సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరిస్తూ బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 29వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
వివరాల ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో నెల 29వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ సందర్శించనున్నారు. 29వ తేదీన మంత్రులు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకుంటారు. అనంతరం, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ప్రాణిహిత, కాళేశ్వరం ప్రాజెక్ట్ వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల జరిగిన లాభ, నష్టాలను వివరించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మంత్రులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం.. కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలను వెల్లడించనున్నారు. ప్రాజెక్ట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్‌పై ప్రభుత్వం స్పష్టతనివ్వనుంది. అలాగే, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌ల సమస్యలు, వాటి పరిష్కారాలు, తదితర అంశాలపై ప్రభుత్వం సమీక్ష చేయనుంది. ఈ పర్యటనకు సంబంధించి నిర్మాణ సంస్థలకు సబ్ కాంట్రాక్టర్లలకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికి సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోగలరని మంత్రులు ఈఎన్‌సీని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: రూ. 500 గ్యాస్ సిలిండర్.. ఈ కేవైసీ అవసరం లేదు..!
Comments
Please login to add a commentAdd a comment