సాక్షి, కరీంనగర్ : సిర్పూర్ కాగజ్ నగర్ మహిళా అటవీ అధికారిణిపై జరిగిన దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు సరిగాలేదని మండిపడ్డారు. గిరిజనుల పోడుభూముల సమస్య పరిష్కారిస్తామన్న సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపటం లేదని ఆయన ప్రశ్నించారు. సీఎం గిరిజనులకు పోడు భూములు ఇవ్వమంటుంటే.. అధికారులేమో వాటిని లాక్కుంటామంటున్నారు, ఇదెక్కడి న్యాయమంటూ దుయ్యబట్టారు. పోలీసుల దాడులతో గిరిజనులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటును గమనించి.. టీఆర్‌ఎస్ సర్కార్ మేల్కోవాలని సూచించారు. పోడుభూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ.. పోరాడతామన్నారు. అటవీ అధికారులపై టీఆర్‌ఎస్ నేతలు దాడి చేశారని, చట్టాన్ని చేతిలోకి తీసుకున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment