సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్ నేతలు ఇష్టానుసారం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ కార్యక్రమాలను కావాలనే ప్రభుత్వం బద్నాం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై పీసీసీ స్పందనే తన స్పందన అని చెప్పుకొచ్చారు. అలాగే, హైడ్రాకు ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించిందన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మూసీ అభివృద్ధి, సంక్షేమంపై చాలెంజ్ చేస్తాం. కత్తుల యుద్ధం చేస్తా అంటే నాలుగేళ్ల తర్వాత చేద్దాం. సంచులు మోసింది వాళ్లే అందుకే అదే గుర్తుకు వస్తుంది. ఇష్టారాజ్యం, అడ్డుగోలుగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తే సహించేది లేదు. పార్టీ పరంగా ఏమైనా తప్పులు జరిగితే రాహుల్ గాంధీ సరిచేస్తారు. అంతేగానీ మూసీ ప్రాజెక్ట్‌కు రాహుల్ గాంధీకి ఏం సంబంధం లేదు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసి రెండు రోజులు వార్తల్లో ఉండాలి అనుకుంటున్నారు.
డిజిటల్ కార్డుల కార్యక్రమంలో ఈటల రాజేందర్‌కు ఆహ్వానం అందలేదు అంటే సమీక్ష చేస్తాం. ప్రోటోకాల్ అంశంలో ఎక్కడ తప్పు జరిగిందో రివ్యూ చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలను కావాలనే బీఆర్‌ఎస్ నేతలు బద్నాం చేస్తున్నారు. జహీరాబాద్‌కు పొల్యూషన్ కంపెనీలు అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. జహీరాబాద్‌కు త్వరలో హ్యుందాయ్ సంస్థ వస్తుంది.. అది పొల్యూషన్ సంస్థనా?. తెలంగాణ నుంచి కంపెనీలు తరలి వెళ్తున్నాయి అనేది అవాస్తవం.
కొండా సురేఖ వ్యాఖ్యలపై పీసీసీ స్పందనే నా స్పందన. నేను ఇప్పటి వరకు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు.. చేయను. కేటీఆర్, బండి సంజయ్, హరీష్ రావు నా మిత్రులు. కేవలం రాజకీయ అభిప్రాయాలు మాత్రమే వేరు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment