ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
మంథనిలో సెంటెలియన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ బ్రాంచ్‌ను ప్రారంభించిన మంత్రి
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో త్వరలో స్కిల్స్ సెంటర్‌ను స్థాపించి విద్యార్థులకు వివిధ రంగాల్లో అవసరమైన శిక్షణ అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శనివారం ఆయన పట్టణంలో సెంటెలియన్ నెట్‌వర్క్ సాఫ్ట్‌వేర్ కంపెనీ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత్, అమెరికా, ఆ్రస్టేలియాతోపాటు మరో ఆరు దేశాల్లో వెయ్యి మంది ఉద్యోగులతో నడిచే ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ డైరెక్టర్లు రాధాకిశోర్, వెంకట్ తనకు మంచి మిత్రులన్నారు.
మంత్రిగా తాను ప్రమాణ స్వీకా రం చేసిన సందర్భంగా వారు అభినందించడానికి వచ్చారని, ఆ సమయంలో ఈ ప్రాంతానికి ఉపయోగపడేలా కంపెనీ బ్రాంచ్‌ను మంథనిలో ఏర్పాటు చేయాలని, అప్పుడే తనకు నిజమైన గౌరవం దక్కుతుందని సూచించానన్నారు. ఇక్కడ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యాలయం ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యాలయానికి అవసరమైన సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్ రాధాకిశోర్, మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రమ, వైస్ చైర్మన్ సీపతి బానయ్య, సింగిల్‌విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment