మూసీపై సీఎంకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
పేదలను నిలబెట్టాలనుకుంటున్నాం.. పడగొట్టడం మా ఉద్దేశం కాదు
ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు... పునరావాసం కోసం హైలెవల్ కమిటీ
మూసీ, హైడ్రా విషయంలో కలెక్టరేట్‌లలో హెల్ప్‌డెస్‌్కలు: మంత్రి డి.శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: అవకాశవాద శక్తులు మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయ ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ మొసలికన్నీరు కారుస్తోందని, భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇందుకోసం రూ.5వేలు ఇచ్చి సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లా డిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలను నిలబెట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, పడగొట్టాలన్నది కాదని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో చెరువులు, మూసీ ఆక్రమణలను తొలగిస్తున్నామని, ఇందులో నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని, వారిని కాపాడుకునే బాధ్య త తమదని భరోసా ఇచ్చారు. 35 బృందాలతో సామాజిక, ఆర్థిక సర్వే చేయిస్తున్నామని, వాక్‌టూ వర్క్ పద్ధతిలో నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కలి్పస్తామన్నారు. ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారన్నారు. పునరావాసం కోసం హైలెవల్ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. రివర్‌బెడ్‌లోని నివాసాలకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని, అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరేళ్లు చదివిస్తామని, మహిళలకు వడ్డీ లేని రుణాలిప్పిస్తామని చెప్పారు.
మూసీకి సంబంధించిన మాస్టర్‌ప్లాన్ బ్లూ ప్రింట్ తయారు చేశామని, పనులు పారదర్శకంగా చేపడతామని, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సంస్థలకే పనుల బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. మూసీ, హైడ్రా విషయంలో అనుమానాల నివృత్తికి అన్ని కలెక్టరేట్లలో హెల్ప్‌డెస్‌్కలు ఏర్పాటు చేస్తామన్నారు.
బీఆర్‌ఎస్‌కు మాట్లాడే నైతికహక్కు లేదు
భూనిర్వాసితుల విషయంలో మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యా నించారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలు సని ఎద్దేవా చేశారు. పేదలు, మధ్యతరగతి నివాసాల విషయంలో ప్రభుత్వం తొందరపడబోదని చెప్పిన శ్రీధర్‌బాబు అడ్డగోలుగా అనుమతులిచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, అడ్డంకులు సృష్టించాలనుకునే బీఆర్‌ఎస్ ప్రయత్నాలను నమ్మొద్దని కోరారు. హైడ్రా విషయంలో ఎవరైనా ఒక్కటేనని, సీఎం రేవంత్ సోదరుడికి కూడా నోటీసులిచ్చామని గుర్తు చేశారు. తాము భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఆదర్శవంతమైన కార్యక్రమంతో ముందుకెళుతుంటే రాజకీయ కక్షపూరిత వైఖరితో తప్పు డు ప్రచారాలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గమనించాలని మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment