నిజాయితీతో వ్యవహరించాలని, ఆపదలో ఉన్న వారిని కాపాడటం గురుతర బాధ్యతగా భావించాలని సూచించారు. అనంతరం అగి్నమాపక శాఖ కార్యక్రమాలను ఫైర్ డీజీ నాగిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ నాగపూర్ణ శ్రీనివాస్, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ టి.మల్లేశ్ ముదిరాజ్, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ కె.వేణుగౌడ్, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవి గుప్తా, అగి్నమాపకశాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడుల కోసం తెలంగాణలో అత్యంత అనుకూల వాతావరణం ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మలేషియా పారిశ్రామికవేత్తలను కోరారు. శ్రీధర్‌బాబు గత నెలలో మలేషియా తెలుగు మహాసభలకు హాజరైన సందర్భంగా అక్కడి పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించారు.ఈ మేరకు పలువురు పారిశ్రామికవేత్తలు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ చొరవతో సోమవారం సచివాలయంలో మలేషియా వాణిజ్య ప్రతినిధులతో మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సౌర విద్యుత్ రంగం, డ్రైపోర్టుల నిర్మాణం, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, మహిళా పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలకు విదేశాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి హుస్సేన్ సాగర్‌లో పూడికతీత, మురుగు నీటి శుద్ధికోసం అత్యాధునిక సీవరేజీ ప్లాంట్ల ఏర్పాటులో పాలు పంచుకోవాలని మలేషియా పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డ్రైపోర్టుల నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ... ప్రస్తుతం మలేషియా నుంచి పామాయిల్ మొలకలు దిగుమతి చేసుకుంటున్నామని, అలా కాకుండా విత్తనాలు సరఫరా చేయడానికి గానీ, ఇక్కడే నర్సరీ ఏర్పాటు చేయడానికి గానీ ముందుకొస్తే సహకరిస్తామని చెప్పారు. -
ఎమ్మెల్యే వివేకానందపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
-
చిన్న పట్టణాలకు ఐటీ విస్తరణ
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలోని టైర్–2, టైర్–3 పట్టణాలలో ఐటీ సంస్థల ఏర్పాటుకు కంపెనీలు ముందుకురావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ఆదివారం నానక్‌రాంగూడలోని వంశీరామ్ సువర్ణదుర్గా టెక్ పార్కులో గ్లోబల్ ఐటీ, ఇంజనీరింగ్ సొల్యూషన్స్ సంస్థ ‘టెక్‌వేవ్ ఏర్పాటుచేసిన మొదటి ఏఐ ఇంజనీరింగ్ హబ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారని, వారి కోసం ట్రిపుల్ ఐటీలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. టైర్–2, టైర్–3 పట్టణాలలో రోడ్డు, విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పట్టణాలలో ఐటీ సంస్థలను ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పట్టణాల అభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. నిబద్ధత ఉంటే ఏదైనా సాధ్యమే.. నిబద్ధత, చిత్తశుద్ధి, ప్రతిభ ఉన్న నాయకత్వం ఉంటే ఎలాంటి సంస్థలకైనా ప్రగతి సాధించేందుకు అవకాశం ఉంటుందని, అందుకు టెక్‌వేవ్ సంస్థనే ఉదాహరణ అని శ్రీధర్‌బాబు తెలిపారు. పది దేశాలలో 3,500 మంది ఉద్యోగులు కలిగి, 20 ఏళ్లు పూర్తి చేసుకొన్న టెక్‌వేవ్ సంస్థ యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు.కార్యకలాపాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని ఈ సంస్థ ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో టెక్‌వేవ్ సంస్థ చైర్మన్ దామోదరరావు గుమ్మడపు, సీఈఓ రాజ్ గుమ్మడపు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో ఉత్తమ శాసనసభ వక్త అవార్డు: శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ అంటే అందరిదీ.. ఏ ఒక్క పార్టీకి చెందినది కాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన నేతలందరూ సభకు హాజరయ్యే సంప్రదాయం కొనసాగించాలని కోరారు. సిద్ధాంతపరంగా బేధాలున్నప్పటికీ.. సభలో ఎవరి పాత్ర వాళ్లు పోషించాలన్నారు.శాసనసభ వ్యవహారాలపై తెలంగాణ శాసనసభ, మండలి సభ్యులకు బుధ, గురువారాల్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘మొదటి సారి ఎన్నికైన శాసనసభ్యులు 57 మంది శాసన సభలో ఉన్నారు. శాసన సభ అందరిది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో మరొక పార్టీదో కాదు. ఈ ట్రైనింగ్ సెషన్స్ కోసం అందరికీ ఆహ్వానం పంపించాము.పాత రోజుల్లో సిద్ధాంత పరంగా భేదాభిప్రాయాలు ఉన్నా సభలో ఎవరి పాత్ర వారు పోషించారు. నేను మొదటిసారి ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. నేను నాలుగోసారి సభలో ఉన్నప్పుడు పీఏసీని ప్రతిపక్షానికి ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు అందరూ శాసనసభకు హాజరయ్యే సాంప్రదాయం కొనసాగించాలి. ఎమ్మెల్యేగా గెలిచి సభ రాకుండా దూరంగా ఉండకండి. పార్లమెంట్లో ఎలాగైతే ఉత్తమ పార్లమెంటేరియన్ ఇస్తున్నారో అదే విధంగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు ఇవ్వాలని స్పీకర్‌ను కోరుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..‘చట్టాలను రూపొందించే హక్కు శాసన సభ్యులకు ఉంటుంది. గతంలో శాసనసభ సమావేశాలు ఉంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునే వారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ మాదిరిగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు పరిశీలన చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు.తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ..‘గాలివాటం రాజకీయాలు ప్రారంభం అయినప్పటికీ కొత్త వాళ్ళు మళ్ళీ గెలవడం లేదు. మొదటిసారి ఎన్నికై రాజకీయాల్లో సక్సెస్ అయ్యే వారి శాతం 25శాతమే. కొందరు నాయకులు గెలిచాక ప్రజలతో మమేకం కావడం లేదు. ఎమ్మెల్యేకు కోటరీ వల్ల ప్రజలు స్వయంగా ఎమ్మెల్యేను కలిసే అవకాశం ఎక్కువగా ఉండదు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. ఫోన్లు ఎత్తాలి. నేను ఒకసారి ఓడిపోవడానికి నాకు సెక్యూరిటీ సమస్య వల్లే. ప్రజలు ఎమ్మెల్యేకు దూరం అవ్వడానికి కారణం పీఏలు, పీఆర్వోలు అంటూ కామెంట్స్ చేశారు. -
8 నెలల్లో ఇంటింటికీ ఇంటర్నెట్
సాక్షి, హైదరాబాద్: టీ–ఫైబర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని అన్ని ఇళ్లకు వచ్చే 6–8 నెలల్లో తక్కువ ధరకే హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీతోపాటు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రకటించారు. దీనివల్ల ప్రతి ఇంట్లో టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్‌తోపాటు కంప్యూటర్ ఆధారిత అన్ని రకాల సేవలు అందుబాటులో వస్తాయన్నారు.ఇప్పటికే అన్ని గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ఏర్పాటు పనులు పూర్తికావొచ్చాయని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మద్దూరు (కొడంగల్ నియోజకవర్గం), సంగంపేట (అందోల్), అడవి శ్రీరాంపూర్ (మంథని) గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చిన టీ–ఫైబర్ ఇంటర్నెట్ సేవలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులతో వర్చువల్‌గా సంభాషించి అభినందనలు తెలిపారు. అలాగే పరిశ్రమల శాఖ ప్రవేశపెట్టిన పలు యాప్‌లను ఆయన ఆవిష్కరించారు. ఇక 2 రోజుల్లో పంట రుణాలు.... రైతులు పంట రుణాలు పొందడానికి ప్రస్తుతం 30 రోజుల సమయం పడుతుండగా కొత్తగా ఆవిష్కరించిన స్మార్ట్ అగ్రి క్రెడిట్ సర్విస్ యాప్ ద్వారా కేవలం 2 రోజుల్లోనే పొందవచ్చని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. అలాగే రైతులు వాయిస్ కమాండ్ ద్వారా ఎరువులు, క్రిమికీటకాల నివారణ వంటి అంశాల్లో సూచనలను సైతం పొందవచ్చని చెప్పారు. డ్రగ్స్పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కలి్పంచడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ‘మిత్ర–తెలంగాణ’అనే మరో యాప్‌ను తీసుకొచ్చామన్నారు. ఇక యాప్ ద్వారా మీ–సేవ మీ–సేవ విస్తరణలో భాగంగా స్టడీ గ్యాప్ సర్టిఫికెట్, పేరు మార్పు, లోకల్ క్యాండిడేట్, మైనారిటీ, ఇన్కమ్, క్యాస్ట్, క్రీమీలేయర్/నాన్ క్రీమీలేయర్ సరి్టఫికెట్లతోపాటు సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ ఫిర్యాదులు, వణ్యప్రాణుల దాడిలో మరణించే వ్యక్తులు, పశువులకు నష్టపరిహారం, టింబర్ డిపో/సామిల్స్‌కు పరి్మట్ల జారీ/రెన్యూవల్ కలిపి మొత్తం 9 సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని శ్రీధర్‌బాబు తెలిపారు.కొత్తగా ఆవిష్కరించిన మీ–సేవ యాప్, ‘కియోస్‌్క’లతో సైతం ఇప్పటికే మీ–సేవ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 400కిపైగా సేవలను ప్రజలు పొందొచ్చని వివరించారు. టీ–వర్క్స్–బిట్స్ పిలానీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ(సీఆర్‌ఈఎన్‌ఎస్)ని మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్య అన్వేషణ, అభివృద్ధికి ‘రూరల్ వర్క్స్’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు.రూ. 7,592 కోట్ల పెట్టుబడులతో 3 మెగా పరిశ్రమలురాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, విస్తరణకు రూ. 7,592 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన 3 కంపెనీలతో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో పరి శ్రమల శాఖ 4 పరస్పర అవగాహన ఒప్పందా (ఎంవోయూ)లు కుదుర్చుకుంది. ఆయా సంస్థల ఏర్పాటుతో 5,200 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. సీతారాంపూర్‌లో 4 గిగావాట్ల సౌర విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న ‘ప్రీమియర్ ఎనర్జీస్’.. వ్యాపార విస్తరణలో భాగంగా రూ. 1,950 కోట్లతో సోలార్ ఇంగాట్స్ అండ్ అల్యూమినియం ప్లాంట్ ఏర్పా టు చేసేందుకు, మరో రూ. 3,342 కోట్ల పెట్టుబడితో 4 గిగావాట్ల సోలార్ పీవీ టాప్కాన్ సెల్, 4 గిగావాట్ల సోలార్ పీవీ టాప్కాన్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చిందన్నారు.అలాగే రూ. 1,500 కోట్లతో ‘లెన్స్‌కార్ట్’ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లద్దాలు, అనుబంధ ఉత్ప త్తుల తయారీ హబ్‌ను ఫ్యాబ్‌సిటీలో ఏర్పాటు చేయనుందని వివరించారు. ఆజా ద్ ఇంజనీరింగ్ సంస్థ ఘణపూర్‌లో రూ. 800 కోట్లతో సూపర్ అల్లాయ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రగతిని అడ్డుకోవడానికి చాలా మంది విషప్రచారం చేసినా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తాము తెచ్చిన పాలసీకి విశేష స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలో త్వరలో 2 వేల ఎకరాల్లో రూ. 1,500 కోట్లతో కొత్తగా 12 మినీ ఇండస్ట్రీయల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. -
Sridhar Babu: రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోంది
-
హైదరాబాద్‌కు MNC కంపెనీలు.. అందుబాటులోకి కొత్త యాప్: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌కు ఎంఎన్సీ కంపెనీలు చాలా వస్తున్నాయి. ఈ క్రమంలోనే బిల్డ్ నౌ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి వెల్లడించారు.మంత్రి శ్రీధర్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. లీజింగ్ మార్కెట్ శరవేగంగా పెరుగుతోంది. లేఔట్ పర్మిషన్లు దాదాపు 22 శాతం పెరిగాయి. హైదరాబాద్‌కు ఎంఎన్సీ కంపెనీలు చాలా వస్తున్నాయి. గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాం. ఈ క్రమంలోనే బిల్డ్ నౌ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం.ప్రతి దరఖాస్తును ధృవీకరించి ట్రాక్ చేసేందుకు నమ్మకాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ అవకాశం కల్పిస్తుంది. డిజిటల్ రంగంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. గత సంవత్సరం కాలంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రక్షణ శాఖ భూములకు ఆమోదం పొందటం జరిగింది. రెండు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణం 18కి.మీల పొడవుతో నిర్మాణం చేపడుతున్నాం. ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫాం వరకు 5.2km కారిడార్ నిర్మాణం చేపడుతాం. నగర సుందరీకరణ, పచ్చదనం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము.రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. బెంగళూర్ కన్నా మన దగ్గర 467 మంది UHAI ఉన్నారు. ఐటీ రంగంలో 45000 జాబ్స్.. దాదాపు 10 లక్షల మంది ఐటీ రంగంలో పని చేస్తున్నారు. దేశంలో ఈరోజు 21% గ్లోబల్ సెంటర్లు హైదరాబాద్‌లో ఉన్నాయి. నగరాలకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చే సంస్థ సావిల్స్ గ్రో హబ్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే టాప్ 5గా ఉంది. ప్రపంచంలోనే మొదటి స్థానం రావాలి అని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము.ఆన్లైన్లో నూతన భవన, లేఅవుట్‌కు సంబంధించిన వ్యవస్థను ప్రవేశ పెట్టాము. డ్రాయింగ్, స్కూటిని ప్రొపెస్ లేట్ అవుతుంది అని మా దృష్టికి తీసుకొని రావటం జరిగింది. వినియోగదారులకు వారాల నుండి నిమిషాల వ్యవధికి తగ్గించడానికి బిల్డ్ నౌను ప్రవేశ పెడుతున్నాం. ఇది భవన నిర్మాణానికి అవసరమైన సమాచారాన్ని, అనుమతులను, వివరాలను వేగంగా అందిస్తుంది. 3D టెక్నాలజీ ద్వారా ప్రజలు తమ భవన నిర్మాణం ముందే అగ్మెంటెడ్ విసువలైజేషన్ ద్వారా చూడవచ్చు. త్రీడీలో పెద్ద పెద్ద భవనాలు, ఫ్లాట్స్ మోడల్ త్రీడీలో వీక్షించే అవకాశం ఉంది. ఇంగ్లీష్ తెలుగు, ఉర్దూ, భాషల్లో బిల్డ్ నౌ టెక్నాలజీ సేవలు ఉంటాయి అని తెలిపారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాలను అమలు చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోటి నెరవేరుస్తున్నాం. ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్నాం’ అని కామెంట్స్ చేశారు. -
చిన్న కాళేశ్వరానికి రూ. 571 కోట్లు
సాక్షి, హైదరాబాద్: చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మిగులు పనుల పూర్తికి ప్రభుత్వం రూ.571 కోట్లతో పాలనాపర అనుమతులు జారీ చేసిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. మంథని నియోజకవర్గం పరిధిలోని 63 గ్రామాలను సస్యశ్యామలం చేయడానికి 2007లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకి సంబంధించిన 75 శాతం పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చేర్చి సత్వరం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీధర్‌బాబు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శనివారం జలసౌధలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి 45 వేల ఎకరాలకు సాగునీరు, 0.5 టీఎంసీలను తాగునీటి అవసరాలకు అందిస్తామన్నారు. గోదావరి నుంచి అప్రోచ్ కాల్వ ద్వారా నీళ్లను కన్నెపల్లి వద్ద ఒకటో పంప్‌హౌస్‌కి తరలించి అక్కడి నుంచి మందిరం చెరువు, ఎర్ర చెరువుకు, ఆ తర్వా త రెండో పంప్‌హౌస్‌కి ఎత్తిపోస్తారు. మొత్తం 4.2 టీఎంసీలను రెండో పంప్‌హౌస్‌కు పంప్‌చేస్తారు. కాగా, వరదకు తెగిపోయిన రుద్రారం చెరువు పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. శ్రీరాంసాగర్ నీటితో 28 వేల ఎకరాల ఆయకట్టు మంథని నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ కింద 28,800 ఎకరాల ఆయకట్టు ఉంది. డీ–83 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా గుండారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు చేరుకోవాలి. అక్కడి నుంచి 24 మైనర్ కాల్వల ద్వారా మొత్తం 28,800 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కాలక్రమేణా కాల్వల్లో పూడిక చేరడంతో నిర్దేశిత ఆయకట్టుకు నీరు అందడం లేదు. గుండారం చెరువు నుంచి చివరి వరకు మరమ్మతులు చేసినీటి సామర్థ్యాన్ని పెంచాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. -
మూసీ నిద్రకు ఆలౌట్లు,మస్కిటో కాయిల్స్ అవసరమా?: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,హైదరాబాద్:పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బీజేపీ నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం(నవంబర్17) మీడియాతో మాట్లాడారు.‘నిర్వాసితుల సమస్యలు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఆలౌట్లు,మస్కిటో కాయిల్స్ అవసరమా..? కిషన్‌రెడ్డి నిజాయితీగా నిద్రకు వెళితే మూసీ రివర్‌బెడ్‌లో నివసించే వారి కష్టాలు తెలిసేవి.కలుషితమైన నీరు,గాలి మధ్య వారంతా దుర్భర జీవితం గడుపుతున్నారు. మూసీ నిర్వాసితుల కష్టాలు తెలవాలంటే అక్కడికి వెళ్లి ఉండాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయని మూసీ నిద్ర ఎంచుకున్నారు.మంచి నీరు,మంచి వాతావరణం కల్పించాలని ప్రభుత్వం చూస్తోంది.ఓట్లు వేసి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే ప్రక్షాళన అడ్డుపడుతున్నారు.గోడలు కడితే సరిపోతుంది అంటూ బీజేపీ నాయకులు అంటున్నారు.డీపీఆర్ వచ్చాక గోడలు కట్టాలో ఇంకేమైనా చెయ్యాలా అనేదానిపై సలహాలు ఇవ్వండి’అని శ్రీధర్‌బాబు సూచించారు. -
సింపతీ కోసమే కేటీఆర్ అరెస్ట్ డ్రామా: శ్రీధర్ బాబు
సాక్షి, సచివాలయం: ప్రజల్లో సానుభూతి కోసమే కేటీఆర్ పదే పదే అరెస్ట్ అంటూ మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. లగచర్ల ఘటనలో కలెక్టర్‌ను చంపే కుట్ర జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, రైతుల విషయంలో ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం ఆపాలని డిమాండ్ చేశారు.మంత్రి శ్రీధర్ బాబు సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల ఘటనలో ఎవ్వరనీ వదిలిపెట్టం. దీనిపై విచారణ జరుగుతోంది. రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయి. లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్టు వారి పార్టీ నాయకులే అంటున్నారు. కేటీఆర్ పదే పదే అరెస్ట్ అనడం కేవలం సానుభూతి కోసమే. ఆయనను అరెస్ట్ చేయడానికి మేమేమీ కుట్రలు చేయడం లేదు. సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తి అయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయి.గత పదేళ్లలో రైతులకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తోంది. సన్న వడ్లు పండించిన ధాన్యానికి 500 బోనస్ ఇస్తున్నాం. ధాన్యం సేకరించిన వారం రోజులలోపే ఐదు వందల బోనస్ రైతులకు అందుతాయి. రైతుల విషయంలో ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం ఆపాలి. ఇప్పటి వరకు 33కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రాసెస్ జరిగింది. 66 లక్షల ఎకరాల్లో 140 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది.కాళేశ్వరంతోనే నీళ్లు ఇచ్చాం అన్నారు.. మరి ఈ ధాన్యం ఉత్పత్తి కాళేశ్వరంతో కాలేదు కదా?. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు. బీజేపీ తమ బాధ్యతలను విస్మరిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలి. గత ప్రభుత్వ హయంలో గుట్టలకు, పుట్టలకు, చెట్లకు రైతుబంధు ఇచ్చారు. ఇలాంటి విధానాన్ని మేము కొనసాగించం.. నిజమైన రైతులకు న్యాయం చేస్తాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
పారదర్శకంగా భూసేకరణ
మాదాపూర్: పరిశ్రమల కోసం భూసేకరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో రెండు నెలల్లో లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ రంగంలో రాష్ట్రంలో కంపెనీలు నెలకొల్పేందుకు ముందుకొచ్చే సంస్థలకు భూ కేటాయింపు, ప్రోత్సాహకాలకు సంబంధించిన విధానాన్ని ఈ పాలసీలో వెల్లడిస్తామని చెప్పారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో గురువారం ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగంపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒకే చోట కాకుండా పలు ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పది నెలల్లో రాష్ట్రంలో రూ.35,820 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని చెప్పారు. 141 దేశీయ, బహుళజాతి కంపెనీలు ఔషధ టీకాలు, లైఫ్ సైన్సెస్, పరిశోధన రంగాల్లో పనులు ప్రారంభించాయని వెల్లడించారు. ఇవన్నీ పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తే 51,086 మందికి ప్రత్యక్షంగా, లక్షన్నర మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఫార్మా రంగంలో ఆసియాలోనే మూడో పెద్ద కంపెనీ అయిన టకెడా లైఫ్ సైన్సెస్ హైదరాబాద్‌లోని బయోలాజికల్– ఈ (బీఈ)తో కలిసి ఏటా ఐదుకోట్ల డెంగ్యూ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుందని, వీటిని ప్రపంచమంతా ఎగుమతి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్, టీజీఐఐసీ సీఈఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతారో తెలుసు: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగిచర్లలో కలెక్టర్‌పై దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదిస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ విషయమై శ్రీధర్‌బాబు మంగళవారం(నవంబర్ 12) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.‘పరిశ్రమలు రాకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ అశాంతిని రగులుస్తోంది.ప్రభుత్వ పరంగా ఎక్కడ తప్పు జరిగిందో తేల్చుతాం.లా అండ్ ఆర్డర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు.కేటీఆర్ అన్నంత మాత్రానా ఎవరికి ఎవరూ భయపడరు.రాజకీయాల కోసం దాడులకు తెగబడితే కఠిన చర్యలు తప్పవు.కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతారో అందరికీ తెలుసు.కేసుల నుంచి తప్పించాలని ఢిల్లీని వేడుకుంటున్నారు.అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏటీఎంగా ఉందా..మోదీ ఆరోపణలన్నీ రాజకీయ లబ్ది కోసమే.బీజేపీ,బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయి’అని శ్రీధర్‌బాబు ఆరోపించారు.కాగా కలెక్టర్‌పై దాడి ఘటన మీద జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్,ఐజీ సత్యనారాయణ,ఎస్పీ నారాయణ రెడ్డి హాజరయ్యారు.ఘటన వివరాలను శ్రీధర్‌బాబు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పోలీసుల తీరుపై శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఘటనపై రిపోర్టు ఇవ్వాలని డీజీపీ, సీఎస్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దాడిపై పోలీస్ శాఖ నివేదికను సిద్ధం చేస్తోంది. ఇదీ చదవండి: ఫార్మాపై రైతుల ఫైర్.. అధికారులపై దాడి -
8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ ఈవెంట్: పోస్టర్ ఆవిష్కరించిన ఐటీ మంత్రి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి 'దుద్దిళ్ల శ్రీధర్ బాబు' మాదాపూర్‌లోని టీ-హబ్‌లో '8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ 2024' ఈవెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నవంబర్ 20న జరగనుంది. దీనికి డిజైన్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖు హాజరుకానున్నారు.8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ 2024 ఈవెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డిజైన్, టెక్నాలజీని ప్రోత్సహించడంలో తెలంగాణ నిబద్ధతకు ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. కాన్క్లేవ్ పరిశ్రమ అభివృద్ధికి కొత్త అవకాశాలను పెంపొందిస్తూ సృజనాత్మకతను పెంచుతుంది. అంతే కాకుండా ఇది కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్ ఖ్యాతిని బలోపేతం చేస్తుందని అన్నారు.నవంబర్ 9న (శనివారం) జరిగిన ఈ కార్యక్రమానికి డిజైన్ విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, సలహాదారులతో సహా మొత్తం 250 మంది హాజరయ్యారు.8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ 2024 ప్రతినిధి 'రాజ్ సావంకర్' ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన పరిశ్రమ నిపుణుల నేతృత్వంలో ప్యానెల్ చర్చలను హోస్ట్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాము. హాజరైనవారు విభిన్న రంగాలలో సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం సృజనాత్మకత, సాంకేతికతను కలిపే ఏకైక వేదిక, అంతే కాకుండా.. ఇది భవిష్యత్ పురోగతికి కూడా వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు. -
రూ.300 కోట్లతో ‘షూఆల్స్’ కర్మాగారం!
సాక్షి, హైదరాబాద్: మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో కర్మాగారం ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 750 ఎకరాలు కేటాయిస్తే రూ. 300 కోట్లతో అత్యాధునిక షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని చెప్పిందన్నారు. దక్షిణ కొరియా నుంచి వచి్చన షూఆల్స్ చైర్మన్ చెవోంగ్ లీ, ఆ సంస్థ ప్రతినిధులు గురువారం సచివాలయంలో తనను కలిసినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. 87 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగల గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారన్నారు.మెడికల్ చిప్‌తో కూడిన బూట్ల సోల్స్, జీపీఎస్ అమర్చిన బూట్లు, 10 వేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే బూట్లతోపాటు మధుమేహం, కీళ్ల నొప్పుల బాధితులకు నడకలో ఉపశమనం కలిగించే పలు రకాల ఉత్పత్తులను తాము తయారు చేస్తామని చెవోంగ్ లీ పేర్కొన్నట్లు శ్రీధర్‌బాబు వివరించారు. అలాగే 5 వేల ఎకరాలు కేటాయిస్తే ఆసియాలో ఎక్కడాలేని విధంగా స్మార్ట్ హెల్త్సిటీని నెలకొల్పే ప్రతిపాదనను కొరియా బృందం చేసిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు రైన్లాండ్ ఆసక్తిరాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు జర్మనీ దేశంలోని రైన్లాండ్ రాష్ట్రం ఆసక్తి కనబర్చిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రైన్లాండ్ రాష్ట్ర ఆర్థిక, రవాణా, వ్యవసాయ మంత్రి డానియేలా ష్మిట్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం గురువారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమైంది. చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కూష్లెర్, హైదరాబాద్ కాన్సుల్ అమితా దేశాయ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు, బయో టెక్నాలజీ, వ్యా క్సిన్లు, ప్యాకేజింగ్, పౌల్ట్రీ, వ్యవసాయం, ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో భాగస్వామ్యం, పెట్టుబడులు పెట్టే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు. -
జీవన్ రెడ్డి సేవలు పార్టీకి అవసరం..
-
జీవన్‌రెడ్డి అలక.. స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,హైదరాబాద్: జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి వ్యవహారంపై మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం(అక్టోబర్ 23) స్పందించారు. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్‌పై సీరియస్‌గా ఉన్నామన్నారు. మర్డర్ ఎవరు చేసినా ఎవరు చేయించినా వదిలేది లేదన్నారు. జిల్లా ఎస్పీతో ఈ విషయమై ఇప్పటికే మాట్లాడామన్నారు. ‘జీవన్ రెడ్డితో ఇప్పటికే పీసీసీ చీఫ్ మాట్లాడారు. జీవన్‌రెడ్డితో నేను కూడా మాట్లాడుతా. జీవన్‌రెడ్డి పార్టీలో అత్యంత సీనియర్ నేత.. ఆయన సేవలను మేము వినియోగించుకుంటాం. పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించం. చనిపోయిన గంగారెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. అందరితో సమన్యాయం చేసుకోని మాట్లాడాలని పీసీసీ చీఫ్ నాకు సూచించారు’అని శ్రీధర్‌బాబు తెలిపారు.ఇదీ చదవండి: అవమానాలు చాలు ఇకనైనా బతకనివ్వండి : జీవన్‌రెడ్డి -
TG: జీవన్‌రెడ్డి వ్యవహారంపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గంగారెడ్డి హత్యను పార్టీ సీరియస్‌గా తీసుకుందని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఈ విషయమై మహేష్‌కుమార్ గౌడ్ మంగళవారం(అక్టోబర్ 22) మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ నేత గంగారెడ్డి హత్య వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదు.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మాట్లాడాను.జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు హత్యకు గురికావడంతో ఆయన ఆవేదనతో ఉన్నారు.జీవన్ రెడ్డి పార్టీ సీనియర్ నేత ఆయన ఆవేదనను అర్థం చేసుకుంటాం. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు వచ్చిన చోట్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవన్నీ త్వరలో పరిష్కారమవుతాయి. జీవన్‌రెడ్డి అంశాన్ని మంత్రి శ్రీధర్‌బాబుకు అప్పగించాం. ఆయన త్వరలో అన్ని సర్దుకునేలా చేస్తారు’అని మహేష్‌కుమార్ గౌడ్ చెప్పారు.ఇదీ చదవండి: జగిత్యాలలో కాంగ్రెస్ నేత దారుణ హత్య -
‘పోలీసు స్కూల్’కు శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలసి ఈ ‘పోలీస్ స్కూల్’కు శంకుస్థాపన చేశారు. పోలీసు వ్యవస్థలో కొత్త అధ్యాయానికి దీనితో తెరతీసినట్టు సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ‘‘యూనిఫాం సర్వీసులవారి కుటుంబ సభ్యుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగానే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు శంకుస్థాపన చేశాం.ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో గత ప్రభుత్వం పోలీసులను వారి పార్టీ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే.. మా ప్రభుత్వం మాత్రం పోలీసు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తోంది..’’ అని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశామని.. కులమతాలకు అతీతంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో పోలీసులకు ఏమీ చేయలేదని విమర్శించారు. కాగా.. పోలీసు కుటుంబ సభ్యులకు స్కూల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని.. ఇవి కేంద్రీయ విద్యాలయాలకు దీటుగా విద్యను అందిస్తాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. కేంద్రీయ విద్యాలయాల్లో మాదిరిగా.. పోలీస్ స్కూళ్లలోనూ ఇతర విద్యార్థులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.యూనిఫాం సర్వీసుల సిబ్బంది అందరికీ..పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితోపాటు ఇతర యూనిఫాం సర్వీసులైన అగ్నిమాపక, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, జైళ్లశాఖ సిబ్బంది పిల్లలకు విద్య అందించేందుకు ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ఏర్పాటు చేస్తూ.. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఐటీ ఎగుమతులు, ఆర్థికవృద్ధిలో జీసీసీ కీలకం
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: రాష్ట్ర ఐటీ ఎగుమతులు, ఆర్థికవృద్ధిని నడపడానికి మిడ్ మార్కెట్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ) కీలకమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్‌లో జీసీసీ ఇన్నోవేషన్ సమ్మిట్–2024ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఏఐ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో హైదరాబాద్‌కు ఉన్న అసాధారణ ప్రతిభతోపాటు, సహాయక విధానాలు, బలమైన మౌలిక సదుపాయాలతో మేము ఈ కీలక ప్లేయర్స్‌ను ఆకర్శించడానికి ప్రాధాన్యతనిచ్చామన్నారు.టీహబ్ తాత్కాలిక సీఈఓ సుజిత్ జాగిర్దార్ మాట్లాడుతూ జీసీసీలకు తెలంగాణ కీలక కేంద్రంగా మారుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయే‹Ùరంజన్, తెలంగాణ రాష్ట్ర చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ శ్రీకాంత్లంక, ఏఎన్ఎస్ఆర్ సహ వ్యవస్థాపకుడు విక్రమ్ ఆహూజా ప్రసంగించారు. టీహబ్ ఐఈఈఈ –టోరంటో, బిజినెస్ డెవలప్మెంట్ సెంటర్– కెనడా, మెడ్ట్రానిక్తో సహా కీలకమైన ఎనిమిది వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలను చేసుకున్నట్టు ప్రకటించింది. టీజీటీఎస్ వ్యాపార పరిధిని పెంచుకోవాలి ప్రభుత్వ విభాగాలకు కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను సరఫరా చేసే నోడల్ ఏజెన్సీ తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్(టీజీటీఎస్) తన పరిధిని మరింత పెంచుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. టీజీటీఎస్ పనితీరును సైఫాబాద్ హాకా భవన్‌లోని కార్యాలయంలో సమీక్షించారు. ప్రభుత్వ విభాగాలన్నీ సంస్థ ద్వారా కంప్యూటర్ సంబంధిత పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను సేకరించుకునేలా సమన్వయం చేసుకోవాలన్నారు. దీనిపై జయేశ్ రంజన్‌తో చర్చించాలన్నారు. ప్రస్తుతం 44 ప్రభుత్వ విభాగాలు, 140 విభాగాలకు టీజీటీఎస్ సేవలు అందిస్తోందని సంస్థ ఎండీ శంకరయ్య మంత్రికి వివరించారు. వీటిలో కొన్ని సొంతంగా కొనుగోళ్లు జరుపుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కొద్ది మొత్తంలో కొనుగోళ్ల కంటే భారీ ఆర్డర్ల ద్వారా రాయితీలు, తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ పరికరాలు సేకరించవచ్చని ఆయా శాఖాధిపతులకు వివరించాలన్నారు. -
మద్యం మాఫియా సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే
-
కొండా సురేఖ వ్యాఖ్యలపై శ్రీధర్‌బాబు స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ కార్యక్రమాలను కావాలనే ప్రభుత్వం బద్నాం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై పీసీసీ స్పందనే తన స్పందన అని చెప్పుకొచ్చారు. అలాగే, హైడ్రాకు ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించిందన్నారు.మంత్రి శ్రీధర్ బాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మూసీ అభివృద్ధి, సంక్షేమంపై చాలెంజ్ చేస్తాం. కత్తుల యుద్ధం చేస్తా అంటే నాలుగేళ్ల తర్వాత చేద్దాం. సంచులు మోసింది వాళ్లే అందుకే అదే గుర్తుకు వస్తుంది. ఇష్టారాజ్యం, అడ్డుగోలుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తే సహించేది లేదు. పార్టీ పరంగా ఏమైనా తప్పులు జరిగితే రాహుల్ గాంధీ సరిచేస్తారు. అంతేగానీ మూసీ ప్రాజెక్ట్‌కు రాహుల్ గాంధీకి ఏం సంబంధం లేదు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసి రెండు రోజులు వార్తల్లో ఉండాలి అనుకుంటున్నారు.డిజిటల్ కార్డుల కార్యక్రమంలో ఈటల రాజేందర్‌కు ఆహ్వానం అందలేదు అంటే సమీక్ష చేస్తాం. ప్రోటోకాల్ అంశంలో ఎక్కడ తప్పు జరిగిందో రివ్యూ చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలను కావాలనే బీఆర్ఎస్ నేతలు బద్నాం చేస్తున్నారు. జహీరాబాద్‌కు పొల్యూషన్ కంపెనీలు అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. జహీరాబాద్‌కు త్వరలో హ్యుందాయ్ సంస్థ వస్తుంది.. అది పొల్యూషన్ సంస్థనా?. తెలంగాణ నుంచి కంపెనీలు తరలి వెళ్తున్నాయి అనేది అవాస్తవం.కొండా సురేఖ వ్యాఖ్యలపై పీసీసీ స్పందనే నా స్పందన. నేను ఇప్పటి వరకు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు.. చేయను. కేటీఆర్, బండి సంజయ్, హరీష్ రావు నా మిత్రులు. కేవలం రాజకీయ అభిప్రాయాలు మాత్రమే వేరు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
రూ.5వేలు ఇచ్చి మాట్లాడిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: అవకాశవాద శక్తులు మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయ ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ మొసలికన్నీరు కారుస్తోందని, భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇందుకోసం రూ.5వేలు ఇచ్చి సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లా డిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలను నిలబెట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, పడగొట్టాలన్నది కాదని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు.హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో చెరువులు, మూసీ ఆక్రమణలను తొలగిస్తున్నామని, ఇందులో నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని, వారిని కాపాడుకునే బాధ్య త తమదని భరోసా ఇచ్చారు. 35 బృందాలతో సామాజిక, ఆర్థిక సర్వే చేయిస్తున్నామని, వాక్టూ వర్క్ పద్ధతిలో నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కలి్పస్తామన్నారు. ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారన్నారు. పునరావాసం కోసం హైలెవల్ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. రివర్‌బెడ్‌లోని నివాసాలకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరేళ్లు చదివిస్తామని, మహిళలకు వడ్డీ లేని రుణాలిప్పిస్తామని చెప్పారు.మూసీకి సంబంధించిన మాస్టర్‌ప్లాన్ బ్లూ ప్రింట్ తయారు చేశామని, పనులు పారదర్శకంగా చేపడతామని, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సంస్థలకే పనుల బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. మూసీ, హైడ్రా విషయంలో అనుమానాల నివృత్తికి అన్ని కలెక్టరేట్లలో హెల్ప్‌డెస్‌్కలు ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్ఎస్కు మాట్లాడే నైతికహక్కు లేదు భూనిర్వాసితుల విషయంలో మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యా నించారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలు సని ఎద్దేవా చేశారు. పేదలు, మధ్యతరగతి నివాసాల విషయంలో ప్రభుత్వం తొందరపడబోదని చెప్పిన శ్రీధర్‌బాబు అడ్డగోలుగా అనుమతులిచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, అడ్డంకులు సృష్టించాలనుకునే బీఆర్ఎస్ ప్రయత్నాలను నమ్మొద్దని కోరారు. హైడ్రా విషయంలో ఎవరైనా ఒక్కటేనని, సీఎం రేవంత్ సోదరుడికి కూడా నోటీసులిచ్చామని గుర్తు చేశారు. తాము భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఆదర్శవంతమైన కార్యక్రమంతో ముందుకెళుతుంటే రాజకీయ కక్షపూరిత వైఖరితో తప్పు డు ప్రచారాలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గమనించాలని మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. -
‘హైడ్రా’ కూల్చివేతలు..మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: ప్రజలను రెచ్చగొట్టేందుకు కొన్ని అవకాశవాద శక్తులు చాలా కష్టపడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిపశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో శ్రీధర్‌బాబు ఆదివారం(సెప్టెంబర్29) మీడియాతో మాట్లాడారు.‘చెరువులు,జలాశయాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పరితపిస్తోంది.మూసీ ఆక్రమణలో ఉన్న ప్రతీ ఒక్కిరికీ ప్రత్యమ్నాయ సదుపాయం కల్పిస్తున్నాం.పేదలకు ఏ రోజూ కాంగ్రెస్ అన్యాయం చేయలేదు.చేయదు. ఇళ్లు కోల్పోయిన వారందరికీ 2013 చట్టప్రకారం నష్టపరిహారం అందజేస్తాం. హైడ్రాతో పేదవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మూసీ ఆక్రమణలో ఉన్న పేదలందరికీ డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.మూసీలో మంచి నీరు ప్రవహించాలని మేం ప్రయత్నం చేస్తున్నాం.నందనవనం ప్రాజెక్టు చేపట్టినపుడు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు.కానీ మేం ఈరోజు పేదలందరికీ పక్కా ఇల్లు ఇస్తున్నాం.పేదలను నిలబెట్టే సంస్కృతి కాంగ్రెస్‌ది. పడగొట్టే సంస్కృతి బీఆర్ఎస్ది. బీఆర్ఎస్ది బుల్డోజర్ పాలసీ. మల్లన్నసాగర్ వద్ద బుల్డోజర్లతో పేదలను ఇళ్లను కూల్చారు’అని శ్రీధర్‌బాబు విమర్శించారు.ఇదీ చదవండి: హైడ్రా ముందే మేల్కొంటే బాగుండేది -
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఎమ్మెల్యే గాంధీ వ్యవహారం
-
కేటీఆర్ ట్వీట్.. మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
సాక్షి, పెద్దపల్లి జిల్లా: ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోందంటూ కేటీఆర్ ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ‘‘ఎమ్మెల్యే అరికెపూడి గాంధీయే తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చినట్టు మేము తలదూర్చం’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.‘‘మీ పార్టీ అంతర్గత సమస్యల్ని మీరు పరిష్కరించుకోవాలి. మా పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ప్రజలందరూ తెలంగాణ ప్రజలే.. వారందరినీ గౌరవిస్తాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం’’ అని శ్రీధర్‌బాబు చెప్పారు.‘‘రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచడానికి అందరూ పాలుపంచుకోవాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కొన్ని ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరు ఏం చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు’’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు -
మంథనిలో స్కిల్స్ సెంటర్ ఏర్పాటు చేస్తాం
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో త్వరలో స్కిల్స్ సెంటర్‌ను స్థాపించి విద్యార్థులకు వివిధ రంగాల్లో అవసరమైన శిక్షణ అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శనివారం ఆయన పట్టణంలో సెంటెలియన్ నెట్వర్క్ సాఫ్ట్వేర్ కంపెనీ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత్, అమెరికా, ఆ్రస్టేలియాతోపాటు మరో ఆరు దేశాల్లో వెయ్యి మంది ఉద్యోగులతో నడిచే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్లు రాధాకిశోర్, వెంకట్ తనకు మంచి మిత్రులన్నారు.మంత్రిగా తాను ప్రమాణ స్వీకా రం చేసిన సందర్భంగా వారు అభినందించడానికి వచ్చారని, ఆ సమయంలో ఈ ప్రాంతానికి ఉపయోగపడేలా కంపెనీ బ్రాంచ్‌ను మంథనిలో ఏర్పాటు చేయాలని, అప్పుడే తనకు నిజమైన గౌరవం దక్కుతుందని సూచించానన్నారు. ఇక్కడ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యాలయం ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యాలయానికి అవసరమైన సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్ రాధాకిశోర్, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమ, వైస్ చైర్మన్ సీపతి బానయ్య, సింగిల్‌విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మంథనిలో సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
-
సాంకేతికతతో జీవితాల్లో గుణాత్మక మార్పు
సాక్షి, హైదరాబాద్: జీవితాల్లో గుణాత్మక మార్పు తేవడమే లక్ష్యంగా సాంకేతికతను ఉపయోగించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల మూలంగా ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారని, ఇది కుటుంబ వ్యవస్థతోపాటు ఆర్థిక, సామాజిక వ్యవస్థలపైనా ప్రభావం చూపుతోందన్నారు. ఈ నేపథ్యంలో వాహనాల తయారీలో భద్రతకు పెద్దపీట వేస్తూ సాంకేతిక ఆవిష్కరణలు, ఉత్పత్తులు అందుబాటులోకి రావాల్సిన అవసరముందని చెప్పారు.హైదరాబాద్‌లో జెడ్ఎఫ్ లైఫ్‌టెక్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం శ్రీధర్‌బాబు సంస్థ ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవవనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వాహన రంగంలో భద్రతకు సంబంధించి జెడ్ఎఫ్ లైఫ్‌టెక్ సంస్థ బలమైన భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు సా గాలని సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే సంస్థలకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని చెప్పా రు. పారిశ్రామిక, పెట్టుబడిదారుల అనుకూ ల విధానాలు అవలంబిస్తామని చెప్పారు. భద్రతా ప్రమాణాలు పెంచుతాం ప్రపంచ ఇంజనీరింగ్ అవసరాలకు అనుగుణంగా నూతనంగా ప్రారంభించిన జెడ్ఎఫ్ గ్లోబల్ కేపబుల్ సెంటర్ ద్వారా కార్లు, ఇతర వాహనాల సీటు బెల్టులు, ఎయిర్‌బ్యాగ్‌లు, స్టీరింగ్ల్లో అధునాతన సాంకేతికత ద్వారా భద్రతా ప్రమాణాలు పెంచుతామని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ రుడాల్ఫ్ స్టార్క్ చెప్పారు. వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్‌తోపాటు ప్రపంచ ఇంజనీరింగ్ అవసరాలు తీర్చే విధంగా తమ సంస్థ కార్యకలాపాలు ఉంటాయన్నారు. సేఫ్టీ టెక్నాలజీలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ దిగ్గజ సంస్థలతో కలిసి పనిచేస్తామని జెడ్ఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆకాశ్ పస్సే అన్నారు. సమావేశంలో సంస్థ ఇండియా విభాగం ఈడీ రవికుమార్ తుమ్మలూరుతోపాటు రాష్ట్ర డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ భవానీ శ్రీ, టీజీఐఐసీ ఎండీ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల కట్టడి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, వాటి నిర్వహణ తీరును కట్టడి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పడిపోవడంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం–2020 అమలు వల్ల జరిగే ప్రయోజనాలు, సవాళ్లను సమగ్రంగా విశ్లేషించాలని సూచించింది. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంపు దిశగా సరికొత్త మార్గాన్వేషణ చేయాల్సిన అవసరాన్ని విద్యాశాఖ ముందుంచింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం విద్యారంగంలో సంస్కరణలపై బుధవారం సమగ్రంగా చర్చించింది. సబ్æ కమిటీ సభ్యురాలు మంత్రి సీతక్క ఈ సమీక్షలో పాల్గొన్నారు. కోచింగ్ కేంద్రాలపై నియంత్రణ పలు రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ కేంద్రాలపై నియంత్రణ అవసరమని, అభ్యర్థుల భద్రత, ఫీజుల నియంత్రణపై దృష్టి పెట్టాలని మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను కోరారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో కూడా అమలు చేస్తామన్నారు. ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్మీడియట్ కళాశాల ఫీజుల నిర్ధారణపై నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచితే, పేదలు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లరని, ఈ దిశగా ఎక్కడ లోపం ఉందో అన్వేíÙంచాలని మంత్రి అధికారులకు సూచించారు. మానవ వనరులు వృ«థా అవ్వకుండా అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లను విలీనం చేసే అంశంపై అధ్యయనం చేయాలని విద్యాశాఖకు మంత్రి వర్గ ఉప సంఘం సూచించింది. ప్రమాణాలు తగ్గడంపై ఆందోళన రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలు తగ్గడంపై ఉప సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా ప్రమాణా ల్లో రాష్ట్రం 34వ స్థానంలో ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డిగ్రీ కళాశాలల్లో బీఏ కోర్సుల పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసి విద్యార్థులను ఉద్యోగాలకు సంసిద్ధం చేసేలా శిక్షణ ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసే పనులను వేగవంతం చేయాలని చెప్పారు. మాసబ్‌ట్యాంక్, రామంతాపూర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కొత్తగూడెం, సికింద్రాబాద్, కులీకుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీలను ప్రారంభిస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళలపై వేధింపులకు పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయనే అంశాలను 5, 6 తరగతుల పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు ఎందుకు వెళ్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. -
‘కేసీఆర్, అరికెపూడికి పడకపోతే మేమేం చేస్తాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారడంలేదని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. అలాగే, అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారమే కమిటీల నియామకం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిని పీఏసీ ఛైర్మన్‌గా చేస్తే ఎందుకు తప్పు పడుతున్నారని ప్రశ్నించారు.కాగా, మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘అసెంబ్లీ చైర్‌ను కొందరు ప్రతిపక్ష నేతలు అప్రతిష్ట పాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల్లో ఆక్రోశం కనిపిస్తోంది. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ అన్ని వ్యవస్థలను నాశనం చేసింది. ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిని పీఏసీ చైర్మన్‌గా చేస్తే ఎందుకు తప్పు పడుతున్నారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేల మధ్య అభిప్రాయ బేధాలు ఉంటే మాకు ఏం సంబంధం?. పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ.. తాను బీఆర్ఎస్ సభ్యుడేనని స్పష్టంగా చెప్పారు. సంఖ్యా బలంపరంగా బీఆర్ఎస్ నుంచి ముగ్గురికి అవకాశం ఇచ్చారు.బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీరు ముగ్గురేనా? మిగతా వారు లేరా?. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరికెపూడి గాంధీ కలిశారు. అందులో తప్పేముంది?. ప్రజాస్వామ్యం గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. గతంలో సీఎల్పీ లీడర్‌గా భట్టి విక్రమార్క ఉంటే కేసీఆర్ ఓర్వలేకపోయారు. ఎమ్మెల్యేల అంశంలో హైకోర్టు ఏం చేయాలో చెప్పలేదు. నాలుగు వారాల్లో ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పింది. లెజిస్లేచర్ వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం ఎంత వరకు ఉంటుందో అనే అంశంపై చర్చ జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఇంత సమయంలో నిర్ణయం జరగాలని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. పీఏసీ చైర్మన్ అరికేపూడి గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నాను తనకు పీఏసీ పదవి ఇచ్చారని గాంధీ అన్నారు. అలాగే, సీఎం రేవంత్‌ను కలిసినప్పుడు తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. ఆలయానికి సంబంధించిన శాలువానే తనకూ కప్పారని అన్నారు. అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. పీఏసీ చైర్మన్ హరీష్ రావుకు ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా.. వేరే వాళ్లకు ఇస్తే ఒప్పుకోరా అని సూటిగా ప్రశ్నించారు. ఇదే సమయంలో తనపై విమర్శలు చేసే వారికి ఇదే నా సవాల్.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని చాలెంజ్ చేశారు. ఎలాంటి పరిణామాలకైనా తాను సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్లు ఏం చేశారో గుర్తుతెచ్చుకోవాలని హితవు పలికారు.ఇది కూడా చదవండి: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
ఏఐకి ‘ఫ్యూచర్’ సిటీనే: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక రంగంలో అత్యుత్తమ ఆవిష్కరణగా చెప్తున్న ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు – ఏఐ) టెక్నాలజీకి హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్‌తో సరిపోలే నగరమేదీ దేశంలో లేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఏఐని ప్రోత్సహించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూనే భవిష్యత్తును సృష్టిస్తామన్నారు. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని భారత్ సరిగా అనుసరించలేక పోయిందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో రెండురోజుల పాటు జరిగే ‘తెలంగాణ గ్లోబల్ ఏఐ సదస్సు’ను గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. నిపుణులు భాగస్వాములు కావాలి..కొత్తగా నిర్మితమయ్యే ఫ్యూచర్ సిటీని ఏఐ హబ్‌గా తీర్చిదిద్దుతామని, అందులో నిపుణులు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ‘తెలంగాణ ఏఐ మిషన్’, నాస్కామ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేస్తామన్నారు. సాంకేతికత, ఆవిష్కరణలు లేకుండా సమాజంలో ఏ మార్పూ సాధ్యం కాదని చెప్పారు. రైలు ఇంజిన్, విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపం మారిపోగా.. కరెంటు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ వంటి ఆవిష్కరణలు ప్రపంచ గతిని మార్చడంలో కీలకపాత్ర పోషించాయని అన్నారు. టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు చూడటం మన తరం చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఏఐ లాంటి కొత్త టెక్నాలజీ వచ్చిన సమయంలో.. ఓ వైపు జీవితం మెరుగు పడుతుందనే ఆశ ఉండగా, మరోవైపు ఉద్యోగ భద్రత ఉండదనే భయం కూడా సహజంగానే ఉత్పన్నమవుతోందన్నారు. కానీ ఏఐ టెక్నాలజీని ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. 200 ఎకరాల్లో ఏఐ సిటీ: శ్రీధర్‌బాబు తెలంగాణ రాష్ట్రం ఏటా 11.3 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగుతూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని 176 బిలియన్ డాలర్లకు చేర్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. త్వరలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఏఐ పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని తీర్చిదిద్దుతామని తెలిపారు. ఏఐ సిటీ నూతన ఆవిష్కరణలకు పుట్టినిల్లుగా నిలుస్తుందని, స్కూల్ ఆఫ్ ఏఐ ఎక్సలెన్స్‌ను కూడా ప్రారంభిస్తామని అన్నారు. ఏఐ ఆధారిత కంపెనీల కోసం తాత్కాలికంగా శంషాబాద్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంలో రెండు లక్షల చదరపు అడుగుల్లో అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి చెప్పారు. 26 అవగాహన ఒప్పందాలు ‘ఏఐ ఆధారిత తెలంగాణ’లక్ష్యాల సాధన దిశగా ప్రైవేటురంగ సంస్థలు, విద్యా సంస్థలు, దిగ్గజ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, లాభాపేక్ష లేని సంస్థలతో 26 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ ఒప్పందాల్లో కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్‌లెన్స్ కేంద్రం, స్కిల్లింగ్, ఇంపాక్ట్ అసెస్మెంట్, స్టార్టప్ ఇన్నొవేషన్, జనరేటివ్ ఏఐ, పరిశోధన సహకారం, డేటా అన్నోటేషన్ రంగాలకు సంబంధించినివి ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. ఏఐ ద్వారా తెలంగాణను ప్రపంచ మేధోశక్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రణాళికలు పటిష్టంగా రూపొందిస్తున్నామని చెప్పారు. ఏఐలో ఆవిష్కరణలు కీలకం: బీవీఆర్ మోహన్‌రెడ్డి ఏఐ రంగంలో కొత్తగా ఆవిష్కరణలు, కొత్త యాప్‌లు అత్యంత కీలకమని నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి అన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఏఐపై పాఠాలు, పరిశోధనలకు వాణిజ్య రూపం ఇవ్వడం, ఏఐలో కొత్త మార్కెట్‌ను సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఐటీ రంగ ప్రముఖులు రాబిన్, వరప్రసాద్‌రెడ్డి, అశోక్ స్వామినాథన్‌తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి లంకా, ఎమ్మెల్యే మదన్మోహన్రావు తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఐటీలో మేటిగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : కొత్తగా దూసుకువస్తున్న కృత్రిమ మేథస్సు (ఏఐ టెక్నాలజీ)తో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో బెంగళూరు చాలా ముందంజలో ఉందని, ఇతర రాష్ట్రాలు కూడా ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ సాంకేతికత ద్వారా భారీ ముందడుగు వేసి ఐటీ రంగంలో బెంగళూరును అధిగమించే దిశగా ప్రయత్నాలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, వాణిజ్యం పెంచే దిశగా ప్రభుత్వం రోడ్ మ్యాప్ రూపొందిస్తోందని తెలిపారు. ఏఐ టెక్నాలజీని ప్రోత్సహించే ప్రణాళికలో భాగంగా ఏఐ సిటీ నిర్మిస్తామని, రాష్ట్ర అభివృద్ధిని పదింతలు పెంచుతామని చెప్పారు.గురు, శుక్రవారాల్లో రెండురోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా ‘తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్’(అంతర్జాతీయ ఏఐ సదస్సు)ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్‌బాబు ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. బహుముఖ లక్ష్యంతో.. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఏఐ టెక్నాలజీ ఫలితాలు, వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడం సహా బహుముఖ లక్ష్యంతో నాస్కామ్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఏఐ ద్వారా భవిష్యత్తులో ఐటీ రంగంలో కొత్తగా భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అదే సమయంలో ఇది కోడింగ్, అల్గారిథమ్స్ ఆధారిత ఉద్యోగాలు చేస్తున్న ఐటీ నిపుణుల ఉద్యోగ భద్రతకు కూడా సవాలు విసరనుంది. ఈ నేపథ్యంలో ఏఐ నిపుణులను తయారు చేసేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి అనుసరించాల్సిన విధానాలపై సదస్సులో చర్చిస్తాం. వాణిజ్యం, వ్యాపార రంగాల్లో ఏఐ ఆధారిత అభివృద్ధి, ఉత్పాదకత పెంచడం తదితరాలపై సదస్సులో పాల్గొనే నిపుణులు సూచనలు చేస్తారు. ఏఐ టెక్నాలజీ రెండంచుల కత్తిలాంటిదనే ఆందోళన నేపథ్యంలో నైతిక మార్గంలో ఏఐ సాంకేతికత వినియోగం, ప్రభుత్వ నియంత్రణ తదితర అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. ఏఐ పాలసీ రూపకల్పన కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో సదస్సులో పాల్గొనే నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటాం. తెలంగాణను ‘ఏఐ క్యాపిటల్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతోంది. ఉత్పాదకత పెంపునకు ఏఐ వినియోగం వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత పెంచడం లక్ష్యంగా ఏఐ వినియోగం పెంచాలని భావిస్తున్నాం. పరిశ్రమల ఆటోమేషన్, మెరుగైన నాణ్యత, యంత్రాల మెయింటినెన్స్, మార్కెటింగ్, మెరుగైన విద్యుత్ వినియోగం వంటి అంశాల్లో ఏఐ టెక్నాలజీ ఉపయోగించేలా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. వ్యవసాయంలో ఎరువులు, నీళ్లు, తెగుళ్లు, పంట నూరి్పళ్లు సమర్ధవంతంగా జరిగేలా చూడటం, కూలీల కొరతను అధిగమించడం వంటి సవాళ్ల పరిష్కారంపై ఇప్పటికే పలు ఏఐ ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. వైద్య రంగంలో రోబోటిక్ సర్జరీలు, చికిత్సలు, రోగ నిర్ధారణ సమర్ధవంతంగా చేయడం సాధ్యమవుతోంది. విద్యారంగంలోనూ ఏఐ సాంకేతికతతో బహుళ లాభాలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఏఐ ఆధారిత శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంటర్ స్థాయిలో ఏఐ! సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా ఎనలిటిక్స్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తులు, సేవలు అందుబాటులోకి తెచ్చేలా పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు జూనియర్ కాలేజీ స్థాయి నుంచి కరిక్యులమ్‌లో ఏఐ పాఠ్యాంశాలను చేర్చడంపై సదస్సులో చర్చిస్తాం. బెంగళూరు తరహాలో ఇక్కడి ఏఐ హబ్ నుంచి యూనికార్న్‌లు (బిలియన్ డాలర్ల వ్యాపారం చేసే సంస్థలు) పుట్టుకొచ్చే వాతావరణం కల్పిస్తాం. త్వరలో ఎస్ఎంఎస్ఈ, లైఫ్ సైన్సెస్ పాలసీలను కూడా ఆవిష్కరిస్తాం. -
ఏఐని వాడుకుంటాం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వ శాఖల్లో మెరుగైన సేవలందించేందుకు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), హైదరాబాద్ ఐఐటీలో అభివృద్ధి చేస్తున్న సాంకేతికతను వాడుకునే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇప్పటికే డ్రోన్ల ద్వారా పంటలకు మందులు పిచికారీ చేసే విధానాన్ని వ్యవసాయశాఖ వినియోగిస్తోందని, అలాగే రవాణా, హెల్త్‌కేర్ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నామని తెలిపారు.సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో పరిశోధన విభాగం టీహాన్ అభివృద్ధి చేస్తున్న డ్రైవర్ రహిత (అటానమస్ నావిగేషన్) వాహనాన్ని పరిశీలించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి ఈ వాహనంలో ప్రయాణించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమెరికా, యూకే, యూరప్ దేశాల్లో మాదిరిగా మన దేశంలోని రోడ్లు, ట్రాఫిక్ తీరుకు అనుగుణంగా పనిచేసే డ్రైవర్ రహిత వాహన టెక్నాలజీని హైదరాబాద్ ఐఐటీ అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ఈ వాహనాలను రోడ్లపైకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ పరిశోధనకు సహకరిస్తున్న జపాన్‌కు చెందిన సుజుకీ కంపెనీ ప్రతినిధులను, పరిశోధన విభాగం విద్యార్థులు, ప్రొఫెసర్లను మంత్రి అభినందించారు. ఐఐటీని ఇక్కడకు తీసుకొచి్చంది వైఎస్సే దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఈ హైదరాబాద్ ఐఐటీని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి సంగారెడ్డి జిల్లా కందిలో స్థాపించారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. స్కిల్స్ యూనివర్సిటీలో ఒక డైరెక్టర్‌గా ఉండాలని మంత్రి హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తిని కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో టీహాన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
పెట్టుబడులు రాత్రికి రాత్రే వచ్చి పడవ్
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తాను, తమ అధికారులు చేసుకున్న అవగాహన ఒప్పందాల (ఎంవోయూ)తో రాత్రికి రాత్రే వేలకోట్ల పెట్టుబడులు వచ్చిపడవని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఆ ఎంవోయూలపై నిరంతరం శ్రమిస్తేనే అవి పెట్టుబడుల రూపంలో వస్తాయని, లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. అయినా వేలకోట్ల పెట్టుబడులు వస్తాయని తాము అమెరికా, దక్షిణ కొరియా వెళ్లలేదని వ్యా ఖ్యానించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, లక్ష్యాలను ప్ర ముఖ పరిశ్రమల యాజమాన్యాలతో పంచుకున్నామని తెలిపారు. పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు. శనివారం సచివాలయంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంవో అధికారి శ్రీనివాస్, ప్రజా సంబంధాల కమిషనర్ హనుమంతరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణ అభివృద్ధిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా తమ పర్యటన సాగిందని శ్రీధర్‌బాబు చెప్పారు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ (భవిష్యత్ రాష్ట్రం)గా దిగ్గజ కంపెనీల ముందు ఆవిష్కరించామన్నారు. పలు సంస్థలు అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు (జీసీసీ) ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయని, 11 రోజుల పర్యటనలో మొత్తం 19 ఒప్పందాలు, 50 మందితో వ్యాపార సమావేశాలు జరిపామని తెలిపారు. మొత్తం రూ. 31,500 కోట్ల పెట్టుబడులతో 30,750 మందికి ఉపాధి కల్పించడానికి ఆయా సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. వీటిల్లో ముఖ్యంగా కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీయంఆర్, ట్రైనెట్, ట్రైజిన్, కారి్నంగ్, ఆమ్జెన్, జోయ్టిస్, థెర్మో ఫిషర్ సైంటిఫిక్, మోనార్క్ ట్రాక్టర్స్, స్వచ్ఛ్‌బయో, వాల్‡్షకర్ర హోల్డింగ్స్ లాంటి సంస్థలు ఉన్నాయని వెల్లడించారు. ఇవి కాకుండా హ్యుందాయ్ మోటార్స్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు చేస్తోందని, దుస్తులు, ఫ్యాషన్, కాస్మోటిక్స్ సంస్థలు కూడా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని తెలిపారు. గతంలో దావోస్‌లో రూ.40,230 కోట్ల పెట్టుబడులకు తమ ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇటీవలి కాలం వరకు ముఖ్యమంత్రి స్థాయిలో పెట్టుబడులను ఆహ్వానించడానికి, ప్రభుత్వ ఆలోచనలు పంచుకోవడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదనే అభిప్రాయం ప్రవాస భారతీయులు, పలు పరిశ్రమల యజమానుల్లో వ్యక్తమైందని మంత్రి చెప్పారు. సీఎం సోదరుడు అయితే ఒప్పందం కుదుర్చుకోకూడదా? సీఎం సోదరుడి కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన వారికి రాయితీల కల్పన, భూముల ధారాదత్తం లాంటివి చేయలేదు కదా అని శ్రీధర్‌బాబు అన్నారు. 30 సంవత్సరాలుగా అమెరికాలో ఉండి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమ పెట్టడానికి వస్తామంటే ఎందుకు వద్దనాలని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల బంధువులు పెట్టుబడులు పెడతామన్నా తాము స్వాగతిస్తామన్నారు. గత ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో కేవలం 30 నుంచి 35 శాతం పరిశ్రమలు మాత్రమే ఏర్పాటయ్యాయని, వారు పాస్ అయ్యారో, ఫెయిల్ అయ్యారో ప్రజలే చెప్పాలని అన్నారు. తాము మాత్రం సంవత్సర కాలంలో ఈ ఎంవోయూలను పెట్టుబడుల రూపంలోకి మార్చడానికి ప్రయతి్నస్తామని చెప్పారు. త్వరలోనే తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకుని వస్తుందని తెలిపారు. -
రాష్ట్రంలోహ్యుందాయ్ మెగా టెస్టింగ్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజ సంస్థ ‘హ్యుందాయ్ మోటార్ కంపెనీ’తన భారతీయ అనుబంధ విభాగం ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్’(హెచ్ఎంఐఈ) ద్వారా తెలంగాణలో కార్ల ‘మెగా టెస్టింగ్ సెంటర్’ను స్థాపించనుంది. ఈ సెంటర్లో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం (ఎలక్ట్రిక్ వాహనాలతో సహా) కూడా ఉంటుంది. దీంతో పాటు హైదరాబాద్‌లోని తమ ఇంజనీరింగ్ కేంద్రం ఆధునీకరణ, విస్తరణ ద్వారా భారత్ సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో హెచ్ఎంఐఈ మరింత ఉపాధి కల్పించనుంది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలోని అధికారుల బృందం సోమవారం సియోల్‌లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారత్‌కు తమకు ముఖ్యమైన మార్కెట్ అని, వినియోగదారుల కోసం అత్యుత్తమ ఉత్పత్తులకు, సాంకేతిక అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్లు హెచ్ఎంఐఈ ప్రతినిధులు ఈ సందర్భంగా వెల్లడించారు. మెగా టెస్ట్ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందన్నారు. పెట్టుబడులపై అగ్రశ్రేణి కంపెనీల ఆసక్తి: సీఎం ‘ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణ అనుసరిస్తున్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయి. ఆటంకాలు లేని అనుమతుల వ్యవస్థ, పగతిశీల విధానాలతో తెలంగాణలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం హెచ్ఎంఐఈ లాంటి అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయి..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. పెట్టుబడులకు అనువుగా మెగా టెక్స్టైల్ పార్కు కొరియాలోని టెక్స్టైల్ పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కు అనువైన ప్రదేశమని సీఎం అన్నారు. కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ (కొఫోటి) ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. వరంగల్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో టెక్స్టైల్ రంగంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో యంగ్వన్ చైర్మన్ కిహక్ సంగ్, కొఫొటి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సోయంగ్ జూతో పాటు 25 దిగ్గజ కొరియన్ టెక్స్టైల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. చెంగ్చియాన్ నదిని సందర్శించిన రేవంత్ బృందం మూసీ నది పునరుద్ధరణ తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుంది?, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ పునరుద్ధరణ ఎలా చేయాలి? వంటి అంశాలపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. మూసీ పునరుద్ధరణకు అవసరమైన పరిష్కారాల అన్వేషణ, సాధ్యాసాధ్యాలపై అధ్యయనంలో భాగంగా సోమవారం అర్ధరాత్రి దక్షిణ కొరియా సియోల్ నగరంలోని చెంగ్చియాన్ నదిని ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. కాగా మూసీ విషయంలో అనేక ఆలోచనలు, ప్రణాళికలు తమ దృష్టికి వచ్చినట్లు సీఎం వెల్లడించారు. సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘లో చెంగ్చియాన్ రివర్ ఫ్రంట్ వీడియోను ఆయన షేర్ చేశారు. -
‘ఫ్యూచర్ స్టేట్’గా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, నినాదం ఉన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రానికి ‘ఫ్యూచర్ స్టేట్’ అనే నినాదాన్ని ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. న్యూయార్క్‌కు ‘అవుటాఫ్ మెనీ..వన్’, టెక్సాస్‌కు ‘లోన్ స్టార్ స్టేట్’, కాలిఫోరి్నయా కు ‘యురేకా’ అనే ట్యాగ్‌లైన్ ఉందని.. అదే రీతి లో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ఇకపై ‘ది ఫ్యూచర్ స్టేట్’కు పర్యాయపదంగా నిలుస్తుందని చెప్పారు.అమెరికా పర్యటనలో ఉన్న సీఎం నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం కాలిఫోరి్నయాలో ‘ఏఐ యూనికార్న్’ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యింది. భారతీయ కాన్సుల్ జనరల్ నిర్వహించిన ‘ఏఐ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం’లో వారినుద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కంపెనీల ప్రతినిధులు తెలంగాణను సందర్శించి భవిష్యత్తును ఆవిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ యూనికార్న్ వ్యవస్థాపకులు హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సదుపాయాలు పరిశీలించాలని కోరారు. హైదరాబాద్‌లో ‘ఆమ్జెన్’ రీసెర్చ్ సెంటర్ అమెరికాలో అతిపెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ‘ఆమ్జెన్’ తెలంగాణలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా నూతన ‘రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం’ను ప్రారంభించనుంది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఏర్పాటవుతున్న ఈ సెంటర్ ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. శాన్ఫ్రాన్సిస్కోలోని ‘ఆమ్జెన్’ ఆర్ అండ్ డీ సెంటర్లో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు, సంస్థ ఎండీ డాక్టర్ డేవిడ్ రీస్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ ఛటోపాధ్యాయ భేటీ అయ్యారు. ఆమ్జెన్ కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడంపై రేవంత్, శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి రూపాయి భవిష్యత్తుకు పెట్టుబడి: సీఎం ప్రతి రూపాయి భవిష్యత్తుకు పెట్టుబడి: సీఎం తెలంగాణలో పెట్టుబడుల ద్వారా హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని ఐటీ సేవల కంపెనీలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్ ‘ఐటీ సర్వ్ అలయెన్స్’ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం పాల్గొన్నారు. ‘చారిత్రక నగరం హైదరాబాద్‌తో పాటు సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ ఏర్పాటవుతోంది. ఇక్కడ పెట్టుబడిగా పెట్టే ప్రతి రూపాయి మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది..’ అని రేవంత్ చెప్పారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు సహకరించండి: శ్రీధర్‌బాబు ఏఐ, టెక్నాలజీ సెంటర్‌గా, ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన భవిష్యత్తు నగరంగా హైదరాబాద్ మారుతోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. వచ్చే పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు చేర్చడంలో అందరూ కలిసి రావాలన్నారు. కాగా ఈ ఏడాది చివరలో వేగాస్‌లో జరిగే ‘ఐటీ సర్వ్ అలయెన్స్’ వార్షికోత్సవానికి రావాల్సిందిగా సీఎం రేవంత్‌ను అలయెన్స్ ప్రతినిధులు ఆహా్వనించారు. అడోబ్ సిస్టమ్స్ సీఈఓతో భేటీ అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్‌తో రేవంత్, శ్రీధర్‌బాబుల బృందం భేటీ అయింది. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ‘హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో పాలు పంచుకునేందుకు అంగీకరించారు. రూ.3,350 కోట్లతో గ్రీన్ డేటా సెంటర్ హైదరాబాద్‌లో అత్యాధునిక ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్‌ను రూ.3,357 కోట్ల (400 మిలియన్ యూఎస్ డాలర్లు) పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు ఆరమ్ ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ ప్రకటించింది. కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బృందంతో భేటీ అనంతరం ఆరమ్ ఈక్విటీ ఈ ప్రకటన చేసింది. గత ఏడాది 50 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడతామని ప్రకటించిన కంపెనీ.. తాజాగా 100 మెగావాట్ల ఆధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను 400 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పెట్టుబడి హైదరాబాద్‌లో అనేక ఉద్యోగాల కల్పనకు దోహద పడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. భారత్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించేందుకు తమ పెట్టుబడి ఉపయోగపడుతుందని ఆరమ్ సీఈవో వెంకట్ బుస్సా ప్రకటించారు. ఈ –సేవ, ఈ– విద్య, ఈ– చెల్లింపులు వంటి సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయన్నారు. -
కాగ్నిజెంట్ భారీ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్‌లో భారీ విస్తరణకు ముందుకు వచ్చింది. దాదాపు 15 వేల మంది ఉద్యోగు లకు పని కల్పించేలా, 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ఇతర ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరి గిన చర్చల అనంతరం కాగ్నిజెంట్ విస్తరణ ప్రణా ళికపై ఒప్పందం జరిగింది. వాస్తవానికి గత ఏడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నేపథ్యంలో కంపెనీ విస్తరణకు కాగ్నిజెంట్ ఈ నగరాన్ని ఎంచుకుంది. కాగా ఒప్పందం సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్‌కు తమ ప్రభుత్వం తగిన మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని చెప్పారు. క్లయింట్లకు మెరుగైన సేవలుకాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ మాట్లాడుతూ.. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్‌లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తామని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. కాగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర టైర్–2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనపై కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడుతుందని శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. -
నేడు అమెరికాకు సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శనివారం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్లనున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి డి.శ్రీధర్‌బాబు కూడా ఆయనతో వెళ్తున్నారు. శనివారం ఉదయం 4.35 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.25 గంటలకు న్యూయార్క్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈనెల 4న న్యూజెర్సీలో జరిగే ప్రవాస తెలంగాణీయులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు.5, 6 తేదీల్లో న్యూయార్క్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. 6న పెప్సికో, హెచ్‌సీఏ కంప్యూటర్స్ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం వాషింగ్టన్ డీసీకి చేరుకుని అక్కడ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 7న డల్లాస్‌లో వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అదే రోజు అక్కడ గాంధీ స్మృతి కేంద్రాన్ని సందర్శిస్తారు.8న శాన్ఫ్రాన్సిస్కోలో యాపిల్ ఉత్పాదక బృందం, ట్రైనెట్ సీఈఓ, ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి చర్చించనున్నారు. 9న గూగుల్, అమెజాన్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. శాన్ఫ్రాన్సిస్కోలో సాయంత్రం జరిగే ప్రవాస తెలంగాణీయుల భేటీలో పాల్గొంటారు. 10న శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి 11న దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చేరుకుంటారు. 12, 13 తేదీల్లో ఎల్జీ, శామ్సంగ్తో పాటు ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. 13న రాత్రి 11.50 గంటలకు సియోల్ నుంచి బయల్దేరి 14న ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. సీఎం రేవంత్‌తో ఆనంద్ మహీంద్రా భేటీ రాష్ట్రంలో కొత్తగా స్థాపించనున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని ప్రారంభించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ముందుకొచ్చారు. ఈమేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో ఆనంద్ మహీంద్రా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. త్వరలోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిశీలనకు తమ కంపెనీ బృందాన్ని పంపిస్తామని సీఎంకు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో క్లబ్ మహీంద్రా హాలీడే రిసార్ట్ విస్తరణకు ముందుకొచ్చారు. -
విద్యార్థుల నైపుణ్యం పెంచేందుకు స్కిల్ యూనివర్శిటీ
-
తెలంగాణలో జాబ్ క్యాలెండర్, స్కిల్ వర్సిటీ: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. రాబోయే రోజుల్లో దీని ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే, ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.కాగా, తెలంగాణ అసెంబ్లీలో నేడు ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేస్తాం. రెండు లక్షల ఉద్యోగాలు కల్పించినా.. ఇంకా లక్షలాది మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయి. వారిలో స్కిల్స్ పెంపుపై పారిశ్రామిక వేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించాం.ఇందులో భాగంగానే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ స్థాపనకు ప్రతిపాదిస్తున్నాం. అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి ఉంటాయి. నైపుణ్యాలు, ఉపాధి అంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుంది.. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తుంది. 2024-25 సంవత్సరంలో 2వేల మంది విద్యార్థులకు.. వచ్చే ఏడాది 10వేల మందికి శిక్షణ ఇస్తాం. ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పుకొచ్చారు.ఇక, మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీధర్ బాబు ప్రసంగం ఆపాలని కామెంట్స్ చేశారు. దీంతో, బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీరియస్ అయ్యారు. సభలో గందరగోళం చేస్తున్న బీఆర్ఎస్ సభ్యుల తీరు సరికాదు. పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ సభ్యులకు సభ రూల్స్ తెలియవా?. నిరుద్యోగ యువత కోసం బిల్లు తెస్తే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలు సిద్దాంత పరంగా వేరు అయినా బిల్లుకు మద్దతు ఇచ్చారు. స్లోగన్స్ ఇవ్వడానికి అసెంబ్లీ ఫ్లాట్ ఫాం కాదు. యువతకు సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ జరుగుతుంటే సహకరించాలి కదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ కూడా మండిపడ్డారు. -
ఆ వాటాల విక్రయమంటే కన్నబిడ్డలను అమ్ముకోవడమే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయం (డిజ్ ఇన్వెస్ట్మెంట్) ద్వారా ఈ ఏడాది రూ.50 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రస్తావించడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయమంటే కన్నబిడ్డలను మరొకరికి అమ్ముకోవడమే అని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై శ్రీధర్‌బాబు స్పందిస్తూ పీఎస్‌యూలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్త వాటిని స్థాపించకపోగా, లాభాల్లో ఉన్న సంస్థల వాటాలను అమ్మి సొమ్ము చేసుకుంటోందని ఆరోపించారు. బ్యాంకులు కాకుండా పీఎస్‌యూల వార్షిక లాభాలు రూ.2,64,000 కోట్లుగా ఉన్నాయన్నారు. బ్యాంకులను జాతీయం చేసి పేదల దగ్గరికి చేర్చింది స్వర్గీయ ఇందిరాగాంధీ అని, ఇప్పుడా బ్యాంకుల ద్వారా గతేడాది మోదీ ప్రభుత్వానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెంట్ లభించిందని శ్రీధర్‌బాబు తెలిపారు.నష్టాల్లో ఉన్న పీఎస్‌యూలకు అపారమైన ఆస్తులున్నాయని, కానీ అవి దివాలా తీశాయని ప్రధాని చెబుతున్నారని విమర్శించారు. వాటి అప్పుల కన్నా ఆస్తుల విలువ ఎక్కువని పేర్కొన్నారు. 13 మహారత్న, 14 నవరత్న, 72 మినీరత్న పీఎస్‌యూలన్నీ లాభాల్లో ఉన్నాయని, వీటిని నిర్వీర్యం చేసి వాటాలు అమ్ముకుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని శ్రీధర్‌బాబు హెచ్చరించారు.రక్షణరంగ ఉత్పత్తుల తయారీపై రూ.వెయ్యి కోట్ల పెట్టుబడిముందుకొచ్చిన వెమ్ టెక్నాలజీస్: మంత్రి శ్రీధర్బాబుసాక్షి, హైదరాబాద్: రక్షణరంగ పరికరాల ఉత్పత్తి సంస్థ వెమ్ టెక్నాలజీస్ మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్‌లో 511 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ సమీకృత ఉత్పాదన కేంద్రం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ట్రయల్ ప్రొడక్షన్‌కు సిద్ధమవుతుందని వెల్లడించారు. మొదటి దశ పూర్తయితే 1,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.గురువారం సచివాలయంలో వెమ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు. సంస్థకు కేటాయించిన భూమిలో ఇంకా స్వాధీనం చేయాల్సిన 43 ఎకరాలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతికి.. శ్రీధర్‌బాబు సూచించారు. ఉత్పత్తికి 33 కేవీ విద్యుత్ లైన్లను నాలుగు నెలల్లో ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సమావేశంలో వెమ్ టెక్నాలజీస్ సీఎండీ వెంకటరాజు పాల్గొన్నారు. -
కేసీఆర్ బీజేపీతో జతకట్టారనడానికి ఇదే నిదర్శనం: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట బడ్జెట్‌పై కేసీఆర్ విమర్శలా?.. కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు మంత్రి శ్రీధర్‌బాబు.. కేసీఆర్ బీజేపీతో జతకట్టారనడానికి ఇదే నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేశారాయన.. రాష్ట్ర బడ్జెట్ పెంచాలని అనుకున్నాం కానీ కేంద్రం నుంచి నిధులు రాలేదు.. సంక్షేమం, అభివృద్ధి సమభాగంలో బడ్జెట్ కేటాయింపులు జరిపామని మంత్రి అన్నారు.వ్యవసాయ రంగానికి న భూతో న భవిష్యత్ అనుకుంటున్నాం. హైదరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా మౌలిక వసతుల కోసం రూ. 10 వేల కోట్లు కేటాయించాం. హైదరాబాద్ ఎకో సిస్టం అభివృద్ధి కోసం 10వేల కోట్లు బడ్జెట్లో పెట్టాం. భవిషత్ తరాలకు అవసరం అయ్యేందుకు బడ్జెట్ కేటాయింపులు చేశాం.’’ అని శ్రీధర్‌బాబు వివరించారు.వ్యవసాయనికి 23వేల కోట్లు గత ప్రభుత్వం పెడితే.. ఇప్పుడు 72వేల కోట్లు పెట్టాం. వట్టి మాటలు మేము చెప్పడం లేదు.. కేసీఆర్ చెప్పి వెళ్ళారు. హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా జరగబోతోంది అందుకే బడ్జెట్ ఫోకస్ ఎక్కువగా సిటిపై పెట్టాం. మాకు ఒక విజన్ ఉంది.. 2004లో మహిళలను లక్షాధికారులను చేసి చూపాం. మేము అప్పులు తెచ్చి.. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నం. జులై వరకు 35వేల కోట్లు అప్పు చేసి 42వేల కోట్ల వడ్డీలు కట్టాం. రాష్ట్రం పై కేసీఆర్‌కు ప్రేమ ఉంటే నిన్న ఎందుకు రాలేదు?. కేంద్రం నుంచి పిలుపు రాగానే కేసీఆర్ ఇక్కడికి వచ్చి మాట్లాడి పోయారు. తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని అడుగుతాం’’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. -
తప్పుడు ప్రచారం మానుకోండి.. బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారని కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. ఇప్పటికైనా రైతుల్లో అయోమయం సృష్టించడం మానేసి మా నుంచి మీరు నేర్చుకోంది. మీరు చేయలేని పనులు మేము చేస్తే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మా పార్టీ సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హౌసింగ్ జీవోపైనా ఇష్టానుసారం మాట్లాడారు’ అంటూ సీరియస్ అయ్యారు.ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటుపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నెర్రెలు వాచిన కథ మనం చూశాం. మళ్లీ కుంగుతున్నట్టు ప్రజలు చెబితేనే మాకు తెలిసింది. ఇప్పటికే కాళేశ్వరంపై విచారణ కమిషన్ పనిచేస్తోంది. మిగతా ఇంకా ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు BRSకు లేదు - శ్రీధర్ బాబు
-
బీఆర్ఎస్లో మిగిలే ఆ నలుగురు ఎవరో వారే చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్కు చెందిన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు.. బీఆర్ఎస్కు కౌంటరిచ్చారు.ఇక, తాజాగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ..‘పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు. పార్టీలోకి చేరుతాం అంటే ఎవరైనా వద్దంటారా?. ఫిరాయింపులను ప్రోత్సహించాలని మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. గతంలో బీఆర్ఎస్ వేరే రకంగా చేరికలకు పాల్పడింది. భయపెట్టి మా పార్టీ ఎమ్మెల్యేలను అప్పుడు బీఆర్ఎస్లో చేర్చుకున్నారు.కానీ, ఇప్పుడు మేము ఎవరిని బెదిరించడం లేదు. వారికి వారే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రజలకు సేవ చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు వస్తున్నారు. నైతికంగా బీఆర్ఎస్కు ఇప్పుడు మమ్మల్ని అడిగే హక్కు, మా గురించి మాట్లాడే హక్కు లేదు. సంక్షేమం, అభివృద్ధిలో చెప్పిన పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి పాత్రదారులుగా ఉండేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు. బీఆర్ఎస్లో మిగిలే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరో ఆ పార్టీ నేతలే చెప్పాలి’ అని కామెంట్స్ చేశారు. -
ప్రభుత్వరంగ సంస్థల భూములను వెనక్కి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు (పీఎస్‌యూ) రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేటాయించిన భూములను తిరిగి వెనక్కి ఇవ్వాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు కాంగ్రెస్, బీజేపీ నేతలతో కలిసి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తో భేటీ అయ్యారు. పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తోందని, వీటి ఆ«దీనంలో ఉన్న మిగులు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని శ్రీధర్‌బాబు కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 70 ఏళ్లలో అనేక ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేసిందని, వాటి ఏర్పాటు కోసం అప్పట్లో వేలాది ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరా రు. ఖాయిలా పడిన ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. 4 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామ ర్ధ్యం కలిగిన సీసీఐ ఆదిలాబాద్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2,100 ఎకరాల సున్నపురాతి గనులతో పాటు మొత్తం 2,290 ఎకరాల భూమిని ఉచితంగా ఇచి్చన విషయాన్ని గుర్తు చేశారు.రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని, సులభతర వాణిజ్యంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులు ఉన్నాయని, వీటితో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని శ్రీధర్‌బాబు కోరారు. త్వరలో హైదరాబాద్‌లో పర్యటించి శ్రీధర్‌బాబు ప్రస్తావించిన అంశాలపై అధికారులతో చర్చిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. -
ఇంకా అలక వీడని జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు సమాచారం లేకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడంపై కినుక వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఇంకా అలకపాన్పు వీడలేదు. సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి గంటన్నర పాటు చర్చించారు. చర్చల తర్వాత కూడా ఆయన తన వైఖరి మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీని తాను వదిలే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రం త్వరలోనే రాజీనామా చేస్తానని జీవన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. మండలి చైర్మన్‌కు ఫోన్ సంజయ్ చేరిక సమయంలో కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదన్న మనస్తాపంతో ఉన్న జీవన్‌రెడ్డితో కాంగ్రెస్ నాయకత్వం సోమవారం చర్చలు జరిపింది. పార్టీ అధిష్టానం కూడా మాట్లాడింది. అయినా, తన వైఖరిలో మార్పు లేదంటూ జీవన్‌రెడ్డి మంగళవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాను కలుస్తానంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫోన్ చేశారు. కానీ, తాను అందుబాటులో లేనని, నల్లగొండ వెళుతున్నానని గుత్తా వెల్లడించడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు బేగంపేటలోని జీవన్‌రెడ్డి నివాసానికి హుటాహుటిన వెళ్లారు. గంటన్నరకు పైగా అక్కడే ఉండి జీవన్‌రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ తగిన గౌరవం ఇస్తుందని, సీనియారిటీకి ఎక్కడా గౌరవం తగ్గకుండా తాము చూస్తామని నచ్చజెప్పారు. అయితే, మంత్రులతో చర్చల సందర్భంగా జీవన్‌రెడ్డి తన మనసులోని మాటలను వారికి వెల్లడించారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలోని తన రాజకీయ ప్రత్యరి్థని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తనకు ఏం గౌరవం ఇచి్చనట్టని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధమని, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే ఆలోచన ప్రస్తుతానికి లేదని, తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసినట్టు సమాచారం. జీవన్‌రెడ్డి మా మార్గదర్శకులు: డిప్యూటీ సీఎం భట్టి మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర నేతలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పదేళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన నాయకుడు జీవన్‌రెడ్డి అని అన్నారు. ఆయన మనస్తాపానికి గురైతే తాము కూడా బాధపడతామని వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి తమందరికీ మార్గదర్శకులని, ఆయన అనుభవాన్ని ప్రభుత్వాన్ని నడిపేందుకు తప్పనిసరిగా వినియోగించుకుంటామని చెప్పారు. ఆయన సీనియారిటీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సీనియర్ నాయకులను వదులుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జీవన్‌రెడ్డిని తాము కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి వెల్లడించారు. చైర్మన్‌ను సమయం ఎందుకు అడిగానో ఆలోచించుకోండి: జీవన్‌రెడ్డి భట్టి, శ్రీధర్‌బాబులతో చర్చలు ముగిసిన అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉదని చెప్పారు. జరిగిన పరిణామాలు కొన్ని బాధించాయని వ్యాఖ్యానించారు. తనతో పార్టీ ఇన్చార్జ్ మున్షీ కూడా మాట్లాడారని వెల్లడించారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరని, ఆయన అందుబాటులోకి రాగానే నిర్ణయం చెబుతానని, త్వరలోనే మండలి చైర్మన్ దగ్గరకు వస్తానని అన్నారు. మీరు ఎమ్మెల్సీగా కొనసాగుతారా? రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా, మండలి చైర్మన్ టైం ఎందుకు అడిగానో అర్థం చేసుకోవాలని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
యానిమేషన్, గేమింగ్‌లో మనమే టాప్
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు 3 వేలకుపైగా హాలివుడ్ సినిమాలకు యానిమేషన్, వీఎఫ్ఎక్స్లకు సబంధించిన అవుట్ సోర్సింగ్ పనులు చేశారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని టీ–హబ్ ప్రాంగణంలో శనివారం వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, యానిమేషన్, ఫిల్మ్, గేమింగ్ అనే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అలాగే తెలంగాణ వీఎఫ్ఎక్స్ యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్, ఇండో–అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సేవలపైనా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ నుంచి యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్, సినిమాల ప్రచారంతోపాటు ప్రపంచ యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్, సినిమాలలో భారతదేశంలో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని ఆయన వివరించారు. సోనీ, కామ్‌కాస్ట్, నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ వంటి పెద్ద కంపెనీలు భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. ఈ రంగాన్ని ప్రోత్సహించడంలో ఇండో–అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ఐఏసీసీ జాతీయ అధ్యక్షుడు పంకజ్ బొహ్ర మాట్లాడుతూ పెరుగుతున్న డిమాండ్, నిరంతర ఆవిష్కరణలు భారత్‌లో ఈ రంగాన్ని తాము ప్రోత్సహించడానికి ప్రధాన కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, అమెరికన్ కాన్సులేట్ వాణిజ్య వ్యవహరాల సలహాదారు రాఘవన్ శ్రీనివాసన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రాజెక్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి. మధుసూదన్ ప్రసంగించారు. -
నీట్‌పై సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ‘నీట్’ పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు ఆరోపణలు రావడం ఒకటైతే, 63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంకు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన శాసనసభలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల అంశంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై తక్షణమే కేంద్రం స్పందించాలని కోరారు. దీనికి బా ధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నెలరోజులపాటు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతినిచ్చి.. ఆ తరువాత మరో వారం రోజులు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పరీక్షల ఫలితాలు జూన్ 14వ తేదీ రావాల్సి ఉండగా.. పదిరోజుల ముందుగానే ప్రకటించడం కూడా అనుమానాలు మరింత పెరగడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయని, గ్రేస్ మార్కులు కూడా ఇష్టానుసారం కలిపారని మంత్రి ఆరోపించారు. నీట్ పరీక్షల నిర్వహణలో నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే)పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. బొగ్గు గనుల వేలంపై పునరాలోచన చేయాలి.. బొగ్గు గనులను వేలం వేయకుండా ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలోనే ప్రారంభించాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. బొగ్గు గనులను సింగరేణి ద్వారానే ఏర్పాటు చేయాలని, కానీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాత్రం ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నట్లు చెబుతున్నారని మంత్రి విమర్శించారు. అన్ని బొగ్గు నిక్షేప సంస్థలు లాభాల్లో ఉన్నాయని, కిషన్‌రెడ్డి ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.బొగ్గు గనుల అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిసి మాట్లాడతారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై పునరాలోచన చేసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఒక్కసీటు కూడా రాదని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. జీవో 46పై త్వరలోనే సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
మంత్రి దృష్టికి తీసుకెళ్తా.. సమస్యను పరిష్కరిస్తా: కేఎల్ఆర్
సాక్షి, హైదరాబాద్: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని జన్నాయిగూడ గ్రామంలో ఫ్యాబ్ సిటీ, ఫార్మసిటీ వల్ల భూములు కోల్పోయిన స్థానికులతో మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేఎల్ఆర్ (కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి), ధరణి కమిటీ చైర్మన్ కోదండ రెడ్డిలు భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కేఎల్ఆర్ మాట్లాడుతూ.. సమస్యను మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బోధ మాధవరెడ్డి, పుంటి కూర చంద్రశేఖర్‌రెడ్డి, ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్తో పాటు ఆయా గ్రామల రైతులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. -
12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది మేమే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూసే పరిస్థితి ఉండేదన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేనని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు హరీశ్, కేటీఆర్‌ల ఆరోపణలను కౌంటర్ చేస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఆశ వర్కర్ల గురించి మాట్లాడే అర్హత హరీశ్‌రావుకు లేదు. బీఆర్ఎస్ హయాంలో ఆశవర్కర్లను గుర్రాలతో తొక్కించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం. మూడునెలల మా పాలన పూర్తయ్యేలోపే ఎన్నికల కోడ్ వచి్చంది. ఇప్పుడే కోడ్ అయిపోయింది. అన్ని హామీలు అమలు చేస్తాం. త్వరలోనే జాబ్ కేలండర్ విడుదల చేస్తాం.’అని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, మతఘర్షణల వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. -
రాష్ట్రంలో పెట్టుబడులకు డెల్టా ఎయిర్‌లైన్స్ ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులకు డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ ఆసక్తితో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. శుక్రవారం అట్లాంటాలోని డెల్టా ఎయిర్‌లైన్స్ కార్యాలయంలో ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీటీఓ నారాయణన్ కృష్ణకుమార్‌తో తెలంగాణ మంత్రుల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కలి్పస్తుందని శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు వివరించారు.ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు డెల్టా టీమ్ తెలిపిందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇలావుండగా శ్రీధర్‌బాబుతో పాటు పర్యటనలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం నడపాలని కృష్ణకుమార్‌ను కోరారు.నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం వలన అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్ధులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కృష్ణకుమార్.. డెల్టా ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఈ దిశగా తక్షణం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ‘కోకో కోలా’ సానుకూల స్పందన అట్లాంటాలోని కోకో కోలా హెడ్ క్వార్టర్స్‌లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనాథాన్ రీఫ్‌తో కూడా మంత్రులు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహా్వనించారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశం సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్లాంట్ స్థాపించినా అందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని, రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు పెరిగాయని వివరించారు. సానుకూలంగా స్పందించిన జోనాథాన్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మంత్రులతో ఉన్నారు. -
ఈదురుగాలుల ఎఫెక్ట్.. కూలిన వంతెన
టేకుమట్ల/మహాముత్తారం/ముత్తారం(మంథని): జయశంకర్ భూపాలపల్లి–పెద్దపల్లి జిల్లాను అనుసంధానం చేస్తూ ఓడేడ్ – గర్మిళ్లపల్లి మధ్య మానేరుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు కూప్పకులాయి. సోమవారం రాత్రి వీచిన బలమైన గాలుల ధాటికి పియర్లపై అమర్చిన మూడు గడ్డర్లు ఒక్కసారిగా కిందపడ్డాయి. 2016 ఆగస్టు 4న రూ.47.4కోట్ల అంచనా వ్యయంతో 40 మీటర్ల పొడవున 24 పియర్లతో వంతెన నిర్మాణం ప్రారంభించారు. నాటినుంచి ఈ అంతర్ జిల్లా వంతెన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు సగం గడ్డర్లు కూడా పూర్తి కాలేదు. కాగా, సోమవారం రాత్రి బలమైన గాలులకు రెండు, మూడు పియర్లపై అమర్చిన మూడు గడ్డర్లు విరిగి నేలమట్టమయ్యాయి. సిమెంట్ దిమ్మెలకు బదులు కర్రలు పెట్టి గడ్డర్లు బిగించడంతో వర్షానికి తడిసి నానిపోయి మానేరులో నిర్మించిన తాత్కాలిక రోడ్డుపై అవి కూలిపోయాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోడ్డుపై పగలు వందలాదిమంది ప్రయాణాలు సాగిస్తుంటారనీ, వంతెన గడ్డర్లు పగలు కూలి ఉంటే ఊహించని ప్రాణనష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఐదు గడ్డర్లు కూలేందుకు సిద్ధం నంబర్ 2, 3 పియర్ల మధ్య ఓ వైపు ఉన్న మూడు గడ్డర్లు కూలిపోగా, మరో పక్క రెండు ఒంగడంతో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే 23, 24 పియర్లపైనున్న మరో మూడు గడ్డర్లు కూడా ఒక వైపునకు ఒంగి కూలే పరిస్థితిలో ఉన్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే: ఎస్ఈ ఆర్ అండ్ బీ జగిత్యాల ఎస్ఈ చందర్‌సింగ్, ఈఈ రాములు, గోదావరిఖని ఏసీపీ రమేశ్ మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్ఈ చందర్‌సింగ్ మాట్లాడుతూ, బలమైన గాలుల ధాటికి వంతెనలు కూలవని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఇది కూలిందన్నారు. విచారణ చేపడతాం: మంత్రి శ్రీధర్‌బాబు గత ప్రభుత్వంలో చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణాల నాణ్యత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, మొన్న కాళేశ్వరం నేడు ఓడేడ్ వంతెన కూలిపోవడమే నిదర్శనమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహాముత్తారం ప్రచారానికి వచ్చిన ఆయన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. కలకాలం ఉండాల్సిన బ్రిడ్జి కడుతుండగానే గాలికి కూలిపోవడం దారుణమన్నారు. ఇలాంటి నిర్మాణాలు నిర్మించిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టి, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకునే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. -
‘పాలమూరు’కు జాతీయ హోదా!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయనుంది. ఈ మేరకు శనివారం తుక్కుగూడ జన జాతర సభలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చే 23 ప్రత్యేక హామీలను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. మంత్రి, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ ఖరారు చేసిన ఈ ప్రత్యేక హామీలను సీఎం రేవంత్‌రెడ్డి తుక్కుగూడ సభ వేదికపై ప్రకటించనున్నారు. కాంగ్రెస్ ఇవ్వనున్న ప్రత్యేక హామీలివే..! 1) ఐటీఐఆర్ ఏర్పాటు 2) ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం.. కాజీపేట్ రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌లో ఐఐఎం, హైదరాబాద్–వి జయవాడ హైవేలో ర్యాపిడ్ రైల్వే సిస్టం, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు. 3) భద్రాచలం సమీపంలోని ఏటపాక, గుండాల, పురుషో త్తమ పట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాలు తిరిగి తెలంగాణలో విలీనం. 4) పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా. 5) హైదరాబాద్‌లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం 6) కొత్త విమానాశ్రయాల నిర్మాణం 7) రామగుండం, మణుగూరు రైల్వేలైన్ 8) కొత్తగా నాలుగు సైనిక్ స్కూళ్ల ఏర్పాటు 9) కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పెంపు 10) నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు 11) నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు 12) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఏఎస్ఈఆర్) 13) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ఫారిన్ ట్రేడ్ 14) నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ 15) ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్ఐ) క్యాంపస్ 16) అధునాతన వైద్య ఆరోగ్య పరిశోధనా కేంద్రం 17) కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయింపు 18) ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ యూనిట్ 19) ఐదు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం (హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– నాగ్‌పూర్, హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్–నల్లగొండ–మిర్యాలగూడ, సింగరేణి పారిశ్రామిక కారిడార్) 20) అంతర్జాతీయ స్థాయి కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ 21) మేడారం జాతరకు జాతీయ హోద 22) న్యూ డ్రైపోర్టు ఏర్పాటు 23) హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు -
గచ్చిబౌలి: ఓఘ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన డింపుల్ హాయతి
-
త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని (స్కిల్ యూనివర్సిటీ) ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సహచరులు, అధికారులు చిత్తశుద్ధితో ఉన్నట్లు ఆయన వివరించారు. విద్యా శాఖ, ఉన్నత విద్యామండలి, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో ఉద్యోగ–ఉపాధి అవకాశాలు, ఇంటర్న్‌షిప్, ఉద్యోగాల కల్పన, విద్యార్థుల అభివృద్ధి’’అనే అంశంపై గురువారం అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రం విద్య, ఐటీ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే ఏ విద్యార్థి కూడా నైపుణ్య లేమితో ఉపాధి అవకాశాలు కోల్పోరాదని, ఆ దిశగా ఉన్నత విద్యా మండలి, విద్యా శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. డిగ్రీ స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే విద్యార్థులు రాష్ట్రంలోని ప్రఖ్యాత పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఆయా కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక శిక్షణను ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నత విద్య స్థూల నమోదు జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువగా ఉందని, రాష్ట్ర విద్యారంగంలో అమలు అవుతున్న కార్యక్రమాలు ఉన్నతమైన గుర్తింపు పొందాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొ. వెంకట రమణ, ప్రొ. ఎస్.కె. మహమూద్ తదితరులు ప్రసంగించారు. -
రెన్యూ సిస్ పెట్టుబడులు రూ. 6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్/మహేశ్వరం: సోలార్ ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్, ఫొటో వోల్టాయిక్ సెల్స్ తయారీలో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థ ‘రెన్యూసిస్’తెలంగాణలో రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వంతో రెన్యూసిస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్‌సిటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో రెన్యూసిస్తో జరిగిన ఒప్పందంపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సంతకాలు చేశారు. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలో తయారీ యూనిట్లు కలిగిన రెన్యూసిస్ తమ అతిపెద్ద తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ముందుకు రావడంపై మంత్రి శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందజేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా హైదరాబాద్ సోలార్ పరికరాల తయారీకి హబ్‌గా మారుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని ప్రోత్సహిస్తుందన్నారు. సోలార్ పరికరాల ఉత్పత్తి రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని, అందుకు అనువుగా ఉండే సమగ్ర ఇంధన విధానాన్ని రూపొందిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. పరిశ్రమలకు ప్రోత్సాహం : రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని హార్డ్‌వేర్ పార్కు–2లో అపోలో మైక్రో సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ ఎల్రక్టానిక్ పరికరాల కంపెనీ నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణకు అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్షరింగ్ హబ్‌గా మారిందన్నారు. ఏరోస్పేస్ పరికరాల తయారీలో దేశంలోనే ముందు వరుసలో ఉన్నామని స్పష్టం చేశారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, అపోలో మైక్రో సిస్టమ్స్ కంపెనీ ఎండీ బద్దం కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కాళేశ్వరం’పై సిట్టింగ్ జడ్జి కోసం మరోసారి లేఖ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై న్యాయవిచారణ నిర్వహించేందుకు సిట్టింగ్ జడ్జి సేవలను కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని మరోసారి కోరతామని పరిశ్రమలు, ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని గతంలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరామని, అయితే జడ్జీల సంఖ్య తక్కువగా ఉన్నందున ఇవ్వలేమని, విశ్రాంత న్యాయమూర్తిని అందుకు కేటాయిస్తామని హైకోర్టు నుంచి జవాబు వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాల్సిందిగా మరోసారి లేఖ రాస్తామని వెల్లడించారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాళేశ్వరం అవినీతిపై న్యాయవిచారణ జరిపిస్తామని స్పష్టంగా పేర్కొన్నామని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపిస్తామంటే అడ్డు చెప్పబోమని పేర్కొన్నారు. విచారణ జరిపించ దలుచుకుంటే కేంద్రానికి సీబీఐయే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో కూడా జరిపించేందుకు అవకాశం ఉందన్నారు. అయితే ఈ విభాగాలతో కేంద్రం విచారణ జరిపిస్తే మాత్రం బీఆర్ఎస్–బీజేపీ ఒక్కటవుతాయనే అనుమానం కూడా తమకుందన్నారు.రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమున్నా కాళేశ్వరంపై ప్రాజెక్టుపై విచారణ జరిపించే ఉండేవారని, అందుకోసం విచారణకు సిట్టింగ్ జడ్జిని కూడా ఇచ్చి ఉండేవాళ్లని చెప్పారు. గతంలోనూ వివిధ అంశాలపై పలు సందర్భాల్లో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగిన ఉదంతాలున్నాయని, అందువల్ల సిట్టింగ్ జడ్జిని ఎప్పుడూ విచారణకు ఇవ్వలేదనే వాదనలు అవాస్తవమని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇదిలా ఉంటే... బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంపై కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన నివేదికలోని అంశాలపైనా తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని శ్రీధర్‌బాబు చెప్పారు. కేఆర్ఎంబీ చర్చంటే.. బీఆర్ఎస్ సభ్యులు పారిపోయారు కృష్ణానది యాజమాన్య బోర్డు అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొనకుండా బీఆర్ఎస్ సభ్యులు పారిపోయారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు సూచనలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్నారు. నల్లగొండ సభకు వెళ్లిన కేసీఆర్‌కు శాసనసభకు రావడానికి ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు. సభలో ఏయే పార్టీలు ఎంతెంత సమయమంటే.. 8 రోజుల పాటు 45 గంటల 32 నిమిషాలు సభ నిర్వహించామని, 59 మంది సభ్యులు సభలో మాట్లాడారని, 64 మంది సభ్యులు జీరో అవర్‌లో మాట్లాడారని, 2 తీర్మానాలను పాస్ చేశామని, 3 బిల్లులకు ఆమోదం తెలిపామని శ్రీధర్‌బాబు వివరించారు. సభ్యులందరూ సవివరంగా మాట్లాడే అవకాశం కల్పించామని, పార్టీల వారీగా కాంగ్రెస్‌కు 8 గంటల 43 నిమిషాలు, బీఆర్ఎస్కు 8 గంటల 41 నిమిషాలు, బీజేపీకి 3 గంటల 48 నిమిషాలు, ఎంఐఎంకు 5 గంటలు, సీపీఐకి 2 గంటల 55 నిమిషాలు అవకాశం ఇచ్చామని చెప్పారు. కాగా, కౌన్సిల్ 11 గంటల 5 నిమిషాల పాటు జరిగిందని శ్రీధర్‌బాబు చెప్పారు. -
రాజగోపాల్ రెడ్డి మాటల్లో తప్పేంటి ?..తప్పుగా మాట్లాడితే..
-
అన్ని పార్టీల సభ్యులు మేడిగడ్డకు రావాలి: శ్రీధర్ బాబు
-
తెలంగాణ బడ్జెట్: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
Live Updates.. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు.. ఉభయ సభలు సోమవారానికి వాయిదా. భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం.. 2024-25 ఆర్థికసంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 29,669 కోట్లు ద్రవ్యలోటు రూ.32,557 కోట్లు. రెవెన్యూలోటు రూ.5944 కోట్లు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తాం తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తెస్తాం ప్రజల సంక్షేమం కోసం ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొంటాం ప్రజాపాలన మరింత పటిష్టంగా ముందుకు సాగుతుంది నిస్సహాయులకు సాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం సమానత్వమే మా ప్రభుత్వ విధానం అందరం కోసం మనందరం అనే స్పూర్తితో ముందుకెళ్తాం ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించడం మా చిత్తశుద్ధికి నిదర్శనం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత గత ప్రభుత్వం దళిత బంధు పథకానికి రూ.17,700 కోట్లు చూపించారు.. ఒక్క పైసా ఇవ్వలేదు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పంచాయతీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు జీఎస్డీపీ 2022-3తో పోలిస్తే 13,02,371 కోట్ల నుంచి 14,49,708 కోట్లకు ఆర్ధిక వృద్ధి 14.7 శాతం నుంచి 11.3 శాతం క్షీణించింది దేశీయ స్థాయిలో వృద్ధి రేటు 16.1 శాతం నుంచి 8.9 శాతానికి పడిపోయింది అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది 5వ స్థానం టీఎస్ పీఎస్ సీ నిర్వహణ కోసం 40 కోట్లు కేటాయింపు అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు హామీలు నెరవేర్చాం విద్యుత్ రంగానికి ర.16,825 కోట్లు కేటాయింపు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్ల అదనపు చెల్లింపు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం గృహ జ్యోతి కింద రూ.500లకే వంటగ్యాస్ సంక్షేమ పథకాల అమలుకు రూ.53,196 కోట్లు మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను మరింత అభివృద్ధి చేస్తాం రాష్ట్రంలో ప్రభుత్వం తరపున రెండు లెదర్ పార్కులు రాష్ట్రం నలుమూలల అభివృద్ధికి ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు త్వరలో డ్రై పోర్టులను అందుబాటులోకి తెస్తాం పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు ప్రతిపాదిస్తున్నాం గ్రామీణ ప్రజల అభివృద్ధికి ఏఐ టెక్నాలజీని వినియోగిస్తాం ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బంది రానీయం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరిస్తాం అమెరికాలోని ఐటీ సర్వ్ అనే సంస్థతో సంప్రదింపులు చేస్తున్నాం ఐటీ రంగంలో తెలంగాణ తిరుగులేని శక్తిగా నిలబడుతుంది 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే విధివిధానాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు పాలనకు కాదు రాష్ట్రాభివృద్ధికి హైదరాబాద్ గుండెకాయ హైదరాబాద్ కు ఆర్ధిక శక్తినిచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఫార్మా, ఐటీ, ఓఆర్ఆర్, 24 గంటల విద్యుత్ ఘనత కాంగ్రెస్‌దే హైదరాబాద్ అభివృద్ధి నాయకులు, అధికారుల కోసం కాదు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పనా జోన్ గా మారుస్తాం మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధికి నూతన విధానాలు హైదరాబాద్ అభివృద్ధి నాయకులు, అధికారుల కోసం కాదు థేమ్స్ నది తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి సాంస్కృతిక కట్టడాల పరిరక్షణను పకడ్బందీగా అమలు చేస్తాం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కోసం రూ.1,000 కోట్లు తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని 3 జోన్ లుగా విభజిస్తాం ORR, RRR మధ్య ప్రాంతాన్ని పెరి అర్బన్ జోన్ RRR ఆవల ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్ గా విభజన సాగుకు పనికి రాని భూములకు సైతం గత సర్కార్ రైతుబంధు ఇచ్చింది పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ భూములకు రైతుబంధు ఇచ్చారు రైతు బంధు కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందిస్తాం ఆయిల్ పామ్ సాగుకు అదనంగా లక్ష ఎకరాలకు పెంపు కైలు రైతులకు రైతు బీమా పథకం వర్తింపజేస్తాం త్వరలో నూతన విత్తన విధానం అమల్లోకి తెస్తాం ధరణి కొంతమందికి భరణంగా, మరికొంతమందికి ఆభరణంగా మారింది ధరణి పోర్టల్ సమస్యల అధ్యయనంపై ఐదుగురితో కమిటీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను మరింత అభివృద్ధి చేస్తాం ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1,000 కోట్లు ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.250కోట్లు గురుకులాల పాఠశాలల సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కాలేజీలు ఎస్టీ సంక్షేమానికి రూ.13,313 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2,262 కోట్లు బీసీ గురుకుల భవన నిర్మాణాలకు రూ.1,546 కోట్లు సాంప్రదాయ వృత్తుల వారికి శిక్షణతోపాటు పనిముట్లు బీసీ సంక్షేమానికి రూ.8,000 కోట్లు కేటాయింపు కాంగ్రెస్ మేనిఫెస్టో సింహభాగం మహిళల సంక్షేమానికే మహిళలకు గత డిసెంబర్ 9 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు పోషకాహారం తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తాం త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కేటాయింపులు ఇలా.. ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ.53,196 కోట్లు. ఐటీ శాఖకు రూ.774 కోట్లు. పంచాయతీరాజ్ శాఖకు రూ.40080 కోట్లు. పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు. వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు. ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1250 కోట్లు. గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు. నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు. బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సింహభాగం మహిళల సంక్షేమానికే. బీసీ గురుకుల భవన నిర్మాణాలకు రూ.1546 కోట్లు. సాంప్రదాయ వృత్తుల శిక్షణతో పాటు పనిముట్లు. విద్యుత్-గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు. విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. విద్యుత్ రంగానికి 16825 కోట్లు కేటాయింపు మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు అదనపు కేటాయింపు. గృహజ్యోతి కింద రూ.500లకే వంటగ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ విద్యారంగానికి రూ.21,389 కోట్లు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు. యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు. ఎస్సీ సంక్షేమం రూ.21874కోట్లు. ఎస్టీ సంక్షేమం రూ.13013 కోట్లు. పరిశ్రమల శాఖకు రూ.2543 కోట్లు ప్రతిపాదిస్తాం. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తాం. విద్యారంగానికి రూ.21389 కోట్లు. త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు రూ.500 కోట్లు కేటాయింపు. 65 ఐటీఐలను ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం. గుజరాత్, ఢిల్లీ, ఒడిశా తరహాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లు. మా ప్రభుత్వంలో 6956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించాం. వైద్య రంగానికి రూ.11,500 కేటాయింపు. యువజన సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. యువకులను రెచ్చగొట్టం కాదు.. ఆత్మగౌరవంతో బతికేలా చేస్తాం. జాబ్ క్యాలెండర్ తయారు ప్రక్రియను ప్రారంభించాం. త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నాం. త్వరలో 15వేల కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. టీఎస్పీఎస్సీకి రూ.40కోట్ల ఆర్థిక వనరులు. తాత్కాలిక ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగి మరణిస్తే రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా. చేనేత కార్మికుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి స్కూల్ యూనిఫామ్స్ కొనుగోలు చేస్తాం. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన ఘనత తెలంగాణది. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ది. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌కు కట్టుబడి ఉన్నాం. గృహజ్యోతి పథకం కింద రూ.200 యూనిట్ల ఫ్రీ కరెంట్. గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు కేటాయింపు. ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ.16,825 కోట్లు. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల సాయం. ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు. గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం. రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించాం. నూతన హైకోర్టు భవనానికి వంద ఎకరాల స్థలం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అయిష్టంగా ఉంది. ప్రణాళిక, హేతుబద్దత లేకుండా గత ప్రభుత్వం అప్పులు చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు సవాళ్లుగా మారాయి. నీళ్లు, నిధులు, నియామకాలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగుతుంది. ►తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ►బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి విక్రమార్క. ►మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి శ్రీధర్ బాబు. ►తెలంగాణ బడ్జెట్ 2.75 లక్షల కోట్లు. నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి కేటీఆర్ దూరం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ బీఆర్ఎస్ సభకు హాజరుకానున్న కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని. అనంతరం తెలంగాణ భవన్‌కు కేటీఆర్ ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక భేటీ రేపు సాయంత్రం సీఎల్పీ సమావేశం. సీఎల్పీలో కాళేశ్వరం టూర్, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్న నేతలు సీఎల్పీ భేటీకి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు ►బడ్జెట్ ప్రతులను సీఎం రేవంత్‌కు అందించిన ఆర్థిక మంత్రి భట్టి, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. ►శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ పత్రాలు అందజేసిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ►ఈనెల 12వ తేదీన బడ్జెట్ సమావేశాలను ముగించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్. ►మరోవైపు.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్ శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ►విజిలెన్స్ ఇరిగేషన్ అంశాలను సభలో మాట్లాడనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ►ఈనెల 13న మేడిగడ్డ పర్యటనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్. ►సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించిన ప్రభుత్వం. ►కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయం. ►కేసీఆర్‌ను ఆహ్వానించే బాధ్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌కు అప్పగించిన సీఎం రేవంత్ ►కాసేపట్లో అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్. ఇప్పటికే అసెంబ్లీ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ►బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కామెంట్స్ స్పీకర్ పదవి ఆఫర్ ఇచ్చారు. నేనే వద్దన్నాను. రెండో విడతలో మంత్రి పదవి వస్తుంది అని ఆశిస్తున్నాను. కేసీఆర్ ముర్కుడు.. రేషన్ బియ్యం సరఫరాలో, ధాన్యం సేకరణలో అవినీతికి పాల్పడ్డారు ప్రాణహిత చేవెళ్ల కోసం రెండువేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తే పైపులకే కేసీఆర్ మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో SLBCకి కొంత నిధులు ఇస్తే ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేది. దానికి కూడా నిధులు ఇవ్వలేదు 9:50AM, Feb 10, 2024 బడ్జెట్లో అన్ని అంశాలు ఉంటాయి: భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలను అమలు చేస్తాం 9:47AM, Feb 10, 2024 ముగిసిన తెలంగాణ కేబినెట్‌సమావేశం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం మధ్యాహ్నం గం. 12.లకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ అంచనా రూ. 3లక్షల కోట్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు ►తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం ►బడ్జెట్లో అన్ని అంశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తాం: భట్టి విక్రమార్క ►బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం. ►తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ►కాసేపట్లో బడ్జెట్‌కు ఆమోదం తెలుపునున్న రాష్ట్ర కేబినెట్ ►తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నాం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. ►మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండ్రోజులుగా దూరంగా ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది. -
Ts: బీఏసీ మీటింగ్ వివాదం.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావుకు అసెంబ్లీలో వింత అనుభవం ఎదురైంది. బీఏసీ సమావేశానికి హాజరయ్యే విషయంలో ఏర్పడిన గందరగోళంపై హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘గతంలో లేని సంప్రదాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తోంది. జాబితాలో పేర్లు ఉన్న వారు మాత్రమే బీఏసీ సమావేశానికి రావాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అంటున్నారు. కడియం శ్రీహరితో పాటు హరీశ్‌రావు బీఏసీకి వస్తారని నిన్ననే స్పీకర్‌కు బీఆర్ఎస్ఎల్పీ లీడర్ కేసిఆర్ తెలియజేశారు. స్పీకర్ రమ్మన్నారు కాబట్టే వెళ్ళాను. ఒక్క ఎమ్మెల్యే ఉన్న సీపీఐని బీఏసీ సమావేశానికి పిలిచారు’ అని హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. అంతకుముందు బీఏసీ సమావేశానికి వెళ్లిన హరీశ్‌రావు సమావేశం మధ్యలో నుంచే బయటికి వచ్చేశారు. జాబితాలో పేరున్న కేసీఆర్‌కు బదులుగా పేరున్న హరీశ్‌రావు బీఏసీకి వెళ్లారు. హరీశ్‌రావు బీఏసీ సమావేశానికి రావడంపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం తెలపడంతో హరీశ్‌రావు మధ్యలోనే బయటికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. తాము ఎవరినీ వ్యక్తిగతంగా బీఏసీ నుంచి బయటికి వెళ్లమని కోరలేదన్నారు. స్పీకర్ నిర్ణయం మేరకే బీఏసీ నడిచిందని, పార్టీల నుంచి ముందుగా ప్రతిపాదించిన సభ్యులే బీఏసీకి రావాలని స్పీకర్ కోరారని చెప్పారు. జాబితాలో పేరున్న కేసీఆర్‌కు బదులుగా హరీశ్‌రావు వస్తారని బీఆర్ఎస్ తెలిపిందన్నారు. గవర్నర్ ప్రసంగంలో గ్యారెంటీల జాడ లేదు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంపై అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీశ్‌రావు స్పందించారు. ఒక విజన్‌లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచిందన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా లేదని విమర్శించారు. ‘కొత్త ఆసరా పెన్షన్లు, మహిళలకు నెలకు రూ. 2500 ఎప్పుడిస్తారో తెలియని ప్రసంగం నిరాశపరిచింది. రైతులకు బోనస్, రైతు బంధు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేనేలేదు. ప్రజావాణి కార్యక్రమం తుస్సుమంది. మంత్రులు, ఐఏఎస్‌లు తీసుకోవాల్సిన అప్లికేషన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పినట్టు 2 గ్యారెంటీలు అమలవ్వడం లేదు. త్వరలో ఎన్నికల కోడ్ అమలవనుంది. అప్పుడు ఈ కొత్త హామీలు ఎలా అమలు చేస్తారు’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇదీచదవండి.. ప్లీజ్ కేటీఆర్..కాంట్రవర్సీ వద్దు -
సభా సమయం.. నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మూడో శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30కి శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ఈ నెల 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆమోదం ఉంటాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. కాగా బడ్జెట్లోని అంశాలపై 12 నుంచి చర్చ జరగనుంది. ఆరు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని భావిస్తుండగా, గురువారం స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సమావేశ తేదీలు, ఎజెండా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే బీఏసీ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో విపక్ష పారీ్టల నేతలతో సంప్రదించి సభ నిర్వహణ తీరు తెన్నులపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. సకాలంలో సమాధానాలు ఇవ్వండి శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ఉభయ సభల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇవ్వడంతో పాటు సమావేశాలు సజావుగా నడిచేందుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. ఆఫీసర్ బాక్సులో అధికారులు తగిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని అన్నారు. పాత అసెంబ్లీ భవనంలోకి శాసనమండలిని తరలించే పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తా చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భద్రత, లాబీల్లోకి సందర్శకులు గుంపులుగా రావడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడటం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. సమావేశాలు జరిగే సమయంలో మంత్రులు అందుబాటులో ఉండాల ని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ కోరారు. ప్రోటోకాల్‌లో తప్పిదాలు జరగొద్దు: శ్రీధర్‌బాబు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు వచ్చేలా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ప్రస్తుత సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగవద్దని అన్నారు. ప్రోటోకాల్ విషయంలో గతంలో తాను కూడా బాధితుడినని గుర్తు చేశారు. త్వరలో ఓరియెంటేషన్ కార్యక్రమం మండలిని అసెంబ్లీ ప్రాంగణంలోకి త్వరితగతిన తరలించేందుకు చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు చెప్పారు. తొలిసారిగా శాసనసభ, శాసనమండలికి ఎన్నికైన సభ్యుల కోసం రెండురోజుల ఓరియెంటేషన్ కార్యక్రమం త్వరలో ఏర్పాటు చేస్తా మన్నారు. ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్, బీర్ల ఐలయ్య, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు, లెజిస్లేచర్ అడ్వైజర్ ప్రసన్నకుమార్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా పాత అసెంబ్లీ భవనంలోకి శాసనమండలిని తరలించాలనే నిర్ణయం నేపథ్యంలో బుధవారం మండలి చైర్మన్, స్పీకర్ తదితరులు పాత అసెంబ్లీ భవనంలోని సమావేశ మందిరాన్ని పరిశీలించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. -
మూసీ సుందరీకరణే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: మూసీ నది సుందరీక రణ, స్థిరమైన అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ’’రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందా? అని ఎన్నికల వేళ మాట్లాడుకున్నారు, గెలిచి చూపించాం. ఇ ప్పుడు ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేస్తుందా? అని హేళనగా మాట్లాడుతున్నారు. మూ సీ పరీవాహక ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నాం’’ అని ఆయన వెల్లడించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో గురువారం నగరంలో జరిగిన ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టే ట్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓ ఆర్ఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) మధ్య 13 క్లస్టర్ల ఏర్పాటుతో ఆయా ప్రాంతాలలో సాంసృతిక వ్యాపారాలకు అవ కాశం ఉంటుందని వివరించారు. పీపీపీ విధా నంలో టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ప్రభుత్వం అనేది.. కేవలం వ్యాపా రాన్ని సులభతరం చేసే ఒక వేదిక మాత్రమే నని, మౌలిక వసతుల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల సహకారం అవసరమని ఆయన పునరుద్ఘాటించారు. మూడు దశాబ్దాలుగా స్థిరాస్తి రంగం పుంజుకుందని, సుస్థిరమైన విధానాలతో స్థిరాస్తి రంగంలో మరింత అభివృద్ధి కోసం కృషి చేస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపబోమని స్పష్టం చేశారు. మూసీనదిలో పడవ రవాణా సదుపాయం: దాన కిషోర్ గ్రేటర్ హైదరాబాద్‌కు మూసీ నది చోదక శక్తికి మారనుందని హెచ్ఎండీఏ పిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ తెలిపారు. గ్రేటర్లో దాదాపు 55 కిలోమీటర్లు మేర ఉన్న మూసీ నది వెంట గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజి యం, చార్మినార్, హైకోర్టు, ఉస్మానియా వంటి ఎన్నో వారసత్వ ప్రదేశాలు కొలువై ఉన్నాయని, అందుకే మూసీ రివర్ ఫ్రంట్ కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. మూసీ ప్రవాహంలో సగ భాగం మెట్రో, సగం భాగం రోడ్డు మార్గం ఉంటుందని, దీంతో పాటు మూసీలో పడవ రవాణా ప్రయాణ సదుపాయం వచ్చేలా పటిష్టమైన ప్రణాళికలుంటాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు పశ్చిమ ప్రాంతంలోనే కేంద్రీకృతమైన అభివృద్ధిని మూసీ రివర్ ఫ్రంట్‌తో నగరం నడిబొడ్డుకు తీసుకొస్తామని దాన కిషోర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం మూసీ పరివాహం వెంట వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లను నిర్మించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు నైపుణ్యం పెంపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని దాన కిషోర్ తెలిపారు. ఇప్పటివరకు ఉన్న డిప్లమో కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు, వేతనాలు తక్కువ అని అందుకే ఈ కోర్సులను గ్రాడ్యుయేషన్ స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆయన వెల్లడించారు. -
హైదరాబాద్‌లో ఏసీఈ ల్యాబ్ ఫోరెన్సిక్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఫోరెన్సిక్, డేటా రికవరీలో పేరొందిన రష్యా సంస్థ ‘ఏసీఈ ల్యాబ్’మరో కంపెనీ ‘జూమ్ టెక్నాలజీస్’తో కలిసి హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ సెంటర్, మాన్యుఫాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. మంగళవారం ఏసీఈ ల్యాబ్ సీవోవో మ్యాక్స్ పుతివ్ సేవ్, జూమ్ టెక్నాలజీస్ సీవోవోతోపాటు ఆయా సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. సంబంధిత ప్రతిపాదనలు, ప్రభుత్వపరంగా అందించాల్సిన సహాయ సహకారాల గురించి వివరించారు. 129 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని, సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్న అనుభవం తమకు ఉందని వివరించారు. డేటాలాస్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ సవాళ్లను అధిగమించడానికి భారతీయ వ్యాపారాలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, దర్యాప్తు సంస్థలకు సహకరిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ముందుకు రావడంపట్ల మంత్రి శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. కాగా ‘టిబెటన్ పార్లమెంట్ ఇన్ ఎక్సైల్’ప్రతినిధులు మంగళవారం శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. టిబెట్‌కు సార్వ¿ౌమాధికారాన్ని కల్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతినిధి బృందంలో మాంక్ గేశే అతుక్ సెతాన్, ఎంపీ సెరింగ్ యంఘ్చెన్, దొండప్ తాషి తదితరులు ఉన్నారు. బయో ఆసియా 2024లో ‘ఫ్రాండర్స్’భాగస్వామ్యం ఆసియాలోనే జీవ శాస్త్ర, ఆరోగ్య సాంకేతిక రంగాల వేదికగా పనిచేస్తున్న ‘బయో ఆసియా’21వ వార్షిక సదస్సుకు బెల్జియంలో లైఫ్‌సైన్సెస్, ఆరోగ్య రంగాలకు కేంద్రంగా ఉన్న ఫ్లాండర్స్ రీజియన్ భాగస్వామ్యం వహించనుంది. త్వరలో హైదరాబాద్ వేదికగా జరిగే ‘బయో ఆసియా–2024’లో ఫ్రాండర్స్ రీజియన్ భాగస్వామ్యంపై మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం కీలక ప్రకటన చేశారు. లైఫ్‌సైన్సెస్ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న తెలంగాణలో ఫార్మా, బయో టెక్నాలజీ, వైద్య పరిశోధన రంగాల వృద్ధికి అనువైన వాతావరణం ఉందని శ్రీధర్‌బాబు అన్నారు. శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలో ఘనమైన చరిత్ర కలిగిన ఫ్లాండర్స్ రీజియన్ బయో ఆసియాలో భాగస్వామ్యం వహించడం ఇరు ప్రాంతాల నడుమ పరిశోధన ఫలాల మార్పిడికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. భాగస్వామ్య పెట్టుబడులు, జాయింట్ వెంచర్లు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ప్రస్తుత భాగస్వామ్యం ద్వారా వాణిజ్యవేత్తలు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు ఒకే వేదికపైకి వచ్చి ఇరు ప్రాంతాల నడుమ భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారని ఫ్లాండర్స్ తరపున దక్షిణ భారతదేశంలో పెట్టుబడులు, వాణిజ్య వ్యవహారాల పర్యవేక్షకులు జయంత్ నాడిగర్ వెల్లడించారు. -
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పలు బహుళజాతి కంపెనీలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెట్టుబడుల సాధనలో భాగంగా సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ఆయన ఆదివారం జెడ్డాలోని పలు సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. సౌదీ యువరాజు ప్రత్యేక కార్యాలయ జనరల్ డైరెక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రాయెస్‌తో జరిగిన భేటీలో శ్రీధర్ బాబు తెలంగాణ విధానాలు, ఐటీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం తదితర అంశాలను వివరించారు. సౌదీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రసాయనాలు, ఇంధన రంగాలకు సంబంధించి అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థగా పేరుపొందిన ఆరాంకో సంస్థ ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా మద్దతిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆల్ షరీఫ్ గ్రూప్ హోల్డింగ్స్ సంస్థ సీఈవో ఆల్ షరీఫ్ నవాబ్ బిన్ ఫైజ్ బిన్ అబ్దుల్ హకీమ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రాజెక్ట్స్ ఇంజనీర్ సులైమన్ కేతో మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమై పెట్టుబడులపై చర్చించారు. ఈ సంస్థ విద్యుత్, ఆతిథ్య, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, ఆవిష్కరణ రంగంలో అగ్రగామిగా ఉంది. సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులతో సహా పలువురితో భేటీ ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులతో, జెడ్డా చాంబర్స్‌తో, ఆహార ఉత్ప త్తుల దిగ్గజ సంస్థ అయిన సవోలా గ్రూప్ సీఈవో వలీద్ ఫతానాతో, సౌదీ బ్రదర్స్ కమర్షియల్ కంపెనీ సీఈవో, బోర్డ్ సభ్యులతో పెట్రోమిన్ కార్పొరేషన్ ప్రతినిధులతో, బెట్టర్జీ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ మాజెన్ బెట్టర్జీతోనూ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అనువైన పరిస్థితులను వివరించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా, పుష్కలమైన నీటి లభ్యత, నాణ్యమైన మానవ వనరులు, మంచి మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ ఉన్నాయని మంత్రి వారికి వివరించారు. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి కనబర్చినట్టు మంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. -
త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ
సాక్షి, హైదరాబాద్: ప్రజలు కోరుకున్న మార్పును తీసుకురావడంలో భాగంగా అందరి సలహాలు, సూచనలతో త్వరలో కొత్త పారిశ్రామిక విధానం రూపొందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) తోడ్పాటును అందిస్తామని భరోసానిచ్చారు. వివిధ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఎఫ్‌టీసీసీఐ, ఫిక్కి, సీఏఏ, ఎఫ్టీఎస్ఏసీ, డిక్కి సంస్థల ప్రతినిధులతో బుధవారం శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. పారిశ్రామిక కారిడార్ విషయంలోనూ సలహాలు, సూచనలు స్వీకరించడంతో పాటు అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. చైనా కంటే ఉత్తమంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పారిశ్రామిక రంగానికి నూతన ఉత్తేజం కల్పించడంతోపాటు అర్బన్, రీజనల్, సెమీ అర్బన్ క్లస్టర్లుగా విభజించి పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. డ్రైపోర్ట్ విషయంలోనూ త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని, నల్లగొండ నుంచి పాత ముంబై హైవే ప్రాంతాలను అనుసంధానం చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి న హామీ మేరకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు పారిశ్రామిక రంగం అభివృద్ధితో లక్షలాది మంది ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా ‘ప్లాన్ 2050’అమలు చేస్తామన్నారు. ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించిన హైదరాబాద్‌ను అభివృద్ధి చెందిన దేశాలు కూడా గుర్తించేలా ‘ఫార్మా ఇండస్ట్రీ హబ్’గా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌లో తయారైన క్షిపణులు ఇజ్రాయెల్‌కు ఎగుమతి అవుతున్న వైనం రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి అద్దం పడుతోందన్నారు. అదానీ కంపెనీ వ్యవహారంలో కొంతమంది కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల పారిశ్రామిక వేత్తలకు అవకాశం రావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని, తమ నాయకుడు రాహుల్ గాంధీ అదానీని వ్యతిరేకించారు కానీ అభివృద్ధిని కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదానీ పెట్టుబడులు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధిపైనే తమ ఆలోచన ఉంటుందని శ్రీధర్‌బాబు అన్నారు. -
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటూ రాదు
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేదని పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తరువాత కారు పార్టీ కనుమరుగయ్యే అవ కాశం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ నాయకుల్లో అహంకారం తగ్గ లేదన్నారు. గురువారం గాంధీభవన్‌లో మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. 2018 ఎన్ని కల్లో గెలిచిన తరువాత 36 రోజుల వరకు కనీసం అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయని బీఆ ర్ఎస్కు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలరోజులు కూడా కాకముందే రెండు హామీలను అమలు చేయడమే కాక, ప్రజల నుంచి అభయహ స్తం అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న విష యం తెలియదా అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 3న ఫలితాలు వచ్చిన నాలుగు రోజుల్లోనే మంత్రివర్గం ఏర్పడటం, మంత్రివర్గం ఏర్పాటైన రెండురోజుల్లోనే శాసన సభ సమావేశాలు ప్రారంభించడమేకాక, మహిళ లకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితిని పెంచిన విషయాన్ని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఆరున్నర కోట్ల మంది మహిళలు బస్సులో ఉచిత ప్రయాణం చేశారన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తరువా త రెండునెలల వరకు మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయకపోవడం బాధ్యతారాహిత్యం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ విడుదల చేసిన బుక్లెట్పై మంత్రి మండిపడ్డారు. నెల కాకుండానే ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కడం దారుణమన్నారు. తొందరపాటు ఎందుకు.. ముందు పార్టీని చక్కదిద్దుకోండి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్కు ఎందుకంత తొందరపాటు అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నామన్నారు. మీరేమై నా సూచనలు చేస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మీ పార్టీ కార్యా లయంలో మీడియా సమావేశాలు పెట్టడం కాదు క్షేత్రస్థాయికి వెళ్లి చూడండని హితవు పలికారు.. విభజన హామీలపై ఏమాత్రం పోరాటం చేయని బీఆర్ఎస్ 420నో కాదో ప్రజలకు తెలుసు నని అన్నారు. అధికారం పోయిందనే అక్క సుతో ఆరోపణలు చేయడం సరికాదని, ముందు పార్టీని చక్కదిద్దుకో వాలని సూచించారు. కొంతమంది ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని శ్రీధర్‌బాబు విమర్శించారు. -
బీఆర్ఎస్ తన పరువు తానే తీసుకుంది: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: తమ మేనిఫెస్టోపై విష ప్రచారం చేస్తున్నారని.. బీఆర్ఎస్ వేసిన ‘420 పుస్తకాన్ని ఖండిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 420 పుస్తకం వేసి బీఆర్ఎస్ తన పరువు తానే తీసుకుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరన్నారు. ‘‘ఆర్థిక క్రమశిక్షణతో మా ప్రభుత్వం ప్రజలకు అవసరయ్యే నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవం ఇవ్వరా?. బీఆర్ఎస్ నాయకులు మహిళలకు ఉచిత బస్సు వద్దని చెప్పదలచుకున్నారా?. ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే 2 పథకాలు అమలు చేశాం. 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తర్వాత గానీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయలేదు. 2018లో ప్రజలిచ్చిన తీర్పును బాధ్యత లేకుండా అలుసుగా తీసుకున్నారు. నవ్విపోదురు గాక నాకేమీ సిగ్గు అనేలాగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు’’ అంటూ మంత్రి మండిపడ్డారు. పది సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలపై వేలాది మంది ప్రజావాణికి వస్తున్నారు. కనీసం సంవత్సరం తర్వాత మా పాలనపై విమర్శిస్తే బాగుండేది. 2014, 2018లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుంది’’ అంటూ మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. గడిల పాలన కాదు.. గల్లీ బిడ్డల పాలన: సీతక్క అధికారం పోయిందనే అక్కసుతో బీఆర్ఎస్ దుర్మార్గానికి ఒడి గట్టిందని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. గడిల పాలన కాదు గల్లీ బిడ్డల పాలన కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులు, కుటుంబ పాలన పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ హితవు పలికారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అన్నట్లు వ్యవహరించి పాలన చేశారు. అధికారం లేకుండా బతకలేని పార్టీగా తయారయ్యారు. ప్రజా స్పందన చూసి ఓర్వలేక పోతున్నారు. పదేళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కానీ ముప్పై రోజులు కాక ముందే విమర్శలు చేస్తున్నారు’’ అంటూ సీతక్క మండిపడ్డారు. -
నుమాయిష్ 2024 ప్రారంభం.. మాస్క్ కంపల్సరీ!
హైదరాబాద్, సాక్షి: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు(నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు కూడా) పాల్గొన్నారు. ఈసారి కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ 2024 జరగనుంది. నుమాయిష్ కోసం ఈసారి 2,400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. నుమాయిష్‌కు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. మాస్కులు కచ్చితంగా ధరించి రావాలంటూ సందర్శకులను కోరుతున్నారు నిర్వాహకులు. ఈసారి నుమాయిష్ నేపథ్యంలో నగరంలో 45 రోజుల పాటు ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. మరోవైపు సర్వీసులను ఎక్కువ సమయం నడిపేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది. ఇక మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణాల నేపథ్యంలోనూ నాంపల్లి రూట్లో బస్సులకు ప్రయాణికుల తాకిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. నుమాయిష్‌కు టికెట్ ధరలు గతంలో మాదిరే ఉండనున్నాయి. గతేడాది 10 రూపాయలు పెంచి నుమాయిష్ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. ఇప్పుడు కూడా టికెట్ ధర రూ.40 లుగా కొనసాగించనున్నారు. నుమాయిష్ సాధారణ రోజులలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు కొనసాగుతోంది. వీకెండ్స్,సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఈ సంవత్సరం నుమాయిష్ సందర్శన వేళలను నిర్వాహకులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నుమాయిష్ ను సందర్శించేందుకు మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా ఒక్కో రోజు కేటాయించనున్నారు. జనవరి 9న 'లేడీస్ డే' పేరుతో మహిళలను, 31న 'చిల్డ్రన్ స్పెషల్' పేరుతో పిల్లలను నుమాయిష్ ను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వహకులు తెలిపారు. నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రతీ ఏడాది సుమారు రెండు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతోపాటు సుమారు 30 వేల మంది విద్యార్థులకు విద్యావకాశం కల్పిస్తోంది నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ. -
మంత్రుల మేడిగడ్డ బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల యాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా గత బీఆర్ఎస్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ నెల 29న సందర్శించి అక్కడికక్కడే సమీక్ష జరపనున్నారు. మొదటి నుంచి ‘కాళేశ్వరం’ను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు పనులను మధ్యలోనే నిలుపుదల చేసి దాని బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. దీనిని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారంలోకి వస్తే ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు పనులను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నేపథ్యంలో మంత్రుల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ, ప్రాణహిత మీద తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంపై తమ ప్రభుత్వ వైఖరిని మంత్రులు ప్రకటించే అవకాశం ఉంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్... ఈ నెల 29న ఉదయం 9 గంటలకు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మేడిగడ్డ బ్యారేజీ వద్దకి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి తీసుకెళ్లనున్న మీడియా ప్రతినిధుల బృందం సమక్షంలో మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించనున్నారు. ప్రాణహిత–చేవెళ్ల,, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో జరిగిన లాభ, నష్టాలు, ప్రాజెక్టు వ్యయం, ప్రతిపాదిత ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు, ప్రాజెక్టు నిర్వహణ వ్యయం, విద్యుత్ అవసరాలు, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో చోటుచేసుకున్న సాంకేతిక లోపాలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదలను ప్రభుత్వం వాయిదా వేసుకున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ రూపొందించిన నివేదికపై కూడా మీడియా సమక్షంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి. అనంతరం అక్కడే మంత్రులిద్దరూ సమీక్ష జరపనున్నారు. కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లూ రావాలని ఆదేశం ప్రజెంటేషన్ తర్వాత మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను మంత్రులిద్దరూ సందర్శించి లోపాలు, సమస్యలను పరిశీలిస్తారు. గత అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, ఆ తర్వాత కొన్ని రోజులకే అన్నారం బ్యారేజీకి బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీకయ్యాయి. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ పునర్నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ మధ్య పేచీ నడుస్తోంది. సొంతంగా పునర్నిర్మాణం జరుపుతామని గత ప్రభుత్వ హయాంలో హామీ ఇచ్చిన ఎల్ అండ్ టీ సంస్థ, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాటను మార్చింది. ప్రాజెక్టు డిఫెక్ట్ లయబిలిటీ గడువు ముగిసిందని, అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే 7వ బ్లాక్ పునర్నిర్మాణం చేపడతామని స్పష్టం చేసింది. నిర్మాణ సంస్థలతో పాటు సబ్ కాంట్రాక్టర్లు, ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న వారందరూ తమ పర్యటన సందర్భంగా క్షేత్ర స్థాయలో ఉండి అడిగిన సమాచారం ఇవ్వాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అందరికీ సమాచారం పంపించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్‌కు స్పష్టం చేశారు. -
‘సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తాం’
సాక్షి, పెద్దపల్లి: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసీ) కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సోమవారం సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సింగరేణి ఆర్జీ 3 పరిధిలోని ఏఎల్పీ, ఓసీపీ 1, ఓసీపీ 2 బొగ్గుగనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరుపున మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మట్లాడారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని తెలపారు. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామన్నారు. డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిస్కారానికి హైపవర్ కమిటీ నియమిస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు. -
కాళేశ్వరంపై కాంగ్రెస్ ఫోకస్.. మేడిగడ్డ పరిశీలనకు మంత్రులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ను టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 29వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో నెల 29వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ సందర్శించనున్నారు. 29వ తేదీన మంత్రులు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకుంటారు. అనంతరం, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ప్రాణిహిత, కాళేశ్వరం ప్రాజెక్ట్ వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల జరిగిన లాభ, నష్టాలను వివరించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మంత్రులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం.. కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలను వెల్లడించనున్నారు. ప్రాజెక్ట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్‌పై ప్రభుత్వం స్పష్టతనివ్వనుంది. అలాగే, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌ల సమస్యలు, వాటి పరిష్కారాలు, తదితర అంశాలపై ప్రభుత్వం సమీక్ష చేయనుంది. ఈ పర్యటనకు సంబంధించి నిర్మాణ సంస్థలకు సబ్ కాంట్రాక్టర్లలకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికి సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోగలరని మంత్రులు ఈఎన్సీని ఆదేశించారు. ఇది కూడా చదవండి: రూ. 500 గ్యాస్ సిలిండర్.. ఈ కేవైసీ అవసరం లేదు..! -
జవాబు చెప్పలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెల్లమొహం వేశారు
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాలనలో అప్పులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జవాబు చెప్పలేక తెల్లమొహం వేశారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. రేషన్‌బియ్యం పంపిణీ మొదలుకొని రైతులకు మద్దతు ధర, విద్యావ్యవస్థ వంటి వాటిపై సభలో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలే పరిస్థితి ఏర్పడిందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ, ఎస్సీ, ఎస్టీలకు నిధుల కేటాయింపుపై సమాధానం చెప్పలేకపోయారన్నారు. గురువారం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో తాము రాష్ట్ర ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచామని తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలన ఎలా సాగిందో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు నిజమే అని తమ హయాంలో అప్పులు చేశామని, తాము ప్రభుత్వపరంగా చేసిన వ్యయం వల్ల ప్రయోజనాలు కలగలేదని వారు ఒప్పుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ పాలన కారణంగా రాష్ట్రంలోని ప్రతి యువకుడిపై రూ.7లక్షల అప్పు మోపారన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడుగులు వేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు పదవులు అనుభవించారని మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో విద్యుత్‌రంగంలో చర్యలు చేపట్టకపోతే ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 12 గంటల కరెంట్ ఇవ్వగలిగేది కాదన్నారు. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాల్లో లెక్కలు, తప్పులు అనేది అవాస్తవం...తేదీలు వెయ్యలేదు కాబట్టి కన్ఫ్యూజన్ ఏర్పడిందని ఆయన వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో పెట్టిన ప్రతి లెక్క వాస్తవం కావాలంటే స్పీకర్ ఆదేశంతో ప్రతీ సభ్యుడికి ఆ వివరాలు అందజేస్తామన్నారు. శ్వేతపత్రం లెక్కలు ఎవ్వరినీ కించపరచడానికి కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, వ్యవసాయం, పరిశ్రమలు, డొమెస్టిక్ వినియోగదారులకు పూర్తి స్థాయిలో కరెంట్ ఇస్తామన్నారు. అప్పడు టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన 36 రోజులకు అసెంబ్లీ సమావేశాలు పెట్టి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారని గుర్తుచేశారు. తాము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే అసెంబ్లీని సమావేశపరిచామన్నారు. -
శ్వేతపత్రంపై వాడీవేడీ చర్చ
-
వైట్ - ఫైట్
-
ఆదాయం పెంచామంటూ బీఆర్ఎస్ నేతల కౌంటర్
-
సెటైర్లు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల పర్వం మొదలైంది. అభ్యంతరాలు, వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, వ్యంగ్య వ్యాఖ్యలతో రోజంతా సభ ఆసక్తికరంగా సాగింది. సభలో ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తామంటూనే అధికార పక్షం బీఆర్ఎస్పై దాడికి దిగింది. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ పక్షాన సీనియర్ సభ్యులు కేటీఆర్, హరీశ్ ఇద్దరూ దూకుడుగా కాంగ్రెస్ సర్కారుపై ఎదురుదాడి చేశారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను కట్టడి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రయతి్నంచారు. కుటుంబ పాలన, వరి పంటకు మద్దతు ధర, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, 50ఏళ్ల కాంగ్రెస్ పాలన అవస్థలు, ఆ పార్టీ సీఎంలను ఎంపిక చేసిన తీరు తదితర అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు పరస్పరం వ్యంగ్య విమర్శలు, వాదోపవాదాలకు దిగారు. మొదట సీఎం దాడి.. సీఎం రేవంత్ తన ప్రసంగం ప్రారంభంలోనే బీఆర్ఎస్పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చినా బీఆర్ఎస్లో మార్పు రాలేదంటూ మండిపడ్డారు. ఇక ‘మేనేజ్మెంట్ కోటా’పేరిట జరిగిన చర్చ ఆసక్తికరంగా సాగింది. ‘‘మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వారు కేబినెట్ నిర్ణయాలు, చట్టబద్ధత కల్పించడంపై తేడాను గమనించాలి’’అని రేవంత్ వ్యాఖ్యానించగా.. కేటీఆర్ ప్రతిస్పందిస్తూ..‘‘ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ అధ్యక్ష పదవి, సీఎం పదవి తెచ్చుకున్న వ్యక్తి మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు’’అని ఎద్దేవా చేశారు. దీంతో.. ‘‘గవర్నర్ ప్రసంగం చూసి సిగ్గుపడుతున్నానని కేటీఆర్ అన్నారు. నిజంగా గత పదేళ్ల పాలనపై ఆయన సిగ్గుపడాల్సిందే..’’అని రేవంత్ సెటైర్ వేయగా.. ‘పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా’నని కేటీఆర్ విమర్శించారు. దీనికి ప్రతిగా ‘మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి.. ప్రజల నుంచి వచ్చి సీఎం కుర్చిలో కూర్చున్న వారిపై కుళ్లుకుంటున్నారు’అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చీకట్లు, రైతుల ఆత్మహత్యలేనని బీఆర్ఎస్ సభ్యులు విమర్శించగా.. గత పాలనలో అన్యాయం జరిగిందనే అందరం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఇప్పుడు గత పదేళ్ల పాలన గురించి మాట్లాడుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హరీశ్‌రావుకు మైక్ నిరాకరణపై నిరసన ధన్యవాద తీర్మానంపై సీఎం ఇచ్చిన సమాధానానికి బీఆర్ఎస్ పక్షాన హరీశ్‌రావు వివరణ కోరడం కూడా అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న కేటీఆర్‌కే వివరణ కోరే అవకాశం ఇస్తామని స్పీకర్ పలుమార్లు ప్రకటించారు. అయి నా చివరికి హరీశ్‌రావుకు మైక్ ఇచ్చారు. ‘‘సీఎం పలు అంశాలపై హుందాతనం లేకుండా విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినట్లుగా ఇప్పుడు సీఎం అయినా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డ పీవీ చనిపోతే చూసేందుకు కాంగ్రెస్ నేతలెవరూ రాలేదు’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి కల్పించుకుంటూ.. బీఆర్ఎస్ వాల్లు పదేళ్ల నుంచీ అదే చెప్తున్నారని, ఇంకెన్నాళ్లు చాచా నెహ్రూ, పీవీ నర్సింహారావుల గురించి మాట్లాడుతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో ధన్యవాద తీర్మానం తీర్మానాన్ని ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటిస్తూ, శాసనసభను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు తమకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వలేదని నినాదాలు చేస్తూ సభ నుంచి బయటికి వచ్చారు. -
ఉద్యోగాలు.. ఇళ్లు.. భూ వివాదాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజాదర్బార్ (ప్రజావాణి)లో ప్రధానంగా చాలామంది తమకు ఉద్యోగాలు ఇవ్వాలని, భూ సమస్యలు పరిష్కరించాలని, ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. సోమవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విజ్ఞాపన పత్రాలతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని భరోసానిచ్చారు. దరఖాస్తుదారులు తమ విజ్ఞాపనపత్రంలో సమస్యతోపాటు అడ్రస్, ఫోన్ నంబర్‌ను రాయాలని సూచించారు. తద్వారా దరఖాస్తుదారుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. జెన్కో పరీక్ష వాయిదాపై సీఎంతో మాట్లాడతాః మంత్రి శ్రీధర్‌బాబు ఈ నెల 17న నిర్వహించనున్న జెన్కో ఏఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అదే రోజు రెండు, మూడు పరీక్షలు ఉన్నట్లు అభ్యర్థులు వివరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు మంత్రి తెలిపారు. సంబంధిత అధికారులతో చర్చించి పరీక్ష వాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. తమకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రతి నెలా రెగ్యులర్ గా ఇవ్వాలని మధ్యాహ్న భోజన వంట కారి్మకులు విజ్ఞాపన పత్రం అందజేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, ఆయుష్ విభాగం డైరెక్టర్ హరిచందన, సీనియర్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రి పాల్గొన్నారు. ఇప్పటివరకు 4,471 వినతులు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో ప్రారంభించిన ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలను సమర్పించేందుకు ప్రజా భవన్ కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి సోమవారం వరకు మొత్తం 4,471 వినతి పత్రాలు అందాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పింఛన్లకు సంబంధించిన వినతి పత్రాలే ఎక్కువగా ఉన్నాయి. సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో 1,143 వినతి పత్రాలు అందినట్లు ప్రజా భవన్ అధికార వర్గాలు తెలిపాయి. -
మంత్రి పదవిపై శ్రీధర్ బాబు ఫస్ట్ రియాక్షన్
-
గెలిచిన 64 మందిలో ఎవరైనా సీఎం కావొచ్చు : శ్రీధర్ బాబు
-
ప్రచారంలో ప్రత్యర్థి కంటే ఎక్కువ జోరు చూపిస్తున్న శ్రీధర్ బాబు
-
బీఆర్ఎస్ ఓటమి భయంతోనే దాడులకు దిగుతోంది: శ్రీధర్‌బాబు
-
కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు
ధర్మపురి/పెగడపల్లి/కాటారం: కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రజలను కోరారు. ‘తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎట్లుండే.. ఇప్పుడెట్ల ఉన్నదో’గమనించాలని సూచించా రు. ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా ఆదివారం ఆమె ధర్మపురి, పెగడపల్లి మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మూడు గంటల కరెంటు చాలని, ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, అదే జరిగితే రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. తాము మరోసారి అధికారంలోకొస్తే అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం ఇస్తామన్నారు. ప్రస్తుత పథకాలు కొనసాగాలన్నా.. మరిన్ని పథకాలు రావాలన్నా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. అనంతరం ఆమె ధర్మపురి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. తర్వాత స్థానిక బ్రాహ్మణ సంఘం భవనంలో మహిళలతో మాట్లాడారు. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకు మద్దతుగా ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో కవిత మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో లేదని సాకులు చెబుతూ ఏ పనీ చేయ ని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు ఓటు వేయడం వృథా అన్నారు. మంథని అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని ఇటీవల సీఎం ప్రకటించారని, మంథనిని కేసీఆర్ దత్తత తీసుకుంటారేమో అనిపిస్తోందన్నారు. -
వెయ్యికోట్లు ఇస్తానని చెప్పడం హస్యాస్పదం: శ్రీధర్ బాబు
-
కాంగ్రెస్‌కు కలిసొచ్చేవిధంగా శ్రీధర్‌బాబు స్కెచ్!
