
సాక్షి, హైదరాబాద్: రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరమున్నా సీఎం కేసీఆర్ ఎందుకు జంకుతున్నారో అర్థం కావడం లేదని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ‘ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాకపోవడంతో అనేక అంశాలు అసంపూర్తిగా ఉన్నాయి. గత సెప్టెంబర్ 6 నుంచి మొన్నటి వరకు ఆపద్ధర్మ ప్రభుత్వంగానే ప్రజలు చూశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఇప్పటికీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో వివిధ ముఖ్యమైన అంశాలపై స్పష్టత కొరవడింది. మూడ్రోజుల పాటు జరిగే సమావేశంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని నిర్ణయించాం..’ అని చెప్పారు.