Mallanna Sagar
-
‘మల్లన్నసాగర్’పై ‘ఎన్జీటీ’ విచారణ
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ప్రధాన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఏ అధ్యయనమూ చేయలేదు. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరపలేదు. తొందరపాటుతో డ్రాయింగ్స్‌ను ఆమోదించి భూకంప జోన్లో మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించారంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) నివేదిక సమర్పించింది’అంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తను ఎన్జీటీ సుమోటోగా పరిగణించింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ, జిల్లా డిప్యూటీ కలెక్టర్, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణమార్పుల మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్) కార్యద ర్శిని ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. అనంతరం చెన్నైలోని ఎన్జీటీ సదరన్ జోన్ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. గత నెల 7న విచారణ నిర్వహించిన చెన్నై ఎన్జీటీ ధర్మాసనం.. ‘మల్లన్నసాగర్’ను సందర్శించి నివేదిక సమర్పించాలని జిల్లా డిప్యూటీ కలెక్టర్, నీటిపారుదల శాఖను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 11న నిర్వహించనుంది. ‘సిక్కిం’ డ్యామ్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. గతేడాది సిక్కింలోని లోహ్నాక్ వాగుకు గండి పడడంతో తీస్తా నదికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. దీంతో చుంగ్తాంగ్ వద్ద తీస్తాపై నిర్మించిన 1,200 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు కమ్ డ్యామ్ కొట్టుకుపోగా, పలు మరణాలతోపాటు భారీనష్టం వాటిల్లింది. దీనిపై గతంలో ఎన్జీటీ–ఢిల్లీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. మల్లన్నసాగర్ సైతం ఇదే తరహా అంశమని భావిస్తూ దానిపై సైతం విచారణ నిర్వహిస్తామని ఎన్జీటీ–ఢిల్లీ స్పష్టం చేసింది. భూకంపాల సంభావ్యతకు సంబంధించిన అధ్యయనాల్లేకుండా మల్లన్నసాగర్ నిర్మాణంతో ఏదైనా విపత్తు జరిగితే అమలు చేయాల్సిన అత్యవసర కార్యాచరణ ప్రణాళిక సైతం రూపొందించకపోవడం ద్వారా ప్రభుత్వం రిజర్వాయర్‌తోపాటు దిగువ ప్రాంతాల ప్రజల ప్రాణాలను ప్రమాదంలో నెట్టేసిందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసిందని ఈ సందర్భంగా ఎన్జీటీ గుర్తు చేసింది. మల్లన్నసాగర్ గర్భంలో 3 జతల పగుళ్లు మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించడానికి ముందే సైట్లో భూకంపాలు సంభవించడానికి ఉన్న అవకాశాలపై ఎన్జీఆర్ఐతో అధ్య యనం జరిపించాలని షరతు విధిస్తూ ప్రాజెక్టు ప్రాథమిక డ్రాయింగ్స్‌ను 2016 ఆగస్టులో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు. ఈ అధ్యయనాలు నిర్వహించాలని నీటిపారుదలశాఖ 2016 డిసెంబర్, ఆగస్టు 2017, అక్టోబర్ 2017లో హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ డైరెక్టర్‌కు లేఖలు రాసింది. అధ్యయన నివేదిక వచ్చే వరకు వేచిచూడకుండానే, 2017లో నీటిపారుదలశాఖ మల్లన్నసాగర్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. మరోవైపు మల్లన్నసాగర్‌ను ప్రతిపాదించిన ప్రాంత భూగర్భంలో అత్యంత లోతు వరకు నిలువునా 3 జతల పగుళ్లు, వాటిలో కదలికలూ ఉన్నట్టు ఎన్జీఆర్ఐ 2017 మార్చిలో సమర్పించిన ప్రాథమిక నివేదికలో తేల్చి చెప్పిందని కాగ్ బయటపెట్టింది. వీటి ద్వారా ఉండనున్న ప్రభావంపై సమగ్ర సర్వే, పరిశోధనలు చేయా లని సిఫారసులు చేసింది. ఈ ప్రాంతానికి ఉన్న భూకంపాల చరిత్రను ఉటంకిస్తూ సమగ్ర అధ్యయనం జరిపించాలని కోరింది. ఈ సిఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ విస్మరించిందని కాగ్ ఆక్షేపణలు తెలిపింది. -
హైదరాబాద్‌కు మల్లన్నసాగర్ జలాలు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మంచి ‘నీటి’కబురు చెప్పింది. నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి మంచినీటి సరఫరా ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ మంగళవారం ఉత్తర్వులు (జీవో నంబర్ 345) జారీ చేశారు. ఈ పథకం ద్వారా నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను పునరుజ్జీవింప చేయనుంది. హైబ్రిడ్ యాన్యుటీ (బీఓటీ + ఈపీసీ) మోడ్‌లో పనులు పూర్తి చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు వివిధ మార్గాల ద్వారా 580 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే)ల నుంచి 600 ఎంజీడీల నీటి సరఫరా జరుగుతోంది. అయితే 2030వ సంవత్సరం వరకు నీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని అదనంగా 170 ఎంజీడీల జలాల్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో ఈ అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్–2ను చేపట్టాలని నిర్ణయించింది. 2030వ సంవత్సరం నాటికి హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 750 ఎంజీడీలకు పెరుగుతుందనే అంచనా ఉండగా, 2050 నాటికి ఇది 1,014 ఎంజీడీలకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. డీపీఆర్ సిద్ధం చేసిన వాప్కోస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను వాప్కోస్ కంపెనీ సిద్ధం చేసింది. ప్రాజెక్టులో భాగంగా పంప్‌హౌస్‌లు, సబ్స్టేషన్లు, మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ వరకు 3,600 ఎంఎం డయా భారీ పైప్‌లైన్ నిర్మించనున్నారు. ఘన్పూర్ వద్ద 780 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపడతారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎస్టీపీ (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.3849.10 కోట్లు కేటాయించింది. తాజాగా రూ.5,560 కోట్లు కేటాయించడంతో మొత్తంగా నగరానికి రూ.9410 కోట్లు కేటాయించినట్లయింది. మొత్తం 15 టీఎంసీల తరలింపుగోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్ల్యూఎస్) పథకం ఫేజ్–1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీటిని తరలిస్తోంది. తాజాగా రెండో దశ పథకం ద్వారా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 15 టీఎంసీల్లో 10 టీఎంసీల నీటిని నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగతా ఐదు టీఎంసీల నీటిని మూసీ ప్రక్షాళనతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను పునరుజ్జీవింప చేసేందుకు ఉపయోగించనున్నారు. -
భూకంప జోన్లో మల్లన్నసాగర్
సాక్షి, హైదరాబాద్: తగిన అధ్యయనాలు, పరిశోధనలు చేయకుండానే మల్లన్నసాగర్ రిజర్వాయర్ డ్రాయింగ్లను ఆమోదించి, నిర్మాణం చేపట్టారని ‘కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పేర్కొంది. మల్లన్నసాగర్ ప్రాంత భూగర్భంలో చాలా లోతు వరకు నిలువునా చీలికలు, కదలికలు ఉన్నాయని.. భూకంపాలకు అవకాశం ఉందని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) తమ ప్రాథమిక నివేదికలో పేర్కొందని గుర్తు చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ సిఫార్సులను పట్టించుకోకుండా.. తగిన సర్వేలు, అధ్యయనాలు చేపట్టకుండానే రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిందని తప్పుపట్టింది. ఒకవేళ భూకంపం వస్తే సమీప ప్రాంతాల ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మూడేళ్లుగా సమగ్ర ఆడిట్ నిర్వహించిన కాగ్.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ముసాయిదా నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో పేర్కొన్న అంశాలివీ.. సగం ఆయకట్టు మల్లన్నసాగర్ కిందే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద జలాశయమైన మల్లన్నసాగర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. దీని కింద 10.3లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన మొత్తం ఆయకట్టులో ఇది సగానికికన్నా ఎక్కువ. 2017 అక్టోబర్‌లో మల్లన్నసాగర్ నిర్మాణాన్ని ప్రారంభించగా.. మార్చి 2022 నాటికి రూ.6,126 కోట్లు విలువైన పనులు చేశారు. గత సీఎం 2020 ఫిబ్రవరిలో దీనిని ప్రారంభించారు. అధ్యయనం జరపాలని కోరినా... మల్లన్నసాగర్ ప్రాథమిక డ్రాయింగ్స్‌ను 2016 ఆగస్టులో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు. అయితే నిర్మాణం ప్రారంభించడానికి ముందే ఆ ప్రాంతంలో భూకంపాలు సంభవించడానికి ఉన్న అవకాశాలపై (సైట్ స్పెసిఫిక్ సీస్మిక్ స్టడీస్) నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) వంటి సంస్థలతో అధ్యయనం జరిపించాలని సూచించారు. దీంతో సంబంధిత అధ్యయనాలు నిర్వహించాలని నీటిపారుదల శాఖ హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ డైరెక్టర్‌కు లేఖలు రాసింది. కానీ ఆ అధ్యయన నివేదిక వచ్చే వరకు వేచిచూడకుండానే.. 2017లో ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించింది. తర్వాత ఎన్జీఆర్ఐ నివేదిక ఇచ్చింది. భూకంపాలకు అవకాశం ఉందంటూ.. దేశంలో భూకంపాల సంభావ్యత తక్కువగా ఉండే సీస్మిక్ జోన్–2లో తెలంగాణ ఉన్నా.. 1967లో కోయినాలో, 1993లో లాతూర్‌లో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపాలతో.. జోన్–2 ప్రాంతం కూడా భూకంపాలకు అతీతం కాదని తేలిందని ఎన్జీఆర్ఐ నివేదికలో పేర్కొంది. ఇటీవలికాలంలో ఒంగోలు, లాతూర్‌లో వచి్చన భూకంపాలతో తెలంగాణలోనూ ప్రకంపనలు వచ్చాయని, ఇక్కడి నిర్మాణాలకు స్వల్పంగా నష్టం జరిగిందని తెలిపింది. 1969లో భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో వచి్చన భూకంపంతో దక్షిణ భారతదేశం అంతా ప్రకంపనలు కనిపించాయని పేర్కొంది. 1983 జూన్‌లో హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ ప్రాంతంలో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని.. దాని ప్రభావం 200 కిలోమీటర్ల వరకు కనిపించిందని గుర్తు చేసింది. నాటి భూకంప కేంద్రం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉందని స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఇక్కడ 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే తట్టుకునేలా కట్టని (నాన్ ఇంజనీర్డ్) నిర్మాణాలు దెబ్బతింటాయని పేర్కొంది. మల్లన్నసాగర్ ప్రాంతంలోని భూగర్భంలో చాలా లోతు వరకు నిలువునా మూడు జతల చీలికలు (3 సెట్స్ ఆఫ్ డామినెంట్ లీనమెంట్) ఉన్నాయని.. కదలికలు కూడా చోటుచేసుకుంటున్నాయని నివేదికలో తెలిపింది. వీటితో పడే ప్రభావంపై సమగ్ర సర్వే, పరిశోధనలు చేయాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పట్టించుకోకుండా, అధ్యయనాలు చేపట్టకుండానే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో నీటిపారుదల శాఖ ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో మల్లన్నసాగర్ దృఢత్వం, భూకంపం వస్తే జరిగే విపత్తు తీవ్ర ఆందోళన కలిగించే అంశాలేనని కాగ్ పేర్కొంది. అత్యవసరంగా డ్రాయింగ్స్కు ఆమోదం మల్లన్నసాగర్ నిర్మిత ప్రాంతంలో భూకంపాల సంభావ్యతపై అధ్యయనాలు లేవని.. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అత్యవసర పరిస్థితిలో రిజర్వాయర్ డ్రాయింగ్స్‌ను ఆమోదిస్తున్నామని సీడీఓ చీఫ్ ఇంజనీర్ పదేపదే పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ డ్రాయింగ్స్ సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, ఐఐటీ–రూర్కి’ల నుంచి ఈ డ్రాయింగ్స్కు తదుపరి ఆమోదం(వెట్టింగ్) తీసుకోవాలని కూడా సూచించారు. కానీ నీటిపారుదల శాఖ సదరు సంస్థలతో వెట్టింగ్ చేయించినట్టు ఎలాంటి రికార్డులు లేవని కాగ్ పేర్కొంది. మల్లన్నసాగర్ నిర్మాణం 95శాతం పూర్తయ్యాక 2021 జనవరిలో ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలైన డిజైన్లు, స్థిరత్వ విశ్లేషణలు, డిజైన్లకు వెట్టింగ్ కోసం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయడం విడ్డూరమని స్పష్టం చేసింది. ఆ కమిటీ ఇప్పటివరకు ఎలాంటి సమావేశాలు జరపలేదని, ఎలాంటి నివేదిక సైతం ఇవ్వలేదని పేర్కొంది. ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం ఒకవేళ ఏదైనా విపత్తు సంభవించి మల్లన్నసాగర్ డ్యామ్ దెబ్బతింటే.. ప్రాణ, ఆస్తి నష్టం నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్’ ఓ నివేదిక సమర్పించింది. మల్లన్నసాగర్లో నీళ్లు నింపడానికి ముందే ఈ నివేదికలోని అంశాలకు అనుగుణంగా ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేయాలని సూచించింది. మల్లన్నసాగర్లో 2021 ఆగస్టు నుంచి నీళ్లు నింపడం ప్రారంభించగా.. ఇప్పటివరకు ఎమర్జెన్సీ ప్లాన్‌ను తయారు చేయలేదని కాగ్ ఆక్షేపించింది. ఒకవేళ్ల మల్లన్నసాగర్‌కు ప్రమాదం జరిగితే.. సమీప ప్రాంతాల్లోని ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు ఉంటుందని హెచ్చరించింది. -
‘మల్లన్నసాగర్’ గెజిట్ ప్రింటింగ్‌కు రాసిన లేఖ సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం సిద్దిపేట జిల్లా ముట్రాజ్‌పల్లిలో భూసేకర ణకు సంబంధించి గెజిట్ జారీ కోసం ప్రింటింగ్‌కు రాసిన లేఖను సమర్పించాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టును తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. చేసిన పనులను సమర్థించుకునేందుకు తప్పులు చేస్తే సహించేది లేదని చెప్పింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. ఆర్ అండ్ ఆర్ కాలనీ కోసం 102 ఎకరాల సేకరణ నిమిత్తం 2021, జనవరి 31న ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ బాలాజీ స్పిన్నర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని సింగిల్ జడ్జి కొట్టివేయడంతో అప్పీల్ వేసింది. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. గతంలో గెజిట్ జారీకి సంబంధించి రిజిస్టర్లో ఎంట్రీలు నమోదు చేసిన వారి వివరాలను ప్రభుత్వ న్యాయవాది సంజీవ్‌కుమార్ అందజేశారు. -
సిద్ధమవుతున్న ‘మల్లన్నసాగర్ భగీరథ’
గజ్వేల్: ‘మల్లన్నసాగర్ భగీరథ పథకం’సిద్ధమవుతోంది. మార్చి నెలాఖరులోగా ఈ పథకం పనులను పూర్తి చేయడానికి సంబంధిత యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు ఇక ఇక్కడి నుంచే మంచినీటి సరఫరా జరగనుంది. ప్రస్తుతం ఈ జిల్లాలకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే పైప్‌లైన్ నుంచి నీటిని సరఫరా చేస్తుండగా, మార్చి తర్వాత దీనిని హైదరాబాద్‌కే పరిమితం చేసి.. ఈ పైప్‌లైన్‌కు సమాంతరంగా నిర్మిస్తున్న మల్లన్న సాగర్ భగీరథ కొత్త లైన్ ద్వారా మంచినీటి సరఫరా చేపట్టనున్నారు. ఈ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ శనివారం పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కొరత లేకుండా మల్లన్న సాగర్ నుంచి నీరు.. హైదరాబాద్‌లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి సుజలస్రవంతి పథకాన్ని పదేళ్ల క్రితం రూ.3,375 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు 186 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఈ లైన్ ద్వారా 735 ఎంఎల్డీ (మిలి యన్ లీటర్స్ పర్ డే) నీటి సరఫరా జరుగుతోంది. ఇందులో సిద్దిపేట, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు భగీరథ పథకం అవసరాల కోసం సుమారుగా 300 ఎంఎల్డీ నీటిని వాడుకుంటున్నారు. మిగతా నీరు హైదరాబాద్ అసరాలకు వెళ్తుంది. దీనివల్ల హైదరాబాద్‌కు వెళ్లే నీటిలో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా నీరు తక్కువగా వచ్చినప్పుడు ఈ జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలో గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ నీటిని మిషన్ భగీరథ కోసం వాడు కోవాలని నిర్ణయించారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద 540 ఎంఎల్డీ సామర్థ్యంతో చేపట్టిన డబ్ల్యూటీపీ పనులు పూర్తి కావొస్తున్నాయి. మార్చి నాటికి హైదరాబాద్ లైన్‌పై నీటిని తీసుకునే వాల్వులను మూసి వేయనున్నారు. సిద్దిపేట, జనగామ, యదాద్రి, సూర్యా పేట జిల్లాలకోసం మల్లన్నసాగర్ నుంచే లైన్లను నిర్మిస్తున్నారు. ఇబ్బంది లేకుండా నీటి సరఫరా.. మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం ద్వారా మొదటగా జనగామ జిల్లాకు నీటిని సరఫరా చేస్తారు. మల్లన్నసాగర్ నుంచి కొమురవెల్లి కమాన్ వద్ద గల ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా జనగామ జిల్లాకు తాగునీరు వెళ్లనుంది. ఇందుకోసం మల్లన్నసాగర్ నుంచి కొమురవెల్లి కమాన్ వరకు 6.9 కిలోమీటర్ల మేర ప్రత్యేక లైన్ నిర్మించారు. ప్రస్తుతం నీటిని తీసుకుంటున్న హైద రాబాద్ లైన్ వల్ల ఎప్పడైనా నీటి కొరత ఏర్పడితే తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడేవి. మార్చి తర్వాత అలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఇదే తరహాలో సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోనూ భగీరథ పథకానికి ప్రత్యేక వ్యవస్థను తీసు కురానున్నారు. స్మితా సబర్వాల్ పర్యటన సందర్భంగా మార్చి ఆఖరులోగా పనులు పూర్తి చేయడానికి దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి నెలాఖరులో పనులు పూర్తిచేయడమే లక్ష్యం నాలుగు జిల్లాల తాగునీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే ‘మల్లన్నసాగర్ భగీరథ పథకం’ఉద్దేశం. దీనికి సంబంధించి పనులు సాగుతున్నాయి. మార్చి నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తాం. – రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ, గజ్వేల్ -
‘జీవో నంబర్ 35.. ఆ భూసేకరణకు వర్తించదు’
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్లో జీవో నంబర్ 35ను పేర్కొనడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. మలన్నసాగర్ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం కోసం 102.13 ఎకరాల భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మలన్నసాగర్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే దీని నిర్మాణంలో భాగంగా ఇళ్లు కోల్పోయిన 8 గ్రామాల ప్రజలకు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ల గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం 102.13 ఎకరాలను సేకరించేందుకు 2021, జనవరి 30న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో జీవో 35ను ఇందులో చేర్చింది. ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ మండలం ముత్రాజ్‌పల్లికి చెందిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది గౌరారం రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నోటిఫికేషన్లో జీవో 35ను పేర్కొనడం చట్టవిరుద్ధమని చెప్పారు. నీటి ప్రాజెక్టులు, కాలువలు, స్పిల్‌వే.. లాంటి సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరిపే భూసేకరణకు మాత్రమే ఈ జీవోను వినియోగించాలి వెల్లడించారు. కానీ, ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ సర్వే, గ్రామ సభల ఆమోదం నుంచి తప్పించుకునేందుకు ఇళ్ల నిర్మాణం కోసం చేసే భూసేకరణలో ఈ జీవోను ఇచి్చందన్నారు. ఇళ్ల నిర్మాణానికి సరిపడా ప్రభుత్వ భూమి ఉన్నా.. సేకరిస్తున్నారని నివేదించారు. జీవో నం.35 ఈ నోటిఫికేషన్‌కు వర్తించదన్న వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. అధికారికంగా ‘విమోచన’ ఉత్సవాలు -
లంచమడుగుతున్రు.. ఏం జేయాలె సచ్చిపోతున్న: మల్లన్న సాగర్ నిర్వాసితుడు
గజ్వేల్/గజ్వేల్ రూరల్: ‘న్యాయంగా దక్కాల్సిన ఓపెన్ ప్లాట్ ఇవ్వాలని అడిగితే లంచమడుగుతున్నరు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయిన. ఇక సచ్చిపోతున్న’ అంటూ తల్లికి ఫోన్లో చెప్పి మల్లన్నసాగర్ ముంపు బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శనివారం ఈ విషాద సంఘటన జరిగింది. రావాల్సిన ఓపెన్ ప్లాట్ కోసం నెలల తరబడి తిరిగి.. తొగుట మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గొడుగు కిష్టయ్యకు ముగ్గురు కుమారులు రాజబాబు, దేవదాసు, రాజు ఉన్నారు. గ్రామంలో తండ్రితో పాటు ముగ్గురికి సంబంధించిన 1.18 ఎకరాల భూమి, ఇతర ఆస్తులను మల్లన్నసాగర్ కింద కోల్పోయారు. పరిహారం కింద అందరికీ కలిపి రూ.48.74 లక్షలు అందాయి. గ్రామం ఖాళీ అయ్యాక తండ్రి కిష్టయ్యకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాగా ఆయన ఆర్అండ్ఆర్ కాలనీలో ఉంటున్నాడు. ముగ్గురిలో రాజబాబు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. రెండో కుమారుడు దేవదాసు.. ఇటీవల అప్పు చేసి పట్టణంలో సుమారు 60 గజాల స్థలంలో చిన్నపాటి ఇల్లు నిర్మించుకొని అక్కడే ఉంటున్నాడు. తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఓపెన్ ప్లాట్ కోసం నెలల తరబడి సిద్దిపేట ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. శుక్రవారమూ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు దళారులు రూ.3 లక్షలు లంచమిస్తే పనవుతుందని.. లేదంటే ప్లాట్ రాకుండా చేస్తామని బెదిరించారు. దీంతో ప్లాట్ రాదేమోనని మనస్తాపం చెందాడు. ఇప్పుడే వస్తానని భార్యకు చెప్పి.. వెంటనే వస్తానని భార్య స్వప్నకు చెప్పి శుక్రవారం రాత్రి దేవదాసు బయటకు వెళ్లాడు. రాత్రి 11 దాటినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో స్వప్న కుటుంబీకులకు చెప్పింది. ఆ సమయంలో దేవదాసు తన తల్లికి ఫోన్ చేసి ‘ప్లాట్ కోసం ఎంత తిరుగుతున్నా వస్తలేదు.. బ్రోకర్లు లంచమడుగుతున్రు. ఇగ నేను సచ్చిపోతా’నని ఫోన్ పెట్టేశాడు. కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఆచూకీ లభించలేదు. తెల్లవారుజామున రాజిరెడ్డిపల్లి మార్గంలో ఓ చెట్టుకు ఉరేసుకొని శవమై కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దేవదాసు ఆత్మహత్యకు దళారులే కారణమంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఆర్డీవో వచ్చే వరకు కదిలేది లేదని కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డిని వివరణ కోరగా దేవదాసుకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూ.7.5 లక్షలు, ఇల్లుకు సంబంధించిన రూ. 5. 04 లక్షలు అందించామని, ఓపెన్ ప్లాటు వ్యవహారం పెండింగ్‌లో ఉందని తెలిపారు. దేవదాసు చాలా కాలంగా స్థానికంగా ఉండకపోవడం వల్లే ప్లాటు పెండింగ్‌లో పడిందన్నారు. -
కాల్వలకు బదులు పైప్లైన్లు
గజ్వేల్: మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం తీరు మారింది. రూ. 674 కోట్లతో రూపొందించాలనుకున్న ఈ పథకం డిజైన్ మార్చి కొత్త అంశాలను జోడించడంతో నిర్మాణ వ్యయం రూ. 1,100 కోట్లకు పెరగనుంది. గతంలో అక్కారం పంపుహౌస్ కాల్వలు, బస్వాపూర్ రిజర్వాయర్, మల్లన్నసాగర్ల నుంచి పైప్లైన్లు నిర్మించాలని అను కోగా తాజా డిజైన్‌లో మల్లన్నసాగర్ రిజర్వాయర్ స్టోరేజీ నుంచే పైప్లైన్లను నిర్మించాలనుకుంటున్నారు. హైదరాబాద్ జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,375 కోట్లతో గోదావరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టి పూర్తి చేసింది. ఇందుకోసం కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి ఏటా 10 టీఎంసీలను 186 కి.మీ. పైప్‌లైన్ ద్వారా తరలిస్తోంది. ప్రస్తుతం ప్రతిరోజూ 735 ఎంఎల్డీ నీటి సరఫరా జరుగుతుండగా ఇందులో సిద్దిపేట, జనగామ, యాదాద్రి, మేడ్చల్, మెదక్ జిల్లాల అవసరాల కోసం సుమారుగా 300 ఎంఎల్డీ నీటిని ట్యాపింగ్ పద్ధతిలో వాడుకుంటున్నారు. అయితే దీనివల్ల హైదరాబాద్‌కు నీటి తరలింపులో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా నీరు తక్కువగా వచ్చినప్పుడు ఆయా జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా మల్లన్నసాగర్ నీటిని మిషన్ భగీరథ కోసం వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ప్రస్తుతం 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తుండగా అందులో ఏటా 10 టీఎంసీలను తాగునీటి అవసరాలకు వాడుకోనున్నారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద రాష్ట్రంలోనే అతిపెద్దదిగా 540 ఎంఎల్డీ సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులు పూర్తికాగానే గతంలో హైదరాబాద్ లైన్‌పై ఉన్న ట్యాపింగ్‌లను మూసివేస్తారు. అంతేకాకుండా ఎల్లంపల్లి లైన్‌కు సమాంతరంగా మరో కొత్త లైన్‌ను నిర్మించాలనుకుంటున్నారు. సిద్దిపేట, యాదాద్రి, మెదక్ జిల్లాలకు మల్లన్నసాగర్ నుంచే లైన్లను నిర్మించే అవకాశం ఉండగా హైదరాబాద్ లైన్‌ను మాత్రం మల్లన్నసాగర్ నుంచి నిర్మిస్తారా లేక మల్లన్నసాగర్ ద్వారా నిండే కొండపోచమ్మసాగర్ నుంచి నిర్మిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కొండపోచమ్మసాగర్ నుంచి నిర్మిస్తే శామీర్‌పేట సమీపంలోని కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ద్వారా ఘనపూర్ డబ్ల్యూటీపీలో నీటిని శుద్ధి చేసి నగరవాసులకు అందిస్తారు. శాశ్వత పరిష్కారమే లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట, జనగామ, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. ముందుగా అనుకున్న డిజైన్‌లో కొన్ని మార్పులు చేశాం. మల్లన్నసాగర్‌ను ప్రధాన వనరుగా మార్చుకొని మంగోల్ వద్ద డబ్ల్యూటీపీ నిర్మించి అక్కడి నుంచి అయా జిల్లాలకు నీటిని సరఫరా చేస్తాం. – రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ, గజ్వేల్ ఈ వారంలో అధికారికంగా ‘మల్లన్న’ప్రారంభం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి నీటి మళ్లింపు ప్రక్రియను ఈ వారంలో అధికారికంగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన రిజర్వాయర్ పనులు ఆగస్టు మూడో వారానికే పూర్తవగా తుక్కాపూర్‌లోని 6 పంపులను ప్రారంభించడం ద్వారా మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోత సైతం అప్పుడే ఉంటుందని ఇంజనీర్లు భావించారు. అయితే దళితబంధు సహా ఇతర ప్రాధాన్యతా కార్యక్రమాల వల్ల ప్రభుత్వం దాన్ని కేవలం ట్రయల్ రన్‌కే పరిమితం చేసింది. ట్రయల్ రన్లో భాగంగా మోటార్లను పరీక్షిస్తూ సుమారు 4 టీఎంసీలను మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోశారు. స్థానిక ప్రవాహాల నుంచి మరో టీఎంసీ మేర నీరు చేరడంతో ప్రస్తుతం రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. రిజర్యాయర్‌లోకి మరో 5 టీఎంసీల నీటిని ఈ సీజన్లో నింపాలని ఇంజనీర్లు నిర్ణయించడంతో ఈ వారంలో సీఎం కేసీఆర్ మోటార్లను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది నుంచి మూడు నెలలకు ఒకసారి ఐదేసీ టీఎంసీల చొప్పున నీటిని నింపుకుంటూ నిల్వలను పెంచనున్నారు. మల్లన్నసాగర్‌లోకి గోదా వరి జలాల ఎత్తిపోతలపై ఒకట్రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ వర్గాలు తెలిపాయి. -
మల్లన్నసాగర్ ముంపు ఇళ్ల కూల్చివేతలో విషాదం
కొండపాక(గజ్వేల్): మల్లన్నసాగర్ ముంపు గ్రామ మైన ఎర్రవల్లిలో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండుప్రాణం బలైంది. రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేత చేపట్టిన క్రమంలో విద్యుత్ స్తంభం కూలి మీద పడటంతో ఓ యువకుడు మృతి చెందారు. వివరాలు.. సిద్దిపేట జిల్లా కొండపాక, తొగుట మండలాల సరిహద్దులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి ఆదివారం తెల్లవారుజామున గోదావరి నీటి తరలింపునకు ట్రయల్‌రన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎర్రవల్లిలో అధికారులు గుట్టుచప్పుడుకాకుండా ఇళ్లు కూల్చివేత చేపట్టారు. గజ్వేల్ మండలం ముట్రాజ్‌పల్లి శివారులోని డబుల్ బెడ్రూం ఇళ్లల్లో ఉంటున్న బాధితులు విషయం తెలుసుకొని శనివారంరాత్రి ఎర్రవల్లికి వచ్చి తమ ఇళ్లల్లోని సామాన్లను సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆరె కనకరాజు(28) తన ఇంట్లోంచి సామాన్లను బయటకు తీస్తుండగా ఆ పక్కనే ఇంటిని కూల్చివేస్తున్న జేసీబీ సమీపంలోని విద్యుత్‌స్తంభానికి బలంగా తగిలింది. దీంతో కరెంట్ తీగలు తెగిపోయి కనకరాజుపై స్తంభం పడిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే కనకరాజును అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యు లు ధ్రువీకరించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల కూల్చి వేత పనులెలా చేపడతారంటూ ఉస్మా నియా ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కనకరాజు కుటుంబానికి రూ.20 లక్షలు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ అధికారులు హామీనిచ్చే వరకు పోస్టుమార్టం చేయనివ్వబోమంటూ పట్టుబట్టారు. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి ఆసుపత్రి వద్దకు వెళ్లి బాధితకుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తామంటూ హామీనివ్వడంతో శాంతించారు. మృతుడికి రెండు న్నరేళ్ల కూతురు ఉంది. భార్య శ్యామల 4నెలల గర్భవతి. ఎర్రవల్లిలో నేలమట్టమైన ఇళ్లు ఎర్రవల్లిలో విషాదం ఎర్రవల్లికి చెందిన ఆరె నర్సయ్య– లక్ష్మికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. నర్సయ్య చిన్న కుమారుడే కనకరాజు. వారికున్న ఎకరం భూమిలో వర్షాధార పంటలే పండటంతో కనకరాజు బతుకుదెరువు కోసం హైదరబాద్‌కు వెళ్లాడు. ఊరు ముం పునకు గురవుతుందని తెలుసుకున్న ఇటీవల తిరిగి ఎర్రవల్లికి చేరుకొని కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. -
పానం బోయినా జాగ ఇయ్య !