-
సీపీఎస్ రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమలవుతున్న కంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుంది. దాని స్థానంలో పాత పింఛన్ విధానాన్ని (ఓపీఎస్)ను పునరుద్ధరిస్తామని చెప్పనుంది. ఈ మేరకు తన ఎన్నికల ప్రణాళికలో చేర్చనుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఇవ్వాల్సిన హామీలతో కూడిన పార్టీ మేనిఫెస్టో కోసం మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ దాదాపు గత నెలరోజులుగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన కమిటీ మొత్తం 36 అంశాలతో మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దినట్టు తెలుస్తోంది. తాజాగా బుధవారం రాత్రి కూడా గాంధీభవన్‌లో కమిటీ సమావేశమైంది. ఒకట్రెండు అంశాలపై స్పష్టత రాకపోవడంతో పార్టీ పెద్దలను సంప్రదించిన తర్వాత ఆ అంశాలను పొందుపరిచి నాలుగైదు రోజుల్లోపు మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కొత్త స్కీములు..కౌంటర్ పథకాలు విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రతి ఏటా ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తామని, ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ కేలండర్‌ను విడుదల చేయడంతో పాటు ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాన్ని 25 శాతం పెంచుతామనే హామీని కూడా మేనిఫెస్టోలో పొందు పరుస్తున్నారు. బాలింతలకు ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న కేసీఆర్ కిట్‌కు కౌంటర్‌గా మరో పథకాన్ని ప్రకటిస్తారని, కిట్‌లోని వస్తువులతో పాటు ఆర్థిక సాయం పెంచుతారని సమాచారం. అదే విధంగా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రతి ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం పథకాన్ని కూడా ప్రకటించనున్నారు. చదువుకుంటున్న విద్యార్థినులందరికీ స్కూటీలు ఇస్తామని గతంలో ప్రకటించినప్పటికీ, తాజాగా వాటి స్థానంలో ల్యాప్‌టాప్‌లిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందరి సంక్షేమమే లక్ష్యం..! కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రజా మేనిఫెస్టో పేరుతో విడుదల చేయనున్నారు. ఇందులో తెలంగాణ ఉద్యమ, అమరవీరుల సంక్షేమ, వ్యవసాయం–రైతు సంక్షేమం, నీటి పారుదల, యువత–ఉపాధి కల్పన, విద్య, వైద్య రంగాలు, గృహ నిర్మాణం, భూపరిపాలన, పౌరసరఫరాలు, ని త్యావసరాల పంపిణీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం, విద్యుత్ రంగం, టీఎస్ఆర్టీసీ సంక్షేమం, మద్య విధానం, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, సింగరేణి కార్మికులు, కార్మికులు, న్యాయవాదులు, సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు, గల్ఫ్ ఎన్నారైలు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం, క్రీడారంగం, పోలీస్–శాంతి భద్రతల వ్యవస్థ, పర్యాటక రంగం, జానపద, సినిమా–సాంస్కృతిక రంగం, ధార్మిక రంగం, పర్యావరణం, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి తదితర అంశాలతో కూడిన మేనిఫెస్టోకు కాంగ్రెస్ నేతలు రూపకల్పన చేస్తుండడం గమనార్హం. -
రీడిజైన్ తప్పిదంతోనే ప్రమాదం
కాళేశ్వరం/ మంథని: కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ లోపంతోనే ప్రమాదం ఏర్పడిందని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి వద్ద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రివర్స్ పంపింగ్ అనేది ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదన్నారు. గతేడాది బాహుబలి మోటార్లు మునిగాయని, గ్రావిటీకాల్వ కూలిందని, ఇప్పుడు బ్యారేజీ పిల్లర్లు కుంగుతున్నాయని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ విజయభేరి యాత్రకువస్తే కాళేశ్వరానికి వెళ్లి అభివృద్ధి చూడాలన్నారని.. ఇప్పుడు మునిగిన మోటార్లు, కుంగిన బ్యారేజీని చూడాలా అని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కాగా, అంతకుముందు ఆయన మంథనిలో విలేకరులతో మాట్లాడుతూ, నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టి ప్రజల సొమ్మను నీటిపాలు చేశారని కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. శ్వేతపత్రం విడుదల చేయాలి: ఈటల కాళేశ్వరం: ఇంజనీరింగ్ వైఫల్యంతోనే బ్యారేజీలు దెబ్బతింటున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన మహదేవపూర్ మండలం అంబట్పల్లి వద్ద మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి అనంతరం మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంతో వర్షాకాలంలో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రస్తుతం 15వ పిల్లర్ల నుంచి 22వ పిల్లర్ల వరకు కుంగినట్లు తెలుస్తోందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. -
నెలాఖరుకు కాంగ్రెస్ మేనిఫెస్టో!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుంది. పూర్తిస్థాయి రూప కల్పనకు మరో వారానికిపైగానే పడుతుందని, ఈ నెలాఖరు లేదంటే, నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మేనిఫెస్టో విడుదలవుతుందని తెలుస్తోంది. నెలరోజులుగా వరుసగా టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ భేటీ అవుతూ ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలను ఓ కొలిక్కి తెస్తోంది. ఈ క్రమంలో శనివారం కూడా గాంధీభవన్‌లో కమిటీ చైర్మన్, మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది.సమావేశంలో కమిటీ సభ్యులు సంభాని చంద్రశేఖర్, చందా లింగయ్య, హర్షవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా యువతకు ఉద్యోగాల కల్పనపైనే నేతలు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించి పెద్దసంఖ్యలో టీచర్ పోస్టులు భర్తీ చేసే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చాలని నిర్ణయించారు. భారీసంఖ్యలో ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తా మని, తెలంగాణ యువతకు అండగా నిలుస్తామని హామీ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు, వివిధ స్థాయిల్లోని ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లు, ఆర్టీసీ ఉద్యోగుల కోసం పథకాలు రూపొందించాలని కూడా చర్చించారు. ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించిన పలు అంశాలపై ఈ మేనిఫెస్టోలో స్పష్టతనిచ్చే కోణంలో కూడా కమిటీ కసరత్తు జరిపింది. -
ఆరు గ్యారంటీలు.. నూరు సీట్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల కోసం లండన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదాన్ని అందుకుంది. ‘‘ఆరు గ్యారంటీలు–నూరు సీట్లు’ పేరు తో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. టీపీసీసీ ఎన్నారై సెల్ (యూకే) ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని లండన్‌లో చేప ట్టారు. దీనిని గాంధీభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఆరు గ్యారంటీ పథకాలు, నూరు గ్యారంటీ సీట్లు లక్ష్యంగా తెలంగాణ ప్రజల్లోకి వెళ్లాలని.. విదేశాల్లో ఉన్న వారి బంధువులు, సన్నిహి తులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసే లా తోడ్పడాలని ఆయన మార్గ నిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని యువత, మహి ళలు, రైతులకు ప్రాధాన్యం ఉండేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు, ఎన్నారై సెల్ ఏర్పాటు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాన్ని పరిశీ లిస్తామని తెలిపారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన కార్య క్రమంలో ఎన్నారై సెల్ నేతలు రంగుల సుధా కర్ గౌడ్, బిక్కుమండ్ల రాజేశ్, మంగళారపు శ్రీధర్, గంగసాని ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల్లో స్పందన బాగుంది..ఈ సారి కాంగ్రెస్ దే విజయం
-
ఆయన తూర్పు.. ఈయన పడమర..! సెంటిమెంట్ కలిసొచ్చేదెవరికో..?
సాక్షి, పెద్దపల్లి: వారిద్దరూ రాజకీయాల్లో తూర్పుపడమరలు. ఒకరు కాంగ్రెస్ పార్టీ నేత అయితే.. మరొకరు బీఆర్ఎస్ నాయకుడు. కానీ వారిద్దరికీ సెంటిమెంట్ ముత్తారం కేంద్రంగా ఎన్నికల ప్రచారం షురూ చేయడం. వారే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు. ఇటీవల బీఆర్ఎస్ టికెట్ ఖరారు కావడంతో పుట్ట మధు ముత్తారం కేంద్రంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. తూర్పువైపు ఉన్న మండలాల్లో తన పాదయాత్ర కొనసాగించి నియోజకవర్గం చుట్టివచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సైతం ముత్తారం కేంద్రంగా భారీసభ నిర్వహించి పడమర దిశగా తన ప్రచారం మొదలు పెట్టారు. ఈ ఇద్దరు నేతలు ముత్తారం సెంటిమెంట్‌గా ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే ప్రారంభించినా.. ఎవరికి కలిసివస్తుందోనని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. -
స్వేచ్ఛాయుత ఎన్నికలకు వీలేది? ఈసీని నిలదీసిన విపక్షాలు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: రాష్ట్రంలో గతేడాది జరిగిన ఒక్క ఉపఎన్నికనే (మునుగోడు అసెంబ్లీ సీటుకు) సవ్యంగా నిర్వహించలేకపోయిన అధికార యంత్రాంగం.. శాసనసభ సాధారణ ఎన్నికలను ఏ మేరకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించగలుగుతుందని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సహా సీపీఎం, బీఎస్పీ, ఆప్, టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశాయి. మునుగోడు ఉపఎన్నికలో రూ. వందల కోట్లను అధికార బీఆర్ఎస్ బహిరంగంగా పంచిపెట్టి ఓటర్లను ప్రలోభపెట్టినా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయిందని ఆరోపించాయి. ఏకంగా పోలీసు వాహనాలు, అంబులెన్సుల్లో అధికార బీఆర్ఎస్ డబ్బు సరఫరా చేసిందని దుయ్యబట్టాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టింది. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ తీవ్రంగా ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల బృందం హామీ ఇచ్చిందని విపక్షాలు తెలిపాయి. సీఈసీతో సమావేశం అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న బి.వినోద్ కుమార్. చిత్రంలో భరత్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర బలగాలను దింపాలి: బీజేపీ మునుగోడు ఉపఎన్నికతోపాటు గత శాసనసభ ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ జాతీయ నేత ఓమ్ పాఠక్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, ఆంథోనీరెడ్డి ఈసీ బృందాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల సీనియర్ అధికారులను భారీ స్థాయిలో ఎన్నికల పరిశీలకులుగా పంపాలని కోరారు. బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు పనులు చేయా లని అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో తీవ్ర లోపాలున్నాయని, వాటన్నింటినీ సరిచేసి పకడ్బందీగా తుది జాబితాను ప్రకటించాలని కోరారు. మద్యం షాపులు మూసేయిస్తే... మద్యం పంపిణీని నియంత్రించడానికి ఎన్నికల సమయంలో వైన్ షాపులను మూసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ప్రధానపోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి. శ్రీధర్‌బాబు, ఫిరోజ్‌ఖాన్, జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన అధికారుల బదిలీలను మళ్లీ జరపాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ కోసం వచ్చిన వేలసంఖ్యలోని దరఖాస్తులను ఇంకా పరిష్కరించలేదని, ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రచురణ గడువును అక్టోబర్ 4 నుంచి మరో తేదీకి పొడిగించాలన్నారు. ప్రజల మధ్య విభజనకు మతఛాందసవాదుల కుట్ర: బీఆర్ఎస్ ఎన్నికల వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలో ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి మతఛాందసవాదులు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక శాంతిభద్రతల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్లనున్న నేపథ్యంలో మతఛాందసవాదులను నియంత్రించాలని సీఈసీని కోరింది. పార్టీ నేతలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ ఈసీ బృందానికి కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలి ఉన్న రోడ్డురోలర్ గుర్తును ఓ పార్టీకి కేటా యించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరారు. కాగా, ఈ భేటీలో టీడీపీ నేతలు శ్రీపతి సతీష్‌కుమార్, కాసాని సతీష్, రాఘవేంద్ర ప్రతాప్, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డీజీ నరసింహారావు, జ్యోతి, బీఎస్పీ నేతలు విజయార్య క్షత్రియ, రాజరత్నం, సురే‹Ùకుమార్, ఆప్ నేతలు దిడ్డి సుధాకర్, రాములు గౌడ్, హేమ ఈసీ బృందానికి తమ సూచనలు తెలియజేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఈసీ బృందానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, పోలీసు అధికారులు స్వాగతం పలికారు. -
ఉచిత విద్యుత్ కాంగ్రెస్ హయాంలోనే అమలు: శ్రీధర్ బాబు
-
రెండో రోజు టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో ఓటర్లకు ఇచ్చే హామీల కూర్పుపై టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ వరుసగా రెండోరోజు సమావేశమైంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో జరిగిన ఈ సమావేశానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులు హాజరై మేనిఫెస్టోలో పొందుపర్చా ల్సిన అంశాలపై చర్చించారు. కాగా, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలోని సోషల్ డెమొక్రటిక్ ఫోరం ప్రతినిధులు గాంధీభవన్‌కు వచ్చి మేనిఫెస్టో కమిటీతో చర్చించారు. తెలంగాణలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధి, అవినీతి నిర్మూలన, రాష్ట్రంలో చేపట్టాల్సిన కులగణన వంటి అంశాలపై కమిటీకి పలు సూచనలందించారు. దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్ గడ్డం ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు చార్జిషీట్ కమిటీ సమావేశం టీపీసీసీ చార్జిషీట్ కమిటీ భేటీ గురువారం గాంధీభవన్‌లో కమిటీ చైర్మన్ సంపత్‌కుమార్ అధ్యక్షతన జరగనుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు జెట్టి కుసుమకుమార్ అధ్యక్షతన టీపీసీసీ కమ్యూనికేషన్స్ కమిటీ సమావేశం జరగనున్నట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. -
శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీ
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేసింది. పార్టీ మేనిఫెస్టోను తయారు చేసే బాధ్యతను మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు అప్పగించింది. శ్రీధర్‌బాబు చైర్మన్‌గా మరో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ వైస్‌చైర్మన్‌గా 24 మంది సభ్యులతో తెలంగాణ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మేనిఫెస్టో కమిటీ సహా 107 మందితో మొత్తం 8 కమిటీలను ఏఐసీసీ నియమించింది. ఎన్నికల నిర్వహణ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు, పబ్లిసిటీ, చార్జిషీట్, కమ్యూనికేషన్స్, ట్రైనింగ్, స్ట్రాటజీ కమిటీలను ఏర్పాటు చేసింది. అన్ని వర్గాల నేతలకు ఈ కమిటీల్లో స్థానం కల్పించింది. మేనిఫెస్టో కమిటీతోపాటు చార్జిషీట్ కమిటీకి ఎక్స్అఫీషియో సభ్యులను కూడా నియమించింది. టీపీసీసీ కమిటీల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు శిక్షణ కమిటీ బాధ్యతను అప్పగించింది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ విడుదల చేసిన టీపీసీసీ కమిటీలు... 1. ఎన్నికల నిర్వహణ కమిటీ: దామోదర రాజనర్సింహ (చైర్మన్), వంశీచందర్‌రెడ్డి, ఈర్ల కొమురయ్య, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నమిండ్ల శ్రీనివాస్, జగన్‌లాల్ నాయక్, సుప్రభాత్రావు, భరత్‌చౌహాన్, ఫక్రుద్దీన్. 2. మేనిఫెస్టో కమిటీ: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (చైర్మన్), గడ్డం ప్రసాద్ (వైస్ చైర్మన్), దామోదర, పొన్నాల, బలరాం నాయక్, ఆర్. దామోదర్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంభాని చంద్రశేఖర్, పోట్ల నాగేశ్వరరావు, ఎం. రమేశ్‌ముదిరాజ్, ఒబేదుల్లా కొత్వాల్, తాహెర్బీన్హందాన్, ఎర్ర శేఖర్, జి. నాగయ్య, గండ్రత్ సుజాత్, రవళిరెడ్డి, కత్తి వెంకటస్వామి, మర్రి ఆదిత్యరెడ్డి, ప్రొఫెసర్ జానయ్య, దీపక్‌జాన్, మేడిపల్లి సత్యం, చందా లింగయ్య, మువ్వా విజయ్‌బాబు, చామల శ్రీనివాస్. (ఈ కమిటీకి ఎక్స్అఫీషియో సభ్యులుగా పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, అనుబంధ సంఘాల చైర్మన్లను నియమించారు.) 3. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ: బలరాం నాయక్ (చైర్మన్), ఎన్. పద్మావతిరెడ్డి, నేరెళ్ల శారద, రాపోలు జయప్రకాశ్, వేంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్‌యాదవ్, పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, కె. కృష్ణారెడ్డి, కె. తిరుపతి, సయ్యద్ నిజాముద్దీన్. 4. పబ్లిసిటీ కమిటీ: షబ్బీర్ అలీ (చైర్మన్), ఈరవత్రి అనిల్ (వైస్‌చైర్మన్), గడ్డం వినోద్, సురేశ్ షేట్కార్, గాలి అనిల్‌కుమార్, కుమార్‌రావు, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, గడుగు గంగాధర్, మన్నె సతీశ్, నాయుడు సత్యనారాయణ గౌడ్, వచన్‌కుమార్, మధుసూదన్‌గుప్తా. 5. చార్జిషీట్ కమిటీ: సంపత్‌కుమార్ (చైర్మన్), రాములు నాయక్ (వైస్ చైర్మన్), సిరిసిల్ల రాజయ్య, కోదండరెడ్డి, గంగారాం, బెల్లయ్య నాయక్, జ్యోత్స్న రెడ్డి, ఉజ్మా షాకీర్, నాగరిగారి ప్రీతం, నూతి శ్రీకాంత్ గౌడ్, షేక్ సోహైల్, మెట్టు సాయికుమార్, అన్వేశ్‌రెడ్డి, సిరాజ్ అమీన్ ఖాన్. ( ఈ కమిటీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా పార్టీ అధికార ప్రతినిధులను నియమించారు.) 6. కమ్యూనికేషన్స్ కమిటీ: జెట్టి కుసుమకుమార్ (చైర్మన్), మదన్మోహన్రావు (వైస్‌చైర్మన్), ఎం.ఎ.ఫహీమ్, అనిరుద్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, జైపాల్ వడ్డెర, అవెజొద్దీన్, గాలి బాలాజీ, కొప్పుల ప్రవీణ్. 7. ట్రైనింగ్ కమిటీ: పొన్నం ప్రభాకర్ (చైర్మన్), పవన్ మల్లాది (కన్వినర్), గోపిశెట్టి నిరంజన్, సయ్యద్ అజ్మతుల్లా, కోట నీలిమ, పూజల హరికృష్ణ, డాక్టర్. రవిబాబు, ఎం. లింగాజి, కోల్కొండ సంతోశ్, శ్రవణ్‌రావు, ఊట్ల వరప్రసాద్, వెంకటరమణ, మమతానాగిరెడ్డి, సాగరికారావు, రిషికేశ్‌రెడ్డి, కొత్త సీతారాములు, ఎం.ఎ.బాసిత్. 8. స్ట్రాటజీ కమిటీ: కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు (చైర్మన్), కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, జంగయ్య యాదవ్, సింగాపురం ఇందిర, నరేశ్ జాదవ్, పాల్వాయి స్రవంతి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, ఈర్లపల్లి శంకర్, ఆడం సంతోశ్, ఆమీర్జావెద్, జి.వి.రామకృష్ణ, లోకేశ్ యాదవ్, రాములు యాదవ్. -
గద్దర్ మృతి చాలా బాధాకరం
-
వరద సాయమేదీ?.. X మీకు మాట్లాడే హక్కు లేదు!
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల నష్టం, బాధితులకు ఆర్థిక సాయం అంశాలపై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధానికి దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ విమర్శలు చేస్తుండగా.. పలువురు మంత్రులు అడ్డుకున్నారు. దీంతో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ వర్సెస్ శ్రీధర్‌బాబు అన్నట్టుగా వాదోపవాదాలు జరిగాయి. రైతులందరికీ పరిహారం ఇవ్వాలి.. బీఆర్ఎస్ సభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి ఈ చర్చను ప్రారంభించారు. రైతులకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరారు. తర్వాత శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘వరదలతో జనజీవనం అతలాకుతలమైంది. 50 మంది మరణించారు. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రభుత్వం కేటాయించిన రూ.500 కోట్లు ఏ మాత్రం సరిపోవు. ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.1,500 కోట్లు రైతులకు చెల్లించాలి..’’అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుంటూ..‘‘శ్రీధర్‌బాబు వరద నష్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. అవి తప్పుడు లెక్కలు. ఈసారి ఆలస్యంగానైనా వర్షాలు కురిసినందుకు ఆనందించాలి. రెండు రోజులు నీళ్లున్నా వరికి నష్టం జరగదు. సోయా, పత్తి పంటలకు మాత్రమే నీళ్లుంటే నష్టం జరుగుతుంది. శ్రీధర్‌బాబు ఇదేదీ ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్ రుణమాఫీ ప్రకటన చేయగానే కాంగ్రెస్ వాళ్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి. అందుకే అనవసర ఆరోపణలు చేస్తున్నారు. శాస్త్రీయంగా ఆధారాలుంటేనే మాట్లాడాలి. దు్రష్పచారం చేయడం సరికాదు’’అని పేర్కొన్నారు. అంతేగాకుండా.. రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బాహాటంగా వ్యాఖ్యానించారని.. అలాంటి వారు తమకు నీతులు చెప్పడం ఏమిటని వ్యాఖ్యానించారు. గతంలో 6 గంటల కరెంట్ ఇచ్చి రైతులను చావగొట్టారని.. ఇప్పుడు ధరణి రద్దు చేస్తామని, దళారీ ప్రభుత్వం తెస్తామని అంటున్నారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మాటలపై శ్రీధర్‌బాబు రైతాంగానికి క్షమాపణ చెప్తారా? అని నిలదీశారు.‘‘ఒకప్పుడు ఒకాయన (చంద్రబాబు) వ్యవసాయం దండుగ అన్నారు.. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఉచిత విద్యుత్ వద్దంటున్నారు..’’అని కేటీఆర్ మండిపడ్డారు. పరస్పరం మాటల తూటాలతో.. కేటీఆర్ మాట్లాడిన తర్వాత అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. వరదలపై సమాధానం చెప్పలేక కేటీఆర్ చర్చను పక్కదారి పట్టిస్తున్నారని.. విద్యుత్‌పై ప్రత్యేక చర్చ పెడితే అందుకు తాము సిద్ధమని శ్రీధర్‌బాబు సవాల్ చేశారు. మధ్యలో భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ.. రైతులకు 3 గంటల కరెంట్ చాలని రేవంత్‌రెడ్డి అనలేదని స్పష్టం చేశారు. దీనిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ.. రేవంత్‌రెడ్డి మాట్లాడిన వీడియో చూపిస్తామన్నారు. సభలో ఉన్న బీఆర్ఎస్ సభ్యులు కూడా వీడియో చూపించాలన్నారు. వాదోపవాదాలు సాగుతుండగానే శ్రీధర్‌బాబు మాట్లాడు తూ.. ‘‘వరదలతో వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. మేటల తొలగింపు కోసం ఎకరాకు రూ. 50 వేలు ఖర్చు అవుతుంది. వరదలకు ప్రకృతి వైపరీత్యంతోపాటు మానవ తప్పిదం కూడా కనిపిస్తోంది. చెక్‌డ్యామ్‌ల నిర్మాణం శాస్త్రీయంగా లేదు. దీనిపై హౌస్ కమిటీ వేయండి. బాధితులకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలి. ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలి’ అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సర్కారుకు ఇంకా మూడు నాలుగు నెలల సమయమే ఉందని, తర్వాత వచ్చేది తామేనని వ్యాఖ్యానించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ.. ‘వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. పగటి కలలు కనొద్దు’అని పేర్కొన్నారు. మధ్యలో మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ.. ‘‘రేవంత్‌రెడ్డి 24 గంటల కరెంట్ వద్దు అంటున్నారు. చెక్‌డ్యామ్‌లు వద్దని శ్రీధర్‌బాబు అంటున్నారు. మరో కాంగ్రెస్ నేత ధరణి వద్దు అంటున్నారు. ఇదేనా కాంగ్రెస్ విధానం?’’అని విమర్శించారు. భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని.. తాము చెక్‌డ్యామ్ లు వద్దనలేదని, శాస్త్రీయంగా నిర్మించలేదన్న విషయాన్ని స్పష్టం చేశామని పేర్కొన్నారు. దీంతో.. ‘‘ఇరిగేషన్ అధికారులు డిజైన్ చేసి అన్నిరకాలుగా అధ్యయనం చేశాకే చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తారు. అలాంటివి అశాస్త్రీయమని ఎలా అంటారు?’’అని ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు. -
మంత్రి కేటీఆర్, శ్రీధర్‌బాబు మధ్య మాటల యుద్ధం
-
మంథని నియోజకవర్గంలో అధికారం వహించేది ఎవరు?
మంథని నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంధని నియోజకవర్గం నుంచి నాలుగోసారి విజయం సాదించారు. ఆయన సిటింగ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టా మదుపై 16230 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా కాంగ్రెస్ ఓడిపోగా, ఒక్క శ్రీధర్ బాబే గెలవగలిగారు. 2014లో శ్రీధర్ బాబును మదు ఓడిరచగా, 2018లో శ్రీదర్ బాబు పైచేయి సాదించారు. శ్రీదర్ బాబుకు 89045 ఓట్లు రాగా, పుట్టా మధుకు 72815 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన స్వతంత్ర అభ్యర్ది కె.నాగార్జున కు 5400 పైగా ఓట్లు వచ్చి, మూడో స్థానంలో ఉన్నారు. శ్రీధర్ బాబు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత. ఈయన తండ్రి శ్రీపాదరావుకూడా మంథనినుంచి మూడుసార్లు గెలవగా, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రదాని పివి నరసింహారావు నాలుగుసార్లు గెలిచారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు మొత్తం పదకుండు సార్లు గెలిచి నట్లయింది. 2014 ఎన్నికలలో దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఈసారి ఓటమిపాలయ్యారు. వరసగా మూడుసార్లు గెలుస్తూ వచ్చిన ఈయన టిఆర్ఎస్ ప్రభంజనానికి ఓటమి పాలు కాక తప్పలేదు. టిఆర్ఎస్ అభ్యర్ధి పుట్ట మధు ఇక్కడ శ్రీధర్ బాబుపై 19360 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మధు అంతకుముందు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్‌లో ఉండి ఈ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల సమయంలో ఈయన ప్రజారాజ్యం పక్షాన పోటీచేసి ఓడిపోయారు. శ్రీధర్‌బాబు డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో ఉన్నత విద్యాశాఖమంత్రి అయ్యారు. రోశయ్య మంత్రి వర్గంలో కూడా వున్నారు. అనంతరం ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా శ్రీధర్‌బాబు మంత్రిగా కొనసాగారు. టరమ్ చివరిలో కిరణ్‌తో విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేశారు. శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావు 1991 నుంచి నాలుగేళ్లపాటు శాసనసభ స్పీకరుగా పనిచేశారు. ఆయనను నక్సలైట్లు హత్యచేశారు. శ్రీపాదరావు ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిస్తే, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసింది కూడా మంధని నియోజకవర్గం కావడం ఒక ప్రత్యేకత. పి.వి. ఇక్కడ నుంచి నాలుగుసార్లు ఎన్నికై, నీలం, కాసు క్యాబినెట్లలో మంత్రిగా, రాష్ట్రముఖ్యమంత్రిగా, ఆ తరువాత కేంద్ర మంత్రిగా, ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టారు. మూడు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన నేతగా కూడా ప్రసిద్ధి గాంచారు. మన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని హన్మకొండ, నంద్యాలతోపాటు, మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి, ఒరిస్సాలోని బరంపురం నుంచి కూడా ఆయన లోక్‌సభకు గెలుపొందారు. మంథని నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
దేశం రాహుల్ వెంటే..
సాక్షి, హైదరాబాద్: విచ్ఛిన్నకర శక్తులకు ఎదురొడ్డి దేశ ఐక్యత కోసం పాటుపడుతున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వెంటే దేశం నిలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టి.జీవన్‌రెడ్డి చెప్పారు. భారత్‌జోడో యాత్ర పేరు తో దేశవ్యాప్తంగా తిరిగి ప్రజలను చైతన్యపరుస్తున్న రాహుల్ అంటే బీజేపీ బెంబేలెత్తుతోందని, అందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిప డ్డారు. రాహుల్‌పై బీజేపీ అణచివేతకు నిరసనగా బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ‘సత్యాగ్రహ మౌన దీక్ష’ జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగి న దీక్ష అనంతరం నిర్వహించిన సభలో శ్రీధర్‌బా బు, జీవన్‌రెడ్డి మాట్లాడారు. రాహుల్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే దేశప్రజలు ఊరుకోరని, ఆ యనకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కాంగ్రెస్ కార్యక ర్తలు పోరాటాలకు దిగుతారని హెచ్చరించారు. దేశంలోని ఆర్థిక నేరగాళ్లను దృష్టిలో పెట్టుకుని నాలుగేళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టులకెక్కి, శిక్షలు వేయించి, ఉద్దేశపూర్వకంగా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయించారని విమర్శించారు. గత ప్రభుత్వంలో కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారనే సాకుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసన సభ్యత్వాలను కేసీఆర్ రద్దు చేయించారన్నారు. ఇప్పుడు మోదీ కూడా కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని ధ్వజమెత్తారు. తాము సత్యాగ్రహ దీక్ష చేస్తున్నామన్న దుగ్ధతో ఆ దీక్షను భగ్నం చేసేందుకు ఉచిత విద్యుత్ పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ గందరగోళానికి గురిచేస్తోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలను ఓడించాలి: మన్సూర్ అలీఖాన్ విద్వేషాన్ని అడ్డుకుని దేశాన్ని రక్షించేందుకు రాహుల్, సోనియా, ఖర్గే పోరాడుతున్నారని ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇస్తోందని, బీఆర్ఎస్, బీజేపీలను ఓడించేందుకు అందరూ రాహుల్‌కు అండగా నిలవాలని కోరారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ ఒకే నేరంపై వివిధ రాష్ట్రాల్లో కేసులు వేయడం, వాటిని కోర్టులు సమర్థించడం బాధ కలిగిస్తోందన్నారు. మౌనదీక్ష రాహుల్ కోసమే కాదని, దేశంలోని ప్రతి వ్యక్తి స్వేచ్ఛ కోసమని వ్యాఖ్యానించారు. రాహుల్ ఎంపీగా ఉంటే ప్రధాని అవుతాడనే భయం మోదీకి పట్టుకుందని ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్ లోక్‌సభలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయించారన్నారు. ఈ దీక్షలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మల్లురవి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌తోపాటు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని పాల్గొన్నారు. -
ప్రగతి భవన్‌ను పేల్చేయండనడమే కాంగ్రెస్ సిద్దాంతమా? కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రగతి భవన్ పేల్చేయాలని రేవంత్ దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రగతి భవన్ పేల్చేయండని అనొచ్చా? ఇదేనా కాంగ్రెస్ పార్టీ సిద్దాంతం అంటూ విమర్మలు గుప్పించారు. రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ఇద్దరూ మంచి వాళ్లే. సావాస దోషం వల్ల ఇద్దరూ అసెంబ్లీలో అస్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడేమో ధరణి రద్దు చేస్తా అని ప్రకటనలు చేస్తాడు. మా అధ్యక్షుడు అలా మాట్లాడలేదని శ్రీధర్ బాబు చెబుతున్నాడు. కాంగ్రెస్ నాయకుల నోట్లో నుంచి ఒక్క పాజిటివ్ మాట కూడా రావడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కాకుండా పోతుంది. ఇకనైనా వారి వైఖరి మార్చుకోవాలి’ హితవు పలికారు. అదే విధంగా ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ధరణి పోర్టల్‌తో రైతులు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. గత ఆరేళ్లలో 30 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయితే ఈ ఏడాదిన్నర కాలంలోనే 23 లక్షల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలిపారు. అన్నిసవ్యంగా జరిగితే ఎవరూ మాట్లాడరని, ఎక్కడో ఒక చిన్న లోపం జరిగితే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒకట్రెండు లోపాలు జరిగితే రాష్ట్రమంతా గందరగోళం నెలకొందని చెప్పడం సరికాదని మంత్రి హితవు పలికారు. ఆధారాలు లేకుండా నిందారోపణలు చేయడం సరికాదని, శాసనసభను, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడొద్దని కేటీఆర్ సూచించారు. ధరణిని రద్దు చేయడం.. ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టడం, బాంబులతో పేల్చేయాలనడం కాంగ్రెస్ విధానామా? అని కేటీఆర్ కాంగ్రెస్ సభ్యులను సూటిగా ప్రశ్నించారు. -
ఆంక్షల నడుమ సీఎల్పీ బృందం పర్యటన
భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీలోని ముంపు ప్రాంతాల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష(సీఎల్పీ) బృందం పర్యటనకు అడుగడుగునా పోలీసు ఆంక్షలు ఎదురయ్యాయి. ముంపు బాధితుల పరామర్శకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వాన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, సీతక్క, కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తదితరులతో కూడిన బృందం మంగళవారం వచ్చింది. భద్రాచలంలో శ్రీసీతారామ చంద్రస్వామిని దర్శించుకున్నాక స్థానికంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామానికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో పాటు గోదావరి వరద పెరుగుతున్నందున దుమ్ముగూడెం పర్యటన వాయిదా వేసుకోవాలని భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్ కోరినా నేతలు ససేమిరా అన్నారు. దీంతో పోలీసుల కళ్లుగప్పి సీఎల్పీ నేతల కాన్వాయ్ దుమ్ముగూడెం మండలం వైపు వెళ్తుండగా పోలీసులు సినీఫక్కీలో ఛేజ్చేస్తూ గుర్రాలబైలు వద్ద అడ్డుకున్నారు. పోలీసులు ఎంతకూ అనుమతించకపోవడంతో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. చివరకు గుర్రాలబైలు నుంచి లచ్చిగూడెం, మారాయిగూడెం, చేరుపల్లి మీదుగా భద్రాచలానికి సీఎల్పీ నేతల కాన్వాయ్‌ను మళ్లించారు. ఆపై భద్రాచలంలో విలేకరులతో మాట్లాడిన నేతలు బూర్గంపాడు మీదుగా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బ్యారేజీ పరిశీలనకు బయలుదేరారు. అయితే, సీఎల్పీ బృందాన్ని బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీఎల్పీ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు నేతల వాహనాలను బలవంతంగా కొత్తగూడెం వైపు మళ్లించి రాకపోకలను పునరుద్ధరించారు. అక్కడినుంచి నేతలను కొత్తగూడెం మీదుగా కాళేశ్వరం వెళ్లాలని సూచించిన పోలీసులు మార్గమధ్యలో పాల్వంచ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆపై సీఎల్పీ బృందాన్ని వాహనాల్లో బందోబస్తు నడుమ ఇల్లెందుకు తరలించారు. అనంతరం కాళేశ్వరం మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా నాయకులు వాహనాల నుంచి కిందకు దిగారు. దీంతో ఇల్లెందులోని సింగరేణి గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అయితే, గెస్ట్‌హౌస్ తాళాలు లేకపోవడంతో 11గంటల వరకు ఆవరణలోనే నాయకులు పడిగాపులు కాశారు. చివరకు తాళాలు తీసుకురాగా, భోజనం అనంతరం కాళేశ్వరం బయలుదేరనున్నట్లు నాయకులు వెల్లడించారు. తెలంగాణనా.. పాకిస్తానా? ఇది తెలంగాణనా లేకపోతే పాకిస్తానా.. అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముందస్తు సమాచారమిచ్చి గోదావరి ముంపు ప్రాంతాలు, ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తున్న తమను టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందని ఆరోపించారు. దుమ్ముగూడెం పర్యటనకు వెళ్తుంటే మావోల ప్రభావిత ప్రాంతమని, అశ్వాపురం వెళ్తుంటే అనుమతులు లేవని అడ్డుకున్నారని తెలిపారు. ఇదిలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పాతరేయడం ఖాయమన్నారు. గోదావరి వరద ముంపు బాధితుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని భట్టి విక్రమార్క తెలిపారు. -
సంచలన వ్యాఖ్యలు.. డోర్ తెరిస్తే.. ‘దుద్దిళ్ల’ ‘కారు’ ఎక్కడం ఖాయం
సాక్షి, పెద్దపల్లి: సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తెలుపులు తెరిస్తే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని, శ్రీధర్‌బాబు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. టీఆర్ఎస్లో చేరడానికి శ్రీధర్‌బాబు సిద్ధంగా ఉన్నా.. కేసీఆర్ గేట్లు తెరవడం లేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలను గ్రహించి చెంచాగిరీ చేయడం మానుకోవాలని హితవు పలికారు. దీంతో మధు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. (చదవండి: ఆయన ఏం డిసైడ్ అయ్యారు, వెళ్తారా.. ఉంటారా?) -
ప్రజల మనిషి సంజీవయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లను ప్రారంభించింది, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేసింది దామోదరం సంజీవయ్యేనని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. సింగరేణిలో బోనస్ విధానాన్ని అమలు చేసి బోనస్ సంజీవయ్య అని పేరు తెచ్చుకున్నారన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో విప్లవాత్మక విధానాలు, పథకాలను ప్రజల కోసం తీసుకొచ్చారని చెప్పారు. ఉమ్మడి ఏపీ సీఎం, ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సంజీవయ్య శత జయంతి ఉత్సవాలు సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు అధ్యక్షతన ఇందిరాభవన్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సంజీవయ్య జీవిత చరిత్ర నేటి యువతరానికి స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని తానే ముఖ్యమంత్రి అయి కేసీఆర్ మోసం చేస్తే దేశంలోనే తొలి దళిత సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని జగన్‌ను కోరతా: గద్దర్ కాంగ్రెస్ పార్టీ ఉదారమైన పార్టీ అని, ఆ పార్టీలో ఎంతో మంది త్యాగధనులున్నా రని, వారి త్యాగాలకు వెలకట్టలేం కానీ విలువ కట్టాలని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని ఏపీ సీఎం జగన్‌ను కలిసి కోరతానన్నారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, కాం గ్రెస్ నేత పొన్నాల, కోదండరెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, బొల్లు కిషన్, వినోద్ కుమార్, సంజీవయ్య సోదరుడు నాగేందర్ పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, పోలీసులు పోలీసుల్లాగా పనిచేయకపోవడంతో ప్రజల్లో రక్షణ భావం లేకుండా పోతోందని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) ఆరోపించింది. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని టీఆర్ఎస్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా రాష్ట్రంలోని పోలీసులు ప్రజల పక్షాన పనిచేసేలా చూడాలని కోరింది. ఈ మేరకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్కలు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, వామనరావు, నాగమణి అడ్వొకేట్ దంపతుల హత్య, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య, దిశ అత్యాచార ఘటన, హాజీపూర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడడం, హన్మకొండలో 9 నెలల బాలికపై అత్యాచారం, మరియమ్మ లాకప్‌డెత్, శీలం రంగయ్య లాకప్‌డెత్ లాంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. 2021లో కేసుల సంఖ్య పెరిగిందని స్వయంగా డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గణాంకాలతో సహా వెల్లడించారని గుర్తుచేశారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఆందోళనలకు పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేసి పార్టీ నేతలను బయటకు రానీయకుండా చేస్తున్నారని, ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో మభ్యపెడుతూ పోలీసులు ప్రతిపక్ష నేతలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. -
పరిహారం సరే.. ముందు లెక్కలు తేల్చండి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్ట పో యారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో శుక్రవారం జీరో అవర్‌లో పంటనష్టం, పరిహారం అంశాలను లేవనెత్తారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరా ల్లో పంటలు నీట ముని గాయని, వరదలతో తీవ్రనష్టం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. పరి హారం చెల్లింపు అంశాన్ని పక్కనపెడితే కనీసం అంచనాలు రూపొందించాలని, ఈ వివరాలను కేం ద్రానికి సమర్పిస్తే కొంతైనా మేలు జరిగే అవకాశం ఉంటుందని సూచించారు. వర్షా కాలం ముగుస్తోం దని, తక్షణమే స్పందించకుంటే అంచనాలు కూడా రూపొందించే వీలుండదని గుర్తుచేశారు. -
పంచాయతీలకు ప్రతినెలా నిధులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్లిస్తున్నారంటూ విపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పంచాయ తీలకు ప్రతి నెలా నిధులు మంజూరు చేస్తున్నా మని తెలిపారు. కేంద్రం దయాదాక్షిణ్యంగా ఏ విధమైన నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్రం హక్కుగానే నిధులు ఇస్తోందని చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులకు సమానంగా రాష్ట్రమూ నిధులిస్తోందన్నారు. పల్లె, పట్టణ ప్రగతిపై చేతనైతే సుదీర్ఘ చర్చకు రావాలని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. ఖర్చు చేసే ప్రతి పైసకు లెక్క చెబుతామన్నారు. రాష్ట్రం లో గ్రామ పంచాయతీల పురోగతిని కేంద్రమే ప్రశంసించిందని ఆయన గుర్తుచేశారు. శాసన సభలో కాంగ్రెస్ పక్ష సభ్యులు సీతక్క, డి.శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ప్రభృతులు నిధుల మళ్లింపు అంశాన్ని ప్రస్తావించారు. మంత్రి ఎర్రబెల్లి వారికి సమాధానం చెప్పారు. అనంతరం సీతక్క అనుబంధ ప్రశ్న వేశారు. నిధుల వివరాలు చెప్పండి గ్రామ పంచాయతీలకు కేంద్రం ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, దీనివల్ల అనేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని సీతక్క అన్నారు. గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో మానసిక ఆవేదన చెందిన సర్పంచ్‌లు పలు చోట్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పిన పనులు చేయలేదని కలెక్టర్లు, డీపీవోలు వారిని అవమానిస్తున్నారని ఆమె సభ దృష్టికి తెచ్చారు. గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులెంతో చెప్పాలని నిలదీశారు. ఈ నిధులు గ్రామాభివృద్ధికి సరిపోతున్నాయో లేదో తెలపాలన్నారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ వల్ల వచ్చే నిధులు సరిగా పంచాయతీలకు అందడం లేదన్నారు. యూపీఏ ప్రభుత్వ ఉపాధి హామీ పథకం ద్వారా ఏడేళ్ల నుంచి రాష్ట్రానికి రూ. 15 వేల కోట్ల నిధులు వచ్చాయని, వీటిని దారి మళ్ళించింది వాస్తవమా కాదా తెలపాలని భట్టి అన్నారు. సమన్యాయం ప్రభుత్వ విధానం : కేసీఆర్ కొన్ని పంచాయతీల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుందని, మరికొన్ని పంచాయతీలకు ఏమాత్రం ఆదాయం ఉండదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్ హయాంలో తలసరి నిధుల కేటాయింపు కేవలం రూ.4 మాత్రమే ఉంటే, ఇప్పుడు తాము రూ.654 పైచిలుకు ఇస్తు న్నామని తెలిపారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. వాస్త వాలు వక్రీకరించడం కాంగ్రెస్ సభ్యులకు తగదన్నారు. తెలంగాణ గ్రామాలను ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినవారు పులకించి పోతున్నారని, ఇది కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. కరోనా సమయంలోనూ పంచాయతీల నిధులు ఆపొద్దని తాను ఆదేశించినట్టు తెలిపారు. -
నేను పీసీసీ రేసులో లేను: శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: ‘‘నేను పీసీసీ రేసులో లేను.. ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్న అంగీకారమే.. దానికి కట్టుబడి ఉంటాను’’ అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల ఎకరాల భూమిని అమ్మాలని చూస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో 13 ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆస్తులను కాపాడుకునేందుకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం నాలుగు లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళింది. ఉమ్మడి రాష్ట్రంలో భూములు అమ్మ లేదా అని హరీష్ రావు అంటున్నారు. ఆనాడు ఆస్తులు అమ్మతుంటే వద్దని మేము ఆనాటి ముఖ్యమంత్రి కి చెప్పాము. జిల్లాలో భూముల్ని అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని’’ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. ‘‘ఆరున్నర సంవత్సరాలుగా అనేక పనులు కూడా ప్రజావ్యతిరేకంగానే ఉన్నాయి. ఇప్పుడు అమ్మే భూములు ఎవరికి ఏ ప్రాంతానికి అమ్ముతారు. ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగానేతరులకు భూములు అమ్మే ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ హయాంలో వేల ఎకరాలు పేదలకు పంచాం. పొడు భూములు కూడా పంపిణీ చేశాం. మన భూములను మన తెలంగాణ రాష్ట్ర సమితి అమ్మే ప్రయత్నం చేస్తోంది.. మిమ్మల్ని ఏ విదంగా వెల్లగొట్టాలని ప్రజలు ఆలోచిస్తున్నారు’’ అంటూ శ్రీధర్ బాబు మండిపడ్డారు. చదవండి: కాంగ్రెస్‌లో వీహెచ్ వ్యాఖ్యల దుమారం -
న్యాయవాదుల హత్య: పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు
-
న్యాయవాదుల హత్య: పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దారుణ హత్య ఉదంతపై పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్‌రావు హత్య కేసులో తనను ఇరికించేందుకు కుట్రపన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అనుకూల మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి శ్రీధర్‌బాబు తనపై అనేక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా తనపై విద్వేషపూరిత వార్తలను ప్రచురిస్తోందని, కేసు దర్యాప్తు చేస్తోంది పోలీసులా..? లేక మీడియానా అని ప్రశ్నించారు. శనివారం మంథనిలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమలో పాల్గొన్న పుట్ట మధుకర్.. తొలిసారి వామన్‌రావు దంపతుల హత్యపై స్పందించారు. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధంలేదన్నారు. హత్య అనంతరం తాను పారిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని, తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కోరానని, దానికి సీఎం నిరాకరించారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కొంతమంది తన వ్యతిరేకులు పుట్ట మధును ఎప్పుడెప్పుడు అరెస్టు చేస్తారని ఎదురుచూస్తున్నారని అన్నారు. పేద బిడ్డ జడ్పీ చైర్మన్ అయితే సహించలేక పోతున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. పోలీసు విచారణ తర్వాత వాస్తవాలతో హైదరాబాద్‌లో మీడియా ముందుకు వస్తానని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న పత్రికలు, టీవీల గురించి కూడా చెప్తానని అన్నారు. తాను రౌడీయిజం చేస్తున్నట్లు శ్రీధర్‌బాబు ప్రచారం చేస్తున్నారని, అసలు దొంగలు వారేనని విమర్శించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులు కుంట శ్రీనివాస్‌ను(ఏ1), చిరంజీవిని (ఏ2), అక్కపాక కుమార్(ఏ3)ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం పుట్టమధ మేనల్లుడు బిట్టు శ్రీనును కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యలో భాగంగా రిజిస్ట్రేషన్ కాని బ్రీజా కారును, కొబ్బరికాయలు కోసే కత్తులను బిట్టు శ్రీను ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్‌కు సమకూర్చాడు. ఈ క్రమంలోనే పుట్టమధు పాత్రపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మేనల్లుడు హత్య కేసులో ఇరుక్కోవడంతో విమర్శల తాకిడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. లాయర్ దంపతుల హత్య.. రెండు గంటల్లోనే స్కెచ్ -
ఉత్కంఠ రేపుతున్న పీసీసీ చీఫ్ ఎంపిక
సాక్షి, హైదరాబాద్ : కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. బంతి అధిష్టానం కోర్టుకు చేరడంతో సీన్ ఢిల్లీకి మారుతోంది. కాంగ్రెస్ ‘మార్కు’రాజకీయం మొదలైంది. ‘అయిననూ పోయి రావలె హస్తిన’కు అన్నట్లుగా నాయకులు ఢిల్లీ బాట పట్టనున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిపిన పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ వెళ్లిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ వైపు మళ్లింది. ఫలానా నాయకుడికి ఈ పదవి వస్తోందనే ఊహాగానాల నేపథ్యంలో... అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిం చాలని కోరుతూ అధిష్టానాన్ని కలిసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు సోమవారం ఢిల్లీకి బయలుదేరనున్నట్టు సమాచారం. వీరి వెనుకే మంగళవారం జగ్గారెడ్డి కూడా హస్తిన బాట పట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా సోనియా, రాహుల్‌గాంధీల అపాయింట్మెంట్ కోరి రాష్ట్రంలో అభిప్రాయ సేకరణ జరిగిన తీరుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందరినీ ఎలా అడుగుతారు? టీపీసీసీ అధ్యక్ష వ్యవహారంలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ రెండు గ్రూపులుగా చీలిపోయిందని పార్టీ వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. దీర్ఘకాలికంగా పార్టీకి సేవ చేస్తున్న వారినే ఈ పదవికి ఎంపిక చేయాలని కొందరు, పార్టీకి ఊపు తెచ్చే స్పీడున్న నాయకుడికి ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. పాతకాపులకే పగ్గాలు ఇవ్వాలని కోరుతున్న నాయకులు అసలు అభిప్రాయ సేకరణే సరిగా జరగలేదని అంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కోర్ కమిటీ సభ్యుల నుంచి మాత్రమే అభిప్రాయాలు సేకరించాల్సి ఉందని, అందుకు విరుద్ధంగా మొత్తం 160 మందిని పిలవడం ఏఐసీసీ నియమావళికి విరుద్ధమని వారంటున్నారు. ఈ మేరకు సోనియా, రాహుల్‌లకు ఇచ్చేందుకు ఫిర్యాదును కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, పార్టీని ఉత్తేజపరిచే నాయకుడికి బాధ్యతలు అప్పగించాలంటోన్న మరోవర్గం మాత్రం పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ కీలక నేత సాయంతో ఢిల్లీలో పావులు కదుపుతోంది. ఈ రెండు గ్రూపుల ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం ప్రస్తుతం రక్తి కడుతోంది. నాయకుల ఢిల్లీ బాటలపై ఓ ముఖ్యనేత ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘టీపీసీసీ అధ్యక్ష ఎంపిక ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లడం సహజమే. ఫిర్యాదు చేసేందుకు వెళ్లడం లేదు. పార్టీ ఇన్చార్జి మాణిక్యం మరో రెండు రోజుల్లో తన నివేదికను అధిష్టానానికి ఇచ్చే అవకాశముంది. అప్పుడు మమ్మల్ని ఢిల్లీ పెద్దలు పిలిచి ముఖ్యులతో మాట్లాడిన తర్వాత మాత్రమే కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు’అని వ్యాఖ్యానించారు. ఈ ఎపిసోడ్ ఎప్పటికి ముగుస్తుందో... కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు, ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఆ తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే. -
పాత సీట్లకు ప్రభుత్వ ఫీజులే
సాక్షి, హైదరాబాద్: పాత విద్యా సంస్థలనే యూనివర్సిటీలుగా మార్చితే అవి బ్రౌన్‌ఫీల్డ్ యూనివర్సిటీలుగా, పాత విద్యా సంస్థలు లేకుండా కొత్తగా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే గ్రీన్‌ఫీల్డ్ యూనివర్సిటీలుగా అనుమతి ఇచ్చామని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి స్పష్టంచేశారు. బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లో పాత సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే ఉంటాయని, వాటికి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని పేర్కొన్నారు. అదే వర్సిటీల్లో కొత్త సీట్లలో చేపట్టే ప్రవేశాల్లో మాత్రం యాజమాన్యాలే ఫీజులను నిర్ణయిస్తాయని, వాటికి రీయింబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యలు లేవనెత్తిన వివిధ అంశాలపై ఆమె వివరణ ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో నిబంధనలు పాటించని మంత్రులు, ఎమ్మెల్యేల కాలేజీలను కూడా మూసివేయించామని చెప్పారు. యూనివర్సిటీల ఏర్పాటుకు 16 దరఖాస్తులు వస్తే నిపుణుల కమిటీ సిఫారసు చేసిన 9 సంస్థల్లో 8 సంస్థలు ముందుకు వచ్చాయని, అందులో వివాదాల్లేని 5 సంస్థలకు మొదటి విడతలో అనుమతి ఇచ్చామని, మిగతావి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వివరించారు. గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీల్లో ఫీజులు యాజమాన్యాలే నిర్ణయించుకుంటాయని, ఆయా సంస్థల గవర్నింగ్ బాడీలో విద్యాశాఖ కార్యదర్శి ఉంటారని, ప్రభుత్వ నియంత్రణ ఉంటుం దని అన్నారు. వాటిల్లో 25 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలన్న నిబంధన ఉందన్నారు. వీసీలు, అధ్యాపకుల నియామకాలకు లైన్ క్లియర్ అయిందన్నారు. ప్రపంచస్థాయి ఎలా సాధ్యం? ఎమ్మెల్యే డి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ వర్సిటీల్లో వసతులే లేకుంటే ప్రపంచస్థాయిలో అవి ఎలా పోటీ పడతాయని ప్రశ్నిం చారు. ఎమ్మెల్యే మోజంఖాన్ మాట్లాడుతూ ప్రైవేటు వర్సిటీల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పి ంచాలన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, సంజయ్ మాట్లాడుతూ ప్రైవేటు వర్సిటీల అవసరం ఎంతైనా ఉందన్నారు. సభ్యుల ప్రశ్నలపై మంత్రి సమాధానం ఇచ్చాక బిల్లును సభ ఆమోదించింది. -
ప్రజారోగ్యం కోసం రూ.10వేల కోట్లయినా ఖర్చుపెట్టారా?
సాక్షి, సూర్యాపేట : టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ. 3 లక్షల కోట్ల అప్పుల్లో కనీసం రూ.10 వేల కోట్లయినా ప్రజారోగ్యం కోసం ఖర్చు పెట్టారా అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నిం చారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ బృందం వరంగల్ ఎంజీఎం, సూర్యాపేట ఆస్పత్రులను సందర్శించింది. ఈ సందర్భంగా కరోనా రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, వైద్య పోస్టులు ఖాళీ వివరాలు, పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అసలు సమస్యను పట్టించుకోకుండా వివిధ విభాగాలపై సమీక్ష చేయడం సిగ్గు చేటన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటే ఆరేళ్లుగా గాడిదలను కాస్తున్నారా అని భట్టి నిలదీశారు. (ప్రత్యేక రైళ్లకు అన్‌లాక్) ఈటల తప్పుకోవాలి ‘ఇంత పెద్ద ఆస్పత్రిలో డాక్టర్లు లేరు.. సదుపాయాలు లేవు. దీని సంగతి పట్టించుకోని నువ్వు ఒక మంత్రివా..? ఎర్రబెల్లివా.. ఎర్రపెల్లివా’అంటూ తీవ్ర స్థాయిలో మంత్రి దయాకర్‌రావుపై ఫైర్ అయ్యారు . 2016లో కేంద్రం పీఎంఎస్ఎస్వై పథకం కింద నగరంలో రూ.150 కోట్లతో అత్యాధునిక ఆస్పత్రి నిర్మిస్తే రాష్ట్ర వాటా కింద రూ.30 కోట్లు చెల్లించకుండా ఆస్పత్రిని నిరుపయోగంగా మార్చిన గొప్ప ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. పెద్దపెద్ద మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కరోనా విస్తృతి పెరుగుతున్న సమయంలో ఫామ్‌హౌస్‌లో దాక్కున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏ మాత్రం శ్రద్ధ లేదని, ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారని దుయ్యబట్టారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పేర్కొన్నారు. పోస్టులను భర్తీ చేయకుంటే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులు అత్యంత దయనీయంగా ఉన్నాయని తెలిపారు. భట్టి వెంట మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. (ఆరోగ్య సలహానా... ట్వీట్ చెయ్!) -
అధికారానికి కొత్త నిర్వచనం వైఎస్సార్
సాక్షి, హైదరాబాద్ : ప్రజల మనిషి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అనేక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తారని, అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి కొత్త నిర్వచనం చూపారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి వైఎస్ హయాంలోనే జరిగిందని, అవుటర్ రింగ్ రోడ్, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే లాంటి అనేక ఫ్లైఓవర్తను నిర్మించిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ హయాంలోనే అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయం పూర్తైన విషయాన్ని గుర్తుచేశారు. సాఫ్ట్వేర్ పార్కులను ఏర్పాటుచేసి ఐటీకి కొత్తరూపం తెచ్చారని కొనియాడారు. ఆపదలో ఆదుకునే ఆరోగ్య శ్రీ పథకంతో కొత్త విప్లవానికి శ్రీకారం చుట్టిన మహానేత రైతు పక్షపాతిగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచారని పేర్కొన్నారు. -
కేంద్రం ఏ విషయంలో కితాబిచ్చిందో చెప్పాలి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు అందుబాటులో లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లాలో వెంటిలేటర్ల సౌకర్యం కల్పించే బాధ్యతను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జిల్లాలో దాతలు వెంటిలేటర్లు ఇస్తానన్న ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కరోనా ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చడం ఇష్టం లేకపోతే కోవిడ్-19 పేరుతో చికిత్స అందించాలి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేంద్రం కితాబిచ్చిందని చెప్పుకుంటున్నారు. ఏ విషయంలో కితాబిచ్చిందో చెప్పాలి? హైదరాబాద్ సిటీ- అర్బన్ ప్రాంతంలో రోజుకూలీ చేసుకునే వారి కోసం ప్రత్యేక పథకం తీసుకురావాలి. కేంద్ర నిబంధనలు పాటించాలని పోరాటం చేస్తున్నాం’అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. (తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర బృందం ప్రశంసలు) -
దక్షిణాది రాష్ర్టాల నుంచి ఆ గౌరవం పీవీకే దక్కింది
సాక్షి, హైదరాబాద్ : పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు శుక్రవారం ఇందిరాభవన్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీపీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్సీ నేత భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య , షబ్బీర్ అలీ, కమిటీ చైర్మన్ గీతారెడ్డి, వీహెచ్ హనుమంతరావు సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే దేశాన్ని పాలించే స్థాయికి పీవీ ఎదిగారని కొనియాడారు. ఒక సామాన్యుడు సైతం ప్రధాని కావచ్చనే విషయాన్ని పీవీని చూసి స్ఫూర్తి పొందాలన్నారు. ఒక తెలుగువ్యక్తికి అంతటి గోప్ప స్థాయి కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి పీవీకి దక్కిన గౌరవం మరెవరికి దక్కలేదని, సోనియాగాందీ సలహామేరకు ఏఐసీసీ ఆమోదంతో పీవీ ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. పీవీ ప్రధాని పదవి చేపట్టాక దేశ ఆర్థిక సంస్కరణలు పీవీకి ముందు ఆయన తర్వాత అనేలా ఉన్నాయని పేర్కొన్నారు. ('పుట్టుక నుంచి చనిపోయే వరకు పీవీ కాంగ్రెస్ వాది') 24వ శతాబ్ధంలో రాజీవ్‌గాంధీ ఆలోచనలకు రూపకల్పన చేసింది పీవీ అని వీహెచ్ హన్మంతరావు అన్నారు. సొంత గూటి నుంచే పీవీకి గట్టి పోటీ ఉండేదన్నారు. 'పీవీని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రవేసే ప్రయత్నం జరిగింది. మా అధ్యక్షుడు మాటకు గౌరవం ఇచ్చి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడటం లేదు. కొందరు ఆయన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారు. కానీ అది ఎవరి వల్లా కాదు. మన్మోహన్ సింగ్, ఇతర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. పీవీ ఆశించినట్లు బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలి' అని వీహెచ్ అన్నారు. తెలుగు జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి పీవీ నరసింహారవు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. ఆయన ఘనత భావితరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. (హ్యాపీ బర్త్‌డే తారక్: సీఎం జగన్) -
ఆర్థిక మాంద్యమంటూనే అన్ని కోట్ల ప్రతిపాదనలెలా...?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో సమతుల్యత లోపించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. ఆర్థిక మాంద్యం ఉందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తక్కువగా ఉంటాయని పేర్కొంటూనే రూ.1.83 లక్షల కోట్ల బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. రూ.30 వేల కోట్లకు పైగా ఉన్న ద్రవ్యలోటును ఎలా పూడుస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ప్రజలపై ఆస్తిపన్ను, ఇతర చార్జీల భారం మోపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కనబడుతోందని అన్నారు. ఇద్దరూ కలిసి వెళ్లండి.. కాళేశ్వరం ద్వారా భూపాల జిల్లాకు నీళ్లివ్వాలని శ్రీధర్‌బాబు కోరడంతో గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. తన నియోజకవర్గానికి నీళ్లిచ్చే అంశమై ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి సానుకూలంగా ఉన్నారని, కాళేశ్వరంతో రాష్ట్ర ముఖచిత్రమే మారనుందని అన్నారు. అందుకే ఆ ప్రాజెక్టు సందర్శనకు రావాలని కాంగ్రెస్ నేతలను తాను కోరానన్నారు. దీనిపై శ్రీధర్‌బాబు మట్లాడే ప్రయత్నం చేయగా, స్పీకర్ మైక్ ఇవ్వలేదు. అయినా శ్రీధర్‌బాబు నిల్చుని ఉండటంతో ‘మీరూ, గండ్ర వెంకటరమణ ఇద్దరూ కలిసి కాళేశ్వరం వెళ్లిరండి. ప్రాజెక్టు చూసిరండి’అనడంతో అంతా నవ్వుకున్నారు. కేంద్ర సాయం అందకపోతే చలో ఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. కరెంట్, రైల్వేలు, 11 సాగునీటి ప్రాజెక్టులు, పింఛన్లు, గృహ నిర్మాణాలకు కేంద్రం నిధులిస్తోందన్నారు. కేంద్రంనుంచి ఒకవేళ రాష్ట్రానికి అందాల్సిన సాయం అందకపోతే అంతా కలిసి చలో ఢిల్లీ కార్యక్రమం చేద్దామని పేర్కొన్నారు. -
ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం
సాక్షి, మంథని: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతోనే సమ్మెలోకి వెళ్లారని, వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సమస్యల సాధన కోసం మూడు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మంథనిలో శ్రీధర్‌బాబు, పెద్దపల్లిలో విజయరమణారావు సోమవారం సంఘీభావం తెలిపారు. కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.60 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చిన్నచిన్న తప్పిదాలు ఉండేవని, రాష్ట్రం వస్తే అలాంటి సమస్యలను పరిష్కారమవుతాని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కేసీఆర్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని పేర్కొన్నారు. సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని తెలిసినా గత నెల కార్మిక సంఘాలు నోటీస్ ఇస్తే సమస్యలకు పరిష్కారం చూపకుండా ముగ్గురు అధికారులతో కమిటీ వేస్తారా అని ప్రశ్నించారు. ప్రజాసామ్య బద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మంది కార్మికులను తీసేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. సకల జనుల సమ్మె సమయంలో 27 రోజులు సమ్మె చేసినా ఒక్క కార్మికుడిని కూడా సస్పెండ్ చేయలేదన్నారు. కార్మికులను ఒక్క రోజులో విధుల నుంచి తీసేస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. కార్మికులకు అన్యాయం జరిగితే రాష్ట్రంలో ప్రళయమే వస్తుంది హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల వేతనం కేవలం రూ.13 వేల నుంచి రూ.30 వేలు దాటడం లేదని, సీఎం మాత్రం రూ.50 వేలు తీసుకుంటున్నారనడం సరికాదని పేర్కొన్నారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ ధర రూ.70.25 ఉండగా మన రాష్ట్రంలో రూ.73.00 ఉందన్నారు. డీజిల్‌పై జీఎస్టీ, వ్యాట్ 27 శాతం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో 21 శాతం ఉందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులంతా ఏకతాటిపైకి రావాలన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 42 రోజులు సకలజనుల సమ్మెలో పాల్గొని జీతాన్ని కోల్పోయిన కార్మికులు ఇప్పుడు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రశ్నిస్తే రాజరిక వ్యవస్థను కేసీఆర్ గుర్తు చేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రజలంతా సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలన్నారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలవలేదని గుర్తుచేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ శశిభూషణ్‌కాచే, జిల్లా కార్యదర్శి సెగ్గెం రాజేశ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు మంథని సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి, మాజీ జెడ్పీసీసీ చొప్పరి సదానందం, ఆరెల్లి కిరణ్, జంజర్ల శేఖర్, ఆర్టీసీ సంఘం నాయకులు ఐలయ్య, కేకే.రెడ్డి, రాజయ్య, నూగిళ్ల మల్లయ్య, వేముల రామ్మూర్తి, జగదీష్, సురేశ్‌గౌడ్, బొడ్డుపల్లి శ్రీను, రాజమల్లు, రాజు, ఎంఏ.ఖయ్యూం, ఎస్కే.అహ్మద్, నర్సింగం, కొమురయ్య, ఎంఏ. అలీం, బాబా తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెకు కాంగ్రెస్, ప్రజాసంఘాల మద్దతు
సాక్షి, గోదావరిఖని: సమ్మెకు దిగిన కార్మికులు, ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోబోమంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో ఆర్టీసీలో సమ్మె మరింత ఉధృతమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే తదితర డిమాండ్లతో చేపట్టిన సమ్మె సోమవారం మూడో రోజుకు చేరింది. వివిధ పార్టీల నాయకులు సంఘీభావం, పలు సంఘాల నిరసన కార్యక్రమాలతో తీవ్రతరమైంది. కార్మి కులు ఎవరూ విధులకు హాజరు కాలేదు. ఉదయం 6గంటలకే డిపో వద్దకు చేరు కుని నాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి సూచనల మేరకు నిరసనలు చేపట్టారు. మంథని, గోదావరిఖని డిపోల పరిధిలో పనిచేసే డ్రైవర్లు, కం డక్టర్లు, ఉద్యోగులు బస్టాండ్లకు సమీపంలో నిరసన తెలిపారు. గోదావరిఖనిలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ కాలనీలో ఆర్టీసీ ఉద్యోగులు బస్ డిపోకు 300 మీటర్ల దూరంలో ధర్నా చేపట్టారు. మాజీ మంత్రి, మంథని ఎమ్మె ల్యే శ్రీధర్‌బాబు మంథనిలో, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి బస్టాండ్‌లో ప్రదర్శనలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల కోసం ఏమాత్రం ఆలోచించకుండా నియంతలా వ్యవహర్తిస్తున్నా డని ఆరోపించారు. ఉద్యోగుల హక్కుల కోసం అన్నివర్గాల ప్రజలు సహకరించాల ని కోరారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జేఏసీ నాయకులు వంగర శ్రీనివాస్, రాజయ్య, లక్ష్మణ్, మసూద్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రీజియన్‌లో 505 బస్సులు ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ కరీంనగర్ రీజియన్‌లో ఆర్టీసీ బస్సులు 302, అద్దె బస్సులు 203 మొత్తం 505 బస్సులు నడిపించారు. తాత్కాలిక కండక్టర్లు 302, డ్రైవర్లు 302మందితో బస్సులు నడిచాయి. -
‘ఈటెల శ్వేతపత్రం విడుదల చేస్తావా?’
సాక్షి, మంచిర్యాల: కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అధ్వర్యంలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు, కొక్కిరాల సురేఖ మంగళవారం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రులను, ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండి పడ్డారు. 60 మంది వైద్యులు ఉండాల్సిన మంచిర్యాల ఆస్పత్రిలో కేవలం 20 మంది వైద్యులు మాత్రమే ఉన్నారన్నారు. అసలే అరకొర సేవలంటే దీనికి తోడు ఆసిఫాబాద్ జిల్లా నుంచి కూడా రోగులు ఇక్కడకే వస్తున్నారన్నారు. సరైన వసతులు లేకపోవడమే కాక రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో మంచిర్యాల ఆస్పత్రి సిబ్బంది వారందరిని కరీంనగర్ ఆస్పత్రికి పంపుతున్నారన్నారు. ఫలితంగా మంచిర్యాల ఆస్పత్రి కేవలం రిఫరల్ ఆస్పత్రిగా మాత్రమే కొనసాగుతుందని తెలిపారు. ఆస్పత్రుల్లో శానిటేషన్ సిబ్బందికి 20 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో ఆస్పత్రులకు డీఎంఎఫ్టీ కింద వందల కోట్ల నిధులు ఉన్నా ప్రభుత్వం వాటిని ఖర్చు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు మాజీ మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని గొప్పలు చెబుతోన్న ఈటెల దీనిపై శ్వేతం పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖను పటిష్టం చేసి మెరుగైన వైద్య సేవలు అందించకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని శ్రీధర్‌బారు హెచ్చరించారు. -
కేటీఆర్.. మీతో ఛాయ్ కా, ఇంకేమైనా ఉందా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాల సందర్భంగా గురువారం అసెంబ్లీ లాబీలో అసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పద్మా దేవేందర్ రెడ్డి, బాల్క సుమన్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎదురయ్యారు. కేటీఆర్ ఈ సందర్భంగా ఛాయ్ తాగుదాం రండి అంటూ శ్రీధర్‌బాబును ఆహ్వానించారు. ‘మీతో ఛాయ్‌పై చర్చనా ? ఇంకా ఏమైనా ఉందా ? వద్దు బాబు’ అంటూ శ్రీధర్ సమాధానం ఇవ్వడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. అనంతరం బాల్క సుమన్‌ను పలకరించిన శ్రీధర్‌బాబు..ఏదో వన భోజనాలు పెట్టించినట్టున్నావు అని చమత్కరిస్తూ... కాళేశ్వరం జలజాతర పేరిట సుమన్ నిర్వహించిన కార్యక్రమం గురించి ఆయన ప్రస్తావించారు. తానే కాదని, మంథని నియోజకవర్గంలో కూడా గతంలో భోజనాలు పెట్టించారని బాల్క సమాధానమిచ్చారు. ఇక ఇవాళ ఉదయం శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన వెంటనే విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి సభాపతి స్థానం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా శాసనసభ్యులు జగదీశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు శాసనసభ సమావేశాలకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పుష్పగుఛ్చం అందజేసి స్వాగతం పలికారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు గౌడ్‌కు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు స్వాగతం పలికారు. -
మంథని నుంచి ఇసుక,నీరు తీసుకెళ్తున్నారు
-
ఆ సమస్యపై సీఎం ఎందుకు మాట్లాడరు
సాక్షి, కరీంనగర్ : సిర్పూర్ కాగజ్ నగర్ మహిళా అటవీ అధికారిణిపై జరిగిన దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు సరిగాలేదని మండిపడ్డారు. గిరిజనుల పోడుభూముల సమస్య పరిష్కారిస్తామన్న సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపటం లేదని ఆయన ప్రశ్నించారు. సీఎం గిరిజనులకు పోడు భూములు ఇవ్వమంటుంటే.. అధికారులేమో వాటిని లాక్కుంటామంటున్నారు, ఇదెక్కడి న్యాయమంటూ దుయ్యబట్టారు. పోలీసుల దాడులతో గిరిజనులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటును గమనించి.. టీఆర్ఎస్ సర్కార్ మేల్కోవాలని సూచించారు. పోడుభూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ.. పోరాడతామన్నారు. అటవీ అధికారులపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారని, చట్టాన్ని చేతిలోకి తీసుకున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
టిక్కెట్లు అడిగేటప్పుడు తెలియలేదా?!
సాక్షి, పెద్దపల్లి : హైకోర్టు ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. వారిపై స్పీకర్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీలోకి ఫిరాయించడాన్ని దేశంలోని ఏ రాజ్యాంగం ఒప్పుకోదన్నారు. పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్‌లో గ్రూపులు ఉన్నాయంటున్న ఎమ్మెల్యేలకు.. టిక్కెట్లు అడిగేటప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తమ పార్టీలో నాయకత్వ లోపం ఉందని అనడం వెనుక అసలు ఉద్దేశమేమిటో చెప్పాలన్నారు. తాము పార్టీలు మారడానికి ప్రజలు అంగీకారం తెలిపారని అంటున్నారు కదా..అలా అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ 7 స్థానాల్లో ఎలా ఓడిపోయిందో చెప్పాలని ఎద్దేవా చేశారు. కాగా రాజ్యాంగ బద్ధంగానే తాము టీఆర్ఎస్లో చేరామని పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొన్న సంగతి తెలిసిందే. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వీరు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగ కాంతారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ముఠా రాజకీయాలతో సతమతమవుతోందని విమర్శించారు. రాజ్యాంగ బద్ధంగా తమకున్న హక్కుతోనే సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయమని స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చామని స్పష్టం చేశారు. పార్టీ విలీనం గురించి పదో షెడ్యూల్లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరి వ్యాఖ్యలపై శ్రీధర్‌బాబు పైవిధంగా స్పందించారు. చదవండి : రాజ్యాంగం ప్రకారమే సీఎల్పీ విలీనం : రేగా కాంతారావు -
నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు
సాక్షి, హైదదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనడం అనైతికమని, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ప్రభుత్వం కొంటోందని ఆరోపించారు. తమ పార్టీ నాయకులతో కలిసి శాసనసభ ఎదుట రోడ్డుపై ఆయన నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికార పార్టీ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తమ ఎమ్మెల్యేలను కొంటోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల తీర్పును కేసీఆర్ అవమానపరిచారని, ఆంధ్రా కాంట్రాక్టర్ల సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. స్పీకర్ తమకు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని, అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్రగా వెళతామని ఉత్తమ్‌కుమార్ తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఉత్తమ్‌తో పాటు మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి.. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. (చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్) -
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేస్తోంది
సాక్షి, సంగారెడ్డి : ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటుందన్న విషయం మర్చిపోయి టీఆర్ఎస్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజమాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న జీవన్ రెడ్డిని విద్యావంతులు, ప్రజాస్వామ్య వాదులంతా కలిసి గెలిపించాలని కోరారు. జీవన్ రెడ్డి గెలుపు రాబోయే పార్లమెంట్, ఇతర ఎన్నికలల్లో ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువత, నిరుద్యోగుల ఆకాంక్షలు నేరవేరడం లేదన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని భావిస్తే.. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీ కూడా వేయలేదన్నారు. పీఆర్సీ ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు నిరత్సాహంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో పట్టాభద్రులు ప్రభుత్వాన్ని తట్టిలేపేలా తీర్పు ఇవ్వాలని కోరారు. -
‘అందుకే కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను’..
సాక్షి, సిద్దిపేట : అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడడానికి గొంతు ఉండకూడదనే కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో కలుపుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సిద్దిపేటలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు తాను, జీవన్ రెడ్డి ఇద్దరూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే 42 నియోజకవర్గాలలో ఉన్న సమస్యలపై మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. 22న జరిగే ఎన్నికల్లో జీవన్ రెడ్డిని గెలిపిస్తే! రేపు జరిగే ఎంపీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందన్నారు. 2024లో జరిగే ఎన్నికలకు నేడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక పునాది కావాలని ఆకాంక్షించారు. 5 ఏళ్ల పాలనలో లక్షా 80 వేల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రం రాకముందు 60వేల కోట్ల అప్పు ఉంటే, కేసీఆర్ 5 ఏళ్ల పాలనలో లక్షా 80వేల కోట్ల రూపాయలకు అప్పు చేరిందని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యంలో ప్రశ్నించే గొంతు ఉండాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ కుట్రతో ఎమ్మెల్యేలను లాక్కోవడంతో ఎమ్మెల్సీలను పొందలేక పోయామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో.. ఉద్యమాన్ని నడిపించిన విద్యార్థులు ఎమ్మెల్సీలను ఎన్నుకొనే అవకాశం వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చిన మొదటి ఏడాదిలో 2 లక్షల 40వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఇబ్బందు పడుతుంటే కేవలం 18 వేలు తప్ప మిగతావి పూర్తి చేయలేదన్నారు. 10వ పీఆర్సీ కాలం ముగిసిన ఉద్యోగులకు పీఆర్సీ పెంచలేదని తెలిపారు. పక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగులకు 10శాతం పీఆర్సీ ఇచ్చిందని, నిరుద్యోగులకు జీవనభృతి ఇస్తున్నారని వెల్లడించారు. మరి కేసీఆర్ ఏమిచ్చాడు అంటూ మండిపడ్డారు. -
ఫిర్యాదుతో పెరిగిన వేధింపులు
మంథని: సక్రమంగా విధులకు హాజరవుతున్నా.. వేతనంలో వాటా ఇవ్వడంలేదని వేధిస్తున్న అధికారిపై అంగన్వాడీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే అదికాస్త బెడిసికొట్టింది. ఫిర్యాదు తర్వాత వేధింపులు మరింత ఎక్కువ కావడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. మంథని సీడీపీవో పద్మశ్రీ తమను వేధిస్తున్నారని ప్రాజెక్టు పరిధిలోని సుమారు 80 అంగన్వాడీ టీచర్లు జనవరి 16న మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబుతోపాటు కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత నెల 13న జిల్లా సహకార, సంక్షేమ అధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి 57 మంది ఆంగన్వాడీ టీచర్లను వ్యక్తిగతంగా విచారణ చేశారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. సీడీపీవో ప్రతినెలా తమ వేతనం నుంచి బలవంతంగా రూ.3 వేలు వసూలు చేస్తున్నారని విచారణ అధికారికి తెలిపారు. ఇవ్వకుంటే అసభ్య పదజాలంతో ధూషిసూ భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరూ సీడీపీవోకు వ్యతిరేకంగా విచారణాధికారి ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో.. విచారణ నివేదికను కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారికి పంపిస్తామని చెప్పిన అధికారికి రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఉన్నట్లు అంగన్వాడీ టీచర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు తమకు కాకుండా సీడీపీవోకు అనుకూలంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా విచారణ నీరుగారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. విచారణ జరిపి 20 రోజులు కావస్తున్నా ఇప్పటికీ అధికారిపై ఎలాంటి చర్య లేకపోగా, తమపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన కేంద్రాలకు తనిఖీల పేరిట వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని బాధిత టీచర్లు పేర్కొంటున్నారు. తాము విధులు నిర్వహించే పరిస్థితి లేదని అంటున్నారు. పది రోజుల క్రితం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మి గుండెపోటుకు గురైందని తెలిపారు. గతంలో సైతం కన్నాల–1 కేంద్రం టీచర్ పక్షవాతానికి గురైందని, నాగెపల్లికి చెందిన సజన అస్వస్థకుగురై అనారోగ్యపాలైందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణలో పారదర్శత పాటించి తమను ఇబ్బందులకు గురుచేస్తున్న అధికారిపై చర్య తీసుకోవాలని పలువరు టీచర్లు కోరుతున్నారు. వేధింపులు నివారించండి అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా సీడీపీవో సూపర్వైజర్లు వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో అనేక మంది టీచర్లు అనారోగ్యబారిన పడుతున్నారు. న్యాయం కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ జరుగుతుండగా...అధికారి పార్టీకి చెందిన వారు టీచర్లకు సపోర్టు చేయకుండా అధికారి అనుకూలంగా మాట్లాడటం సరికాదు. –జ్యోతి, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి -
శ్రీధర్ బాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్లో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెండోరోజు శాసనసభ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పంచాయతీల నుంచి ఎలాంటి నిధులు తీసుకోలేదని, వాటి పటిష్టత కోసం కొత్త చట్టం తెచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. పంచాయతీరాజ్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని వ్యాఖ్యానించారు. జగిత్యాల మున్సిపాలిటీకి రూ.2కోట్ల బకాయిలు గత కాంగ్రెస్ ప్రభుత్వానిదేని అన్నారు. గ్రామ పంచాయతీలకు ఆర్థిక సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పంచాయతీలకు తగిన నిధులు ఇవ్వలేదని అన్నారు. వడ్డీ మాఫీ విషయంలోనూ రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుబంధు పధకంతో పాటు రైతులను ఆదుకోవాలని, అలాగే ఐఆర్ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని శ్రీధర్ బాబు సభలో ప్రస్తావించారు. మరోవైపు పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇవాళ సభలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. -
రెగ్యులర్ బడ్జెట్‌కు జంకెందుకు?: శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరమున్నా సీఎం కేసీఆర్ ఎందుకు జంకుతున్నారో అర్థం కావడం లేదని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ‘ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాకపోవడంతో అనేక అంశాలు అసంపూర్తిగా ఉన్నాయి. గత సెప్టెంబర్ 6 నుంచి మొన్నటి వరకు ఆపద్ధర్మ ప్రభుత్వంగానే ప్రజలు చూశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఇప్పటికీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో వివిధ ముఖ్యమైన అంశాలపై స్పష్టత కొరవడింది. మూడ్రోజుల పాటు జరిగే సమావేశంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని నిర్ణయించాం..’ అని చెప్పారు. -
క్లైమాక్స్‌లో డీసీసీలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కమిటీలపై కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాల కమిటీలను రద్దు చేసి ఏ జిల్లాకు ఆ జిల్లాగా కమిటీలు వేయాలని ఏఐసీసీ, టీపీసీసీ ఇప్పటికే ఆదేశించాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లికి జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఖరారు చేసే పనిలో నాయకత్వం నిమగ్నమైంది. ఏఐసీసీ, టీపీసీసీ అత్యవసర సమావేశం అనంతరం తక్షణమే జిల్లా కమిటీల ఏర్పాటు చేయాలని ఈ నెల 5న అన్ని జిల్లాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. మొదట ఈ నెల 10 వరకే కమిటీలను ఖరారు చేసి టీపీసీసీ పంపాలని సూచించినప్పటికీ గ్రామపంచాయతీ ఎన్నికలు, కమిటీల కోసం అక్కడక్కడ పోటీ తీవ్రంగా ఉండటం తదితర కారణాల వల్ల సాధ్యం కాలేదు. అయితే తక్షణమే కమిటీలను నియమించాలని మరోసారి టీపీసీసీ సూచించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కమిటీలను ప్రతిపాదించే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన నేతలు, సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ కమిటీలను నాలుగైదు రోజుల్లో అధికారులకు అందజేసే అవకాశం ఉందని తెలిసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్లకు ఖరారు... పెద్దపల్లి నుంచి ఫైనల్‌కు రెండు పేర్లు... జిల్లా కాంగ్రెస్ కమిటీల కసరత్తు తుది దశకు చేరుకుంటుండగా, ఆశావహులు సైతం పెరుగుతున్నారు. అయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు దాదాపుగా డీసీసీ అధ్యక్షులు ఖరారైనట్లేనని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కటకం మృత్యుంజయం పేరు మొదట్లో వినిపించినా.. ఆయన కరీంనగర్‌పైనే పట్టుతో ఉన్నట్లు చెప్తున్నారు. ‘సెస్’ మాజీ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సంగీత శ్రీనివాస్, ముడికె చంద్రశేఖర్ పేర్లు ప్రధానంగా వినిపించినా.. చివరకు నాగుల సత్యనారాయణగౌడ్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. జగిత్యాల జిల్లా నుంచి ప్రధానంగా జువ్వాడి నర్సింగరావు, అడ్లూరి లక్ష్మన్‌కుమార్, మద్దెల రవిందర్, బండ శంకర్ ఆశించినట్లు ప్రచారం జరిగింది. అయితే ధర్మపురి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి 400 పైచిలుకు తేడా ఓడిపోయిన అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌కు డీసీసీ పదవి దాదాపుగా ఖరారైనట్లే. ఇదిలా ఉండగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి రేసులో ప్రధానంగా పీసీసీ కార్యవర్గ సభ్యుడు ఈర్ల కొంరయ్య, చింతకుంట్ల విజయరమణారావు, చేతి ధర్మయ్య ఆసక్తిగా ఉండగా.. ఉమ్మడి జిల్లాలో రెండు గ్రూపులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతల్లో ఒకరు విజయరమణరావు పేరును, ఇంకొకరు ఈర్ల కొంరయ్యను సూచిస్తున్నట్లు సమాచారం. అయితే కూర్చుండి మాట్లాడేందుకు నిర్ణయించుకున్న ఈ గ్రూపుల నేతలు ఇద్దరిలో ఒకరి పేరును ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కరీంనగర్ డీసీసీపై పీటముడి...ససేమిరా అంటున్న ‘కటకం’ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన కటకం మృత్యుంజయం ఈసారి కూడా పట్టుబడుతుండటంతో కరీంనగర్ డీసీసీపై పీటముడి వీడటం లేదని తెలిసింది. కరీంనగర్ డీసీసీ పగ్గాల కోసం కటకం మృత్యుంజయంతో పాటు పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మేయర్ డి.శంకర్, ప్యాట రమేష్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్‌లతో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిలో ఏడెనిమిది మంది ఉన్నా.. చివరకు నలుగురి విషయంలో తర్జనభర్జన జరుగుతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన మృత్యుంజయం ఈసారి తప్పుకుం టారన్న ప్రచారం జరిగింది. కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందన్న చర్చ కూడా ఆ పార్టీలో కొనసాగుతోంది. అయితే మృత్యుం జయం కూడా గట్టిగా పట్టుబడుతుండటంతో కరీంనగర్‌పై ఎటూ తేల్చలేకపోతున్నారని తెలుస్తోంది. కాగా హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మేయర్ డి.శంకర్, పటేల్ రాజేందర్ పేర్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే ఉప్పుల అంజనీప్రసాద్, ప్యాట రమేష్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గందె మాధవి తదితరులు కూడా ఆశిస్తున్నామంటున్నారు. కీలకంగా పొన్నం, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు.. నాలుగు జిల్లాల కాంగ్రెస్ కమిటీలను త్వరలోనే ఖరారు చేసేందుకు టీపీసీసీ సీనియర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుందని సమాచారం. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్లో డీసీసీ రేసుకు దూరంగా ఉన్న పది మంది సీని యర్లను పరిగణలోకి తీసుకుంటుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అలాగే మాజీ విప్ ఆరెపెల్లి మోహన్, కేకే మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, డాక్టర్ మేడిపల్లి సత్యం, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తదితరులు కూడా డీసీసీల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలి సింది. ఏదేమైనా అధిష్టానం సూచనల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీలపై ఇప్పటికే ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే స్పష్టత రాగా, పెద్దపల్లిపైనా ఈర్ల కొంరయ్యకు లైన్‌క్లియర్ అయినట్లేనంటున్నారు. రెండుమూడు రోజుల్లో కరీంనగర్‌పై స్పష్టత వస్తే త్వరలోనే కమిటీలపై ప్రకటన వెలువడవచ్చని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ పేర్కొన్నారు. -
శ్రీధర్‌బాబు ఇంట్లో తనిఖీ
మంథని: మాజీ మంత్రి, మంథని అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి డి. శ్రీధర్‌బాబు ఇంట్లో గురువారం ఎన్నికల అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. మంథని పట్టణంలోని శ్రీధర్‌బాబు ఇంట్లో నగదు నిల్వలు ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంసీసీ ఎన్నికల అధికారులు సుమారు గంట పాటు తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి నగదు దొరకలేదని బృందం ఇన్చార్జి జయరాజ్ తెలిపారు. వీడియో కవరేజీలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని జయరాజ్ వివరించారు. -
కాంగ్రెస్ పార్టీలో చేరిక
మంథని: గుంజపడుగు గ్రామానికి చెందిన సుమారు 200 మంది మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో టీఆర్ఎస్, టీడీపీ, సీఎస్సార్ యువసేన నాయకులున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు మూల సరోజన, మండల పరిషత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ పూదరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ రాష్ట్రంగా తెలంగాణ తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కాని నేడు తెలంగాణ నిరుద్యోగ రాష్ట్రంగా మారిందని ఉస్మానియా యూనివర్సిటీ జేఎసీ చైర్మన్ నాగరాజు అన్నారు. మహాకూటమి అభ్యర్థి డి.శ్రీధర్‌బాబుకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీ పూర్వ విద్యార్థులు ఆదివారం మంథనిలో ప్రచారం నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు వినీత్ మాట్లాడారు. మహేశ్‌గౌడ్, భట్టు సాయి, రామకృష్ణ, నవీన్, రాము, సందీప్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, నాయుకులు వొడ్నాల శ్రీనివాస్, పోలు శివ, ఎల్లంకి వంశీ, బొబ్బిలి శ్రీధర్, మంథని సురేష్, టి.రాజు పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి... కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ముత్తారం జెడ్పీటీసీ సదానందం, టీపీసీసీ కార్యదర్శి జగన్మోహన్రావు అన్నారు. ముత్తారం గ్రామంలో ఆదివారం గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. మాజీ సర్పంచులు తాటిపాముల వకూళారాణి, గోవిందుల పద్మ, ఎంపీటీసీ పప్పు స్వరూప, నాయకులు బాలసాని మొగిళిగౌడ్, బుచ్చంరావ్, మద్దెల రాజయ్య, దుండె రాజేందర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పనితీరు నచ్చకే కాంగ్రెస్‌లో చేరికలు.. టీఆర్ఎస్ పార్టీ పని తీరు నచ్చకే ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ముత్తారం జెడ్పీటీసీ చొప్పరి సదానందం, టీపీసీసీ కార్యదర్శి జగన్మోహన్రావ్ అన్నారు. పోతారం గ్రామ టీఆర్ఎస్కు చెందిన నర్ర రవికుమార్, ముష్కె రాకేశ్, ముష్కె రామకృష్ణ, సాదుల సదయ్య, గడిచెర్ర శంకర్‌తోపాటు సుమారు 30 మంది ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. నాయకులు చెల్కల సుధీర్, జితేందర్, ప్రవీణ్, ఓదెలు, యుగేందర్, గాదం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారం లద్నాపూర్‌లో ఆదివారం గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక శ్రీగోదారంగనాయక, శ్రీదాసాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీటీసీ వనం రాంచందర్‌రావు, మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, మండల అధ్యక్షుడు తోట చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి బండారి సదానందం, నాయకులు రొడ్డ బాపు, ముడుసు ఓదెలు, గొర్రె నరేష్, మల్లెంపల్లి శ్రీనివాస్, అడ్డూరి ప్రవీణ్, తొగరి చంద్రయ్య, మేడగోని రాంచందర్, వీరగోని లక్ష్మణ్, గండి ప్రశాంత్, పులి సాయి, గాజు రఘుపతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలపై భారం మోపిన టీఆర్ఎస్
మంథని: తెలంగాణ ఆవిర్భావ సమయంలో రూ.16వేల కోట్ల మిగులు బడ్టెట్‌లో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. నాల్గున్నర సంవత్సరాల్లో రూ.లక్ష కోట్లకు పైగా అప్పులను ప్రజలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిందని కాంగ్రెస్ అభ్యర్థి డి.శ్రీధర్‌బాబు విమర్శించారు. మంథని మండలం కన్నాల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం పూజలు నిర్వహించారు. మంథనిలోని దత్తాత్రేయ, మహాలక్ష్మితోపాటు ఇతర దేవాలయాల్లో పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా నామినేషన్ వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆయన వెంట కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్‌కాచే, టీపీసీసీ కార్యదర్శి నాగినేజి జగన్మోహన్రావు, మంథని, ముత్తారం జెడ్పీటీసీలు మూల సరోజన, చొప్పరి సదానందం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతియాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిక... మంథని: మంథని మండలం ఖాన్సాయిపేట గ్రామానికి చెందిన సుమారు 70 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు కుడుదుల రాము ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కొలకాని సమ్మయ్య, తాటి రాజయ్య, కొడిపే మల్లయ్య, సంతు, మల్లయ్య, దేవేందర్, రమేశ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి రోడ్డును చూస్తే తెలుస్తుంది.. టీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలో నాలుగున్నర సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మంథని, పెద్దపల్లి ప్రధాన రహదారి చూస్తే తెలుస్తుందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. రామగిరి మండలం సెంటినరీకాలనీలోని శ్రీసాయి గార్డెన్లో నిర్వహించనున్న కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కావడానికి వెళుతూ తెలంగాణ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఉమ్మడి కమాన్‌పూర్ జెడ్పీటీసీ, తెలంగాణ ఉద్యమకారుడు గంట వెంకటరమణారెడ్డి శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. గంట ఆధ్వర్యంలో ఎంపీటీసీ ముల్మూరి శ్రీనివాస్, కమాన్‌పూర్ సింగిల్‌విండో చైర్మన్ బాద్రపు బాపు, సెంటినరీకాలనీ టౌన్ మాజీ అధ్యక్షుడు కాపరబోయిన భాస్కర్, మాజీ ఉప సర్పంచ్ సమ్మయ్య, టీఆర్ఎస్ ఉమ్మడి కమాన్‌పూర్ మండల మహిళా అధ్యక్షురాలు అలుగు కృష్ణవేణి, నాయకులు కొయ్యడ సతీష్, మేకల మారుతి, ఎండీ జానీతోపాటు వివిధ పార్టీలకు చెందినవారు కాంగ్రెస్‌లో చేరారు. బుధవారంపేట మాజీ సర్పంచ్ బుచ్చన్న ఆధ్వర్యంలో పీఏసీఎస్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డితోపాటు 50 మంది చేరారు. మండల అధ్యక్షుడు చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి బండారి సదానందం, టీపీసీసీ కార్యదర్శి నాగినేని జగన్మోహన్రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతియాదవ్, జెడ్పీటీసీ చొప్పరి సదానందం, ఎంపీటీసీలు వనం రాంచందర్‌రావు, ముస్త్యాల శ్రీనివాస్, నాయకులు జగదీశ్వరావు, కర్రు నాగయ్య, గోమాస శ్రీనివాస్, శశిభూషన్‌కాచే తదితరులు పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారం రామగిరి మండలం లద్నాపూర్‌లో బుధవారం గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేయాలని గ్రామస్తులను కోరారు. ఎంపీటీసీ వనం రాంచందర్‌రావు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కలవేన శ్రీకాంత్, నాయకులు పుల్లెల్ల కొంరయ్య, కాల్వ శ్రీనివాస్, కన్నూరి వెంకటి, లింగయ్య, మాటేటి శ్రీనివాస్, తోకల రాకేష్, ఉగ్గె రమేశ్, సంగె మొండయ్య, పర్వతాలు, నూనేటి పోశమల్లు, మొగిళి సందీప్, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరినవారితో శ్రీధర్‌బాబు -
పేదోడి గుండెల్లో దేవుడిలా నిలిచిన వైఎస్సార్
మంథని: పేదవాడికి ఉపయోగపడే అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో దేవుడిగా నిలిచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. వైఎస్సార్ 69 వ జయంతి సంందర్భంగా మంథనిలోని ఆయన నివాసంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడిగా గొప్ప నాయకత్వాన్ని ప్రదర్శించారని, దేశంలో గొప్పవ్యక్తిగా పేరుపొందారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులంతా నేడు ఉన్నత చదువులు చదువుతున్నారంటే ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం చలవే అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శాతావాహన యూనివర్శిటీ, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్‌మానేరుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిచ్చిన మహానాయకుడన్నారు. మంథని నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని గుర్తు చేశారు. మంథనికి జేఎన్టీయూ కళాశాల, డిగ్రీ కళాశాలలో సైన్స్ విభాగం, మహదేవపూర్‌లో డిగ్రీ, పాలిటెక్నిక్ కశాశాలలు, ఐటీఐ కళాశాలతో పాటు అనేక రకాల ప్రొత్సాహం అందించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, టూ టీఎంసీ నిర్మాణాలకు 2008 శ్రీకారం చుట్టి సాగునీటి సమస్యకు సహకరించారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, నాయకులు సెగ్గెం రాజేశ్, మంథని సత్యం, ఆజీంఖాన్, పోలు శివ, గోటికార్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.