సాక్షి, గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీలో మల్లన్నసాగర్ నిర్వాసితుల గృహప్రవేశాలు చేస్తుండగా.. మరోవైపు ఈ కాలనీ నిర్మాణంతో భూమి కోల్పోతున్న బాధితులు ఆందోళన బాట పడుతున్నారు. తాజాగా శుక్రవారం ముట్రాజ్‌పల్లికి చెందిన మర్కంటి అయోధ్యం కాలనీలో భూమిని చదును చేసే పనులను అడ్డుకున్నాడు. ‘పానం బోయిన సరే ఈ భూమి ఇయ్య’గతంలోనే నేను మూడెకరాల భూమి ఇచ్చిన. ఈ పట్టా భూమి కూడా గుంజుకుంటే నేనట్ల బతకాలే?’అంటూ ట్రాక్టర్‌కు అడ్డంగా పడుకొని పనులు ఆపేశాడు. రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తనను గోస పెడుతున్నారని కన్నీరు పెట్టుకున్నాడు. ఈనెల 4న పోలీసు పహారా మధ్య కాలనీలో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కోసమంటూ 332, 333 తదితర సర్వే నెంబర్లలో అధికారులు సుమారు 10 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో అయోధ్యంకు మూడు ఎకరాలు ఉంది. కాగా, మర్కంటి అయోధ్యం భూమిని చట్ట ప్రకారం స్వాధీనం చేసుకున్నామని, బాధితుడికి రావాల్సిన నష్ట పరిహారం ఇప్పటికే కోర్టులో డిపాజిట్ చేశామని గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి తెలిపారు. -
కరువు నేల.. మురిసే వేళ
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా సరిహద్దుకు చేరిన గోదారమ్మను రంగనాయక సాగర్‌లోకి వదిలేందుకు శుక్రవారం ముహూర్తం ఖరారు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ పంపులు ఆన్ చేసి గోదావరి జలాలను వదలనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సూర్యాపేట వరకు గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. గోదావరి నది నుంచి 500 మీటర్ల ఎత్తున ఉన్న సిద్దిపేట నుంచి సూర్యాపేట వరకు ఉన్న బీడు భూములు తడిపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే సీఎం కేసీఆర్ కల సాకారం కానుంది. నేడు రంగనాయక సాగర్‌లోకి గోదావరి అనంతగిరి సాగర్ రిజర్వాయర్ నుంచి పంపులు ఆన్ చేసి గోదావరి జలాలను రంగనాయక సాగర్‌కు వదలనున్నారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో ఈ రిజర్వాయర్ నిర్మించారు. దీని సామర్థ్యం 3 టీఎంసీలు. రిజర్వాయర్‌కు 8.6 కిలోమీటర్ల చుట్టూ భారీ కట్టను నిర్మించారు. కట్ట నిర్మాణం, దాని చుట్టూ రాతి కట్టడం, కట్టపై చమన్ ఏర్పాటుతో పాటు ఇంజనీరింగ్ అధికారుల కార్యాలయం, పర్యాటకులకు విశ్రాంతి భవనం నిర్మించారు. చదవండి: లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేసేదీ చెప్పలేం రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నంగునూరు, దుబ్బాక, చేర్యాల, మద్దూరు కోహెడతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. ఇలా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మొత్తం 409 చెరువులను గోదావరి జలాలతో నింపనున్నారు. సిద్దిపేట జిల్లాలో 78 వేల ఎకరాలకు, సిరిసిల్ల జిల్లాలోని 32 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వెంటనే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌కు.. రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట జిల్లాకు అడుగిడిన గోదావరి జలాలను వెంటనే జిల్లాలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ వరకు, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు తీసుకెళ్లేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. 24 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు 50టీఎంసీల సామర్థ్యం ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాలకు భారీ ప్రయోజనం కలగనుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణంలోని కొంత భూసేకరణ పూర్తి కాలేదు. దీంతో అప్పటి వరకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ వరకు చేరిన నీటిని కాల్వల ద్వారా చెరువుల్లోకి నింపడంతో పాటు, కింద ఉన్న కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించేందుకు 18 కిలో మీటర్ల మేరకు గ్రావిటీ కెనాల్ నిర్మించారు. దీంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్దకు చేరిన నీరు కొండపోచమ్మ సాగర్ వరకు చేరుతాయి. రంగనాయకసాగర్ పంప్‌హౌస్‌ను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు ‘కొండపోచమ్మ’తో 2.85 లక్షల ఆయకట్టుకు నీరు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో ‘కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. దీని సామర్ధ్యం 15 టీఎంసీలు. జగదేవ్‌పూర్, తుర్కపల్లి, గజ్వేల్, రామాయంపేట, కిష్టాపూర్, ఉప్పరపల్లి, శంకరంపేట, ఎం.తుర్కపల్లి మొత్తం ఎనిమిది ప్యాకేజీలతోపాటు సంగారెడ్డి కెనాల్ ద్వారా మొత్తం 2.85 లక్షల ఆయకట్టుకు నీరు అందిస్తారు. అలాగే.. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాకు సాగునీరు, తాగునీరు సరఫరాకు ఈ రిజర్వాయర్ ద్వారా నీరు అందిస్తారు. వీటితోపాటు బస్వాపూర్, గందమల్ల రిజర్వాయర్లతో అనుసంధానం చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట జిల్లాల వరకు సాగు నీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షా ఫలం కరువు నేలకు గోదావరి జలాలు తరలించి పునీతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షా ఫలితమే రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణం. సాగు నీటి కోసం బోర్లు వేసి బోర్లా పడిన రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఈ గడ్డకు ఉంది. స్వయానా రైతుగా కేసీఆర్ చూసిన కష్టాలను తీర్చే మార్గమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు గోదావరి జలాలు కరువు నేలను ముద్దాడాయి. ఈ ప్రాంతంలో కరువు అనేది గతం. సూర్యచంద్రులు ఉన్నంత కాలం సీఎం కేసీఆర్ కీర్తి నిలుస్తుంది. ఈ మహా యజ్ఞంలో భాగస్వామ్యమైన నా జన్మ చరితార్థమైంది. – హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి -
'డిండి' దారెటు?
సాక్షి, హైదరాబాద్: ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు రక్షి త మంచి నీటిని అందించే ఉద్దేశంతో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి మార్గదర్శనం కరువైంది. ఈ ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అలైన్‌మెంట్‌ను ఐదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఖరారు చేసినా, దీనికి ఇంతవరకూ ప్రభుత్వ ఆమోదం దక్కలేదు. పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ నుంచి కాకుం డా ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేందుకు ఇప్పటికే నీటి పారుదల శాఖ ఓకే చెప్పినా, ప్రభుత్వం ఇంకా నాన్చుతుండటంతో ఎటూ తేలడంలేదు. ఇక ఇప్పటికే మొదలైన రిజర్వాయర్ల పరిధిలోనూ భూసేకరణ, సహాయ పునరావాస పనుల్లో అనేక అవాంతరాలున్నా వాటిని పట్టించుకొని పరిష్కరించేవారే కరువయ్యారు. ఎట్టకేలకు కొలిక్కి వచ్చినా ముందుకు సాగలే... శ్రీశైలం నుంచి 30 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగిస్తూ, నాగర్ కర్నూల్, నల్లగొండ, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లోని 7 నియోజకవర్గాలు, 21 మండలాల పరిధిలోని 3.61 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేలా రూ.6,190 కోట్లతో డిండి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు 2015 జూన్ 11న సీఎం కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. అయి తే మొదట ఈ ప్రాజెక్టుకు పాలమూరు ఎత్తిపోతల్లోని రెండో రిజర్వాయర్ ఏదుల నుంచి రోజుకు 0.5 టీఎంసీ నీటిని 60 రోజుల పాటు 30 టీఎంసీల నీటిని తరలించేలా ప్రభుత్వం పరిపాలనా అనుమతులు సైతం ఇచ్చింది. అనంతరం తిరిగి పాలమూరు ప్రాజెక్టులోని మొదటి రిజర్వాయర్ నార్లాపూర్ నుంచే తీసుకునేలా ప్రణాళిక రూపొందించింది. అయితే ఈ ప్రతిపాదనలతో భూసేకరణ అవసరాలు ఎక్కువగా ఉండటం, అటవీ భూముల ముంపు సైతం ఉండటంతో తిరిగి ఏదుల నుంచే తీసుకోవాలని ఇటీవలే తుది నిర్ణయం తీసుకున్నారు. ఏదుల నుంచి 800 మీటర్ల మేర అప్రోచ్ చానల్, తర్వాత 2.52 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, అటునుంచి తిరిగి 16 కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా నీరు ప్రవహిస్తుంది. తర్వాత మళ్లీ 3 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్లో ప్రవహించి, సహజ సిద్ధ వాగులో కలసి, కొత్తగా ప్రతిపాదించిన ఉల్పర రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది. అటు నుంచి డిండికి నీటిని చేరుస్తారు. ఈ ప్రతిపాదనకు రూ.1,293.55 కోట్లు అవు తుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలను జనవరిలోనే ప్రభుత్వ అనుమతికై పంపినా ఇంతవరకు అనుమతులివ్వలేదు. దీంతో ఈ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని సమీక్షించి ఓకే చెబితే కానీ దీనికి అనుమతులు వచ్చేలా కనిపించడం లేదు. అనుమతులు వస్తే కానీ టెండర్లు పిలిచి పనులు చేపట్టడం సాధ్యం కాదు. భూసేకరణ నిధులకూ తంటాలు.. ఏదుల నుంచి డిండికి నీటిని తీసుకునే అలైన్మెంట్ ఖరారు కానుందున, అంతలోగా నల్లగొండ జిల్లాలో ఖరారైన సింగరాజుపల్లి (0.8టీఎంసీ), గొట్టిముక్కల (1.8 టీఎంసీ), చింతపల్లి (0.99 టీఎంసీ), కిష్ట రాంపల్లి(5.68 టీఎంసీ), శివన్నగూడం (11.96 టీఎంసీ) రిజర్వాయర్లు వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనులను ప్రభుత్వం రూ.3,929 కోట్లతో చేపట్టింది. వీటిలో ప్రధాన పనులు ఇప్ప టికే ఆరంభమయ్యాయి. ఈ రిజర్వాయర్ల కింద 16,135 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 8 వేల ఎకరాల మేర పూర్తి చేశారు. మరో 8 వేల ఎకరాలు ఎక్కడికక్కడే ఉంది. ఇక్కడ సేకరించిన భూములకు సం బంధించి రూ.181 కోట్ల మేర ఇంతవరకూ చెల్లించలేదు. దీంతో కొత్తగా భూ ములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. అదీగాక కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ రైతులకు ఇచ్చిన మాదిరే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కిష్టరాంపల్లి, చింతపల్లి రిజర్వాయర్ పరిధిలోని ముంపు గ్రామాలు ప్రభుత్వం ప్రకటించిన దానికన్నా ఎక్కువ పరిహారం కోరుతున్నా యి. ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపితేనే ప్రాజెక్టులో కదలిక వస్తుంది. -
అనంతగిరికి ఆఖరి ఘడియలు
సిరిసిల్ల: అనంతగిరి గ్రామం జలసమాధి కాబోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరికి ఆఖరి ఘడియలు సమీపించాయి. ఊరు ఖాళీ చేసేదిలేదని నిర్వాసితులు భీష్మించుకుని కూర్చున్నా.. ఎలాగైనా ఖాళీ చేయించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఎస్సీ కాలనీని ముందుగా ఖాళీ చేయించనున్నారు. నిర్వాసితులకు ‘అనంత’కష్టాలు: అనంతగిరిలో 837 కుటుంబాలు ఉన్నాయి. ప్రాజెక్టు ప్యాకేజీలను 735 కుటుంబాలకు అందించారు. మిగతా కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. నిబంధనల మేరకు వీరికి 102 ఇళ్లను అధికారులు అనంతగిరి శివారుల్లో నిర్మించి ఉంచారు. కానీ, ఇప్పుడే నీరు వస్తుందని ఊహించని నిర్వాసితులు.. పునరావాస కాలనీల్లో ఇళ్లు కట్టుకోలేదు. ఇం కా ఎక్కడ ఉండాలో తేల్చుకోలేదు. ఈ క్రమంలో నిర్వాసితులు కన్నీరు పెడుతున్నారు. ఇవీ సమస్యలు: అనంతగిరిలో 2017 నాటికి 18 ఏళ్లు నిండిన యువతను కుటుంబాలుగా గుర్తించారు. ఆ జాబితా 1,135కు చేరింది. తంగళ్లపల్లి శివారులో 62 ఎకరాలు, అనంతగిరి పోచమ్మ ఆలయం సమీపంలో 70 ఎకరాల్లో పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. కానీ మౌలిక వసతులు లేవు. ఇప్పటికే 737 కుటుంబాలకు రూ.7.50 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ చెల్లించారు. 250 గజాల స్థలంతో కూడిన ఇంటి స్థలం ఇచ్చారు. నిర్వాసితులతో కలెక్టర్ కృష్ణభాస్కర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం చర్చించారు. తొలుత మంగళవారం 115 దళిత కుటుంబాలను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. మంగళ వారం ఊరు ఖాళీ చేయగానే, బుధవారం మధ్య మానేరు నుంచి నీళ్లు అనంతగిరిలోకి రానున్నాయి. సీఎం కేసీఆర్ సమీక్ష మధ్యమానేరు నుంచి గోదావరి జలాలు మల్లన్నసాగర్ వరకు చేర్చేందుకు అనంతగిరి వద్ద ఎదురవుతున్న ప్రతిబంధకాలపై సీఎంకేసీఆర్ సమీక్షిస్తున్నట్లు సమాచారం. అనంతగిరికి గోదావరి నీళ్లు చేరితే.. మల్లన్నసాగర్ వరకు నీళ్లు వస్తాయని సీఎం అన్నట్లు తెలిసింది. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామిరెడ్డి తో సీఎం మాట్లాడినట్లు సమాచారం. దీంతో అనంతగిరి నింపేందుకు పనులు సాగుతున్నాయి. -
‘ఆ గ్రామాల్లో మల్లన్నసాగర్ పనులు ఆపేయండి’
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని తోగుట, వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల్లో మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనుల్ని వారం రోజుల పాటు నిలిపేయాలని, ఆ గ్రామాల్లో నిలిపేసిన విద్యుత్‌ను తిరిగి సరఫరా చేయాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచి్చంది. తోగుట గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రాజెక్టు వల్ల నష్టపోయే వారికి పునరావాస చర్యలపై నివేదిక ఇవ్వాలని గత విచారణ సమయంలో హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడాన్ని రైతుల తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. రైతులు దాఖలు చేసిన రిట్లను శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. విచారణను 30కి వాయిదా వేసింది. -
మల్లన్న సాగర్ : హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, సిద్దిపేట : విధుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై రాష్ట్ర హైకోర్టు కొరడా ఝళిపించింది. మల్లన్నసాగర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిన గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి, తొగుట తహసీల్దార్ ప్రభుకు రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరికీ జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా, విధుల నుంచి సస్పెండ్ చేస్తూ తీర్పు నిచ్చింది. మల్లన్నసాగర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలో తీర్పు నిచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవడంతో తమకు న్యాయం జరగలేదని బాధితులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. నిర్వాసితుల పిటిషన్‌ను విచారించిన హైకోర్టు అధికారులకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. -
అధికారులకు విధించిన శిక్షపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్ : మల్లన్న సాగర్ రైతుల పరిహారం కేసు విచారణ నేడు హైకోర్టులో జరిగింది. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల పరిహారం విషయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ గతంలో అధికారులకు సింగిల్ బెంచ్ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో శిక్ష పొందిన సిద్దిపేట ఆర్డీవో జై చంద్రారెడ్డి, తోగూట తహసీల్దార్ వీర్ సింగ్, గజ్వేల్ ఇంజనీరింగ్ సూపరింటెండ్ వేణు సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన డివిజన్‌బెంచ్.. అధికారులకు విధించిన శిక్షను అమలు చేయరాదంటూ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
ఎన్నికలకు నో చెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు బుధవారం పలు కేసులను విచారించింది. ఈ సందర్భంగా మల్లన్నసాగర్ భూ వివాదం, మిర్యాలగూడ ఎన్నికలపై స్టే విధించగా సచివాలయం, ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. విచారణలో భాగంగా.. సచివాలయం, ఎర్రమంజిల్‌లో పురాతన భవనం కూల్చివేతల పిటిషన్‌పై ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు తమ వాదనలను వినిపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వం చట్టబద్దంగానే కూల్చివేతల నిర్ణయం తీసుకుంది. నిపుణుల సిఫారసు మేరకు కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వ పాలసీ విధానాలపై ప్రశ్నించే హక్కు పిటిషనర్లకు లేదు’ అని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఏ ప్రాతిపదికత ఆధారంగా పురాతన భవనాలను తొలగించారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దానికి ప్రభుత్వ తరపు న్యాయవాది వివరణనిస్తూ.. ఎర్రమంజిల్ పురాతన భవనం కాదని, హెరిటేజ్ జాబితాలో ఎర్రమంజిల్ భవనం లేదని చెప్పుకొచ్చారు. అనంతరం చారిత్రక కట్టడాల కూల్చివేతపై కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణనుసోమవారానికి వాయిదా వేసింది. విచారణ వాయిదా మల్లన్నసాగర్ భూ వివాదంలో ముగ్గురు అధికారులకు జైలు శిక్ష అమలును తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో రైతులకు న్యాయం చేయకుండా కోర్టును తప్పుదోవ పట్టించారని సింగిల్ బెంచ్ ముగ్గురికి జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఎన్నికలకు నో మిర్యాలగూడ, మహబూబ్‌నగర్ పురపాలక ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన సరిగా జరగలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, బుధవారం కోర్టు దీనిపై విచారణ చేపట్టింది. అనంతరం ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. -
మిడ్‌మానేరు ఎగువన 3.. దిగువన 2 టీఎంసీలు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నుంచి మూడో టీఎంసీ నీటిని తీసుకునేలా ఇప్పటికే బృహత్ కార్యాచరణకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, నీటిని తరలించే వ్యవస్థలకు సమగ్ర ప్రణాళికల తయారీలో పడింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించేలా సివిల్ పనులు జరుగుతుండగా, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా దిగువ మల్లన్నసాగర్ వరకు నీటిని తరలించే ప్రణాళికలకు పదును పెడతోంది. ప్రాజెక్టు ద్వారా గరిష్ట నీటి వినియోగం, వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేలా అధ్యయనం చేసి పనులకు శ్రీకారం చుట్టాలని శనివారం నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఎలాంటి నిర్మాణాలు అవసరమవుతాయా? ఎక్కడెక్కడ లిఫ్టులు, టన్నెళ్లు, పైప్‌లైన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, వ్యయ అంచనాలపై అధ్యయనం ఆరంభించింది. పత్తిపాక ఉంచాలా?.. వద్దా?.. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 3 టీఎంసీల నీటిని తరలించేలా ఇప్పటికే పనుల కొనసాగుతున్నాయి. అం దుకు తగ్గట్లే మేడిగడ్డ, అన్నరం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటు వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం.. ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు జరుగుతున్నాయి. మిడ్ మానేరుకు వచ్చే రెండు టీఎంసీల్లో ఒక టీఎంసీ నీటిని శ్రీరాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు తరలించేలా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టడంతో, మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ మొదలుకుని గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ వరకు ఒక టీఎంసీ నీరు మాత్ర మే లభ్యతగా ఉంటుంది. ఈ నీటితో ఆయకట్టు లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. దీన్ని దృ ష్టిలో పెట్టుకొని మిడ్‌మానేరు వరకు 3 టీఎంసీలు, ఆ దిగువన 2 టీఎంసీల నీటిని తరలించాలన్నది సీఎం యోచన. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలో సుమారు 10 టీఎంసీలతో పత్తిపాక రిజర్వా యర్‌ను సైతం ప్రతిపాదించారు. దీని నిర్మాణంపై భిన్నాభిప్రాయాలు ఉండటంతో ఉంచా లా? వద్దా? అన్న దానిపై అధ్యయనం చేయా లని ఇంజనీర్లను సీఎం ఆదేశించారు. దీన్ని కొనసాగించితే ప్రాజెక్టుకు రూ.13 వేల నుంచి రూ.14 వేల కోట్ల వ్యయం కానుంది. పత్తిపాక లేని పక్షంలో రూ.11 వేల కోట్లు కానుంది. ఇక మిడ్‌మానేరు దిగువన ప్రస్తుతం 12 వేల క్యూసెక్కులు (ఒక టీఎంసీ) మేర నీటిని తరలించేలా కాల్వలు, టన్నెళ్ల నిర్మాణాలు జరుగు తున్నాయి. ప్రస్తుతం 24వేల క్యూసెక్కుల (2 టీఎంసీ) నీటిని తరలించాలంటే మళ్లీ కొత్తగా లిఫ్టులు, పంప్‌హౌజ్‌లు, గ్రావిటీ కాల్వలు, టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉంది. టన్నెళ్ల నిర్మాణం చేస్తే సమయం ఎక్కువగా పట్టే నేపథ్యంలో పైప్‌లైన్ వ్యవస్థ వైపు సీఎం మొగ్గు చూపుతున్నారు. పైప్‌లైన్ వ్యవస్థ అయితే రూ.11 వేల కోట్లు, టన్నెల్ అయితే రూ.8 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే ఏ వ్యవస్థ సరైనదో నిర్ణయించి వారంలో నివేదించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ వ్యవస్థలకు అవసరమయ్యే సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తూనే, ప్రస్తుతం జరుగుతున్న పనుల ద్వారా కనిష్టంగా 3 వేల చెరువులను నింపాలని కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. అవసరమైన చోట్ల తూముల నిర్మాణం వేగిరం చేయాలని సూచించారు. -
రేపు మల్లన్నసాగర్ పరిశీలనకు సీఎం?
దుబ్బాక టౌన్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 5వ తేదీన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలనకు రానున్నట్లు విశ్వసనీయంగా తెలిపింది. సీఎం పర్యటన నేపథ్యంలోనే దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టర్, సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేములఘాట్ ప్రజలను కలెక్టర్ కృష్ణభాస్కర్ కలుస్తారని సమాచారం. దీంతోపాటు సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేసేందుకుగాను కలెక్టర్, అధికారులతో చర్చించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
కాళేశ్వరానికి ఇరుసు మల్లన్నసాగర్
సిద్దిపేటజోన్: కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ ఇరుసు లాంటిదని, ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీ 12 పనులను సోమవారం అర్ధరాత్రి సుమారు 3 గంటల పాటు మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. సిద్దిపేట మండలం వెంకటాపూర్ నుంచి తొగుట మండలం తుక్కాపూర్ వరకు సొరంగంలోనే కలియ తిరిగారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మల్లన్నసాగర్ సొరంగం, పంప్‌హౌస్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ వైపు మల్లన్నసాగర్.. మరోవైపు కాళేశ్వరం మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అవసరమైతే లేబర్ సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. సొరంగం దాదాపు 17 కిలోమీటర్లు ఉండగా.. పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయని, ఇప్పటికే 8 కిలోమీటర్లకు పైగా సిమెంట్ లైనింగ్ పూర్తయినట్టు చెప్పారు. సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మసాగర్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, యాదాద్రి జిల్లాలోని గందమల్ల, బస్వాపూర్, నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని శామీర్‌పేటకు మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఫలాలు అందనున్నాయని మంత్రి తెలిపారు. వారం, పది రోజుల్లో పంప్‌హౌస్ పనులు, సర్జిఫుల్ గేట్లు పూర్తి కానున్నట్టు పేర్కొన్నారు. ఒకవైపు మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు జరుగుతుండగా.. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని సొరంగం, పంప్‌హౌస్‌ల ద్వారా కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అత్యంత ఆధునిక టెక్నాలజీ కలిగిన భారీ మోటార్లు విదేశాల నుంచి తీసుకొచ్చి.. పనులు చేపడుతున్నట్టు తెలిపారు. అనంతరం సొరంగంలో పనులు నిర్వహిస్తున్న కార్మికులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. ఇక్కడ పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు. -
మల్లన్నసాగర్‌పై మరో కుట్ర
సందర్భం డ్యాంలని నదికి అడ్డంగా నిర్మించాలే తప్ప నది లేనిచోట నిర్మించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవంటున్నారు మల్లన్నసాగర్ విమర్శకులు. రాయలసీమలో నదిలేనిచోట వాగులపై ఎక్కువ నిల్వ సామర్థ్యంతో కట్టిన జలాశయాల మాటేంటి? టీజేఏసీ వారు కొన్ని నెలల క్రితం ‘‘ కాళేశ్వరం లిఫ్ట్ ఇరి గేషన్ ప్రాజెక్ట్ – విల్ ఇట్ బెనిఫిట్ తెలంగాణ?’’ పేరుతో విడుదల చేసిన నివేదికలో మల్లన్నసాగర్ జలాశయం ప్రాంతంలో పగుళ్ల గురించి ప్రస్తావించి ఉన్నారు. వాటిని తిరిగి ఇటీవల కోదండరాం చర్చకు తీసుకు వచ్చినారు. పగుళ్ళు ఉన్న ప్రాంతంలో 50 టీఎంసీ జలాశయాన్ని ఎట్లా నిర్మిస్తారని ప్రశ్నిస్తు న్నారు. పగుళ్లపై సమగ్ర అధ్యయనం జరపాలని, అంత వరకు ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలవద్దని, భూసేక రణ చెయ్యవద్దని అంటున్నారు. ఆయన ప్రకటనలని జేఏసీ సభ్యులు కొందరు ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా చర్చిస్తున్నారు. పైన పేర్కొన్న నివేదికలో రచయితలు చేసిన వాదన ఏమిటంటే... సాధారణంగా డ్యాంలని నదీ ప్రవాహానికి అడ్డంగా నిర్మిస్తారు. కానీ ఇక్కడ మాత్రం కూడెల్లి వాగుకు సమాం తరంగా నిర్మిస్తున్నారు. దీని వలన మట్టి కట్ట నుంచి ఎక్కువ నీరు బయటకు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి బురద భూమిగా మారుతుంది. మల్లన్నసాగర్ డ్యాం నిర్మిస్తున్న ప్రాంతంలో భూగర్భంలో డ్యాంకు సమాంతరంగా పగుళ్ళు కనిపిస్తున్నాయి. డ్యాంలో 40– 60 మీటర్ల ఎత్తులో నీరు నిలిచి ఉంటుంది కనుక ఈ నీటి బరువుకి భూగర్భంలో ఉన్న పగుళ్ళు మరింత వెడల్పు అయి ఎక్కువ నీరు బయటకు పోతుంది. దీంతో మట్టి కట్ట క్రమేణా కొట్టుకుపోయి లక్షలాదిమంది ప్రజలు ఆస్తి, ప్రాణ నష్టానికి గురి అవుతారు. అందుకని డ్యాం నిర్మాణ స్థలంపై మరింత పరిశోధన అవసరం. రచయితలు ఈ రకమైన నిర్ధారణకు ఏ భూ భౌతిక పరిశోధనల ఆధారంగా వచ్చినారో ఎక్కడా పేర్కొన లేదు. ఇది కూడా వారి ఊహాగానమే తప్ప శాస్త్రీయ పరిశోధనపై ఆధారపడి చేసిన నిర్ధారణ కాదు. వారు చెప్పినట్లు కూడెల్లి వాగు మల్లన్నసాగర్ డ్యాంకు బయట నుంచి సాగిపోతున్నది. డ్యాంలైన్‌కి అతి దగ్గరగా ఉన్న ప్పుడు దూరం 300 మీటర్లు ఉంటుంది. అదికూడా 34 కి.మీ పొడవున ప్రవహించే కూడెల్లి వాగుకు ఈ స్థితి 5 కి.మీ మాత్రమే ఉంటుంది. దీనివలన మల్లన్నసాగర్ డ్యాంకు ఏ ప్రమాదమూ లేదు. డ్యాంని డిజైన్ చేసేట ప్పుడు నీటి ఒత్తిడితో పాటు భూకంపాల నుండి విడు దల అయ్యే శక్తిని కూడా పరిగణిస్తారు. డ్యాం నిర్మిం చేటప్పుడు పునాది తవ్వుతారు. సమగ్రమైన భూభౌతిక పరిశోధనల అనంతరం సీఓటీ ఎంత లోతుకు తవ్వాలో నిర్ధారిస్తారు. తవ్విన పునాదిలో నీటిని అతి తక్కువగా పీల్చుకునే గుణం కలిగిన మట్టినే నింపుతారు. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతం మధ్యలో ఉన్న వేములఘాట్ గ్రామంలో ఉన్న కోమటి చెరువు, దాని కింద ఉన్న నల్ల చెరువులో ఈ పగుళ్ళ కారణంగా పెద్ద ఎత్తున నీరు బయటకు పోయి చెరువుల్లో నీటి నిల్వ వేగంగా తగ్గిపోయిన అనుభవాలు గతంలో ఎప్పుడూ లేవు. కాబట్టి ఇది ఊహాగానమే, కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ చేత రికన్నాయిజన్స్ సర్వే, లైడార్ సర్వే నిర్వహించింది ప్రభుత్వం. వారి సర్వేలో ఎక్కడా జలా శయం ప్రాంతంలో గాని, కూడెల్లి వాగు పరీవాహక ప్రాంతంలో గానీ పగుళ్ళు ఉన్నట్టు తేలలేదు. ఇక దేశంలో భూకంపాల చరిత్రను పరిశీలిస్తే తెలం గాణలో భూకంపాలు వచ్చిన దాఖలాలు లేవు. భూకంపాలని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు దేశాన్ని మొత్తం 5 జోన్లుగా వర్గీకరించినారు. దక్కన్ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశాలు లేనందున ఈ ప్రాంతాన్ని భూకంప ప్రాంతాల వర్గీకరణ చేసిన ప్పుడు అతి తక్కువ అవకాశాలు ఉన్న జోన్ 1,2, 3లో చేర్చినారు.అందులో 80% తెలంగాణ జోన్ 1,2లో ఉంటే 20% జోన్ 3లో ఉన్నది. అత్యధిక భూకంపాలు సంభవించే అవకాశాలు జోన్ 4, 5లోనే ఉన్నాయి. ఇక మల్లన్నసాగర్ నిర్మించబోతున్న మెదక్ జిల్లా జోన్ 2లో ఉన్నదన్న సంగతి ప్రజలు గమనించాలి. డ్యాంలని నదికి అడ్డంగా నిర్మించాలే తప్ప ఈ రకంగా నది లేనిచోట నిర్మించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవు అంటున్నారు మల్లన్నసాగర్ విమర్శకులు. ఎక్కడో ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నది లేని చోట, లేదా చిన్నవాగులపై అవి సమకూర్చే నీటి పరిమాణం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నిల్వ సామ ర్థ్యంతో నిర్మించిన జలాశయాలు రాయలసీమలో ఉన్నాయి. బ్రహ్మంగారి మఠం జలాశయం ఆ కోవలో నిదే. వాటి వివరాలు చూడండి. కండలేరు–68 టీఎం సీలు, గోరకల్లు–10 టీఎంసీలు, వెలిగొండ–41 టీఎం సీలు, వెలుగోడు–17 టీఎంసీలు, బ్రహ్మంగారి మఠం– 17 టీఎంసీలు, అవుకు–7 టీఎంసీలు, అలుగునూరు–3 టీఎంసీలు. ఇవన్నీ నదులు లేని చోట నిర్మించినవి కావా? అవ సరమైతే కృత్రిమ జలాశయాలు నిర్మించుకోవాలంటూ కేంద్ర జల కమిషన్ (సీడబ్ల్యూసీ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. ఎత్తిపోతల పథకాలలో పెద్ద జలాశ యాల నిర్మాణం అత్యంత అవసరం. సీడబ్ల్యూసీ సూచ నల మేరకే 50 టీఎంసీలతో రీ డిజైన్ చేయడం తప్ప నిసరైంది. నది లేని చోట డ్యాం నిర్మిస్తున్నారని విమర్శి స్తున్న వారు.. పైన పేర్కొన్న జలాశయాలు నిర్మిస్తున్న ప్పుడు కిక్కురుమనలేదెందుకు? ఇప్పుడు అటువంటిదే మల్లన్నసాగర్ జలాశయం నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభు త్వం ఏదో నేరం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. తెలం గాణకు జీవధారగా మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టుని వరుస కుట్రలతో అడ్డుకునే ప్రయత్నాలను వమ్ము చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మార్చే కృషిలో తెలంగాణ ఇంజనీర్లు తమ మేధస్సును, చెమటను ధారపోయడానికి సిద్ధంగా ఉన్నారు. - శ్రీధర్‌రావు దేశ్‌పాండే వ్యాసకర్త కో చైర్మన్, తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ -
పాతవి రద్దు.. కొత్త వాటికి ఆమోదం!
2న కేబినెట్ ముందుకు రీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులు మల్లన్నసాగర్ సహా నాలుగు రిజర్వాయర్లకు ఆమోదం తెలిపే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రీ ఇంజనీరింగ్ చేస్తున్న సాగునీట ప్రాజెక్టులపై పూర్తి స్థాయి సమీక్ష చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీ ఇంజనీరింగ్‌తో రద్దయిన పనులను తొల గించడం, కొత్త వాటికి అనుమతి, సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ నెల 2న జరిగే కేబినెట్ సమావేశంలో రీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. కేబినెట్లో చర్చకు వచ్చే అంశాలపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ప్రాజెక్టుల రీ ఇంజనీరిం గ్‌తో సవరణల భారం అదనంగా రూ.34 వేల కోట్లకు వరకు ఉండనుండగా, దీనిపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. 4 రిజర్వాయర్లపై ప్రకటన?.. మల్లన్నసాగర్ సహా మరో 4 రిజర్వాయర్లపై కేబినెట్లో కీలక నిర్ణయం చేసే అవకాశం ఉంది. 50 టీఎంసీల మల్లన్న సాగర్‌కు రూ.7,308 కోట్లు, 3 టీఎంసీల రంగనాయక సాగర్‌ను రూ.550 కోట్లు, 7 టీఎంసీల కొండ పోచ మ్మకు రూ.521.50 కోట్లు, 9.86 టీఎంసీల గంధమలకు రూ.8 98.50 కోట్లు, 11.39 టీఎంసీల బస్వా పూర్‌కు రూ.1803 కోట్ల తో అంచనాలు సిద్ధమయ్యాయి. వీటికి మొత్తంగా రూ.11,081 కోట్ల అంచనా వేయగా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీనిపై కేబినెట్ లో ఆమోదం తెలిపి అనం తరం అధికారిక ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. -
బెదిరింపులతో భూములు లాక్కుంటారా..?
అంగీకారం లేకుండా ప్రాజెక్టులను నిర్మించడం దుర్మార్గం డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తారా? ప్రజాభిప్రాయాన్ని గౌరవించరా? 2013 చట్టం ద్వారానే భూసేకరణ జరపాలి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సిద్దిపేట జిల్లా వేములఘాట్‌లో మల్లన్నసాగర్ ముంపు బాధితుల దీక్షలకు సంఘీభావం తొగుట: ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపువాసులు చేపడుతున్న రిలే దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. గ్రామాల మధ్య 50 టీఎంసీల రిజర్వాయర్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టు డిటెయిల్డ్ రిపోర్టు తయారు చేయకుండానే రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రిజర్వాయర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముం దుంచాలని డిమాండ్ చేశారు. ప్రజల అం గీకారం లేకుండా ప్రాజెక్టులు నిర్మించడం దుర్మార్గమని మండిపడ్డారు. 123 జీఓతో భూసేకరణ చేయడమంటే ప్రజలను మోసం చేయడమేనన్నారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని ప్రజలు కోరినా ప్రభుత్వం ముందుకు రాకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. భూసేకరణ చట్టంతో ప్రజలకు ఏ విధంగా నష్టమో స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వం మాట వినని ప్రజలపై 144 సెక్షన్ విధించి, పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. రెవెన్యూ అధికారులు పోలీసులతో బెదిరింపులకు గురి చేసి భూములు లక్కోవడం దుర్మార్గమన్నారు. భూములన్నీ గుంజుకుని బహుళజాతి సంస్థలకు కట్టబెడతారా? అని ప్రశ్నించారు. భూ సేకరణ చట్టంలో నిరుపేదలకు అన్ని విధాలా హక్కులున్నాయని చెప్పారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది ప్రజలను రోడ్డుపాలు చేయడానికేనా? అంటూ ప్రభుత్వానికి చురకలంటించారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రా జెక్టులు, పరిశ్రమల పేరిట భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీ జేఏసీ కోకన్వీనర్ పిట్టల రవీందర్, నిజాం కళాశాల ప్రొఫెసర్ పురుషోత్తం, మాల మహానాడు రాష్ట్ర నాయకుడు రమేశ్, విద్యా సంస్థల ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు అమరేందర్‌రెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ముంపు’ బాధితులూ ఆందోళన వద్దు
రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు గజ్వేల్ రూరల్: ‘మల్లన్న సాగర్’ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న ముంపు గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చెందవద్దని, వారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకునేందుకు సిద్ధమవుతుందని రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలు, రైతులను ప్రతిపక్షాలు ఆయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం 2013చట్టం ప్రకారం మెరుగైన పరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. భూములు, ఇండ్లు, ఇతర వనరులు కోల్పోతున్న ప్రజలు, రైతులందరికి పరిహారంతో పాటు డబుల్ బెడ్రూం ఇంటి సౌకర్యం కల్పించేందుకు సిద్దంగా ఉందని, ‘మల్లన్న’ బాధితులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలన్నారు. సమావేశంలో సిద్దిపేట డివిజన్ ఇన్‌ఛార్జి మారెడ్డి రామలింగారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ కన్వీనర్ పి. వెంకట్రాంరెడ్డి, నాయకులు నర్సింలుగౌడ్, రమేష్‌గౌడ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
‘మల్లన్న సాగర్’కు రూ. 9,200 కోట్లు
భారీగా పెరిగిన రిజర్వాయర్ వ్యయ అంచనా * గత ఒప్పంద విలువ రూ. 1,954 కోట్లే * నీటి నిల్వ సామర్థ్యం పెంపు వల్లే పెరిగిన అంచనా వ్యయం * బస్వాపూర్, పాములపర్తి, గంధమల రిజర్వాయర్ల వ్యయ అంచనాలూ రెడీ * త్వరలోనే టెండర్లు పిలవనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో చేపట్టనున్న కొమరవెల్లి మల్లన్న సాగర్ (తడ్కపల్లి) రిజర్వాయర్ అంచనా వ్యయం సిద్ధమైంది. ఈ నిర్మాణానికి రూ. 9,200 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదల శాఖ తేల్చింది. అలాగే రూ. 600 కోట్లతో పాములపర్తి, రూ. 1,700 కోట్లతో బస్వాపూర్, రూ. 900 కోట్లతో గంధమల, రూ. 600 కోట్లతో ఇమామాబాద్ రిజర్వాయర్ల వ్యయ అంచనాలనూ సిద్ధం చేసింది. ఈ అంచనాలపై హైపవర్ కమిటీ చర్చించాక ప్రభుత్వం వాటికి ఆమోదం తెలుపనుంది. అనంతరం టెండర్లు పిలవనుంది. సామర్థ్యానికి తగ్గట్లే మల్లన్న సాగర్ వ్యయ పెరుగుదల... 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రాణహిత నదిపై పెద్దగా రిజర్వాయర్లు లేని దృష్ట్యా సిద్దిపేటలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్ (పాములపర్తి) సామర్థ్యాన్ని ఒక టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇమామాబాద్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని ఒక టీఎంసీ నుంచి 3 టీఎంసీలకు పెంచగా నల్లగొండ జిల్లాలో కొత్తగా గంధమల రిజర్వాయర్‌ను 10 టీఎంసీలతో, బస్వాపూర్ రిజర్వాయర్‌ను 11.39 టీఎంసీలతో చేపట్టాలని నిర్ణయించింది. మల్లన్న సాగర్ పాత వ్యయం అంచనా రూ. 1,864 కోట్లు ఉండగా దాన్ని 4.86 శాతం అధికంగా కోట్ చేయడంతో అంచనా వ్యయం రూ. 1,954.59 కోట్లకు చేరింది. ప్రస్తుతం రిజర్వాయర్‌ను 50 టీఎంసీలకు పెంచి నిర్మాణం చేపట్టనుండటంతో అంచనా వ్యయం ఏకంగా రూ. 9,200 కోట్లకు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ రిజర్వాయర్ కిందే మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయించారు. దీంతోపాటే ఇక్కడి నుంచి ఒకవైపున నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్‌లకు లింకేజీ ఉంది. మరోవైపున కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఏడు రిజర్వాయర్లకు మల్లన్న సాగర్ నుంచే నీటి తరలింపు ప్రణాళిక రూపొందించారు. మరోపక్క సింగూరు ప్రాజెక్టుకు నీరు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు మల్లన్న సాగర్ నుంచి నీటి సరఫరా చే యాలని నిర్ణయించారు. మొత్తంగా 13 లక్షల ఆయకట్టుకు నీరందించేందుకు మల్లన్న సాగర్ కీలకంగా మారనుంది. దీని కింద 14,367 ఎకరాల ముంపు ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. -
కరువు పోవాలంటే ‘గోదావరి’ రావాలి
మల్లన్న సాగర్‌కు అడ్డు టీడీపీ, కాంగ్రెసోళ్లే జిల్లాలో 8 లక్షల ఏకరాలకు సాగు నీరు ప్రతిపక్షాలపై మంత్రి హరీశ్ ఘాటు విమర్శలు దుబ్బాక: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా, కరువు పోవాలన్నా... గోదావరి నీళ్లు రావాలి. అప్పుడే దేశానికి అన్నం పెట్టే అన్నదాతల కళ్లల్లో సంతోషాన్ని చూడాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం దుబ్బాక బాలాజీ ఫంక్షన్ హాల్లో డీసీసీబీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 19 గ్రామాలకు చెందిన 480 మంది రైతులకు పాడి గేదేల కొనుగోలు కోసం రూ. 4.80 కోట్ల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డెబ్బై ఏళ్ల కాలంలో కాంగ్రెసోళ్లు కుంభకర్ణుడి నిద్రలోకి పోయి ఒక్క ప్రాజెక్టు కట్టలేదు... చంద్రబాబు తెలంగాణకు చెందిన ఏడు మండలాలను పొలవరం ప్రాజెక్టులో ముంచిండు.. రైతు కన్నీళ్లను తుడిచి, ఆనందాన్ని నింపుదామనుకున్న కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కోర్టులకెళ్లి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. సముద్రంలో కలిసి పోతున్న గోదావరి నీళ్లను నూరు తాటి చెట్ల ఎత్తున ఉన్న మెదక్ జిల్లాకు తీసుకొచ్చి 8 లక్షల ఎకరాలకు సాగు నీరందించి, ఆత్మహత్యల్లేని జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. రైతుల ప్రయోజనాల కోసమే రానున్న రెండేళ్లలోనే మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను కట్టి తీరుతామని, రైతుల కాళ్ల వద్దకు గోదావరి నీళ్లను తీసుకరావడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. రైతుల బాధలను అర్థం చేసుకున్న కేసీఆర్ నాణ్యమైన విద్యుత్‌ను గృహావసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతరాయంగా అందిస్తుంటే ప్రతిపక్షాల కళ్లకు కనబడడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతంలో ఒక్క పంటకు నీరివ్వలేని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తం కుమార్‌రెడ్డి ఆంధ్రోళ్ల మూడో పంటకు నీళ్లించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ చేసిన పాపాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చక్కదిద్దాలన్నా ఉద్ధేశ్యంతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు రూ. 6 లక్షల నష్ట పరిహారాన్ని ఇస్తోందన్నారు. జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధికి కృషి చేస్తున్న డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డిని మంత్రి అభినందించారు. జాయింట్ లైవ్లీహుడ్ గ్రూప్ కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 33 శాతం, ఓసీ, బీసీ రైతులకు 25 శాతం సబ్సిడీని డీసీసీబీ బ్యాంకు ద్వారా ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రతి పక్షాల ఆరోపణలను ఎక్కడిక్కడా నిలదీసి, అడ్డుకోవాలని మంత్రి ప్రజలకు పిలుపు నిచ్చారు. అమిత్ షా విమర్శలు అర్థరహితం: ఎమ్మెల్యే సోలిపేట తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం కేటాయించిన నిధుల్లో కోతలు విధిస్తూ అభివృద్ధిని అడుగడుగునా అణచివేస్తోందని, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. అభివృద్ధి జరగడం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపణలు చేయడంపై అర్థరహితమని అన్నారు. బీజేపీ ప్రభుత్వ కాలంలో సైనికుల శవ పేటికల్లో జరిగిన కుంభకోణంపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. శిలాజీనగర్ తండాకు చెందిన 100 మంది గిరిజన మహిళలు సారాను బందు చేసి పాల ఉత్పత్తిపై ఆసక్తిని పెంచుకోవడంపై ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ర్యాకం పద్మ, జడ్పీటీసీ ఏల్పుల గౌతమి, ఏఎంసీ చైర్మన్ గుండవెళ్లి ఎల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు అమ్మన రవీందర్‌రెడ్డి, మద్దుల గాలిరెడ్డి, కూరాకుల మల్లేశం, వైస్ చైర్మన్ ఆస జ్యోతి, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
81 ఎకరాలను అప్పగించిన రైతులు
తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్ నిర్మాణానికి గురువారం 81 ఎకరాలను రైతులు అప్పగించినట్టు తహసీల్దార్ గుగులోత్ దేశ్యా నాయక్ తెలిపారు. తొగుటలో 27 మంది రైతులు 50 ఎకరాలు, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ముగ్గురు రైతులు ఒక ఎకరం, పల్లెపహాడ్‌లో 25 మంది రైతులు 30 ఎకరాలను అప్పగించారన్నారు. -
రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం
మల్లన్నసాగర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ గజ్వేల్: మల్లన్నసాగర్ వ్యవహారంపై ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని, సుప్రీంకోర్టుకు వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ముందుగా 1.5 టీఎంసీల సామర్థ్యంతో డిజైన్ చేసిన మల్లన్నసాగర్ ప్రాజెక్టును 50 టీఎంసీలకు పెంచి ఇష్టారాజ్యంగా భూసేకరణ చేపడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలను పరిశీలించి, సాంకేతిక నిపుణులతోనూ అధ్యయనం జరిపించిన తర్వాత మల్లన్నసాగర్ సామర్థ్యం తగ్గించాలని కోరామని, అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా గోదావరి నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లన్నసాగర్‌కు ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకువస్తున్నారని విమర్శించారు. మెదక్ జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో మల్లన్నసాగర్ భూనిర్వాసితుల దీక్షలు వందోరోజుకు చేరిన సందర్భంగా సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో భూబాధితుల పోరాట సంఘీభావ సభ నిర్వహించారు. ఇందులో ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. ‘‘ఆదిలాబాద్ జిల్లాలోని తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టి 160 టీఎంసీల నీటితో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇందుకు రూ. 38 వేల కోట్లు మాత్రమే ఖర్చవుతాయని గతంలో నిర్ణరుుంచారు. ఇందులో భాగంగానే మల్లన్నసాగర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీలుగా నిర్ధారించారు. ఆ సామర్థ్యంతో కడితే మల్లన్నసాగర్ వల్ల ముంపు 1,500 ఎకరాలే. కానీ ‘రీ-డిజైనింగ్’ పేరుతో కమీషన్లను పొందేందుకు తమ్మిడిహెట్టి నుంచి ఈ ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించి అంచనాలను రూ.38 వేల కోట్ల నుంచి రూ.83 వేల కోట్లకు పెంచారు’’ అంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఆయకట్టు పెరిగిందంటూ కాకిలెక్కలు చెబుతున్నారని, ఇదంతా బోగస్ అని పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో ప్రాజెక్టు డీపీఆర్‌ను వెబ్సైట్లో ఉంచాలని డిమాండ్ చేశారు. కోటి ఎకరాలకు నీళ్లు.. ఒట్టి బూటకం తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం జరిగితే మహారాష్ట్రలో ముంపు 3 వేల ఎకరాలు మాత్రమేనని ఉత్తమ్ పేర్కొన్నారు. అక్కడ 3 వేల ఎకరాలు ముంపు లేకుండా చేయడానికి తెలంగాణలో మాత్రం లక్ష ఎకరాలను ముంచడానికి కేసీఆర్ సిద్ధపడ్డారని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై రూ.50 వేల కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ప్రభుత్వం పదేపదే చెబుతున్న కోటి ఎకరాలకు సాగునీరు ఒట్టి బూటకమని, అవన్నీ కాకి లెక్కలని పేర్కొన్నారు. ఏడాదికి 2, 3 పంటలు పండే భూములు తీసుకుని ఆ భూముల్లో ప్రాజెక్టులు కట్టి వాటి ద్వారా ఒక పంటకు నీళ్లిస్తామని చెప్పడం తుగ్లక్ పరిపాలన కాదా? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వేములఘాట్ లో 50 రోజులుగా 144 సెక్షన్ విధించడం దారుణమన్నారు. ప్రభుత్వం తీరు చూస్తే మనం పాకిస్థాన్‌లో ఉన్నామా? కశ్మీర్లో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందన్నారు. మల్లన్నసాగర్‌కు 50 టీఎంసీల సామర్థ్యం అవసరమే లేదని, 1.5 టీఎంసీల సామర్థ్యం చాలన్నారు. ఇటీవల లాఠీచార్జి, గాల్లో కాల్పుల ఘటనలో 163 మంది గాయపడితే ప్రభుత్వం తరపున ఎవరూ పరామర్శించలేదన్నారు. కుకునూర్‌పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి మృతికి కారణమైన సిద్దిపేట డీఎస్పీని సస్పెండ్ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. వేదిక వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మూడింతల పరిహారం ఇవ్వాలి సభలో కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ... 2013 భూసేకరణ చట్టం ప్రకారం మల్లన్నసాగర్ నిర్వాసితుల భూములకు మార్కెట్ ధరకు మూడింతల పరిహారం చెల్లించాలన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని, సొంతింటిని చక్కదిద్దుకోలేనివారు ఇక రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారని మాజీ మంత్రి డీకే అరుణ ఎద్దేవా చేశారు. సభలో పార్టీ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, వి.హనుమంతరావు, సునీతా లక్ష్మారెడ్డి, సర్వే సత్యనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ విజయరామారావు, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, కోదండరెడ్డి, శ్రీధర్‌బాబు, సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ప్రజ్ఞాపూర్ నుంచి నాలుగు కిలోమీటర్ల పొడవునా గజ్వేల్‌లోని సభా నిర్వాసితుల హక్కులు కాపాడండి గవర్నర్‌కు టీపీసీసీ నేతల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ భూనిర్వాసితుల హక్కులు కాపాడాలంటూ గవర్నర్ నరసింహన్‌కు టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ నేతలు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. భూసేకరణ పేరిట రైతుల నుంచి భూములు లాక్కొని ప్రభుత్వం బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటోందని ఫిర్యాదు చేశారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలని నిర్వాసితులు పోరాడుతుంటే ప్రభుత్వం నిర్బంధం విధిస్తోందన్నారు. జీవనోపాధి చూపించాలన్నందుకు నిర్వాసితులపై అక్రమ కేసులు బనాయించి, పోలీసులతో వేధిస్తున్నారన్నారు. పోలీసులు అమానవీయంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
బలవంతపు భూ సేకరణ ఆపాలి
కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా సంగారెడ్డి టౌన్: మల్లన్న సాగర్ కోసం బలవంతపు భూ సేకరణ ఆపాలని సీపీఎం డిమాండ్ చేసింది. 2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా ముంపు గ్రామాల్లో 144 సెక్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సీపీఎం నాయకులు జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ ముంపు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజయ్య, జయరాజు, సాయిలు, యాదవరెడ్డి, ప్రవీణ్, మల్లేశ్వరీ, నర్సమ్మ, అశోక్, యాదగిరి, కృష్ణ, దశరత్ తదితరులు పాల్గొన్నారు. -
'మల్లన్న' పై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
హైదరాబాద్: మల్లన్నసాగర్ పై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్టు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం బలవంతంగా భూ సేకరణ చేస్తోందని, ముంపు గ్రామం వేమలఘట్ లో 50 రోజులుగా 144 సెక్షన్ విధించటం అన్యామన్నారు. గవర్నర్ నరసింహన్‌తో సోమవారం భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలపై గవర్నర్ తో చర్చించారు. భేటీ అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. ఇదేమైనా కశ్మీరా? మనం భారతదేశంలోనే ఉన్నామా? అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ లోని పరిస్థితులను గవర్నర్ కు వివరించి జోక్యం చేసుకోవాలని కోరినట్టు తెలిపారు. తక్షణమే ముంపు గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేసేలా డీజీపీ ఆదేశాలివ్వాలని కూడా కోరామన్నారు. మల్లన్న సాగర్ పై ఈ నెల 14న లేదా 15 న రాష్ట్ర్రపతిని కలవనున్నట్టు వెల్లడించారు. 2013 చట్టం ప్రకారమే భూసేకరణ జరిపేలా ప్రభుత్వానికి గవర్నర్ సూచించాలన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీతో పాటు పలువురు నేతలు ఉన్నారు. -
గవర్నర్‌తో టి-కాంగ్రెస్ నేతల భేటీ
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం ఉదయం భేటీయ్యారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలపై గవర్నర్‌తో వారు చర్చించారు. కేంద్ర ప్రభుత్వ చట్ట ప్రకారం భూ సేకరణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. గత 100 రోజులుగా ముంపు గ్రామాల్లో విధించిన 144 సెక్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ నరసింహన్‌కు వినతి పత్రం సమర్పించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీతో పాటు పలువురు నేతలు ఉన్నారు. -
గజ్వేల్ వేదికగా మరో పోరు
మల్లన్నసాగర్ బాధితుల సంఘీభావ సభ ఏర్పాట్లను పరిశీలించిన దామోదర, సునీతారెడ్డి గజ్వేల్: మల్లన్నసాగర్ ముంపు బాధితులకు మద్దతుగా కాంగ్రెస్ మరో పోరుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ కేంద్రంగా సోమవారం సంఘీభావ సభ నిర్వహించేందుకు సమాయత్తమైంది. పట్టణంలోని దొంతుల ప్రసాద్ గార్డెన్ వేదికగా సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అతిక్రమించి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారని నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ వేములఘాట్‌లో రిలే దీక్షలు వందో రోజుకు చేరుకున్న సందర్భంగా ఈ సభ నిర్వహిస్తోంది. సభలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు హాజరు కానున్నారు. ఉదయం 11గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా గజ్వేల్‌లో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ నిర్వహణ ఏర్పాట్లను ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి హజారి వేణుగోపాల్‌రావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలెంక నర్సింలు, యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్ధార్‌ఖాన్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కుంట్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు
ప్రభుత్వంపై ఉత్తమ్ ఫైర్ సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని, రైతుల హక్కులను కాలరాస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దీనిపై జాతీయ స్థాయిలోని రాజ్యాంగ, న్యాయ వేదికలపై పోరాటం చేస్తామని తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి, మల్లు రవి, శ్రవణ్‌కుమార్‌రెడ్డిలతో కలసి గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. భూసేకరణ చట్టం-2013ను పట్టించుకోకుండా.. భూముల్లేని పేదలు, కూలీలకు పునరావాసం గురించి మాట్లాడకుండా.. రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా.. పోలీసులను, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం దౌర్జన్యానికి దిగుతోందని మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరుగకుండా తాము అడ్డుకుంటే.. మంత్రి హరీశ్‌రావు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులకు సాగునీటిని అందించాల్సిందేనని... అయితే దానికోసం రైతులు, కూలీలను నిరాశ్రయులు చేయడం ఎంత వరకు న్యాయమని ఉత్తమ్ ప్రశ్నించారు. శనివారం గవర్నర్‌ను కలసి ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ నెల 12న మల్లన్నసాగర్ రైతులకు మద్దతుగా గజ్వేల్‌లో సంఘీభావ సభ నిర్వహిస్తామని తెలిపారు. 13, 14 తేదీల్లో రాష్ట్రపతిని కలసి రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామిక హక్కుల అణచివేతపై ఫిర్యాదు చేస్తామని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని ఉత్తమ్ వెల్లడించారు. తెలంగాణలోనే ఉన్నమా? ‘‘రెవెన్యూ, పోలీసు అధికారులు మా ఊళ్ల మీద వేటగాళ్లలా పడుతున్నరు. ప్రశ్నించిన రైతుల మీద కేసులు పెడుతున్నరు. అడిగితే కొట్టిస్తున్నరు. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నమా అనిపిస్తున్నది..’’ అని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులు ఎల్లారెడ్డి, మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. భూమి మీదే ఆధారపడిన తమకు దిక్కు చూపించకుండా వెళ్లిపొమ్మంటే ఎక్కడికిపోయి బతుకుతామని ప్రశ్నించారు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధరకు భూములు ఎక్కడా దొరకడం లేదన్నారు. -
తీవ్రంగా కొట్టి.. గొంతులో సూది గుచ్చారు
ఎర్రవల్లి: మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి లో గురువారం దారుణం చోటు చేసుకుంది. పొలానికి వెళ్లి వస్తున్న ఓ వ్యక్తిపై దుండగులు కర్రలతో దాడి చేశారు. అనంతరం తీవ్రంగా హింసించి గొంతులో సూది గుచ్చారు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతంలో ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచిన భూమిని ఇతరుల పేరుతో దొంగ రిజిస్ట్రేషన్ చేశారని గత కొన్ని రోజులుగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పోరాడుతున్నాడు. సదరు వ్యక్తి ఈ రోజు వ్యవసాయ బావి వద్ద నుంచి వస్తుండగా గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. అనంతరం గొంతులో సూదిని గుచ్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మల్లన్న ‘సాగర’ వెతలు
తెలంగాణ అభివద్ధికి నీరు, సాగునీటి ప్రాజెక్టులు అత్యవసరమే. తెలంగాణ ప్రజలకు నీటిని అందించటానికి ఇలాంటి భూసేకరణే మార్గమా? బాధిత ప్రజల పునరావాసం, పునఃస్థాపనను మీరు ఏ విధంగా విస్మరించగలరు? గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, బాధ్యతగల పౌరులుగా, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న మేము కొన్ని విషయాలను మీ దష్టికి తీసుకురాదలిచాము. తెలంగాణ రాష్ట్రం చిత్తశుద్ధితో పెద్ద పెట్టుబడులతో మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ వంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలతో, మల్లన్న సాగర్ వంటి సాగు నీటి ప్రాజెక్టులతో నీటి సమస్యను పరిష్కరించటానికి పూనుకుంది. అయితే భారీ సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద విస్తీర్ణంలో అవసరమైన భూమిని మీ ప్రభుత్వం సేకరిస్తున్న పద్ధతి పెద్ద వివాదంగా మారింది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అవసరాన్ని ఎవరూ కాదనలేరు. కాని అటువంటి ప్రాజెక్టులు ప్రజల భాగస్వామ్యాన్ని, స్వచ్ఛంద అంగీకారాన్ని పొందటం, అలాగే న్యాయబద్ధమైన నష్టపరిహారాన్ని అందించటం అత్యవసరం. మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రజాస్వామిక హక్కు లను కాలరాచింది. 2013 భూసేకరణ చట్టం ఉండగా తెలంగాణ ప్రభుత్వం జీవో 123 కింద భూసేకరణ ఎందుకు చేస్తున్నదని ప్రజలు మళ్లీమళ్లీ ప్రశ్నిస్తున్నారు. ప్రజలలో పెరుగుతున్న ఈ ఆగ్రహానికి పలు కారణాలున్నాయి. భూమినీ, జీవనోపాధినీ కోల్పోతున్న వారు కనీసం స్థానిక ప్రజా ప్రతినిధులకు కూడా తమ గోడును చెప్పుకునే అవకాశం జీవో 123 కల్పించదు. అది భూసేకరణకు గరిష్ట పరిమితిని ఎత్తివేసి వంద లాది ఎకరాలను పరాయీకరించటానికి వీలు కల్పి స్తుంది. భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన వారికీ పునరా వాసం, పునఃస్థాపన ఖర్చులను చెల్లించే అంశాన్ని ఆ తర్వాత తెచ్చిన జీవో 241లో తొలగించడం దారుణం. మల్లన్నసాగర్ కోసం ప్రభుత్వం చేస్తున్న భూసేక రణకు గత నాలుగు నెలలుగా తీవ్ర ప్రతిఘటన జరుగు తోంది. ప్రజలు భూమిని స్వచ్ఛందంగా ఇవ్వటానికి సిద్ధంగా లేరు. అక్కడ భూ సేకరణలో తప్పుడు సమా చారం ఇవ్వటం, ఒత్తిడి తేవటం, బెదిరించటం జరుగు తున్నట్లు వార్తలొస్తున్నాయి, మా నిజ నిర్ధారణలోనూ ఇది ధ్రువపడింది. భూమినీ, జీవనోపాధినీ కోల్పో తామని, గ్రామం మునిగిపోతే రోడ్డున పడతామని ముఖ్యంగా వయసు మళ్లిన స్త్రీలు, చదువుకునే ఆడ పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో పంచాయతీలను పూర్తిగా పక్కన పెడుతున్నారు. భూమి, జీవనోపాధులపై తీసుకునే ఏ నిర్ణయంలోనైనా గ్రామ సభలు. పంచాయతీల భాగస్వామ్యం ఉండాలి. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేస్తున్న సంస్థ గురించి స్పష్టత లేదు. జీవో 123ని తీసుకురావటం ద్వారా మీ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం వీలు కల్పించిన సామాజిక ప్రభావ అంచనా తదితర ప్రక్రి యల పరిధి నుంచి ఈ ప్రాజెక్టును బయట ఉంచాలని ప్రయత్నిస్తున్నది. చట్టానికి కట్టుబడటానికి బదులు మీ ప్రభుత్వం ప్రజలను గందరగోళపరిచి, వారిని బలవంతపెట్టడం విచారకరం. ఇది వేములగట్టు గ్రామంలో ప్రజలపై లాఠీచార్జి, 144వ సెక్షన్ విధిం చటం వంటి సంఘటనల వరకు వెళ్లింది. ఈ పరిణామాల పట్ల మేము తీవ్రంగా కలత చెందాము. తెలంగాణ అభివద్ధికి నీరు, సాగునీటి ప్రాజెక్టులు అత్యవసరమనే అంశంపై మీతో ఏకీభవిస్తు న్నాం. అరుుతే నీటిని అందించటానికి ఇదొక్కటే మార్గమా? ప్రజాస్వామిక ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పునరావాసం, పునఃస్థాపనకు వీలు కల్పించకుండా భూసేకరణ ఎట్లా చేయగలుగు తుంది? సాగునీరు ఇవ్వటం పేరుతో ప్రభుత్వం వేలాది ప్రజలకున్న కొద్ది ఆస్తిని తీసుకోరాదు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజల హక్కులకు రక్షణ కల్పించి, శాంతి పునరుద్ధరణకు ఈ కింది చర్యలు తీసుకోవలసిందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం: 1. వేములగట్టు గ్రామం నుండి పోలీసులను ఉపసంహరించి 144వ సెక్షన్‌ని ఎత్తివేయాలి. 2. జీవో 123పై హైకోర్టు నుంచి అంతిమ తీర్పు వెలువడే వరకు మల్లన్నసాగర్ ముంపు గ్రామా లలో భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలి. 3. మల్ల న్నసాగర్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీ పీఆర్)ను స్థానిక భాషలో విడుదల చేసి దానిపై చర్చ నిర్వహించాలి. 4. భూసేకరణ జరిపే ముందు.. సేకరణ జరిపే సంస్థ ఏది, ఎవరి పేరిట రిజిస్టర్ చేశారు? ఎవరి పేరిట చేయాల్సి ఉందనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలి. 5. హైకోర్టు ఆదేశాల మేరకు మల్లన్న సాగర్ భూ యజమానులకు, భూమిలేని ప్రజలకు 2013 భూసే కరణ చట్టంలోని 2వ, 3వ షెడ్యూలు ప్రయోజనాలను అందించటంపై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చెయ్యాలి. పైన పేర్కొన్న అన్ని అంశాలపై వెంటనే చర్య తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం.. ప్రజల విశ్వా సాన్ని పునరుద్ధరించాలనీ మేము కోరుతున్నాం. ప్రొఫె సర్ రమా మెల్కోటే - ఉస్మానియా యూనివర్సిటి రిటైర్డ్ ప్రొఫెసర్ (9912021778). డాక్టర్ కే.లలిత - ఫెమినిస్ట్ మేధావి. ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే - కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్. ప్రొఫెసర్ సూజీతారు - IFLU రిటైర్డ్ ప్రొఫెసర్. డాక్టర్ వీణా శత్రుగ్న -NIN డిప్యూటి డెరైక్టర్. ప్రొఫెసర్ శాంత సిన్హా - స్వతంత్ర పిల్లల హక్కుల కార్యకర్త. డాక్టర్ వి.రుక్మిణి రావ్ - మహిళా రైతుల కార్యకర్త, గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్. డాక్టర్ ఉషాసీతాలక్ష్మి - స్వతంత్ర పరిశోధకురాలు. ఎస్. ఆశాలత - మహిళా రైతుల హక్కుల వేదిక ((MAKAAM) వసుధ నాగరాజ్ - హైకోర్టు అడ్వొకేట్. కె. సజయ-ఫ్రీలా న్స్ జర్నలిస్ట్, ఫిలిం మేకర్ ( 9948352008). -
ఇళ్ల పరిహారం ఇవ్వరా?
బి.బంజేరుపల్లి గ్రామస్తులు ఆవేదన తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్ నిర్మాణానికి తమ గ్రామంతోపాటు వ్యవసాయ భూములు అప్పగించి నెలలు గడుస్తున్నా అధికారులు పరిహారం చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీ. బంజేరుపల్లి గ్రామస్తులు ఆరోపించారు. బుధవారం గ్రామంలో వారు మాట్లాడుతూ ఇళ్లు సర్వేచేసి నెలలు గడుస్తున్నా నష్టపరిహారం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు, ఇళ్ల పరిహారం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. భూములు ఇచ్చేంత వరకు ప్రజల చుట్టూ తిరిగిన అధికారులు నేడు ఒకరిని అడిగితే మరొకరి పేరుచెప్పి తప్పించుకుంటున్నారని వాపోయారు. సకాలంలో తమ చేతికి డబ్బులు అందితే తాము మరోచోట భూములు కొనుగోలు చేసుకుంటామని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా తాము అన్ని విధాలుగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం కోసం స్థానిక తహసీల్దార్‌ను సంప్రదిస్తే రేపుమాపు అంటూ తప్పించుకుంటున్నాడని గ్రామస్తులు విమర్శించారు. చెప్పులరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇళ్ల పరిహారం కోసం తాము రాస్తారోకో చేసిన సమయంలో వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు నెల రోజులు గడిచినా స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే ఆందోళన కార్యక్రమం చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. -
బలవంతపు భూసేకరణ తగదు
వేములఘాట్‌లో పోలీస్ పికెట్ ఎత్తివేయాలి డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏగొండస్వామి తొగుట: కొమురవెల్లి మల్లన్నసాగర్ నిర్మాణంలో భాగంగా బలవంతపు భూసేకరణ చేపట్టడం దర్మార్గమని దళిత బహుజన ఫ్రంట్ ( డీబీఎఫ్ ) రాష్ట్ర కార్యదర్శి ఏగొండస్వామి ఆరోపించారు. వేములఘాట్‌లో బుధవారం మహిళలు చేపట్టిన నిరసన దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. పోలీస్ పికెట్ , 144 సెక్షన్‌ను ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేములఘాట్ ప్రజలకు న్యాయం జరిగేవరకు డీబీఎఫ్ అండగాఉండి పోరాడుతుందన్నారు. 88వ రోజుకు చేరిన ముంపు దీక్షలు వేములఘాట్ గ్రామస్తులు చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 88వ రోజకు చేరాయి. దీక్షలో రేణుక ఎల్లమ్మ మహిళా సంఘం సభ్యులు దమ్మి రాజవ్వ , పల్లెపహాడ్ కిష్టవ్వ , లచ్చవ్వ , గడ్డమీది బాలవ్వ , లింగవ్వ , దొడ్ల లక్ష్మి, కూతూరి కమలమ్మ , మాచాపురం లక్ష్మి, విజయ , ప్యాట లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు బలగాలను వెనక్కి తీసుకోండి
సాక్షి, సిటీబ్యూరో: మల్లన్న సాగర్ ప్రాంతంలో మోహరించిన పోలీసు బలగాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని భూ నిర్వాసితుల పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ప్రాంతంలో 144 సెక్షన్‌ను తొలగించాలని కోరారు. జీవో 123 ప్రకారం భూమి కొనుగోళ్లు ఆపివేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని వక్తలు అభిప్రాయపడ్డారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రైతుల రక్తం కళ్లజూసిన పాలకులు ఎంతోకాలం అధికారంలో ఉండరని చరిత్ర రుజువు చేసిందన్నారు. ఎమర్జెన్సీ విధించి, పౌర హక్కులను కాలరాయాలనుకున్న ఇందిరాగాంధీ సైతం ఓటమి పాలవక తప్పలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకుడు కోదండరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛందంగా అసెంబ్లీలో దీనిపై చర్చిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తారని అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకుడు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరుతో తెలంగాణలో వేలాది మంది రైతులు భిక్షగాళ్లుగా మారాల్సి వచ్చిందన్నారు. వేముల ఘాట్ ఇప్పుడు పాకిస్థాన్ సరిహద్దులను తలపిస్తోందని తెలంగాణ రైతు కూలీ సంఘ నాయకులు వెంకట్ అన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు, పోలీసు నిర్బంధానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న తలపెట్టిన ఆందోళనను విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు రాములు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర అధ్యక్షురాలు పశ్య పద్మ, సజయ, రమా మెల్కొటే, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్, దళిత బహుజన్ ఫ్రంట్ నేత శంకర్, పిట్టల రవీందర్, గాదె ఇన్నయ్య, ఉషాసీతాలక్ష్మి, విమల, పీఓడబ్లు్య సంధ్య, తెలంగాణ రైతు సంఘ ప్రతినిధి సాగర్, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి విస్సా కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భూనిర్వాసితులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
తెలంగాణ ప్రభుత్వం భూ నిర్వాసితులపై పెట్టిన కేసులు, 144 సెక్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ భూ నిర్వాసితుల పోరాట కమిటి రాష్ట్ర నాయకులు బి.వెంకట్, టి.సాగర్లు డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఎకరాలను సేకరిస్తున్నారని, ఐతే 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం 123 జీవోను అమలు చేయటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.ఇది చట్ట విర్దుమని వారు అన్నారు. హైకోర్టు కూడ 2013 చట్టాన్ని అమలు చేయాలని చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరించటంతో పాటు దాన్ని వ్యతిరేకించిన రైతులపై అక్రమ కేసులను పెడుతున్నారని, మల్లన్నసాగర్, ముచ్చర్ల ప్రాంతాల్లో జైలుకు కూడ పంపారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేములఘాటు గ్రామంలో 144 సెక్షన్ విధించారని వారు అన్నారు. భూ నిర్వాసితులపై పెట్టిన అక్రమ కేసులను , 144 సెక్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనునన్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు పి.జంగారెడ్డి, వెంకటేశ్వర్లు, బి.ప్రసాద్, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘మల్లన్న’పై అనవసర రాద్ధాంతం
కొండాపూర్: మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసరపు రాద్దాంతం చేస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులపై మహారాష్ట్రతో జరిగిన ఒప్పందం చారిత్రాత్మకమైనదన్నారు.తహాసీల్దార్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం రంజాన్ పర్వదినం, సేవాలాల్ జయంతి సందర్భంగా గిరిజనులకు, మసీద్‌ల సదర్‌లకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ది చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.గత సమైక్య రాష్ట్రంలో ఎన్నో విధాలుగా నష్టపోయామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం అంధకారం అవుతుందని ఆంధ్ర పాలకులు దుష్ప్రచారం చేశారన్నారు. కానీ నేడు తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో వ్యవసాయానికి 12 గంటల విద్యుత్‌ను అందిస్తునామన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించి 7 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఒకవైపు ప్రభుత్వం కృషి చేస్తుంటే మరోవైపు ప్రతిపక్షాలు ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా అమలు కానీ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలోనూ మౌలికవసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. కాగా ఎస్సీ కార్పొరేషన్‌ద్వారా మంజూరైన ఆటోలను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ విఠల్, మండల ఉపాధ్యక్షురాలు జ్యోతిరాజేంద్రప్రసాద్, జెడ్పీకో ఆప్షన్ సభ్యులు అమీనోద్దిన్, సర్పంచ్ రుక్మోద్దిన్, తహసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ స్వప్న, డిప్యూటీ తహసీల్దార్ శ్రీశైలం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మైనార్టీ, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ముంపు బెంగతో మృతి
తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్‌లో తమ గ్రామం ముంపునకు గురవుతుందన్న బెంగతో గుండెపోటుకు గురై ఆటో డ్రైవర్ మరణించిన ఘటన మెదక్ జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎండీ మైమూద్ హుస్సేన్ (41)కు ఎలాంటి భూములు లేకపోవడంతో గ్రామంలో ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెండు నెలలుగా ముంపు నుంచి తమ గ్రామాన్ని మినహాయించాలని గ్రామస్తులు నిర్వహించిన ఆందోళనలో హుస్సేన్ చురుకుగా పాల్గొన్నారు. గత నెల 24న రాజీవ్ రహదారి ముట్టడికి వెళ్తుండగా పోలీస్‌లు జరిపిన లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ముంపునకు గురవుతుందనే బెంగ అధికమైంది. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున తీవ్ర మనస్తాపంతో గుండె పోటుకు గురయ్యారు. వెంటనే సిద్దిపేట ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. హుస్సేన్‌కు భార్య గౌస్యా, కుమారులు సాహేద్, జాహేద్, కుమార్తె మేహజ్ ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
'హరీష్ కు ఆ అర్హత లేదు'
రాష్ట్రంలో ఉన్నది గాంధీ పాలనా లేక గాడ్సే పాలనా అని జగ్గ్గారెడ్డి విమర్శించారు. అహింసా మార్గంలో చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం అణగదొక్కుతోందని, బాధితులకు న్యాయం చేయాలని చేస్తున్న దీక్షలను భగ్నం చేస్తోందని ఆయన ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘నేను తెలంగాణ ద్రోహిని అయితే.. తలసాని, తుమ్మల, కడియం, మహేందర్‌రెడ్డి ఏమవుతారని’ ప్రశ్నించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు అమ్ముకున్న మీరా తెలంగాణ ద్రోహులు నేనా.. త్వరలోననే తెలంగాణ ద్రోహులెవరో తెలిపోతుందన్నారు. హరీష్‌రావుకు నన్ను విమర్శించే హక్కు లేదని.. ప్రతిసారి హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకునే బదులు భూసేకరణ చట్టన్ని అమలు చేయొచ్చు కదా అని అన్నారు. -
మళ్లీ లొల్లి!
రాజుకున్న ‘మల్లన్నసాగర్’ వ్యవహారం ఒకపక్క ప్రతిపక్షాల దీక్షలు.. మరోపక్క భూ రిజిస్ట్రేషన్లు వేములఘాట్ మినహా మిగతా గ్రామాలు భూ సేకరణకు సై ‘2013’ చట్టం కోసం కాంగ్రెస్ పట్టు సంగారెడ్డిలో జగ్గారెడ్డి దీక్ష భగ్నం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మల్లన్నసాగర్ ప్రాజెక్టు మళ్లీ రాజుకుంది. భూ సేకరణ వద్దని, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు దీక్షలకు దిగుతుంటే.. మరోపక్క నిర్వాసితులు తమ భూములను సర్కారుకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. బుధవారం ముంపు గ్రామాలైన ఎర్రవల్లిలో 8.5 ఎకరాలు, తొగుటలో 12 మంది రైతులు 21 ఎకరాలు, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నలుగురు రైతులు 8 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. కోర్టులు, చట్టాలు, జీవోల సంగతి ఎలా ఉన్నా.. ఊరును పోలిన ఊరును కట్టిస్తామని, ఊపాధి చూపిస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పిన మాటలపై నమ్మకం ఉంచి భూసేకరణకు సిద్ధపడుతున్నామని ముంపు గ్రామాల ప్రజలు అంటున్నారు. కాగా, 2013 భూసేకరణ చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగ్గారెడ్డి బుధవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో దీక్షకు దిగబోగా.. పోలీసులు భగ్నం చేశారు. అదే రోజు 123 జీవోకు అనుకూలంగా తీర్పు వెలువడింది. దీంతో అటు అనుకూల, ఇటు వ్యతిరేక పరిణామాలతో మల్లన్నసాగర్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఆగుతూ.. సాగుతూ.. గోదావరి నదిపై కాళేశ్వరం కింద 50 టీఎంసీలతో నిర్మిస్తున్న కొమరవెల్లి మలన్నసాగర్‌కు అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇటీవల 123 జీఓ కొట్టివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ముంపు గ్రామాల్లో భూ సేకరణ తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా సింగిల్ జడ్జి తీర్పును ఏసీజే జస్టిస్ రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసారావులతో కూడిన ధర్మాసనం రద్దు చేయటంతో తాత్కాలికంగా ఆగిపోయిన భూముల రిజిస్ట్రేషన్ మళ్లీ ఊపందుకుంది. తొగుట, కొండపాక మండలాల్లోని ముంపు గ్రామాల్లో ప్రస్తుతం భూసేకరణ జరుగుతోంది. ఎర్రవల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, తొగుట గ్రామల్లో తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి నిర్వాసితులు అంగీకరించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆ ఒక్క గ్రామమే మిగిలింది.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల నేపథ్యంలో మల్లన్నసాగర్ వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎత్తులు వేసింది. అయితే, తాజా పరిణామాలతో ఆ పార్టీ ప్రయత్నాలకు అనుకున్నంత స్థాయిలో మద్దతు లభించటం లేదు. ముంపునకు గురయ్యే గ్రామాల్లో ఒక్క వేములఘాట్ ప్రజలు మాత్రమే ప్రస్తుతం భూసేరణను వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన గ్రామాలు దాదాపు భూములు ఇవ్వటానికి ముందుకు వస్తున్నాయి. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమైతే.. భూములు కోల్పోయి మళ్లీ కోర్టుల చుట్టు తిరగాలని, అంత ఓపిక లేదని నిర్వాసితులు అంటున్నారు. ప్రభుత్వం చూపుతున్న ప్రత్యామ్నాయాలు సైతం బాగున్నాయని, అందుకే 123 జీఓకు అంగీకరిస్తున్నామని వారు చెబుతున్నారు. 123 ఉత్తర్వుల ద్వారా నిర్ణయించిన ధర 15 నుంచి నెల రోజుల్లో చేతికి అందటం, ప్రాజెక్టు నిర్మాణంతో పాటే ముంపు గ్రామాన్ని పోలిన కొత్త గ్రామాన్ని నిర్మించి ఇస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన హామీ నిర్వాసితులను ఆకర్షిస్తోంది. 123 జీవో నచ్చింది 123 జీవో నచ్చింది కనుకనే భూముల రిజిస్ట్రేషన్ చేయడానికి ఒప్పుకున్నాం. డబుల్ బెడ్ రూం పథకంలో నిర్వాసితులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టమైన హామీనిచ్చారు. నేను 3.05 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేశాను. - మన్నెం రాంరెడ్డి, ఎర్రవల్లి, కొండపాక మండలం ఎవరి ఒత్తిడీ లేదు.. భూముల రిజిస్ట్రేషన్‌లో మాపై ఎవరి ఒత్తిడీ లేదు. 123 జీవో ప్రకారం నిర్వాసితులకు మెరుగైన ప్రయోజనాలు కల్పించేలా ప్రభుత్వం మరిన్ని అంశాలు చేర్చిన విషయం తెలుసుకొని భూములను ఇచ్చేందుకు అంగీకరించాం. - మన్నెం కనకలక్ష్మి ఎర్రవల్లి; కొండపాక మండలం భూ రిజిస్ట్రేషన్ ఇలా..(భూమి ఎకరాల్లో) గ్రామం రైతులు పట్టా అసైన్డ్ ఏటిగడ్డ కిష్టాపూర్ 673 1214.39 254.23 తొగుట 492 954.25 490.26 తుక్కాపూర్ 194 240.01 371.19 ఎల్లారెడ్డిపేట 32 65.00 31.32 -
‘మల్లన్నసాగర్’ సామర్థ్యం తగ్గించాలి
తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన వేములఘాట్ గ్రామస్తులు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం నాటికి 66వ రోజుకు చేరాయి. దీక్షల్లో చాముండేశ్వరీ మహిళా సంఘం సభ్యులు నాయిని కనకలక్ష్మి, వెంకటలక్ష్మి, బాలలక్ష్మి, ప్రమీల, దుబ్బాక భాగ్యమ్మ, శేరుపల్లి లక్ష్మి, గిర్మాజి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్ధ్యాన్ని తగ్గించి ముంపు నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. -
'జగ్గారెడ్డి అరెస్టు అప్రజాస్వామికం'
హైదరాబాద్: మల్లన్నసాగర్ ముంపు రైతుల కోసం ఆమరణ దీక్ష చేపట్టడానికి బయలుదేరిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయనిక్కడ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వ్యతిరేకం కాదని, రీ డిజైన్ల పేరుతో జరుగుతున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకమన్నారు. దేశం మొత్తం 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తోంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతుల పొట్టకొట్టడానికి 123 జీవో తీసుకొచ్చిందని మండిపడ్డారు. 123 జీవో రద్దు చేసేవరకూ పోరాడతామని రాజనర్సింహ తెలిపారు. -
సంగారెడ్డి పట్టణంలో ఉద్రిక్తత
సంగారెడ్డి: మల్లన్నసాగర్ నిర్వాసితుల పక్షాన నిరాహార దీక్షకు యత్నించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం దీక్ష చేపట్టేందుకు పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వద్దకు జగ్గారెడ్డి రాగా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. ఇరు వర్గాల తోపులాటలు, జగ్గారెడ్డి మద్దతుదారుల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
నేటి నుంచి ‘మల్లన్నసాగర్’ కోసం దీక్ష
టీపీసీసీ అధికార ప్రతినిధి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలనే డిమాండుతో బుధవారం నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నట్లుగా టీపీసీసీ అధికార ప్రతినిధి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) ప్రకటించారు. జీవో 123ని హైకోర్టు కొట్టివేసినా అప్పీలుకు వెళ్లడం దారుణమన్నారు. భూసేకరణ చట్టం-2013ను అమలు చేయాలని, నిర్వాసితులందరికీ చట్టం ప్రకారం పునరావాస చర్యలను తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు కట్టాలి కానీ వాటికోసం రైతులు, కూలీలు, వృత్తిదారుల పొట్ట కొట్టొద్దని కోరారు. -
'లంకలో సీతమ్మలా నిర్బంధించారు'
హైదరాబాద్: లంకలో సీతమ్మలా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల రైతులను నిర్బంధించారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తూర్పు జగ్గారెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..మల్లన్న సాగర్ ముంపు గ్రామాలను రైతులను ప్రభుత్వం బెదిరిస్తూ, భయపెడుతునారన్నారు. 123 జీవోను హైకోర్టు కొట్టేసినప్పటికీ ప్రభుత్వం అప్పీల్‌కి వెళ్లి మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపటి నుంచి సంగారెడ్డిలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు తెలిపారు. కోర్టు తీర్పుకు కట్టుబడి ప్రభుత్వం 123 జీవోను రద్దు చేయాలని అన్నారు. 2013 కేంద్ర చట్టం ప్రకారమే ప్రభుత్వమే భూసేకరణ జరపాలన్నారు. ప్రాజెక్టులు కట్టండి కానీ రైతుల పొట్ట కొట్టవద్దని హితవు పలికారు. -
'జనాల పాదాలు కడిగి రుణం తీర్చుకుంటాం'
నిజామాబాద్: గోదావరి జలాలతో జనాల పాదాలు కడిగి రుణం తీర్చుకుంటామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మిషన్ భగరీథ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజాం సాగర్ ప్రాజెక్టులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ సాధన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎవరూ అడ్డుకున్న వచ్చే రెండేళ్లలో నిజాం సాగర్‌కు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ పూర్తైతే గ్రామాల్లోకి రానివ్వరని, ఓట్లు వేయరనే భయంతోనే టీడీపీ, కాంగ్రెస్‌లు నాటకాలాడుతున్నాయని వారు మండిపడ్డారు. -
మల్లన్నసాగర్ బాధితులకు మద్దతుగా ఆమరణదీక్ష
-
మల్లన్నసాగర్ బాధితులకు మద్దతుగా ఆమరణదీక్ష
-10 నుంచి సంగారెడ్డిలో నిరశన -అవసరమైతే సుప్రీం కోర్టుకు -కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి వెల్లడి సంగారెడ్డి మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా ఈ నెల 10 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్టు మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మట్లాడుతూ భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. అవసరమైతే పార్టీ పక్షాన సుప్రీం కోర్టును ఆశ్రరుుస్తామన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చేందుకు సంగారెడ్డిలోని ఐబీ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. హైకోర్టు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టినా సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండటాన్ని చూస్తే న్యాయవ్యవస్థపై కూడా విశ్వాసం లేకుండా పరిపాలన సాగిస్తోందన్నారు. తాము రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. దీక్ష కోసం ఇప్పటికే తమకు అనుమతి ఇవ్వాలని పోలీసుశాఖను కోరామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోన్నం శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలి : హరీశ్
మెదక్: రాష్ట్రానికి ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో శనివారం ప్రధాని పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సాక్షితో హరీశ్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు మోదీకి రాసిన లేఖను ఉపసంహరించుకోవాలన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన తమకు గర్వకారణమని హరీశ్ అన్నారు. ప్రధాని పర్యటనపై ప్రతిపక్షాలది గుడ్డి వ్యతిరేకతమని కొట్టిపరేశారు. 123 జీవోపై ప్రతిపక్షాలు స్వీట్లు పంచుకోవడం అనాగరికమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రైతులు, కూలీలు చేతి వృత్తుల వారందరిని ఆదుకునే బాధ్యత తమపై ఉందన్నారు. కోర్టుకు ఇదే విషయాలను వివరించి విజయం సాధిస్తామని హరీశ్ చెప్పారు. -
హైకోర్టు తీర్పు హర్షణీయం
సాక్షి, సంగారెడ్డి: 123 జీవోను కొట్టివేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళ ఓ ప్రకటనలో తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ సేకరణ ప్రభుత్వం 123 జీవో ప్రకారం చేపట్టిందన్నారు. ప్రభుత్వం నిర్వాసితులు డిమాండ్లను పట్టించుకోకుండా మొండిగా 123 జీవో ప్రకారం భూ సేకరణ ప్రారంభించిందన్నారు. హైకోర్టు సైతం నిర్వాసితులకు నష్టంచేసే 123 జీవోను కొట్టివేసి 2013 చట్టం ప్రకారం భూములు సేకరించాలని చెప్పందన్నారు. ఇకనైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా 2013 చట్టం ప్రకారం భూములు సేకరించి, నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. -
123 జీవో కొట్టివేతపై సంబరాలు
మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు ‘నిమ్జ్’ భూ బాధితుల విజయోత్సాహం తొగుట/కొండపాక/న్యాల్కల్: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం 123 జీఓను కొట్టివేయడంపై అటు మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఇటు జాతీయ ఉత్పాదక మండలి (నిమ్జ్) నిర్మించతలపెట్టిన జహీరాబాద్ ప్రాంతంలో బుధవారం సంబరాలు మిన్నంటాయి. కోర్టు తీర్పు వెలువడగానే ఆయా ప్రాంతాల్లోని ముంపు బాధితులు, భూనిర్వాసితులు వీధుల్లోకి వచ్చి మిఠాయిలు పంచుకున్నారు. బాణసంచా కాల్చి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలైన తొగుట మండలంలోని వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, తుక్కాపూర్, బి.బంజేరుపల్లి, వడ్డెర కాలనీలలో, కొండపాకమండలం ఎర్రవల్లి, సింగారం గ్రామాల్లో పండగ వాతవరణం నెలకొంది. గ్రామాల్లోని ప్రజలు, యువకులు, రైతులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. కాగా, మల్లన్నసాగర్‌ను వ్యతిరేకిస్తూ వేములఘాట్ భూనిర్వాసితులు చేస్తున్న దీక్షలు బుధవారంతో 60వ రోజుకు చేరుకున్నాయి. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించే వరకు తమ దీక్షలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. అటు.. ఇటు.. ఒకపక్క మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున నిరసన వ్యక్తం కావడం.. ఇదే క్రమంలో కొద్ది రోజుల క్రితం ముంపు బాధితులపై పోలీసులు విరుచుకుపడటం.. నేతల పరామర్శలు.. అంతలోనే మరోపక్క ఉన్నట్టుండి ఒక్కో ముంపు గ్రామం భూసేకరణకు ముందుకు రావడం.. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగడం.. ఈ పరిణామాలు కొనసాగుతున్న తరుణంలోనే జీవోకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడటం విశేషం. 2013 భూసేకరణ చట్టంతో రైతులకు నష్టం జరుగుతుందంటూ మంత్రి హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేశారని, నేడది కోర్టు తీర్పుతో పటాపంచలైందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోపాలస్వామి అన్నారు. 123 జీవోతో మెరుగైన పరిహారం అందదనే విషయం కోర్టు తీర్పుతో వెల్లడైందన్నారు. కోర్టు తీర్పు దరిమిలా.. రైతుల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూముల్ని తిరిగి ఇచ్చివేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. 123 జీఓ కొట్టివేత రైతుల విజయంగా ఆయా ప్రజా సంఘాలు అభివర్ణించాయి. మరోపక్క ఎర్రవల్లిలో బుధవారం కూడా రైతుల నుంచి భూసేకరణకు అంగీకారంగా సమ్మతి పత్రాలపై సంతకాల సేకరణ జరిగింది. 3 గంటల్లోనే 30 మంది రైతులు 86 ఎకరాలను ఇచ్చేందుకు అంగీకరిస్తూ సంతకాలు చేశారని అధికారులు ప్రకటించారు. రైతు కూలీల విజయం ఇక, కోర్టు తీర్పు జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్లో భూ బాధితులు, కూలీల్లో మరింత ఆనందాన్ని నింపింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న నిమ్జ్‌కు పెద్ద ఎత్తున భూమిని సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం ఇక్కడ కూడా 123 జీవో ప్రకారం భూసేకరణకు దిగగా, రైతు కూలీ సంఘం నాయకులు మోహన్, రాజు, తుక్కమ్మ తదితరులు గత జూన్‌లో హైకోర్టును ఆశ్రయించారు. నిమ్జ్ భూ బాధితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం అందించాలని తీర్పు వెలువరించడంతో రైతులు, కూలీలతోపాటు అఖిల పక్షం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. న్యాల్కల్ మండలంలోని 14 గ్రామాలతోపాటు ఝరాసంగం మండలంలోని మూడు గ్రామాల పరిధిలో 12,635 ఎకరాలు నిమ్జ్ పేరుతో భూములను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. మొదటి విడతగా ఝరాసంగం మండలం బర్దీపూర్, ఎల్గోయి, చీలపల్లి, చీలపల్లి తండాతో పాటు న్యాల్కల్ మండలం ముంగి, ముంగి తండా, రుక్మాపూర్, రుక్మాపూర్ తండాలను ఎంపిక చేశారు. అధికారులు ఆయా గ్రామాల పరిధిలోని పట్టా, అసైన్డ్ భూముల వివరాలను సేకరించారు. పట్టా భూములకు ఎకరానికి రూ:5.80 లక్షలు, అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.3 లక్షల పైచిలుకు చెల్లించారు. అయితే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా భూములు సేకరిస్తుందని నిమ్జ్ భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు ఆందోళనకు దిగారు. 123 జీఓను రద్దు చేసి 2013 చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. తీర్పు రైతులకు, కూలీలకు అనుకూలంగా రావడంతో బాధిత రైతులు, కూలీలో సంతోషం వ్యక్తమైంది.కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని సీపీఎం నాయకులు సాయిలు, రాంచెందర్, కాంగ్రెస్ నాయకులు, రైతులు అన్నారు. -
‘123 జీవో రద్దు ప్రభుత్వానికి చెంపపెట్టు’
నిజామాబాద్ సిటీ : మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ భూసేకరణకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 123ను రాష్ట్ర హైకోర్టు రద్దు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారన్నారు. ప్రతిపక్షాలు కూడా రైతుల పక్షాన నిలబడ్డాయన్నారు. 123 జీవో సరైందేనని సమర్థించుకున్న సీఎం కోర్టు తీర్పుపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. 2013లో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో తప్పుడు లెక్కలు చోటు చేసుకున్నాయని, వీటిపై కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మేయర్ సుజాత, మున్సిపల్ అధికారులు సీఎం ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు పోశెట్టి స్వయంగా విమర్శించటం ఆ పార్టీకి సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేశ్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి మోహన్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుమీర్‌హైమద్, నాయకులు బంటు రాము, విపుల్‌గౌడ్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ జావీద్ అక్రమ్, ఎస్టీసెల్ నగర అధ్యక్షుడు సుభాష్‌జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ
మల్లన్నసాగర్ ద్వారా కామారెడ్డికి తాగునీరు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డి : పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాడని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ నెంబర్ వన్ సీఎంగా కేసీఆర్ గుర్తింపు పొందారన్నారు. మంగళవారం స్థానిక వరలక్ష్మి గార్డెన్స్‌లో నిర్వహించిన నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలతో సాగు, తాగు నీటి కష్టాలు తీరుస్తున్నారని, కరువు నివారణ కోసం హరితహారం కింద కోట్లాది మొక్కలు నాటించారన్నారు. అడ్రస్ గల్లంతవుతుందనే.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పూర్తయి సాగునీటి కష్టాలు తీరితే తమకు స్థానం ఉండదనే భయంతోనే ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని గోవర్ధన్ విమర్శించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కామారెడ్డికి తాగునీటిని అందించేందుకే అష్టకష్టాలు ఎదురయ్యాయని, ప్రాణహిత–చేవెళ్ల 22వ ప్యాకేజీ ద్వారా ఈ ప్రాంతానికి నీరివ్వడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మంత్రిగా పని చేసిన షబ్బీర్‌అలీ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నాడని, ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని సూచించారు. మల్లన్నసాగర్ గేటు తెరిస్తే కూడవెళ్లి వాగు నుంచి ఎగువ మానేరులోకి నీరు చేరుతుందన్నారు. ఇసాయిపేటలోని సముద్రం చెరువును 3 టీఎంసీల రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి ఎగువమానేరు నుంచి పంపింగ్ చేయనున్నట్లు వివరించారు. అక్కడి నుంచి అమర్లబండ గుట్ట మీదికి తీసుకెళితే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు గ్రావిటీ ద్వారా నీళ్లివ్వవచ్చని నిపుణులు సూచించారన్నారు. కామారెడ్డి ప్రాంతానికి నీళ్లివ్వలేని కాంగ్రెస్ నేతలకు తమను విమర్శించే హక్కులేదన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్, ఏఎంసీ చైర్మన్లు రాజమణి, అమృత్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు మధుసూధన్‌రావు, రమేశ్, లక్ష్మి, ఎంపీపీ మంగమ్మ, డీసీసీబీ వైస్ చైర్మన్ ప్రేమ్‌కుమార్, నేతలు నిట్టు వేణు, ముస్తాక్‌హుస్సేన్, రాజేశ్వర్, ఆంజనేయులు, కృష్ణ, లక్ష్మారెడ్డి, మోహన్‌రెడ్డిæతదితరులు పాల్గొన్నారు. -
మల్లన్నసాగర్‌కు సింగారం ఓకే
* గజ్వేల్ కేంద్రంగా మంత్రి హరీశ్‌రావు మంత్రాంగం గజ్వేల్: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు భూములిచ్చేందుకు మెదక్ జిల్లా కొండపాక మండలం తిప్పారం పంచాయతీ పరిధిలోని సింగారం గ్రామం కూడా ముందుకొచ్చింది. ఆదివారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గజ్వేల్‌లో మూడు గంటలపాటు గ్రామస్తులతో జరిపిన చర్చలు ఫలించారుు. మల్లన్నసాగర్ వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్ గ్రామాలకు చెందిన నిర్వాతులను ఒప్పించిన హరీశ్‌రావు.. తాజాగా ఆదివారం సింగారం గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఈ గ్రామంలో 300 మంది రైతుల నుంచి 980 ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది. ముంపునకు గురవుతున్న ఈ గ్రామానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, మల్లన్నసాగర్లో చేపల పెంపకంపై హక్కులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తమకు గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోనే డబుల్ బెడ్రూమ్ పథకం కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భూ నిర్వాసితులు కోరగా.. హరీశ్ అంగీకరించారు. గ్రామాన్ని సీఎం దత్తత తీసుకునే విషయం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. మంత్రి హామీలతో సంతృప్తి చెందిన నిర్వాసితులు రిజర్వాయర్ నిర్మాణానికి తాము సహకరిస్తామని ప్రకటించారు. ఒక్క ఎకరానికై నా నీరిచ్చారా? అరవై ఏళ్లలో జిల్లాలో ఒక ఎకరానికైనా నీరి చ్చారా అని మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. 71 ఊర్లను ముంచి సిం గూరు ప్రాజెక్టును నిర్మించి ఇక్కడ ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకుండా ైెహదరాబాద్కు పం పించింది మీరు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగూరు నిర్వాసితులు ఇంకా ఎంతో మంది నష్టపరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి దుస్థితిని నివారించేందుకు ప్రస్తుతం మల్లన్నసాగర్లో తక్షణమే నష్ట పరిహారం అందించేందుకు మాత్రమే 123 జీఓ తీసుకొచ్చామని,, ఇందులో వేరే ఉద్దేశం లేదన్నారు. టీడీపీ నేతల మాటలను నమ్మవద్ధంటూ సూచించారు. ఆకుపచ్చ తెలంగాణను సాధించడంలో సింగారం గ్రామస్తులు సైతం ముందుకొచ్చి తమ భూములిస్తామని ప్రకటించడం అభినందనీయమని పేర్కొన్నారు. రిజర్వాయర్ నిర్మాణంతో పాటు నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాన్ని సైతం ఒకేసారి వేగవంతంగా చేపడతామని వెల్లడించారు. -
జిల్లా మొత్తం సస్యశ్యామలమే
కరువు అనేదే ఉండదు ఉమ్మడి రాష్ట్రంలో మెతుకుసీమ వెనుకబాటు ఆకలి చావులు ఇక్కడే అధికం రైతుల సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్ - మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తూప్రాన్: మల్లన్న సాగర్‌తో జిల్లా మంచి రోజులు రానున్నాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరువు అనేది ఉండదని, జిల్లా అంతా సస్యశ్యామలమవుతుందన్నారు ఆదివారం తూప్రాన్ పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మెదక్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. అభివృద్ధిలో వెనుకబడిన జిల్లాను మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ద్వారా సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రాజకీయ కుట్రలు పన్నినా మల్లన్న సాగర్‌ను కట్టితీరుతామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లా ప్రజల మనుగడ ముడిపడి ఉందన్నారు. ఇది పూర్తయితేనే సీఎం కేసీఆర్ కల సాకారమవుతుందన్నారు. ప్రజలు సైతం తమ భూములను ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎనిమిది ముంపు గ్రామాలకు గాను ఏడు గ్రామాల రైతులు స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చినట్టు తెలిపారు. సీఎం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఆగస్టు 7న ప్రారంభించేందుకు గజ్వేల్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామునిగారి శ్రీశైలంగౌడ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్, సర్పంచ్ శివ్మమ్మ, ఉప సర్పంచ్ నందాల శ్రీనివాస్, నాయకులు మన్నె శ్రీనివాస్, మామిడి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కోదండరాంను విమర్శించడం తగదు: చాడ
- మల్లన్నసాగర్ నిర్వాసితుల పక్షాన పోరాటం - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఎదులాపురం(ఆదిలాబాద్) ప్రజల పక్షాన పోరాడుతున్న జేఏసీ చైర్మన్ కోదండరాంను టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, నేతలు విమర్శించడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లో పార్టీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వం రైతులను నష్టాల పాలు చేస్తోందని, మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన పోరాడుతామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరచి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలకు వాత పెడితే తిరిగి ప్రజలు వాతలు పెట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. అటవీ హక్కు చట్టాన్ని అనుసరించి పట్టాలు పంపిణీ చేసే వరకు గిరిజనుల పక్షాన పోరాడుతామని తెలిపారు. పార్టీలు మారే ముందు నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేసే విధంగా ఇష్టానుసారంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్, సహ కార్యదర్శి ఎస్.విలాస్, ముడుపు ప్రభాకర్‌రెడ్డి, నళినిరెడ్డి, అరుణ్‌కుమార్, సిర్ర దేవేందర్, మేస్రం భాస్కర్, కుంటాల రాములు పాల్గొన్నారు. -
లాఠీచార్జిపై నేతల ధ్వజం
ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోం ఆగస్టు 1 నుంచి మేధావులతో చర్చా వేదికలు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్ గజ్వేల్ రూరల్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములను కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జీలు చేస్తూ వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భూనిర్వాసితుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్ ఆరోపించారు. శనివారం గజ్వేల్ పట్టణంలోని ఆర్అండ్బీ అతిధిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు హరీష్‌రావు ఏజెంట్లలా తయారయ్యారన్నారని ఆరోపించారు. తాము సిద్దిపేట సబ్జైల్లో ఉన్న మల్లేష్‌ను పలుకరించడం జరిగిందని.. అతన్ని హైదరాబాద్‌లో అరెస్టు చేసి గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు పేర్కొనడం సమంజసం కాదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులను పరామర్శించేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడం బ్రిటీష్ కాలంలో జలియన్‌వాలా బాగ్ ఉద్యమాన్ని తలపిస్తుందన్నారు. ప్రజాస్వామ్య పాలనలో హరీష్‌రావు హిట్లర్ వారసత్వం పుణికిపుచ్చుకున్నట్లు ప్రజాపోరాటాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ముంపు బాధిత రైతులంతా స్వచ్ఛందంగా ప్రాజెక్టు నిర్మాణానికి భూములిస్తున్నారని గోబెల్ ప్రచారం నిర్వహిస్తున్నారే తప్ప ఎక్కడా కూడా 30 శాతానికి మించి రైతులు భూములివ్వలేదన్నారు. బ్రిటీష్ కాలంలో అభివృద్ధి పేరుతో దోచుకోగా... నేడు అభివృద్ధి పేరుతో భూములను గుంజుకుంటున్నారని మండిపడ్డారు. ‘మల్లన్నసాగర్’ ప్రాజెక్టుకు హరీష్‌రావే కథానాయకుడని పేర్కొన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని... ప్రజలకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. ముంపు గ్రామాల్లో స్వచ్ఛందంగా భూములిస్తున్నట్లు వారిచే చెప్పిస్తే తాము దేనికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. 123 జీవో వచ్చి నేటికి సరిగ్గా ఏడాది గడిచిందని. ఈ జీవోతో ఎటువంటి ప్రయోజనం చేకూరదన్నారు. భూములు తీసుకున్న వారికి ఏ ఒక్క కుటుంబానికైనా రూ. 5లక్షల ఉపాధి పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. 123 జీవోకు వ్యతిరేకంగా 150 కేంద్రాలలో నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. 2013 చట్టం ప్రకారమే నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మల్లన్న బాధితులను పరామర్శించేందుకు వస్తున్న లాయర్లపై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ఆగస్టు 1 నుంచి భూనిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మేధావులచే చర్చా వేదికలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌రెడ్డి, నాయకులు సాగర్, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులున్నారు. -
ఎంసెట్ లీకుపై సీబీఐ విచారణ జరిపించాలి: కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: మల్లన్నసాగర్ కు వెళ్తున్న నేతలను అరెస్టు చేయడం అన్యాయమని కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకరరెడ్డిలు అన్నారు. యూనివర్సిటీలకు వీసీల నియామకాలపై హైకోర్టు తీర్పు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సర్కారుకు చెంపపెట్టని విమర్శించారు. కేసీఆర్ అసమర్ధ పాలన వల్లే ఎంసెట్-2 పేపర్ లీకైందని, లీకుకు మేగ్నట్ ఇన్ఫోటెక్ కు ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. అర్హత లేని సంస్థకు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని దుయ్యబట్టారు. మేగ్నట్ ఇన్ఫోటెక్ కు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావుకు సంబంధాలున్నాయని ఆరోపణలు ఉన్నాయని, ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో పాటు వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు ఎంసెట్ లీకుకు బాధ్యులను చేస్తూ కేబినేట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని అన్నారు. మరోవైపు మెదక్ జిల్లా నుంచి మల్లన్నసాగర్ కు బయలుదేరిన లాయర్ల బృందాన్ని ఒంటిమిట్ట వద్ద అడ్డుకున్న పోలీసులు ములుగు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వవైఖరికి నిరసనగా న్యాయవాదులు ఒంటిమిట్టలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ కారు రాస్తారోకో చేస్తున్న లాయర్ల బృందం మీదుగా దూసుకుపోయింది. ప్రమాదంలో హైకోర్టు అడ్వకేట్ ప్రసాద్ కు గాయాలయ్యాయి. ఆగ్రహించిన న్యాయవాదులు పోలీసుల తీరును ఖండిస్తూ పీఎస్ ఎదుట ధర్నా చేశారు. -
మల్లన్నసాగర్ పాకిస్తాన్లో ఉందా?
మల్లన్నసాగర్ తెలంగాణలో ఉందా లేక పాకిస్తాన్లో ఉందా అని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఎన్నిరోజులు అడ్డుకునే ప్రయత్నం చేసినా మేము మాత్రం అక్కడికి వెళ్లే వరకు విశ్రమించేది లేదని ఘంటాపధంగా తెలిపారు. మల్లన్నసాగర్‌పై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడంలేదని అన్నారు. ఫామ్‌హౌస్‌లో ఉంటూ పోలీసు రాజ్యం నడుపుతున్నారని విమర్శించారు. మల్లన్న సాగర్ రైతులను కాంగ్రెస్ నాయకులు పరామర్శించడానికి వెళ్తుంటే ప్రభుత్వ పెద్దలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీల అరెస్ట్‌లను ఖండిస్తున్నానని ఆమె తెలిపారు. మాకేమో 144 సెక్షన్ అంటున్న పోలీసులు.. టీఆర్ఎస్ నాయకులకు ఎలా ర్యాలీలకు అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు. ఎంసెట్ పేపర్-2 లీకేజీ అయ్యి వేలాది మంది విద్యార్థులు ఆందోళనలో ఉన్నా కేసీఆర్ స్పందికపోవడం వెనక మతలబు ఏమిటన్నారు. అవినీతి ఆరోపణల వచ్చిన వెంటనే గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యపై చర్య తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని అన్నారు. దీనిని బట్టి చూస్తే లీకేజే వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. -
అక్రమ అరెస్ట్‌లు తగదు
సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం సంగారెడ్డి మున్సిపాలిటీ: మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కేసులు బనాయించి అరెస్టులు చేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. శుక్రవారం సీపీఎం కార్యాలయం నుంచి ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ... మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేసిన సీపీఎం నాయకుడు మల్లేశం, భాస్కర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2013 చట్టం ప్రకారం గ్రామ సభలు జరిపి ప్రజాభిప్రాయం ఎందుకు తీసుకోలేదన్నారు. టీఆర్ఎస్ నాయకులు దళారులను నియమించి రైతులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ముంపు గ్రామాల ప్రజలకు సీపీఎం అండగా ఉంటుందన్నారు. ఈ నిరసనలో సీపీఎం నాయకులు సాయిలు, యాదవరెడ్డి, ప్రవీణ్‌కుమార్, అశోక్, ఆశన్న, మహబుబ్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న పోలీస్ పికెట్
తొగుట: మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ముంపు గ్రామాలైన వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల చుట్టూ శుక్రవారం కూడా పోలీస్ పికెట్ కొనసాగింది. గ్రామాల్లోకి వెళ్లేవారిని క్షుణ్ణంగా పరిశీలించి వదులుతున్నారు. తమ అవసరాల నిమిత్తం బయటకు వెళ్లకుండా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్లే పిల్లబాటల వెంట కూడా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. గ్రామాలను నిర్బంధించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. -
మల్లన్న సాగర్‌తో జిల్లా సస్యశ్యామలం
ప్రాజెక్టును అడ్డుకోవడం విపక్షాలకు తగదు రైతులను రెచ్చగొట్టడం సరికాదు టీఆర్ఎస్ నాయకుల సూచన చిన్నకోడూరు: కరువు పరిస్థితుల నుంచి మెతుకు సీమ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్మాణం చేపడుతుందని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం సర్పంచ్‌లు ఆంజనేయులు, నీరుగొండ శ్రీనివాస్, ఎంపీటీసీ మల్లేశం, నాయకులు వర్కోలు రాజలింగం, చంద్రమౌళిగౌడ్, మందపల్లి చంద్రం విలేకరులతో మాట్లాడుతూ.. మల్లన్న సాగర్‌ను ప్రతిపక్షాలు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. మల్లన్న సాగర్ పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందన్నారు.ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకులు రైతులను రెచ్చగొడుతూ అడ్డుకోవాలని చూడడం దారుణమన్నారు. సమైక్య రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్‌లు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకుండా అన్యాయం చేయడంతోనే ఇక్కడ కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీంతో ఆత్మహత్యలు పెరిగాయన్నారు. కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నట్లు తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందన్నారు. ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ప్రతిపక్షాల మాటలకు మోసపోతే మళ్లీ కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు రైతులకు సూచించారు. బంగారు తెలంగాణ కోసం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని విపక్ష పార్టీల నాయకులను కోరారు. -
'మల్లన్నసాగర్ తో యుద్ధం మొదలు'
కరీంనగర్: తెలంగాణలో అవినీతి, అసమర్థ పాలన సాగుతోందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. మంత్రులకు అధికారం లేక డమ్మీలుగా ఉన్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పాలనకు రెండేళ్లతో హనిమూన్ ముగిసిందన్నారు. మల్లన్నసాగర్ తో యుద్ధం మొదలైందని అన్నారు. ప్రతిపక్షాలు లేకుండా శాసనసభను కేసీఆర్ నాశసనం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో హరించుపోయిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియాదే అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్ భగీరథ పథకాల్లో అవినీతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. -
మల్లన్నసాగర్‌కు భూమిలిస్తాం
తొగుట: మల్లన్నసాగర్ నిర్మాణానికి తమ భూములిస్తామంటూ మండల పరిధిలోని పల్లె పహాడ్ గ్రామస్తులు ముందుకొచ్చారు. రాష్ట్ర మంత్రి హరీష్‌రావుతో చర్చలు జరిపేందుకు గ్రామ సర్పంచ్ కీసర సంతోష, జెడ్పీటీసీ రూప ఆధ్వర్యంలో గజ్వేల్‌కు బుధవారం తరలివెళ్లారు. మంత్రితో గ్రామస్తులు జరిపిన చర్చలు సఫలం కావడంతో తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. -
ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దు
బాన్సువాడ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్‌లో నిర్మిస్తున్న ఎత్తిపోతల ముంపు బాధితులతో కలిసి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, దీనికి నిరసనగా అధికార టీఆర్ఎస్ నాయకులు మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. బాన్సువాడతో పాటు బీర్కూర్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి చౌరస్తా, వర్ని, కోటగిరి మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ నాయకులు, మార్కెట్ కమిటీల చైర్మన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కలిసి నిరసనలకు దిగారు. కాంగ్రెస్, టీడీపీతోపాటు ప్రొఫెసర్ కోదండరాం దిష్టిబొమ్మలను దహనం చేశారు. బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ నిరసనలు చేశారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ నార్ల సురేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ మాట్లాడారు. ఉత్తర తెలంగాణాలోని ఐదు జిల్లాలను సస్యశ్యామలం చేసే మల్లన్నసాగర్‌ను నిర్మించడకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారిని రెచ్చగొట్టే ధోరణిని ప్రతిపక్షాలు మానుకోవాలని హితువు పలికారు. టీఆర్ఎస్ నాయకులు మహ్మద్ ఎజాస్, కొత్తకొండ భాస్కర్, ఎర్వల కృష్ణారెడ్డి, నార్ల సురేష్, ముఖీద్, ముదిరెడ్డి విఠల్‌రెడ్డి ఉన్నారు. ప్రతిపక్షాలకు పుట్టగతులుండవు.. వర్ని : మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తయి సాగు నీటి వనరులు పెంపొందితే తమకు పుట్టగతులుండవని ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాయని జెడ్పీటీసీ సభ్యుడు విజయభాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ కులకర్ణి ఆరోపించారు. మండల కేంద్రంలో మంగళవారం టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రొఫెసర్ కోదండరాం దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. మల్లన్న సాగర్ బాధిత రైతులకు అండగా ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. నిజాంసాగర్ ఆయకట్టుకు సాగు నీరందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ ప్రాంతాన్ని ఎడారి చేయడానికే ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఎంపీపీ చింగ్లీబాయి, వైస్ ఎంపీపీ సంజీవ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మేక వీర్రాజు, విండో చైర్మన్లు పత్తిరాము, హన్మంత్ రెడ్డి, పిట్ల శ్రీరాములు, ఎంపీటీసీ కలాల్ గిరి, టీఆర్ఎస్ నాయకులు ఇందూర్ సాయిలు, బజ్యానాయక్, చింతం సంజీవ్, కుంకుమ దత్తు, శ్రీనగర్ రాజు, రాంచందర్, బొట్టె గజేందర్, నామాల సాయిబాబా, వి. గోపాల్, సత్యనారాయణ, మైనారిటీ నాయకులు మహ్మద్ బారీ, కరీం ఉన్నారు. కోటగిరిలో.. వర్ని : మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపిస్తూ మంగళవారం టీఆర్ఎస్ నాయకులు కోటగిరి మండల కేంద్రంలో ప్రతిపక్షాల (టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు) దిష్టిబొమ్మలను దహనం చేశారు. వారు మాట్లాడుతూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక రైతులను ప్రతి పక్ష పార్టీలు రె^è ్చగొడుతున్నాయన్నారు. ఈ ప్రాంత రైతాంగాన్ని ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ తహసీల్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నీరడి గంగాధర్, ఎంపీపీ సులోచన, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రావ్, ఏఎంసీ చైర్మన్ శంకర్ పటేల్, నాయకులు గంగాధర్ దేశాయ్, బర్ల గంగారాం, బీర్కూర్ గంగాధర్, హంగర్గ స్వరూప, బి.రాములు, సైదయ్య, కిశోర్ ఉన్నారు. -
విరసం నేత వరవరరావు అరెస్ట్
విరసం నేత వరవరరావును మెదక్ జిల్లా కొండపాక మండలం కోనాయిపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు లాఠీచార్జీలో గాయపడ్డ మల్లన్న సాగర్ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్నా ఆయనను మార్గమధ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న సాగరు ముంపు బాధితులను పరమార్శించడానికి వెళుతున్న విరసం, ప్రజాఫ్రంట్ నాయకులు డా.కాశీం, రవించంద్ర, దేవేంద్ర, గీతాంజలి,నలమాస కృష్ణ, రమణాచారీ, మెంచు రమేష్, కోటి, రమ, స్నేహ,బద్రీ తదితరులను వేములగట్టు పోలీస్ స్టేషన్ కి తరలించారు. -
నిరసన జ్వాల
♦ ఉద్రిక్తంగా మారిన చలో మల్లన్న సాగర్ ♦ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్టు ♦ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి గృహ నిర్బంధం ♦ డీసీసీ అధ్యక్షుడు సహా పలువురు హౌస్ అరెస్టు ♦ కోదండరాం తదితరులకు వ్యతిరేక నినాదాలు ♦ పలుచోట్ల ప్రతిపక్షాల దిష్టిబొమ్మలు దహనం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : చలో మల్లన్న సాగర్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు ఆదివారం రాత్రి నుంచి కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల కదలికలపై నిఘా పెట్టారు. సోమవారం ఉదయం నుంచి అరెస్టుల పరంపర కొనసాగించిన పోలీసులు పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు. మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో మల్లన్న సాగర్’కు వెళ్తున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, రాష్ట్ర నాయకులు గడుగు గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్‌రెడ్డి, నగర అధ్యక్షుడు కేశ వేణు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, ఐఎన్టీయుసీ నేత వెంకులు తదితరులను అడ్డుకున్నారు. వారిని సుదర్శన్‌రెడ్డి ఇంట్లోనే గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఇంట్లో ఆయనతోపాటు కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఖుద్దూస్, యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు సాగర్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు విఫుల్‌గౌడ్, సుమీర్ తదితరులను పోలీసు గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పార్టీ నేతలు ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. కాగా.. గృహ నిర్బంధం చేయడంపై మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలతో తన ఇంట్లోనే నిరసన తెలిపారు. పలుచోట్ల కాంగ్రెస్ నేతల అరెస్టు నిరసన ప్రదర్శనలు చేయకుండా బీర్కూర్ మండలంలో సుమారు 10 మంది కాంగ్రెస్ నాయకులు ముందస్తు అరెస్టు చేశారు. కోటగిరిలో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం తీరుకు నిరసనగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఆదిలాబాద్ డీసీసీ ఉపాధ్యక్షుడు నరేశ్ జాదవ్, బాల్కొండ మాజీ ఎంపీపీ రాజేశ్వర్ సహా 25మంది కాంగ్రెస్ నాయకులను డిచ్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత సొంత పూచికత్తుపై విడుదల చేశారు. కాగా మల్లన్నసాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళన కోసం బయలుదేరిన బాల్కొండ నియోజకవర్గ నాయకులను ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాల్కొండ నుంచి మాజీ ఎంపీపీ జక్క రాజేశ్వర్, జెడ్పీటీసీ భర్త నర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నడ్పిన్న, కమ్మర్పల్లి మాజీ చైర్మన్ రవిలను అదుపులోకి తీసుకున్నారు. కోదండరాం సహా ప్రతిపక్షాల దిష్టిబొమ్మల దహనం మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకోవడంపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం భగ్గుమన్నారు. ప్రొఫెసర్ కోదండరాం సహా కాంగ్రెస్, టీడీపీ, ప్రతిపక్ష పార్టీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ మండల కేంద్రం, బీర్కూర్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి ఎక్స్‌రోడ్డు, వర్నీ మండల కేంద్రం, కోటగిరి మండల కేంద్రాల్లో మల్లన్నసాగర్‌పై కాంగ్రెస్, టీడీపీతోపాటు ప్రొఫెసర్ కోదండరాంలు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల దిష్టిబొమ్మలను, ప్రొఫెసర్ కోదండరాం దిష్టి బొమ్మను దహనం చేసి, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు అడ్డుకునే విపక్షాల యత్నంపై బోధన్‌లో టీఆర్ఎస్ శ్రేణులు మండి పడ్డాయి. కాంగ్రెస్, టీడీపీ, ప్రొఫెసర్ కోదండరాం దిష్టిబొమ్మల దహనం చేశారు. బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు అబిద్, మండల అధ్యక్షుడు సంజీవ్, ముఖ్యనేత తూము శరత్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, సొసైటీ చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని నిజామాబాద్ వెళ్లె ప్రధాన రహదారిలో గల సాటాపూర్ గేట్ వద్ద ప్రతిపక్ష పార్టీలు, ప్రొఫెసర్ కోదండరాం దిష్టిబొమ్మను దహనం చేశారు. నవీపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, టీడీపీ, టీ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌లో నియోజకవర్గ స్థాయిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రైతు విభాగం అధ్యక్షుడు సురేందర్‌రెడ్డితోపాటు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజాంసాగర్‌లో ప్రతిపక్షాల తీరుపై భగ్గుమన్న టీఆర్ఎస్ నాయకులు టీడీపీ, కాంగ్రెస్ దిష్టిబొమ్మలను గాడిదపై ఊరేగించి దహనం చేశారు. ఎల్లారెడ్డి మండలంలో కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహనం చేశారు. -
హోరెత్తిన ‘మల్లన్న సాగర్’
అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలు మద్దతుగా రైతు సంఘాల ర్యాలీ వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన దుబ్బాక: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు అనుకూలంగా ఓ వర్గం, వ్యతి రేక ప్రదర్శనలకు నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక మంగళవారం వేదికైంది. మల్లన్న సాగర్ నిర్మించాల్సిందేనని రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో దుబ్బాక ప్రధాన వీధు ల్లో వందలాది మంది రైతులు ర్యాలీ నిర్వహిం చారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి లాల్ బహదూర్ శాస్త్రీ, అంబేద్కర్ విగ్రహం, నగర పంచాయతీ, బస్టాండ్ మీదుగా ర్యాలీ చేపట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రతిపక్షాలకు సంబంధించిన దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవనేని రఘునంద¯ŒSరావు సమక్షంలో బీజేపీ కార్యకర్తలు మల్లన్న సాగర్ బాధితులకు మెరుగైన పరిహారం చెల్లించాలని, బాధితులపై అకారణంగా పోలీసుల దాడిని నిరసిస్తూ తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో బీజేపీ నాయకులు వడ్ల రాజు, అంబటి బాలేష్ గౌడ్, శెట్టి భూపతి, పల్లె వంశీకృష్ణ గౌడ్, కోమటిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తునికి లింగం, సత్తు తిరుమల్‌రెడ్డి, రాజిరెడ్డి, ఆస రాజశేఖర్, రైతు సంఘాల సమాఖ్య నాయకులు టేకులపల్లి మల్లారెడ్డి, జీడిపల్లి రవి, తౌడ శ్రీనివాస్, ర్యాకం పద్మశ్రీరాములు, పోతనక రాజయ్య, మాధవనేని రాంచందర్‌రావు, పోలబోయిన నారాగౌడ్, బండి రాజు, అమ్మన మహిపాల్‌రెడ్డి, జీడిపల్లి కిష¯ŒS, పూజారి మల్లేశం, శేర్ల కైలాస్, అక్కల వినోద, అస్క రవి, కొంగరి ముత్తారెడ్డి, దొంతగౌని విజయ శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డి పాల్గొన్నారు. కృత్రిమ ఉద్యమం పేరుతో మోసం తెలంగాణ ఉద్యమ కాలంలో సీమాంధ్రులు చేసినట్లుగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందితో కలిసి కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తోందని బీజేపీ నాయకుడు ఎం. రఘునంద¯ŒSరావు ఆరోపించారు. సర్వం కోల్పోతున్న ముంపు బాధితులకు నష్టపరిహారాన్ని ఇవ్వకుండా ప్రభుత్వమే ప్రజలను రెచ్చగొడుతోం దని విమర్శించారు. మల్లన్న సాగర్ ముంపు బాధితులపై పోలీసుల అమానుష దాడిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ముంపు బాధితులను ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయని మంత్రి హరీశ్‌రావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించడం బాధాకరమన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ప్రాజెక్టులను అక్రమ మార్గాల ద్వారా నిర్మించాలనుకోవడం ప్రభు త్వ దమనీతికి నిదర్శనమన్నారు. ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఇంజి నీర్లు చూపిస్తుంటే ఇంజినీర్ల సలహాలు, సూచనలను బేఖాతర్ చేస్తోందన్నారు. ఇమామ్‌బాద్ 1.5 టీఎంసీల నుంచి 0.8 టీఎంసీలకు, పాములపర్తి 21 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు ఎలా తగ్గిం దని?, కొమురవెల్లి మల్లన్న సాగర్ 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు ఎలా పెరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం.. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులని చూడకుండా విచక్షణ రహితంగా లాఠీచార్జి, కాల్పులు జరి పిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. మల్లన్న సాగర్ నిర్మించాల్సిందే... మెదక్‌తోపాటు మరో నాలుగు జిల్లాల రైతాంగానికి లబ్ధి చేకూరే కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను కట్టి తీరాల్సిందేనని రైతు సంఘాల సమాఖ్య సమన్వయకర్త రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాగు, సాగు నీరులేక జనం అల్లాడిపోతుంటే అవేమి పట్టనట్లుగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సీమాంధ్ర పాలకుల మోచేతి నీళ్లు తాగిన ప్రతిపక్షాలు స్వరాష్ట్రంలో ప్రజల ప్రయోజనార్థం ప్రాజెక్టులను నిర్మిస్తుంటే అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ముంపు బాధితులను తాము గుండెల్లో పెట్టుకుని చూస్తామన్నారు. ముంపు బాధితులకు బాసటగా నిలవాల్సిన ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇది ప్రతిపక్షాలకు మంచిది కాదన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు లేకనే తెలంగాణ తెచ్చుకున్నామని, అటువంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తామంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని ఆరోపించారు. మల్లన్న సాగర్ నిర్మించే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతాంగమంతా అండగా ఉంటుందని ప్రకటించారు. -
కాంగ్రెస్ నాయకుల అరెస్టు
ఆదిలాబాద్/మంచిర్యాల రూరల్ : మల్లన్నసాగర్ నిర్వాసితులకు సంఘీభావం తెలుపడానికి తరలి వెళ్లిన జిల్లా కాంగ్రెస్ నాయకులను హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చలో మల్లన్నసాగర్‌కు తరలి వెళ్తుండగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్‌జాదవ్, ఉపాధ్యక్షుడు మల్లెపూల నర్సయ్య, డీసీఎంఎస్ డైరెక్టర్, ఏఐసీసీ కమిటీ సభ్యుడు కోటేష్, ఇచ్చోడ మండల అధ్యక్షుడు మహమూద్‌ఖాన్, జిల్లా కిసాన్‌సెల్ అధ్యక్షుడు మల్లేష్, నారాయణరెడ్డిలను డిచ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద ముందస్తుగా కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, షబ్బీర్‌అలీ తదితర నాయకులతో జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఓబీసీ సెల్ రాష్ట్ర సమన్వయకర్త సుంకి సత్యంలను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులతో చర్చించి న్యాయపరంగా అందాల్సిన పరిహారం అందజేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
బయటివారే చిచ్చు పెడుతున్నారు
నాటి తెలంగాణ ద్రోహులే నేడు ప్రాజెక్టులు పెడుతున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సాక్షి, సంగారెడ్డి: మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో బయటి నేతలు జిల్లాకు వచ్చి చిచ్చుపెడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. నాడు తెలంగాణ రాకుండా అడ్డుకున్న ద్రోహులే నేడు మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారన్నారు. రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్షాల పన్నిన ఉచ్చులో పడవద్దన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టులు పూర్తయితే తమ ఉనికికే ప్రమాదమని ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నాయన్నారు. తెలంగాణ రాకుండా అడ్డుకున్న టీడీపీ ఇప్పుడు మల్లన్నసాగర్ తోపాటు తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ సైతం రాజకీయలబ్ధి కోసం మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనర్సింహ సింగూరు ప్రాజెక్టు కాల్వల భూ సేకరణలో 2013 చట్టం ప్రకారం ఎందుకు పరిహారం చెల్లించలేదన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు పన్నినా రైతులు, ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నంటే ఉన్నారన్నారు. విలేకరుల సమవేశంలో సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్ సుభాన్, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌చారి, నరహరిరెడ్డి, ప్రభుగౌడ్, రాంరెడ్డి, దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో నిరంకుశపాలన
డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి నర్సాపూర్: రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆమె ఫోన్లో సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. పోలీసులు లాఠీ చార్జీలో గాయపడిన రైతులను పరామర్శించేందుకు మంగళవారం తమ పార్టీ రాష్ట్ర నాయకులు వెళ్లగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిరంకుశంగా వ్యవహరించారన్నారు. తాను ఏటిగడ్డ కిష్టాపూర్ వెళ్తుండగా తనను హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో అరెస్టుచేసి మచ్చబొల్లారం పోలీస్స్టేన్కు తరలించారన్నారు. గాయపడిన రైతు కుటుంబాలను అధికార పార్టీ నాయకులు పరామర్శించడం లేదని, తాము పరామర్శిస్తామంటే అడ్డుకోవటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం తమను ఎన్నిసార్లు అరెస్టు చేసినా మల్లన్నసాగర్ రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. అల్వాల్ వద్ద తనతో పాటు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి సాయంత్రం వదిలిపెట్టారన్నారు. -
ప్రజావ్యతిరేక పాలన
మల్లన్నసాగర్ రైతులను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నాయకుల అరెస్టు తాండూరు: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని తాండూరు కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులను పరామర్శించేందుకు మంగళవారం వెళుతున్న తాండూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు దారాసింగ్, ద్యావరి విష్ణువర్ధన్‌రెడ్డి, అపూ, సంతోష్, ప్రభాకర్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి, విద్యాసాగర్, రఘు, రాజ్‌కుమార్, అశోక్, నారాయణరెడ్డి, రాజు, పునీత్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులను శామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. అనంతరం వారిని దుండిగల్ ఠాణాకు తరలించి, వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఈసందర్భంగా నాయకులు ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. బలవంతంగా రైతుల నుంచి భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. దౌర్జన్యంగా కాకుండా ఇష్టపూర్వంగా రైతుల నుంచి భూములు తీసుకుని ప్రాజెక్టులు నిర్మించాలని వారు ప్రభుత్వానికి సూచించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడమే తప్ప రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. -
కరీంనగర్లో కాంగ్రెస్ నేతల అరెస్టు
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్ సమీపంలోని అల్గునూర్‌లో మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ తదితరులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మృత్యుంజయం తదితరులు చేపట్టిన రాస్తారోకోను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం వారందరినీ మానకొండూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో వారు విలేకరులతో మాట్లాడుతూ..మల్లన్నసాగర్ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా కేవలం 123 జీవో ద్వారా ప్రాజెక్టు కోసం నిర్బంధంగా భూమిని సేకరించటం ప్రభుత్వానికి తగదన్నారు. -
మల్లన్న మంటలు
-
టీడీపీ, సీపీఎం కుట్రల వల్లే..
- మల్లన్నసాగర్ ఘటనపై మంత్రి హరీశ్ ఫైర్ - ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులు ఉండవనే అడ్డుకుంటున్నారు - బయట నుంచి వచ్చినవారే పోలీసులు, రైతులపై రాళ్లు రువ్వారు - వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం - ప్రజలు తిరస్కరించడంతో ప్రతిపక్షాల బంద్ విఫలమైంది సాక్షి, హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో హింసాత్మక పరిస్థితులు నెలకొనడానికి టీడీపీ, సీపీఎంల కుట్రలే కారణమని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయి కోటి ఎకరాలకు సాగునీరందితే తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే భయంతోనే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. సోమవారమిక్కడ టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో హరీశ్ మాట్లాడారు. సంగారెడ్డి, హైదరాబాద్ తదితర బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారే రైతులను రెచ్చగొట్టారని, పోలీసులపై, రైతులపై రాళ్లు రువ్వారని అన్నారు. హింసాత్మక ఘటనలను చోటు చేసుకోవడానికి కారణమైన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించడంతో ప్రతిపక్షాలు సోమవారం తలపెట్టిన బంద్ విఫలమైందన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని విపక్షాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడతున్నాయని మండిపడ్డారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎనిమిది గ్రామాలకుగాను ఆరు గ్రామాల రైతులు భూములివ్వడానికి అంగీకరించారని వెల్లడించారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ప్రతిపక్షాలు ఇటీవల ఏ టెంట్ కింద దీక్షలు చేశాయో, అదే టెంట్ కింద రైతులు భూములిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని వివరించారు. మిగిలిన రెండు గ్రామాల్లో కూడా ఒకట్రెండు రోజుల్లో భూసేకరణ సమస్య పరిష్కారమైతే తమ పని అయిపోయినట్లేనని భావించిన టీడీపీ, సీపీఎం నేతలు రాజీవ్ రహదారిపై హింసాత్మక ఘటలకు కుట్రపన్నారన్నారు. ‘‘అధికారులెవరూ ముంపు గ్రామాలకు వెళ్లి భూములివ్వాలని రైతులను అడగడం లేదు. రైతులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవు. 2013 భూసేకరణ చట్టం లేదా 123 జీవోలలో ఏది కావాలనుకుంటే దాని ప్రకారం ప్రకారం భూసేకరణ జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాక ఇక సమస్య ఎక్కడిది? ప్రభుత్వ సంకల్పానికి సహకరించడానికి బదులు ప్రతిపక్షాలు ప్రాజెక్టులే కట్టకుండా అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయి. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఢిల్లీలో ఫిర్యాదులు చేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. ఖమ్మంను ముంచుతున్నారు ‘‘ఇన్ని రిజర్వాయర్లు అవసరమా అని కొందరు మాట్లాడుతున్నారు. అది వారి అవివేకానికి నిదర్శనం. నదులు లేకున్నా ఆంధ్రా ప్రాంతంలో వెలిగొండ, అవుకు తదితర రిజర్వాయర్లు ఎందుకు నిర్మించారో చెప్పాలి. కృష్ణా డెల్టాలో మూడో పంట కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తూ ఖమ్మం జిల్లాలో 8 వందల గ్రామాలను ముంచుతున్నారు. నల్లగొండ జిల్లాలో వందలాది ఎకరాలను ముంచి పులిచింతల ప్రాజెక్టు కట్టారు. తెలంగాణలో కనీసం రెండు పంటలు పండించుకునే ఉద్దేశంతో ప్రాజెక్టులు నిర్మించడం తప్పా?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గోదావరి నదిలో ఇప్పటికే 750 టీఎంసీల నీరు సముద్రం పాలైందని వివరించారు. గోదావరిలో నీళ్లు వచ్చినప్పుడే నిల్వ చేసుకుంటేనే పుష్కలంగా సాగునీరు అందించవచ్చని, అందుకే రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్, టీడీపీ కుట్రలను గుర్తించారని చెప్పారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆ జిల్లాకే చెందిన నాయకులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీశారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టే ధోరణులను తిప్పికొట్టాలన్నారు. పోలీసులు సంయమనం పాటించాలని ఆదేశించామని, విపక్షాలు కూడా సంయమనం పాటించాలన్నారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, నిర్వాసితులను ప్రభుత్వం కడుపులో పెట్టకుంటుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘మల్లన్న సాగర్’ను నిర్మించి తీరుతాం
ఆత్మకూరు(ఎం) : ఏది ఏమైనా మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వస్తే కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందనే ఆశతో ప్రజలు రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని, దానిపై సలహాలు, సూచనలు ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకులు పారి పోయినట్లు చెప్పారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో భువనగిరి డివిజన్ సస్యశ్యామలం కానుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ కాంబోజు భాగ్యశ్రీభానుప్రకాష్, టీఆర్ఎస్ మండల అద్యక్షుడు దూదిపాల రవీందర్‌రెడ్డి, ప్రదాన కార్యదర్శి గుర్రాల రవి, సర్పంచ్‌లు మల్లేల పర్వతాలు, గుండు పెంటయ్య గౌడ్, నాయకులు కాంబోజు భాను, ఏనుగు అంజిరెడ్డి, మేడి రామనర్సయ్య, కోరె భిక్షపతి, కర్రె అయిలయ్య, కోరె వెంకన్న, చిక్కిరి రవి ఉన్నారు. -
‘మల్లన్న సాగర్’పై రాజకీయం తగదు
రాజాపేట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని వరంగల్ జిల్లా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ దేవస్థానం వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం దబగుంటపల్లిలోని శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయంలో సోమవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన 22 ఎకరాల్లో 2,150 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ గీతారెడ్డి, దేవాలయ ధర్మకర్త నర్సింహమూర్తి ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ బండారి శ్రీనివాస్, ఏడీఏహెచ్ యుగేంధర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘లాఠీచార్జ్ నియంతృత్వానికి నిదర్శనం’
మహబూబ్‌నగర్ అర్బన్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసిత రైతులపై లాఠీచార్జి చేయడం నియంతృత్వ పాలనకు నిదర్శనమని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్ విమర్శించారు. సోమవారం న్యూటౌన్‌లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాడని అన్నారు. ఆ ప్రాజెక్టు భూసేకరణలో 2013 చ ట్టాన్ని అమలు చేయకుండా తమను మోసం చేస్తున్నారని ప్ర శ్నించిన రైతులపై పోలీసులచే లాఠీచార్జి చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ సంఘట నను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు. సమావేశంలో పార్టీ మైనార్టీ, దళిత విభాగాల జిల్లా అధ్యక్షులు మ హ్మద్ హైదర్అలీ, మిట్టమీది నాగరాజు, నేతలు షేక్ అబ్దుల్లా, మహ్మద్ సర్దార్, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఆదిలాబాద్ రిమ్స్ : మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లిలో మల్లన్నసాగర్ భూ నిర్వసితులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి మాట్లాడుతూ నిర్వసితులపై దాడి చేయడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ తీరను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు కక్షపూరితంగానే నిర్వసితులపై దాడి చేయించారని ఆరోపించారు. నిర్వాసితులకు మంత్రి క్షమాపణ చెప్పాలని, లాఠీచార్జికి కారణమైన డీఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యవర్గ సభ్యుడు డి.మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు బొమ్మెన సురేష్, కె.అశోక్, మయూరిఖాన్, అగ్గిమల్ల స్వామి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జమున, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పూసం సచిన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్, ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు కనక గణపతి పాల్గొన్నారు. -
ఎర్రవల్లికి వెళ్లకుండా అడ్డగింత
కొండపాక: మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామం చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. నాయకులను ఎవ్వరినీ ఆ గ్రామానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పోలీసుల లాఠీచార్జిలో ఎర్రవల్లికి చెందిన పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న వివిధ పార్టీల నాయకులు ప్రజలను పరామర్శించడానికి బయలు దేరి వస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో అడ్డుకున్నారు. రాజీవ్‌రహదారిపై ఉన్న మంగోల్ గ్రామ క్రాస్‌రోడ్డు వద్ద తొగుట సీఐ రామాంజనేయులు, కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డిలతో పాటు భారీగా పోలీసులు మోహరించారు. ఈక్రమంలో ప్రజా తెలంగాణా వ్యవస్థాపక అధ్యక్షులురాలు విమలక్కను పోలీసులు అడుడ్కొని తొగుట సర్కిల్లోని బేగంపేట పోలీస్టేషన్‌కు తరలించారు. దీంతో సీపీఐ పార్టీ ఎమ్మెల్యే చాడ వెంకటర్‌రెడ్డిని సైతం అడ్డుకొని గజ్వేల్ పోలీస్టేషన్‌కు తరలించారు. వారిని ఉదయం నుంచిసా యంత్రంవరకు పోలీస్టేషన్లో ఉంచుకొని వదిలివేశారు. -
మెదక్ జిల్లాలో బంద్ పాక్షికం..ఉద్రిక్తం
- ముంపు గ్రామాల చుట్టూ పోలీసు వలయం - పోలీసుల ఆధీనంలోరాజీవ్ రహదారి - కార్లు, బస్సుల్లో తనిఖీలు - జాతీయ రహదారి మీదనే కోదండరాం అరెస్టు - గ జ్వేల్‌లో దామోదర్, సునీతారెడ్డి, రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - సిద్దిపేట, ఆందోల్‌లో మల్లన్నసాగర్ కట్టాలంటూ ప్రతి ర్యాలీలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులపై ఆదివారం జరిగిన లాఠీచార్జికి నిరసనగా సోమవారం వివిధ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ జిల్లా బంద్ పాక్షికంగా జరిగింది. తూర్పు మెదక్ జిల్లా ప్రాంతంలోనే కొంత మేరకు బంద్ ప్రభావం కనిపించింది. ముందస్తుగానే ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. భారీ ఎత్తున పోలీసులను మొహరించటంతో సర్వత్రా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. జిల్లా సరిహద్దు ప్రాంతం ఒంటిమామిడి నుంచి కుకునూర్‌పల్లి వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారిని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కపల్లి, మెదక్ జిల్లా ఒంటిమామిడి గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల పరిధిలో రెండు భారీ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వందల మంది పోలీసు బలగాలను మొహరించారు. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో చెక్‌పోస్టు పహారా ఏర్పాటు చేశారు. ముంపు గ్రామాల ప్రజలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు ఒంటిమామిడి చెక్‌పోస్టు వద్దనే అరెస్టు చేసి జిన్నారం మండలం బొల్లారం పోలీసుస్ట్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్‌రాజనర్సింహ, సునీతారెడ్డి, శ్రావణ్, అద్దంకి దయాకర్, టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, రఘునందన్‌రావును గజ్వేల్ పట్టణంలో వేర్వేరు సమయాల్లో అరెస్టు చేసి తూప్రాన్, హైదరాబాద్‌లోని ఇతర పోలీసుస్టేషన్లకు తరలించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డిని, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్కను కుకునూర్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం 5 గంటల సమయంలో వారిని సొంత పూచీకత్తుపై వదిలారు. పోలీసు వలయంలో ముంపు పల్లెలు వేములఘాట్, పల్లెపహాడ్, ఎర్రవల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, సింగారం, బంజేరుపల్లి తదితర ముంపు గ్రామాలను పోలీసులు చుట్టుముట్టారు. బయటి వ్యక్తులు ఊర్లోకి, ఊరి వ్యక్తులు బయటికి వెళ్లకుండా దిగ్బంధించారు. పోలీసు చర్యలకు నిరసనగా ముంపు గ్రామాల ప్రజలు ఊళ్లలోనే ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎప్పుడేఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి పల్లెల్లో నెలకొని ఉంది. సిద్దిపేట, ఆందోల్‌లో ప్రతి ర్యాలీలు ఆందోల్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొందరు రైతులు మల్లన్నసాగర్‌ను త్వరగా పూర్తి చేసి సింగూరును నింపాలని నినాదాలు చేస్తూ ఎంపీపీ కార్యాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి వినతిపత్రం ఇచ్చారు. దీంతో పట్టణంలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. సిద్దిపేటలో ప్రతిపక్ష పార్టీల నేతలు బంద్‌ను విజయంవంతం చేయాలని కోరుతూ దుకాణాలు మూసివేయించగా...వారి వెనకే టీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి మల్లన్నసాగర్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ దుకాణాలు తెరిపించాయి. గజ్వేల్ పట్టణంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యరక్తల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. -
ప్రొ.కోదండరాం అర్రెస్ట్ అప్రజాస్వామికం
ఖండించిన జెఎసి సంగారెడ్డి టౌన్ఃపోలీసులు దాడి చేసిన మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను పరామర్శించడానికి వెల్లనీయకుండా జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను అర్రెస్టు చేయడం అప్రజాస్వామికమని జెఎసి నాయకులు అశోక్ కుమార్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బీరయ్య యాదవ్‌లు మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీటిపారుదల ప్రాజెక్టు నిపుణులు అక్కడ 50 టిఎంసిల ప్రాజెక్టు అవసరం లేదని చెబుతున్నారని, అయితే ప్రభుత్వ బలవంతంగా భూసేకరణ ఎందుకు చేస్తున్నారని వారు ప్రశ్నించారు. కార్పోరేట్ శక్తులకు భూములు అప్పగించేందుకే ప్రభుత్వ భూములను బలవంతంగా గుంజుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల మాదిరిగానే ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులపై దాడులు దేనికి సంకేతమని నిలదీశారు. రైతులకు, ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్ఛరించారు. -
‘ప్రతిపక్షాలు నాటకాలాడుతున్నాయి'
యాదాద్రి : అభివృద్ధిని అడ్డుకోవడానికి యత్నిస్తున్న ప్రతిపక్షాలు నాటకాలు ఆడుతున్నాయని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. సోమవారం నల్లగొండ జిల్లా యాదాద్రిలో నిర్మించనున్న రెవెన్యూ భవన సముదాయానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్లన్న సాగర్‌ను నిర్మించి తీరుతామని.. ముంపు గ్రామ ప్రజలకు 123 జీవో ప్రకారం నష్టపరిహారం చెల్లించడంతో పాటు, ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్ట్‌ల ద్వారా మల్లన్న సాగర్‌కు నీళ్లు మల్లించి 70 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. -
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం అరెస్టుపై నిరసనలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ విద్యార్థి రాజ్యం సంఘం ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న కోదండరామ్ ను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వ దమన నీతిని విద్యార్థులు నిరసించారు. -
పోలీసుల అదుపులో కోదండరామ్
-
పోలీసుల అదుపులో కోదండరామ్
మెదక్: తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులు ఇవాళ చేపడుతున్న బంద్‌కు మద్దతు తెలపడానికి గజ్వేల్ వస్తున్న ఆయనను ములుగు మండలం వంటిమామిడి వద్ద రాజీవ్ రహదారిపై పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో అక్కడే రహదారి పై కూర్చొని నిరసన చేస్తుండటంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లాలో కొనసాగుతున్న బంద్ మరోవైపు మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల దాష్టీకానికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ మినహా రాజకీయ పార్టీలు ఆర్టీసీ బస్సు డిపోల వద్ద ఆందోళన చేపట్టాయి. దీంతో మెదక్, ప్రజ్ఞాపూర్, నారాయణ్‌ఖేడ్, సిద్దిపేట డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి.కాగా, సిద్దిపేటలో బంద్ అనుకూల, వ్యతిరేక వర్గాల వారు ర్యాలీలు చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు భారీగా మోహరించారు. అయితే, బలవంతంగా బంద్ చేయిస్తున్నారనే కారణంతో కొందరు ప్రతిపక్ష నేతలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పట్టణంలో విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. పెట్రోల్ బంక్‌లు మాత్రం మూతబడ్డాయి. -
నేడు మెదక్ జిల్లా బంద్
- పిలుపునిచ్చిన కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్/గజ్వేల్: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై ప్రభుత్వ దౌర్జన్యకాండకు నిరసనగా సోమవారం మెదక్ జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నెల 26న బాధిత రైతులను పరామర్శించేందుకు పార్టీ ముఖ్య నాయకులందరూ తరలి వెళ్లాలని నిర్ణయించింది. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అండగా ఉంటామని నేతలు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి గాంధీభవన్‌లో అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులతో టీపీసీసీ అత్యవసర భేటీ జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి, నేతలు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కి, అంజన్‌కుమార్ యాదవ్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, కుసుమ కుమార్, ఈరవర్తి అనిల్, క్యామ మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులపై పోలీసుల లాఠీచార్జి, జిల్లా కాంగ్రెస్ నేతల అరెస్టు తదితర అంశాలపై చర్చించారు. స్థాని కంగా చోటుచేసుకున్న పరిణామాలపై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు ఫోన్ చేసి ఆరా తీశారు. అనంతరం సమావేశ వివరాలను భట్టి విక్రమార్క, జానారెడ్డిలు వివరించారు. రాష్ట్రంలో దుర్మార్గ, నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. సాంకేతికంగా సాధ్యం కాని మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం దౌర్జన్యంగా పేద రైతుల నుంచి భూములు గుంజుకుంటోందని మండిపడ్డారు. శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారిపై దాడు లు చేస్తోందన్నారు. రైతులను వందలాది మం ది పోలీసులు చుట్టుముట్టి పశువులను బాధినట్లు కొట్టారన్నారు. దేశంలో ఎక్కడా ఇంత ఘోరమైన పరిస్థితులు ఎదురుకాలేదన్నారు. క్రూరమైన చర్య: ఉత్తమ్ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులపై లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా బంద్‌కు అందరు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ నేతల పాదయాత్ర.. లాఠీచార్జిలో గాయపడిన బాధిత మహిళలను కాంగ్రెస్ నేతలు పరామర్శించే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, నేతలు దాసోజు శ్రావన్ కుమార్, జగ్గారెడ్డి తదితరులు గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి పరామర్శించారు. అనంతరం ఎరవ్రల్లికి వెళ్లేందుకు యత్నించారు. తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నేతలు గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు రాజీవ్ రహదారిపైకి మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాపూర్‌లో రాజీవ్ రహదారిపై బైఠాయించారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. -
కేసీఆర్ సర్కారుకు పోయే కాలం: తమ్మినేని
నారాయణపేట: అన్నం పెట్టే రైతులపై దాడి చేసిన ఏ ప్రభుత్వం నిలబడలేదని, మల్లన్న సాగర్ నిర్వాసితులపై లాఠీచార్జి జరిపించిన కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అప్పంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్వాసితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ అనవసరమని ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నా వినకుండా సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాగా, సోమవారం తలపెట్టిన మెదక్ జిల్లా బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటేశ్ తెలిపారు. -
దౌర్జన్య పాలన సహించం
నిర్వాసితులపై లాఠీచార్జి అమానుషం: కోదండరాం సంగారెడ్డి టౌన్ /రేగోడ్: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి అమానుషమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘మనది పోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. ఇక్కడ దౌర్జన్య పాలనను సహించం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం లేని ప్రాజెక్టు కోసం బలవంతంగా భూసేకరణ చేయడమే కాకుండా రైతులపై లాఠీచార్జి చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుపై ఉద్యమిస్తున్న వారిని ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో, అంతకుముందు రేగోడ్ మండలం దోసపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రాజెక్టులు ప్రజల అవసరానికి ఉపయోగపడాలి తప్ప.. ప్రభుత్వాలకు కాదు. ప్రాజెక్టు కట్టి తీరుతామని రైతుల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సాదాబైనామాలతో రైతులను బెదిరిస్తూ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం అన్యాయం. రైతులతో చర్చిస్తేనే మల్లన్నసాగర్ భూ సేకరణ సమస్య పరిష్కారం అవుతుంది’’ అని అన్నారు. ప్రభుత్వాలు అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్టు చెబుతున్నా.. ఆచరణలో విఫలం అవుతున్నాయన్నారు. ఎస్సీల వర్గీకరణ అమలు కావాలని కోరుతున్నామన్నారు. అమానుషం: జస్టిస్ చంద్రకుమార్ మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధిత రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడం అమానుషం అని రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్, తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాఠీచార్జి చేశారని పేర్కొన్నారు. -
మెదక్‌లో ఉద్రిక్తత: మంత్రి హరీశ్ జపాన్ పర్యటన రద్దు
హైదరాబాద్: నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు జపాన్ పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. మరి కొద్ది సేపట్లో విమానాశ్రయానికి బయలుదేరుతారనగా మంత్రిగారు నిర్ణయం మార్చుకున్నారు. పలువురు ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం రాత్రి జపాన్ వెళ్లాల్సిన ఆయన.. మెదక్ జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పర్యటన వాయిదా వేసుకున్నారు. (మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత) మల్లన్నసాగర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళుతోన్న మహిళలను పోలీసులు అడ్డుకొని పాశవికంగా కొట్టడం, లాఠీచార్జ్ చేయడంతో జిల్లా మొత్తం ఒక్కసారిగా వేడెక్కింది. మహిళలపై పోలీసుల లాఠీచార్జ్ ను నిరసిస్తూ అఖిలపక్షం సోమవారం మెదక్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తాను విదేశీ పర్యటనకు వెళ్లడం సమంజసం కాదనే ఉద్దేశంతోనే మంత్రి హరీశ్ రావు పర్యటన రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. (మల్లన్న సాగర్ కట్టితీరుతాం) షెడ్యూల్ ప్రకారం మంత్రి హరీశ్, ఇతర ఉన్నతాధికారులు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన పంపులు, పరికరాలను పరిశీలించేందుకు జపాన్ వెళ్లాల్సిఉంది. ఈ నెల 31 వరకు జపాన్‌లోను ఉండి, తర్వాత ఆస్ట్రియాకు వెళతారు. ఆగస్టు 6న తిరిగి రాష్ట్రానికి తిరిగి రావాల్సిఉంది. ఆయన వెంట నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎన్. వెంకటేశ్వర్లు, సర్కిల్-2 ఎస్ఈ పి. వెంకట రాములు, సిరిసిల్ల ఈఈ ఎస్.ప్రభాకర్, టీఎస్ జెన్కో ఎస్ఈ కే శ్రీనివాసరెడ్డిలు మంత్రి వెంట జపాన్ బయలుదేరారు. ఆస్ట్రియా వెళ్ళే బృందంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు , చీఫ్ ఇంజనీర్ హరిరామ్, ఎస్ఈ కేఎస్ఎస్ చంద్రశేఖర్, సిద్దిపేట ఈఈ కేఎన్ ఆనంద్, జెన్కో డివిజనల్ ఇంజనీర్ జే శ్రీనివాస్‌లు ఉన్నారు. -
మల్లన్న సాగర్ కట్టితీరుతాం
- రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు - అడ్డుకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారు - రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చిన్నకోడూరు: నాడు తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకున్నాయని.. అయినా ప్రజల సంఘటితంతో రాష్ట్రాన్ని సాధించామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నేడు రైతుల మేలు కోసం ప్రాజెక్టులకు పూనుకుంటే కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకుంటున్నాయని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. మన బతుకు దెరువు చూపేది మల్లన్న సాగర్ అన్నారు. ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ మెతుకు సీమను తయారు చేసిది మల్లన్న సాగరేనని ఆయన చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీలు ప్రాజెక్టును అడ్డుకోవడానికి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. మల్లన్న సాగర్ నిర్మాణాన్ని అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. -
మెదక్ జిల్లా బంద్‌కు వైఎస్ఆర్ సీపీ మద్దతు
మెదక్: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసుల దాడికి నిరసనగా సోమవారం మెదక్ జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు వైఎస్ఆర్ సీపీ మద్దతు ప్రకటించింది. బంద్‌లో పాల్గొనాలని కార్యకర్తలకు వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షడు శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను జిల్లాకు తరలిస్తోంది. కాగా.. ప్రతిపక్షాల కవ్వింపు చర్యల మూలంగానే ఇవాళ్టి ఘటన జరిగిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. -
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజీవ్ రహదారిపై నిరసన తెలపడానికి వెళ్తున్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకోవడంతో మహిళలు వాగ్వాదానికి దిగారు. దీంతో మహిళలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. కొంత మంది మహిళలను బూటు కాళ్లతో తంతూ పోలీసులు లాక్కెళ్లారు. తీవ్రగాయాలపాలైన మహిళలను ఆసుపత్రికి తరలించారు. నిరసన తెలపడానికి వచ్చిన కొంతమందిని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భూమి కోల్పోతున్నానని.. రైతు ఆత్మహత్య
హైదరాబాద్: మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన పల్లెపహాడ్‌లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మల్లన్న సాగర్ ముంపు వల్ల వ్యవసాయ భూమితో పాటు ఇళ్లు కూడా కోల్పోతున్నాననె బెంగతో గ్రామానికి చెందిన బచ్చల్లి నర్సయ్య బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. ప్రభుత్వం ఇంకా ఎంత మంది ప్రాణాలు తీసుకుంటుందని ముంపు గ్రామాల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం పల్లెపహాడ్‌లో జరిగే నర్సయ్య అంత్యక్రియల్లో ముంపు బాధితులంతా పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని నిర్ణయించుకున్నారు. -
'ప్రజలను ముంచి కట్టాల్సిన పనిలేదు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఎదురుదాడి చేశారు. ప్రాజెక్టుల నిర్మాణ పేరుతో తెలంగాణ సర్కారు అనాలోచితంగా, ఆశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని అన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ అసలు అవసరం లేదని అన్నారు. డీపీఆర్ లు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా అధికారులు ఇవ్వలేదని ఉత్తమ్ చెప్పారు. గత కొద్ది రోజులుగా మల్లన్న సాగర్ అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి ఈ అంశంపై మరోసారి సోమవారం మాట్టాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి .. ప్రాజెక్టుల నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పై 23న గాంధీభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కూడా రిజర్వాయర్లు లేకుండా రీ డిజైన్ చేయాలని అన్నారు. మల్లన్న సాగర్ తో పాటు ఇతర రిజర్వాయర్లకోసం చేపట్టిన భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సాగునీరు పారిశ్రామిక అవసరాలకోసం మాత్రమే రిజర్వాయర్ నిర్మిస్తే సరిపోతుందని అన్నారు. హరియాణాలోని యమునా నదిపై నిర్మించిన జవహార్ లాల్ నెహ్రూ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ మాదిరిగానే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలని అన్నారు. సంపులు, పంపులు, కాల్వల ద్వారా సాగునీరు అందించాలని చెప్పారు. ప్రాజెక్టుల గురించి బాగా తెలుసని అనుకుంటున్న కేసీఆర్ ప్రజలను, గ్రామాలను ముంచి ప్రాజెక్టులు కట్టాల్సిన పనిలేదని అన్నారు. మరోపక్క, మల్లన్న సాగర్ తో పాటు ఇతర రిజర్వాయర్ల కోసం చేపట్టిన భూసేకరణ వెంటనే ఆపాలని మరో కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు. -
‘ఇలాంటి విడ్డూరం ప్రపంచంలోనే లేదు’
కొండపాక(మెదక్): ఎత్తిపోతల ద్వారా 50 టీఎంసీల జలాశయాన్ని తలపెట్టిన దాఖలా తెలంగాణలో తప్ప ప్రపంచంలోనే మరెక్కడా లేదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. మెదక్‌జిల్లా కొండపాక మండలంలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఎర్రవల్లి, సింగారంలలో శనివారం కాంగ్రెస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి, ఉస్మానియా కళాశాల ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డిలతో కలిసి నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ లిప్టు ఇరిగేషన్ స్కీంలో 50 టీఎంసీల ప్రాజెక్టు నిర్మాణం సరికాదని ఇంజనీర్లు, నిపుణులు చెపుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టు కోసం బలవంతంగా భూసేకరణ చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. ముంపు గ్రామాల ప్రజలపై నిజంగా ప్రేమే ఉంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులు ముందుగా జిల్లా కలెక్టరుతో గ్రామ సభలు ఎందుకు పెట్టించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ కోసం సేకరించిన భూములపై హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు సంఘం నాయకులు ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన సమావేశానికి కొందరు మహిళలు పురుగు మందు డబ్బాలను తీసుకొచ్చుకున్నారు. ఈసందర్బంగా బాలవ్వ అనే మహిళ తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించాలని టీఆర్ఎస్ నాయకులు బలవంతం చేస్తున్నారంటూ పురుగు మంతుఆ తాగేందుకు యత్నించింది. వెంటనే అక్కడున్న వారు డబ్బాను లాక్కోన్నారు. ప్రాజెక్టులో ఎర్రవల్లి మునిగిపోతే పురుగుల మందే శరణ్యమంటూ మహిళలు ముక్త కంఠంతో నినదించారు. -
హరీశ్ రాజకీయ లబ్ధికోసం రైతుల బలి: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మంత్రి హరీశ్‌రావు రాజకీయ లబ్ధికోసం మల్లన్నసాగర్లో భూములు కోల్పోతున్న రైతులను బలిపెట్టేందుకు కుట్ర జరుగుతున్నదని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూముల విలువను పెంచి, నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని సూచించారు. అలాకాకుండా, రైతులను ముంచాలని ప్రభుత్వమే ప్రయత్నించడం దారుణమన్నారు. మంత్రి హరీశ్‌రావు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, కేసీఆర్ మెప్పు పొందడానికి భూ నిర్వాసితుల నోళ్లలో మట్టికొట్టాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. -
'రైతుల పేరుతో కేసులు వేయించిన ప్రభుత్వం'
న్యూఢిల్లీ : మల్లన్నసాగర్‌పై టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు ఆరోపించారు. బుధవారం న్యూఢిల్లీలో విద్యాసాగర్‌రావు విలేకర్లతో మాట్లాడుతూ... ఈ ప్రాజెక్ట్‌పై సమాచారం అడిగితే ఇంజనీర్ హన్మంతరావు, కోదండరామ్‌కు అందిస్తామన్నారు. పాలమూరు - డిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రైతుల పేరుతో కేసులు వేయించిందని విద్యాసాగర్‌రావు విమర్శించారు. -
మల్లన్నసాగర్‌కు ‘ఏటిగడ్డ’ బాసట
- రిజర్వాయర్‌కు భూములిస్తామని రైతుల ప్రకటన - ప్రభుత్వానికి సహకరిస్తామని హరీశ్ సమక్షంలో వెల్లడి - ఎకరాకు రూ.6 లక్షల పరిహారం, ఇతర సౌకర్యాలు - ఏటిగడ్డ బాటలో ఎర్రవల్లి, లక్ష్మాపూర్ రైతులు కూడా గజ్వేల్: మల్లన్నసాగర్‌ను వ్యతిరేకిస్తూ మూడు నెలలపాటు తీవ్రమైన ఉద్యమం చేసిన మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ వాసులు మనసు మార్చుకున్నారు. రిజర్వాయర్ కోసం భూములిచ్చేందుకు ఎట్టకేలకు ముందుకొచ్చారు. ఈ విషయంలో మంత్రి హరీశ్ చొరవ ఫలించింది. గ్రామవాసులు మంగళవారం గజ్వేల్ మండలం బంగ్ల వెంకటాపూర్‌లోని నర్సరీలో హరీశ్‌తో 3 గంటలపాటు చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మాణానికి సహకరిస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్, హరీశ్‌లపై తమకు సంపూర్ణ విశ్వాసముందన్నారు. ఎకరాకు రూ.6 లక్షల పరిహారానికి అంగీకరిస్తున్నట్టు వెల్లడించారు. ఈ గ్రామంలో సుమారు 1800 ఎకరాలను ప్రభుత్వం సేకరించనుంది. ఇక ఎర్రవల్లి, లక్ష్మాపూర్ గ్రామాల రైతులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామ రైతులతో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి మాట్లాడి భూములిచ్చేందుకు ఒప్పించారు. రూ.7 లక్షలడిగిన రైతులు కిష్టాపూర్‌కు చెందిన వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర రైతు పరిరక్షణ సమితి నాయకులు పాకాల శ్రీహరి రావు తదితరులు మంత్రితో చర్చల్లో పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించారు. ఎకరాకు రూ.7 లక్షల పరిహారమివ్వాలని రైతులు పట్టుబట్టారు. ఇవీ మంత్రి హామీలు... మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇస్తున్న నష్టపరిహార ప్యాకేజీ అత్యుత్తమమైనదని చర్చల సందర్భంగా హరీశ్ అన్నారు. జీఓ 123 ప్రకారం ఎకరాకు రూ.5.85 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మల్లన్నసాగర్ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ‘‘నాతోపాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కూడా దత్తత తీసుకుని అభివృద్ధిై చేస్తారు. ప్రతి ఒక్కరికీ డబుల్బెడ్రూం పథకం కింద ఇళ్లు నిర్మించిస్తాం. బావులకు, బోర్లకు, చెట్లకు, ఇళ్లకు అదనపు పరిహారం ఉంటుంది. పూర్తిగా భూమి, ఇళ్లు లేని పేదలనూ తగువిధంగా ఆదుకుంటాం. కొత్తగా నిర్మించే కాలనీల్లో గుడి, బడి, కరెంటు, శ్మశానవాటిక తదితర సౌకర్యాలు సమకూరుస్తాం. చేపలపై వచ్చే ఆదాయాన్ని ఏటా భృతిగా అందిస్తాం. నిర్వాసితుల పిల్లలందరినీ మంచి పాఠశాలల్లో చదివిస్తాం’’ అని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని నిర్వాసితులు కోరినచోట సమకూర్చాలని గజ్వేల్ తహసీల్దార్ బాల్‌రెడ్డిని ఆదేశించారు. ఎకరాకు రూ.6 లక్షలకు మంత్రి అంగీకారం తెలపడంతో,రిజిస్ట్రేషన్ చేసివ్వడానికి ఒప్పుకున్నారు. వార్తల్లో నిలిచిన గ్రామం మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో 14 గ్రామాలు ముంపునకు గురవుతుండటం తెలిసిందే. ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామం నిర్వాసితుల ఉద్యమంతో ఇటీవల రాష్ట్రస్థాయిలో వార్తల్లో నిలిచింది. ఉద్యమంలో ఏటిగడ్డవాసులు కీలకపాత్ర పోషించారు. విపక్ష నేతల దీక్షలు, ధర్నాలు, గ్రామస్తుల ఆందోళనలు పెద్ద ఎత్తున సాగాయి. ఏటిగడ్డవాసుల స్ఫూర్తి అభినందనీయం: హరీశ్ లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే మహోన్నత ఆశయానికి కిష్టాపూర్‌తో పాటు లక్ష్మాపూర్, ఎర్రవల్లి గ్రామస్తులు సహకరించడానికి ముందుకు రావడం అభినందనీయమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. చర్చలు ఫలించిన అనంతరం నిర్వాసితులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘దశాబ్దాల తరబడి గ్రామంతో ఉన్న అనుబంధం కోల్పోతున్నం దుకు బాధ సహజమే. వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు రానివ్వం. కడుపులో పెట్టి చూసుకుంటాం. మల్లన్నసాగర్ పూర్తి చేసి తెలంగాణకు నీరివ్వడం ఎంత ముఖ్యమో నిర్వాసితులను ఆదుకోవడం కూడా ప్రభుత్వానికి అంతే ముఖ్యం. ముంపు గ్రామాల ప్రజలకు నాతోపాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అండగా ఉంటారు. ఎన్నో పార్టీలు గ్రామానికి వెళ్లి ఎన్నో రకాల గందరగోళం సృష్టించినా వాస్తవ పరిస్థితులను తెలుసుకుని పెద్ద మనసుతో ప్రభుత్వానికి సహకరించడానికి ముందుకు రావడం అభినందనీయం’’ అన్నారు. -
మల్లన్న సాగర్ ను కట్టి తీరుతం
♦ కోటి ఎకరాలకు సాగు నీరిస్తాం ♦ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ♦ ప్రతిపక్షాలకు రైతులు బుద్ధిచెప్పాలి ♦ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దుబ్బాక/రామాయంపేట: ‘రైతన్నలూ మేల్కొండి.. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలను అడ్డుకోండి’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయని, ఇలాంటి ప్రతిపక్షం దేశంలో ఎక్కడా లేదన్నారు. సోమవారం దుబ్బాకలో మార్కెట్ కమిటీల పాలక వర్గాల ప్రమాణ స్వీకారోత్సవంలో, రామాయంపేటలో విలేకరులతో మాట్లాడారు. గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే తెలివిలేని కాంగ్రెస్, టీడీపోళ్లు నీళ్లు వద్దంటూ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నాలుగు ముంపు గ్రామాల్లో రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని గ్రామాల రైతుల ఉసురు పోసుకుంటారని ప్రశ్నించారు. 60 ఏళ్లలో గత ప్రభుత్వాలు ఒక్క ప్రాజెక్టు కూ డా కట్టలేదని, తెలంగాణలో నిర్మించిన పులి చింతల ప్రాజెక్టులోని నీరు పారేది మాత్రం ఏపీలోని మూడు పంటలకని, అప్పుడు నోరు మెదపని ప్రతిపక్షాలు ఇప్పుడెందుకు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఏడు మండలాలు పోయినప్పుడు? ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను బలవంతంగా ఆంధ్రాలో కలుపుకున్నప్పుడు నోరు మెదపని టీడీపోళ్లు మల్లన్న సాగర్‌పై రాద్ధాంతం చేస్తూ, రాజకీయ శిఖండిలా వ్యవహరిస్తున్నారని మంత్రి విమర్శించారు. పులిచింతలో 14 గ్రామాలు, సింగూర్ ప్రాజెక్టులో 15 గ్రామాలు ముంపు గురైనా తెలంగాణలో మాత్రం ఒక్క ఎకరానికి సాగు నీరందలేన్నారు. బాధితులకు ఇప్పటివరకు పరిహారం కూడా అందలేదన్నారు. మునిగేది తెలంగాణ... పారేది ఆంధ్ర ప్రాంతానికన్నారు. 14 గ్రామాలు మునిగిపోతుంటే, తెలంగాణ నీరు ఆంధ్రాలో పారుతుంటే కాంగ్రెసోళ్లు ఎందుకు మాట్లాడలేదని హరీశ్ ప్రశ్నించారు. గోదావరి నీళ్లు వస్తాయని ఆనందపడాల్సింది పోయి కాంగ్రెసోళ్లు, టీడీపోళ్లు శిఖండిలా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు జీవనాధారమైన ప్రాజెక్టులను అడ్డుకునే ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపు నిచ్చారు. -
అన్నారం, సుందిళ్ల సామర్థ్యం పెంపు!
► మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య ఎక్కువ నీటి నిల్వకు సర్కారు యోచన ► అన్నారం సామర్థ్యం 11.77 టీఎంసీలకు.. ► సుందిళ్ల సామర్థ్యం 5.46 టీఎంసీలకు పెంచేలా కసరత్తు ► 8 టీఎంసీల మేరకు పెరగనున్న సామర్థ్యం ► మల్లన్నసాగర్ ఆలస్యమయ్యే పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం ► బ్యారేజీల స్థల మార్పుపై క్షేత్ర స్థాయిలో ఇంజనీర్ల అధ్యయనం సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్లీ మార్పుచేర్పులు మొదలయ్యాయి. ప్రాజెక్టు పరిధిలో అత్యంత కీలకమని భావిస్తున్న మల్లన్నసాగర్ రిజ ర్వాయర్ పరిధిలో నెలకొన్న భూసేకరణ సమస్యతో నిర్మాణం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో అదనపు నీటి నిల్వకు వీలుగా ఎగువన ఉన్న బ్యారేజీల సామర్థ్యం పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. గోదావరి ప్రవాహపు మార్గంలో మేడిగడ్డ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల మధ్య ఉండే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సామర్థ్యాన్ని పెంచేలా కసరత్తు మొదలు పెట్టింది. 8 టీఎంసీల మేర పెరగనున్న సామర్థ్యం.. గోదావరి నుంచి 160 టీఎంసీల నీటిని మేడిగడ్డ బ్యారేజీ ద్వారా మళ్లించి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసేలా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ఖరారైన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీని 101 మీటర్ల ఎత్తులో 19.73 టీఎంసీల సామర్థ్యంతో.. అన్నారం బ్యారేజీని 122 మీటర్ల ఎత్తులో 6.22 టీఎంసీల సామర్థ్యంతో.. సుందిళ్లను 131 మీటర్ల ఎత్తులో 2.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేలా ప్రణాళికలు ఖరారయ్యాయి. బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల నిర్మాణానికి రూ.13,811 కోట్లతో టెండర్లను సైతం ఖరారు చేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే 50 టీఎంసీల సామర్థ్యంతో తలపెట్టిన మల్లన్నసాగర్ భూసేకరణ అంశం వివాదాస్పదమైంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నిర్ణీత గడవులోగా మల్లన్నసాగర్ పూర్తి చే యడం కష్టమని, ఒకవేళ ప్రాజెక్టును పాక్షికంగా పూర్తి చేసినా, 50 టీఎంసీల నిల్వకు అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా నిల్వ చేసి, తరలించుకునేందుకు వీలుగా అన్నారం, సుందిళ్ల సామర్థ్యాలను పెంచాలని యోచిస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. అన్నారం ఎత్తును 124 మీటర్లకు పెంచి సామర్థ్యాన్ని 11.77 టీఎంసీలకు పెంచాలని, సుందిళ్ల ఎత్తును 134 మీటర్లకు, సామర్థ్యం 5.46 టీఎంసీలకు పెంచే అవకాశాలున్నాయి. దీంతో సుమారు 8 టీఎంసీల సామర్థ్యం పెరుగుతుంది. ఇక అన్నారం బ్యారేజీ కింద 607 హెక్టార్లు, సుందిళ్ల కింద 218 హెక్టార్ల మేర ముంపునకు గురవుతోంది. అన్నారం కింద పరిహారానికి రూ.192 కోట్లు, సుందిళ్ల కింద పరిహారానికి రూ.82 కోట్ల మేర ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో ముంపును తగ్గిస్తూ, అదే ప్రవాహపు దారిలో ఎక్కువ నీటిని నిల్వ చేసే అనువైన ప్రాంతాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. అది జరిగితే బ్యారేజీల ప్రతిపాదిత స్థలాల మార్పు అనివార్యమవుతుంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి ‘కన్నెపల్లి’ గుర్తింపు.. బ్యారేజీల నిర్మాణాలకు అనువైన స్థలాలను గుర్తించాలని భారీ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఆదేశాల నేపథ్యంలో ఆదివారం ఈఎన్సీ మురళీధర్, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం సీఈ నల్లా వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, సీడీవో సీఈ నరేందర్‌రెడ్డి తదితరులు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాల్లో పర్యటించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి కన్నెపల్లి అనువైనదిగా గుర్తించారు. అన్నారం, సుందిళ్ల కోసం సైతం స్థల పరిశీలన చేశారు. రెండు, మూడు రోజుల్లో అనువైన స్థలాన్ని ఖరారు చేయనున్నారు. ఇక ప్రాజెక్టుకు అవసరమైన పంపులు, మోటార్ల కోసం డీఈ నర్సింగరావు, జెన్కో ఏడీఈ ఉపేందర్ భోపాల్ వెళ్లి పరిశీలన చేసి వచ్చారు. -
రైతులను బలవంత పెట్టొద్దు
మల్లన్నసాగర్ భూసేకరణపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం చట్ట నిబంధనల ప్రకారమే ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వులు సర్కారు అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకం భూసేకరణ కోసం ఒప్పందం చేసుకోవాలంటూ రైతులను బలవంతం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చట్ట నిబంధనలకు లోబడే భూసేకరణ చేపట్టాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణను వేగవంతం చేయడానికే జీవో 123ని జారీ చేశాం తప్ప భూములను బలవంతంగా తీసుకోవడానికి కాదన్న ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకుంటూ ఈ ఉత్తర్వులిచ్చింది. బలవంతంగా భూములు తీసుకోవట్లేదు: ఏజీ ప్రాజెక్టుల భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన జీవో 123ని చట్ట విరుద్ధంగా ప్రకటించడంతోపాటు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ మెదక్ జిల్లాకు చెందిన రైతులు సేరుపల్లి ఉపేందర్‌రెడ్డి, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత వారం విచారణ సందర్భంగా భూసేకరణ విధానంపై అఫిడవిట్ సమర్పించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (రెవెన్యూ) ప్రదీప్‌చంద్ర రెండు పేజీల అఫిడవిట్‌ను ధర్మాసనం ముందుంచారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ రైతుల నుంచి తాము బలవంతంగా భూములు తీసుకోవడం లేదని పునరుద్ఘాటించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి నుంచే భూములు కొనుగోలు చేస్తున్నామన్నారు. భూములు ఇవ్వడానికి ముందుకు రాని వారి విషయంలో ఏ రకంగానూ కఠిన చర్యలకు పాల్పడటం లేదని కోర్టుకు నివేదించారు. ఇవే అంశాలను అఫిడవిట్లో పొందుపరిచామన్నారు. అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. అయితే తమ వాదనలను వినాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ కోరగా అందుకు అంగీకరించింది. జీవో 123కి విలువ లేదు: పిటిషనర్ల తరఫు న్యాయవాది కేంద్ర ప్రభుత్వం 2013లో తెచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే దేశంలో ఎవరైనా భూములను సేకరించాలి తప్ప, మరో మార్గం లేదని వేదుల వాదించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగిస్తూ జీవో 123ను జారీ చేసిందన్నారు. ఈ అధికారాల ద్వారా తెచ్చిన జీవోకన్నా చట్టానికే ఎక్కువ విలువని, అందువల్ల జీవో 123కు చట్ట ప్రకారం విలువ లేదన్నారు. భూసేకరణ చట్టం లేనప్పుడు జీవో 123 జారీ చేయడంలో అర్థముంటుందని, కానీ 2013 భూసేకరణ చట్టం ఉండగా దాన్ని అమలు చేయకుండా మరో చట్టాన్ని తేవడం, భూములను సేకరించడానికి వీల్లేదన్నారు. జీవో 123 వల్ల బాధితులకు ఎటువంటి లబ్ధి దక్కడం లేదన్నారు. అయితే హైకోర్టు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. -
123 జీవో ఎందుకు రద్దు చేయలేదు?
- 2013 చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలి - డీపీఆర్ లేకుండా భూసేకరణ - జూలై 1 నుంచి ముంపు గ్రామాల్లో పాదయాత్ర - మల్లన్నసాగర్ నిర్వాసితుల సదస్సులో వక్తలు గజ్వేల్ రూరల్: ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టాలనుకుంటే 123 జీవోను ఎందుకు రద్దు చేయలేదని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పాల్గొన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మల్లన్నసాగర్‌కు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) లేకుండా ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు అవసరమయ్యే భూమి ఎంత?, ఏయే గ్రామాల నుంచి ఎన్నిఎకరాలు సేకరిస్తారు? పరిహా రం ఎంత చెల్లిస్తారనేది చెప్పకుండానే 123 జీవో లేదా 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామనడం విడ్డూరంగా ఉంద న్నారు. 80 శాతం ప్రజామోదం పొందాకే భూసేకరణ చేపట్టాలని, ఆయా గ్రామాల్లో మార్కెట్ ధర కు నాలుగింతలు పెంచి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తమ్మినేని మాట్లాడుతూ ఎకరాకు రూ.60 వేలు పరిహారం చెల్లిస్తామనడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో 4-5 లక్షల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జూలై 1 నుంచి 4 వరకు ముంపు గ్రామాల్లో సీపీఎం పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ కోదండరాం, గద్దర్, విమలక్క, ప్రజా సంఘాలు, పార్టీల మద్దతు కోరతామన్నారు. -
మల్లన్నసాగర్‌పై రైతుల పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకంపై బాధిత రైతుల వేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. రైతులు అడిగిన పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జీవో నెంబర్ 123 అనేది ఒక ప్రక్రియ మాత్రమేనని.. భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేకపోతే భూసేకరణ చట్టం ద్వారా ముందుకెళ్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. కాగా, మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం బలవంతపు భూ సేకరణకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జీవో 123 కింద భూ సేకరణ నిలిపేసి, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మెదక్ జిల్లా తోగుట మండలంలోని మూడు గ్రామాలకు చెందిన రైతులు అడియాల రంగారెడ్డి, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
భూ నిర్వాసితుల పొట్టకొడితే ఊరుకోం
-2013 చట్టం ప్రకారమే భూసేకరణ జరపాలి -మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కొండపాక మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పొట్టకొడితే ఊరుకునేది లేదని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా కొండపాకకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడిన టీఆర్ఎస్ సర్కార్ భూనిర్వాసితుల పొట్టకొట్టేలా 123 జీఓను తేరమీదికి తెచ్చిందని విమర్శించారు. దీన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వం లేనిపోని విమర్శలు చేసిందని, అయినా బెదిరేది లేదన్నారు. భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడైనా ప్రాజెక్టుల కోసం భూముల కోల్పోతున్న నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూసేందుకు యూపీఏ ప్రభుత్వం 2013లో భూసేకరణ చట్టాన్ని అమలు చేసి చట్టబద్ధత కల్పించిందన్నారు. అలాంటి చట్టాన్ని పక్కన పెట్టడం దారుణమన్నారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామస్తుల అనుమతి మేరకే భూసేకరణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామంటూ ముందుకు రావడం వెనుక మరో రకమైన కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. డబ్బులు అందిన తరువాతే భూములు రిజిస్ట్రేషన్లు చేయాలని ఆయన నిర్వాసితులకు సూచించారు. ప్రాంతీయేతరులు మోసం చేస్తే పొలిమెరల దాకా తరిమి కొట్టండి... తెలంగాణ వారే మోసం చేస్తే పాతి పెట్టండి... అంటూ భూనిర్వాసితులకు పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీ కార్యదర్శి చిలువేరి రాంరెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పరిహారంపై పట్టువిడుపు
నిర్వాసితులు ఎలా కోరుకుంటే అలా పరిహారం: కేసీఆర్ జీవో 123 లేదా 2013 భూసేకరణ చట్టం.. ఏది కావాలంటే అది వర్తింపజేస్తాం మంత్రి హరీశ్‌తో ముఖ్యమంత్రి భేటీ.. అనంతరం పరిహారంపై ప్రకటన నిర్వాసితులు ఆందోళన విరమించే అవకాశం ప్రాజెక్టు పరిధిలో భారీగా పెరగనున్న పరిహార మొత్తం 2013 చట్టం ప్రకారం ఇస్తే 21 వేల ఎకరాలకు ఏకంగా రూ.2 వేల కోట్లు! ఇదే విధంగా అన్ని ప్రాజెక్టులకు వర్తింపజేస్తే పెనుభారమే... సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూ సమీకరణ విషయంలో రైతుల ప్రయోజనాలు, వారి అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం పరిహారం అందిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూమి సేకరించడానికి ప్రస్తుతం రెండు విధానాలు అమలులో ఉన్నాయని, యూపీఏ ప్రభుత్వం 2013లో తెచ్చిన భూసేకరణ చట్టం అందులో ఒకటి కాగా.. మరొకటి తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.123 అని తెలిపారు. ఈ రెండింట్లో రైతులు ఎలా కావాలనుకుంటే అలా పరిహారం అందిస్తామని ప్రకటించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ద్వారా పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీతోపాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం శనివారం తన అధికార నివాసానికి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును పిలిపించుకుని మల్లన్నసాగర్ భూసేకరణ వివాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పరిహారంపై ఈ మేరకు ప్రకటన వెలువడింది. భారీగా పెరగనున్న వ్యయం భూ సేకరణ చట్టం-2013ను అమలు చేస్తే మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 21 వేల ఎకరాలకు చెల్లించాల్సిన పరిహారం భారీగా ఉండనుంది. కనీసం రూ.2 వేల కోట్లు పరిహారం కింద చెల్లించే అవకాశం ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సీఎం తాజా ప్రకటన తర్వాత.. జీవో 123 ద్వారా పరిహారం కోరుకునే రైతులుంటారని తాను అనుకోవడం లేదని ఆ అధికారి పేర్కొన్నారు. మల్లన్నసాగర్‌తో పాటు మిగతా ప్రాజెక్టుల కింద కూడా 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తే ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే వ్యయం కంటే పరిహారం ఎక్కువగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మూడు నెలల ఆందోళనకు ఫుల్స్టాప్ మల్లన్నసాగర్ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గత మూడు మాసాలుగా ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనకు పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డితో పాటు సీపీఐ, సీపీఎం నేతలు ఏటిగడ్డ కిష్టాపూర్‌కు వెళ్లి అక్కడి నిర్వాసితులకు సంఘీభావం ప్రకటించారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి శనివారం రెండ్రోజుల దీక్ష ప్రారంభించారు. మరోవైపు మల్లన్నసాగర్ నిర్వాసితులు తమకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి తాజా ప్రకటనతో మల్లన్నసాగర్ నిర్వాసితులు తమ ఆందోళన విరమించే అవకాశం ఉంది. భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్: కలెక్టర్ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని , భూసేకరణ కోసం ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి బలవంతంగా భూమి సేకరించడం లేదని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటి వరకు 1,600 ఎకరాలు రైతుల నుంచి సేకరించినట్లు వివరించారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఇప్పటివరకు 145 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 270 ఎకరాల భూమిని జీవో 123 ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశారని వివరించారు. -
తొగుటలో రేవంత్‌రెడ్డి 48 గంటల దీక్ష
-ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఏర్పాట్లు తొగుట(మెదక్ జిల్లా): ముంపు బాధితులకు బాసటగా మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి 48 గంటల పాటు దీక్ష చేపడుతున్నారు. శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళాయాదవరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న సాగర్ సామర్థ్యాన్ని తగ్గించి, ముంపు నుంచి గ్రామాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల పొట్టకొట్టే 123 జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. పార్లమెంట్ ఆమోదించిన 2013 చట్టం ప్రకారం ముంపు భాదితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల న్యాయం జరిగే వరకు తమ పార్టీ వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. రేవంత్‌రెడ్డి దీక్షకు ప్రజలు అధిక సంఖ్యలో మద్దతు పలికి ప్రభుత్వ కళ్లు తెరిపించాలని ఆమె పిలుపునిచ్చారు. -
ప్రభుత్వం తప్పును సరిచేసుకోవాలి : కోదండరామ్
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ... ప్రొ.జయశంకర్ వర్థంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. వచ్చే ఏడాదైనా ప్రభుత్వం చేసిన తప్పును సరిచేసుకోవాలని కోదండరామ్ సూచించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు మద్దతుగా ఉంటామని కోదండరాం స్పష్టం చేశారు. -
పనికిరాని ప్రాజెక్టులెందుకు?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తొగుట/కొండపాక: కొమురవెల్లి మల్లన్న సాగర్‌తో ఎవరికి మేలు జరుగుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన మెదక్ జిల్లా తొగుట మండలం వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, కొండపాక మండలం ఎర్రవల్లిలో బాధితులు చేపట్టిన రిలే దీక్షాశిబి రాలను బుధవారం ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో జనం బాధలు తీరుస్తారని కేసీఆర్‌కు ఓట్లేసి గెలిపిస్తే ప్రాజెక్టుల పేరుతో ప్రజలను ముంచుతున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు నష్టం కలగకుం డా ఒకటి లేదా రెండు టీఎంసీల సామర్థ్యంతో అక్కడక్కడా ప్రాజెక్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు వద్దంటూ 14 గ్రామాల ప్రజలు కోరుతుంటే వీరికి వ్యతిరేకంగా.. ప్రాజెక్టు కావాలంటూ మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలో ఆందోళనలు చేయించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా వేములఘాట్ పాఠశాలలోని పదోతరగతి విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన వినతి పత్రాన్ని లక్ష్మణ్‌కు అందజేశారు. -
అవినీతిపై మీరా మాట్లాడేది ?
హైదరాబాద్ : మల్లన్నసాగర్‌పై రాజకీయం చేస్తున్నాయని ప్రతిపక్షాలపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు. మంగళవారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లను అడ్డుకోవడం సరికాదని ప్రతిపక్షాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు సూచించారు. ఎవరు అడ్డుకున్నా... ప్రాజెక్ట్‌ల నిర్మాణం మాత్రం ఆగదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. అవినీతి గురించి మీరా మాట్లాడేది ? అంటూ టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.భట్టి విక్రమార్కపై బాలసాని లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. అవినీతిపై మీరు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేసిన ఉత్తమ్ ఆ శాఖను అవినీతిమయం చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఉత్తమ్ కారులో దొరికిన కోట్లాది రూపాయిల గురించి.. ఇప్పటి వరకు లెక్క చెప్పలేదని గుర్తు చేశారు. భట్టి విక్రమార్క పేపరు పులి అని ఆయన అభివర్ణించారు. భట్టి, ఉత్తమ్ అసమర్థులు కాబట్టే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు పెరిగాయన్నారు. ముందుగా పదవులకు రాజీనామా చేయాలని ఉత్తమ్, భట్టిలను బాలసాని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. -
హెచ్చార్సీలో మల్లన్నసాగర్ బాధితులు
మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులు సోమవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. ప్రాజెక్టునిర్మాణం పేరుతో తమ భూములు, ఊళ్లను, ఇళ్లను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. -
బంగారు తెలంగాణలో బతుకనీయరా ?
ముంపు గ్రామాల టీఆర్ఎస్ నాయకుల మండిపాటు తొగుట : పోరాడి సాధించుకున్న బంగారు తెలంగాణ రాష్ట్రంలో జీవించే హక్కును కాలరాయొద్దని ముంపు గ్రామాల టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు చేశారు. మండల కేంద్రమైన తొగుటలో శనివారం వారు మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న సాగర్ నిర్మాణంలో 14 గ్రామాలను ముంచడం దారుణమన్నారు. ప్రభుత్వం మా న్యాయమైన హక్కులపై బూటకపు ఉద్యమాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రాజకీయ లబ్ధికోసం ఉద్యమాలు చేసి బతుకు పోరాట ఉద్యమాలను కించపర్చొద్దని సూచించారు. రెండు నెలలుగా న్యాయమైన పొరాటం చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడంలేదన్నారు. 14 గ్రామాల ముంపు ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. కొందరు రాజకీయ బ్రోకర్లను గ్రామాల్లో ఉసిగొల్పి ప్రజల మధ్యన చిచ్చుపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముంపు గ్రామాల్లో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను ఊరేగించి పోలీస్ స్టేషన్ సమీపంలో దహనంచేశారు. కార్యక్రమంలో ముంపుగ్రామాలైన పల్లేపహడ్, నగరం, తండా, వేముగాట్, తర్క బంజేరుపల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, తాండ, తిరుమలగిరి, లక్ష్మాపూర్ ,కొంపాక మండలం ఎర్రవెల్లి, శింగారం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
మల్లన్న సాగర్‌పై అనవసర రాద్ధాంతం
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు మల్లన్న సాగర్‌పై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ జరుగుతోందని తెలిపారు. ఎత్తై ప్రాంతం కావడం వల్ల, ఎత్తిపోతల అవసరం లేకుండా కాల్వల (గ్రావిటీ) ద్వారా నీరిచ్చే అవకాశం ఉండటం వల్ల మల్లన్న సాగర్‌ను చేపట్టామన్నారు. తెలంగాణ భవన్లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ మల్లన్న సాగర్ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులంతా తెలంగాణ బిడ్డలేనన్నారు. విపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వాసితులను రె చ్చగొడుతున్నాయని, ఏ ప్రాజెక్టు నిర్మించినా ముంపు ఉంటుందని అన్నారు. -
కేసీఆర్ ఫాంహౌస్ భూమి ఎకరా 10 లక్షలకు ఇస్తారా?
హైదరాబాద్: సీఎం కేసీఆర్ తన ఫాం హౌస్ భూమిని ఎకరా రూ.10 లక్షలకు ఇస్తారా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగితే ప్రాజెక్టులను తాము అడ్డుకుంటున్నట్లు మంత్రి హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో 123 ద్వారా నిర్వాసితులకు న్యాయం జరగదు, ఆ జీవోలో నష్టపరిహారం, పునరావాసం అంశాలు లేవని ఆయన ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అమలుచేసి భూ నిర్వాసితులకు నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 లక్షలే ఇస్తామనడం అన్యాయమన్నారు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి, భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చే విధానాన్ని ఖరారు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సూచించారు. -
బాబు రాజకీయ వ్యభిచారం మీకు కనిపించలేదా?
రాష్ట్రంలోని మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్ట్‌ల కింద భూముల సేకరణ, 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. ముంపు గ్రామాల వాసులకు ప్రతి ఎకరాకు రూ. 25 లక్షలు, కులవృత్తులు చేసుకునే వారికి రూ. 10 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు మార్కెట్ రేటుకు నాలుగింతలు పెంచి అందజేయాలని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు, వివిధ రకాలుగా భూములు అనుభవిస్తున్న రైతులకు న్యాయం చేయాల్సి ఉందన్నారు. ఇంటికి నలుగురు పోలీసులను పెట్టి భూసేకరణలో ప్రభుత్వం జీవో 123 ప్రకారం వెళ్తానంటే ప్రజలు, రైతుల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో టాటా భూముల విషయంలో సీపీఎం వారు ఇలాగే వ్యవహరించి చేతులు కాల్చుకున్నారన్నారు. తన జిల్లానుంచే ప్రతిఘటన ఆరంభం కాకుండా సీఎం కేసీఆర్ చూచుకోవాలని వైఎస్సార్ సీపీ హెచ్చరిస్తోందని వారు చెప్పారు. 2013 భూ సేకరణ చట్టంలో ఏవేం అంశాలు ఉన్నయో వాటన్నింటినీ ప్రభుత్వం ఇక్కడి వారికి నెరవేర్చాలని సూచించారు. సీఎం కేసీఆర్ కేవలం సిద్దిపేట, గజ్వేల్, తన ఫామ్‌హౌజ్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు నీరు తరలించేందుకు రీ డిజైన్ నాటకం తెర మీదకు తీసుకవచ్చారన్నారు. 25వేల ఎకరాల బంగారు భూమిని, 14 గ్రామాలను పూర్తి నీటి ముంచుతున్నారని వాపోయారు. 16 వేల జనాభా పూర్తి నిరాశ్రయులు కానున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ అంటే బంగారు భూమిని నీట ముంచటమా? అని వారు ప్రశ్నించారు. మిత్రమా రేవంత్...బాబు వ్యభిచారం కన్పించలేదా..! వివిధ పార్టీల ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ టీఆర్ఎస్లో చేర్చుకోవటం వ్యభిచారం అయినప్పుడు, ఏపీలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అక్కడి సీఎం, మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోటానుకోట్లు ఏర చూపి లాగేసుకోవటం వ్యభిచారంగా కన్పించలేదా అని వైఎస్సార్ సీపీ నేతలు ముకుమ్మడిగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. టీడీపీ రెండు నాల్కాల ధోరణి విడనాడాలని సూచించారు. ఇరురాష్ట్రాల సీఎంలు ఇలాగే వ్యవహరిస్తూ వెళ్తే, ముందు ముందు ప్రజల అగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. -
సాగర్ నిర్వాసితులకు అండగా ఉంటాం
విపక్షాలవి అర్థం లేని ఆరోపణలు: హరీశ్‌రావు భూసేకరణ చట్టం అమలు చేస్తే ఎకరాకు వచ్చేది రూ.1.8 లక్షలే.. రాష్ట్రం రూ.5.8 లక్షలు ఇస్తోంది ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రత్యేకంగా రూ.5.4 లక్షలు ఇస్తోంది సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులకు అండగా ఉంటామని.. రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికీ రైతుల పక్షపాతి అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ విపక్షాలు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని, రైతుల పొట్ట కొట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రభుత్వ పథకాల అమలుకో, ప్రాజెక్టుల నిర్మాణానికో భూసేకరణ జరిపితే... నిర్వాసితులకు అండగా ఉండాలన్నదే మా ప్రభుత్వ మూల సూత్రం. మల్లన్నసాగర్ విషయంలోనూ ఇదే పంథాను కొనసాగిస్తాం.. కానీ దీనిపై విపక్షాలు వితండవాదం చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఏనాడూ వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోంది. పేద రైతుల పొట్ట కొట్టాలని ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు..’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణంలో నష్టపోతున్న ఏటిగడ్డ కిష్టాపూర్ రైతులకు 2013 భూసేకరణ చట్ట పరిధికి మించి మరీ న ష్ట పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. అక్కడి భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి మెట్టభూములకు రూ.50వేలు, తరి భూములకు రూ.60వేలుగా ఉందని.. భూసేకరణ చట్టం ప్రకారం దానికి మూడు రెట్లు పరిహారం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. అంటే రైతులకు రూ.1.5 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు మాత్రమే వస్తుందని... కానీ ప్రభుత్వం నిర్వాసితుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ఎకరాకు రూ.5.8 లక్షలు పరిహారంగా చెల్లిస్తోందని తెలిపారు. ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రత్యేకంగా రూ.5.4 లక్షలు అందజేస్తోందని వెల్లడించారు. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు.. నిర్వాసితుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నా కుహానా మేధావులు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు మిడిమిడి జ్ఞానంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని... ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. చట్టప్రకారం భూములు స్వాధీనం చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉన్నా ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
మల్లన్నా దారెటు..?
♦ వివాదాస్పదంగా భూసేకరణ అంశం ♦ గగ్గోలు పెడుతున్న బాధితులు ♦ సర్కార్‌పై ప్రతిపక్షాల ముప్పేట దాడి ♦ దీటుగా స్పందిస్తున్న అధికార పక్షం కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూసేకరణ అంశం గందరగోళంగా మారింది. భూములు గుంజుకుంటున్నారని, ఊరంతా ఖాళీ చేయాల్సి వస్తుందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. భూములు, ఊరిని వదిలితే బతుకుదెరువు ఏమిటని బెంగపెట్టుకున్నారు. ఇన్నేళ్లు ఉన్న బంధం ఒక్కసారిగా తెగిపోతుందంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. వారి పక్షాన ఉద్యమిస్తున్నారు. ఇదిలావుంటే దేశంలోనే నంబర్ వన్ ప్యాకేజీ ప్రకటించా మని సర్కార్ దీటుగా జవాబిస్తోంది. భూ బాధితులు, ప్రతిపక్షాలు ఒకవైపు.. సర్కార్ మరోవైపు అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. రాజకీయ రంగు పులుమునుకున్న మల్లన్న సాగర్ అంశం ఎలా కొలిక్కివస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద 1.5 టీఎంసీల సామర్థ్యంతో దుబ్బాక-గజ్వేల్ నియోజకవర్గాల మధ్య మల్లన్నసాగర్‌ను నిర్మించడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. జిల్లాకు ఒక్క ఘణపురం ఆనకట్ట తప్ప మరో సాగునీటి ప్రాజెక్టు లేకపోవడంతో సీఎం కేసీఆర్ మల్లన్న సాగర్ సామర్థ్యం పెంపు ప్రతిపాదన చేశారు. దీంతో ప్రాజెక్టు రీ-ఇంజినీరింగ్ చేసేందుకు నిర్ణయించారు. 21 వేల ఎకరాల్లో 52 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే రిజర్వాయర్‌ను తొగుట-కొండపాక మండలాల మధ్య నిర్మించవచ్చని వాస్కోప్ సంస్థ ఇచ్చిన నివేదికతో తెలంగాణ ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్మాణానికి పూనుకుంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలో నిర్మితమవుతున్న రిజర్వాయర్, పైప్లైన్లు మొదలగు వాటి కోసం మొత్తం గ్రామాల్లో 20,079.16 ఎకరాల భూమి సేకరించడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో 5 గ్రామాల్లో పూర్తిగా ఇళ్లు, భూములు ముంపునకు గురవుతున్నాయి. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించడానికి ముంపు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సదస్సులు కూడా నిర్వహించారు. భూ సేకరణ కోసం జూలై 30న జీఓ 123ను జారీ అయ్యింది. దీనిలో స్వల్ప మార్పులు చేస్తూ జీఓ 214 ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం పాత జీఓలోని.. పునరావసం, మరో చోట నివాసానికి చెల్లింపు.. తదితర పదాలను ప్రభుత్వం తొలగించింది. ముంపు బాధితుల డిమాండ్లు ♦ ఎకరానికి మార్కెట్ ధర మీద కనీసం నాలుగు రెట్లు అధికంగా చెల్లించాలి. ♦ మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలి ♦ భూమికి భూమి, ఇంటికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి ♦ ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకు సాగు నీరందించడానికి చేపడుతోన్న 52 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈక్రమంలో 20,079.16 ఎకరాలను సేకరించే పని మొదలైంది. ముంపునకు గురవుతున్న ఊళ్లు, ఎకరాలు, ఇళ్ల వివరాలు... ♦ పైప్లైన్ల నిర్మాణానికి తుక్కాపూర్‌లో 972.10 ఎకరాలు, తొగుట, బ్రాహ్మణ బంజేరుపల్లిలో 2,703 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 142.30 ఎకరాల భూమి పోతోంది. ♦ గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలం పల్లెపహాడ్ రెవెన్యూ పరిధిలో 1,199 ఎకరాలు, 320 ఇళ్లు, దస్తగిరి నగరంలో 162 ఇళ్లు కోల్పోతున్నారు. తిప్పారంలో 2,344.1 ఎకరాలు, 250 ఇళ్లు, మదిర గ్రామమైన సింగారంలో 120 ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. ♦ ఎర్రవల్లిలో 2,297 ఎకరాలు 348 ఇళ్లు, మంగోల్‌లో 1851.36 ఎకరాలు 450 ఇళ్లు, కాశీ గుడిసెలులో 20 ఇళ్లు, కోనాయిపల్లిలో 444 ఎకరాలు 105 ఇళ్లు, వడ్డెర కాలనీలో 15 ఇళ్లు కోల్పోతున్నారు. మాత్పల్లి గ్రామంలో 44 ఎకరాలు, మేదినీపూర్‌లో 117 ఎకరాలు, ముద్దారం గ్రామంలో 40.19 ఎకరాల సాగు భూమి పైప్లైన్ల నిర్మాణం కోసం సేకరిస్తున్నారు. జీఓనా... చట్టమా..? 123 జీఓ అంటే మ్యూచివల్ కాన్సెంట్ అవార్డు. రైతు ఒప్పుకుంటేనే వారితో ప్రభుత్వం ఒప్పదం చేసుకునే జీవో ఇది. 123 ప్రకారం ఎకరానికి దాదాపు రూ.6 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. బోరు, చెట్టు, బావి, పైప్లైన్లు ఇలా ఉన్నవాటికి కూడా అదనంగా నష్టపరిహారం కట్టిస్తారు. ఈ లెక్కన సగటున ఒక్కో ఎకరానికి రూ.7.5 నుంచి రూ.8 లక్షల చొప్పున పరిహారం అందుతుంది. ఈ డబ్బు కూడా రైతులు భూములు రిజిస్ట్రేషన్ చేసిన 15 నుంచి 20 రోజుల్లోనే అవకాశం ఉంది. ఇళ్లు కోల్పోతున్న వారికి రూ. 5.4 లక్షల నష్టపరిహారంతో(డబుల్ బెడ్రూంకు అయ్యే ఖర్చు) పాటు, కొత్త ఇళ్లు కట్టుకోవడానికి మరో రూ.5.4 లక్షల ఆర్థిక సహకారం అందిస్తారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువకు రెండింతలు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మరో నిబంధన ప్రకారం ముంపునకు గురై, భూములు పోగొట్టుకున్నవారికి దానికి సమానమైన భూములు ఇవ్వాలనే నిబంధన ఉంది. నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వానికి 6 నుంచి 8 నెలల సమయం తీసుకునే వెసులుబాటు ఈ చట్టంలో ఉంది. ఈ చట్టాన్ని గతంలో సింగూరు ప్రాజెక్టు కింద రైతులకు అమలు చేశారు. ఈక్రమంలో పుల్కల్, అందోల్ మండలాల్లో 24 గ్రామాల్లో రైతులు భూములు కోల్పోయారు. కానీ, రైతులకు చేతికి ఇప్పటి వరకు డబ్బులు అందలేదు. మల్లన్న సాగర్‌తో లాభాలు మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. మల్లన్న సాగర్ నుంచి విడుదలయ్యే నీటితో మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేపట్టిన చెరువులను నింపుతారు. భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయి. బీళ్లుగా మారిన భూములు సాగులోకి వస్తాయి. దీంతో ప్రతి ఒక్కరికి చేతి నిండా పని దొరుకుతుంది. వర్షాధార పంటల అవసరమే ఉండదు. ఏడాదిలో రెండు పంటలకు సరిపోయేంత సాగు నీరందిస్తోంది. బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉంటాయి. రైతులకు అదనపు ఖర్చులు తగ్గుతాయి. ముంపు గ్రామాల ప్రజల సమస్యలు, కోరికలను ప్రభుత్వం తీరిస్తే మల్లన్న సాగర్ రిజార్వాయర్‌తో నష్టం కన్నా లాభాలే అధికంగా ఉంటాయని మేథావుల అభిప్రాయం. ముంపు బాధితుల కష్టాలు 20,079.16 వేల ఎకరాల సాగుకు అనుకూలమైన సారవంతమైన భూమిని రైతులు కోల్పోతున్నారు. 3,112 ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. ఇళ్లను ఎక్కడ నిర్మించుకోవాలో? ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలో? ఎక్కడ సాగు భూములను కొనుగోలు చేసుకోవాలో? తెలియని ఆందోళన ముంపు గ్రామాల ప్రజల్లో నెలకొంది. బాధితుల బతుకులే చిందర వందరమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. నా దగ్గర మంచి స్కీం ఉంది: సీఎం కేసీఆర్ ‘ప్రతి నియోజకవర్గానికి 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తాం. రిజర్వాయర్‌లో సాగు భూములు, ఇళ్లను కోల్పోతున్నవారు ఆధైర్య పడొద్దు. పోయినదానికంటే రూపాయి ఎక్కువే ఇస్తా. మీరు ఏం చేయాలో.. నా దగ్గర మంచి స్కీం ఉంది. నా దగ్గరకు మీరు వంద... నూటయాభై మంది కలిసి రండి. మీరు ఎక్కడెక్కడ భూములు కొనుక్కోవాలో చెప్తా.’ జనవరి 11న దుబ్బాకలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేసీఆర్ అన్న మాటలివి. -
మల్లన్న సాగర్ వద్దంటూ ‘మల్లన్న’కు వినతిపత్రం
చేర్యాల: మెదక్ జిల్లా కొండపాక, తొగుట మండలాల పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ తమకొద్దంటూ భూ నిర్వాసితులు వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి మల్లికార్జున స్వామికి ఆదివారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు.ఈ విషయంలో ప్రభుత్వ మనసు మార్చాలని కోరుతూ స్వామికి వినతిపత్రం సమర్పించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ పరిధిలోని 14 గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో సుమారు 50 మంది రైతులు, యువకులు కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం పేరుతో భూమి లాక్కుంటే తమకు భిక్షాటనే గతి అని ఆలయ మెట్ల వద్ద భిక్షాటన చేసి నిరసన తెలిపారు. 2013 చట్టం ప్రకారం 80 శాతం మంది రైతులు ఒప్పుకుంటేనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుంటే 14 గ్రామాల ముంపు భాదితులు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని నిర్వాసితులు హెచ్చరించారు. -
మల్లన్న సాగర్ నిర్వాసితులకు కాంగ్రెస్ భరోసా
*చట్టం అమలు చేయకపోతే ఉద్యమం *ప్రాణహిత ప్రాజెక్టును నీరు గార్చేందుకే రీ డిజైన్ *రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే రైతులకు అండగా ఉంటామని వారికి న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క తెలిపారు. 2013 భూ సేకరణ చట్టమే శ్రీరామ రక్ష అని ఆ చట్టం అమలు అయ్యే వరకు పోరాటాలు చేసి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. మల్లన్న సాగర్ కింద ముంపునకు గురయ్యే 14 గ్రామాల ప్రజలు శనివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 14 గ్రామాలలో సుమారు 20 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని, మూడు వేలకు పైగా ఇళ్ళు ముంపు అవుతున్నాయని నిర్వాసితులు వివరించారు. నిర్వాసితుల సమస్యలను విన్న కాంగ్రెస్ నాయకులు వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా అప్రజాస్వామిక పద్దతులలో కార్యక్రమాలు చేపడుతుందని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అమలు చేయాల్సిన నిబంధనలు అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ తెచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వమే భూ సేకరణ చట్టం చేసిందని, అందువల్ల చట్టం అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అన్నారు. ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిందని అయితే దాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందన ఆయన విమర్శించారు. 20 వేల ఎకరాలను ముంచి కడుతున్న ప్రాజెక్టు కింద ఎన్ని వేల ఎకరాలకు నీరు ఇస్తారో కూడా చెప్పలేకపోతున్నారని ఆయన విమర్శించారు. త్వరలోనే కాంగ్రెస్ నాయకులంతా కలిసి ముంపు గ్రామాలను సందర్శించి ప్రజలు పక్షాన నిలబడుతామని, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. -
ఒకటి ఓకే!
కేశవాపూర్‌కు మల్లన్న సాగర్ నుంచి నీటి లింక్.. అసెంబ్లీలో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో స్పష్టత.. మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మాణంపైనే స్పష్టత కరువు.. సిటీబ్యూరో: ‘మహా’నగర దాహార్తిని తీర్చేందుకు నగర శివార్లలోని శామీర్‌పేట్ మండలం కేశవాపూర్‌లో నిర్మించతలపెట్టిన భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణంపై మరింత స్పష్టత వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేశవాపూర్ రిజర్వాయర్‌కు మెదక్ జిల్లాలో నిర్మించతల పెట్టిన కొమురెల్లి మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఈ రిజర్వాయర్‌లో నిల్వచేస్తామని ప్రకటించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో మహానగరానికి భవిష్యత్‌లో తీవ్ర నీటి ఎద్దడిసమస్య ఉండదని స్పష్టం చేయడం విశేషం. ఇక నల్లగొండ జిల్లా మల్కాపూర్ వద్ద నిర్మించతలపెట్టిన భారీ రిజర్వాయర్‌పై మాత్రం ఈసారి ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రైవేటు సహకారంతో..! కాగా ప్రైవేటు సంస్థలుతమ సొంత నిధులతో ఈ రిజర్వాయర్‌ను నిర్మించే (యాన్యుటీ బేసిస్) అంశంపై దృష్టిసారించాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం వ్యాప్కోస్ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేస్తున్న విషయం విదితమే. ఈ నివేదిక అందగానే ప్రైవేటు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. కాగా నగర శివార్లలో నల్లగొండ జిల్లా దేవులమ్మనాగారం(మల్కాపూర్ పరిసరాలు)లోనూ భారీ రిజర్వాయర్‌ను నిర్మించాలనుకున్నప్పటికీ తొలివిడతగా కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ రిజర్వాయర్‌కు కరీంనగర్ జిల్లా కాళేశ్వరం-మిడ్‌మానేరు-కొమురెల్లిమల్లన్న సాగర్(మెదక్) మీదుగా 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించే అవకాశం ఉంది. నూతనంగా నిర్మించ తలపెట్టిన కొమురెల్లి మల్లన్న సాగర్(కుక్నూరుపల్లి-మెదక్)లో సుమారు 50 టీఎంసీల మేర గోదావరి జలాలను నింపనున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో అక్కడి నుంచి 42 కి.మీ దూరంలో ఉన్న కేశవాపూర్ రిజర్వాయర్‌కు 25 కిలోమీటర్ల మేర గ్రావిటీ (భూమ్యాకర్షణశక్తి), మరో 17 కి.మీ మార్గంలో పంపింగ్ ద్వారా 20 టీఎంసీల నీటిని దశలవారీగా తరలించి నింపవచ్చని నిపుణులు చెబుతున్నారు. రూ.1660 కోట్లతో కేశవాపురం రిజర్వాయర్.. రంగారెడ్డిజిల్లా శామీర్‌పేట్ మండలం కేశవాపురం వద్ద రూ.1660 కోట్ల అంచనా వ్యయంతో 20 టీఎంసీల గోదావరి జలాల నిల్వకు అవసరమైన భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన 3600 ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ భూమి అందుబాటులో ఉంది. ఈ జలాశయాన్ని భూమట్టం నుంచి 60 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ డ్యామ్ నిర్మించనున్నారు. ఈ జలాశయంలో గోదావరి మంచినీటి పథకం మొదటి, రెండవ, మూడవ దశల ద్వారా తరలించనున్న నీటితో ఈ జలాశయాన్ని నింపే అవకాశం ఉంటుందని, గోదావరి నదిలో సమృద్ధిగా వరద ప్రవాహం ఉన్నప్పుడే ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి జలకళ సంతరించుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో గోదావరిలో వరద ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్‌కు 20 టీఎంసీల నీటిని తరలించి నిల్వచేస్తే ఏడాది పొడవునా మహానగర తాగునీటికి అవస్థలు ఉండవని చెబుతున్నారు. మల్కాపూర్ రిజర్వాయర్‌పై స్పష్టత కరువు? నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం-మల్కాపూర్ సరిహద్దుల్లో రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించాలని సర్కారు యోచిస్తోంది. అయితే ఈ నిర్మాణం విషయంపై స్పష్టత కరువైంది. ఈ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన రెండువేల ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ,అసైన్డ్భూములు అందుబాటులో ఉన్నాయి. ఈ జలాశయాన్ని కాంక్రీటుతో భూ మట్టానికి 70-80 మీటర్ల ఎత్తులో నిర్మించాలని యోచిస్తున్నారు. కానీ ఈ జలాశయానికి పాలమూరు ఎత్తిపోతల లేదా డిండి పథకం ద్వారా నీటి లింక్ ఏర్పాటు, నిధుల వ్యయం ఎవరు చేయాలన్న అంశంపై స్పష్టత కరువైంది. వర్షాకాలంలో నీటిలభ్యత అధికంగా ఉన్నప్పుడే ఈ భారీ జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
‘మల్లన్న’సాగర్ కు కొత్త టెండర్!
♦ రిజర్వాయర్ సామర్థ్యం ♦ 50 టీఎంసీలకు పెంచడంతో మారిన అంచనా సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో చేపట్టనున్న కొమురవెల్లి మల్లన్నసాగర్(తడ్కపల్లి) రిజర్వాయర్ నిర్మాణానికి కొత్తగా టెండర్లు పిలవాలని నీటి పారుదల శాఖ దాదాపు నిర్ణయానికి వచ్చింది. రిజర్వాయర్ స్వరూపం పూర్తిగా మారడం, సామర్థ్యం ఏకంగా ఒక టీఎంసీ నుంచి 50 టీఎంసీలకు పెంచిన నేపథ్యంలో పూర్తిగా కొత్త కాంట్రాక్టర్‌కే దీని పనులు అప్పగించాలని భావిస్తోంది. రిజర్వాయర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు వచ్చిన అనంతరం దీనిపై తుది నిర్ణయం చేయనుంది. 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రాణహిత నదిపై పెద్దగా రిజర్వాయర్లు లేని దృష్ట్యా, సిద్ధిపేట లోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్(పాములపర్తి)ని 1 టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచుతూ నిర్ణయం చేసింది. ఇందులో ఇప్పటికే పాములపర్తి రిజర్వాయర్ పనులను పాత కాంట్రాక్టర్‌కే అప్పగించారు. మల్లన్నసాగర్ విషయంలో ఇంకా ఏ నిర్ణయం చేయలేదు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఉన్న ప్యాకేజీ 12ను ప్రస్తుతం రెండుగా విభజించారు. ఇందులో 12(ఎ)లో ప్రధాన కాల్వలు, ఇతర డిస్ట్రిబ్యూటరీల వాస్తవ నిర్మాణ వ్యయం అంచనా రూ. 1,864 కోట్లు ఉండగా, అది మారిన పనుల కారణంగా మరో రూ. 1,550.52 కోట్లు పెరిగింది. దీనికి తోడు ప్యాకేజీ 12 (బి)లో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ నిర్మాణ వ్యయాన్ని వేరుగా అధికారులు లెక్కగట్టారు. ఈ అంచనా వ్యయం విలువ రూ. 5,734.45గా తేలింది. ఇందులో డిస్ట్రిబ్యూటరీ, కాల్వలకు సంబంధించిన పెరిగిన వ్యయానికి సంబంధించిన పనులను సైతం పాత కాంట్రాక్టర్లకే అప్పగించాలనే యోచనలో ఉంది. అయితే రిజర్వాయర్ నిర్మాణానికి మాత్రం కొత్తగా టెండర్లు పిలిచి అనుభవం ఉన్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఇక మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో నిర్మించే మూడు బ్యారేజీల నిర్మాణాలకు ఈ నెల 19 తర్వాతే టెండర్లు పిలిచే అవకాశం ఉంది.